గంటల వ్యవధిలో.. తారుమారైన గోల్డ్ రేటు! | Israel and Iran War Effect Gold Price Changing | Sakshi
Sakshi News home page

యుద్ధం ఎఫెక్ట్: గంటల వ్యవధిలో.. తారుమారైన గోల్డ్ రేటు!

Mar 2 2026 8:22 PM | Updated on Mar 2 2026 8:37 PM

Israel and Iran War Effect Gold Price Changing

బంగారం ధరలు ఎప్పుడు, ఎలా? మారిపోతున్నాయో.. ఊహకందకుండా పోతోంది. ఉదయం ఉన్న రేటు, సాయంత్రానికి మారిపోతోంది. ఈ రోజు పరిస్థితి అలాగే ఉంది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి?, ఏ నగరం ఎక్కువగా ఉన్నాయి?, ఏ నగరంలో కొంత తక్కువగా ఉంది? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,69,880 వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు సాయంత్రానికి 1,70,510 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,55,650 రూపాయల దగ్గర నుంచి రూ. 1,56,300 వద్దకు చేరింది. ఇదే ధరలు ముంబై, బెంగళూరు ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

చెన్నైలో ఉదయం 156660 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి అదే రేటు వద్ద కొనసాగింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు (రూ.170840) విషయంలో ఎలాంటి మార్పు లేదు.

ఢిల్లీలో ఈ రోజు ఉదయం 155880 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ రేటు 156450 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం రేటు 1,69,950 రూపాయల వద్ద నుంచి 1,70,660 వద్ద నిలిచింది.

ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా.. బంగారం ధరల్లో చాలా మార్పులు సంభవిస్తున్నాయి. రానున్న రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు సైతం చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement