breaking news
IndiGo
-
ఇండిగో.. ఇదేందయ్యో!
టికెట్ బుక్ అయిందంటే చాలు.. విమాన సంస్థ నమ్మకంగా తమను సమయానికి గమ్యానికి చేరుస్తుందన్న హామీ లభించినట్టు భావిస్తాం. వాతావరణం అనుకూలించక, సాంకేతిక సమస్యతో సర్వీసు రద్దయితే ప్రత్యేక పరిస్థితుల వల్లే ఇలా జరిగిందేమోనని అర్థం చేసుకుంటాం. అలాకాకుండా కార్యాచరణ నిర్లక్ష్యంతో కస్టమర్లకు ఇచ్చిన హామీని ఆపరేటర్ ఉల్లంఘిస్తే..? దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కార్పొరేట్ ఉదాసీనతగా భావించాలి. అంతేకాదు పెద్ద వైఫల్యం కూడా. ఇండిగో విషయంలో ఇదే జరిగింది. ప్రపంచం నివ్వెరపోయిన ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా నిలవడానికి బదులుగా నిశ్శబ్దంగా వెనక్కి తగ్గడం కోట్లాది మందిని ఆశ్చర్యంలో ముంచెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్భారత్లో ప్రజల ఊహలకు అతీతంగా ప్రభుత్వం ప్రవర్తించిందన్నది ప్రయాణికుల మాట. దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు తలెత్తినప్పుడు పౌర విమానయాన నియంత్రణ సంస్థ కఠిన చర్యల అమలుకు బదులు సలహా ప్రకటనలకే పరిమితమైంది. వివిధ దేశాల్లో విమానయాన సంస్థలు విఫలమైనప్పుడు ప్రయాణికులకు పరిహారం అందుతుంది. ఆపరేటర్లను వదిలిపెట్టరు. టికెట్‌కు అయిన ఖర్చు వెనక్కి ఇవ్వడం, భోజనాలు, పానీయాలు, ప్రత్యామ్నాయ విమానాల ఏర్పాటు వంటివి ఒకప్పుడు భారత్‌లో అమలయ్యాయి. కానీ దశాబ్ద కాలంగా నియంత్రణ చర్యలు పేలవంగా, అస్థిరంగా, అరుదుగా శిక్షలతో అమలవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమి చేయొచ్చంటే.. సర్వీసు ఆలస్యం, కంపెనీ ప్రకటనలు, సమాచారాన్ని కస్టమర్లు రికార్డ్ చేయాలి. చాంతాడంత క్యూలు, ఖాళీ అయిన కౌంటర్లు, సిబ్బంది ప్రవర్తన మొదలైన వాటి ఫొటోలు, వీడియోలను సేకరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘భోజనం, వసతి, ప్రత్యామ్నాయ విమానం, ప్రయాణ బిల్లులను ఉంచుకోవాలి. వినియోగదారుల ఫోరమ్స్‌లో పరిష్కారం కోసం ఇటువంటి ఆధారాలు అవసరం. డీజీసీఏ ఎయిర్‌సేవా పోర్టల్‌కు ఫిర్యాదు చేయాలి.జిల్లా వినియోగదారుల కోర్టులనూ ఆశ్రయించాలి. సేవా ఉల్లంఘన కింద ఆపరేటర్‌కు చట్టపరమైన నోటీసు పంపాలి. బాధిత ప్రయాణికులు సమూహంగా ఏర్పడి ప్రభుత్వానికి, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ఉమ్మడి పరిహార దావాలకు క్లాస్ పిటిషన్లను దాఖలు చేయవచ్చు’అని చెబుతున్నారు.బిజినెస్ క్లాస్ అంటేనే..: ఇండిగో వైఫల్యాన్ని బహిరంగంగా ఖండించాలని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ‘వివిధ కంపెనీల ప్రముఖులు, తరచూ ప్రయాణించేవారు ఆపరేటర్‌ను సామాజిక మాధ్యమాల్లో ఎండగడితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నియంత్రణ సంస్థల కంటే బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు విమానయాన సంస్థలు ఎక్కువగా భయపడతాయి. పదేపదే సేవలు ఉల్లంఘించే ఆపరేటర్లతో ఒప్పందాలను కార్పొరేట్ సంస్థలు నిలిపివేయొచ్చు. పెద్ద క్లయింట్లను కోల్పోవడం అంటే వ్యాపారాన్ని పోగొట్టుకున్నట్టేనని విమానయాన సంస్థలు భావిస్తాయి’అని చెబుతున్నారు.మన దగ్గరా అమలవ్వాలి..: నియంత్రణ పరంగా సంస్కరణలకు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేయాలన్నది నిపుణుల మాట. ‘ఈయూ 261 తరహా నిబంధనల కోసం ఒత్తిడి చేయాలి. ఎయిర్‌లైన్ వల్ల కలిగే అంతరాయానికి కస్టమర్ల అభ్యర్థన ఆధారంగా కాకుండా ఆటోమేటిక్‌గా పరిహారం అందాలి. ఆపరేటర్లే భోజనాలు, ఆశ్రయాన్ని కల్పించాలి. జరిమానాలు ఆర్థికంగా ఉండాలి. ఉల్లంఘనలు పెరిగిన కొద్దీ జరిమానా అదే స్థాయిలో అధికం కావాలి’అని సూచిస్తున్నారు.ఏ దేశంలో ఎలా ఉందంటే..చాలా పరిణతి చెందిన విమానయాన మార్కెట్లలో కంపెనీల నిర్లక్ష్యంతో ఇటువంటి పరిస్థితులు తలెత్తితే అక్కడి ప్రభుత్వాలు చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తాయి. భారీ జరిమానాలు, కోర్టులు, వినియోగదార్ల ఫోరమ్స్‌లో వ్యాజ్యాలు, ఆపరేటర్లపై కఠిన చర్యలతోపాటు నియంత్రణ పరంగా జోక్యం చేసుకుంటాయి. యూరప్: ఈయూ నిబంధన 261 ప్రకారం.. విమానం ఆలస్యం, రద్దు అయితే ఒక్కో ప్యాసింజర్‌కు 600 యూరోల వరకు పరిహారం చెల్లించాలి. తప్పనిసరి భోజనం, పానీయాలు, వసతి కల్పించాలి. టికెట్ ధరను పూర్తిగా వెనక్కి ఇవ్వడం లేదా మరో మార్గంలో (రీ–రూటింగ్) గమ్యస్థానానికి పంపించాల్సిన బాధ్యత ఆపరేటర్‌దే. అమెరికా: 2022లో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ సంక్షోభంతో ప్రజల ఆగ్రహం, కోర్టుల్లో వ్యాజ్యాల కారణంగా ప్రభుత్వం దర్యాప్తు జరిపింది. భారీ మొత్తంలో కంపెనీ రీఫండ్ చేయాల్సి వచ్చింది. ప్రయాణికులకు హోటల్ కవరేజ్, భోజనం, రీబుకింగ్ సహాయం, రీఫండ్స్ లభించాయి.కెనడా: ఎయిర్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ నిబంధనల ప్రకారం ఎయిర్‌లైన్ లోపం కారణంగా తలెత్తే అంతరాయాలకు ప్రతి ప్యాసింజర్‌కు 125–1,000 కెనడియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆ్రస్టేలియా: ప్రయాణికులను తప్పుదారి పట్టించడం, వారికి ఏదైనా హాని కలిగితే విమానయాన నియంత్రణ సంస్థలు ఆపరేటర్లకు జరిమానా విధిస్తాయి. -
ఇండిగో సంక్షోభం.. కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి సాహసం
కనీవినీ ఎరుగని రీతిలో ఇండిగో విమానాల రద్దు, ప్రయాణీకుల కష్టాలకు సంబంధించిన ఇప్పటికే పలు హృదయవిదారక కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. హరియాణాలోని రోహ్తక్ నుండి పంఘల్ కుటుంబాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. కుమారుడి పరీక్ష కోసం తండ్రి చేసిన సాహసం వైరల్‌గా మారింది.హర్యానాలోని రోహ్తక్కు చెందిన యువ షూటర్ ఆశీష్ చౌధరిపంఘాల్, ఇండోర్‌లోని డాలీ కళాశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. ప్రీ-బోర్డ్ పరీక్ష (XII ) రాసేందుకు ఇండోర్‌కు వెళ్లాల్సి ఉంది. ఢిల్లీ నుండి విమానాశ్రయానికి వెళ్లాలని ప్లాన్. కానీ అనూహ్యంగా ఇండిగో విమాం రద్దు అయింది. రైలులో సీటు అందుబాటులో లేదు. దీంతో ఏం చేయాలో పాలుపోని తండ్రి రాజ్‌నారాయణ్ పంఘాల్ సాహసపోతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన కొడుకు పరీక్షకు హాజరుకావాలంటే రాత్రంతా కారులో ప్రయాణించాలని ఎంచుకున్నాడు. దాదాపు 800కిలోమీటర్లు కారులో ప్రయాణించి కాలేజీకి చేరుకున్నాడు. సరిగ్గాపరీక్ష సమయానికి ఇండోర్‌కు చేరడం విశేషంగా నిలిచింది. ఇదీ చదవండి: మధుమేహులకు గుడ్ న్యూస్ : నోవో నార్డిస్క్ మందు వచ్చేసిందిదీనిపై తండ్రి రాజ్ నారాయణ్ స్పందిస్తూ డిసెంబర్ 8న పరీక్షలు రాయాల్సి ఉంది. అంతకుముందు, డిసెంబర్ 6 సాయంత్రం ఇండోర్‌లోని కళాశాలలో అబ్బాయికి సత్కారం జరగాల్సి ఉంది. ఢిల్లీ నుండి ఇండోర్‌కు అతని విమానం ఇప్పటికే బుక్ చేశాం. అతణ్ని ఢిల్లీ విమానాశ్రయంలో దింపడానికి వెళ్ళాను, విమానం రద్దు కావడంతో సత్కారం మిస్ అయింది. కానీ పరీక్ష మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే తానీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. సమయానికి తీసుకెళ్ల గలిగాను అంటూ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో గ్రేట్ ఫాదర్, నాన్న ప్రేమ అలా ఉంటుంది అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. -
కోర్టుకు ఎక్కిన ఇండిగో..
ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కోర్టుకు ఎక్కింది. విమాన ఇంజిన్లు, విదేశీ మరమ్మతుల తర్వాత తిరిగి దిగుమతి చేసుకున్న విడిభాగాలపై చెల్లించిన రూ .900 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.ఆన్లైన్ లీగల్ సమాచార పోర్టల్ బార్ & బెంచ్ కథనం ప్రకారం.. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ శైల్ జైన్ లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ కేసును విచారించింది. అయితే, తన కుమారుడు ఇండిగోలో పైలట్ గా పనిచేస్తున్నాడని పేర్కొంటూ జస్టిస్ జైన్ ఈ కేసు నుండి వైదొలిగారు. ఈ విషయాన్ని ఇప్పుడు వేరే ధర్మాసనం ముందు ఉంచనున్నట్లు నివేదిక తెలిపింది.ఇండిగో వాదన ఇదీ..మరమ్మతుల తర్వాత తిరిగి చేసుకునే దిగుమతులను సర్వీస్‌గా పరిగణించాలే తప్ప తాజా వస్తువుల దిగుమతిగా కాదు.. అనేది ఇండిగో వాదన. తదనుగుణంగానే పన్ను విధించాలని ఈ ఎయిరలైన్స్ కోరుతోంది. సంక్షిప్త విచారణ సందర్భంగా, ఇండిగో తరపున సీనియర్ న్యాయవాది వి.లక్ష్మీకుమారన్.. కస్టమ్స్ సుంకం రాజ్యాంగ విరుద్ధమని, అదే లావాదేవీపై "డబుల్ లెవీ" అని వాదించారు.ఇండిగో ఇప్పటికే పునర్-దిగుమతి చేసుకునే సమయంలోనే ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని చెల్లించిందని, మరమ్మతులను సర్వీసుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద విడిగా జీఎస్టీని చెల్లించిందని చెప్పారు. అయితే, కస్టమ్స్ అధికారులు పునర్-దిగుమతిని తాజాగా వస్తువుల దిగుమతిగా పరిగణించి మళ్లీ సుంకాన్ని డిమాండ్ చేశారని విన్నవించారు.మరమ్మతు తర్వాత పునర్-దిగుమతులపై రెండుసార్లు సుంకం విధించలేరని కస్టమ్స్ ట్రిబ్యునల్ గతంలో తీర్పు ఇచ్చిందని విమానయాన సంస్థ తెలిపింది. అయితే, ట్రిబ్యునల్ తరువాత మినహాయింపు నోటిఫికేషన్ ను సవరించింది, అటువంటి మార్పులు భవిష్యత్తులో పనిచేస్తాయని స్పష్టం చేసింది. అదనపు లెవీని అనుమతించే నోటిఫికేషన్ లోని భాగాన్ని ట్రిబ్యునల్ కొట్టివేసిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఇండిగో కోర్టుకు తెలిపింది.అదనపు సుంకం చెల్లించి తీరాల్సిందేనని కస్టమ్స్ అధికారులు బలవంతం చేశారని, అంత వరకూ విమానాన్ని నిరవధికంగా గ్రౌండ్ చేయనీయకపోవడంతో తప్పని పరిస్థితిలో 4,000 కంటే ఎక్కువ ఎంట్రీ బిల్లుల ద్వారా రూ.900 కోట్లకు పైగా డిపాజిట్ చేసినట్లు ఇండిగో వివరించింది. -
ఇండిగో సంక్షోభం నలుగురు అధికారులు సస్పెండ్
-
Good News: రూ.15 వేల విలువైన వోచర్స్ ఇవ్వనున్న ఇండిగో
-
ఇండిగో బాధితులకు స్వల్ప ఊరట,ఆఫర్ ఏంటంటే..
సాక్షి,ముంబై: తీవ్ర సంక్షోభం, గందరగోళం మధ్య విమానయాన సంస్థ ఇండిగో బాధిత ప్రయాణికుల స్వల్ప ఊరట నిచ్చింది. వరుస విమానాల రద్దు, ప్రయాణీకుల ఇక్కట్లు , డీజీసీఏ చీవాట్లు నేపథ్యంలో విమాన రద్దుతో ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో రూ. 10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అందించనుంది. ఈ మేరకు డిసెంబర్ 11 గురువారం ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది.డిసెంబర్ 3, 4 మరియు 5 తేదీలలో విమాన అంతరాయాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో రూ. 10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అందిస్తామని ఎయిర్‌లైన్ తెలిపింది. విమాన ఆలస్యాలు , రద్దుల కారణంగా ప్రయాణికులకు ఎయిర్‌లైన్ చెల్లించాల్సిన వాపసులు, ప్రభుత్వం నిర్దేశించిన పరిహారానికి ఇండిగో ప్రకటించిన ఈ ఆఫర్ అదనం. రాబోయే 12 నెలల్లో ఇండిగోతో భవిష్యత్తులో చేసే ఏదైనా ప్రయాణానికి వోచర్లను రీడీమ్ చేసుకోవచ్చని తెలిపింది.రద్దు చేయబడిన అన్ని విమానాలకు రీఫండ్ల ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు ఇండిగో తెలిపింది. రీఫండ్లు ఇప్పుడు కస్టమర్ ఖాతాలో క్రెడిట్అయ్యాయనీ, మిగిలిన వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తున్నామని తెలిపింది. ట్రావెల్ ప్లాట్‌ఫామ్ భాగస్వాముల ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్ల రీఫండ్లు కూడా ప్రారంభమైనట్టు పేర్కొంది. మరోవైపు విమాన టికెట్ల చార్జీల రీఫండ్‌తోపాటు, ప్రస్తుత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, బయలుదేరే సమయం నుండి 24 గంటలలోపు విమానాలు రద్దు చేయబడిన వినియోగదారులకు, విమానం బ్లాక్ సమయం ఆధారంగా ఇండిగో రూ. 5,000 నుండి రూ. 10,000 వరకు పరిహారాన్ని అందిస్తుంది. ఇదీ చదవండి: రూ. 9.1 కోట్లు ఉంటే ట్రంప్ గోల్డ్ కార్డ్ మీదే! ఎలా అప్లయ్ చేయాలి? -
ఇంకా సమసిపోని ఇండిగో సంక్షోభం
ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. డిసెంబర్ 2 నుంచి 5000 విమాన సర్వీసులు వరకు రద్దయ్యాయని తెలుస్తుంది. ఇటీవల ఇండిగో సీఈఓ పూర్తిస్థాయిలో సర్వీసులు పునరుద్ధరించినట్లు చెప్పారు. కానీ విమానాల రద్దు, సర్వీసుల్లో అంతరాయం ఇంకా కొనసాగుతోంది. ఈరోజు బెంగళూరులో 60 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో చెప్పింది. దాంతోపాటు ఇటీవల నెలకొన్న కొన్ని తాజా పరిణామాలు కింద చూద్దాం.అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం మొత్తం 18 ఇండిగో విమానాలను రద్దు చేశారు. వీటిలో తొమ్మిది రావాల్సినవి, మరో తొమ్మిది బయలుదేరాల్సిన సర్వీసులు ఉన్నాయి.మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నుంచి ఇండిగో విమాన సర్వీసులు సకాలంలో తిరిగి ప్రారంభమయ్యాయి.బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో గురువారం ఉదయం 60 ఇండిగో విమానాలను రద్దు చేసినట్లు విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. రావాల్సినవి-32, బయలుదేరాల్సినవి-28.ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ ఈ రోజు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ముందు హాజరుకానున్నారు. ఇటీవలి కార్యాచరణ అంతరాయాలపై డేటా, అప్డేట్లతో సహా సమగ్ర నివేదికను సమర్పించడానికి డీజీసీఏ ఆయనను పిలిచింది.ఇటీవల విమాన సర్వీసుల రద్దు నేపథ్యంలో ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ మెహతా ఒక వీడియో సందేశంలో ప్రయాణికులకు క్షమాపణలు కోరారు. వేలాది మంది ప్రయాణికులు ఈ సంఘటన వల్ల చాలా ఇబ్బందులు పడ్డారని అంగీకరించారు.Message from Vikram Singh Mehta, Chairman and Non-Executive Independent Director of IndiGo pic.twitter.com/sySacxlFq0— IndiGo (@IndiGo6E) December 10, 2025ఇండిగో నిన్న 220 విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది.సామూహిక విమానాల రద్దు కారణంగా మూడో త్రైమాసికంలో దేశీయ వింటర్ షెడ్యూల్లో 10 శాతం సర్వీసులను తగ్గించుకోవాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: సవాళ్లపై భారత్ నజర్ వేయాల్సిందే! -
65,000 మంది ఉద్యోగుల సహకారం!
దేశీయ విమానయాన రంగంలో ఇటీవల తలెత్తిన భారీ అంతరాయాల నేపథ్యంలో ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి కృషి చేసినట్లు తెలిపింది. ఈ ప్రయత్నంలో రోజువారీ కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 65,000 మంది ఉద్యోగులు కీలకమైన సహకారాన్ని అందించారని ఇండిగో పేర్కొంది.డిసెంబర్ 2న ప్రారంభమైన సామూహిక విమాన రద్దులు, ఆలస్యం కారణంగా ప్రయాణికులకు కలిగిన తీవ్ర అసౌకర్యాన్ని పరిష్కరించడానికి ఇండిగో యాజమాన్యం ప్రయత్నించింది. ఈ సంక్షోభ సమయంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్, తన బృందం పరిస్థితులను సద్దుమణిగించేందుకు చర్యలు తీసుకున్నారు. నిన్న విమాన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించినట్లు చెప్పారు. ఈ క్రమంలో ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. ఇండిగో బోర్డు మొత్తం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది.ప్రభుత్వ జోక్యం: డీజీసీఏ చర్యలుఈ అసాధారణ అంతరాయాలపై కేంద్ర విమానయాన శాఖ స్పందించింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించాలని ఇండిగో సీనియర్ నాయకత్వానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాక, ఇండిగో విమాన కార్యకలాపాలను స్థిరీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇండిగో ఫ్లైట్ షెడ్యూల్లో 10% తగ్గించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. దీనికి అనుగుణంగా, విమానయాన సంస్థ తన నెట్‌వర్క్‌లోని అన్ని గమ్యస్థానాలకు సేవలను కొనసాగిస్తూనే స్థిరీకరణ కోసం షెడ్యూల్లో కోతలు పెట్టింది.ఇదీ చదవండి: అసంఘటిత కార్మికులకు అండగా ఏఐ -
ఇండిగో క్రెడిట్ డ్రామా… చంద్రబాబు అండ్ కో ప్రయత్నం ఫెయిల్
సాక్షి,అమరావతి: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విషయంలో క్రెడిట్ కొట్టేద్దామని చంద్రబాబు అండ్ గ్యాంగ్ ప్రయత్నించిందని, సీన్ రివర్స్ కావడంతో సైలెంటయ్యిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.మీడియాతో మాట్లాడిన సతీష్ రెడ్డి.. ‘బాబు పాలనపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అభివృద్ధి పేరుతో చేసింది ఏమీ లేదు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. బాబు పాలన అంతా ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయడం బాబుకు అలవాటు కాదు. డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఆయనకు తెలిసిన మార్గం.టీటీడీలో చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. టీటీడీలో తప్పు జరిగితే వేంకటేశ్వరస్వామి శిక్షిస్తాడు. అనవసరంగా బురద చల్లితే ఆ పాపం ఊరికే పోదు’అని ఆయన హెచ్చరించారు. -
IndiGo Flight Crisis: ఇండిగోకు DGCA బిగ్ షాక్.. విమానాల సంఖ్య తగ్గింపు
-
ఇండిగో సంక్షోభం: హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో
భారతదేశపు అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభంతో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితులు ఇపుడిపుడే ఒక కొలిక్కి వస్తున్నాయి. అయితే విమానాల రద్దు, ప్రయాణీకుల అగచాట్ల నేపథ్యంలో ఇండిగో పై సోషల్‌మీడియాలో అనేక మీమ్స్, కామెడీ పంచ్‌లు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇటీవల ఇండిగోను విమర్శిస్తూ వచ్చిన ఒక AI-వ్యంగ్య వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.‘‘ఇండిగో కొత్త విమానాలు: ఆలస్యం లేదు, మళ్లింపులు లేవు... చాలా రీజనబుల్’’ అనే శీర్షికతో పోస్ట్ అయిన ఈ వీడియోలో ఇండిగో విమానం మాదిరిగా గానే ఒక ఆటో రిక్షాను మనం చూడవచ్చు. పైలట్ల కొరత, ఒక్క డిసెంబర్లోనే 2,000 కంటే ఎక్కువ విమానాల రద్దు, తీవ్రమైన కార్యాచరణ వైఫల్యం లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఈ విడియో రావడం గమనార్హం. IndiGo’s new fleet: no delays, no diversions…. and very reasonable 😃 pic.twitter.com/llHqkloH6T— Harsh Goenka (@hvgoenka) December 9, 2025కాగా భారతదేశ దేశీయ విమానయాన మార్కెట్లో దాదాపు 65 శాతం వాటా ఉన్న ఇండిగో, పైలట్ల కోసం కొత్త పనిగంటలు, నైట్ డ్యూటీలు వారపు విశ్రాంతి పరిమితులను (FDTL) తీర్చడానికి కార్యాచరణ వనరులను సర్దుబాటు చేయకుండా ఇండిగో తన శీతాకాలపు షెడ్యూల్లో రోజువారీ విమానాలను 6శాతం పెంచడంతో సమస్యలు తలెత్తాయి.దీంతో ఊహించనరీతిలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. వేలాదిమంది ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలో చిక్కుకుపోయి అనేక ఇబ్బందులు పడ్డాడు. దీనిపై కేంద్ర విమానాయాన మంత్రిత్వశాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలు చేపట్టింది. దీనిపై దర్యాప్తునకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు, ఇండిగో దేశీయ షెడ్యూల్లో 10శాతం కోత విధించాలని మంగళవారం ఆదేశించింది. గతంలో జారీ చేసిన 5శాతం తగ్గింపుతో పోలిస్తే ఇది రెట్టింపు. -
ఇండిగోకు DGCA షాక్
-
కొన్ని గాల్లో.. ఇంకొన్ని నేలపై
న్యూఢిల్లీ/ముంబై: గత రెండు రోజులుగా ఇండిగో విమాన సర్వీసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వరుసగా ఎనిమిదో రోజు సైతం విమానాల రద్దు పర్వం కొనసాగింది. మంగళవారం మరో 422 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే 152 విమానాలు రద్దయ్యాయి. బెంగళూరులో 121, హైదరాబాద్‌లో 58, చెన్నైలో 50, ముంబైలో 41 విమానాలు రద్దయి హ్యాంగర్లకే పరిమితమయ్యాయి.సంక్షుభిత ఇండిగో మాత్రం తమ సర్వీసులు దాదాపు మళ్లీ సాధారణస్థాయికి చేరుకుంటున్నాయని ప్రకటించింది. ఈ మేరకు ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీటర్ ఎల్బర్స్ మంగళవారం ఒక వీడియో సందేశం విడుదలచేశారు. ‘‘ ఇండిగో మళ్లీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. గతంలో విమానాల రద్దు ఘటన విషయంలో మరోసారి ప్రయాణికులకు క్షమాపణలు చెబుతున్నా. మా వెబ్సైట్లో కనిపించే దాదాపు ప్రతి విమానం షెడ్యూల్ సమయానికి రాకపోకలు సాగించేలా శతథా కృషిచేస్తున్నాం’’ అని ఆయన అన్నారు. ఇండిగో సర్వీసులపై కేంద్రం కోతతరచూ విమానాలు రద్దవడంతో ఇండిగో టికెట్లు కొన్న ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, ఈ కంపెనీ టికెట్లు కొని అవస్థలు పడకుండా నివారించేందుకు దేశవ్యాప్త షెడ్యూల్లో సంస్థకు చెందిన 5 శాతం సర్వీసులపై మోదీ ప్రభుత్వం కోత విధించింది. ఆ మేరకు 5 శాతం షెడ్యూల్ స్లాట్‌ను ఇతర కంపెనీలకు కేటాయించింది. ముఖ్యంగా అత్యంత రద్దీ ఉండే, ప్రధాన రూట్లలో ఈ 5 శాతం షెడ్యూల్‌ను ఇతర కంపెనీలకు కేటాయించింది. దేశీయ పౌరవిమానయాన రంగంలో 65 శాతం వాటాను ఆక్రమించిన ఇండిగోపైనే పూర్తిగా ఆధారపడకుండా ఇతర కంపెనీలకూ అవకాశాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో వాటికి 5 శాతం స్లాబ్‌ను కేటాయించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అనుమతించిన షెడ్యూల్లో విమానాలను నడపలేక విఫలమైన ఇండిగోకు ప్రభుత్వం ఇలా స్లాట్ కోత రూపంలో పాక్షికంగా శిక్షించింది. -
ఇండిగో బ్లాక్‌మెయిలింగ్
ప్రయాణికులపట్ల దురుసుగా ప్రవర్తిస్తూ తరచు వార్తల్లోకెక్కే ‘వివాద’యాన సంస్థ ఇండిగో... తనకు నచ్చని నిబంధనలు అమల్లోకి రావటాన్ని జీర్ణించుకోలేక వారం రోజులపాటు దేశంలో పౌర విమానయానాన్ని దాదాపు స్తంభింపజేసింది. కనీవినీ ఎరుగని రీతిలో దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయి, వేలాదిమంది ప్రయాణికులు దారీతెన్నూ తోచక ఇబ్బందులు పడ్డారు. కనీసం ప్రత్యామ్నాయాలు వెదుక్కుందామన్నా లగేజీ ఆచూకీ దొరక్క నరకయాతన అనుభవించారు. వారం గడుస్తున్నా యథాపూర్వ స్థితి ఇంకా ఏర్పడలేదు. కాకపోతే కాస్త మెరుగైంది.ఈ పాపంలో కేంద్ర ప్రభుత్వానికీ వాటా ఉంది. ఇండిగో ధిక్కరణను పసిగట్టలేని అమాయకత్వం క్షంతవ్యమేనా? తక్కువ చార్జీలతో ప్రయాణికులను ఆకట్టుకుని, సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంటూ, ఎవరికీ అందని స్థాయిలో విస్తరించుకుంటూ పోయిన ఇండిగో ఆ రంగంలో గుత్తాధిపత్యాన్ని నెలకొల్పింది. గత పాతికేళ్లలో మూతబడిన జెట్ ఎయిర్వేస్, ఎయిర్ సహారా, ఎయిర్ డెక్కన్, కింగ్‌ఫిషర్ వగైరా 9 సంస్థలు ఇండిగో చకచకా ఎదగటానికి దోహదపడ్డాయి. పర్యవసానంగా పౌర విమానయాన రంగంలో ఇండిగో 61 శాతం వాటాను సాధించగలిగింది. మరో సంస్థ ఎయిరిండియా 30 శాతం దగ్గర నిలిచింది.పోటీదారులందరినీ దాటుకుని శరవేగంతో దూసుకుపోవటం, లాభార్జన అదే స్థాయిలో పెరగటం, స్వల్ప కాలంలోనే సమర్థవంతమైన సంస్థగా పేరు తెచ్చుకోవటం, ఏటా పది కోట్ల మంది ప్రయాణికులను చేరేయటం ప్రశంసించదగ్గ విజయమే కావొచ్చు. కానీ గగనతలంలో 35,000 అడుగుల ఎత్తున ఎగిరే విమానాలతోపాటే దాని అహంకారమూ పడగలెత్తింది. విమానయాన రంగాన్ని శాసిస్తున్న తనకు విధివిధానాలు నిర్దేశించటానికి పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) ఎవరన్న స్థాయికి చేరుకుంది. అందుకే ఉద్దేశపూర్వకంగా ధిక్కారాన్ని ప్రదర్శించింది. ‘కేవలం అవగాహన లేమి వల్లా, ప్రణాళికల రూపకల్పనలో జరిగిన లోటుపాట్ల వల్లా’ సర్వీసులకు అంతరాయం ఏర్పడిందన్న ఇండిగో ప్రకటన ఉత్త వంచన. ఎందుకంటే దేశీయ విమాన సర్వీసుల్ని ఎడా పెడా రద్దు చేసిన ఆ సంస్థ... అంతర్జాతీయ సర్వీసుల్లో కేవలం 10 శాతానికి మాత్రమే కోతపెట్టింది. ఆ సర్వీసులు ఇష్టానుసారం రద్దు చేస్తే భారీ మొత్తాల్లో జరిమానాలుంటాయి మరి.డీజీసీఏ ఏర్పరిచిన నిబంధనలు ఇప్పటివి కాదు. గత ఏడాది మొదట్లోనే... అంటే దాదాపు రెండేళ్లనాడే ఆ ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. లాభార్జన కోసం తక్కువ మందితో ఎక్కువ సర్వీసులు నడిపే ధోరణి ప్రమాదకరమన్న ఉద్దేశంతో విధించిన పరిమితులవి. వారంలో పైలెట్లకుండే విశ్రాంతి సమయాన్ని 36 గంటలనుంచి 48 గంటలకు పెంచటం, రాత్రి వేళల్లో పైలెట్లు పనిచేసే సమయాన్ని 10 గంటలకు పరిమితం చేయటం, ఒక పైలెట్ వారానికి రెండుసార్లకు మించి నైట్ ల్యాండింగ్‌లు చేయరాదన్న నిబంధన అందులో భాగమే. ఇవన్నీ గత నెల 1 నుంచి అమలు చేయాలని కోరింది.ఈ ఏడాది కాలంలో ఇండిగో ఇందుకోసం సాగించిన కసరత్తేమీ లేదు. పైగా ఒకరి పైలెట్లను మరొకరు తీసుకోరాదని వేరే సంస్థలతో లాలూచీకి దిగి పనిగంటలు పెంచింది. సిబ్బంది వేతనాలను స్తంభింపజేసింది. ఇతర సంస్థలన్నీ దారిలోకి వచ్చినప్పుడు ఇండిగోకు మాత్రమే ఏమిటి సమస్య? గండం గట్టెక్కటానికి గత్యంతరం లేక డీజీసీఏ తన నిబంధనలు సడలించుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఏర్పరిచిన నిబంధనలకే దిక్కులేకపోవటం విషాదం కాదా? బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగటం కాదా? ప్రతిదానికీ ప్రైవేటు మంత్రం జపించే పాలకులకు ఇండిగో వ్యవహారం కనువిప్పు కావాలి.సంక్షోభ సమయాల్లో టిక్కెట్ ధరలు పెంచి ప్రయాణికుల జేబులు కొల్లగొడు తున్నా పట్టనట్టుండే ధోరణి ఇండిగో వంటి సంస్థలకు కొమ్ములూ కోరలూ తెచ్చింది. ధిక్కరణకు పురిగొల్పింది. ఉన్న రెండు ప్రధాన విమానయాన సంస్థల్ని సరిగా పర్యవేక్షించలేని కేంద్ర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు చేతగానితనం ఈ పర్యాటక సీజన్లో దేశం పరువు తీసింది. ఈ వ్యవహారంలో జవాబుదారీతనాన్ని నిగ్గు దేల్చి కేంద్రమంత్రితో సహా బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలి. -
ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ
దేశీయ విమానయాన రంగంలో ఇటీవల తలెత్తిన భారీ అంతరాయాలపై ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ మంగళవారం (డిసెంబర్ 9, 2025) ఒక వీడియో సందేశం ద్వారా ప్రయాణికులకు బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. విమానాల రద్దు, జాప్యం కారణంగా కస్టమర్లకు కలిగిన తీవ్ర అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ, ఇండిగో తన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించిందని చెప్పారు. భవిష్యత్తులో ప్రయాణికుల్లో విశ్వసనీయతను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.వ్యక్తిగత క్షమాపణసీఈఓ తన సందేశంలో ‘ప్రియమైన కస్టమర్లు.. మేము మీకు అసౌకర్యాన్ని, నిరాశను కలిగించామని మాకు తెలుసు. మీలో చాలా మంది ముఖ్యమైన క్షణాలను కోల్పోయారని తెలుసు. కుటుంబ సభ్యులను కలుసుకునేవారు, వ్యాపార సమావేశాలు, సెలవులు.. ఇలా చాలా మందికి తమ ప్రయాణాల్లో అంతరాయం కలిగింది. మమ్మల్ని క్షమించండి. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టామని అంగీకరిస్తున్నాం’ అని అన్నారు.కార్యకలాపాలు పునరుద్ధరణగత కొన్ని రోజుల పాటు కొనసాగిన గందరగోళం తర్వాత నెట్వర్క్ పునరుద్ధరణ కోసం ఇండిగో తీసుకున్న చర్యలను సీఈఓ స్పష్టం చేశారు. డిసెంబర్ 5న అతిపెద్ద సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి. ఆ తర్వాత క్రమంగా కార్యకలాపాలు మెరుగుపడ్డాయని ఆయన తెలిపారు.విమాన సర్వీసుల పునరుద్ధరణ క్రమండిసెంబర్ 5: 700 విమానాలుడిసెంబర్ 6: 1,500 విమానాలుడిసెంబర్ 7: 1,650 విమానాలుడిసెంబర్ 8: 1,800 విమానాలుడిసెంబర్ 9: 1,800 విమానాలు, పూర్తి నెట్వర్క్ పునరుద్ధరణ‘ఈ రోజు డిసెంబర్ 9 నాటికి మా కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చాయని నేను నిర్ధారించగలను. మేము మా నెట్‌వర్క్‌లోని మొత్తం 138 గమ్యస్థానాలకు తిరిగి సేవలు అందిస్తున్నాం’ అని ఎల్బర్స్ ప్రకటించారు.ప్రయాణికులకు తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించడానికి ఇండిగో తీసుకున్న చర్యలను కూడా ఎల్బర్స్ వివరించారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు లేదా ఇంటికి సురక్షితంగా చేర్చడం తొలి ప్రాధాన్యతగా తెలిపారు. లక్షల మంది కస్టమర్లకు ఇప్పటికే పూర్తి రిఫండ్లు జారీ అయ్యాయని చెప్పారు. మిగిలిన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. విమానాశ్రయాల్లో నిలిచిపోయిన చాలా బ్యాగ్‌లను ప్రయాణికుల ఇళ్లకు పంపినట్లు పేర్కొన్నారు.భవిష్యత్తుపై భరోసాఈ సంక్షోభంపై అంతర్గత సమీక్ష నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని సీఈఓ తెలిపారు. ఈ అంతరాయానికి గల కారణాలను తెలుసుకోవడంతో పాటు ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనల అమలులో ఎదురైన సమస్యలను కూడా పరిష్కరిస్తున్నామని అన్నారు. ‘ఇటువంటి అంతరాయాలు మళ్లీ జరగకుండా చూసుకోవడానికి మేము కొత్త రక్షణలను అమలు చేస్తున్నాం. మాపై నమ్మకాన్ని ఉంచుతున్నందుకు ధన్యవాదాలు’ అని తెలిపారు.#WATCH | IndiGo CEO Pieter Elbers says," IndiGo is back on its feet, and our operations are stable...Lakhs of customers have received their full refunds, and we continue to do so on a daily basis. Most of the bags stuck at airports have been delivered to your homes...We also… pic.twitter.com/zhezNROtoh— ANI (@ANI) December 9, 2025ఇదీ చదవండి: అనిల్ అంబానీ కుమారుడిపై సీబీఐ కేసు -
Big Shock To Indigo: ఇండిగో సర్వీస్‌పై DGCA కోత
-
ఇండిగో సంక్షోభం : చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్
దేశవ్యాప్తంగా వరుసగా ఇండిగో విమానాల రద్దు, ప్రయాణీకుల అగచాట్లతో విమానయానరంగంలో గతంలో ఎన్నడూ చూడని తీవ్ర సంక్షోభం నెలకొంది. గత కొన్ని రోజులుగా వందలాది విమానాలు రద్దవ్వడంతో ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయి పిల్లాపాపలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అటు విమానాలు రద్దు, ఇటు సమయానికి రైళ్లు దొరక్క నానా కష్టాలపడుతున్నారు. దీనికి తోడు భరించ లేని ఆర్థిక భారం. చేతగానితనం, నిర్లక్ష్యంతోనే ముప్పుఇండిగో విమాన సర్వీసుల రద్దు, టికెట్ ధరల భారీ పెరుగుదలపై కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత గందర గోళానికి కారణమైన ఇండిగోను అదుపు చేయలేక పోవడపై ప్రయాణికులు మండిపడ్డారు. మరోవైపు మంత్రి అసమర్థత వల్లే ఈ సంక్షోభం నెలకొందని, విమానయాన సంస్థను నియంత్రించలేకపోతున్నారని ప్రతిపక్షాలు, విమాన పైలట్ల సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఇండిగో అంతర్గత సమస్యలపై మంత్రి స్పందించడంలో విఫలమయ్యారని, రెండు నెలల ముందే పైలట్ల సంఘం హెచ్చరించినా పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు. అటు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్లు గట్టిగానే వినిపించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కుదిపేసిన ఇండిగో సంక్షోభంపై వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యం వల్లే దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విమానాలు రద్దయ్యాయని విమర్శించారు. ఈ సంక్షోభానికి నైతిక బాధ్యత వహించి రామ్మోహన్ నాయుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లుకేంద్రమంత్రి వైఫల్యమా? ఇండిగో వైఫల్యమా? అనేదానిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. ఎయిర్‌లైన్స్ లోపాలను సరిదిద్దడానికి, నియంత్రించడానికి ఏర్పాటు చేసింది డీజీసీఏ (DGCA). మరి పైలట్ల పని గంటలు, విశ్రాంతిపై కచ్చితమైన మార్గనిర్దేశాలను ఇచ్చినప్పటికీ ఇండిగో ఎందుకు అమలు చేయలేదు. తీవ్ర సంక్షోభం వచ్చేదాకా ఎందుకు నియామకాలు చేపట్టలేదు. ఏ పైలట్ ఎన్ని గంటలు fly చేస్తున్నాడు అనే సమాచారం రియల్ టైంలో విమానశాఖ వద్ద ఉంటుంది. దీంతోపాటు ఏయే సంస్థ దగ్గర ఎంత మంది పైలట్స్ ఉన్నారో రెగ్యులేటరీ దగ్గర పూర్తి డేటా ఉంటుంది. ఇండిగోలో పైలట్ల కొరతనుగుర్తించడంలో అటు విమాన యాన శాఖ, ఇటు డీజీసీఏ వైఫల్యం, ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ముందస్తు సమీక్షలు చేయని నిర్లక్ష్యం, పరిస్థితిని అంచనావేయడంలో ఘోర వైఫల్యమే ఇంతటి సంక్షోభానికి దారి తీసిందంటున్నారు. రామ్మోహన్ నాయుడు చేతగానితనంతోనే దేశ పరువు ప్రపంచస్థాయిలో దిగజారిందని పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరికొందరు మంత్రి రామ్మోహన్ నాయుడుకి రీల్స్‌పై ఉన్న శ్రద్ధ తన శాఖపై పెట్టి ఉంటే ప్రయాణీకులకు ఇన్ని కష్టాలొచ్చేవి కావని మరికొంతమంది మండి పడుతున్నారు. కబుర్లే గానీ, పనితనం లేదు‘‘కుర్రాడికి కాళ్ళు ఎక్కడా భూమి మీద నిలవటం లేదు, ఇటువంటి స్ట్రోక్ అవసరం ఎంతైనా ఉంది. అడ్మినిస్ట్రేషన్ చెయ్యటం స్పీచులు ఇచ్చినంత ఈజీ కాదు, మా బెజవాడ ఎయిర్‌పోర్ట్‌లో అతని పనితనం చూశాం, అప్పుడే అనుకున్నాను ఈ కుర్రాడు కబుర్లు బాగా చెబుతాడు కానీ పనిమంతుడు కాడు అని జీవితంలో ఎయిర్‌ఫోర్ట్‌లో మొహం చూడని వాళ్ళు అతన్ని తిడుతున్నారు అని పోస్టులు చూసాను, జీవితంలో విమానాశ్రాయం మొహం చూడని వాళ్ళు కూడా అతన్ని గుడ్డిగా వెనకేసుకు వస్తున్నారు’’ అని మూడు రోజులు నుంచి విమానాలు దొరక్క, ట్రెయిన్స్ దొరక్క భోపాల్ లో ఇరుక్కు పోయిన ప్రయాణికుడి ఆవేదన ఇది. రీఫండ్లు ఇస్తారు సరే, మా కష్టాల మాటేమిటి? మా ఆర్థిక నష్టాన్ని ఎవరు భరిస్తారు? మానసిక క్షోభకు ఎవరు విలువ కడతారు అంటూ బాధిత ప్రయాణీకుల ప్రశ్నలకు రామ్మోహనాయుడి దగ్గర సమాధానం ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్‌లో వందలామంది ప్రయాణీకుల సజీవ దహనమైన ఎయిరిండియా విషాదాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మరిన్ని ఘోరాలు జరగముందే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఇలా ఉంటే చర్యలు తీసుకుంటున్నాం.. సమీక్షిస్తున్నాం అని కేంద్ర మంత్రి ఊదర గొడుతున్నప్పటికీ, ఇప్పటికీ ఇండిగో విమానాల రద్దుకు ఫుల్ స్టాప్ పడలేదు. కొంతమంది రీఫండ్లు, లగేజీలు పరిస్థితి ఇంకా చక్కబడలేదు. ఇండిగో క్రమంలో స్థిరీకరణలోకి వస్తున్నాయంటూ ఇండిగో సంక్షోభంపై లోక్‌సభలో రామ్మోహన్ నాయుడు ప్రకటన చేశారు. విమానయాన రంగాన్ని సంరక్షిస్తాం, ప్రయాణీకుల భద్రతను కాపాడతాం అంటూ, ఇండిగో సంస్థకు షోకాజ్ నోటీసులిచ్చి చేతులు దులిపేసుకున్న వైనాన్ని మనం చూడవచ్చు. -
పరువు విమానం పాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కేంద్ర మంత్రి, జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అప్రతిష్ట పాలయ్యారు. రామ్మోహన్ నాయుడు తన వాగ్ధాటితో ఇన్నేళ్లు నెట్టుకువచ్చారు. వీటిపైనే సామాజి క మాధ్యమాల్లో, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎలివేషన్ వీడియోలు చేసి బిల్డప్‌లు ఇస్తుంటారు. అయితే ఈ ఏడాదిలో జరిగిన పరిణామాలు మాత్రం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడిని అభాసుపాలు చేశాయి. ఆయనకు ఎంత ఎలివేషన్ ఇస్తున్నారో అంత అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వస్తోంది.రామ్మోహన్నాయుడు హయాంలో భారత విమానయాన శాఖ గౌరవానికి మచ్చ వచ్చి పడింది. జాతీయ, అంతర్జాతీయ విమానాలను ఇండిగో సంస్థ రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికుల శాపనార్థాలతో విమానాశ్రయాలు గగ్గోలు పె డుతున్నాయి. గత ఐదు రోజులుగా విమాన సర్వీ సులు రద్దువుతున్నా ఏం చేయలేకపోయారని ప్రయాణికులు కేంద్ర మంత్రిపై మండిపడుతున్నారు. అత్యవసర ప్రయాణం చేయాల్సిన వారు, షెడ్యూల్ ప్రకారంగా వెళ్లాల్సిన వారు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదీ చదవండి: Indigo crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్ఇండిగో విమానాలు అకస్మాత్తుగా నిలిచిపోవడం, 1000కి పైగా విమానాల సేవలు రద్దు కావడంతో, వాటిలో ప్రయాణించాల్సిన ప్రయాణికులంతా లబోదిబోమంటున్నారు. కేంద్ర మంత్రిపైన, చివరికి కేంద్రప్రభుత్వంపైన ప్రయాణికులంతా ధ్వజమెత్తుతున్నారు. దేశంలో ఇండిగో విమానాల రాకపోకలు నిలిచిపోవడం అతి పెద్ద ప్రయాణ సంక్షోభంగా చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రమంత్రిగా పరిష్కరించలేకపోయారని, సంక్షోభాన్ని డీల్ చేయలేకపోయారని విమర్శలకు గురవుతున్నారు. మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడం మాటలు చెప్పినంత సులువు కాదని విమాన ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.అంతకుముందు కూడాకేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అంతకుముందు కూడా అప్రతిష్టను మూటగట్టుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన విమానం అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో కూలిపోయిన సమయంలో ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు వీడియో తీశారు. దానికి బ్యాగ్రౌండ్ మ్యూ జిక్ జత చేసి పోస్టు చేయడంతో అది కాస్తా వివాదాస్పదమైంది. విషాద సమయంలో ఇలాంటి పనులేంటని నెటిజన్లు ధ్వజమెత్తారు. మంత్రి తీరుపై దేశమంతా చర్చ జరిగింది. -
ఇండిగోపై కేంద్రం తొలి వేటు!
ఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగోపై కేంద్రం కొరడా ఝళిపించింది. దేశవ్యాప్తంగా వందలాది విమానాల రద్దు, వాయిదాలకు కారణమైనందుకు చర్యలు మొదలుపెట్టింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇండిగో సంస్థకు ఉన్న స్లాట్లలో ఐదు శాతం కోత విధించింది. దీంతో ఇకపై ఈ వైమానిక సంస్థ నడిపే విమానాల సంఖ్యలో కనీసం 110 వరకూ తగ్గనున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జారీ చేసిన ఈ తాజా ఉత్తర్వులు మరిన్ని విమాన సర్వీసుల రద్దుకు దారితీయడం గమనార్హం.నిన్న మొన్నటి వరకు ఇండిగో దేశవ్యాప్తంగా దాదాపు 2200 సర్వీసులను నడిపేది. ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో, తదితర సంస్థలు ఎన్నిసార్లు టేకాఫ్/ల్యాండింగ్‌లు జరిపేందుకు ఉన్న అనుమతుల సంఖ్యనే స్లాట్లు అంటాం. ఉదాహరణకు హైదరాబాద్ విమానాశ్రయంలో 24 గంటల సమయంలో ఇండిగోకు వంద స్లాట్లు ఉన్నాయనుకుంటే.. ఆ సంస్థ ఈ సమయంలో యాభై చోట్లకు సర్వీసులు నడపవచ్చు. డీజీసీఏ తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఐదు శాతం స్లాట్లు తగ్గుతాయి కాబట్టి ఇకపై ఇండిగో హైదరాబాద్ నుంచి సుమారు 47 చోట్లకు మాత్రమే సర్వీసులను నడపగలదన్నమాట.Negative for Indigo DGCA orders Indigo to reduce flights by 5%. pic.twitter.com/BNxDFOcJZh— Yatin Mota (@yatinmota) December 9, 2025తగ్గించిన ఐదు శాతం స్లాట్లు ఏమవుతాయి?డీజీసీఏ ఉత్తర్వుల ప్రకారం వీటిని ఇప్పుడు ఎయిర్ ఇండియా, ఆకాశ, స్పైస్‌జెట్ వంటి ఇతర సంస్థలకు కేటాయిస్తారు. స్లాట్ల తగ్గింపు నేపథ్యంలో ఇండిగో మంగళవారం చెన్నైలో అత్యధికంగా 41 విమానాలను రద్దు చేసింది. వీటిల్లో 23 ల్యాండింగ్స్ ఉన్నాయి. 18 టేకాఫ్‌లు ఉన్నాయి. తిరువనంతపురం, ఢిల్లీ, ముంబైలలోనూ ఒకటి అర సర్వీసుల రద్దు ఉన్నాయి. ‘‘స్లాట్ల తగ్గింపు చర్యల వల్ల వైమానిక సంస్థల బాధ్యత మరింత పెరుగుతుంది. షెడ్యూల్స్ నిర్వహణ మరింత మెరుగవుతుంది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యం తగ్గుతంది.’’ అని డీజీసీఏ అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.ఇతర సంస్థలకు లాభం.. ఇండిగో స్లాట్లలో కోత ఇతర సంస్థలకు లాభదాయకంగా మరనుంది. చాలా బిజీగా ఉన్న ఎయిర్పోర్టుల్లోనూ తమ సర్వీసులను నడిపేందుకు అవకాశం కల్పిస్తుండటం ఇందుకు కారణం. అదే సమయంలో దేశీయంగా సుమారు 60 శాతం వాటా కలిగిన ఇండిగోకు స్లాట్ల కోతతో పడే ప్రభావం కూడా నామమాత్రమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాకపోతే ఇష్టారీతిన వ్యవహరిస్తే సహించబోమన్న సందేశం మాత్రం ఇండిగోకు అందుతుందని అంచనా. స్లాట్ల కోతపై ఇండిగో ఇప్పటివరకూ ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కాకపోతే మరిన్ని క్రమశిక్షణ చర్యల నుంచి తప్పించుకునేందుకు దీన్ని ఒక అదనుగా తీసుకుంటుందని, షెడ్యూళ్ల సమీక్ష, గ్రౌండ్ సర్వీసులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు. స్లాట్ల కోత కారణంగా కొన్ని సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉన్నందున ప్రయాణీకులు ఎప్పటికప్పుడు ఈ అంశంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. -
చేతకాకపోతే రాజీనామా చెయ్.. మంత్రి రామ్మోహన్‌పై విరుచుకుపడ్డ తమ్మినేని
-
KSR Live Show: ఇండిగో సంక్షోభం తప్పెవరిది..?
-
గోవా నైట్‌క్లబ్.. వెలుగులోకి సంచలన విషయాలు
పనాజీ: గోవా ‘బిర్క్ బై రోమియో లేన్’ నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ క్లబ్‌కు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ 2024లోనే పూర్తయినట్లు గుర్తించారు. దీంతో, అధికారులు నిర్లక్ష్యం తెరపైకి వచ్చింది.గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో 2024 మార్చిలోనే ఈ నైట్‌క్లబ్ ట్రేడ్ లైసెన్స్ గడువు ముగిసినట్టు అధికారలుఉ గుర్తించారు. అయినప్పటికీ.. దీని నిర్వహణ ఇంకా కొనసాగుతుందని తెలుసుకున్నారు. కాగా, నిబంధనల ప్రకారం.. దీనిపై చర్యలు తీసుకునే అధికారం అక్కడి పంచాయతీ అధికారులకు ఉంది. అయినా వారు ఆ క్లబ్ గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు.. ఈ నైట్‌క్లబ్ యజమానులైన గౌరవ్ లూథా, సౌరభ్ లూథ్రాలను అరెస్టు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, ఘటన జరిగిన వెంటనే వారు విదేశాలకు పారిపోయినట్లు అధికారులు తెలిపారు.ఈ కేసులో ప్రధాన నిందితులు, యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌కు పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన చోటుచేసుకున్న గంటల వ్యవధిలోనే వారు 6E-1073 ఇండిగో విమానంలో దేశం విడిచి పారిపోయారని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం గోవా పోలీసుల అభ్యర్థన మేరకు ‘బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్’ (BOI) వారిపై లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ చేసింది. ఈ ఇద్దరినీ వీలైనంత త్వరగా పట్టుకునేందుకు సీబీఐలోని ఇంటర్‌పోల్ విభాగంతో సమన్వయం చేసుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.Shocking video reveals panic just before the deadly Goa club fire 😱🔥A midnight cylinder blast at Birch, Baga killed 25, mostly trapped staff.Owner & manager arrested.CM orders probe and statewide safety crackdown. pic.twitter.com/n69mFwEJU1— 🐰Jefnï Arul🐰 | 𝔽rAI (@ArulJefni7037) December 8, 2025ఇదిలా ఉండగా.. ఆదివారం తెల్లవారుజామున క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో మరణించిన వారిలో 20 మందిని గుర్తించి వారి స్వస్థలాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక, ఈ క్లబ్ నిర్వాహకుల మధ్య వివాదాలు ఉన్నాయని, దీని కూల్చివేతకు గతంలో నోటీసులు జారీ చేశామని స్థానిక సర్పంచి రోషన్ రెడ్కర్ ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, కొంతమంది అధికారులు దానిని అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక, ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో రోమియో లేన్ పేరుతో ఉన్న మరో రెండు వాణిజ్య సంస్థలను కూడా అధికారులు సీజ్ చేశారు. -
ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో సర్వీసులు పునరుద్ధరణ
విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఇండిగో విమానాల రాకపోకలు రద్దయ్యాయి. -
ఇండిగో కొంప ముంచింది ఇదే..
దేశీయ విమానయాన రంగంలో ఆధిపత్యం వహిస్తున్న ఇండిగో విమాన సేర్వీసుల్లో ఇటీవల భారీ అంతరాయాలు, రద్దులు సంభవించాయి. దాంతో వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడం ఒక సంక్షోభానికి దారితీసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్తగా అమలు చేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలు, పైలట్ల కొరత ఈ అంతరాయాలకు ప్రధాన కారణంగా నిలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇండిగోకు ప్రధాన పోటీదారుగా ఉన్న ఎయిరిండియా వ్యూహాత్మకంగా పైలట్ల నియామక ప్రక్రియను వేగవంతం చేసింది.కొత్త నిబంధనలు ఇండిగోపై ప్రభావండైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రవేశపెట్టిన నూతన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు (గతంలో 36 గంటల నుంచి 48 గంటలకు). రాత్రిపూట ల్యాండింగ్ల సంఖ్యను తగ్గించారు (ముందు 6 నుంచి ఇప్పుడు వారానికి 2కి). రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు.ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు 2,200కి పైగా విమానాలను నడుపుతుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్‌వర్క్‌ను, సిబ్బంది రోస్టర్‌ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.ఎయిరిండియా దూకుడుఇండిగో ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియాకు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి ఒక అవకాశంగా మారింది. ఎయిరిండియా ఎఫ్డీటీఎల్ నిబంధనల అమలును ముందుగానే ఊహించి సిబ్బంది ప్రణాళికలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది.ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ వంటి ఇతర విమానయాన సంస్థలు కొత్త నిబంధనలకు అనుగుణంగా అవసరమైన అదనపు పైలట్లను సకాలంలో నియమించుకునేలా చర్యలు చేపట్టాయి. వారికి శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకున్నాయి. ఇండిగో మాదిరిగా కాకుండా ఎయిరిండియా తమ కార్యకలాపాల సామర్థ్యాన్ని తగ్గించుకొని, తగినంత సిబ్బందిని ముందుగానే సిద్ధం చేసుకుంది. ఎయిరిండియా కేవలం కొత్త పైలట్లను నియమించుకోవడమే కాకుండా, తన పైలట్ వినియోగ ప్రణాళికలో మరింత సంప్రదాయబద్ధమైన విధానాన్ని అవలంబించింది. దీనివల్ల ప్రతి విమానానికి తగినంత మంది సిబ్బంది ఉండేలా చూసుకుంది. తద్వారా ఇండిగో మాదిరిగా భారీ అంతరాయాలను నివారించగలిగింది.పైలట్-టు-ఎయిర్‌క్రాఫ్ట్ నిష్పత్తిపై విశ్లేషణఎయిరిండియా (Air India) ఒక విమానానికి సగటున 5.4 మంది పైలట్ల నిష్పత్తిని కలిగి ఉంది. ఇది బఫర్, భద్రతపై దృష్టి సారించే వ్యూహాన్ని సూచిస్తుంది. అధిక సంఖ్యలో పైలట్లను కేటాయించడం వల్ల కొత్త నిబంధనల ప్రకారం సిబ్బందికి తగిన విశ్రాంతినివ్వడం, డ్యూటీ పరిమితులను సులభంగా పాటించడం సాధ్యమవుతుంది. ఫలితంగా, నిబంధనల మార్పును ఎయిరిండియా సమర్థవంతంగా అధిగమించగలిగింది.మరోవైపు ఇండిగో ఒక్కో విమానానికి కేవలం 2.5 మంది పైలట్ల నిష్పత్తిని మాత్రమే కలిగి ఉంది. ఇది తక్కువ ఖర్చుతో గరిష్టంగా విమానాలను ఉపయోగించాలనే ‘లీన్ మ్యాన్‌పవర్’(Lean Manpower) వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది. అయితే, కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత ఇండిగో ఈ తక్కువ నిష్పత్తి ఆపరేషనల్ వైఫల్యానికి దారితీసింది. విశ్రాంతికి వెళ్లాల్సిన పైలట్లను భర్తీ చేయడానికి తగిన సిబ్బంది లేకపోవడంతో వందలాది విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.ఇదీ చదవండి: చాట్‌జీపీటీలో ప్రకటనలు..? -
Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి
-
కష్టాల్లో ఇండిగో : హద్దే లేదు రారమ్మంటున్న ఎయిరిండియా
విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం మధ్య ట్రాటా గ్రూపుసొంతమైన ఎయిరిండియా ఇచ్చిన పైలట్ల నియామక ప్రకటన సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఒక పక్క ఇండిగో పైలట్ల కొరతతో ఇబ్బంది పడుతోంటే సందట్లో సడేమియా అన్నట్టు ఎయిర్‌బస్ A320 మరియు బోయింగ్ B737 విమానాల కోసం పైలట్లు కావాలంటూ ఎయిరిండియా ప్రకటనలో జారీ చేయడం నెట్టింట చర్చకు దారి తీసింది."స్కై ఈజ్ నాట్ ది లిమిట్" ఇది ప్రారంభం మాత్రమే అని టాటా గ్రూప్ కంపెనీలో కెరీర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పైలట్లను కోరుతూ ఎయిరిండియా ప్రకటించింది. "భారత విమానయాన భవిష్యత్తును ఏలండి.. అనుభవజ్ఞులైన B737 , A320 పైలట్లను మా పెరుగుతున్న విమానాల సముదాయంలో చేరమని ఆహ్వానిస్తున్నాం. డిసెంబర్ 22 నాటికి మీ దరఖాస్తులను సమర్పించండి" అని ఎయిర్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో తెలిపింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో నెటిజన్లు ఆకట్టుకుంటోంది.మరోవైపు గత సంవత్సరం రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జారీ చేసిన సవరించిన విమాన డ్యూటీ సమయ పరిమితులు (FDTL) నియమాలు, విమానాల రద్దు, రీషెడ్యూల్‌తో ఇండిగో తీవ్ర విమర్శలెదుర్కొంటోంది. తీవ్ర పైలట్ల కొరతను ఎదుర్కొంటున్న ఇండిగో కూడా ఇప్పటికే నిపుణులైన పైలట్ల, ఇతర సిబ్బంది నియామకాల కోసం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది.ఇదీ చదవండి: ప్రమాదంలో చూపు పోయింది : లెఫ్టినెంట్ కల్నల్ సక్సెస్ జర్నీవిమాన కార్యకలాపాలు సకాలంలో పనితీరు క్రమంగా మెరుగుపడుతున్నాయని ప్రకటించినప్పటికీ ఇండిగో విమానాలను రద్దు కొనసాగుతూనే ఉంది.దీంతో ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్లు ఈరోజు 6.9 శాతం పడిపోయాయి . దాదాపు 66 శాతం దేశీయ మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఇండిగోకు ఇది ఎనిమిది నెలల్లో అత్యధికం నష్టం.ఇదీ చదవండి: ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్ -
ఇండిగో సంక్షోభంపై రాజ్యసభలో రామ్మోహన్ నాయుడిని నిలదీసిన విపక్షాలు
-
ఇండిగోతో లోకేష్ డీల్..!? మోదీ సీరియస్..
-
ఇండిగో విమానాలపై కోర్టుల్లో పిటిషన్లు
ఏడో రోజు కూడా ఇండిగో కష్టాలు కొనసాగుతున్నాయి. పలు విమానాశ్రయాల్లో ప్రయాణీకులు.. -
రామ్మోహన్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడా?
సాక్షి, అమరావతి: ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం పరిష్కరించడంలో ఘోరాతి ఘోరంగా విఫలమైన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై జాతీయ మీడియా తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తోంది. ఇంత పెద్ద సంక్షోభం తలెత్తితే మంత్రి ఏం చేస్తున్నారు? నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా, లేక రీల్స్ చేస్తున్నారా.. నెట్‌ఫ్లిక్స్‌లో వీడియోలు చూస్తున్నారా అంటూ కడిగిపారేస్తోంది. రిపబ్లిక్ టీవీలో ప్రెజెంటర్ ఆర్నాబ్ గోస్వామి లేవనెత్తుతున్న ప్రశ్నలకు బదులివ్వలేక తెలుగుదేశం పార్టీ ఆపసోపాలు పడుతోంది. తొలుత.. రిపబ్లిక్ టీవీలో చర్చలో పాల్గొన్న దీపక్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఈ పరిస్థితిని నారా లోకేశ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.. ఇందుకోసం వార్ రూమ్‌ని కూడా ఏర్పాటుచేశార’ంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో టీడీపీ అభాసుపాలైన విషయం తెలిసిందే. ఇక ఆదివారంకొమ్మారెడ్డి పట్టాభిరాంని పంపిస్తే దానికి రెండింతలు పరాభవం పార్టీ మూటగట్టుకుంది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఇదే పెద్ద చర్చగా నడుస్తోంది. అర్నాబ్ గోస్వామి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇద్దరూ నీళ్లునమిలారు.ధైర్యం ఉంటే చర్చలో పాల్గొనమనండి..పట్టాభిని అర్నాబ్ ఏమి అడిగారంటే.. మీ తెలుగుదేశం పార్టీకి చెందిన కె. రామ్మోహన్నాయుడు విమానయాన మంత్రి శాఖ నిర్వహిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు? నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా అంటూ పట్టాభిని సూటిగా ప్రశ్నించారు. సమస్యను తెలుసుకోవడానికి విమానయాన శాఖ మంత్రికి నేను ఫోన్ చేస్తే.. హలో హలో అంటూ ఫోన్ పెట్టేస్తున్నాడని.. ధైర్యం ఉంటే ఈరోజు చర్చలో మంత్రి పాల్గొనాలంటూ పట్టాభికి సవాల్ విసిరారు. ఈ రోజు నా చర్చలో ప్రజలకు సమాధానం చెప్పాలంటూ రెట్టించి అడిగారు. వెంటనే పట్టాభి కలుగజేసుకుని, మంత్రి సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తున్నారనగానే.. సమస్య పరిష్కారమంటే కూర్చుని నెట్‌ఫ్లిక్స్ వీడియోలు చూడటమా! అంటూ అర్నాబ్ గాలితీసేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది అని పట్టాభి చెప్పగా.. అయితే మీ మంత్రిని నా కాల్ లిఫ్ట్ చేయమనండి అంటూ అర్నాబ్ సవాల్ విసిరారు. ఈరోజు ఇంతమంది ప్రజలు ఇబ్బందులుపడుతుంటే దాన్ని తెలుసుకోవడానికి ఫోన్‌చేస్తే మీ మంత్రి హలో హలో అంటూ ఫోన్ పెట్టేస్తారా అంటూ మండిపడ్డారు. ఇలా రెండ్రోజులుగా జాతీయస్థాయిలో తెలుగుదేశం పార్టీ అప్రతిష్టపాలు కావడంతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ పరువు పోవడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
రామ్మోహన్..రాజీనామా చెయ్!
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇండిగో’ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా దేశం పరువు మసకబారడం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మన దేశంలో పర్యటిస్తున్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం.. లక్షలాది మంది విమాన ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురి కావడం.. ఎయిర్‌పోర్టుల్లో కన్నీళ్లు పెట్టడం.. ఐదారు రోజులు గడిచిపోయినా కష్టాలు తీరకపోవడం.. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు అసమర్థ పనితీరుతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండటంతో ఇక ప్రధాని కార్యాలయం నేరుగా రంగంలోకి దిగినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రెండు నెలల ముందే ఈ సమస్య తన దృష్టికి వచ్చినా పట్టించుకోకపోవడంతోనే సమస్య జటిలమైందని కేంద్ర ప్రభుత్వం ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రధాని కార్యాలయమే నేరుగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రధాని పర్యవేక్షణలో పీఎంలో ఉన్నతాధికారులు నేరుగా ఇండిగో సీఈవో, ఇతర అధికారులతో చర్చలు జరిపారు. సంక్షోభం ముంచుకొస్తోందని పసిగట్టిన ఆల్ ఇండియా పైలెట్ల అసోసియేషన్ రెండు నెలల క్రితమే ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ దృష్టికి తెచ్చింది. కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు కనీసం స్పందించలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో దారుణంగా విఫలమయ్యారు. సమస్యకు మూల కారణం తెలిసినా దాన్ని పరిష్కరించకుండా ప్రయాణికులకు రీఫండ్ ఇప్పిస్తామంటూ ఎల్లో మీడియాలో ప్రచారానికి తెర తీశారు. కేంద్ర మంత్రి పదవిలో ఉంటూ కేవలం ఎల్లో మీడియాను మాత్రమే పిలిపించుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎన్డీఏలోని కీలక నేతలు సైతం ఆయన కేంద్ర మంత్రా? లేక టీడీపీ మంత్రా? అని విస్తుపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంత అసమర్థ మంత్రి, చేతకాని మంత్రి, ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని మంత్రి, టికెట్ల ధరల మోత, సంక్షోభాన్ని అరికట్టలేని మంత్రి మాకొద్దు..! అంటూ జాతీయ స్థాయిలో మీడియాలో, సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో ఏదో ఒక మూల ఏదో ఒక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని, అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం నుంచి తాజాగా ఇండిగో సంక్షోభం దాకా దీనికి నిదర్శనమని పేర్కొంటున్నారు. రామ్మోహన్నాయుడు తక్షణం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుండటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చాంశనీయమైంది. ఫోన్ కాల్స్‌కి కేంద్ర మంత్రి స్పందించడం లేదని.. ప్రజల సమస్యను గాలికొదిలేసి స్నేహితులతో కలిసి పార్టీలు, నెట్ఫ్లిక్ చూసుకోవడం, రీల్స్ చేసుకోవడంలో మంత్రి బిజీగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో సంక్షోభం తలెత్తిన మూడోరోజు న్యూఢిల్లీలో స్నేహితుడి పార్టీలో పాల్గొన్న రామ్మోహన్నాయుడి ఫోటోలను షేర్ చేస్తూ మండిపడుతున్నారు. గతంలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో ప్రమాద సమయంలో కూడా సంఘటనాస్థలికి వెళ్లి వాటిని రీల్స్‌గా చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న సంఘటలను గుర్తు చేస్తున్నారు. దేశం దిగ్భ్రాంతిలో ఉంటే వీడియోలా!ఇండిగో సంక్షోభం నేపథ్యంలో పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు కేంద్రం చెక్ పెట్టనుందా? అనే చర్చ దేశ రాజధానిలో జోరుగా సాగుతోంది. అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం మొదలు ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైన రామ్మోహన్ నాయుడుపై ప్రధాని కార్యాలయం సహా కేంద్ర పెద్దలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఈ ఏడాది జూన్ 12న అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 230 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. దేశ చరిత్రలో ఇది చీకటి రోజుగా నిలిచింది. సంఘటన స్థలానికి వెళ్లిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్, షర్ట్‌ను మోచేతి వరకు మడతపెట్టడం చూసిన నెటిజన్లు మండిపడ్డారు. దేశం అంతా దిగ్భ్రాంతిలో ఉంటే వీడియోలు చేసుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పైలట్ల నియామక చర్యలు షురూ..
భారతదేశపు అతిపెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో తీవ్రమైన పైలట్ కొరత సంక్షోభంలో కూరుకుపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జీడీసీఏ) కొత్తగా అమలు చేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలు, నియామక లోపం కారణంగా ఇటీవల ఇండిగో వేల సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ నుంచి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు హెచ్చరిక నోటీసు కూడా జారీ అయింది.పైలట్ల నియామకానికి ప్రణాళికలుకొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలకు అనుగుణంగా పైలట్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇండిగో తన నియామక షరతులను ఎత్తివేసింది. డీజీసీఏకు సమర్పించిన ప్రణాళికల ప్రకారం ఇండిగో వేగంగా పైలట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 10, 2026 నాటికి 158 మంది కొత్త పైలట్లను నియమించుకోవాలని నిర్ణయించింది. రాబోయే 12 నెలల్లో 900 మంది (300 మంది కెప్టెన్లు, 600 మంది జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లు)ని క్రూలో చేర్చుకుంటామని చెప్పింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మరో 742 మంది పైలట్ల నియామకం జరుపుతామని పేర్కొంది.ప్రస్తుతం 2,357 కెప్టెన్లు, 2,194 మంది ఫస్ట్ ఆఫీసర్లు ఉన్న ఇండిగో ఫిబ్రవరి 10 నాటికి మొత్తం 2,425 కెప్టెన్లు, 2,284 మంది ఫస్ట్ ఆఫీసర్లకు పెంచాలని ప్రణాళిక వేసింది.విశ్లేషకుల హెచ్చరికఎలారా సెక్యూరిటీస్ అంచనా ప్రకారం, ఎఫ్డీటీఎల్ నిబంధనలను పూర్తిగా పాటించేందుకు ఇండిగోకు ఫిబ్రవరి నాటికి కనీసం 1,000 మంది పైలట్లు అవసరం. కెప్టెన్లకు 12 నెలలు, కో-పైలట్లకు 6 నెలల సుదీర్ఘ నోటీసు వ్యవధి కారణంగా ఈ నియామకాలు కష్టమవుతాయని ఎలారా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గగన్ దీక్షిత్ పేర్కొన్నారు.మార్టిన్ కన్సల్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ డి మార్టిన్ ప్రకారం ఇండిగోకు వాస్తవానికి 5,525 మంది పైలట్లు అవసరం. కానీ, డిసెంబర్ ఫైలింగ్‌లో 4,551 మంది మాత్రమే ఉన్నారు. అంటే 974 మంది కొరత ఉంది. విదేశీ పైలట్ల నియామకానికి రెగ్యులేటరీ క్లియరెన్స్‌కు కూడా మూడు నెలలు పడుతుంది. ప్రస్తుతం ఇండిగో ప్రతి విమానానికి 2.5 మంది పైలట్లతో పనిచేస్తుండగా ఎయిర్ ఇండియా, ఆకాసా ఎయిర్ వంటి ఇతర ఎయిర్‌లైన్స్‌లు 5.4 మంది పైలట్లతో పనిచేస్తున్నాయి.విమానాల రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇండిగో డిసెంబర్ 10-15 నాటికి ఆపరేషన్లు సాధారణ స్థితికి చేరుకుంటాయని అంచనా వేస్తోంది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడానికి రద్దులు, రీషెడ్యూలింగ్‌పై పూర్తి వేవర్లను ప్రకటించింది.డీజీసీఏ హెచ్చరిక, జరిమానాకు అవకాశంనవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు డిసెంబర్ 6న డీజీసీఏ, ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు హెచ్చరిక నోటీసు జారీ చేసింది. ఆపరేషన్లలో లోపాల కారణంగా జరిమానాలు లేదా సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకోవచ్చని నోటీసులో స్పష్టం చేసింది. ఈ నిబంధనల నుంచి ఇండిగోకు మాత్రమే ఫిబ్రవరి 10 వరకు మినహాయింపు ఇచ్చారు.ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా? -
ఇండిగో ప్రకటన
గత కొద్ది రోజులుగా విమానాల రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు ఇండిగో శుభవార్త తెలిపింది. ఆదివారం సాయంత్రం కల్లా 1,500 విమానాలు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. తమ నెట్ వర్క్ కనెక్టివిటీలో దాదాపు 95శాతం మేర నెట్ వర్క్ రీబూట్ చేశామని పేర్కొంది. ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరుపైనే చర్చంతా. సిబ్బంది కొరతతో విమానాయాన సంస్థ సేవలు అర్థాంతరంగా నిలిపివేయడంతో ఇండియా వ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకలు దెబ్బతిన్నాయి. సాధారణ ప్రయాణికులతో పాటు ఎంతో మంది ప్రొఫెషనల్స్ తమ గమ్య స్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎయిర్ పోర్టులలో నిరీక్షిస్తూ అవస్థలు పడ్డారు. దీంతో కేంద్రం ప్రభుత్వం ఇండిగో పద్దతిపై సీరియస్ అయ్యింది. ఇంత పెద్దసంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదని ఫైరయ్యింది.ఈ నేపథ్యంలో ఇండిగో తమ కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. తమ విమానాయాన నెట్వర్క్ ను దాదాపు పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. ఆదివారం సాయంత్రం వరకూ 1500 విమానాలు నడుపనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇండిగో 138 రూట్లలో సేవలందిస్తుండగా 135 గమ్యస్థానాలకు సేవలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. దీంతో దాదాపు 95 శాతం మేర రూట్లు రీకనెక్ట్ అయినట్లు పేర్కొంది. సాధారణంగా ఇండిగో నడిపే ఫ్లైట్ల సంఖ్య 700కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాటి సంఖ్య 1500కు పెంచినట్లు తెలిపింది.ఇండిగోపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని, ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ప్రకటించింది. ఈ కష్టకాలంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇండిగో సిబ్బంది కొరతతో విమానాలను అర్థాంతరంగా నిలిపివేయడంతో దేశవ్యాప్తంగా ప్రయాణాలు స్తంభించి పోయాయి. ప్రయాణికులు రోజుల తరబడి ఎయిర్ పోర్టులలో నిరీక్షించారు. దీంతో ఈ దేశీయ విమానయాన సంస్థపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కాగా ప్రస్తుతం ఇండిగో ప్రకటనతో విమానాల కోసం ఎదురుచూస్తున్న చాలామంది ప్రయాణికులకు ఉపశమనం లభించినట్లయింది. -
సర్వీసుల పునరుద్ధరణకు ఇండిగో చర్యలు
ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. -
గవర్నమెంట్ యాక్షన్.. త్వరలో సమన్లు
భారత వైమానిక రంగం కొద్ది రోజులుగా స్తంభించిపోయింది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నిర్వాకంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో వేల సంఖ్యలో ప్రయాణికులు చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంటరీ కమిటీ త్వరలో ఇండిగోతో సహా దేశంలోని అన్ని విమానయాన సంస్థలకు సమన్లు జారీ చేయనుంది.దేశీయ విమానయాన సంస్థ ఇండిగో చేసిన పని దేశవ్యాప్తంగా సంక్షోభాన్ని సృష్టించింది. పెద్దఎత్తున ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసినప్పటికీ వాటిసమాచారం సదరు ప్యాసింజర్స్ కి చేరవేయకపోవడంతో విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకొని తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలోనూ ఇండిగో ఘోరంగా విఫలమైంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం సీరియస్ అయ్యారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని విమానయాన సంస్థలతో పాటు డీజీసీఏకు పార్లమెంటరీ కమిటీ త్వరలో సమన్లు జారీ చేయనుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కేవలం వివరణ అడగడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఏటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని పరిశీలించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.కమిటీ మెంబర్ మాట్లాడుతూ "భారత విమానయాన చరిత్రలో ప్రస్తుతం విపరీత పరిస్థితులు నెలకున్నాయి. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ జరగలేదు. ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏమిటో ఎయిర్ లైన్స్ తో పాటు రెగ్యులెటరీ అథారిటీ తెలపాలి. వాటిని ఎదుర్కొవడంలో వారు ఎందుకు విఫలమయ్యారో వివరించాలి" అని అన్నారు. అదే విధంగా ప్రస్తుతం జరిగిన సంఘటన విమానయాన రంగంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతుందని సిబ్బంది కొరత, నిర్వహణలో ఒత్తిడి, రెగ్యులెటరీ వ్యవస్థల మధ్య గ్యాప్ తదితర అంశాలను సూచిస్తుందని తెలిపారు. అంతేకాకుండా విమానాలు రద్దయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే ఇతర విమానాయాన సంస్థలు ఇదే అదనుగా భావించి టికెట్ ధరలను విపరీతంగా పెంచాయని ఈ అంశాలన్నింటినీ పార్లమెంటరీ కమిటీ చర్చిస్తుందని కమిటీ సభ్యుడు తెలిపారు. జేడీయూ నేత సంజయ్ కుమార్ జా ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. -
‘ఇండిగో’ నిర్వాకంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల అష్టకష్టాలు... మంచినీళ్లు, ఆహారం కోసం వరద బాధితుల తరహాలో ఫుడ్ కోర్డుల ముందు నిరీక్షణ
-
ఏవియేషన్ డే: ఇండిగో తరహా సంక్షోభాలు మున్ముందు ఎదురైతే..
భారత్‌లోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలు నిలిచిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విమాన సేవలు ఆకస్మాత్తుగా ఆగిపోవడంతో వేల మంది ప్రయాణికుల మీద ప్రభావం చూపుతోంది. పర్యాటకులతో పాటు వ్యాపార, వ్యక్తిగత, విద్య, వైద్య అవసరాల కోసం ప్రయాణించాలనుకున్న వారికి అనూహ్య ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏకంగా పెళ్లిళ్లూ రద్దవుతున్నాయి. దీంతో, ఇండిగో యాజమాన్యం తీరుపై జనం నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని సగటు ప్రయాణికుడు ప్రశ్నిస్తున్నాడు..అయితే, ఇండిగో తన దగ్గర ఉన్న పరిమిత సిబ్బంది, పైలెట్లతోనే పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిర్వహిస్తోంది. తక్కువ ధరకు ప్రయాణికులను చేరవేసేందుకు ఈ సంస్థ రాత్రి పూట నడిపే సర్వీసులు సైతం అధికంగా ఉన్నాయి. మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల్లో 63% మందిని ఈ సంస్థ చేరవేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో విమానయాన సంస్థలు సైతం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.పౌర విమానయాన రంగంలో కీలక సవాళ్లు..1. అధిక ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ఖర్చులుభారతదేశంలో ATF ధరలు GST పరిధిలోకి రాకపోవడంతో ఇంధన ధరలు అధికంగా ఉన్నాయి. విమానయాన నిర్వహణ ఖర్చులలో ఇంధన వాటా 30–40% ఉంటుంది. దీనివల్ల టిక్కెట్లు ఎక్కువగా ఉన్నాయి. మార్జిన్లు తక్కువగా ఉంటాయి. ఇంధన ఖర్చులను తగ్గించడానికి పరిశ్రమ చాలా కాలంగా ATFని GST కింద చేర్చాలని డిమాండ్ చేస్తోంది.2. మౌలిక సదుపాయాల అడ్డంకులుదేశ ప్రయాణీకుల రద్దీ ప్రతీ ఏటా పెరుగుతోంది. 120 మిలియన్ల నుండి 236 మిలియన్లకు పెరిగింది. విమానాశ్రయాలు కూడా 74 నుండి దాదాపు 160కి రెట్టింపు అయ్యాయి. ఎయిర్‌పోర్టుల విస్తరణ ఉన్నప్పటికీ ప్రధాన విమానాశ్రయాలలో (ఢిల్లీ, ముంబై, బెంగళూరు) రద్దీ మాత్రం ఇప్పటికీ సవాలుగానే ఉంది. ప్రాంతీయ కనెక్టివిటీ (UDAN పథకం) విస్తరిస్తున్నప్పటికీ చిన్న విమానాశ్రయాలు నిధులు, కార్యాచరణ అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. చిన్న విమానయాన సంస్థలు మనుగడ కోసం కష్టపడుతున్నాయి3. స్థిరత్వం, కార్బన్ నియమాలు2027 నుండి ICAO యొక్క CORSIA కార్బన్ ఆఫ్సెట్ పథకాన్ని భారతదేశం పాటించాలి. ప్రభుత్వం స్థిరమైన విమాన ఇంధనం (SAF) మిశ్రమ లక్ష్యాలను నిర్దేశించింది. కానీ SAF ఖరీదైనది, పరిమితమైనంది. లాభదాయకతను సమతుల్యం చేస్తూ ఉద్గారాలను తగ్గించడానికి విమానయాన సంస్థలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.4. సైబర్ భద్రతా ప్రమాదాలుఢిల్లీ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన GPS స్పూఫింగ్ సంఘటనలు నావిగేషన్ వ్యవస్థలలోని భద్రతలేమిని హైలైట్ చేశాయి. డిజిటల్ ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ బెదిరింపులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదాలను ఎదుర్కోవడానికి భారత్ GNSS సలహాదారులను, మెరుగైన పర్యవేక్షణను అమలు చేస్తోంది.5. పైలట్ల కొరత.. దేశంలో ముఖ్యంగా పైలట్ల కొరత అధికంగా ఉంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమాన పైలెట్లు, సిబ్బందికి తగిన విశ్రాంతి ఇవ్వాలి.పరిష్కారాలు..దేశంలో కొత్త ఫ్లయింగ్ అకాడమీలు ఏర్పాటు చేయడంపైలట్ శిక్షణలో PPP మోడల్ ప్రవేశపెట్టడంFDTL (Flight Duty Time Limit) నియమాలను శాస్త్రీయ డేటా ఆధారంగా తయారు చేయడం. పైలట్లకు వెల్నెస్ ప్రోగ్రామ్‌లు, ఫ్యాటిగ్ మానిటరింగ్ సిస్టమ్లుపైలట్ శిక్షణ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలిఎయిర్లైన్స్ సిబ్బంది ప్లానింగ్‌లో AI ఆధారిత షెడ్యూలింగ్ ఉపయోగించాలిఎయిర్లైన్స్కు స్లాట్ మేనేజ్మెంట్ కఠినంగా అమలు చేయడంవాతావరణ అంచనాల కోసం అధునాతన మెటీరియాలజీ సిస్టమ్‌లు ఏర్పాటు చేయడంప్రయాణికులకు రియల్-టైమ్ సమాచారం అందించే యాప్‌లు తీసుకురావాలి. విమాన సర్వీసుల రద్దులపై పెనాల్టీ మెకానిజం తీసుకురావడం. ఎయిర్‌లైన్స్ బ్యాకప్ క్రూ & బ్యాకప్ విమానాల వ్యవస్థను కలిగి ఉండాలి. చిన్న ఎయిర్‌లైన్స్‌కు పన్ను రాయితీలు ఇవ్వాలి.మల్టీ-రన్‌వే ఎయిర్‌పోర్ట్‌లు అభివృద్ధి చేయాలి. మెట్రో నగరాల్లో సెకండరీ ఎయిర్‌పోర్ట్‌లు ఏర్పాటు చేయాలి. కార్గో టెర్మినల్‌లను ఆధునీకరించాలి. ఎయిర్‌పోర్ట్‌లలో సోలార్ ఎనర్జీ వినియోగం.ఎఫ్డీటీఎల్ నిబంధనలు..డీజీసీఏ 2024 జనవరిలో కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనలను జారీ చేసింది. మొదటి దశ నిబంధనలు 2025 జులై నుంచి అమలవుతున్నాయి. రెండో దశ నిబంధనలను నవంబరు 1 నుంచి పాటించాల్సి వచ్చింది. ఈ నిబంధనలు ప్రధానంగా పైలెట్లు, కేబిన్ సిబ్బంది అలసిపోకుండా విశ్రాంతి నివ్వడం, రాత్రి డ్యూటీలకు సంబంధించినవే. పైలెట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి 36 గంటల నుంచి 48 గంటలకు పెంపు.రాత్రి ల్యాండింగ్ పరిమితులు వారానికి ఆరు నుంచి రెండుకు కుదింపు.‘రాత్రి గంట’లకు కొత్త నిర్వచనం ఇచ్చారు. అర్థరాత్రి నుంచి ఉదయం 6 గంటల వరకూ సమయాన్ని రాత్రి గంటలుగా పేర్కొన్నారు. పైలెట్లకు వరుసగా రెండు రాత్రి డ్యూటీలు మాత్రమే వేయాలి. విమానయాన సంస్థలు తప్పనిసరిగా అలసట నివేదికలను మూడు నెలలకోసారి సమర్పించాలి.ఇండిగో ఏం చేసింది..మొదటి దశ నిబంధనల్లో ముఖ్యమైనదైన పైలెట్లు, సిబ్బందికి వారాంతపు విశ్రాంతి గంటల పెంపు అంశాన్ని ఇండిగో తేలికగానే అమలు చేసింది. రెండోదశలో, రాత్రి ల్యాండింగ్ పరిమితిని వారానికి ఆరు నుంచి రెండుకు తగ్గించడాన్ని అమలు చేయాల్సి రావడంతో ఇండిగోకి ఇబ్బంది తలెత్తింది. ఈ సంస్థ ఇతర సంస్థలతో పోల్చితే, తన సిబ్బందితో ఎంతో ఎక్కువ గంటలు పనిచేయిస్తుంది. అందుకే రాత్రి పూట ఇండిగో విమాన సర్వీసులు అధికంగా ఉంటాయి. ఇండిగోతో పోల్చితే ఎయిర్ ఇండియా సగం విమాన సర్వీసులే నిర్వహిస్తోంది. కొత్త నిబంధనల ఫలితంగా పైలెట్లు, సిబ్బంది అందుబాటులో లేక ఇండిగో నవంబరులోనే 755 విమాన సర్వీసులు రద్దు చేసింది. ఈనెలలో రోజూ వేల సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి. దీంతో, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సమగ్ర సంస్కరణలు అవసరం..భారత్ ఇప్పుడు అమెరికా, చైనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌ను కలిగి ఉంది. కోవిడ్ కారణంగా దేశీయంగా మార్కెట్ దెబ్బతిన్నప్పటికీ కొద్దినెలలుగా పరిస్థితి మారిపోయింది. అంతర్జాతీయ రవాణా కోవిడ్‌కి ముందు స్థాయిలను చేరుకుంటోంది. భారత పౌర విమానయాన రంగం కేవలం రవాణా వ్యవస్థ కాదు. ఇది దేశ ఆర్థిక వృద్ధి, ప్రాంతీయ సమగ్రత, గ్లోబల్ కనెక్టివిటీకి ఎంతో కీలకం. సవాళ్లు ఉన్నప్పటికీ, సమగ్ర సంస్కరణలు, సాంకేతిక ఆధునీకరణ, పర్యావరణ అనుకూల విధానాలు అమలు చేస్తే భారత విమానయాన రంగం స్థిరమైన, సమర్థవంతమైన, ప్రపంచ స్థాయి వ్యవస్థగా మారుతుంది. భారత విమానయాన రంగం ప్రస్తుతం మార్పు దశలో ఉంది. సవాళ్లను అవకాశాలుగా మార్చే విధాన దృక్పథం, పోటీని ప్రోత్సహించే మార్కెట్ నిర్మాణం, ప్రయాణికుల కేంద్రిత సేవలు ఈ రంగాన్ని మరింత బలపరుస్తాయి. సమర్థవంతమైన నియంత్రణ, పారదర్శకత, దీర్ఘకాలిక ప్రణాళికలతో భారత పౌర విమానయాన రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలదు. భవిష్యత్ విమానయాన రంగం పర్యావరణ అనుకూలత, ఇంధన సామర్థ్యం, హరిత సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. ఈ దిశగా భారత్ ముందడుగు వేస్తే, స్థిరమైన వృద్ధి సాధ్యమవుతుంది. ప్రయాణికులకు భరోసా ఉంటుంది. -
ఏడాదిగా అవే కష్టాలు..
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజులుగా ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణి కులు తీవ్ర ఇక్కట్లు పడుతున్న విషయం తెలిసిందే. అయితే సంవత్సర కాలంగా ఇండిగో విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు వివిధ విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వారి అనుభవాల ద్వారా తెలుస్తోంది. ఇండిగో విమాన ప్రయాణికుల ఇక్కట్లపై లోకల్ సర్కిల్స్ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో ఇదే అంశాలు వెల్లడయ్యాయి.ఇండిగో విమానాలు సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఈ సర్వేలో పాల్గొన్న 54 శాతం మంది ప్రయాణికులు తెలిపారు. అలాగే ఇండిగో విమాన సిబ్బంది ప్రవర్తన సైతం సరిగా లేదని 54 శాతం మంది చెప్పారు. విమాన నిర్వహణ, భద్రత మొదలు లగేజీ నిర్వహణ వరకు అనేక అంశాలపై లోకల్ సర్కిల్స్ సంస్థ మొత్తం 15 వేల మంది ఇండిగో ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టు లోకల్ సర్కిల్స్ సంస్థ వెల్లడించింది. -
పాలుపోక.. దిక్కులేక..: ప్రయాణికులకు ‘ఇండిగో’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: దేశీయ విమానయాన రంగంలో గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్న ఇండిగో సంస్థ వ్యవహారశైలి కారణంగా శంషాబాద్ నుంచి అత్యవసర పనుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. శనివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించాల్సిన ఇండిగో విమానాల్లో ఏకంగా 144 (రాత్రి పదింటి వరకు) సరీ్వసులు రద్దయ్యాయి.శంషాబాద్ విమానాశ్రయం మీదుగా ఇండిగో సగటున రోజుకు 196 సర్వీసులు నడుపుతుండగా అందులో మూడొంతులు రద్దయ్యాయి. ఆయా సర్వీసులను నడిపే పరిస్థితి లేదని ముందే తెలిసినప్పటికీ ఇండిగో సంస్థ ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రత్యామ్నాయ విమానం ఉందా? మళ్లీ సర్వీసును ఎప్పుడు ఏర్పాటు చేస్తారు.. అసలు సర్వీసు ఉంటుందా, టికెట్ డబ్బులు తిరిగిస్తారా.. లాంటి వివరాలు చెప్పేవారు కరువయ్యారు. ఇక వేరే ప్రాంతాల నుంచి హైదరాబాద్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ ప్రయాణికుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది.హైదరాబాద్ వరకు వచ్చాక కనెక్టింగ్ ఫ్లైట్లు రద్దయ్యాయని తెలుసుకొని వారు కంగుతిన్నారు. దీంతో తమను గమ్యం ఎప్పుడు చేరుస్తారో, అందుకు తీసుకుంటున్న ప్రత్యామ్నాయ చర్యలేంటో చెప్పేవారు లేక గంటల తరబడి విమానాశ్రయంలోనే ఉండిపోయారు. కనీసం లగేజీని కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో రోడ్డు లేదా రైల్లో గమ్యం చేరుకోవాలనుకున్నా కుదరని పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో విమానాల రద్దుతో వేల మంది ప్రయాణికులు అక్కడే ఉండిపోవటంతో శనివారం శంషాబాద్ విమానాశ్రయం రైల్వే స్టేషన్‌ను తలపించింది.భోజనం, ఉపహారం ఏర్పాట్లు కూడా లేవు..విమాన సర్వీసులను ఉన్నట్టుండి రద్దు చేస్తే ప్రయాణికులకు భోజనం, ఉపహారం, టీ, మంచినీటిని ఎయిర్‌లైన్స్ సంస్థలు సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ఇండిగో దీన్ని కూడా పట్టించుకోలేదు. అసలే భారీ ధరలుండే విమానాశ్రయంలోని లాంజ్‌లో తాజా పరిస్థితితో ధరలు మరింత పెరిగాయి. టీ, టిఫిన్, భోజనానికి ఒక్కో ప్రయాణికుడు సుమారు రూ. 2 వేల వరకు ఖర్చు చేయాల్సి వచి్చంది. పైగా చాంతాడంత క్యూను దాటుకుంటే తప్ప తిండి దొరకని దుస్థితి నెలకొంది. తుపాను బాధితుల తరహాలో తిండి కోసం ప్రయాణికులు అల్లాడాల్సి వచి్చంది. ఎయిర్‌పోర్టు అధికారులు సరఫరా చేసిన మంచినీరు, స్నాక్స్ కొందరికే అందాయి. ప్రయాణికులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నా ఇండిగో సిబ్బంది సమాధానం చెప్పడానికి అందుబాటులో లేకుండా పోవడం గమనార్హం.కన్నీళ్లకూ విలువ లేదాయే..విమానాలు రద్దయి ప్రయాణాలు ఆలస్యం అవడంతో సాధారణ ప్రయాణికులు ఎదురుచూపులతో ఇబ్బందులకు గురవగా కొందరి మానసిక స్థితిని చూసి తోటి ప్రయాణికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యులు చనిపోయారని తెలిసి అత్యవసరంగా ఇళ్లకు బయలుదేరిన వారు విమానాలు లేక దుఃఖాన్ని దిగమింగుకోలేక బోరున విలపించిన తీరు అక్కడి వారిని చలింపజేసింది.అయ్యప్ప భక్తుల ఆందోళనశబరిమలై యాత్రకు బయలుదేరిన అయ్యప్ప భక్తులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. తలపై ఇరుముడితో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న భక్తులు.. ఇండిగో సరీ్వసులు రద్దయ్యాయని తెలిసి ఆందోళనకు దిగారు. తమకు సరైన సమాచారం కూడా ఇవ్వడం లేదంటూ ఇండిగో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీలోనూ ప్రయాణికులకు ‘ఇండిగో’ కష్టాలుఆంధ్రప్రదేశ్లోని వివిధ ఎయిర్పోర్టుల్లోనూ శనివారం ఇండిగో విమాన సరీ్వసుల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విశాఖలో 9 ఇండిగో విమానాలు రద్దవగా విజయవాడలో ఒకటి, రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో ఒకటి, తిరుమతిలో మరొకటి ఇండిగో విమానం సరీ్వసులు రద్దయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కడప, విశాఖపట్నం సరీ్వసులు గంట నుంచి రెండు గంటల వరకు అలస్యంగా నడిచాయి.➤‘అమ్మ చనిపోయింది.. అర్జంటుగా భువనేశ్వర్ వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుంటే విమానం రద్దయింది. అమ్మను కడసారి చూడగలనో లేదో’అంటూ ఓ యువతికంటతడి!➤‘ముంబైలో రేపు బ్యాంకు ఇంటర్వ్యూ ఉంది. బయలుదేరదామనుకుంటే విమానం లేదు. ఫ్లైట్ ఎప్పుడో చెప్పడం లేదు’అని ఓ యువకుడి ఆవేదన!➤‘కనెక్టింగ్ ఫ్లైట్‌లో హైదరాబాద్ వస్తే ఇక్కడి నుంచి కూడా ఫ్లైట్ లేదు.. లగేజీ కూడా సమయానికి ఇవ్వట్లేదు’అంటూ ఓ డాక్టర్ ఆగ్రహం.➤తండ్రి అస్తికలు గంగా నదిలో నిమజ్జనం చేసేందుకు వస్తే విమానం రద్దయింది. చేతిలో అస్తికలు.. ఊళ్లో పితృ కార్యక్రమం.. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు’ అని అన్నదమ్ముల ఆందోళన.ఇలాంటి మనసు పిండేసే గాథలెన్నో.. బరువెక్కిన మనసులతో మసులుతున్న వారెందరో. కానీ ఇండిగో ఎయిర్‌లైన్స్ నిర్వాకంతో ఇలాంటి వారి ఆవేదనను పట్టించుకునే వారు లేకుండా పోయారు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అంతా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ నుంచి కనీస సమాచారానికి కూడా దిక్కులేని దుస్థితి నెలకొంది.అక్కడ విమానం రద్దయిందని కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుంటే.. రాజమండ్రి నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నా. అది రద్దు కా వడంతో ఇండిగోను వాకబు చేయగా హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేసుకోమన్నారు. అలా బుక్ చేసుకుని హైదరాబాద్ వచ్చాక ఇక్కడి నుంచి ఢిల్లీ కనెక్టింగ్ ఫ్లైట్ రద్దయిందని చెప్పారు. పోనీ రైల్లో వెళదామనుకుంటే లగేజీని ఇవ్వలేదు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటి? – డాక్టర్ దీపక్ (ఢిల్లీ ప్రయాణికుడు)సమాచారం చెప్పకుంటే ఎలా..నేను రెండు కార్యక్రమాల్లో పా ల్గొనేందుకు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చా. తిరుగు ప్రయాణ విమానం రద్దయింది. ఆ విషయం విమానాశ్రయానికి వచ్చాక చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమిటంటే ఎవరూ సమాధానం చెప్పట్లేదు. విమానాశ్రయంలో ఎన్ని గంటలు ఎదురుచూసినా సమాచారం కాదు కదా.. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. – సౌమ్య మిశ్రా (భువనేశ్వర్ ప్రయాణికురాలు)త్వరగా చక్కదిద్దాలి బ్యాంకుకు సంబంధించిన రెండు రోజుల శిక్షణ కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చా. శిక్షణ పూర్తి చేసుకుని తిరుగుప్రయాణం కోసం ఎయిర్‌పోర్టుకు రాగా విమానం రద్దయిందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సరైన స్పందన లేదు. ఇక్కడ ఎంత సేపు ఎదురుచూడాలో, రాత్రి ఎక్కడ ఉండాలో తెలియని వింత పరిస్థితి నెలకొంది. – రవీందర్ శర్మ, బ్యాంకు ఉద్యోగి -
గట్టిగా పట్టుకో! మాకు ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదు!
గట్టిగా పట్టుకో! మాకు ఇంతకు మించిన ప్రత్యామ్నాయం లేదు!... హ్యాపీ జర్నీ! -
విమానయానంలో ఇండిగో ఆధిపత్యం
భారతీయ విమానయాన మార్కెట్లో 64 శాతం పైగా ఆధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (ఎఫ్డీటీఎల్) నిబంధనల అమలులో జరిగిన జాప్యం కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. డిసెంబర్ 2 నుండి 5 వరకు 1,200కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 5న ఒక్కరోజే 1,000కు పైగా సర్వీసులు రద్దయ్యాయి. ఇది ఇండిగో 20 సంవత్సరాల చరిత్రలో అతిపెద్ద ఆపరేషనల్ సవాలుగా నిలిచింది.ఎఫ్డీటీఎల్ నిబంధనల్లో ఏముంది?జనవరి 2024లో డీజీసీఏ నూతన ఎఫ్డీటీఎల్ నిబంధనలను ప్రకటించింది. వీటిని నవంబర్ 1, 2025 నుంచి పూర్తిగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నిబంధనల్లో ఉన్న కొన్ని ముఖ్యాంశాలు..డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రవేశపెట్టిన నూతన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు (గతంలో 36 గంటల నుంచి 48 గంటలకు). రాత్రిపూట ల్యాండింగ్ల సంఖ్యను తగ్గించారు (ముందు 6 నుంచి ఇప్పుడు వారానికి 2కి). రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు.ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు 2,200కి పైగా విమానాలను నడుపుతుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్‌వర్క్‌ను, సిబ్బంది రోస్టర్‌ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.తాత్కాలిక రిలాక్సేషన్పరిస్థితి చేయిదాటిపోవడంతో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ తక్షణమే జోక్యం చేసుకుని డిసెంబర్ 5న డీజీసీఏ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపేసింది. ఇండిగో A320 ఫ్లీట్‌కు మాత్రమే వర్తించేలా ఫిబ్రవరి 10, 2026 వరకు రిలాక్సేషన్లు మంజూరు చేశారు.ఇండిగో ఆధిపత్యంమార్కెట్ షేర్: ఆగస్టు 2025 నాటికి 64.2 శాతం డొమెస్టిక్ మార్కెట్ వాటాతో దేశంలో ప్రతి 10 మంది ప్రయాణికులలో 6 మంది ఇండిగోలో ప్రయాణిస్తున్నారు.అంతర్జాతీయంగా ఆసియాలో 2వ అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా నిలిచింది. ప్రపంచంలో 9వ అతిపెద్ద ప్యాసింజర్ క్యారియర్‌గా ఉంది.నవంబర్ 2025 నాటికి రోజుకు 2,700కి పైగా సర్వీసులు నడుపుతోంది.ఇదీ చదవండి: విమాన కష్టాలు.. ఇండిగో సీఈవో వివరణ -
ఇండిగో విమానాల రద్దుపై కేటీఆర్ సంచలన కామెంట్స్
-
దిగొచ్చిన ఇండిగో : పైలట్లు,సిబ్బంది నియామకాలు షురూ
ముందస్తు హెచ్చరికలు లేకుండా వందలాది విమానాలు రద్దు, ప్రయాణీకులు ఆగ్రహాలు, కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్ననేపథ్యంలోఇండిగో ఎట్టకేలకు దిగి వచ్చినట్టు కనిపిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం పైలట్ పూల్ విస్తరణ జరుగుతుందని తాజాగా ప్రకటించింది.ఇండిగో కెప్టెన్లు, ఫస్ట్ ఆఫీసర్ల నియామకాలు సిబ్బంది నియామకాల్లో నెలల తరబడికొనసాగుతున్న స్తంభనను ముగించి ఇండిగో కొత్త FDTL నిబంధనలకు అనుగుణంగా నియంత్రణ సంస్థ డీజీసీఏ ద్వారా తాత్కాలిక మినహాయింపు పొందిన రోజే ఎయిర్‌బస్ A320 విమానాల కోసం కెప్టెన్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లను (టైప్ రేటెడ్) నియమాకాలకు రంగంలోకి దిగింది.ఈ పదవికి భారతీయులు డిసెంబర్ 6న, ఎయిర్‌లైన్ A320 కెప్టెన్లు, ఇతర సిబ్బంది కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్ జారీ చేసింది. భారతీయ పౌరులు లేదా 62 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండి, విదేశీ పౌరుడు కార్డ్ హోల్డర్లు కాకుండా ఉండాలి. దరఖాస్తుదారులు A320 కుటుంబంలో మొత్తం 3000 గంటలు ,PIC పోస్ట్ లైన్ రిలీజ్‌గా కనీసం 100 గంటలు ప్రయాణించాలి.ఇదీ చదవండి: రోజూ వెళ్లే జిమ్మే... కానీ క్షణాల్లోనే అంతా అయిపోయింది!అలాగే 18-27 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళా భారతీయ పౌరుల కోసం క్యాబిన్ అటెండెంట్ (గ్రేడ్ ట్రైనీ) నియామకాన్ని కూడా ఎయిర్‌లైన్ ప్రారంభించింది. అభ్యర్థి ఏదైనా ఇండిగో స్థావరంలో మకాం మార్చేందుకు సిద్ధంగా ఉండాలి. ఇండిగో నెట్వర్క్ అంతటా తన కార్యకలాపాలను తిరిగి ట్రాక్‌లోకి తీసుకు రావడానికి దృఢంగా పనిచేస్తున్నట్లు తెలిపింది.కొత్త నిబంధనల ప్రకారం పైలట్ పూల్ విస్తరణ జరుగుతుందని ఇండిగో ప్రకటించినప్పటికీ పైలట్ల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (FIP) నియామకాల నిలిపివేత కొనసాగుతోందని ఆరోపించింది. మరో పైలట్ సంస్థ ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA) కొత్త FDTL నిబంధనలను అమలు చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. కాగా కొత్త FDTL నియమాలు వన్-టైమ్ మినహాయింపు ఇండిగో కొన్ని కఠినమైన నిబంధనలను, ముఖ్యంగా నైట్ డ్యూటీకి సంబంధించిన నిబంధనలపై మినహాయింపునిచ్చింది.ఇదీ చదవండి: ఏదైనా 30 రూపాయలే.. ఎగబడిన జనం ..కట్ చేస్తే -
ఇండిగో ఎయిర్ లైన్స్ పేరు మారిందన్న హర్ష్ గోయెంకా
-
రంగంలోకి మోదీ మ్మోహన్ కు బిగ్ షాక్
-
శంషాబాద్ ఎయిర్ పోర్టు ప్రయాణికుల కోసం తెలంగాణ RTC ఏర్పాట్లు
-
ఇండిగో ఇష్యూపై.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి హైదరాబాద్ : భారత విమానయాన సంస్థలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సివిల్ ఏవియేషన్ లో ఇండిగో సంస్థ గుత్తాధిపత్యం నడుస్తుందన్నారు. విమానయానం మెుత్తం ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఐదు రోజులుగా దేశంలోని ఎయిర్ పోర్టులు బస్టాండ్లను తలపిస్తున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కింద డీజీసీఏ కొత్త రూల్స్ తీసుకవస్తే వాటిని ఇండిగో సంస్థ అమలు చేయలేదని కేటీఆర్ అన్నారు. శ్రమ దోపిడికి అలవాటు పడ్డ సంస్థ రూల్స్ అమలు చేయడానికి ఇష్టపడట్లేదని వాటిని అమలు చేయాలని డీజీసీఏ ఒత్తిడి తెస్తే 1,000 విమానాలను రద్దు చేసిందని తెలిపారు. ఇండిగో చర్యలతో విమానాశ్రయాలన్నీ బస్టాండ్లను తలపిస్తున్నాయన్నారు. పవర్ కొంతమంది చేతుల్లో ఉంటే ఏం జరుగుతుందో అందరికీ అర్థమైందని కేటీఆర్ ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
ఇండిగోపై కేంద్రం యాక్షన్ షురూ..!
గత కొద్ది రోజులుగా దేశీయ విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇండిగో సంస్థకు చెందిన విమానాలు హఠాత్తుగా రద్దు కావడంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో వేలమంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంక్షోభానికి కారణమైన ఇండిగో సంస్థపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ను తొలగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. దేశీయ విమానాయాన సంస్థ ఇండిగో నిర్వాకంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ఐదో రోజు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. విమానాలు రద్దయ్యే సమాచారం ప్రయాణికులకు ఇవ్వకపోవడంతో వారంతా విమానాశ్రయాలలో చిక్కుకొని తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇండిగో సంస్థ కావాలనే ఈ విధంగా చేసిందని కేంద్రం భావిస్తోంది. దీంతో ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ పై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఈఓ పదవి నుంచి ఆయనను తొలగించడంతో పాటు పెద్ద మెుత్తంలో జరిమానా విధించనున్నట్లు సమాచారం.ఈ మేరకు కేంద్ర విమానయాన సంస్థ ఈ రోజు సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ భేటీకి ఇండిగో సంస్థ యాజమాన్యం తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ భేటీలో ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించే అవకాశం ఉంది.ప్రస్తుత ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ 2022లో బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన కేఎల్ఎమ్ రాయల్ డచ్ ఎయిర్ లైన్స్ కి సీఈఓగా వ్యవహరించారు.కాగా ఇండిగో ఘటనపై ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ క్షమాపణలు చెప్పారు. అంతర్గతంగా చర్యలు తీసుకోవడంలో సంస్థ విఫలమైందని అంగీకరించారు. అంతర్గతంగా అన్నీ షెడ్యూళ్లను రీబూట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో 5-10 రోజుల్లో ఇండిగో కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని పీటర్ ఎల్బర్స్ తెలిపారు. -
రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి: జూపూడి ప్రభాకర్
సాక్షి తాడేపల్లి: దేశీయ విమానయాన రంగంలో సంక్షోభ పరిస్థితుల వేళ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇండిగో సంస్థతో కుమ్మక్కయ్యారని, అందువల్లే ఈ సంక్షోభం ఏర్పడిందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు కారణమైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. దేశవ్యాప్తంగా ఇంత సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రామ్మోహన్ నాయుడు రీల్స్ చేసుకుంటూ సరదాగా గడుపుతున్నారని విమర్శించారు. ఆయన విమానయానశాఖ మంత్రిగా కాకుండా రీల్స్ మంత్రిగా మారారని దుయ్యబట్టారు. ఇండిగో సంక్షోభాన్ని వదిలేసి సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేసుకుంటూ గడుపుతున్నారన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. వాటిని కచ్చితంగా పాటించేలా చూడాలని విమానాయాన సంస్థలకు ఆదేశాలిచ్చింది.కానీ డీజీసీఏ నిబంధనలను ఇండిగో పాటించేలా చేయడంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారని ఈ ఫలితంగానే ఇప్పుడు ఇండిగో సంక్షోభం వచ్చిందని తెలిపారు. డీజీసీఏ తన రూల్స్‌ను వెనక్కి తీసుకునేలా ఇండిగో వ్యవహరించిందంటే దానికి కారణం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడేనని కనుక ఆయనను పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని జూపూడి ప్రభాకర్ కేంద్రాన్ని కోరారు.నారా లోకేష్ వార్ రూమ్‌లో చర్చలు జరుపుతున్నారంటూ నేషనల్ మీడియాలో మాట్లాడి పరువు తీశారు. అసలు కేంద్ర మంత్రి పదవితో లోకేష్ కి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. లోకేష్‌కి జాకీలు పెట్టి లేపాలనే ఉద్దేశ్యంతో దేశ వ్యాప్తంగా తెలుగు వారి పరువు తీశారని జూపూడి ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
Karumuri Venkat : రీల్స్ మీద ఉన్న శ్రద్ద ప్రజల మీద లేదా?
-
రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి..! ప్రయాణికుల ఆగ్రహం..
-
అర్నబ్ మాస్ కౌంటర్ రివ్యూ చేయడానికి లోకేష్ ఎవరు..?
