కోకాపేటలో కొత్త రియల్‌ఎస్టేట్‌ ట్రెండ్‌.. | New Real Estate Trend In Kokapet Rise Of Branded Luxury Homes In West Hyderabad, Check More Details Inside | Sakshi
Sakshi News home page

కోకాపేటలో కొత్త రియల్‌ఎస్టేట్‌ ట్రెండ్‌..

Feb 14 2026 1:30 PM | Updated on Feb 14 2026 1:58 PM

New Real Estate Trend in Kokapet Rise of Branded Luxury Homes in West Hyderabad

విలాసవంతమైన గృహ విభాగం సరికొత్త పుంతలు తొక్కుతోంది. గృహ కొనుగోలుదారులు అభిరుచులకు అనుగుణంగా సంస్థలు ఇళ్లను నిర్మిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రైవసీ, భద్రత, గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇచి్చన బిల్డర్లు.. ఇప్పుడు కస్టమర్లకు అంతర్జాతీయ స్థాయి సేవలను అందించేందుకు సిద్ధమయ్యారు. లగ్జరీ ఆతిథ్య సంస్థల భాగస్వామ్యంతో గృహ నిర్మాణాలను చేపడుతున్నారు. హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌(హెచ్‌ఎన్‌ఐ), ప్రవాసుల నుంచి ఈ తరహా ఇళ్లకు విపరీతంగా డిమాండ్‌ ఉంది. ప్రధానంగా కోకాపేట, పుప్పాలగూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ హైదరాబాద్‌ ప్రాంతాల్లో ఇటువంటి ఫైవ్‌ స్టార్‌ హోమ్స్‌ వస్తున్నాయి.     – సాక్షి, సిటీబ్యూరో

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో మార్కెటింగ్‌ కోసం ఇప్పుడు ఏ ప్రాజెక్ట్‌ మీద చూసినా లగ్జరీ అనేది కనపడుతోంది. విలాసవంతంగా ఉన్నా లేకున్నా ఈ పదం వాడేస్తున్నారు. అందరూ లగ్జరీ అనే ట్యాగ్‌ వాడటంతో అర్థమే మారిపోయింది. కొందరు మాత్రమే ఈ స్థాయి ప్రమాణాలతో కడుతున్నారు. కొనుగోలుదారులు సైతం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతుండటంతో విలాసం అంటే ఎలా ఉంటుందో వారికి అవగాహన పెరిగింది. దీంతో నిర్మాణ సంస్థలు లగ్జరీకి పునఃనిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదు నక్షత్రాల రేటింగ్‌ కలిగిన నివాసాలను నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు ప్రసిద్ధ ఆతిథ్య సంస్థలతో జతకడుతున్నాయి. డిజైనింగ్‌ ప్రమాణాలను పెంచడంతో పాటు నివాసం ఉండేవారికి స్టార్‌ హోటల్‌ మాదిరి సేవలు కల్పించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి.

హోటల్స్, ఫ్యాషన్‌ డిజైనర్లతో ఒప్పందం 
ఇంటర్‌ కాంటినెంటల్, మారియట్, తాజ్, రిడ్జ్, కార్ల్‌టన్, లీలా వంటి స్టార్‌ హోటల్‌ బ్రాండ్స్, అబూజానీ, సందీప్‌ ఖోస్లా వంటి ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్లతో నగరానికి చెందిన పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు భాగస్వామ్యం చేసుకొని గృహ నిర్మాణాలను చేపడుతున్నాయి. డిజైనింగ్, ఆర్కిటెక్చర్, ఎలివేషన్స్, విస్తీర్ణం, వసతులు, సేవలు.. అన్నీ టాప్‌ క్లాస్‌గా ఉంటాయి. నివాసితులకు అంతర్జాతీయ జీవనశైలి అనుభూతిని అందించడమే ఈ గృహాల ప్రత్యేకత.

హెచ్‌ఎన్‌ఐ, ప్రవాసులు కస్టమర్లు.. 
కరోనా  నుంచి నగరంలో హైఎండ్‌ గృహాలకు ఆదరణ పెరిగింది. ఆధునికత, విలాసవంతమైన జీవనశైలికి నేటి యువ గృహ కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. హెచ్‌ఎన్‌ఐలు, ప్రవాసులు, బిజినెస్‌ టైకూన్లు, సినీ, క్రీడా సెలబ్రిటీలు డిజైనర్‌ హోమ్స్‌కు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా ఈ తరహా ఇళ్ల కొనుగోలుదారులు సెకండ్‌ లేదా థర్డ్‌ హోమ్‌ బయ్యర్లు ఉంటారు. ఇందులో నివాసం ఉండటం స్టేటస్‌ సింబల్‌గా భావిస్తుంటారు. హైటెక్‌ సిటీ, గచి్చ»ౌలి, రాయదుర్గం, నియోపొలిస్, నానక్‌రాంగూడ, కోకాపేట, ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్, పుప్పాలగూడ, తెల్లాపూర్, మదీనాగూడ, నల్లగండ్ల వంటి ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. వీటి విస్తీర్ణం 6 వేల చదరపు అడుగుల నుంచి ప్రారంభవుతుంది. ధర రూ.6 కోట్ల నుంచి ఉంటుంది.

వీటి ప్రత్యేకతలివే.. 
స్టార్‌ హోమ్స్‌ అంటే హోటల్‌ ఆధారిత ప్రాజెక్ట్‌లు. ఇందులో లేఔట్‌ స్థలంలో నివాసాల కోసం ప్రత్యేకంగా ఒక టవర్‌ ఉంటుంది. పక్కనే మరో టవర్‌లో హోటల్‌ ఉంటుంది. నివాసితులకు సేవలన్నీ ఆతిథ్య సంస్థలే నిర్వహిస్తాయి. కొన్ని ప్రాజెక్ట్‌లలో దిగువ అంతస్తుల్లో హోటల్, ఎగువ అంతస్తులో నివాస యూనిట్లు ఉంటాయి. నివాసితులకు ప్రత్యేకంగా యాప్‌ ఉంటుంది. ఇందులో నుంచి ఫుడ్, స్పా, సెలూన్‌ వంటివి ఆర్డర్‌ చేయవచ్చు. వాళ్లే అపార్ట్‌మెంట్‌కు వచ్చి సర్వీస్‌ చేస్తారు. అలాగే వీటిల్లో సెవెన్‌ స్టార్‌ హోటల్‌లో మాదిరి గ్రాండ్‌ లాంజ్, డబుల్‌ హైట్‌ బాల్కనీ, హోమ్‌ ఆటోమేషన్, బ్యూటీఫుల్‌ వ్యూ, స్కై లాంజ్, స్పా, మినీ థియేటర్, ప్రైవేట్‌ స్విమ్మింగ్‌ పూల్‌ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి.

ప్రైవసీ, భద్రత..
ప్రైవసీ, భద్రత ఈ ప్రాజెక్ట్‌ల ప్రత్యేకత. వెంటిలేషన్, ఓపెన్‌ స్పేస్, వేర్వేరుగా ఎంట్రీ అండ్‌ ఎగ్జిట్‌ ద్వారాలు, ప్రతి అపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక మార్గం ఉంటుంది. అపార్ట్‌మెంట్‌ ఫేసింగ్‌ ఎదురెదురుగా ఉండదు. దీంతో పూర్తిగా ప్రైవసీ ఉంటుంది. విశాలమైన బాల్కనీ, గ్రీనరీ, ఓపెన్‌ స్పేస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సాధారణ గృహాలతో పోలిస్తే ఈ డిజైనర్‌ హోమ్స్‌లో 5–7 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement