
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ .58.50 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,665కు దిగొచ్చింది.
అంతకుముందు జూన్‌లోనూ చమురు సంస్థలు వాణిజ్య సిలిండర్లపై రూ .24 తగ్గింపును ప్రకటించాయి. దాంతో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ .1,723.50 గా ఉండేది. ఏప్రిల్లో దీని ధర రూ.1,762గా ఉంది. ఫిబ్రవరిలో స్వల్పంగా రూ.7 తగ్గగా, మార్చిలో రూ.6 పెరిగింది.
19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ.58.50 తగ్గించడం చిన్న వ్యాపారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య వినియోగదారులు తమ రోజువారీ కార్యకలాపాలకు ఈ గ్యాస్ సిలిండర్లపై ఎక్కువగా ఆధారపడతారు.
అయితే, గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. సమీక్షకు పిలుపునిచ్చినప్పటికీ 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర స్థిరంగా ఉంది. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని కంపెనీలు ధృవీకరించాయి.
నగరం | కొత్త ధర (రూ.) | మునుపటి ధర (రూ.) |
---|---|---|
ఢిల్లీ | 1,665 | 1,723.50 |
ముంబై | 1,616 | 1,674.50 |
కోల్ కతా | 1,769 | 1,826 |
చెన్నై | 1,823.50 | 1,881 |
బెంగళూరు | 1,796 | — |
నోయిడా | 1,747.50 | — |
హైదరాబాదు | 1,798.50 | 1,857 |