ముందే చెప్పాలి..ఇండిగో సిబ్బందిపై ఆగ్రహాం | Passengers fire at IndiGo staff | Sakshi
Sakshi News home page

ముందే చెప్పాలి..ఇండిగో సిబ్బందిపై ఆగ్రహాం

Feb 14 2026 9:17 AM | Updated on Feb 14 2026 10:03 AM

Passengers fire at IndiGo staff

సాక్షి హైదరాబాద్: శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇండిగో సిబ్బంది తీరుపై ‍ప్రయాణికులు తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు.  షెడ్యూల్ ప్రకారం విమానాశ్రయం నుంచి 8.20 గంటలకు ఫ్లైట్‌ బాగ్డోగ్రా వెళ్లాల్సిఉంది. అయితే ఇండిగో సిబ్బంది ఉదయం 7.40 గంటలకే గేట్లు క్లోజ్ చేశారు. దీంతో గేట్ వద్ద 50 మంది వరకూ ప్రయాణికులు వేచిచూడాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు ఇండిగో సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

బోర్డింగ్ సమయంలో ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విమాన సమయాల్లో ఎవైనా మార్పులుంటే ముందుగా సమాచారం ఇవాల్సిందని ఆగ్రహాం చెందారు. కాగా కొద్ది నెలల క్రిత ఇండిగో నిర్లక్షంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement