మార్చి నెలకు ఎల్పీజీ (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరించాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు రూ.28 నుంచి రూ.31 వరకు పెరిగాయి. అయితే 14 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేకపోవడం సాధారణ వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగించే అంశం.
ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు
రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1740.50 నుంచి రూ.1768.50కు పెరిగింది. కోల్‌కతాలో ధర రూ.1844.50 నుంచి రూ.1875.50కు చేరింది. ముంబైలో రూ.1692 నుంచి రూ.1720కు పెరిగింది. అలాగే చెన్నైలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1899.50 నుంచి రూ.1929కు, హైదరాబాద్‌లో రూ. 1,962.50 నుంచి రూ. 1,990.50కు విశాఖపట్నంలో రూ. 1,791.50 నుంచి రూ. 1,822.50కు పెరిగినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి.
గృహ ఎల్పీజీ రేట్లు యథాతథం
ఆయిల్ కంపెనీల తాజా వివరాల ప్రకారం 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.ఢిల్లీలో ఇది రూ.853కు అందుబాటులో ఉంది. కోల్‌కతాలో రూ.951గా కొనసాగుతోంది. ముంబైలో రూ.852.50గా ఉంది. లక్నోలో గృహ సిలిండర్ ధర రూ.890.50గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో రూ. 905, విశాఖపట్నంలో రూ. 861లుగా ఉంది.
కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడం హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మార్పు లేకపోవడం సామాన్యులకు కొంత ఊరట కలిగిస్తోంది.