-
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై ప్రయాణికుల ఆగ్రహం
-
ఇండిగోకు కేంద్రం తీవ్ర హెచ్చరిక
మూడు రోజులుగా దేశ వైమానిక రంగంలోసంక్షోభం సృష్టించిన ఇండిగో సంస్థపై కేంద్రం సీరియస్ అయ్యింది. విమానాల ఆకస్మిక రద్దు, ప్రయాణ వాయిదాల నివారణకు తగిన ప్రత్యామ్నాయలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికుల టికెట్ రద్దు రీఫండ్ ను ఆలస్యం చెయవద్దని వారికి రేపు రాత్రి 8లోపు డబ్బులు తిరిగివ్వాలని తీవ్రంగా హెచ్చరించింది. దేశీయ విమానయాన సంస్థ ఇండిగోపై కేంద్రం తీవ్రస్థాయిలో మండిపడింది. ఫ్లైట్స్ క్యాన్సిల్ వల్ల వేలాది మంది ఇబ్బందులు పడుతుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఇండిగో పూర్తిగా విఫలమైందని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే విమానాల సంక్షోభం సృష్డించి దానికి డీజీసీఏ నిబంధనలు సాకుగా చూపుతుందని ఆరోపించింది. లక్షలాది ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంస్థకు ఏమాత్రం పట్టడం లేదని దానిని కనీసం లెక్కచేయడం లేదని ఆరోపించింది. రద్దైన విమానాల సమాచారం కోసం వెంటనే ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ఇండిగోకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర విమానయాన శాాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి ఇండిగో యాజమాన్యం తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. కాగా డీజీసీఏ తీసుకొచ్చిన కొత్త రూల్స్ వల్లే ఈ సమస్య ఏర్పడిందని ఇండిగో సంస్థ ప్రకటించింది. అయితే ఆ రూల్స్ ని డీజీసీఏ తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నప్పటికీ పరిస్థితుల్లో మాత్రం మార్పు కన్పించడం లేదు. ప్రయాణికులకు విమానాలు రద్దైన ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో వారంతా విమానాశ్రయాలలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇండిగో సంస్థ కావాలనే వారికి ఈ సమాచారం అందించలేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీజీసీఏ తెచ్చిన కొత్తరూల్స్ వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చేందుకే ఇండిగో సంస్థ కావాలనే ఈ కృత్తిమ సంక్షోభాన్ని సృష్టించిందనే ఆరోపణలు వస్తున్నాయి. -
విమాన కష్టాలు.. ఇండిగో సీఈవో వివరణ
అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో విమానాల రద్దు గందరగోళం కొనసాగుతోంది. శుక్రవారం వరకు సుమారు 1,000 పైగా విమాన సర్వీసులు రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఇండిగోలో తలెత్తిన విమానాల రద్దు సంక్షోభంపై దాని సీఈవో సీఈఓ పీటర్ ఎల్బర్స్ స్పందించారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు అంగీకరించారు. అంతర్గతంగా తమ అన్ని వ్యవస్థలను, షెడ్యూళ్లను "రీబూట్" చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పారు. శనివారం నాటికి విమానాల రద్దు సంఘటనలు తగ్గుతాయని హామీ ఇచ్చారు. రాబోయే 5-10 రోజుల్లో అంటే డిసెంబర్ 10-15 నాటికి క్రమంగా కోలుకుని కార్యకలాపాలు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందన్నారు.సిబ్బంది పని గంటలను నియంత్రించే కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్డీటీఎల్) నిబంధనలను అమలు చేయడంలో ప్రణాళిక అంతరాల కారణంగా ఈ సంక్షోభం ఉద్భవించిందని వివరణ ఇచ్చారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఈ నిబంధనలను సమీక్ష పెండింగ్ లో ఉంచింది. -
విమానాల రద్దుపై.. ఇండిగో CEO వివరణ
-
విమాన టికెట్ల ధర పెంపుపై కేంద్రం సీరియస్
ఇండిగో సంక్షోభంతో గగనతల ప్రయాణం ఒక్కసారిగా ఖరీదుగా మారింది. అయితే విమాన టికెట్ల ధరల పెంపుపై కేంద్రం సీరియస్ అయ్యింది. సంక్షోభాన్ని క్యాష్ చేసుకోవద్దని ఎయిర్‌లైన్స్‌లకు శనివారం హెచ్చరికలు జారీ చేసింది. నిర్దేశించిన ఛార్జీల పరిమితులను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. భారీ సంఖ్యలో ఇండిగో విమానాల రద్దుతో.. మిగతా ఎయిర్‌లైన్స్ క్యాష్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పలు రూట్లలో దాదాపు 10 రెట్ల అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. అయితే మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఈ దోపిడీ ప్రభుత్వం దృష్టికి చేరింది. అయితే.. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ప్రయాణికులను కొన్ని విమానయాన సంస్థలు దోచుకోవడం సరికాదని కేంద్రం చెబుతోంది. అడ్డగోలుగా రేట్లు పెంచితే చూస్తూ ఊరుకోబోమని.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ జారీ చేసింది.మరోవైపు.. ఇండిగో సంక్షోభంగా ఐదో రోజుకి అడుగపెట్టింది. దేశంలోని పలు ప్రధాన నగరాల ఎయిర్‌పోర్టుల వద్ద ప్రయాణికుల నిరీక్షణ కొనసాగుతోంది. ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో ఎయిర్‌లైన్స్ ఘోరంగా విఫలం అయ్యిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. విమానాల రద్దు గురించి తెలీక.. సరైన సమాచారం లేక.. ఎయిర్‌పోర్టులలో హెల్ప్‌డెస్క్‌ల వద్ద ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఇండిగో సిబ్బంది తమతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ‘‘క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోతుందా?’’ అంటూ ఎయిర్‌లైన్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఇండిగో సిబ్బందిని హడలెత్తించిన మహిళ..
ఢిల్లీ: భారత్‌లో విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా ఐదో తీవ్ర అంతరాయం కలిగింది. విమాన సర్వీసుల రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా విమాన సర్వీసులను రద్దు కావడంతో విదేశీయులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఓ విదేశీ మహిళ.. ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు సిబ్బందితో గొడవకు దిగారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ ఆఫ్రికన్ ప్రయాణికురాలు ఇండిగో సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో సిబ్బందితో సదరు మహిళ గొడవకు దిగారు. తాను ప్రయాణించాల్సిన విమానం రద్దు కావడంతో ఇండిగో కౌంటర్‌పైకి ఎక్కి సిబ్బందితో వాగ్వాదం పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కేకలు వేసింది. ఆమె తీరు చూసిన ఇండిగో సిబ్బంది దెబ్బకు హడలెత్తిపోయారు. ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో ఐదు నుంచి పది రోజులు పడుతుందని ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బెర్స్ తెలిపారు. ఇండిగో ప్రకటనపై ప్రయాణికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే వరకు తమకు ఎందుకు సమాచార ఇవ్వలేదని ఫైర్ అవుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ఇండిగో సిబ్బందితో గొడవకు దిగారు. పలువురు ప్రయాణికులు వారికి చెక్ఇన్ అయ్యాక విమానాలు రద్దు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు విమానాశ్రయాల్లో తిండి, నిద్రలేకపోవడంతో ప్రయాణికులు కన్నీటిపర్యంతమవుతున్నారు.Delhi airport scene hai .The worst thing is the government is sleeping 😴 pic.twitter.com/8Yl7mWorJm— Charu Yadav (@YadavCharu28) December 5, 2025 -
రామ్మోహన్ నాయుడుపై ప్రయాణికుల ఆగ్రహం
తెలుగు రాష్ట్రాల్లో విమాన ప్రయానికులు అవస్థలు అప్డేట్స్.. 144 ఇండిగో సర్వీసులు రద్దు శంషాబాద్ నుంచి 144 ఇండిగో సర్వీసులు రద్దుఈరోజు ఒక్కరోజే భారీ సంఖ్యలో సర్వీసులు రద్దు. శంషాబాద్ నుంచి వెళ్లే 74 సర్వీసులు రద్దు.శంషాబాద్ వచ్చే 70 సర్వీసులు క్యాన్సిల్. శంషాబాద్‌లో ఉద్రిక్తత..కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుపై ప్రయాణికుల ఆగ్రహంశంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆవేదన.ప్రయాణికులు మాట్లాడుతూ..ఇక్కడే మేము ఇబ్బంది పడుతుంటే రామ్మెహన్ నాయుడు ఏం చేస్తున్నారని మండిపాటు.పార్లమెంట్లో ప్రకటనలు తప్పితే చేసేందేమీ లేదు.కేంద్రమంత్రిగా రామ్మోహన్ నాయుడు విఫలమయ్యారు.ఆయన ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించి ఏం ఉపయోగం అని ఆగ్రహం.గన్నవరంలో అవస్థలు..గన్నవరం విమానశ్రయంలో ఇండిగో ప్రయాణీకుల అవస్థలుగన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దుహఠాత్తుగా విమానం రద్దు చేయడంతో ప్రయాణికులు ఆందోళనఢిల్లీ విమానం రద్దుకు కారణం చెప్పాలని ఇండిగో కౌంటర్ సిబ్బందిని నిలదీసిన ప్రయాణీకులు.విమానం రద్దు అయినట్లు మెసేజ్ పెట్టమంటూ ఇండిగో సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానంఇండిగో సిబ్బంది సమాధానంపై ప్రయాణికులు అసహనంమధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం నుంచి బయల్దేరాల్సిన ఇండిగో విమానంఅర్ధరాత్రి 3:30 గంటలకు విమానం రద్దైనట్లు మెసేజ్ పెట్టడం మండిపడుతున్న ప్రయాణీకులు👉శంషాబాద్ విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండిగో తీరు, సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానాల రద్దు విషయంలో ఎయిర్‌పోర్టుకు వచ్చే వరకు తమకు ఎందుకు ఇవ్వలేదని ఇండిగో సిబ్బందిని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. దీంతో, స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా, ఐదో రోజు కూడా ఇండిగో సర్వీసులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 👉వివరాల ప్రకారం.. శంషాబాద్ నుంచి పలు నగరాలకు వెళ్లాల్సిన ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. శంషాబాద్ నుంచి ఇండిగోకు చెందిన 69 సర్వీసులు నేడు రద్దు అయ్యాయి. దీంతో, ఆయా సర్వీసుల్లో టికెట్ తీసుకున్న ప్రయాణికులు భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. తీరా వచ్చాక సర్వీసులు రద్దు విషయం తెలిసి.. సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే వరకు తమకు ఎందుకు సమాచార ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ఇండిగో సిబ్బందితో గొడవకు దిగారు. మరోవైపు.. పలువురు ప్రయాణికులు వారికి చెక్ఇన్ అయ్యాక విమానాలు రద్దు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప స్వాముల సైతం ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు.@IndiGo6E you all need staffs man , there are people in trouble here at Delhi airport at least give them right remuneration or just response pic.twitter.com/hQRLT5C2ha— a (@higirlz12) December 4, 2025టికెట్ ధరలకు రెక్కలు..👉ఇండిగో సంక్షోభం ముదురుతున్న వేళ విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. కోల్‌కతా నుంచి ముంబైకి వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమాన టికెట్ ధర శుక్రవారం ఏకంగా రూ.90,000కు చేరుకుంది. ముంబై నుంచి భువనేశ్వర్‌కు ఎయిరిండియా నడుపుతున్న విమానం టికెట్ ధర కూడా రూ.84,485 పలికింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రూ.25 వేలు, విజయవాడకు రూ.18 వేలు పలికాయి.इंडिगो की फ्लाइट्स में रुकावट और निरस्तीकरण की वजह से देश भर में यात्रियों को परेशानी का सामना करना पड़ रहा है। वीडियो अहमदाबाद एयरपोर्ट से है।#IndigoFlights #FlightCancellation #TravelUpdate #AhmedabadAirport #PassengerProblem #AirportChaos #IndiaTravel #FlightDelay pic.twitter.com/GyUfyOmwRb— Prince Singh (@Praveshkumar863) December 6, 2025 -
పేరు మార్చేసుకున్న ఇండిగో?!
దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత నాలుగు రోజులుగా విమాన సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 5) ఒక్క రోజే 400కి పైగా విమానాలను రద్దు చేసింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ అంతరాయంపై ఇండిగో అధికారికంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది కూడా. రద్దయిన అన్ని విమానాలకు ఆటోమేటిక్‌గా ఒరిజినల్ పేమెంట్ మోడ్‌కు పూర్తి రీఫండ్ ప్రాసెస్ చేస్తామని చెప్పింది. ఈతరుణంలో నెట్టింట పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా హాస్యస్పదంగా చేసిన పోస్ట్ హాట్‌టాపిక్ మారింది.ఆ పోస్ట్‌లో వరసగా నాలుగో రోజున కూడా విమాన సర్వీసులు అంతరాయం కొనసాగుతుండగా, గోయెంకా ఎయిర్‌లైన్ లోగోతో కూడిన సరికొత్త పేరును నెటిజన్లతో ఇలా పంచుకున్నారు. కొనసాగతున్న విమాన సర్వీసులు అంతరాయం నేపథ్యంలో తమ ఎయర్‌లైన్స్ పేరు మార్పు అంటూ.. “ఇట్ డిడ్న్'ట్ గో”, అని సరదాగా ఇలా పోస్ట్ చేశారు. అంతే నిమిషాల్లో ఈ పోస్ట్వైరల్ అయిపోయింది. చాలామంది ప్రయాణికులు ఈ జోక్‌ను మన నిరాశను ప్రతిబింబిస్తుందని చెప్పడం విశేషం. భారతదేశంలోని అతిపెద్ద విమానాయాన సంస్థ ఈ వారం ప్రారంభం నుంచి వందలాది సేవలను రద్దు చేసింది, ఢిల్లీ, బెంగళూరు మరియు చెన్నై వంటి ప్రధాన కేంద్రాలలో ప్రయాణీకులను ఇబ్బందులకు గురిచేసింది. ఫలితంగా ప్రత్యామ్నాయ విమానాల టిక్కెట్ల ధరల అమాంతం పెరిగేందుకు కారణమైంది. ఇక గోయెంకా చేసిన పోస్ట్ విమానాల రద్దుతో ఎయిర్‌పోర్ట్‌లో చిక్కకుపోయిన ప్రయాణికులను ఎంతాగానో ఆకట్టుకుంది. నెటిజన్లంతా "ఇండిగో ఇండిగో నుంచి ఇట్ డిడ్ డిట్ గోకు వెళ్లడం క్రేజీగా ఉంది అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తదుపరి అప్డేట్ పేరు మార్పు కాదని ఆశిస్తునన్నాం అలాగే ఇక ఈ ఆలస్యం కొనసాగదని ఆశిస్తున్నాం అని పోస్టులు పెట్టారు. కానీ కొంతమంది విమాన చరిత్రలోనే ఇంతలా విమాన సర్వీసుల రద్దు అనేది భలే ట్విస్టింగ్‌గా ఉన్నా..బహుశా లోగో కూడా రీబ్రాండ్ కోరుకుంటుందేమో అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ విమాన సర్వీసులు అంతరాయం పూర్తిగే తగ్గే వరకు గోయెంకా పోస్ట్ వైరల్ అవుతూనే ఉంటుంది కాబోలు.Name change announced…. pic.twitter.com/Pd3JJiE6CG— Harsh Goenka (@hvgoenka) December 5, 2025 (చదవండి: ఏఐ చాట్‌బాట్‌తో జర జాగ్రత్తోయ్..!) -
ఇండిగో ఎఫెక్ట్.. ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
ఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులకు ఓ ఆఫర్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పలు కీలక నగరాల మధ్య నడిచే 37 ప్రీమియం రైళ్లలో 116 అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్టు రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో, పలు నగరాలకు వెళ్లే ప్రయాణీకుల కోసం ప్లాన్ చేసింది.ఇండిగో విమాన రద్దు తర్వాత ప్రయాణీకుల డిమాండ్ పెరిగిన దృష్ట్యా భారత రైల్వే దేశవ్యాప్తంగా పలు రైళ్లలో బోగీల సంఖ్యను పెంచింది. దక్షిణ రైల్వే (SR) పరిధిలో నడిచే రైళ్లలో అత్యధిక సంఖ్యలో 18 రైళ్లకు బోగీలను పెంచినట్టు తెలిపింది. అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో అదనపు చైర్ కార్, స్లీపర్ క్లాస్ కోచ్‌లను పెంచినట్టు అధికారులు తెలిపారు. 6 డిసెంబర్ 2025 నుండి ఇది అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.ఇక, ఉత్తర రైల్వే (NR) ఎనిమిది రైళ్లలో బోగీలను పెంచారు. పలు రైళ్లలో 3AC, చైర్ కార్ కోచ్‌లను అదనంగా జత చేశారు. పశ్చిమ రైల్వే (WR)లో నాలుగు రైళ్లకు 3AC, 2AC కోచ్‌లను జత చేశారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) 2025 డిసెంబర్ 6-10 మధ్య ఐదు ట్రిప్పులకు అదనంగా 2AC కోచ్‌లతో రాజేంద్ర నగర్-న్యూఢిల్లీ (12309) మధ్య అదనంగా పెంచారు. ఇది బీహార్-ఢిల్లీ సెక్టార్లో మెరుగైన రవాణాను అందించనుంది.ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECOR) ఐదు ట్రిప్పులకు 2AC కోచ్‌లను జోడించడం ద్వారా భువనేశ్వర్-న్యూఢిల్లీ సేవలను (రైళ్లు 20817/20811/20823) పెంచింది. ఒడిశా-ఢిల్లీ రాజధాని మధ్య కనెక్టివిటీని మెరుగుపరచనుంది. గోరఖ్‌పూర్-ఆనంద్ విహార్ టెర్మినల్-గోరఖ్‌పూర్ స్పెషల్ (05591/05592) డిసెంబర్ 7 మరియు 9 మధ్య నాలుగు ట్రిప్పులను నడుపుతుంది. Indian Railways, in view of the surge in passenger demand following widespread flight cancellations, has taken extensive measures to ensure smooth travel and adequate availability of accommodation across the network. A total of 37 trains have been augmented with 116 additional… pic.twitter.com/ovDFWqG0VR— ANI (@ANI) December 5, 2025 -
ఎగరని విమానాలు.. ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ప్యాసింజర్ల కష్టాలు చూశారా?.. (చిత్రాలు)
-
ఇండిగో ఓ మాట.. కేంద్రం మరో మాట!
న్యూ ఏవియేషన్ రూల్స్‌ను వెనక్కి తీసుకోవడంతో విమానయాన ప్రయాణాలు ఇక సాఫీగా సాగుతాయని భావించిన ప్రయాణికులకు నిరాశ తప్పడం లేదు. పైలట్లు సత్వరమే అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ.. విమానాల రద్దు, వాయిదాలపర్వం ఇంకా కొనసాగుతోంది. దీంతో.. వేల మంది ఇంకా ఎయిర్‌పోర్టులలోనే ఇరుక్కుపోయారు. ఈ సంక్షోభం ఎప్పుడు ముగస్తుందనే విషయంపై ఇటు కేంద్రం, అటు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లు ఓ స్పష్టత అంటూ ఇవ్వలేకపోతున్నాయి. సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ఇంకోన్నిరోజులు సమయం పట్టొచ్చు.. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ చెబుతున్న మాట ఇది. గత నాలుగు రోజులుగా నెలకొన్న పరిస్థితులకు.. తీవ్రస్థాయిలో అవస్థలు పడ్డ ప్రయాణికులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారాయన. ఇండిగో మొత్తం ఆపరేషనల్ సిస్టమ్ రీబూట్ చేయడం వల్ల పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడిందని.. దీని వల్ల షెడ్యూల్లు, క్రూ మేనేజ్మెంట్, ఫ్లైట్ ప్లానింగ్ అన్నీ తాత్కాలికంగా దెబ్బతిన్నాయన్నారు. విమానాల రద్దుపై ప్రయాణికులకు సమాచారం చేరవేస్తున్నామని.. అనవసరంగా ఎయిర్‌పోర్టుల వద్దకు వచ్చి ఇబ్బంది పడొద్దని ప్రయాణికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 10–15 మధ్యకల్లా సేవలు క్రమంగా సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. కేంద్రం మాత్రం మరోలా చెబుతోంది. శనివారం(ఇవాళ)కి పరిస్థితి కాస్త చక్కబడుతుందని.. సోమవారం నుంచి సర్వీసులన్నీ యధాతథంగా, సాధారణ పరిస్థితుల మధ్య నడవొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటూ.. 24x7 కంట్రోల్ రూమ్ ద్వారా పౌరవిమానయాన శాఖ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అయితే పరిస్థితులు మాత్రం కేంద్రం చెబుతున్నట్లుగా ఏమాత్రం లేవు.పైలట్లకు వారాంతపు విశ్రాంతి విషయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాత్కాలికంగా వెనక్కి తగ్గినప్పటికీ.. ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగడానికి కారణాలున్నాయి. భారీ సంఖ్యలో విమానాల రద్దుతో ఇప్పటికే షెడ్యూల్లు గందరగోళంగా మారిపోయాయి. తీవ్ర పైలట్ కొరత, రోస్టరింగ్ సమస్యలను చక్కబెట్టుకోవడానికి ఇండిగోకు ఇంకొంత సమయం పట్టొచ్చు. సిస్టమ్ రీబూట్ వల్ల ఏర్పడిన ఆపరేషనల్ అంతరాయం ఒక్కసారిగా సరిచేయలేని స్థాయిలో కొనసాగుతోంది. ఈ ఫలితంతో.. ఇవాళ కూడా వెయ్యికి పైగా విమానాలు రద్దు అయ్యాయి. ఇండిగో సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటున్న మిగతా ఎయిర్‌లైన్స్‌లు ఛార్జీలు భారీగా పెంచాయి. దీంతో ఈ సంక్షోభం ఇప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు.. ప్రయాణికులకు విమానాల రద్దుపై ముందస్తు సమాచారం లేకపోవడంతో ఇండిగో కావాలనే ఇలా చేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డీజీసీఏ తెచ్చిన కొత్త రూల్స్ విషయంలో ఒత్తిడి పెంచేందుకే ఈ కృత్రిమ సంక్షోభాన్ని ఇండిగోనే సృష్టించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో కేంద్రం అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించింది. ప్యానెల్ ఏర్పాటు చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీసీఏ ఆదేశించింది. అయితే.. రూల్స్ వెనక్కి తీసుకోవడంపై పైలట్ అసోషియేషన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇది భద్రతా ప్రమాణాలను తగ్గించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇటు ఇండిగో.. అటు డీజీసీఏ.. ఇద్దరి నిర్వాకంతోనే బిగ్ ట్రబుల్ ఏర్పడిందని, కాబట్టి సమిష్టిగా భాద్యత వహించాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే డీజీసీఏ గనుక రూల్స్‌ను వెనక్కి తీసుకోకపోయి ఉంటే మాత్రం ఈ సంక్షోభం రెండు మూడు నెలలైనా ముగిసేది కాదనేది నిపుణుల మాట. -
భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు
హైదరాబాద్ నుంచి కోల్‌కతకు రూ. 69 వేలు.. ఢిల్లీ నుంచి విజయవాడకు రూ. 67 వేలు.. హైదరాబాద్–శ్రీనగర్‌కు సుమారు రూ. 60 వేలు.. విశాఖ నుంచి ముంబైకి సుమారు రూ. 56 వేలు.. ఢిల్లీ టు హైదరాబాద్ రూ. 50 వేలు... తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు శుక్రవారం వివిధ విమానయాన సంస్థలు విక్రయించిన ఒక్కో ఎకానమీ క్లాస్ విమాన టికెట్ ధర ఇది. అవే విమానయాన సంస్థల వెబ్సైట్లలో శుక్రవారం హైదరాబాద్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా అమెరికాలోని న్యూయార్క్‌కు టికెట్ ధర కనిష్టంగా రూ. 50 వేలలోపే అందుబాటులో ఉంది. అలాగే విశాఖ నుంచి సింగపూర్‌కు ఆదివారం రోజున టికెట్ రూ. 17,309కే లభిస్తోంది.శంషాబాద్/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం/విమానాశ్రయం (గన్నవరం)/రేణిగుంట: పైలట్ల కొరత, నిర్వహణ సమస్యలతో ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) శుక్రవారం దేశవ్యాప్తంగా ఏకంగా వెయ్యికిపైగా సర్వీసులను రద్దు చేయడంతో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి దేశంలోని ప్రధాన నగరాల మధ్య రాకపోకలు సాగించే మిగతా ఎయిర్‌లైన్స్ సంస్థలు టికెట్ ధరలను అసాధారణ రీతిలో పెంచేశాయి. సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీలతో పోలిస్తే కొన్ని రెట్లు అధికంగా వసూలు చేశాయి. దీంతో కొన్ని దేశీయ సర్వీసుల చార్జీలు విదేశీ టికెట్ చార్జీలను సైతం మించిపోయి ప్రయాణికుల జేబులను గుల్లచేశాయి. దేశీయ విమాన చార్జీలు సైతం అమెరికా వెళ్లాల్సిన చార్జీలకన్నా భారీగా ఉండటంతో విమాన ప్రయాణికులు తప్పనిసరైన ప్రయాణాలను మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండిగో విమాన సర్వీసుల రద్దుతో 24 గంటల నుంచి 48 గంటల ముందు టికెట్లు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు మాత్రం ఈ అధిక ధరలు చెల్లించాల్సిన దుస్థితి తలెత్తింది. మరో రెండు నుంచి మూడు రోజులు మాత్రమే టికెట్ ధరలు అధికంగా చూపిస్తున్న ఎయిర్‌లైన్స్ సంస్థలు.. ఆ తర్వాత సాధారణ చార్జీలనే చూపిస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రేట్లు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు తప్పని చిక్కులు.. పార్లమెంట్ సమావేశాల కారణంగా తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఢిల్లీలో ఉండగా వివిధ పనుల నిమిత్తం ఢిల్లీకి చేరుకున్న వివిధ పార్టీల నేతలు, వారి అనుచరగణం ఇండిగో విమాన సర్వీసుల రద్దు, ఆలస్యంతో ఇక్కట్లు పడుతున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కొచ్చి, అహ్మదాబాద్, పటా్న, కోల్‌కతా, ముంబై వంటి నగరాలకు వెళ్లే విమాన సర్వీసులేవీ నేరుగా అందుబాటులో లేవు. మధ్యలో ఒకటి, రెండు స్టాప్‌లతో నడిచే వాటినే ఇతర విమానయాన సంస్థలు అందుబాటులో ఉంచుతున్నాయి. ఒక స్టాప్ లేదా రెండు స్టాప్‌లతో హైదరాబాద్ వెళ్లే విమానాల టికెట్ రేట్లకు పరిమితి లేకుండా పోయింది. కొన్ని విమానాలు రూ. లక్షకుపైగా టికెట్ ధర పెట్టడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇక హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రయాణికులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రూ. 40 వేలకు పైగా టికెట్ ధర ఉండటంతో ప్రయాణికులు అక్కడే నిరీక్షిస్తున్న ఉదంతాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శంషాబాద్‌కు 84 డిపార్చర్, 71 అరైవల్ విమానాల రద్దు వివిధ గమ్యస్థానాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన 71 ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీసులను సంస్థ శుక్రవారం రద్దు చేసింది. అలాగే హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన 84 ఇండిగో విమానాలు కూడా రద్దయ్యాయి. మరికొన్ని ఇండిగో విమాన సర్వీసులు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారం శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మరోవైపు విశాఖ నుంచి శుక్రవారం 15 ఇండిగో విమాన సర్వీసులు, విజయవాడ నుంచి రెండు సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు.. శుక్రవారం దుబాయ్ ఈకే–526 విమానాన్ని బాంబులతో పేల్చివేయనున్నట్లు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెయిల్ రావడంతో తనిఖీలు చేశారు. -
IndiGo Flight: ప్రయాణికులకు చుక్కలు
-
ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్ : ఉన్నత స్థాయి విచారణ
ఇండిగో సంక్షోభం కేంద్రం సీరియస్‌గా స్పందించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ నిమిత్తం ఉన్నత స్థాయి కమిటినీ నియమించింది. శనివారం నాటికి విమాన షెడ్యూల్ సరి అవుతుందని, మూడు రోజుల్లో సోమవారం నాటికి సాధారణ స్థితికి తిరిగి వచ్చే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. రద్దయిన విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులకు పూర్తి రీఫండ్ చేయాలని ఇండిగో సంస్థను ఆదేశించింది. ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేయాలని సూచించింది.వరుసగా ఇండిగో విమానల రద్దు, ప్రయాణీకుల ఆందోళన సందర్భంగా, పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని విమానయాన మంత్రి తెలిపారు. దీనిపై తక్షణమే స్పందించిన విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ జాప్యాలు, విమానాల రద్దులకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేసేందుకు నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ ప్యానెల్లో సంజయ్ కె బ్రహ్మణే (జాయింట్ డైరెక్టర్ జనరల్), అమిత్ గుప్తా (డిప్యూటీ డైరెక్టర్ జనరల్), కెప్టెన్ కపిల్ మాంగ్లిక్ (SFOI), మరియు కెప్టెన్ లోకేష్ రాంపాల్ (FOI) ఉంటారు.ఎఫ్డీటీఎల్ నిబంధనలను డీజీసీఏ సవరించడం సరికాదని కేంద్రం అభిప్రాయపడింది పైలట్లు, సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా చూడటం లక్ష్యంగా విమాన విధి సమయ పరిమితులపై కొన్నినిబంధనలను నిలిపివేయడాన్నిసమర్థిస్తూ, ఈ చర్య ప్రయాణీకుల ప్రయోజనాల కోసమేననీ, భద్రతలో రాజీ పడేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇండిగో వైఫల్యం నేపథ్యంలో ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది.ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వారికి లాంజ్ యాక్సెస్, వారి ప్రయాణ అనుభవం సౌకర్యవంతంగా ఉండేలా అన్ని సాధ్యమైన సహాయం అందించాలని పేర్కొంది. అంతేకాకుండా, విమానాలు ఆలస్యం కావడం వల్ల ప్రభావితమైన అన్ని ప్రయాణీకులకు రిఫ్రెష్మెంట్లు , అవసరమైన సేవలు అందించాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. సాధారణ విమానయాన సేవలు వీలైనంత త్వరగా పునరుద్ధరించబడటానికి,ప్రయాణికులకుకలిగే అసౌకర్యాన్ని తగ్గించడానికి కార్యాచరణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం : తండ్రి చితాభస్మం కలశంతో కుమార్తె నమిత ఆవేదనకమిటీ విచారణఇండిగోలో ఎక్కడ తప్పు జరిగింది అనేది విచారణ కమిటీ పరిశీలిస్తుంది, తగిన చర్యలకు అవసరమైన చోట జవాబుదారీతనాన్ని నిర్ణయిస్తుంది .భవిష్యత్తులో ప్రయాణీకులు మళ్లీ అలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేలా ఇలాంటి అంతరాయాలను నివారించడానికి చర్యలను సిఫార్సు చేస్తుంది. విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఉత్తర్వుల్లో సవరించిన విమాన విధి సమయ పరిమితులను (FDTL) పాటించడానికి విమానయాన సంస్థలకు తగినంత సమయంఇచ్చినట్టు డీజీసీఏ పేర్కొంది. 15 రోజుల్లోపు కమిటీ నివేదికను డీజీసీఏకు సమర్పిస్తుంది. -
‘విమానం రాలేదు.. దయచేసి ఉద్యోగం తీసేయకండి’
భారత్‌లో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అమలు చేసిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్డీటీఎల్) నిబంధనల కారణంగా పైలట్ల కొరతతో సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం కారణంగా గురువారం ఒక్కరోజే 500కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈనేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈమేరకు ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు ఏడుస్తూ సర్వీసుల ఆలస్యం కారణంగా తన ఉద్యోగం కోల్పోతానని భయపడుతూ చేసిన పోస్ట్ కొద్ది సమయంలో వైరల్ అయింది. అందులో ప్రయాణికుడు ఏడుస్తూ ‘ప్రయాణం ఆలస్యం కారణంగా నన్ను ఉద్యోగం నుంచి తొలగించకూడదని దయచేసి నా బాస్‌కి చెప్పండి’ అని చెప్పడం గమనించవచ్చు.పుణెలో డాక్టర్ ప్రశాంత్ పన్సారే ‘గేట్ వద్ద సమస్య గురించి కమ్యునికేట్ చేయడానికి సిబ్బంది ఎవరూ కనిపించడం లేదు. బోర్డులో మాత్రం షెడ్యూల్ ప్రకారం విమాన సర్వీసులు చూపిస్తున్నాయి’ అని ఫిర్యాదు చేశారు.My @IndiGo6E flight is delayed for hours and passengers are stuck with no clear communication. I even have a video of people raising concerns. This needs urgent attention. #IndiGo #Delay #6E979 pic.twitter.com/iKKdGftKoo— Ayush Kuchya (@KuchyaAyush) December 3, 2025పైలట్ల కొరతే కారణండీజీసీఏ అమలు చేసిన కొత్త ఎఫ్డీటీఎల్ నిబంధనల కారణంగా పైలట్లకు వారంలో 36 గంటల నుంచి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి చేశారు. అలాగే, రాత్రి వేళల్లో ల్యాండింగ్ల సంఖ్యను ఆరు నుంచి రెండుకు తగ్గించారు. విమానయాన భద్రతను పెంచే లక్ష్యంతో తీసుకువచ్చిన ఈ మార్పులు ప్రత్యేకించి రాత్రి వేళల్లో అధిక విమానాలను నడిపే ఇండిగో ఆపరేషన్లపై తీవ్ర ప్రభావం చూపాయి. కొత్త నిబంధనల అమలుకు తగినంత మంది పైలట్లను నియమించుకోవడంలో ఇండిగో వైఫల్యం చెందిందని పైలట్ సంఘాలు ఆరోపించాయి. దీనివల్లనే ఈ సంక్షోభం ఏర్పడిందని పేర్కొన్నాయి.ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభానికి కారణాలు ఇవేనా.. -
ఇండిగో సంక్షోభానికి కారణాలు ఇవేనా..
దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో గత నాలుగు రోజులుగా విమాన సర్వీసుల అంతరాయాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో శుక్రవారం (డిసెంబర్ 5) ఒక్క రోజే 400కి పైగా విమానాలను రద్దు చేసింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ అంతరాయంపై ఇండిగో అధికారికంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. రద్దయిన అన్ని విమానాలకు ఆటోమేటిక్‌గా ఒరిజినల్ పేమెంట్ మోడ్‌కు పూర్తి రీఫండ్ ప్రాసెస్ చేస్తామని చెప్పింది. ఈనేపథ్యంలో అసలు ఈ సంక్షోభానికి కారణాలను మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రవేశపెట్టిన నూతన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు (గతంలో 36 గంటల నుంచి 48 గంటలకు). రాత్రిపూట ల్యాండింగ్ల సంఖ్యను తగ్గించారు (ముందు 6 నుంచి ఇప్పుడు వారానికి 2కి). రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు.ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు 2,200కి పైగా విమానాలను నడుపుతుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్‌వర్క్‌ను, సిబ్బంది రోస్టర్‌ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.సిబ్బంది కొరతకొత్త FDTL నిబంధనల అమలుకు ముందు నుంచే ఇండిగో సంస్థలో పైలట్ల కొరత ఉందని విమర్శలు ఉన్నాయి. కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిసినప్పటికీ సంస్థ తగినంత మంది సిబ్బందిని ముందుగానే నియమించుకోవడంలో లేదా వారికి శిక్షణ ఇవ్వడంలో విఫలమైందని పైలట్ సంఘాలు ఆరోపించాయి. సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి సుదీర్ఘకాలంగా అనుసరించిన ‘లీన్ మ్యాన్‌పవర్ స్ట్రాటజీ’(తక్కువ సిబ్బందితో ఎక్కువ పనులు చేయించడం) ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసిందని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం -
ఇండిగో సంక్షోభంపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు వల్ల దేశవ్యాప్తంగా సంక్షోభం ఏర్పడిన తరుణంలో కేంద్రం దృష్టి సారించింది. ఇండిగో విమానాల రద్దుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు డీజీసీఏ పరిస్థితిన సమీక్షిస్తూ ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా విమానయాన మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇండిగో సంక్షోభంలో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. సంక్షోభానికి కారణమైన వారిని శిక్షిస్తామన్నారు. పైలట్ల రోస్టర్ సిస్టమ్ పూర్తిగా నిలిపివేసిన కేంద్రం.. ప్రయాణికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొంది. ప్రయాణికుల కొరకు కంట్రోల్ రూమ్ నంబర్ 011 2461 0843 2469 3963 ఏర్పాటు చేసింది కేంద్రం.ఇదిలా ఉంచితే, సిబ్బంది కొరత కారణంగా ఇండిగో సంస్థ ప్రస్తుత పరిస్థితులపై చింతిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజులుగా ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాము. చాలా మంది ప్రయాణికుల ప్రయాణాలు రద్దయ్యాయి. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యే సమాచారం లేక చాలామంది ఎయిర్ పోర్టులలో చిక్కుకున్నారని తెలిపింది. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యను పరిష్కరించడానికి ఇండిగో అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది. ఇంత పెద్ద సమస్య ఒక్క రాత్రిలో పరిష్కారం కాదని ప్రయాణికులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన విడుదల చేసింది.ప్రయాణికులకు ఇండిగో సూచనలురద్దైన విమానాల టికెట్ ఛార్జీలు ఆటోమెటిక్ గా ప్రయాణికుల అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి.క్యాన్సిల్ టికెట్స్ కు 100 శాతం రీఫండ్ చేయబడుతుంది. అదే విధంగా 05 నుంచి 15 తారీఖు వరకూ రీషెడ్యూల్ రిక్వెస్టులు స్వీకరించబడతాయి.ప్రస్తుతం ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్న వారికోసం పరిసర ప్రాంతాలలోని హోటల్ రూమ్స్ బుక్ చేయబడతాయి.అదేవిధంగా ప్రయాణికులకు స్నాక్స్ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.వృద్ధులు,దివ్యాంగులకోసం లాంజ్ సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది.ప్రయాణికులు తమ ఫ్లైట్స్ ల వివరాలు అధికారిక వెబ్ సైట్లలో చూసుకోవాలని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే దయచేసి విమానాశ్రయానికి రాకూడదని తెలిపింది. ఇండిగో ఫ్లైట్స్ విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తమ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని దయచేసి ప్రయాణికులు సహకరించాలని కోరింది.ఏమి జరిగింది?గత కొన్ని రోజుల్లో 1,000కిపైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. కేవలం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాల్లో వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయాయి.డీజీసీఏ కొత్తగా అమలు చేసిన Flight Duty Time Limit (FDTL) నియమాలు పైలట్ల అలసటను తగ్గించేందుకు కఠినంగా అమలు చేయడం వల్ల, ఇండిగోలో క్రూ షెడ్యూలింగ్ పూర్తిగా దెబ్బతింది. -
Bengaluru: ఆన్లైన్లో రిసెప్షన్ చేసుకున్న కొత్త దంపతులు
-
విమానాల రద్దు.. ఇండిగో కీలక ప్రకటన
ఇండిగో సంస్థ ప్రస్తుత పరిస్థితులపై చింతిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజులుగా ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాము. చాలా మంది ప్రయాణికుల ప్రయాణాలు రద్దయ్యాయి. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యే సమాచారం లేక చాలామంది ఎయిర్ పోర్టులలో చిక్కుకున్నారని తెలిపింది. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యను పరిష్కరించడానికి ఇండిగో అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది. ఇంత పెద్ద సమస్య ఒక్క రాత్రిలో పరిష్కారం కాదని ప్రయాణికులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన విడుదల చేసింది.ప్రయాణికులకు ఇండిగో సూచనలు-రద్దైన విమానాల టికెట్ ఛార్జీలు ఆటోమెటిక్ గా ప్రయాణికుల అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి.-క్యాన్సిల్ టికెట్స్ కు 100 శాతం రీఫండ్ చేయబడుతుంది. అదే విధంగా 05 నుంచి 15 తారీఖు వరకూ రీషెడ్యూల్ రిక్వెస్టులు స్వీకరించబడతాయి.-ప్రస్తుతం ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్న వారికోసం పరిసర ప్రాంతాలలోని హోటల్ రూమ్స్ బుక్ చేయబడతాయి.-అదేవిధంగా ప్రయాణికులకు స్నాక్స్ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.-వృద్ధులు,దివ్యాంగులకోసం లాంజ్ సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది.ప్రయాణికులు తమ ఫ్లైట్స్ ల వివరాలు అధికారిక వెబ్ సైట్లలో చూసుకోవాలని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే దయచేసి విమానాశ్రయానికి రాకూడదని తెలిపింది. ఇండిగో ఫ్లైట్స్ విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తమ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని దయచేసి ప్రయాణికులు సహకరించాలని కోరింది. -
IndiGo: ఏవియేషన్ కొత్త రూల్స్ ఉపసంహరణ
-
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇండిగో ఎంక్వైరీ ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయాణికులు ప్రయత్నించారు. కస్టమర్ సర్వీస్ రూమ్ డోర్లు బాదుతూ సిబ్బందిని ప్రయాణికులు నిలదీశారు. ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది, ప్రయాణికులకు మధ్య వాగ్వివాదం జరిగింది.నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నాం.. స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదంటూ ఇండిగో సిబ్బందిపై ప్రయాణికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెన్షన్ వాతావరణ నెలకొనడంతో సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు రంగ్ర ప్రవేశం చేశారు. పోలీసులు, ప్రయాణికులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.ఇండిగో యాజమాన్యం కనీస వసతులు కూడా కల్పించడం లేదంటూ ప్రయాణికుల ఆందోళనకు దిగారు. బోర్డింగ్ పాస్ పూర్తయిన తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్తున్నారంటూ మండిపడ్డారు. తమ లగేజ్ అడిగితే ఇక్కడ ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో కస్టమర్ సర్వీస్ కనీస స్పందన లేదని.. గంటలు గంటలు నిల్చున్న సమాధానం చెప్పట్లేదని.. చిన్నారులకు కనీసం నీళ్లు కూడా ఇవ్వట్లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇండిగోకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: గగనతల ప్రయాణాలపై గందరగోళం కొనసాగుతున్న వేళ.. ఇండిగోకు భారీ ఊరట దక్కింది. పైలట్లకు వారాంతపు విశ్రాంతి ఇచ్చే ఏవియేషన్ న్యూ రూల్స్‌ను తక్షణమే ఉపసంహరించుకున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ప్రకటించింది. దీంతో గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడి ప్రయాణాలు సాఫీగా సాగే అవకాశం కనిపిస్తోంది.ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్(FDTL) పేరిట.. పైలట్లకు 48 గంటల విశ్రాంతి తప్పని సరిచేసింది డీజీసీఏ. దీంతో దేశవ్యాప్తంగా ఎయిర్‌లైన్స్ సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. అప్పటికే పైలట్ల కొరతలో ఉన్న ఇండిగోకు ఇది మరింత చిక్కుల్ని తెచ్చి పెట్టింది. పైలట్ల కొరత కారణంగా గత నాలుగైదు రోజులుగా భారీ సంఖ్యలో విమానాలను రద్దు చేయడం.. మరికొన్నింటిని దారి మళ్లించడం చేసింది. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో..డీజీసీఏ ఇండిగో నుంచి వివరణ కోరింది. అయితే పరిస్థితుల ప్రభావం, ఇండిగో నుంచి వివరణ.. రూల్స్ విషయంలో మినహాయింపు కోరుతూ చేసిన విజ్ఞప్తిని డీజీసీఏ పరిగణనలోకి తీసుకుంది.నాలుగు రోజుల్లో..నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఎఫ్డీటీఎల్ కొత్త నిబంధనల్లో.. పైలట్లు రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలకు మించి విధులు నిర్వర్తించకూడదని డీజీసీఏ ఆదేశించింది. రోజులో కనీసం 10 గంటలు వారికి విశ్రాంతి ఇవ్వాలని పేర్కొంది. అలాగే.. రాత్రి పూట ఫ్లైయింగ్, ల్యాండింగ్ విషయంలోనూ కఠిన నిబంధనలు తెచ్చింది. వీటితో పాటు ప్రతి ఏటా పైలట్లు, సిబ్బందికి ఫాటిగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ తప్పనిసరి చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. పైలట్లు, సిబ్బంది అలసట లేకుండా పని చేయడం, అలాగే ప్రయాణికుల భద్రత కోసమే ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. కానీ, రోస్టరింగ్ సిస్టమ్ మార్పులతో ఎయిర్‌లైన్స్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో రూల్స్‌ను తక్షణమే ఉపసంహరించుకుంది.డీజీసీఏ జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం విమాన పైలెట్లకు వారంలో కనీసం 48 గంటల విశ్రాంతినివ్వాలి. దీన్ని సెలవులకు ప్రత్యామ్నాయంగా వాడటం కుదరదు. అయితే ఇండిగో విమానాల మూకుమ్మడి కేన్సిలేషన్ నేపథ్యంలో డీజీసీఏ ఈ నిబంధనను సడలించింది. కాకపోతే నెల రోజుల్లో ఒక పైలెట్ గరిష్టంగా విమానం నడపగల గంటలపై మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. విమాన సిబ్బందిపై పని ఒత్తిడిని అంచనా వేసేందుకు విమానయాన సంస్థలు తగిన పద్ధతులను అభివృద్ధి చేయాలని కూడా డీజీసీఏ తన కొత్త నిబంధనల్లో స్పష్టం చేసింది.వరుస నైట్డ్యూటీలను తప్పించేలా రోస్టర్లను తయారు చేయాలని సూచించింది. పైలెట్ల విషయానికి వస్తే వీరి ఒత్తిడిని గుర్తించడం తప్పనిసరి చేసింది. ఈ కొత్త నిబంధనల నేపథ్యంలోనే బుధవారం నుంచి దేశవ్యాప్తంగా పలు ఇండియో విమానాలు రద్దయ్యాయి. లేదంటే వాయిదా పడ్డాయి. చౌక విమానయాన సంస్థ కావడంతో సిబ్బందిని అతి తక్కువగా ఉంచుకుందీ సంస్థ. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్గుఆ తాము కొత్త నిబంధనలను రూపొందించినట్లు డీజీసీఏ చెబుతూండగా.. అకస్మాత్తుగా వీటిని అమలు చేయాల్సి రావడం సమస్యలకు దారితీసిందని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. -
కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్
విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం పట్టి కుదిపేస్తోంది. ఉన్నట్టుండి టికెట్లు బుక్ చేసుకున్న విమానాలు రద్దు కావడంతో ప్రయాణీకుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒకరికి ఉద్యోగం, మరొకరికి అనారోగ్యం, మరొకరికి వేరొక అత్యవసర పరిస్థితి కారణంగా విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటే, చివరి నిమిషంలో విమానాల రద్దుతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫలితంగా ఒక కొత్త జంట సొంత రిసెప్షన్‌కు హాజరు కాలేని పరిస్థితి. వేరే దారి లేక ఆన్లైన్లో రిసెప్షన్‌కు హాజరయ్యారంటే ఈ సంక్షోభం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇండిగోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.కొత్త ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తన రోస్టర్ ప్లానింగ్‌లో తగినంత మార్పులు, పైలట్ల కొరత కారణంగా ఈ వారం భారతదేశం అంతటా వందలాది విమానాలను రద్దు చేసింది. దీంతో కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఊహించని పరిణామం వెలుగులోకి వచ్చింది. నూతన వధూవరులు తమ సొంత రిసెప్షన్‌కు వర్చువల్‌గా హాజరు కావాల్సి వచ్చింది. A newly wed techie couple forced to attend their own reception online after their Indigo flights from Bhubaneswar-Hubbali were cancelled. The bride’s parents having already invited relatives decided to broadcast their live feed on a big screen. #IndigoDelay #FlightCancellations pic.twitter.com/jO7lTgm8lZ— Deepak Bopanna (@dpkBopanna) December 5, 2025 బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హుబ్బళ్లికి చెందిన మేధా క్షీర్సాగర్ , ఒడిశా భువనేశ్వర్‌కు చెందిన సంగమ దాస్ నవంబర్ 23న భువనేశ్వర్‌లో వివాహం చేసుకున్నారు. బుధవారం వధువు స్వస్థలంలో అధికారిక రిసెప్షన్ ఏర్పాటు చేశారు. హుబ్బళ్లిలోని గుజరాత్ భవన్లో జరగాల్సి ఉంది.వీరు భువనేశ్వర్ నుండి బెంగళూరుకు అక్కడినుంచి హుబ్బళ్లికి వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. డిసెంబర్ 2న భువనేశ్వర్ నుండి బెంగళూరుకు , తరువాత హుబ్బళ్లికి టిక్కెట్లు బుక్ చేసుకున్న వధూవరులు, మంగళవారం ఉదయం 9 గంటల నుండి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు విమానాలు పదేపదే ఆలస్యం కావడంతో చిక్కుకుపోయారు. చివరికి డిసెంబర్ 3న విమానం రద్దైంది. వీరితోపాటు భువనేశ్వర్-ముంబై-హుబ్బళ్లి మీదుగా ప్రయాణించే అనేక మంది బంధువులకు ఇదే ఇబ్బంది తప్పలేదు. మరోవైపు రిసెప్షన్ వేదిక వద్ద చుట్టాలు, పక్కాలు అందరూ విచ్చేశారు. సన్నాహాలన్నీ పూర్తి చేసుకుని బంధుమిత్ర సపరివార సమేతంగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో విమానాల రద్దు వార్త అశనిపాతంలా తాకింది. ఇక చేసేదేమీ లేకవధువు తల్లిదండ్రులు రంగంలోకి దిగి ఆన్లైన్లోనే తంతు ముగించారు. రిసెప్షన్ కోసం సిద్ధం చేసుకున్న దుస్తులతో వధూవరులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రిసెప్షన్లో చేరారు. టీవీ స్క్రీన్‌మీదే ఆన్లైన్లోనే నూతన దంపతులను ఆశీర్వదించారు.వారు వస్తారని ఆశించాం కానీ వారు రాలేకపోయారు. బంధువులందర్నీ పిలుచుకున్నాం, కానీ ఇలా జరగడం బాధనిపించింది. అలాగని అన్నీ ఏర్పాట్లు చేశాక, ఈవెంట్‌ను రద్దు చేయలేం. అందుకే అందరితోనూ చర్చించి రిసెప్షన్‌కు ఆన్లైన్లో హాజరు కావాలని వారి భాగస్వామ్యాన్ని స్క్రీన్‌పై ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నామని వధువు తల్లి చెప్పారు.ఇండిగో విమానాలు రద్దుఢిల్లీ, జైపూర్, భోపాల్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఇతర నగరాల్లోని విమానాశ్రయాలలో ఇండివిమాన కార్యకలాపాలు స్థంభించి పోయాయి. వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. గురువారం, రోజుకు దాదాపు 2,200 విమానాలను నడుపుతున్న ఇండిగో గురువారం 500 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది, ఇది దాని 20 సంవత్సరాల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి కార్యకలాపాలు పూర్తిగా స్థిరీకరించే అవకాశం ఉందని అంచనా. విమాన విధి నిబంధనలలో తాత్కాలిక సడలింపులను కోరిందని ఏవియేషన్ వాచ్డాగ్ DGCAకి తెలిపింది. -
ఇండిగో సంక్షోభంపై రాహుల్ సంచలన ట్వీట్
ఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ సంక్షోభానికి ‘గుత్తాధిపత్య మోడల్’ ఫలితమంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. కేంద్ర ప్రభుత్వమే టార్గెట్‌గా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. విమానాల ఆలస్యం, కాన్సిలేషన్ వల్ల బాధపడేది సామాన్యులేనంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ప్రభుత్వం చర్యలు కారణంగా సామాన్యులు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఈ సమస్య పునరావృతం కాకుండా చూడాలి. న్యాయమైన పోటీ ఉండాలన్న రాహల్... మ్యాచ్ ఫిక్సింగ్, గుత్తాధిపత్యం ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కిందటి ఏడాది ఆయన చేసిన ఓ ట్వీట్‌ను ప్రముఖంగా ప్రస్తావించారు.IndiGo fiasco is the cost of this Govt’s monopoly model. Once again, it’s ordinary Indians who pay the price - in delays, cancellations and helplessness.India deserves fair competition in every sector, not match-fixing monopolies. https://t.co/sRoigepFgv— Rahul Gandhi (@RahulGandhi) December 5, 2025దేశవ్యాప్తంగా ఇండిగో కష్టాలు కొనసాగుతున్నాయి. ఎయిర్ లైన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఢిల్లీలోనే 220పైగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ప్రధాన విమానాశ్రయాల్లో ఒకే రోజు 70కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. -
ఇండిగో కీలక నిర్ణయం.. టెన్షన్లో ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల రాకపోకలపై అంతరాయం కొనసాగుతోంది. గత మూడు రోజుల్లో వందల కొద్దీ సర్వీసులకు అంతరాయం కలిగింది. ఇవాళ ఇంకొన్ని విమానాలు రద్దు కాగా.. ఇంకొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. బుక్ చేసుకున్న సర్వీసులు రద్దు కావడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండిగో విమానాల్లో అంతరాయానికి సిబ్బంది కొరత.. సాంకేతిక సమస్యలు కారణమని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫ్లైయింగ్ అకాడమీల నుండి సిబ్బందిని తాత్కాలికంగా రిక్రూట్ చేసుకుంటోంది ఇండిగో. అయితే విమాన సిబ్బంది లేనప్పుడు ఫ్లైట్లను బుకింగ్స్‌లో ఎందుకు పెట్టారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. టెంపరరీ అని తీసుకొస్తున్నారు.. అసలు వారికి శిక్షణ పూర్తి అయ్యిందో లేదో? అని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలపై ఇండిగో అధికారికంగా స్పందించాల్సి ఉంది.మరోవైపు.. దేశవ్యాప్తంగా ఇండిగో ప్రయాణికుల అవస్థలు కొనసాగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద శుక్రవారం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం నుంచి వెయిటింగ్లో పడుతున్నారు. ఈ క్రమంలో సహనం నశించి.. సీఐఎస్ఎఫ్ సిబ్బందితో చెకింగ్ పాయింట్ వద్ద వాగ్వాదానికి దిగారు. పిల్లలతో పడిగాపులు పడుతున్నామని.. వేరే విమానంలో అయినా తమను తరలించాలని కోరుతున్నారు. ఎఫ్డీటీఎల్ (Flight Duty Time Limitations) రూల్స్ అనేవి డీజీసీఏ(Directorate General of Civil Aviation) రూపొందించిన నియమాలు. ఇవి పైలట్లు డ్యూటీ టైమింగ్స్‌తో పాటు కనీస విశ్రాంతి సమయం ఎంత ఉండాలి అనే విషయాల్ని నిర్దేశిస్తాయి. తాజాగా.. పైలట్లకు ఊరట ఇస్తూ ఈ రూల్స్‌లో మార్పులు చేశారు. అయితే.. ఇండిగో అనేది దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్స్ సర్వీస్. రోజుకు 1,800 ఫ్లస్ సర్వీసులు నడుపుతోంది(మిగతావి అన్నీ కలిపి 200-400 సర్వీసులు మాత్రమే). అయితే దీనికి స్టాఫ్ కొరత మొదటి నుంచే ఉంది. ఈ క్రమంలో తాజా రూల్స్‌తో అది సంక్షోభ దిశగా అడుగులు వేసింది. దీంతో ఇండిగో డీజీసీఏను ఆశ్రయించింది. తమ విమానాల్లో కొన్నింటికి నిబంధనల నుంచి మినహాయింపు కోరినట్లు తెలుస్తోంది. -
ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఇవన్నీ ఇవ్వాల్సిందే..!
దేశంలో విమానాల రద్దు సంఘటనలు ప్రస్తుతం ఎక్కువయ్యాయి. ముఖ్యంగా దేశీయ సర్వీసుల్లో ఇవి ఎక్కువ ఉంటున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ పౌర విమానయాన సంస్థ ఇండిగో.. భారీగా విమానాల రద్దుతో వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో విమానాలు క్యాన్సిల్ అయినప్పుడు విమానయాన సంస్థల బాధ్యతలు ఏంటి.. డీజీసీఏ నిబంధనలు ఏం చెబుతున్నాయి.. ప్రయాణికులుగా మనకు ఎటువంటి హక్కులు ఉంటాయి.. ఈ కథనలో తెలుసుకుందాం..భారతదేశంలో విమానాలు రద్దు అయినప్పుడు డీజీసీఏ (DGCA డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు ప్రయాణికులకు రిఫండ్, ప్రత్యామ్నాయ విమానం, భోజనం/హోటల్ సౌకర్యం వంటి బాధ్యతలు వహించాలి. అలాగే ప్రయాణికులకు పాసింజర్ ఛార్టర్ ఆఫ్ రైట్స్ ద్వారా కొన్ని స్పష్టమైన హక్కులు కల్పించారు.విమానయాన సంస్థల బాధ్యతలుసమయానికి సమాచారం ఇవ్వాలి: విమానం క్యాన్సిల్ అయితే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా ముందుగానే తెలియజేయాలి. ప్రత్యామ్నాయ విమానం: అదే గమ్యస్థానానికి మరో విమానం ఉచితంగా ఏర్పాటు చేయాలి. రిఫండ్: ప్రయాణికుడు కోరుకుంటే పూర్తి టికెట్ ధర రిఫండ్ చేయాలి. భోజనం/హోటల్ సౌకర్యం: విమానం క్యాన్సిల్ లేదా 2 గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయితే ప్రయాణికులకు భోజనం, రిఫ్రెష్మెంట్ వసతి కల్పించాలి. అదే 24 గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయితే హోటల్ వసతితోపాటు ట్రాన్స్ఫర్(స్థానిక రవాణా) సౌకర్యం కల్పించాలి.ప్రయాణికుల హక్కులు ఇవే..విమానం క్యాన్సిల్ అయితే ప్రయాణికులు ఛార్జీలు రిఫండ్ తీసుకోవచ్చు లేదా మరో విమానంలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఓవర్‌బుకింగ్ వల్ల ప్రయాణికుడికి సీటు దొరకకపోతే టికెట్ పూర్తి రిఫండ్‌తోపాటు పరిహారం పొందవచ్చు.లగేజీని విమానయాన సంస్థలు పోగొడితే నిబంధనల ప్రకారం ప్రయాణికులు పరిహారం పొందవచ్చు.విమానాల ఆలస్యం లేదా క్యాన్సిలేషన్‌పై స్పష్టమైన సమాచారం పొందే హక్కు ప్రయాణికులకు ఉంటుంది.డీజీసీఏ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..ప్రయాణికులు 7 రోజులు ముందే విమాన టికెట్ బుక్ చేసి, 24 గంటలలోపు రద్దు చేస్తే పూర్తి రిఫండ్ పొందవచ్చు. విమానాలు 2 గంటలకు మించి ఆలస్యమైతే ఉచితంగా భోజనం, రిఫ్రెష్మెంట్ సౌకర్యం కల్పించాల్సిందే.24 గంటలకు మించి ఆలస్యమైతే ఉచితంగా హోటల్ వసతి, స్థానిక రవాణా ఏర్పాట్లు చేయాలి.విమానాల క్యాన్సిలేషన్ సందర్భంలో పూర్తి రిఫండ్ లేదా ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలి. అయితే సేఫ్టీ కారణాలు (వాతావరణం, టెక్నికల్ సమస్యలు) రీత్యా విమానాలు ఆలస్యం లేదా రద్దు అయితే రిఫండ్/రీబుకింగ్ తప్పనిసరి. కానీ అదనపు పరిహారం ఇవ్వకపోవచ్చు. -
ఎయిర్‌పోర్టులలో గందరగోళం.. ప్రయాణికుల ఆగమాగం
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు.. ఇలా ప్రధాన నగరాల ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకులు పడిగాపులు కాస్తున్నారు. సరైన సమాచారం ఇవ్వకపోవడం.. వసతులు కల్పించడంలో విఫలం కావడంతో ఇండిగో తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విమాన సర్వీసుల రద్దు విషయంలో ఇండిగో తన చెత్త రికార్డు తానే బద్ధలు కొట్టుకుంది. ఇవాళ ఒక్కరోజే 600కి పైగా విమానాలను రద్దు చేసింది. ఇందులో ఒక్క ఢిల్లీలోనే 220 విమానాలు ఉండడం గమనార్హం. అలాగే ముంబైకి వెళ్లే 100 విమానాలను క్యాన్సిల్ చేసింది. ఇటు హైదరాబాద్‌లోనూ దాదాపు 80కిపైగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. నేటి అర్ధరాత్రి దాకా ఈ రద్దు ఉంటుందని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.My IndiGo flight was cancelled today with zero proper communication and my checked-in luggage never came back. Hundreds stranded, families crying, people missing important commitments. This isn’t a “delay issue”, it’s a complete collapse of operations. Passengers deserve better. pic.twitter.com/dak5J7p7CI— Varun Kumar (@Varun2829) December 5, 2025ప్రయాణికుల తీవ్ర అవస్థలుసిబ్బంది కొరతే ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలతో పైలెట్ల కొరత నెలకొంది. ఇండిగోతో పాటు ఇతర విమానయాన సంస్థలపైనా ఈ ప్రభావం పడింది. అయితే ఇండిగో దేశంలోనే అత్యధికంగా విమానాలు నడిపే సంస్థ కావడం, అప్పటికే అక్కడి సిబ్బంది కొరత ఉండడంతో ఎఫెక్ట్ ఈ స్థాయిలో కనిపిస్తోంది. इंडिगो की 500 फ्लाइट रद्द, एयरपोर्ट पर यात्री भड़के#Indigo #IndigoDelay #IndigoFlightsCancelled pic.twitter.com/f8coTKnWqk— Buland Bharat TV (@Bulandbharattv) December 5, 2025आज इंडिगो की 550 से ज़्यादा उड़ानें रद्द कर दी गईं। हज़ारों लोग रास्ते में फँसे हुए हैं, एक पिता अपनी बेटी के लिए सैनिटरी पैड की भीख माँगता हुआ दिखाई दिया। क्या हमारे पास कोई विमानन मंत्रालय भी है? मंत्री जी क्या कर रहे हैं?#Indigo #DGCA #IndigoDelay pic.twitter.com/uUpuAM5Dm8— Gems of Viral (@GemsofViral) December 5, 2025India’s air travel chaos deepens as new pilot safety rules and strict FDTL norms trigger mass IndiGo cancellations, long delays & stranded passengers nationwide. Crew shortages & regulatory pressure highlight India’s need for stronger aviation planning. Follow @bharat24by7 pic.twitter.com/bM9jz1EUwd— bharat24by7 (@Bharat24by7) December 5, 2025 ఈ ప్రభావంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విమానాలు ఎప్పుడు ఎగరతాయో.. తమను ఎప్పుడు తీసుకెళ్తారో అని ఎదురు చూస్తున్నారు. ఎయిర్‌పోర్టులలో తమకు సరైన సదుపాయాలు అందించడం లేదని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటు.. వాళ్లకు సరైన సమాచారం అందించలేక ఇండిగో క్షమాపణలు చెబుతోంది. వెరసి.. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులలో గందరగోళం కొనసాగుతోంది.ఇండిగో విమానాలు రద్దు కావడంతో.. అటు మిగిలిన విమాన సంస్థలు దోపిడీకి దిగాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి టికెట్ ధరలను పెంచేశాయి. ఏకంగా 40వేలు ఛార్జ్ చేస్తున్నాయి.శంషాబాద్‌లో ఉద్రిక్తత శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటల పాటు ఆలస్యం కావడంతో స్వాములు నిరసనకు దిగారు.షెడ్యూల్ ప్రకారం.. ఇండిగో విమానం గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉంది. ఈ విమానంలో వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు సాయంత్రమే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, విమానం శుక్రవారం ఉదయానికి కూడా బయలుదేరాకపోవడంతో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. 12 గంటలుగా తాము విమానాశ్రయంలోనే ఉన్నట్టు తెలిపారు. విమానం గురించి తమకు సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. గురువారం ఉదయం కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. కేరళకు వెళ్లే ఇండిగో విమానం అకస్మాత్తుగా రద్దు కావడంతో శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఎలా విమానం రద్దు చేస్తారు?” అంటూ భక్తులు విమానాశ్రయ అధికారులను ప్రశ్నించారు. విమాన రద్దుకు ప్రత్యామ్నాయంగా వెంటనే మరో సర్వీస్‌ను ఏర్పాటు చేయాలని లేదా ప్రత్యేక విమానాన్ని నడపాలని భక్తులు డిమాండ్ చేశారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ అసౌకర్యం పెరగడంతో విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. -
ఆరు ఇండిగో విమానాలు రద్దు
గోపాలపట్నం (విశాఖ): సాంకేతిక కారణాలతో దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు ప్రభావం విశాఖ విమానాశ్రయంపై కూడా పడింది. ఇక్కడ గురువారం మొత్తం ఆరు ఇండిగో విమానాలు రద్దయ్యాయని విశాఖ విమానాశ్రయం అధికారులు వెల్లడించారు. హైదరాబాద్–విశాఖ– హైదరాబాద్ (618/307), విశాఖ–బెంగళూరు–విశాఖ (217/218), చెన్నై–విశాఖ–ముంబై (557/6485), ముంబై–విశాఖ–చెన్నై (5248/845), కోల్‌కత–విశాఖ–కోల్‌కత (512/617), ఢిల్లీ–విశాఖ–ఢిల్లీ (6779/6680) విమానాలను రద్దుచేశారు. -
ఇండిగో చరిత్రలో చెత్త రికార్డు.. ఒక్కరోజే 550 విమానాలు రద్దు
న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ పౌర విమానయాన సంస్థ అయిన ఇండిగోలో విమానాల రద్దు పరంపర గురువారం సైతం కొనసాగింది. బుధవారం 200 విమానాలు రద్దుకాగా గురువారం ఒక్కరోజే మరో 550కుపైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. సాంకేతిక సమస్యలు, అననుకూల వాతావరణ పరిస్థితులు, ప్రయాణికుల రద్దీ, విమాన విధుల సమయ కాలపరిమితి(ఎఫ్డీఐఎల్) నిబంధనల అమలు వంటి సమస్యల ధాటికి ఇండిగో విమాన సర్వీసులను కంపెనీ రద్దుచేయక తప్పలేదు. సిబ్బంది కొరత, మెరుగైన జీతభత్యాల కోసం కొందరు పైలట్లు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సెలవులు పెట్టి వేరే చోట్ల ఇంటర్వ్యూలకు హాజరవడం వంటి మరెన్నో కారణాలు జతకలిసి ఇండిగో విమానసర్వీసులను మరింత ఆలస్యంచేస్తున్నాయి. దీంతో గురువారం దేశంలోని చాలా విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. సమయానికి రాకపోకలను సూచించే ఆన్‌టైమ్ పంక్చువాలిటీ(ఓటీపీ) విషయంలో ఇండిగో డిసెంబర్ మూడో తేదీన కేవలం 19.7 శాతాన్ని మాత్రమే చేరుకోగల్గిదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే 172 విమానాలు రద్దయ్యాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 118, బెంగళూరులో 100, హైదరాబాద్‌లో 75, కోల్‌కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దయ్యాయి. ఇండిగోలో తలెత్తిన సమస్యకు పైలట్ల కొరత సైతం కారణమన్న వార్తల నేపథ్యంలో ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఎల్పీఏ) ఘాటుగా స్పందించింది. ‘‘ నిరాటంకంగా విమానం నడిపే పైలట్ పూర్తి ఆరోగ్యంగా ఉండటం కోసం ‘కొత్త ఫ్లైట్ డ్యూటీ, రెస్ట్ పీరియడ్’ నిబంధనల ప్రకారం పైలట్ మరింతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక పైలట్ విశ్రాంతి/సెలవులో ఉంటే అదనపు పైలట్లతో విమాన సర్వీసుల్ని కొనసాగించాలి. అంతమంది పైలట్లు ఇండిగోలో లేరు. ఇటీవల ఇండిగో కొత్త పైలట్లను నియమించుకోవడం ఆపేసింది. దీంతో పైలట్ల కొరత ఏర్పడి విమానాలను రద్దుచేయాల్సి వస్తోంది’’ అని ఏఎల్పీఏ వ్యాఖ్యానించింది. ఇండిగో రోజుకు సగటున 2,300 విమానసర్వీసులను నడుపుతోంది.ఫిబ్రవరి 10దాకా ఇంతేసమస్య పూర్తిగా సద్దుమణగాలంటే ఫిబ్రవరి పదో తేదీదాకా ఆగక తప్పదని ఇండిగో గురువారం మరో బాంబు పేల్చింది. అంటే అప్పటిదాకా సమయానికి ఇండిగో విమాన రాకపోకలు సవ్యంగా ఉండకపోవచ్చని సంస్థ పరోక్షంగా అంగీకరించింది. ఈ మేరకు ఇండిగో గురువారం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు వివరణ ఇచ్చింది. ‘‘ రోజువారీ విమానాల సంఖ్యను డిసెంబర్ 8వ తేదీ నుంచి తగ్గిస్తాం. గతంలో మాదిరి విమానసర్వీసులు యథాతథ స్థాయికి చేరుకోవడానికి ఫిబ్రవరి10దాకా వేచి ఉంచాల్సి రావొచ్చు. రానున్న రోజుల్లో రద్దయ్యే విమానాల సంఖ్య భారీగా ఉండొచ్చు’’ అని ఇండిగో స్వయంగా ప్రకటించింది. -
సంక్షోభంలో విమానయానం: ఇండిగోకు ఉన్న ఇక్కట్లేమిటి?
తక్కువ సమయంలో సుదూర గమ్యాలకు చేరుకొనే వీలు, ప్రయాణ సౌకర్యం ఉంటుందనే భావనతో విమానయానానికి మొగ్గుచూపడం సర్వసాధారణం. కానీ, కొద్దికాలంగా విమాన యానమంటే ఎన్నడూ లేనంత అనిశ్చితి నెలకొనడం విడ్డూరం. విమాన సర్వీసుల్లో విపరీతమైన జాప్యాలు, ఆఖరి నిమిషంలో అనూహ్యంగా సర్వీసు రద్దవడాలు, ఎప్పుడు ఎలా చేరతామో తెలియని దుఃస్థితి వగైరా దేశీయంగా ప్రయాణికుల్ని భయపెడుతున్నాయి. తాజాగా ‘ఇండిగో’ విమానసేవల్లో నెలకొన్న సంక్షోభం దేశీయ విమానయాన రంగంలోని అనేక లోపాలకు అద్దం పడుతోంది. తక్షణం దిద్దుబాటు చర్యలను చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.ఇప్పుడేం జరిగింది?కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు నిర్వహణపరమైన సంక్షోభంలో చిక్కు కున్నాయి. ఒక్క డిసెంబర్ తొలి వారంలోనే కనీసం మూడు రోజులుగా కొన్ని వందల సంఖ్యలో ఫ్లైట్లు ఆఖరి నిమిషంలో రద్దయ్యాయి. ముంబయ్, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో గంటలు, పూటలకొద్దీ జాప్యాలతో లక్షలాది ప్రయా ణికులు మార్గమధ్యంలో చిక్కుకుపోయారు. అత్యవ సర పనుల మీదున్న జనం ఈ అంతులేని ప్రయాణ కష్టాలతో ఆగ్రహించారు. చివరకు కనివిని ఎరుగని ఈ సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవి యేషన్ (డీజీసీఏ) దర్యాప్తు చేప ట్టింది. సంక్షోభ కారణాలను వివరించాలనీ, విమాన సర్వీసులను చక్కదిద్దేందుకు అత్యవసర ప్రణాళికను అందజేయా లనీ ఇండిగోను గురువారం ఆదేశించింది.ఇండిగోకు ఉన్న ఇక్కట్లేమిటి?అధికారిక గణాంకాల ప్రకారం ఇండిగో దేశీయంగా 90కి పైగా, అంతర్జాతీయంగా 45కి పైగా గమ్యస్థానా లకు ప్రయాణికులను చేరుస్తోంది. దాదాపు 400 పైచిలుకు విమానాలు దానికున్నాయి. రోజూ 2300కి పైగా విమాన సర్వీసులు నడుపుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో 11.8 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించింది. 2024లో కొత్తగా 58 విమానాల్ని కూడా సమకూర్చుకుంది. అయితే, విమానయానం పెరుగుతున్న సమయంలో ఇది ఏ మాత్రం సరి పోదు. పైగా పెరుగుతున్న డిమాండ్‌కు తగ్గట్టుగా తగినంతమంది పైలట్లూ లేరు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ మాటల్లో చెప్పాలంటే, సిబ్బంది కొరత వల్లే ఈ జాప్యాలు, సర్వీసుల రద్దు లాంటి వన్నీ! ఎమిరేట్స్ ఈ వారంలోనే పెద్దయెత్తున నియా మకాలు చేపట్టడంతో ఇండిగోకు కాక్‌పిట్, క్యాబిన్ సిబ్బంది కూడా తీవ్రంగా కొరవడినట్టు భోగట్టా.కొత్త షరతులతో తలనొప్పి?లోతుకు వెళితే, వైమానిక డ్యూటీ సమయ పరిమితి (ఎఫ్డీటీఎల్)కి సంబంధించిన నిబంధనలు మారాయి. వాటిలో తొలి విడత జూలై 1 నుంచి, రెండో విడతవి నవంబర్1 నుంచి అమలయ్యాయి. పైలట్ల విశ్రాంతి, నైట్‌డ్యూటీ రూల్స్ కట్టుదిట్టమయ్యాయి. పైలట్లకు ఏకబిగిన 48 గంటల విరామమివ్వాలి, వరుసగా 2 నైట్ డ్యూటీలు మించకూడదు. వీటి వల్ల, అడిగిన వెంటనే సిబ్బంది అందుబాటులో ఉండే పాత రోజులు పోయాయి. అలాగే, చలికాలంలో సాంకేతి కంగా ఉండే చిన్న చిన్న చిక్కులు, ప్రతికూల వాతా వరణాలు, ప్రయాణాల సీజన్ కావడంతో ఉండే రద్దీ లాంటివన్నీ కలసి తలకు మించిన భారమయ్యాయి. ఒక్క నవంబర్లోనే ఇండిగో 1232 సర్వీసులు రద్దు చేసింది. ఇందులో 62 శాతం దాకా చిక్కులకు సిబ్బంది కొరత, ఎఫ్డీటీఎల్ షరతులే కారణం. వంద లాది సర్వీసులు రద్దవడంతో ఆ సంస్థ షేర్లు కూడా 3 శాతం పైగా పడిపోవడం గమనార్హం. మన దేశీయ విమానయాన మార్కెట్లో దాదాపు 65 శాతం వాటా ఇండిగోదే కావడంతో సర్వీసులో రద్దుతో ఒక్క సారిగా టికెట్ రేట్లు 3–4 రెట్లు పెరిగిపోయాయి.ఇకపై ఏం చేయాలి?ఇటీవల సాఫ్ట్వేర్ అప్డేట్ సమస్యలతో ఎయిర్ బస్‌లు స్తంభించాయి. ఇప్పుడీ ఇండిగో సమస్య. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగున్న విమాన యాన మార్కెట్ మనది. పెరుగుతున్న ఆ డిమాండ్‌కు తగ్గట్టు పైలట్లు లేరు. వచ్చే దశాబ్ద కాలంలో మనకు 30 వేల మంది కొత్త పైలట్లు కావాలి. కానీ, అందుకు తగ్గ ప్రాథమిక వసతులు, శిక్షణ సౌకర్యం, నిధులు కరవే. ఇకనైనా మరోసారి ఇలాంటి సంక్షో భాలు తలెత్తకూడదంటే, అదనపు సిబ్బంది అందు బాటులో ఉండేలా నియామకాలు పెంచుకోవడం కీలకం. తక్కువ సిబ్బంది, తక్కువ జీతాలతో ఖర్చు తగ్గించుకోవాలనే పిచ్చి ఆలోచనతో పెనాల్టీల పాలై, పేరు పోగొట్టుకునే కన్నా అది మేలు. ఖర్చు గిట్టు బాటయ్యేలా చూసుకుంటూనే నిర్వహణ సామర్థ్యం బలోపేతం చేసుకొని, సమతూకం పాటించడం అత్యవసరమన్నది తాజా ఉదంతం అన్ని ఎయిర్ లైన్స్కూ నేర్పుతున్న పాఠం. నేర్చుకోకపోతే ఈ కష్టాల సీరియల్ కొనసాగక మానదు. -
ఒక్కరోజులో 250కిపైగా విమానాలు రద్దు
-
ఇండిగోకు ఏమైంది? మరో బాంబు బెదిరింపు కాల్
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను పలు కష్టాలు ఒక్ సారిగా చుట్టుముట్టాయి. ఇండిగో విమానాలకు గురువారం కొన్ని గంటల్లోనే రెండు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగో మదీనా-హైదరాబాద్ విమానాన్ని దారి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ అయిందో లేదో మరో బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది.ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన 300కి పైగా విమానాల రద్దుతో విమాన ఆలస్యాన్ని, ప్రయాణికుల ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది ఇండిగో. తాజాగా మరో బాంబు బెదిరింపు కాల్ రావడంతో షార్జా నుంచి హైదరాబాద్ బయలుదేరిన విమానాన్ని ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ విమానం షార్జా నుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్తుండగా, గాలిలో ఉండగానే బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన స్థానిక పోలీసులు ,ముంబై విమానాశ్రయానికి చేరుకుని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళానికి సహాయం చేశారు. రెండవ బాంబు బెదిరింపుపై అధికారులు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు.గురువారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు రావడంతో మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. సౌదీ అరేబియాలోని మదీనా నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న విమానం అహ్మదాబాద్‌కు మళ్లించాల్సి వచ్చింది. విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. #WATCH | Ahmedabad, Gujarat: Atul Kumar Bansal, DCP Zone-4, Ahmedabad City, says, "Today, an Indigo flight from Medina to Hyderabad made an emergency landing at Ahmedabad Airport. This was because a threatening email about the flight was received at Hyderabad Airport. All… https://t.co/MtCKwk7fCv pic.twitter.com/TxPdRdDVfC— ANI (@ANI) December 4, 2025 -
300పైగా విమానాలు రద్దు.. ఆకాశాన్నంటిన ఛార్జీలు
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద ప్రయాణీకులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో కార్యాచరణ, సాంకేతిక సంబంధిత సమస్యల కారణంగా అనేక సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఇతర విమానయాన సంస్థల టిక్కెట్ ధరలు ఊహించని విధంగా పెరిగిపోయి ప్రయాణ ప్రణాళికలు అస్తవ్యస్తమయ్యాయి.భోపాల్‌కు రూ.1.3 లక్షలుఇండిగో కొన్ని విమానాలను రద్దు చేసుకున్న కారణంగా ఎయిర్ ఇండియా అనేక మార్గాల్లో ఏకైక ప్రత్యామ్నాయంగా నిలిచింది. దీంతో విమాన ఛార్జీలు భారీగా పెంచేసినట్లు కొందరు ప్రయాణికులు చెప్పారు. హైదరాబాద్-భోపాల్ మార్గంలో ఎయిర్ ఇండియా ఛార్జీలు దాదాపు రూ.1.3 లక్షలకు చేరుకోవడం ప్రయాణికులు షాకయ్యారు. కొన్ని సంస్థలు వెల్లడించించిన వివరాల ప్రకారం.. ముంబై, ఢిల్లీ మీదుగా హైదరాబాద్ నుంచి భోపాల్ వెళ్లే కనెక్టెడ్ ఫ్లైట్స్‌లో రాత్రిపూట టిక్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.ఎకానమీ: రూ. 1.03 లక్షలుబిజినెస్ క్లాస్: రూ. 1.3 లక్షలుఎయిరిండియా పోర్టల్‌లో ఈ అత్యధిక ధరలున్నా కేవలం ఒక సీటు మాత్రమే మిగిలి ఉన్నట్లు చూపించింది.#WATCH | Telangana: Chaos at Rajiv Gandhi International Airport in Hyderabad amid delay in IndiGo flights' movement. pic.twitter.com/U46cyOmJxZ— ANI (@ANI) December 4, 2025ఇండిగో విమానాల రద్దు ప్రభావంహైదరాబాద్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, విశాఖపట్నం, భోపాల్ వంటి ప్రధాన గమ్యస్థానాలకు ఇండిగో సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. దీనితో మిగిలిన విమానాలు, ముఖ్యంగా ఎయిర్ ఇండియా నెట్‌వర్క్‌లో టిక్కెట్ ధరలు భారీగా పెరిగాయి. విమానాశ్రయ అథారిటీ సైతం ఈ అంతరాయాలను ధ్రువీకరిస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. అనేక ఇండిగో విమానాలు ‘విమానయాన సంబంధిత సాంకేతికత, కార్యాచరణ సమస్యల వల్ల రద్దు అయ్యాయి’ అని పేర్కొంది.ఇండిగో ఎప్పుడు పూర్తిస్థాయిలో కార్యకలాపాలను పునరుద్ధరిస్తుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో విమాన ప్రయాణాలు చేయాలనుకునేవారు అందుకు సిద్ధంగా ఉండాలని తెలుస్తోంది. పెరిగిన ఛార్జీలను పర్యవేక్షించి ప్రయాణీకుల ఫిర్యాదులను సమీక్షించాలని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.ఇదీ చదవండి: రాత్రి నిద్ర లేకుండా చేసే ఆలోచన అదే.. -
IndiGo: భారీ సంఖ్యలో ఇండిగో విమానాల రద్దు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గగనతల ప్రయాణాల సంక్షోభం కొనసాగుతోంది. వివిధ ఎయిర్‌లైన్స్ విమానాల సర్వీసులు రద్దు అవుతున్నాయి. అతిపెద్ద విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించడం, మరికొన్ని రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఇందుకు కారణమైన ఆ కొత్త రూల్స్ ఏంటో తెలుసా?.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, గోవా, అహ్మదాబాద్, చెన్నై, హుబ్లీ, భోపాల్, భువనేశ్వర్ ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో ప్రయాణికుల అవస్థలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యమైన సమావేశాలు వెళ్లలేకపోతున్నామని, ఇండిగో సిబ్బంది తగిన సమాధానం చెప్పడం లేదంటూ ఆగ్రహం వెల్లగక్కతున్నారు. రీఫండ్ విషయంలోనూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఇండిగో మీద ప్యాసింజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి సాంకేతిక సమస్యలు, రద్దీ, సిబ్బంది రోస్టరింగ్ నిబంధనలు, ప్రతికూల వాతావరణం వంటివీ విమానాల రద్దుకు కారణాలుగా నిలిచాయి. అయితే.. ఈ పరిస్థితికి కారణం ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్(ఎఫ్డీటీఎల్) నిబంధనల్లో సవరణ చేయడమేనని ఇండిగో వర్గాలు చెబుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు మరింత ఎక్కువ సమయం విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. ఫలితంగా పైలట్లు, సిబ్బంది కొరత ఏర్పడింది. దాంతో అనివార్యంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని, విమానాలు ఎయిర్‌పోర్టులకే పరిమితం అయ్యాయని అంటున్నారు. ఏంటా కొత్త రూల్స్.. ?FDTL కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలి. వాటి ప్రకారం.. రాత్రి సమయంలో (రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు) డ్యూటీ గంటలు తగ్గించబడ్డాయి. వరుసగా ఎక్కువ గంటలు పని చేయకుండా, మధ్యలో ఎక్కువ విరామం తప్పనిసరి. కేబిన్ సిబ్బందికి ల్యాండింగ్స్ పరిమితం చేశారు. 11 గంటల డ్యూటీలో గరిష్టంగా 6 ల్యాండింగ్స్ మాత్రమే ఉండాలి. అలాగే.. 11.30 గంటల డ్యూటీలో గరిష్టంగా 5 ల్యాండింగ్స్ ఉండాలి. ఇక14 గంటల డ్యూటీలో (9 గంటల ఫ్లైయింగ్) కేవలం 2 ల్యాండింగ్స్ మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రతి ఏటా పైలట్లు, సిబ్బందికి ఫాటిగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ తప్పనిసరి చేశారు.అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా.. పైలట్లు, సిబ్బంది అలసట లేకుండా పని చేయడం, అలాగే ప్రయాణికుల భద్రత కోసమే ఈ రూల్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే రోస్టరింగ్ సిస్టమ్ మార్పులతో.. ఎయిర్‌లైన్స్ తమ షెడ్యూల్‌లను కొత్త నియమాలకు అనుగుణంగా మార్చుకోవాల్సి వస్తోంది. మరీ ముఖ్యంగా రాత్రిపూట నడిపించే విమానాలు, అధిక ఫ్రీక్వెన్సీ రూట్లలో అంతరాయానికి దారి తీస్తోంది. ఇలాగే ఇంకొన్ని గంటలురెండు రోజులుగా తమ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని, వారిని క్షమాపణ కోరుతున్నామని ఇండిగో యాజమా న్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్లో మార్పులతోపాటు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు పేర్కొంది. అయితే పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుందో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో రూల్స్ నుంచి పశమనం కోరుతూ డీజీసీఏను ఆశ్రయించింది. ఎఫ్డీటీఎల్ కొత్త నిబంధనలను పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ఇటీవలే జారీ చేశారు. విమాన సిబ్బంది రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలకు మించి విధులు నిర్వర్తించకూడదని ఆదేశించారు. 24 గంటల్లో కనీసం 10 గంటలు వారికి విశ్రాంతి ఇవ్వాలని పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి. మరోవైపు.. మానవ వనరుల నిర్వహణలో ఇండిగో విఫలమైందని, అందుకే విమానాలను రద్దు చేయాల్సి వచ్చినట్లు ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(అల్పా) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
200 ఇండిగో విమానాలు రద్దు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించడం, మరికొన్ని రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చిన్నపాటి సాంకేతిక సమస్యలు, రద్దీ, సిబ్బంది రోస్టరింగ్ నిబంధనలు, అననుకూల వాతావరణం వంటివీ విమానాల రద్దుకు కారణాలుగా నిలిచాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, గోవా, అహ్మదాబాద్, చెన్నై, హుబ్లీ, భోపాల్, భువనేశ్వర్ ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల గంటలకొద్దీ వేచి చూడాల్సి వచ్చింది. వారు సోషల్ మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ముఖ్యమైన సమావేశాలు వెళ్లలేకపోతున్నామని, ఇండిగో సిబ్బంది తగిన సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. ఇండిగో సంస్థ దేశంలో 2,200 విమానాలను నడిపిస్తోంది. మంగళవారం 1,400 విమానాలు ఆలస్యంగా నడిచాయి. బుధవారం 200 విమానాలు రద్దయ్యాయి. ఈ పరిస్థితికి కారణం ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్(ఎఫ్డీటీఎల్) నిబంధనల్లో సవరణ చేయడమేనని ఇండిగో వర్గాలు చెబుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు, ఇతర సిబ్బందికి మరింత ఎక్కువ సమయం విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. ఫలితంగా పైలట్లు, సిబ్బంది కొరత ఏర్పడింది. దాంతో అనివార్యంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని, విమానాలు ఎయిర్‌పోర్టులకే పరిమితం అయ్యాయని అంటున్నారు. కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాంకేతిక లోపాలతో చెక్–ఇన్ వ్యవస్థలు సరిగా పనిచేయలేదు. కౌంటర్ల ముందు ప్రయాణికులు బారులు తీరారు. మరో 48 గంటలు ఇదే పరిస్థితి! రెండు రోజులుగా తమ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని, వారిని క్షమాపణ కోరుతున్నామని ఇండిగో యాజమా న్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్లో మార్పులతోపాటు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు పేర్కొంది. మరో 48 గంటలపాటు ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఎఫ్డీటీఎల్ కొత్త నిబంధనలను పౌర విమానయాన డైరెక్టర్ జనరల్(డీజీసీఏ) ఇటీవలే జారీ చేశారు. విమాన సిబ్బంది రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలకు మించి విధులు నిర్వర్తించకూడదని ఆదేశించారు. 24 గంటల్లో కనీసం 10 గంటలు వారికి విశ్రాంతి ఇవ్వాలని పేర్కొన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి. డీజీసీఏ దర్యాప్తు ఇండిగో ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ బుధవారం ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితికి కారణం ఏమిటో తెలియజేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే విమాన సేవలను యథాతథంగా కొనసాగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారోర చెప్పాలని సూచించినట్లు వివరించారు. ఈ మేరకు డీజీసీఏ ఒక ప్రకటన విడుదల చేశారు. మానవ వనరుల నిర్వహణలో ఇండిగో విఫలమైందని, అందుకే విమానాలను రద్దు చేయాల్సి వచ్చినట్లు ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(అల్పా) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ఇండిగో సంస్థకు భారీ జరిమానా
విమానయాన సంస్థ ఇండిగోకు జీఎస్టీ అధికారులు భారీ జరిమానా విధించారు. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌కు సంబంధించి కేరళలోని సీజీఎస్టీ కొచ్చి కమిషనరేట్‌లోని సెంట్రల్ టాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ రూ .117.52 కోట్ల జరిమానా విధించారని, దీన్ని సవాలు చేస్తామని ఇండిగో తెలిపింది.ఇండిగో రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. జరిమానా 2018-19 నుంచి 2021-22 మధ్య కాలానికి సంబంధించి కంపెనీ పొందిన ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)ను డిపార్ట్మెంట్ తిరస్కరించింది. దీంతో జరిమానాతో సహా డిమాండ్ ఆర్డర్ జారీ చేసింది. ‘అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు తప్పుగా ఉన్నాయని కంపెనీ నమ్ముతోంది. అలాగే బాహ్య పన్ను సలహాదారుల సహాయంతో కేసుపై బలం తమ వైపే ఉంటుందని కంపెనీ విశ్వసిస్తోంది’ అని ఇండిగో ఫైలింగ్‌లో పేర్కొంది.పన్ను అధికారులు ఇచ్చిన జరిమానా నోటీసును తగిన అధికారుల ముందు సవాలు చేస్తామని తెలిపిన ఇండిగో యాజమాన్యం.. దీని వల్ల తమ ఆర్థిక పరిస్థితులు, నిర్వహణ లేదా ఇతర కార్యకలాపాలపై పెద్ద ప్రభావమేమీ ఉండదని వివరించింది.ఏమిటీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్?ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అనేది వ్యాపార సంస్థలు ఇన్పుట్లపై చెల్లించిన పన్నులకు క్రెడిట్ క్లెయిమ్ చేయడం ద్వారా పన్ను బాధ్యతను తగ్గించుకునేందుకు అనుమతించే జీఎస్టీ కింద ఒక యంత్రాంగం. ఈ అర్హతను ఆయా వ్యాపార సంస్థలు పొందాయా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలిస్తారు. ఒకే వేళ వ్యత్యాసాలు గుర్తిస్తే ఆ ట్యాక్స్ క్రెడిట్‌ను జరిమానాతో సహా తిరిగి వసూలు చేస్తారు. -
విమానాల కొనుగోలుకు రూ.7270 కోట్లు!: ఇండిగో
దేశీ విమానయాన కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ విమానాల కొనుగోలుకి సిద్ధపడుతోంది. ఇందుకు సొంత అనుబంధ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐఎఫ్ఎస్సీ ప్రయివేట్ లిమిటెడ్‌కు 82 కోట్ల డాలర్లు (రూ. 7,270 కోట్లు) అందించనుంది.ఇండిగో బ్రాండ్ విమాన సర్వీసుల కంపెనీ ఈక్విటీ షేర్లు, నాన్‌క్యుములేటివ్ ఆప్షనల్లీ కన్వర్టిబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు(ఓసీఆర్‌పీఎస్) జారీ ద్వారా పెట్టుబడులను సమకూర్చనుంది. ఒకేసారి లేదా దశలవారీగా వీటి జారీని చేపట్టనున్నట్లు ఇండిగో తెలియజేసింది. నిధులను ప్రధానంగా విమానాల కొనుగోలుకి వినియోగించనున్నట్లు వెల్లడించింది. ఇండిగో ఇప్పటికే 411 విమానాలను కలిగి ఉంది. వీటిలో 365 విమానాలు నిర్వహణలో ఉన్నట్లు విమాన ట్రాకింగ్ వెబ్సైట్ ప్లేన్‌స్పాటర్.నెట్ పేర్కొంది. -
విమాన ప్రయాణాలపై ‘మోంథా’ ఎఫెక్ట్
గోపాలపట్నం/విమానాశ్రయం(గన్నవరం): మోంథా తుపాను కారణంగా మంగళవారం బెంగళూరు, విశాఖ నుంచి రాకపోకలు సాగించే అన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు ఇన్చార్జ్ డైరెక్టర్ పురుషోత్తం తెలిపారు. సోమవారం ఢిల్లీ నుంచి విశాఖ రావాల్సిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో భువనేశ్వర్‌కు మళ్లించారు. వాతావరణం అనుకూలించిన కొద్ది గంటల తర్వాత ఈ విమానం విశాఖ చేరుకుంది. సోమవారం విజయవాడ–విశాఖ–హైదరాబాద్, బెంగళూరు–విశాఖ–బెంగళూరు ఎయిరిండియా విమానాలు రద్దయినట్లు పురుషోత్తం చెప్పారు.అలాగే, గన్నవరం విమానాశ్రం నుంచి రాకపోకలు సాగించే అన్ని ఎయిరిండియా విమాన సర్విస్లను కూడా మంగళవారం రద్దు చేశారు. రెండు న్యూఢిల్లీ సర్వీస్‌లతోపాటు ముంబయి సర్విస్ రద్దయినట్లు ఎయిరిండియా ప్రతినిధులు తెలిపారు. ఇండిగో విమాన సంస్థ కూడా మంగళవారం ఉదయం సర్వీస్‌లు మినహా అన్ని విమానాలను రద్దు చేసింది. ఉదయం 10.35 గంటలలోపు హైదరాబాద్, చెన్నైతోపాటు న్యూఢిల్లీ సర్విస్లు మాత్రమే నడుస్తాయని ఇండిగో ప్రతినిధులు తెలిపారు. ఆ తర్వాత అన్ని విమాన సర్వీస్‌లను రద్దు చేసినట్లు పేర్కొంది. -
ఇండిగో విమానంలో కలకలం..ఫ్యూయల్ ట్యాంక్ లీక్
ఢిల్లీ: ప్రముఖ విమానయాన రంగ సంస్థ ఇండిగోలో కలకలం రేగింది. కోల్‌కతా నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం 6E 6961లో ఫ్యూయల్ ట్యాంక్ లీకైంది. దీంతో అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని ఉత్తరప్రదేశ్ లాల్‌బహుదూర్ శాస్త్రి ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇండిగో విమానంలో 166మంది ప్రయాణికులున్నారు.అత్యవసర ల్యాండింగ్ కారణంగా విమానంలోని ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి అపాయం సంభవించలేదని, సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో యాజమాన్యం ప్రకటించింది. ల్యాండింగ్ తర్వాత విమానంలోని ఫ్యూయల్ లీకేజీ సమస్యని పరిష్కరించి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్లు సమాచారం. -
విన్నింగ్ కెప్టెన్ న్యూ కెప్టెన్
విమానంలో క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ కనిపించడం విశేషం కాకనొవచ్చు. అయితే ఈసారి మాత్రం విశేషంగా మారింది. ఇండిగో ఆహ్వానం మేరకు విమానంలోకి అడుగుపెట్టిన కపిల్‌దేవ్ కొత్తగా కెప్టెన్‌గా ప్రమోట్ అయిన ప్రియాంక యూనిఫామ్‌కు చారలపట్టి పిన్ చేశారు. ఈ ఫోటోని విమానయాన సంస్థ ఇండిగో ‘ఎక్స్’లో తన అఫీషియల్ ఎకౌంట్లో షేర్ చేసింది. ‘ఇది చిరస్మరణీయంగా గుర్తుండి పోయే సందర్భం. కెప్టెన్ కావడం అనేది చిన్న విషయమేమీ కాదు. ప్రియాంకకు తన విజయాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకునే మధుర జ్ఞాపకం’ ... ఇలాంటి కామెంట్లు ఇండిగో పోస్ట్‌లో కనిపిస్తాయి.‘చూడముచ్చటైన దృశ్యం. గోవా టు దిల్లీ ఫ్లైట్‌లో ఈ అపురూప దృశ్యాన్ని చూసే అవకాశం నాకు వచ్చింది’ అని రాశారు అదే ఫ్టైట్‌లో ప్రయాణించిన ఒక యూజర్. ‘ఫ్రమ్ ఏ విన్నింగ్ కెప్టెన్ టు ఏ న్యూ కెప్టెన్’ అన్నారు ఒకరు. ‘కెప్టెన్ ప్రియాంక నేపథ్యం ఏమిటి? ఆ స్థాయికి రావడానికి పడిన కష్టాల గురించి రాసి ఉంటే ఎంతో మందికి స్ఫూర్తిగా ఉండేది’ అని రాశారు ఒక యూజర్. Becoming a Captain is no small feat and having Mr. Kapil Dev pin her stripes made Captain Priyanka’s achievement a moment she’ll always treasure. There’s indeed no better way to say Hello, Captain! #goIndiGo@therealkapildev pic.twitter.com/09tgA7cowR— IndiGo (@IndiGo6E) October 4, 2025(చదవండి: నెల జీతం వస్తోంది కానీ... విత్ డ్రా చేయలేకపోతున్నాను..!) -
ఛార్జీల నియంత్రణకు డీజీసీఏ చర్యలు
దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో విమానయాన రంగంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు విపరీతంగా పెరగకుండా నిరోధించడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక చర్యలు తీసుకుంటుంది. ప్రయాణికులకు సరసమైన ధరలు లభించేలా చూడటానికి దేశీయ విమానయాన సంస్థలు తమ విమాన సామర్థ్యాన్ని పెంచాలని రెగ్యులేటర్ ఆదేశించింది.పండుగ కాలంలో టికెట్ ధరలు పెరగడం వల్ల ప్రయాణికులపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు విమానయాన సంస్థలతో ఈ సమస్యను ముందుగానే చర్చించినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన మార్గాల్లో విమాన ఛార్జీల పోకడలను సమీక్షించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అధిక డిమాండ్ ఉన్న దీపావళి, క్రిస్మస్ వంటి పండుగ సమయాల్లో ఛార్జీల హెచ్చుతగ్గులపై ప్రయాణికుల నుంచి ఇటీవల ఫిర్యాదుల పెరుగుతున్న దృష్ట్యా డీజీసీఏ ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.భారతదేశంలో ‘ఓపెన్ స్కైస్ పాలసీ’ ప్రకారం విమానయాన సంస్థలకు తమ ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఛార్జీలు అసమానంగా పెరిగితే జోక్యం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని అధికారులు స్పష్టం చేశారు. పండుగ సీజన్లో ప్రయాణీకుల ప్రయోజనాలను కాపాడటానికి విమాన ఛార్జీలు, విమాన సామర్థ్యాలపై కఠినమైన పర్యవేక్షణ కొనసాగుతుందని డీజీసీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు.డీజీసీఏ సలహాకు అనుగుణంగా ప్రధాన విమానయాన సంస్థలు అదనపు విమానాలను మోహరిస్తున్నాయి. ఈ అదనపు విమానాలు అక్టోబర్, నవంబర్ నెలల్లో సేవలందించనున్నాయి. దేశంలో 64.2 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉన్న ఇండిగో 42 సెక్టార్లలో 730 అదనపు విమానాలను నడపనుంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కలిసి 20 మార్గాల్లో సుమారు 486 విమానాలను జోడించనున్నాయి. స్పైస్ జెట్ 38 సెక్టార్లలో 546 అదనపు సేవలను మోహరించనుంది.ఇదీ చదవండి: మేనేజర్ కావాలనే నాపై కక్ష కట్టాడు! -
ఎలుక హల్చల్.. మూడు గంటలు ఆలస్యంగా ఇండిగో విమానం టేకాఫ్
కాన్పూర్: 172 మంది ప్రయాణికులతో బయలుదేరేందుకు సిద్ధమైన ఇండిగో విమానం ఒక ఎలుక కారణంగా మూడు గంటలు ఆలస్యంగా టేక్ ఆఫ్ అయ్యింది. కాన్పూర్ నుండి ఢిల్లీకి వెళ్లే విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానపు సిబ్బంది క్యాబిన్లో ఎలుక కనిపించడంతో ఎలుకను వెదికి పట్టుకునేందుకు ముందుగా ప్రయాణికులను కిందకు దింపారు. ఎలుకను పట్టుకుని, దానిని తొలగించిన తర్వాత విమానం బయలుదేరింది.షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ-కాన్పూర్ ఇండిగో విమానం ఆదివారం మధ్యాహ్నం 2.10 గంటలకు చకేరి విమానాశ్రయం(కాన్పూర్)లో ల్యాండ్ అయింది. ఆ విమానం మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ఆ సమయంలో విమానంలో దాదాపు 172 మంది ప్రయాణికులున్నారు. టేకాఫ్‌కు సిద్ధం అయ్యేంతలో క్యాబిన్ లోపల ఒక ఎలుక పరిగెత్తుతున్నట్లు సిబ్బంది ఒకరు గమనించారు. ఆయన ఈ విషయాన్ని సీనియర్ అధికారులకు తెలియజేయగా, తొలుత ప్రయాణికులందరినీ దింపి, లాంజ్‌కు తరలించారు. ఎలుకను పట్టుకుని , దానిని తొలగించిన తర్వాత ప్రయాణికులను విమానంలోనికి ఎక్కాలని కోరారు. విమానం సాయంత్రం 4.50 గంటలకు బయలుదేరింది. కాన్పూర్ విమానాశ్రయ మీడియా ఇన్ఛార్జ్ వివేక్ సింగ్ విమానంలో ఎలుక ఉందని ధృవీకరించారు. ఎలుకను పట్టుకునేందుకు దాదాపు గంటన్నర సమయం పట్టిందన్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని నివారించేందుకు రిఫ్రెష్మెంట్లు, ఇతర ఏర్పాట్లు చేసినట్లు ఇండిగో అధికారులు తెలిపారు. -
లక్నో-ఢిల్లీ ఇండిగో విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య
-
దేశీయ అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా ఇండిగో
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో భారతదేశపు అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సంస్థగా అవతరించింది. ప్రస్తుతం 43 విదేశీ నగరాలకు విమానాలు నడుపుతూ ఈ ఘనత దక్కించుకుంది. తర్వాతి స్థానంలో ఎయిరిండియా(స్టాండలోన్-ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను మినహాయిస్తే) 42 అంతర్జాతీయ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతోంది.14 ఏళ్ల క్రితం దిల్లీ-దుబాయ్ మధ్య ఒకే విమానంతో అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించిన ఇండిగో విమానయాన సంస్థకు ఈ ఘనత ఓ మైలురాయిగా నిలుస్తుందని కంపెనీ అధికారులు చెప్పారు. ఆసియా, మిడిల్ఈస్ట్, యూరప్ అంతటా కొత్త మార్కెట్లలో దూకుడుగా విస్తరించాలన్న ఇండిగో వ్యూహానికి ఇది ప్రేరణగా నిలుస్తున్నట్లు తెలిపారు.గతంలో ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న ఎయిరిండియా ఇటీవల తనకుతాను విధించుకున్న ‘సేఫ్టీ పాజ్’, కొన్ని ప్రాంతాల్లో విమానాల రద్దు కారణంగా అంతర్జాతీయ సేవల్లో అంతరాయం నెలకొంది. ఇది ఇండిగోను ముందుంచేలా చేసిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలాఉండగా, ఇండిగో 2025 చివరి నాటికి లండన్, కోపెన్ హాగన్, సీమ్ రీప్‌తో సహా అనేక కొత్త మార్గాలను ప్రారంభించాలని యోచిస్తోంది. దేశీయ అంతర్జాతీయ విమాన కార్యకలాపాల్లో ఇండిగో సుమారు 30% వాటాను కలిగి ఉంది. ఈ సంఖ్యను 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 40%కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: మొదటిసారి అప్పు చేస్తున్నారా? -
‘ఇండిగో’లో మందుబాబు హల్చల్.. షాకిచ్చిన ఎయిర్ లైన్స్
న్యూఢిల్లీ: ఇండిగో విమానంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ నుండి కోల్‌కతాకు వెళుతున్న ఇండిగో విమానం 6ఈ 6571లో ఒక ప్రయాణికుడు మద్యం మత్తులో గందరగోళం సృష్టించాడు. విమానంలోని క్యాబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టాడనే ఫిర్యాదులు అందాయి. An IndiGo Spokesperson says, "We are aware of an incident of unruly behaviour onboard IndiGo flight 6E 6571 operating from Delhi to Kolkata on 01 September 2025. One of the customers onboard, under the influence of alcohol, was found to be misbehaving with the cabin crew and…— ANI (@ANI) September 3, 2025ఈ ఘటనను ధృవీకరించిన ఇండిగో ఎయిర్‌లైన్స్..విమానయాన ప్రోటోకాల్‌ల ప్రకారం, ప్రయాణికుడిని విమానం కోల్‌కతాకు చేరుకున్న తర్వాత భద్రతా సిబ్బందికి అప్పగించింది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు భంగం కలిగించినందుకు అతనిపై చర్యలు తీసుకోనున్నారు. 31డీ సీటులో కూర్చున్న ప్రయాణికుడు విమానంలో మద్యం సేవించాడు. మతపరమైన నినాదాలు చేస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేశాడు.అయితే ఈ ఆరోపణలకు అతను ఖండించాడు. విమానాశ్రయంలో ఎక్కే ముందే తాను బీరు తాగానని, కొనుగోలు రసీదును రుజువుగా చూపాడు. -
ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ముంబై: బ్యాంకాక్–ముంబై ఇండిగో విమానానికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. శనివారం వేకువజామున ముడు గంటల సమయంలో ముంబై విమానాశ్రయంలో ఎయిర్‌బస్ విమానం లాండయ్యింది. ఆ సమయంలో విమానం తోకభాగం రన్‌వేను తాకింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం తక్కువ ఎత్తులో విమానాశ్రయం చుట్టూ ఎగురుతూ ల్యాండ్ అయ్యే సమయంలో ఘటన చోటుచేసుకుంది. అనంతరం మరో ప్రయత్నంలో సురక్షితంగా ల్యాండైంది. ఈ నేపథ్యంలో విమానం పైలట్, కోపైలట్లను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు డీజీసీఏ తెలిపింది.ఈ నేపథ్యంలో ఘటనపై ఇండిగో ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండగా ఇండిగో ఎయిర్‌బస్ A321 విమానం తోక రన్‌వేను తాకింది. ఆ తర్వాత, విమానం మరొక సమీపానికి వెళ్లి సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రామాణిక ప్రోటోకాల్‌ను అనుసరించి, విమానం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించే ముందు అవసరమైన తనిఖీలు, మరమ్మతుల అనుమతి తర్వాతే వెళుతుంది. ప్రయాణికులు, సిబ్బంది, విమానాల భద్రత మా మొదటి ప్రాధాన్యత. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.IndiGo plane tail touches runway at Mumbai amid bad weather@tweets_amit with more details#indigoflight #Mumbai @suyeshasavant pic.twitter.com/nDzTY1yxFe— IndiaToday (@IndiaToday) August 16, 2025 -
అనుమతిస్తే పునప్రారంభానికి సిద్ధం: ఇండిగో
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరిన వెంటనే చైనాకు ప్రత్యక్ష విమాన సర్వీసులను పునరుద్ధరించేందుకు ఇండిగో సిద్ధమవుతోందని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) పీటర్ ఎల్బర్స్ తెలిపారు. కొవిడ్-19 పరిణామాల కారణంగా 2020 ప్రారంభంలో నిలిపివేసిన చైనా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆంక్షలకు ముందు ఈ సంస్థ న్యూఢిల్లీ నుంచి చెంగ్డూ, కోల్‌కతా-గ్వాంగ్ జౌ మధ్య రోజువారీ సర్వీసులను నడిపేది.ద్వైపాక్షిక ఒప్పందంపై ఆశలు..ప్రత్యక్ష విమాన కనెక్టివిటీని పునరుద్ధరించడానికి భారత్, చైనాలు సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, అధికారిక అనుమతులు ఇంకా ఖరారు కాలేదు. ప్రత్యక్ష సేవలను తిరిగి ప్రారంభించేందుకు మార్గాలను అన్వేషించడానికి ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రతినిధి స్థాయి చర్చలు జరిగాయి. కొవిడ్-19కు ముందు తాము చైనాకు విమానాలు నడిపేవారమని, ప్రభుత్వం ఒక ఒప్పందానికి వస్తే వాటిని పునప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని ఎల్బర్స్ చెప్పారు. 2020 ప్రారంభం నుంచి భారతదేశం-చైనా మధ్య ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ లేదు. ఆ ఏడాది చివర్లో లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో జరిగిన సైనిక ఘర్షణలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇది దౌత్య, ఆర్థిక సంబంధాలపై ప్రభావాన్ని చూపింది. ప్రస్తుతం భారతదేశం-హాంకాంగ్ మధ్య విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అక్కడి నుంచి చైనాకు వెళ్లాల్సి ఉంటుంది.ప్రధాన సమస్యప్రస్తుతం జరుగుతున్న చర్చల్లో భారత విమానయాన సంస్థలపై చైనా విధించిన విమాన ఛార్జీల నిబంధనల అంశం ప్రాధానమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఛార్జీలను నిర్ణయించడానికి విమానయాన సంస్థలకు అనుమతిస్తూ, అధిక ధరల స్వేచ్ఛ కోసం భారత్ ఒత్తిడి తెస్తోంది. చైనాలో తమ గత నిర్వహణ అనుభవాలపై భారత ప్రభుత్వం విమానయాన సంస్థల నుంచి ఫీడ్‌బ్యాక్ కోరిందని సీనియర్ అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: మరో టాప్ కంపెనీలో లేఆఫ్స్ పర్వంఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరితే భారత విమానయాన మార్కెట్లోకి చైనీస్ చౌక ధరల విమానయాన సంస్థల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇది ద్వైపాక్షిక పర్యాటకం, వ్యాపార ప్రయాణాన్ని పెంచే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ఐదేళ్ల విరామం తర్వాత ఇటీవల చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలు జారీ చేసే ప్రక్రియను తిరిగి ప్రారంభించింది. -
ఇండిగోకు భారీ జరిమానా.. ప్రయాణికురాలు ఏం చేసిందంటే?
ఢిల్లీ: ఇండిగో ఎయిర్ లైన్స్‌కు ఢిల్లీ వినియోగదారుల ఫోరం భారీ జరిమానా విధించింది. విమానంలో ఓ ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, అసౌకర్యవంతమైన సీటును కేటాయించినందుకుగాను రూ.1.5 లక్షల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. ఈ కేసుకు సంబంధించి ఆమె ఖర్చు చేసిన రూ.25,000 కూడా చెల్లించాలని ఆదేశించింది.వివరాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి ఐదో తేదీన పింకీ అనే మహిళ బాకు-ఢిల్లీ ఇండిగో విమానంలో ప్రయాణించింది. ఈ సందర్భంగా విమానంలో తనకు అపరిశుభ్రమైన సీటు కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం, ఈ ఘటనపై ఢిల్లీలోని వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీని వల్ల తాను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పడినట్లు తెలిపారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్ అపరిశుభ్రమైన, అసౌకర్యవంతమైన సీటును కేటాయించినందుకుగాను ఇండిగో ఎయిర్ లైన్స్‌కు రూ.1.5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సదరు ప్రయాణికురాలికి చెల్లించాల్సిందిగా ఆదేశించింది. అలాగే, ఈ కేసుకు సంబంధించి ఆమె ఖర్చు చేసిన రూ.25,000 కూడా చెల్లించాలని పేర్కొంది.అయితే.. ఈ ఆదేశాలను ఇండిగో వ్యతిరేకించింది. ప్రయాణికురాలికి కేటాయించిన సీటు సరిగ్గా లేకపోడంతో ఆమె అభ్యర్థన మేరకు తాము వేరే సీటు కేటాయించినట్లు తెలిపింది. అనంతరం ఆమె సౌకర్యవంతంగా తన ప్రయాణాన్ని పూర్తి చేసినట్లు పేర్కొంది. అయినప్పటికీ వినియోగదారుల ప్రయాణ సమాచారాన్ని తెలిపే రికార్డులలో భాగమైన సిట్యువేషన్ డేటా డిస్ప్లే నివేదికను సమర్పించడంలో ఎయిర్‌లైన్స్ విఫలమైందని తెలిపింది. అందుకే జరిమానాను చెల్లించాల్సిందేనని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది. -
మీకు దండం పెడతా.. దయచేసి కూర్చోండి..!
ముంబై: అది ఇండిగో విమానం.. ముంబై నుంచి వారణాసి వెళ్లాల్సిన ప్రయాణికులంతా తమ తమ సీట్లలో కూర్చొని ఉన్నారు. అయితే టేకాఫ్‌కు ముందు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ విమానం రెండు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. ఈ మధ్యలో చోటు చేసుకున్న రభస అంతా ఇంతా కాదు. సీట్లలో కూర్చొన్న ప్రయాణికలు ఒక్కొక్కరిగా తమ నిరసనను ఉధృతం చేశారు. తొలుత కొంత ఓపిక పట్టిన ప్రయాణికులు.. ఆపై తమ సహనం కోల్పోయారు. విమానం ఎప్పుడు బయల్దేరుతుందో చెప్పాలంటూ విమాన సిబ్బందిపై ప్రశ్నలు వర్షం కురిపించారు. అయితే విమానం లోపల ఉన్న ఎయిర్ హోస్టస్ వద్ద కచ్చితమైన సమాధానం లేకపోవడంతో ప్రయాణికుల్ని బ్రతిమాలుకున్నారు. ప్లీజ్.. మీకు చేతులెత్తి దండం పెడతా.. దయచేసి ఎవరి సీట్లలో వారు కూర్చోండి’ అంటూ ఒక ఎయిర్ హోస్టెస్ ఓ ప్రయాణికుడ్ని బ్రతిమాలుతున్న వీడియో వైరల్‌గా మారింది. విమానంలోని ఈ రగడ జరిగే సమయంలో ఎవరో వీడియో తీసి పోస్ట్ చేస్తే అది వైరల్‌గా మారింది. ఇదంతా శనివారం(జూలై 26) రాత్రి ముంబై నుంచి వారణాసి బయల్దేరే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి గం. 9. 45 ని.లకు బయల్దేరాల్సిన విమానం.. టేకాఫ్ కావడానికి సుమారు రెండు గంటలు ఆలస్యమైంది. ఆ విమానం రాత్రి గం. 11.40 ని.లకు టేకాఫ్ అయ్యింది. -
ఇండిగో వెంచర్స్‌కు పెట్టుబడులు
ముంబై: విమానయాన దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కార్పొరేట్ వెంచర్ క్యాపిటల్ విభాగం ఇండిగో వెంచర్స్ తొలి ఫండ్ ద్వారా రూ. 450 కోట్లు సమీకరించింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతితో గతేడాది ఆగస్ట్‌లో రూ. 600 కోట్ల సమీకరణ లక్ష్యంగా తొలిసారి ఫండ్‌కు తెరతీసింది. తొలి దశలో రూ. 450 కోట్లు సమకూర్చుకున్నట్లు ఇండిగో వెంచర్స్ తెలియజేసింది. కాగా.. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన ఏరోస్పేస్ స్టార్టప్ జే ఏరోస్పేస్లో తొలి పెట్టుబడికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించింది. అయితే పెట్టుబడి వివరాలు వెల్లడించలేదు. నిధులను అడ్వాన్స్డ్ డిజిటల్ తయారీ మౌలికసదుపాయాలు, ఏఐ ఆధారిత ఉత్పాదకత పెంపు(ప్రొడక్షన్ ఆప్టమైజేషన్), సరఫరా చైన్ వ్యవస్థలను ఏకంచేసే ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి, ఇంజినీరింగ్, ప్రొడక్షన్ నిపుణులను ఆకట్టుకోవడం తదితరాలకు వినియోగించనున్నట్లు ఇండిగో వెంచర్స్ వివరించింది. విమానయానం, తత్సంబంధిత రంగాలలో స్టార్టప్‌లకు ప్రాథమిక దశలో పెట్టుబడులను సమకూర్చేందుకు ఇండిగో వెంచర్స్ ఫండ్‌కు తెరతీసింది. బీఎస్ఈలో ఇండిగో షేరు 0.8 శాతం బలపడి రూ. 5,847 వద్ద ముగిసింది. -
పోయి చెప్పులు కుట్టుకో!
న్యూఢిల్లీ: ప్రైవేట్ విమానాయాన సంస్థ ఇండిగోలో పై కుల వివక్ష పూరిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురిపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఆఫీసులో తన కుమారుడిపై ముగ్గురు సహోద్యోగులు దుర్భాషలాడారని బాధితుడు శరణ్‌కుమార్ తండ్రి అశోక్‌కుమార్ తెలిపారు. కాక్‌పిట్‌లో కూర్చో వడానికి, విమానం నడపడానికి అర్హతలేదని, వెళ్లి చెప్పులు కుట్టుకోవాలంటూ తన కొడుకును అవ మాన పరిచారని ఆయన పేర్కొన్నారు. బాధితుని తండ్రి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ విషయం సోమ వారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇండిగోలో పనిచేస్తున్న శరణ్‌కుమార్ వేతనంలో అనధికార కోతలు విధించారు. ఎలాంటి కారణం లేకుండా సిక్లీవ్స్ను తగ్గించారు. సిబ్బంది ప్రయాణం, ఏసీఎమ్ సౌకర్యాలను రద్దు చేశారు. చివరకు రాజీనామా చేయాలంటూ లేఖ జారీ చేశారు. దీంతో ఆయన దిద్దుబాటు శిక్షణ పొందవలసి వచ్చింది. అయితే.. దీనిపై ప్రశ్నించినందుకు సహచరులు తపస్ డే, మనీష్ సహానీ, రాహుల్ పాటిల్‌లు శరణ్కుమార్పై కుల వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. ‘మా ముందు కూర్చుని, మ మ్మల్ని వివరణ అడిగే ధైర్యం ఉందా? ఈ భవనంలో వాచ్‌మన్‌గా ఉండే అర్హత కూడా లేని నువ్వు వివరణ అడుగుతున్నావా? మీరు విమానం నడపడానికి అర్హులు కాదు.తిరిగి వెళ్లి చెప్పులు కుట్టండి. మీరు షూ తుడవడానికి కూడా పనికి రారు’ అంటూ అవమా నించారు. ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈఓ, ఎథిక్స్ కమిటీకి నివేదించినప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో.. శరణ్ తండ్రి అశోక్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సహోద్యోగులు నిరంతరం తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తన కొడుకును అవమానించే ఉద్దేశంతోనే కులం గురించి స్పష్టంగా ప్రస్తావించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదు ఆధారంగా, ముగ్గురు నిందితులపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కులం పేరుతో దూషిస్తూ.. ఇండిగో సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ ట్రైనీ పైలట్ ఒకరు.. సంచలన ఆరోపణలకు దిగారు. తనను కులం పేరుతో అతిదారుణంగా దూషించారంటూ సహచరులపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురుగ్రామ్‌లోని ఎయిర్‌లైన్స్ హెడ్‌క్వార్టర్స్ ఈ ఘటన జరగ్గా.. పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. బెంగళూరుకు చెందిన శరణ్ కుమార్(35) అనే ఇండిగో ట్రైనీ పైలట్.. ఎమ్మార్ క్యాపిటల్ టవర్ 2లో జరిగిన మీటింగ్‌కు హాజరయ్యారు. ఆ టైంలో మరో ముగ్గురు ఉద్యోగులు అతన్ని ఉద్దేశించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. శరణ్ తండ్రి అశోక్ కుమార్ చేసిన ఫిర్యాదులో.. ‘‘కాక్ పిట్లో కూర్చుని విమానం నడిపేందుకు నీకు(శరణ్‌ను ఉద్దేశించి..) అర్హత లేదు. ఇండిగోలో గుమాస్తాగా కాదు కదా.. కనీసం మా బూట్లు నాకడానికి కూడా నువ్వు పనికి రావు. పోయి.. మీ తాతముత్తాతల్లాగా చెప్పులు కుట్టుకుని పని చేసుకుంటూ బతుకు’’ అంటూ తనపై వ్యాఖ్యలు చేశారని తపస్ డే, మనిష్ సహానీ, రాహుల్ పాటిల్‌పై శరణ్ ఫిర్యాదు చేశారు. అంతేకాదు..తన కుమారుడి విషయంలో ఎయిర్‌లైన్స్ వాళ్లు దారుణంగా వ్యవహరించారని.. ఈ విషయాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎథిక్స్ కమిటీ, ఆఖరికి ఆ సంస్థ సీీఈవో దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేవని అశోక్ మీడియా ముందు వాపోయారు. అంతేకాదు.. తన కొడుకు విధినిర్వహణలో సక్రమంగా ఉన్నప్పటికీ సెలవులు ఇవ్వకుండా, పైగా జీతాల్లో కోతలు పెట్టారని ఆరోపించారాయన. ఘటనపై బీఎన్ఎస్లోని పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. అయితే ఈ ఘటన జరిగింది గురుగ్రామ్(హర్యానా)లోని కార్పొరేట్ ఆఫీస్ పరిధిలో. దీంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బెంగళూరు పోలీసులు.. గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్-1 పీఎస్‌కు కేసును బదిలీ చేశారు. -
విమానం నుంచి ‘మేడే కాల్’.. తప్పిన పెను ప్రమాదం
ఇండిగో విమానం నుంచి ‘మేడే కాల్’తో ఒక్కసారిగా కలకలం రేగింది. గువహటి నుంచి చెన్నైకి వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. పెను ప్రమాదమే తప్పడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఈ ఘటన మూడు రోజుల క్రితమే జరగ్గా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.గువహటి నుంచి చెన్నైకి ప్రయాణికులతో గురువారం సాయంత్రం 4:40 గంటలకు బయలుదేరిన ఇండిగో విమానం.. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో ఇంధనం చాలా తక్కువగా ఉందని పైలట్ గమనించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)కి ‘మేడే’ సందేశం పంపారు.దీంతో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వైద్య, అగ్నిమాపక సేవలతో సహా అత్యవసర సేవల బృందాలను మోహరించారు. రాత్రి 8:20 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. 168 మంది ప్రయాణికులు విమానంలో ఉండగా.. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.మేడే కాల్ అంటే..ఎవరైనా పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. సహాయం కోసం మేడే కాల్ ఇచ్చిన పైలట్ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్‌ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్‌లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు. ఎప్పటి నుంచి వాడుతున్నారో తెలుసా..?విమాన ప్రమాదాలు జరిగిన ప్రతిసారి ఒక పదం ప్రధానంగా వినిపిస్తుంది. అదే ‘మేడే’. ఏదైనా పౌర విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) కేంద్రానికి సహాయం కోసం ఆ విమానం పైలట్ పంపే అభ్యర్థనే ఈ ‘మేడే’. పైలట్ మేడే.. మేడే.. మేడే అని మూడుసార్లు పలికి సిగ్నల్ పంపాడంటే విమానం అత్యంత ప్రమాదంలో ఉందని అర్థం. ఈ పదానికి అర్థమేంటి? సివిల్ ఏవియేషన్ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్‌లోని క్రోయ్డన్ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్‌గా పనిచేసిన ఫ్రెడరిక్ స్టాన్లీ మాక్‌ఫీల్డ్ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. ఇది ఫ్రెంచ్ పదమైన మైడెర్‌కు సమానార్థకం. ఫ్రెంచ్‌లో మైడెర్ అంటే సహాయం చేయండి (హెల్ప్ మీ) అని అర్థం. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్ ఏవియేషన్ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. అత్యవసర సమయాల్లో మేడేతోపాటు ఎస్ఓఎస్ పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ, మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది. -
ఇండిగో ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు కాల్
-
విమాన సిబ్బంది తీరుపై అసహనం
ఎయిర్‌పోర్ట్‌లో విమాన ప్రయాణ సంస్థ సిబ్బంది సరిగా వ్యవహరించకపోవడంతో దాదాపు రూ.2.65 లక్షల విలువైన క్లయింట్ డీల్‌ను కోల్పోయినట్లు లింక్డ్ఇన్లో ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన జైపూర్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ఇండిగో సిబ్బంది సరిగా వ్యవహరించకపోవడం వల్ల తాను ప్రయాణించాలనుకున్న విమానాన్ని మిస్సయ్యానని ఓ వ్యక్తి తెలిపారు.చయాన్ గార్గ్ అనే ప్రయాణికుడు ‘ఇండిగో, మీరు దిగజారుతున్నారు’ అనే శీర్షికతో ఓ పోస్ట్ చేశారు. ‘నేను జైపూర్ నుంచి ముంబయి వెళ్లాలనుకున్నాను. దాంతో తెల్లవారుజామున 4:40 గంటలకు జైపూర్ విమానాశ్రయానికి చేరుకున్నాను. 5:10 గంటలకు సెక్యూరిటీ క్లియర్ చేశాను. 10-15 నిమిషాల్లో బోర్డింగ్ ప్రారంభమవుతుందని ఇండిగో ఎగ్జిక్యూటివ్ చెప్పారు. బోర్డింగ్ గేటు రద్దీగా ఉండటాన్ని గమనించి బోర్డింగ్ ప్రారంభానికి ముందు వాష్ రూమ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నేను 12 నిమిషాల్లో తిరిగి వచ్చాను. అంతలోనే బోర్డింగ్ మూసివేశారు. ఆ సమయానికి బోర్డింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, మూసివేతపై ఆశ్చర్యపోయాను. గేటు మూసివేస్తున్నారని ఎలాంటి ప్రకటనలు చేయలేదు’ అని చెప్పారు.ఇదీ చదవండి: యాపిల్ కొత్త ఓఎస్ గురించి తెలుసా..?ఎయిర్పోర్ట్ సిబ్బందిని ప్రశ్నించగా జైపూర్ విమానాశ్రయంలో బహిరంగ ప్రకటన అవకాశాలు పరిమితంగా ఉన్నాయని తెలియజేసినట్లు గార్గ్ చెప్పారు. ఫ్లైట్ సిబ్బందిని వేడుకున్నప్పటికీ, తాను వెళ్లాల్సిన క్లయింట్ సమావేశం ఎంత అత్యవసరమో వివరించినప్పటికీ బోర్డింగ్ క్లియర్ చేయలేదని తెలిపారు. ప్రయాణానికి ప్రత్యామ్నాయం చూపలేదని చెప్పారు. టికెట్‌ఫేర్ రీఫండ్ ఇవ్వలేదన్నారు. కనీసం సిబ్బంది తనపై సానుభూతి చూపలేదని వాపోయారు. ఈ వ్యవహారం వల్ల తాను క్లయింట్‌ను కోల్పోయానని చెప్పారు. దీని విలువ రూ.2.65 లక్షలు, నెల రోజుల శ్రమ క్షణాల్లో వృథా అయిందని తెలిపారు.ఇండిగో స్పందనగార్గ్ లింక్డ్ఇన్ పోస్ట్‌కు ప్రతిస్పందనగా ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రామాణిక విధానాలను అనుసరించామని పేర్కొంటూ ప్రయాణికుడి నిరాశను అంగీకరించింది. ‘డియర్ మిస్టర్ గార్గ్, ఫ్లైట్ మిస్ అవ్వడం ఎంత నిరాశ కలిగిస్తుందో మాకు తెలుసు. మేము జాగ్రత్తగా ప్లాన్ చేసిన సమయానికి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేయాలనుకుంటున్నాం. మా సమీక్ష ప్రకారం ప్రామాణిక ప్రక్రియకు అనుగుణంగా బయలుదేరడానికి 25 నిమిషాల ముందు బోర్డింగ్ గేట్ మూసివేశారు. దురదృష్టవశాత్తూ గేటు మూసివేసిన తరువాత మీరు వచ్చారు. అప్పటికి టేకాఫ్ కోసం తుది సన్నాహాలు జరుగుతున్నాయి. మా ఎయిర్పోర్ట్ సిబ్బంది తదుపరి అందుబాటులో ఉన్న విమానాన్ని మీకు సూచించారు. అందులో ప్రయాణించకూడదనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం. ఇండిగో వినియోగదారులందరికీ అంతరాయం లేని ప్రయాణాల కోసం నిరంతరం పనిచేస్తోంది’ అని తెలిపింది. -
భారత మార్కెట్లో భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: భారత ఐటీ పరిశ్రమ, ఔట్సోర్సింగ్ మోడల్ నుంచి టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌గా ఎదిగిందని బ్రిటన్ విమానయాన సంస్థ వర్జిన్ అట్లాంటిక్ సీఈవో షాయ్ వైస్ తెలిపారు. ఇండియా మార్కెట్లో విస్తరణకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. తమకు అమెరికా తర్వాత రెండో అతి పెద్ద మార్కెట్‌గా భారత్ నిలుస్తోందని వైస్ వివరించారు. వర్జిన్ అట్లాంటిక్ గత పాతికేళ్లుగా భారత్‌కి విమానాలు నడుపుతోంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి లండన్ హీత్రో ఎయిర్‌పోర్ట్‌కి రోజూ అయిదు ఫ్లయిట్స్‌ను నిర్వహిస్తోంది.ప్రయాణికులను నిరాటంకంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ విమానయాన సంస్థ ఇండిగోతో కంపెనీకి కోడ్õÙర్ ఒప్పందం ఉంది. కొత్త రూట్లలో సర్విసులు ప్రారంభించడమనేది డిమాండ్‌పై ఆధారపడి ఉంటుందని వైస్ చెప్పారు. భారత్–బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశల మధ్య వ్యాపార కార్యకలాపాలు పుంజుకుంటాయని, తమ కార్గో వ్యాపారానికి కూడా ఇది ప్రయోజనకరమైన అంశమని తెలిపారు.భారత్ రూట్లో నడిపే ప్రతి విమానంలో స్థానికతకు పెద్ద పీట వేసేలా నలుగురు లోకల్ సిబ్బంది ఉంటారని, మెనూలో సమోసాలను కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. టారిఫ్లపరమైన ఆందోళనపై స్పందిస్తూ విమానయాన సంస్థలకు ఇలాంటి పరిస్థితులు అలవాటేనని వైస్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, బ్రెగ్జిట్, కోవిడ్ మహమ్మారిలాంటివెన్నో చూశాయని చెప్పారు. ఇక సరఫరావ్యవస్థపరంగా అంతరాయాల విషయానికొస్తే తమ దగ్గర తగినన్ని విమానాలు ఉన్నాయని, ఈ ఏడాది డెలివరీలేమీ లేవని వైస్ వివరించారు. -
ఆకాశంలో అల్లకల్లోలం.. 170మందితో వెళ్తున్న విమానాన్ని పక్షి ఢీకొట్టడంతో..
రాంచీ: ఓ పక్షి ఆకాశంలో అల్లకల్లోలం సృష్టించింది. 170 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనతో విమానాన్ని,అందులోని ప్యాసింజర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అయితే, పైలెట్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు సురక్షితంగా భయపడ్డారు. వారిలో పలువురు ప్రయాణికులకు గాయలైనట్లు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం 1.14 గంటల సమయంలో ఇండిగో ఎయిర్‌బస్ 320 (Airbus 320) విమానం పాట్నా నుండి రాంచీ(ranchi)కి రావాల్సి ఉంది. ఆ సమయంలో ఎయిర్‌బస్ 320ని ఓ పక్షి ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రమాదంతో అప్రమత్తమైన పైలెట్ చాకచక్యంగా ల్యాండింగ్ చేయాల్సిన ఎయిర్ పోర్టుకు కాకుండా సమీపంలో ఉన్న రాంచీ బిర్సా ముండా విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా దించారు. ఈ ఘటనలో 175 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రాంచీ సమీపంలో ఇండిగో విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. ఈ సంఘటన జరిగినప్పుడు ఫ్లైట్ 3,000 నుండి 4,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇండిగో విమానం పాట్నా నుండి రాంచీకి వస్తుండగా, పైలట్ ఇక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది’ అని రాంచీలోని బిర్సా ముండా విమానాశ్రయ డైరెక్టర్ ఆర్ ఆర్ మౌర్య తెలిపారు.ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, పక్షి ఢీకొట్టడం వల్ల విమానానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంజనీర్లు నష్టాన్ని అంచనా వేస్తున్నారు’ అని అన్నారు. కాగా, ఈ ఘటనపై ఇండిగో ప్రతినిధులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. Ranchi-bound IndiGo flight suffers bird hit, makes emergency landing, all 175 passengers safe: Official pic.twitter.com/KtzhnVH9KL— Press Trust of India (@PTI_News) June 2, 2025 -
టర్కీ ఎయిర్‌లైన్స్ డీల్ ప్రశ్నార్థకం
భారత్‌కు చెందిన ఇండిగో ఎయిర్‌లైన్స్ టర్కీ ఏవియేషన్ కంపెనీ అయిన టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు బోయింగ్ 777-300ఈఆర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఇండిగో లీజుకు తీసుకొని నడుపుతోంది. ఈ డీల్ మే31తో ముగుస్తుండగా, మరో ఆరు నెలలు పొడిగించాలని ఇండిగో సంస్థ భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖను కోరింది. అయితే ఆ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది.టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లోగా రద్దు చేయాలని ఇండిగోను కేంద్రం ఆదేశించింది. ఢిల్లీతో సహా భారతదేశంలోని తొమ్మిది ప్రధాన విమానాశ్రయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టర్కిష్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ సెలెబి ఏవియేషన్‌కు ఇటీవల సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేసిన తరువాత ఈ పరిణామాలు మరింత తీవ్రమవుతున్నాయి.ఇండిగో వినియోగిస్తున్న టర్కీ సంస్థకు చెందిన రెండు విమానాలకు లీజు అనుమతి మే 31తో ముగుస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ధ్రువీకరించింది. ఈ లీజు పొడిగింపు ప్రతిపాదనను మంత్రిత్వ శాఖ తిరస్కరించినట్లు డీజీసీఏ తెలిపింది. అందుకు బదులుగా స్వల్పకాలిక ఉపశమనం ఇచ్చినట్లు పేర్కొంది. ప్రయాణీకుల సేవలకు తక్షణ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆగస్టు 31 వరకు మూడు నెలలపాటు అనుమతులు పొడిగించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. ఈ పొడిగింపును మళ్లీ ఎట్టి పరిస్థితుల్లోనూ పునరుద్ధరించబోమని తేల్చి చెప్పింది.ఇదీ చదవండి: ఆస్టన్ మార్టిన్‌తో రియల్మీ జట్టుపాకిస్థాన్ ఉగ్రవాదులు పహల్గామ్లో భారత పౌరులను కిరాతకంగా చంపిన ఘటన నేపథ్యంలో భారత సైన్యం విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ను అమలు చేసింది. ఈ తరుణంలో పాక్ సైన్యానికి టర్కీ మద్దుతుగా నిలిచిందని భారత్ ఆరోపిస్తోంది. దాంతో ఆ దేశంలోని సంస్థలతో క్రమంగా సంబంధాలు తెంచుకుంటోంది. అందులో భాగంగానే దేశీయ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
ఇండిగో ఘటన వేళ.. వక్రబుద్ధి చాటుకున్న పాక్!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఢిల్లీ-శ్రీనగర్ ఇండిగో విమానం ఆకాశంలో తీవ్ర కుదుపులకు లోనైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానం ముందుభాగం బాగా దెబ్బతింది కూడా. అయితే ఆ సమయంలో అప్రమత్తమైన పైలట్.. పాక్ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారట!. బుధవారం సాయంత్రం 227 మందితో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు ఇండిగో విమానం బయల్దేరింది. ఈదురు గాలులు, వడగండ్ల కారణంగా అమృత్సర్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ భయపడిపోయారు. ఆ టైంలో అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సంకేతాలు పంపించారు. మరోవైపు.. ఈ అల్లకల్లోల్లాన్ని తప్పించుకునేందుకు పాక్ గగనతలాన్ని వినియోగించుకోవాలని అనుకున్నారట. అందుకోసం లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కోరారు. అయితే, ఇండిగో అభ్యర్థనను లాహోర్ ఏటీసీ తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. దీంతో చేసేది లేక చివరకు.. శ్రీనగర్‌లోనే విమానం సేఫ్ ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే భారత్‌కు చెందిన విమానయాన సంస్థలకూ పాక్ తన గగనతలాన్ని మూసివేసింది. ఇవాళ్టితో(మే 23) ఆ గడువు ముగియనుంది. తాజాగా మరోసారి దానిని పొడిగించే యోచనలో పాక్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఒకేసారి.. ఒక నెల కంటే ఎక్కువ కాలం ఆంక్షలు విధించేందుకు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) నిబంధనలు అనుమతించవు.ఇదీ చదవండి: పాక్ ఆర్మీ అధికారి బలుపు కామెంట్స్ -
ఇండిగో లాభం ‘హై’జంప్
న్యూఢిల్లీ: దేశీ విమానయాన దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 62 శాతం దూసుకెళ్లి రూ. 3,067 కోట్లను అధిగమించింది. ఇది క్యూ4లో కంపెనీ సాధించిన రికార్డ్ లాభంకాగా.. ఇందుకు విమాన ప్రయాణికులు పెరగడం సహకరించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 1,895 కోట్లు ఆర్జించింది. ఇండిగో బ్రాండ్ విమాన సర్వీసుల కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 18,505 కోట్ల నుంచి రూ. 23,098 కోట్లకు ఎగసింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 10 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ప్రయాణికుల జోరు మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి ఇండిగో నికర లాభం రూ. 7,258 కోట్లను అధిగమించింది. విదేశీ మారక ప్రభావాన్ని మినహాయిస్తే దాదాపు రూ. 8,868 కోట్ల లాభం ఆర్జించింది. గతేడాది 11.8 కోట్లమంది ప్రయాణికులను గమ్యాలకు చేరవేసినట్లు సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు. కాగా.. క్యూ4లో ఇండిగో ప్రయాణికుల టికెట్ ఆదాయం 25% జంప్‌చేసి రూ. 19,567 కోట్లను దాటింది. అనుబంధ విభాగాల ఆదాయం 25 శాతం అధికమై రూ. 2,153 కోట్లకు చేరింది. మొత్తం నగదు నిల్వలు రూ. 48,170 కోట్లను అధిగమించగా.. విమానాల సంఖ్య 400ను దాటింది. ఇండిగో షేరు బీఎస్ఈలో 0.4% లాభంతో రూ. 5,466 వద్ద ముగిసింది. -
మేము చనిపోయామని అనుకున్నాం.. ఇండిగో బాధితుల ఆవేదన
శ్రీనగర్: దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. ఢిల్లీ నుంచి ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని తీవ్ర కుదుపులకు గురైంది. వడగండ్ల కారణంగా విమానం ముందుభాగం దెబ్బతిని పెద్ద రంధ్రమే ఏర్పడింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై హాహాకారాలు చేశారు. ఇదే విమానంలో ప్రయాణించిన తృణముల్ కాంగ్రెస్ నేతలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఐదుగురు సభ్యుల తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం డెరెక్ ఓ'బ్రియన్, నదిముల్ హక్, సాగరికా ఘోష్, మనస్ భూనియా, మమతా ఠాకూర్‌తో కూడిన బృందం బుధవారం శ్రీనగర్‌కు వెళ్తున్న 6E2142 విమానంలో ప్రయాణించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత సాగరిక ఘోష్ మాట్లాడుతూ.. విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో మేమంతా ఇక చనిపోయామని అనుకున్నాం. చావు దగ్గర వరకు వెళ్లి వచ్చినట్టుగా ఉంది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు.I had a narrow escape while flying from Delhi to Srinagar. Flight number #6E2142. Hats off to the captain for the safe landing.@IndiGo6E pic.twitter.com/tNEKwGOT4q— Sheikh Samiullah (@_iamsamiullah) May 21, 2025విమానంలో ఉన్న వారంతా భయంతో కేకలు వేస్తున్నారు. కొందరు ప్రార్థనలు చేశారు. మమ్మల్ని సురక్షితంగా తీసుకువచ్చిన పైలట్‌కు కృతజ్ఞతలు. విమానం దిగిపోయిన తర్వాత మేమంతా విమానం దెబ్బతిన్న భాగాన్ని చూసి ఖంగుతిన్నాం’ అని చెప్పుకొచ్చారు. భారత్, పాక్ మధ్య దాడుల వల్ల సరిహద్దుల్లో ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వీరంతా శ్రీనగర్ వెళ్లినట్టు తెలిపారు. టీఎంసీ ప్రతినిధి బృందం మే 23 వరకు జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. శ్రీనగర్‌తో పాటు పూంచ్, రాజౌరిలో వీరు పర్యటించనున్నారు.Delhi–Srinagar IndiGo flight hit by severe turbulenceFlight 6E-2142 was caught in a terrifying hailstorm just before landing in Srinagar, forcing an emergency landing around 6:30pm. Damage to plane's nose cone, cabin luggage tumbling. #6E2142 #indigo6e pic.twitter.com/gHKFxpn7SI— Lucifer (@krishnakamal077) May 21, 2025ఇదిలా ఉండగా.. 227 మంది ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని బుధవారం తీవ్ర కుదుపులకు గురైంది. అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షిత ల్యాండింగ్‌కు చర్యలు చేపట్టారు. చివరకు సాయంత్రం 6.30గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. విమానం ముందు భాగం దెబ్బతిన్న, ప్రయాణికులు కేకలు వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాంకేతిక సమస్యలతో విమానం శ్రీనగర్‌లోనే నిలిచిపోయింది. -
ప్రయాణికులకు అలెర్ట్.. ఆ నగరాలకు విమానాల రాకపోకలు బంద్!
ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌తో భారత్- పాకిస్తాన్ మధ్య కమ్ముకున్న యుద్ధ మేఘాల కారణంగా కేంద్రం గగన తలంపై ఆంక్షలు విధించింది. అయితే, భద్రతా చర్యల దృష్ట్యా విమానాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని ఇండిగో,ఎయిరిండియా విమానయాన సంస్థలు ప్రకటించాయి. మే 13 నుంచి మే 17 అర్ధరాత్రి వరకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, రాజ్కోట్లకు రాకపోకలు నిర్వహించే ఇండిగో అన్ని విమానాలను శనివారం రాత్రి 11:59 గంటల వరకు రద్దు చేసింది. రద్దుతో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.ఎయిరిండియా మంగళవారం (మే 13) జమ్మూ, లేహ్, జోధ్‌పూర్, అమృత్సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్కోట్లకు విమానాల రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. తాజా పరిణామాలు, ప్రయాణికుల దృష్ట్యా మే 13న పైన పేర్కొన్న ప్రాంతాలకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ట్వీట్లో పేర్కొంది.#TravelAdvisoryIn view of the latest developments and keeping your safety in mind, flights to and from Jammu, Leh, Jodhpur, Amritsar, Bhuj, Jamnagar, Chandigarh and Rajkot are cancelled for Tuesday, 13th May.We are monitoring the situation and will keep you updated.For more…— Air India (@airindia) May 12, 2025 -
ఇండిగో కీలక ప్రకటన: 10 నగరాల్లో విమానాల రద్దు
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటైన 'ఇండిగో' మే 10న రాత్రి 11:59 గంటల వరకు 10 నగరాలకు విమాన సేవలను రద్దు చేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రయాణికులు తమ బుకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవాలని, రీషెడ్యూల్ కోసం కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని ఎయిర్‌లైన్ సూచించింది. రేపు (శనివారం) రాత్రి 11:59 గంటల వరకు శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనీర్, జోధ్‌పూర్, కిషన్‌గఢ్, రాజ్కోట్లకు విమాన సదుపాయం ఉండదు.విమానాలకు రద్దుకు కారణమేమిటనే విషయాన్ని.. ఎయిర్‌లైన్ అధికారికంగా వెల్లడించలేదు. కానీ భారతదేశంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య విమానాలను రద్దు చేసి ఉండొచ్చని సమాచారం. మే 10 తరువాత విమాన సేవలు యధావిధిగా కొనసాగుతాయా?, లేదా మళ్ళీ నిలిపివేస్తారా.. అనే విషయాన్ని ఇండిగో వెల్లడించాల్సి ఉంది.ఇలాంటి పరిస్థితిలో ప్రయాణికులు ఏం చేయాలి?➤అప్డేట్ కోసం కోసం ఇండిగో మెసేజస్ లేదా ఇమెయిల్‌లను చేస్తూ ఉండండి.➤రీషెడ్యూల్ చేయడానికి లేదా రద్దు చేయడానికి ఎయిర్‌లైన్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌ను సందర్శించండి.➤ప్రత్యామ్నాయ ప్రయాణ ఎంపికల కోసం కస్టమర్ సేవను సంప్రదించండి.ప్రయాణికులు విమానయాన శాఖ అడ్వైజరీ➤ఎయిర్‌పోర్ట్‌లకు మూడు గంటల ముందుగానే చేరుకోవాలి.➤75 నిమిషాల ముందే చెక్ ఇన్ క్లోజ్ అవుతుంది.#6ETravelAdvisory: Your safety is paramount. Flights to/from the following cities are cancelled until 2359 hrs on 10th May. We are here to help you travel with ease. Check flight status here https://t.co/ll3K8PwtRV. To rebook or claim a refund, visit https://t.co/51Q3oUe0lP. pic.twitter.com/v5BSdX3dDo— IndiGo (@IndiGo6E) May 9, 2025 -
తప్పతాగి, ఎయిర్‌హోస్టెస్‌కు వేధింపులు : తిక్క కుదిర్చిన ఎయిర్‌లైన్స్
విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన తాజాగా వెలుగులోకి చ్చింది.ఢిల్లీ-షిర్డీ వెళ్తున్న ఇండిగో విమానంలో విమాన సిబ్బందిలో భాగమైన ఎయిర్‌హోస్టెస్‌ను వేధింపులకు గురిచేశాడు. ఆమెను అనుచితంగా తాకి లైంగికంగా వేధించాడు. చివరికి ఏమైందంటే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మే 2న ఢిల్లీ నుంచి షిర్డీ వెళ్లే 6E 6404 ఇండిగో విమానంలో మద్యం తాగిన వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదు మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇండిగో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.విమానంలోని టాయిలెట్ దగ్గర ప్రయాణీకుడు ఎయిర్ హోస్టెస్‌ను అనుచితంగా తాకినట్లు పోలీసు అధికారి తెలిపారు. అసభ్యకరమైన ప్రవర్తనతో విసిగిపోయిన ఎయిర్ హోస్టెస్ తన మేనేజర్‌కు సమాచారం అందించింది. దీంతో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత వారు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారని, ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు.రహతా పోలీస్ స్టేషన్లో అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వైద్య పరీక్షలో అతను మద్యం సేవించినట్లుగా కూడా నిర్ధారణ అయింది. దీనిపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందింస్తూ.. ‘‘అందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని" అందించడమే తమ లక్ష్యమని వెల్లడించింది. ప్రయాణికులకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే చింతిస్తున్నామని ఎయిర్‌లైన్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
ఇండిగోకు రూ.944 కోట్ల జరిమానా
ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.944.20 కోట్ల జరిమానా విధించింది. భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో శనివారం ఈ ఆర్డర్‌ను అందుకుంది. పెనాల్టీ ఆర్డర్‌ను సంస్థ ఖండిస్తూ.. చట్టపరమైన చర్యలతోనే ముందుకు వెళ్తామని సవాలు చేసింది.ఆదివారం జరిగిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో.. ఆదాయపు పన్ను అథారిటీ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ జరిమానా విధించబడిందని ఇండిగో స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను కమిషనర్ (అప్పీల్స్) ముందు ఇండిగో చేసిన అప్పీల్ కొట్టివేయబడిందని అథారిటీ తప్పుగా భావించింది. అయితే అప్పీల్ ఇప్పటికీ క్రియాశీలంగా ఉంది. తీర్పు కూడా పెండింగ్‌లో ఉంది. ఈ ఆర్డర్ చట్ట పరిధిలోకి రాలేదని కంపెనీ వెల్లడిస్తూ.. ఈ జరిమానాను ఎదుర్కోవడానికి చట్టపరమైన పరిష్కారాలను అనుసరిస్తామని ఇండిగో స్పష్టం చేసింది.ఆదాయపన్ను శాఖ ఇచ్చిన ఆర్డర్ వల్ల.. కంపెనీ ఆర్థిక, కార్యకలాపాలు లేదా మొత్తం వ్యాపార కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపదని ఇండిగో స్పష్టం చేసింది. ఇప్పటికే పలు ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కొంటున్న ఇండిగో ఇప్పుడు తాజాగా జరిమానాకు సంబంధించిన పెనాల్టీ ఆర్డర్‌ను అందుకుంది.ఇదీ చదవండి: రూ.8000 కోట్లకు కంపెనీ అమ్మేసి.. ఫిజిక్స్ చదువుతున్నాడువిమానయాన సంస్థ ఇటీవల FY25 మూడవ త్రైమాసికంలో దాని నికర లాభంలో 18.6 శాతం క్షీణతను నమోదు చేసింది. ఆదాయాలు కూడా రూ.2,998.1 కోట్ల నుంచి రూ.2,448.8 కోట్లకు పడిపోయింది. నిర్వహణ ఖర్చులు పెరగడం కూడా ఆదాయం తగ్గడానికి కారణమైందని కంపెనీ వెల్లడించింది. -
హోలీ గేట్‌వే సేల్.. రూ.1,199కే విమాన ప్రయాణం!
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తన వినియోగదారులకు హోలీ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘హోలీ గెట్‌వే సేల్’ పేరుతో ఆకర్షణీయ ఆఫర్లను అందించింది. ఇది ప్రయాణికులు తక్కువ ధరలతే తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా మార్చి 10 నుంచి మార్చి 12, 2025 వరకు బుకింగ్స్ కోసం పరిమిత ఆఫర్‌ను అందిస్తుంది. ఈ సమయాల్లో విమాన టికెట్లు బుక్ చేసిన ప్యాసింజర్లు మార్చి 17 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.విమాన ఛార్జీలు ఇలా..ఈ హోలీ గెట్‌వే సేల్‌లో భాగంగా ఇండిగో దేశీయ రూట్లలో రూ.1,199, అంతర్జాతీయ రూట్లలో రూ.4,199 నుంచి వన్ వే విమాన ఛార్జీలు అమలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న వేసవిలో విహారయాత్రలు, సెలవులకు వెళ్లే వారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. విమాన ఛార్జీల్లో తగ్గుదలతోపాటు యాడ్-ఆన్ సర్వీసుల్లో డిస్కౌంట్లను కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రీపెయిడ్ అదనపు బ్యాగేజీపై 20 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. స్టాండర్డ్ సీట్ సెలక్షన్లో 35 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం ముందుగా బుక్ చేసుకున్న వారికి భోజనం ఖర్చులో 10 శాతం తగ్గింపు ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఐపీఎల్లో పొగాకు, మద్యం ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం?అదనంగా ఐదు శాతం తగ్గింపు..ఇండిగో అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ విమానాలను బుక్ చేసుకునే ప్రయాణికులు అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే ఇండిగో హోలీ గెట్ వే సేల్ పరిధిలోని ఏయే గమ్యస్థానాలు వస్తాయో స్పష్టత ఇవ్వలేదు. సంస్థ విమానాల నెట్వర్క్ దేశీయ, అంతర్జాతీయ గమ్యస్థానాలను కవర్ చేస్తుంది. ప్రధానంగా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్‌కతా వంటి ప్రసిద్ధ దేశీయ నగరాలతో పాటు దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్, కౌలాలంపూర్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు అధికంగా సర్వీసులు నడుపుతోంది. వీటికి ఉన్న పాపులారిటీ, కనెక్టివిటీ దృష్ట్యా ఈ సేల్‌లో ఈ గమ్యస్థానాలు భాగం అయ్యే అవకాశం ఉంది. -
ఇండిగోకు రూ.115.86 కోట్ల జరిమానా
విదేశాలకు చెందిన తన కస్టమర్లకు ఎగుమతులుగా పరిగణించని సేవలను అందించినందుకు ఇండిగో(Indigo)పై జీఎస్టీ అధికారులు జరిమానా విధించారు. దాంతోపాటు 2018, 2019, 2020 ఆర్థిక సంవత్సరాలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లను చెల్లించేందుకు నిరాకరించినందుకు ఇండిగో మొత్తం రూ.115.86 కోట్ల జరిమానా చెల్లించాలని తెలిపారు. ఇండిగో ప్రస్తుతం ఈ ఉత్తర్వులను అప్పిలేట్ అథారిటీ ముందు సవాలు చేస్తోంది.ఫిబ్రవరి 4, 2025న ప్రకటించిన జరిమానాలో విదేశాల్లోని సంస్థ సర్వీసులు పొందేవారికి సంబంధించిన రూ.113.02 కోట్లు ఉన్నాయి. వీటిని జీఎస్టీ అధికారులు ‘సేవల ఎగుమతి’గా వర్గీకరించలేదు. దీనికితోడు నిర్దిష్ట ఆర్థిక సంవత్సరాలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ చెల్లించేందుకు సంస్థ నిరాకరించింది. దాంతో రూ.2.84 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.115.86 కోట్లు ఫైన్ కట్టాలని అధికారులు తెలిపారు.ఇండిగో స్పందన..జీఎస్టీ(GST) విధించిన జరిమానాకు ప్రతిస్పందనగా ఇండిగో తన ఆర్థిక కార్యకలాపాలు లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని వాటాదారులకు హామీ ఇచ్చింది. తగిన చట్టపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇండిగో విమానయాన మార్కెట్ వాటా ఎక్కువగానే ఉంది. ఆర్థిక పనితీరు బలంగా ఉంది. కంపెనీ ఆదాయంలో క్రమంగా పెరుగుదల నమోదవుతోంది. -
Maha Kumbh 2025: పాల్గొన్న ఇండిగో సీఈవో.. మాటల్లో చెప్పలేని శాంతి..!
భారతదేశపు అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ఈ మహా కుంభమేళా. ఇందులో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 144 ఏళ్లకు ఒక్కసారి జరిగే ఈ వేడుకలో ఎందరో ప్రముఖులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. తాజాగా ఇండిగో సీఈవో డచ్ ఎగ్జిక్యూటివ్ కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించారు. ఆయన ఈ ఉత్సవాన్ని తిలకించి తన అధ్యాత్మిక అనుభవాల తోపాటు అందుకు సంబధించిన ఫోటోలను షేర్ చేసుకున్నారు.ఇండిగోIndiGo) సీఈవో పీటర్ ఎల్బర్స్(Pieter Elbers ) లింక్డ్ఇన్(LinkedIn)లో ఆ సందర్భం తాలుకా ఫోటోల తోపాటు తన అనుభవాన్ని కూడా షేర్ చేసుకున్నారు. ఈ డచ్ ఎగ్జిక్యూటివ్ తాను ఉదయం 5 గంటలకు త్రివేణి సంగమంలో స్నానం చేసి.. గందరగోళం నడుమ ఆధ్యాత్మిక శాంతిని పొందానన్నారు. ఈ ఏడాదిలో ఈ మహా కుంభమేళా అద్వితీయమైన ఘట్టంగా అభివర్ణించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు కేవలం 45 రోజుల్లోనే 450 మిలియన్ల మంది సందర్శకులను తరలివస్తారనేది అంచనా. 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకలో భూమిపై ఉండే యావత్తు మానవాళిలో అత్యధిక మంది ఈ అధ్యాత్మిక వేడుకలో చేరి గుమిగూడే సమయం ఇది. ఈ స్థాయిలో అసంఖ్యాక ప్రజలను చూడటం అనేది దాదాపు అసాధ్యం కూడా. ఇది యూరప్ జనాభాకు సమానం. పైగాయూఎస్ జనసాంద్రతకు మించి అని లింక్డ్ ఇన్ పోస్ట్‌లో రాసుకొచ్చారు ఎల్బర్స్. తాను గత వారంలోని గణతంత్ర దినోత్సవం నాడు భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత వారసత్వ సంగమాన్ని జరుపుకునే మహాకుంభమేళాలో పాల్గొన్నాను అని తెలిపారు. అంతేగాదు ఈ ప్రదేశానికి ఉన్న శక్తిని ఏ వాక్యం, ఏ పదం లేదా చిత్రాలు వర్ణించేందుకు సరిపోవు అని అన్నారు. తాను ఈ త్రివేణి సంగమంలో ఉదయ ఐదు గంటల సమయంలో పుణ్య స్నానాలు ఆచరించానని చెప్పారు. మంత్రాలు, ప్రార్థన, భక్తి, మానవత్వం ఐక్యతల నడుమ చుట్టుముట్టిన ఈ గందరగోళం మధ్య ఓ గొప్ప ఆధ్యాత్మిక శాంతిని అనుభవించే క్షణం దొరికిందని ఆనందంగా చెప్పారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే ఈ దివ్యమైన గొప్ప అనుభవంలో తాను భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు ఇండిగో సీఈవో. అంతేగాదు ఈ కార్యక్రమం కోసం అధికంగా వస్తున్న యాత్రికుల రద్దీని చక్కగా నిర్వహిస్తున్న తమ ఇండిగో బృందానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఈ మహా కుంభమేళా జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతుంది. ఈ మొదటి పదిరోజుల్లో పది కోట్లకు పైగా భక్తులు ఇప్పటికే సంగంలో స్నానాలు ఆచరించారు. అంటే ఈ 45 రోజుల పండుగ ముగిసే సమయానికి ఆ సంఖ్య కాస్తా 40 కోట్లకు చేరుతుందనేది అంచనా.(చదవండి: 'ది బిలియనీర్స్ డాటర్' ఆ ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్..!) -
Mahakumbh 2025: ప్రభుత్వ చొరవతో తగ్గిన విమానయాన ఛార్జీలు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో పలువురు విమానాల్లోనూ ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన పలు విమానయాన సంస్థలు విమానయాన ఛార్జీలను అమాంతం పెంచేశాయి.ప్రయాగ్‌రాజ్‌కు విమాన ఛార్జీల పెంపు పై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. మహా కుంభమేళా వేళ ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరిగిన నేపథ్యంతో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న విమానయాన సంస్థలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది. విమానయాన సంస్థలు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను కొనసాగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ నేపధ్యంలో ఇండిగో విమానయాన సంస్థ ప్రయాగ్‌రాజ్‌కు విమాన ఛార్జీలను 30 నుంచి 50 శాతం మేరకు తగ్గించింది.మహా కుంభమేళా సమయంలో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు పలు విమానయాన సంస్థలతో సమన్వయ సమావేశాలను నిర్వహించారు. ఈ సమావేశంలో, విమానయాన సంస్థల ప్రతినిధులు, డీజీసీఏ అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి, దేశంలో వివిధ నగరాల నుంచి 132 విమానాలు ప్రయాగ్‌రాజ్‌కు సేవలు అందిస్తున్నాయి.ఇండిగో తన వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 16 వరకు ఢిల్లీ-ప్రయాగ్‌రాజ్ విమానాలకు టిక్కెట్ ధరలు రూ.13,500 కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయని తెలిపింది. జనవరి 31న ధరలు రూ.21,200 పైగా ఉన్నాయని పేర్కొంది. ఫిబ్రవరి 12కి ధరలు తగ్గి రూ.9 వేలకు చేరనున్నాయని తెలిపింది. అయితే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చొరవతో విమానయాన సంస్థలు టిక్కెట్ ఛార్జీలు తగ్గించనున్నట్లు ప్రకటించాయి. ఇది కూడా చదవండి; Mahakumbh 2025: ప్రతి భక్తుని రక్షణ బాధ్యత మాదే: సీఎం యోగి -
ఇండిగో సిబ్బంది ఓవరాక్షన్..: మంచు లక్ష్మి ఆగ్రహం
ఇండిగో విమానాయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi Prasanna) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిగో (IndiGo Airlines) సిబ్బంది చాలా దురుసుగా ప్రవర్తించారని మండిపడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఆ సంస్థను ట్యాగ్ చేసింది. నా లగేజ్ బ్యాగేజ్‌ను పక్కకు తోసేశారు. కనీసం నేను బ్యాగ్ ఓపెన్ చేసేందుకు కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పింది వినకపోతే నా బ్యాగును గోవాలోనే వదిలేస్తామన్నారు. ఇది చాలా దారుణం. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు.ఇండిగో సిబ్బంది వేధింపులుఒక్క మాటలో చెప్పాలంటే వేధించారు. చివరకు నా లగేజీకి సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ అందులో ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఇంత నిర్లక్ష్యంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు? అని ట్వీట్ చేసింది. తన బ్యాగుకు కనీసం లాక్ వేయలేదు, ట్యాగ్ కూడా వేయలేదని వీడియో సైతం షేర్ చేసింది. This is harassment @IndiGo6E 😭 after all that they did not even put a security tag in front of my eyes. In spite of insisting that they would do so if anything is missing, I doubt Indigo will take any responsibility. How is this even possible to run an airline like this?— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025My bag pulled aside and @IndiGo6E and they won’t let me open my bag. They insist to do it or else my bag will be left in Goa, someone help!!! Flt 6e585.. this is ridiculous, and the staff is being extremely rude— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025I rest my case @IndiGo6E 💔💔 pic.twitter.com/1AXPbumRm7— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) January 27, 2025 చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడుకన్నడ బిగ్‌బాస్ విన్నర్‌గా 'రైతుబిడ్డ'.. ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా..? -
ఇండిగో లాభం నేలచూపు
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 2,450 కోట్లకు పరిమితమైంది. ప్రధానంగా కరెన్సీ ఆటుపోట్లు లాభాలను దెబ్బతీశాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,998 కోట్లు ఆర్జించింది. అయితే ఇండిగో బ్రాండ్ విమాన సరీ్వసుల కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం రూ. 20,062 కోట్ల నుంచి రూ. 22,993 కోట్లకు ఎగసింది. కాగా.. ఇంధన వ్యయాలు తగ్గడానికితోడు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో రూ. 3,850 కోట్ల లాభం ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో 3.11 కోట్లమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసినట్లు వెల్లడించింది. బీఎస్ఈలో ఇండిగో షేరు 0.6 శాతం బలపడి రూ. 4,163 వద్ద ముగిసింది. -
36,000 అడుగుల ఎత్తులో ‘ఛాయ్.. ఛాయ్..’
‘ఛాయ్.. ఛాయ్.. టీ కావాలా మేడమ్.. సర్ ఛాయ్ ఇమ్మంటారా?’ సాధారణంగా బస్సు స్టాప్లోనో లేదా రైళ్లలోనూ ఇలా టీ సర్వ్ చేయడం చూస్తూంటారు. కానీ ఏకంగా 36,000 అడుగుల ఎత్తులో టీ సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది.. విమానంలో టీ సర్వ్ చేసి ఓ వ్యక్తి తోటి ప్రయాణికులను ఆశ్చర్యపరిచాడు. ఈమేరకు తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.ఇండిగో విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు తన సీటులో నుంచి లేచి ‘ఛాయ్.. ఛాయ్..’ అంటు తోటి ప్రయాణికులకు టీ సర్వ్ చేశాడు. అందుకు మరో ప్రయాణికుడు సాయం చేశాడు. డిస్పోజబుల్ గ్లాస్లో తోటి ప్యాసింజర్లకు టీను అందిస్తున్నట్లు తీసిన వీడియోను ఎయిర్‌క్రూ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by Aviation/CabinCrew's HUB 🇮🇳 (@aircrew.in)ఇదీ చదవండి: ఆన్లైన్ ఉన్నా చివరకు షోరూంలోనే..‘ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వారు టీ ఎలా తీసుకుళ్లుంటారు?’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘ఒక భారతీయుడు మాత్రమే టీని ఎప్పుడైనా ఎక్కడైనా సర్వ్ చేయగలడు’ అని మరో వ్యక్తి రిప్లై ఇచ్చాడు. -
కొత్త ఎలక్ట్రిక్ కారు.. పేరు మార్చేసిన మహీంద్రా: ఎందుకంటే..
మహీంద్రా ఎలక్ట్రిక్ కొత్తగా లాంచ్ చేసిన కారు పేరులో '6ఈ'ని ఉపయోగించడంపై.. భారత విమానయాన సంస్థ ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీంద్రా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఇండిగో అభ్యంతరాన్ని దృష్టిలో ఉంచుకుని మహీంద్రా కంపెనీ తన బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారు పేరును 'బీఈ 6'గా మారుస్తున్నట్లు వెల్లడించింది. రెండు కంపెనీల మధ్య సంఘర్షణ అవసరం లేదు. కాబట్టే ఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంటే త్వరలో విక్రయానికి రానున్న మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కారు 'బీఈ 6'గా రానుంది.6ఈ పేరుతో ఇండిగో సేవలుఇండిగో సంస్థ తన బ్రాండింగ్ కోసం మాత్రమే కాకుండా.. ప్రయాణికులకు '6ఈ' పేరుతో సేవలందిస్తోంది. ఎయిర్‌లైన్ 6ఈ ప్రైమ్, 6ఈ ఫ్లెక్స్, బ్యాగేజ్ ఎంపికలు, లాంజ్ యాక్సెస్ వంటి వాటి కోసం కూడా 6ఈను ఉపయోగిస్తోంది. ఇప్పుడు మహీంద్రా '6ఈ'ను ఉపయోగించడం పట్ల ఇండిగో కోర్టును ఆశ్రయించింది. అయితే మహీంద్రా కంపెనీ తన కారు పేరును మార్చుకోవడంతో సమస్య సద్దుమణిగినట్లే అని స్పష్టమవుతోంది. -
ప్రపంచంలోనే చెత్త ఎయిర్‌లైన్స్.. ఇండిగో స్థానం ఇది!
విమానంలో ప్రయాణించాలంటే ఏ విమానయాన సంస్థ బెటర్ అనేది తెలుసుండాలి. అలాగే కేబిన్లు, సేవల నాణ్యత తోపాటు..విమానాలు ఎంత ఆలస్యంగా వస్తున్నాయన్నది కూడా అన్నింటికంటే ముఖ్యం. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీ ప్రతి ఏటా దీనికి సంబంధించి ప్రయాణికులకు అవగాహన కల్పించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది. ఏడాది మెత్తంలో ఎన్ని సార్లు ఆలస్యంగా కస్టమర్లను గమ్యస్థానాలకు చేర్చింది, సౌకర్యం, సేవలు, ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ వంటి అంశాల ఆధారంగా అత్యుత్తమమైనవి, చెత్త సర్వీస్ అందించిన ఎయిర్‌లైన్స్‌గా జాబితా చేసి ర్యాంకులు ఇస్తుంది. ఈ ఏడాది మాత్రం కస్టమర్ ఫీడ్‌బ్యాక్, కార్యచరణ సామర్థ్యం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్లైన్లకు ర్యాంకుల ఇచ్చింది.ఇందులో జనవరి నుంచి అక్టోబర్ వరకు గల డేటాను బేస్ చేసుకుని ఈ ర్యాంకులు ఇచ్చింది. ఇలా ర్యాంకులు ఎందుకంటే.. కేవలం ప్రయాణికుల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎయిర్‌లైన్స్‌ని ప్రోత్సహించడమేనని ఎయిర్ హెల్ప్ సీఈవో టామ్జ్ పౌల్జిన్ చెబుతున్నారు.2024 సంవత్త్సరానికి అత్యంత చెత్త విమానయాన సంస్థలు..100. స్కై ఎక్స్‌ప్రెస్101.ఎయిర్ మారిషస్102. తారోమ్103. ఇండిగో104. పెగాసస్ ఎయిర్‌లైన్స్105. ఎల్ అల్ ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్స్106. బల్గేరియా ఎయిర్107. నౌవెలైర్108. బజ్109. తునిసైర్2024 సంవత్సరానికి అత్యుత్తమ విమానయాన సంస్థలు..10. ఎయిర్ సెర్బియా9. వైడెరో8. ఎయిర్ అరేబియా7. లాట్ పోలిష్ ఎయిర్‌లైన్స్6. ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్5. ప్లే (ఐస్లాండ్)4. అమెరికన్ ఎయిర్‌లైన్స్3. యునైటెడ్ ఎయిర్‌లైన్స్2. ఖతార్ ఎయిర్వేస్1. బ్రస్సెల్స్ ఎయిర్లైన్స్ఈసారి బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్ 2018 నుంచి ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం చెలాయించి.. ఖతార్ ఎయిర్వేస్ను వెనక్కు నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఈ ఏడాది గణనీయమైన కార్యాచరణ అంతరాయాలను ఎదుర్కొన్నప్పటికీ..మంచి పనితీరును కొనసాగించి మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక కెనడియన్ క్యారియర్ ఎయిర్ ట్రాన్సాట్ 36వ స్థానంలో నిలవగా, డెల్టా ఎయిర్ లైన్స్ 17వ స్థానానికి పడిపోయింది. అలాగే జెట్‌బ్లూ, ఎయిర్ కెనడా దిగువ 50 స్థానాల్లో నిలిచాయి. అలాస్కా ఎయిర్‌లైన్స్ కూడా 88వ స్థానానికి పరిమతమయ్యింది.ఇండిగో స్పందన:భారత్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వే ఫలితాలపై స్పందించింది. సదరు గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హెల్ప్ ఇచ్చిన ర్యాంక్‌ని ఖండిచింది. తమ సంస్థ కస్టమర్లకు మంచి ప్రయాణ అనుభవాన్ని ఇస్తుందని స్పష్టం చేసింది. కస్టమర్ పిర్యాదులు కూడా తక్కువేనని పేర్కొంది ఇండిగో. భారత ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకారం..తొమ్మిది నెలల కాలంలో 7.25 కోట్లకు పైగా ప్రయాణికులను తీసుకెళ్లడమే గాక 61.3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. అంతేగాక నెలవారీగా కస్టమర్ పిర్యాదులను, సమయాపాలన డేటాను ప్రచురిస్తామని కూడా ఇండిగో స్పష్టం చేసింది. గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హెల్ప్ విశ్వసనీయత లేని విధంగా ర్యాంకులు ఇచ్చిందని, తమ విమానయాన సంస్థ డేటాని పరిగణలోనికి తీసుకుని ఇచ్చిన ర్యాంకు మాత్రం కాదని ఆరోపించింది. (చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక) -
కోర్టు మెట్లెక్కిన ఇండిగో: మహీంద్రా ఎలక్ట్రిక్‌పై దావా
దేశీయ వాహన తయారీ దిగ్గజం ఇటీవల 'బీఈ 6ఈ' ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. మహీంద్రా ఎలక్ట్రిక్ కొత్తగా లాంచ్ చేసిన కారు పేరులో '6ఈ'ని ఉపయోగించడంపై.. భారత విమానయాన సంస్థ ఇండిగో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. మహీంద్రా కంపెనీ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది.మంగళవారం ఈ కేసు జస్టిస్ 'అమిత్ బన్సల్' ముందుకు వచ్చింది. అయితే ఈయన ఈ కేసు నుంచి తప్పకున్నారు. కాబట్టి విచారణ డిసెంబర్ 9వ తేదీకి వాయిదా పడింది. మహీంద్రా ఎలక్ట్రిక్ ఇండిగోతో సామరస్య పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇండిగో సంస్థ తన బ్రాండింగ్ కోసం మాత్రమే కాకుండా.. ప్రయాణికులకు '6ఈ' పేరుతో సేవలందిస్తోంది. ఎయిర్‌లైన్ 6ఈ ప్రైమ్, 6ఈ ఫ్లెక్స్, బ్యాగేజ్ ఎంపికలు, లాంజ్ యాక్సెస్ వంటి వాటి కోసం కూడా 6ఈను ఉపయోగిస్తోంది. ఇప్పుడు మహీంద్రా '6ఈ'ను ఉపయోగించడం పట్ల ఇండిగో కోర్టును ఆశ్రయించింది.నిజానికి మహీంద్రా ఎలక్ట్రిక్ నవంబర్ 25న 'బీఈ 6ఈ' నమోదు కోసం దరఖాస్తును చేసుకుంది. దీనిని రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్‌మార్క్ అంగీకరించింది. ద్విచక్ర వాహనాలను మినహాయించి, ఫోర్ వీలర్ వాహనాలకు '6E' హోదాను ఉపయోగించడానికి హక్కులను కంపెనీ సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు ఇండోగో అభ్యంతరం చెబుతోంది. దీనిపై తీర్పు త్వరలోనే వెల్లడవుతుంది. -
విద్యార్థులకు ఇండిగో స్పెషల్ ఆఫర్..
దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ 'ఇండిగో' విద్యార్థుల కోసం 'స్టూడెంట్ స్పెషల్' అనే ప్రత్యేకమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఇండిగో కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో విద్యార్థులకు ప్రత్యేక ఛార్జీలు, అదనపు ప్రయోజనాలు లభించనున్నట్లు ప్రకటించింది.విమాన టికెట్ మీద 6 శాతం రాయితీ కల్పించడం మాత్రమే కాకుండా.. 10 కేజీల వరకు అదనపు లగేజ్ తీసుకెళ్లడానికి ఇండిగో అనుమతించింది. విద్యార్థులు కోసం తీసుకొచ్చిన ఈ స్పెషల్ ఆఫర్ ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు అందుబాటులో ఉంటుందో.. స్పష్టంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశంఇండిగో ప్రకటించిన ఈ స్పెషల్ ఆఫర్ కేవలం హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా గోవా, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మొత్తం 80 రూట్లలో నడిచే విమాన సర్వీసుల్లో అందుబాటులో ఉంటుంది. 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న విద్యార్థులు తమ స్కూల్ లేదా యూనివర్సిటీకి సంబంధించిన ఐడీ కార్డును కలిగి ఉండాలి. ఐడీ కార్డు కలిగిన వారు మాత్రమే ఈ ఆఫర్ ఉపయోగించుకోవడానికి అర్హులు. -
రెండు సంస్థలదే ఆధిపత్యం!
దేశంలో మరిన్ని విమానయాన సంస్థలు కార్యకలాపాలు సాగించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం రెండు ప్రముఖ కంపెనీలే అధిక వ్యాపార వాటాను కలిగి ఉన్నాయని చెప్పారు. విమానయాన రంగంలో రెండు సంస్థలే ఆధిపత్యం కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈటీ ఇండియా అసెండ్స్ ఈవెంట్లో నాయుడు పాల్గొని మాట్లాడారు.‘ఏ పరిశ్రమలోనైనా పోటీ ఉండాలి. దాంతో వినియోగదారులకు తక్కువ ధరలకే సేవలందుతాయి. కానీ విమానయాన పరిశ్రమలో కేవలం రెండు సంస్థలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ రంగం ఈ సంస్థలకే పరిమితం కావడం సరైందికాదు. మరిన్ని కంపెనీలు ఈ విభాగంలో సేవలందించాలి. దాంతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందుతాయి. విమాన ప్రయాణం అందుబాటు ధరలో ఉండేలా ప్రభుత్వం టిక్కెట్ ధరలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నా ప్రభుత్వం విభిన్న పాలసీలను తయారుచేస్తోంది. ఈ రంగాన్ని మరింత ఉత్తమంగా ఎలా చేయగలమో ఆయా సంస్థలతో చర్చిస్తోంది. ఏదైనా విమానయాన సంస్థ దివాలా తీయడం లేదా పరిశ్రమను వదిలివేయడం మాకు ఇష్టం లేదు. ఈ పరిశ్రమలోకి కొత్త విమానయాన సంస్థలు ప్రవేశించేలా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రైవేట్ మూలధనం ద్వారా కార్యకలాపాలు సాగించే కొత్త కంపెనీలు దివాలా దిశగా వెళితే ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఎయిరిండియా గ్రూపులో ఇటీవల విస్తారా విలీనం అయింది. దాంతో దేశీయ విమానయాన మార్కెట్ వాటాలో 80 శాతం ఇండిగో, ఎయిరిండియాలే సొంతం చేసుకుంటున్నాయి. రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 2023లో మరో పదేళ్ల కాలంపాటు అంటే 2033 వరకు ఈ పథకాన్ని పొడిగించారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్(ఉడాన్) పథకంలో భాగంగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడం, విమానయానాన్ని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు
ఇండోనేషియా బాలీలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో బూడిద కమ్ముకుని పలు విమానాలు రద్దయ్యాయి. బాలీలోని ‘మౌంట్ లెవోటోబి లకీ-లకీ’ అనే అగ్నిపర్వతం రెండోసారి పేలడంతో దాదాపు 10 కిలోమీటర్ల(32,808 అడుగులు) ఎత్తులో దట్టంగా బూడిద కమ్ముకుందని అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రయాణాలు ప్రమాదకరమని చెప్పారు. దాంతో కొన్ని సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసినట్లు పేర్కొన్నారు.బాలీలోని ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో ఉన్న మౌంట్ లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం నవంబర్ 3న మొదట విస్ఫోటనం చెందింది. తిరిగి మంగళవారం పలుమార్లు భారీ స్థాయిలో బద్దలవ్వడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఇండిగో ప్రకటన విడుదల చేసింది. ‘బాలీలో ఇటీవలి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాంతో వాతావరణంలో భారీగా బూడిద మేఘాలు ఏర్పడ్డాయి. దానివల్ల ఆ ప్రాంతానికి వచ్చిపోయే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని తెలిపింది. ఇండిగో సంస్థ బెంగళూరు నుంచి ఇండోనేషియా బాలీకి రోజువారీ సర్వీసు నడుపుతోంది.ఢిల్లీ-ఇండోనేషియా మధ్య ప్రయాణించే రోజువారీ విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ధ్రువీకరించింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా బుధవారం ఇండోనేషియాకు ప్రయాణించే విమాన ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.ఇదీ చదవండి: గుడ్‌బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటనబాలీ నుంచి దాదాపు 800 కి.మీ దూరంలో ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో నవంబర్ 3న లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం మొదట విస్ఫోటనం చెందింది. దానివల్ల తొమ్మిది మంది మరణించారు. తాజాగా మంగళవారం మళ్లీ పలుమార్లు విస్ఫోటనం చెందింది. మొదటిసారి ఘటన జరిగిన సమయంలో నవంబర్ 4 నుంచి 12 వరకు సింగపూర్, హాంకాంగ్, కొన్ని ఆస్ట్రేలియన్ నగరాల నుంచి బాలీకి ప్రయాణించే 80 విమానాలు రద్దు చేశారు. -
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా ఇండిగో కో-ఫౌండర్
ఇండిగో కో-ఫౌండర్ 'రాకేష్ గంగ్వాల్' అమెరికాలోనే ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. జులైలో బోర్డులో మెంబర్‌షిప్‌గా చేరిన గంగ్వాల్.. ఇటీవల 108 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 900 కోట్లు) విలువైన షేర్స్ కొనుగోలు చేశారు.కొత్త బోర్డు కమిటీ అధ్యక్షుల పేర్లతో పాటుగా గంగ్వాల్ స్వతంత్ర బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారని ప్రకటించింది. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ తిరిగి బలమైన ఆర్థిక పనితీరుకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రెసిడెంట్, సీఈఓ బాబ్ జోర్డాన్ సహకారం కూడా ఉంటుందని గంగ్వాల్ పేర్కొన్నారు.సెప్టెంబరు 30, అక్టోబరు ప్రారంభంలో గంగ్వాల్ 3.6 మిలియన్ షేర్లను సౌత్‌వెస్ట్‌లో కొనుగోలు చేశారు. ఒక్కో షేరుకు 29 డాలర్ల నుంచి 30 డాలర్ల మధ్యలో ఉన్నాయి. మొత్తం పెట్టుబడి 108 మిలియన్ డాలర్లు. గంగ్వాల్ వరల్డ్‌స్పాన్ టెక్నాలజీస్‌కు చైర్మన్ & సీఈఓగా కూడా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఈయన ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్ధి. 2022లో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీని స్థాపించారు. -
హైదరాబాద్ లో అలెర్ట్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు
-
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపులు
సాక్షి,హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నుంచి చండీగఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ శుక్రవారం మధ్యాహ్నం అంగతకులు బాంబు బెదిరింపులకు పాల్పడ్డారు. అగంతకుల ఫోన్ కాల్‌తో ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. 130 ప్రయాణికులతో చండీగఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానాన్ని నిలిపివేశారు. ప్రయాణికుల్ని దించి సోదాలు నిర్వహించారు.గతకొన్ని రోజులగా విమానాలకు బాంబుల బెదిరింపుల బెదడ ఎక్కువైంది. ఈ బాంబు బెదిరింపులపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పందించారు. 9 రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. వాటిపై కేంద్రం దృష్టి సారించింది. విమానంలో బాంబ్ పెట్టామంటూ ఫేక్ కాల్ చేసిన బాలుడిని ముంబై పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికీ వస్తున్న బాంబు బెదిరింపులపైఫేక్ కాల్స్ లేదంటే ఉగ్రకోణం ఉందా? అనే దిశగా విచారణ చేపడుతున్నామని తెలిపారు. -
విమానం దారి మళ్లింపు.. కారణం..
ముంబై నుంచి ఫుకెట్ వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించినట్లు ఇండిగో శుక్రవారం తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ను మలేషియాలోని పెనాంగ్‌కు మళ్లించినట్లు స్పష్టం చేసింది. విమాన మళ్లింపు వార్తను పలువురు ప్రయాణికులు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.‘ఫుకెట్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నాయని సమాచారం అందింది. దాంతో ప్రతిస్పందనగా ముంబై నుంచి ఫుకెట్‌కు వెళుతున్న ఫ్లైట్ నం 6E 1701 ఎయిర్‌క్రాఫ్ట్‌ను మార్గమధ్యలో దారి మళ్లించాం. ప్రతికూల వాతావరణానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే సమీప విమానాశ్రయమైన మలేషియాలోని పెనాంగ్‌లో దించాం. ఈమేరకు ప్రయాణికులకు సమాచారం అందించాం’ అని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ఫుకెట్‌లోని వాతావరణ పరిస్థితిని సమీక్షించి తిరిగి ప్రయాణానికి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు.ఇదీ చదవండి: ‘అన్నీ అవాస్తవాలే’ఫుకెట్‌లో 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఆకాశం మేఘావృతమై ఉందని కొన్ని సంస్థల నివేదికల ద్వారా తెలిసింది. పశ్చిమం నుంచి గంటకు 15 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రతికూల వాతారణ పరిస్థితులు ఉన్నప్పుడు ముందస్తు సమాచారంతో విమానాలను దారి మళ్లించడం సర్వ సాధారణం. ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళనలు చెందకూడదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. -
కొండలు, లోయ ప్రాంతాల్లో సులువుగా నడిపేలా కొత్త టెక్నాలజీ
ఎత్తైన కొండలు, లోయ ప్రాంతాల్లోని ఎయిర్‌పోర్ట్‌ల్లో విమానాలను దించడం, టేకాఫ్ చేయడం సవాలుతో కూడుకున్న విషయం. ఈ సమస్యను అధిగమించేలా ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. నేపాల్ రాజధాని కాఠ్మాండూ లోయ చుట్టూ ఉన్న ప్రతికూల భౌగోళిక పరిస్థితులకు ధీటుగా విమానాన్ని నడిపేందుకు వీలుగా ఆర్ఎన్పీ ఏఆర్ టెక్నాలజీని వినియోగించింది.రిక్వైర్డ్ నేవిగేషన్ ఫర్‌ఫెర్మాన్స్ విత్ ఆథరైజేషన్ రిక్వయిర్డ్(ఆర్ఎన్పీ ఏఆర్)గా పిలువబడే ఈ టెక్నాలజీని విమానంలో వాడడం వల్ల ఎత్తు పల్లాలు వంటి ఎలాంటి భౌగోళిక పరిస్థితుల్లోనైనా విమానాన్ని నడపవచ్చని ఇండిగో తెలిపింది. ఎత్తైన ప్రాంతంపై ఉన్న కాఠ్మాండూ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (కేటీఎం) లాంటి విమానాశ్రయాల కోసం ప్రత్యేకంగా ఈ సాంకేతికతను తయారు చేసినట్లు పేర్కొంది. ఇటీవల ఇండిగో ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఈ ఆర్ఎన్పీ ఏఆర్ సాంకేతికను ఉపయోగించినట్లు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ‘డిస్కౌంట్ ధరకు హెల్మెట్’‘ఎత్తైన ప్రదేశంలోని ఉన్న కాఠ్మాండూ త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (కేటీఎం) విమానాశ్రయం చుట్టూ హిమాలయాలు ఉన్నాయి. దాంతో ఎయిర్‌క్రాఫ్ట్‌ను దించడం, టేకాఫ్ చేయడం సవాలుగా మారుతుంది. ఆర్ఎన్పీ ఏఆర్ విధానం ద్వారా విమాన మార్గాన్ని ముందుగానే గుర్తించి అందుకు తగినట్లుగా పైలట్లు స్పందించే అవకాశం ఉంది. దాంతో ప్రమాదాలు తగ్గుతాయి. కొత్త సాంకేతికతతో ఎత్తు పల్లాల ప్రాంతాల్లో విమానాలను నడపడం సులువవుతుంది. అయితే ఈ టెక్నాలజీ వినియోగించాలంటే పైలట్లకు ప్రత్యేకంగా శిక్షణ అవసరం’ అని ఇండిగో తెలిపింది. -
లవ్ ఈజ్ ఇన్‌ద ఎయర్ : లవ్ ప్రపోజల్ వీడియో వైరల్
తాజ్‌మహల్ ముందే లవ్ ప్రపోజ్ చేయాలా ఏంటి? ఈఫిల్ టవర్ముందు నిలబడే ఐ లవ్ యూ చెప్పాలా? మంచి ఘడియ ముంచుకు రావాలే గానీ ఎక్కడైనా మనసులోని ప్రేమను వ్యక్తం చేయొచ్చు. అందుకే ఇండిగో విమానంలో తన ప్రియుడికి ప్రపోజ్ చేసిందో ప్రేయసి. లవ్ ఈజ్ ఇన్ ది ఎయిర్ అన్నట్టున్న ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. "నేను గాలిలో ప్రపోజ్ చేశాను" అంటూ ప్రియురాలు ఐశ్వర్య బన్సల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ అందమైన ఈ వీడియో ప్రేమికుల మనసు దోచుకుంటోంది.బన్సల్, ప్రియుడు అమూల్య గోయల్ ఫ్లైట్ ఎక్కడంతో వీడియో ప్రారంభమవుతుంది. కొన్ని సెకన్ల తర్వాత, బన్సల్ తన బాయ్‌ఫ్రెండ్ వైపు నడుచుకుంటూ వెళ్లి మోకాళ్లపై నిలబడి తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దీంతో ప్రియుడు ఫుల్ ఖుష్ ఆగి ఆ క్షణంలోనే ఓకే చెప్పేసాడు. అంతే క్షణం ఆలస్యంగా తన బెటర్ హాఫ్ వేలికి ఉంగరాన్ని తొడిగింది. అంతేకాదు దీన్ని ఇండిగో కూడా సెలబ్రేట్ చేసింది. ఫ్లైట్ అటెండెంట్ మైక్రోఫోన్ తీసుకుని, ఇతర ప్రయాణీకుల దృష్టిని ఆకర్షిస్తూ ఈ పెళ్లి ప్రపోజ్ ప్రకటన చేయడం విశేషం. తన జీవితంలో ఎంతో అందమైన ఈ క్షణాలు చాలా ప్రత్యేకంగా ఉండాలని భావించాను. కానీ ఊహించిన దాని కంటే మించి ఇంత అందంగా ఉంటుందని అనుకోలేదు. సిబ్బంది ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డా.. అన్నీ అనుకున్నట్టుగాజరిగాయంటూ అంతులేని సంతోషాన్ని వ్యక్తం చేసింది బన్సల్. ఈ ప్రణయ పక్షుల వీడియోను మీరు కూడా చూసేయండి మరి! View this post on Instagram A post shared by Aishwarya Bansal (@aishwaryabansal_) -
ఆకాశ వీధిలో బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌దే హవా
దేశీయంగా చౌక విమానయాన సంస్థల (బడ్జెట్ ఎయిర్‌లైన్స్–ఎల్సీసీ) హవా కొనసాగుతోంది. అంతర్జాతీయ ట్రావెల్ డేటా సంస్థ ఓఏజీ తాజా గణాంకాల ప్రకారం ఎల్‌సీసీల మార్కెట్ వాటా అత్యధికంగా ఉన్న టాప్ 10 దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. మొత్తం సీట్ల సామర్థ్యంలో ఇండిగో సారథ్యంలోని ఎల్సీసీలకు ఏకంగా 71 శాతం వాటా ఉంది. అంతర్జాతీయంగా చూస్తే భారత్‌కు సమీప పోటీదారు ఇండోనేసియాలో ఇది 64 శాతమే. ఈ విషయంలో అంతర్జాతీయ సగటు 34 శాతంగానే ఉంది. ప్రపంచంలోనే టాప్‌లో ఉన్న నాలుగు విమానయాన సంస్థలు ఎల్సీసీలే కావడం గమనార్హం. సౌత్‌వెస్ట్, రయాన్ఎయిర్, ఇండిగో, ఈజీజెట్ ఈ లిస్టులో ఉన్నాయి. 2019 నుంచి అంతర్జాతీయంగా ఎల్‌సీసీల వాటా 13 శాతం మేర పెరిగింది. సంపన్న దేశాలు, చైనాలో ఎఫ్‌ఎస్‌సీలు .. ఇతర దేశాలను చూసినప్పుడు, అతి పెద్ద ఎయిర్‌లైన్స్ మార్కెట్లలో ఒకటైన చైనాలో ఫుల్ సరీ్వస్ ఎయిర్‌లైన్స్‌దే (ఎఫ్ఎస్సీ) హవా ఉంటోంది. అక్కడ ఎల్‌సీసీల మార్కెట్ వాటా కేవలం 12 శాతమే. ఇక బ్రిటన్ మార్కెట్లో పరిస్థితి కాస్త అటూ ఇటుగా ఉంది. ఎఫ్ఎస్సీలతో పోలిస్తే ఎల్సీసీలకు కాస్త మొగ్గు ఎక్కువగా ఉంది. రయాన్ఎయిర్, ఈజీజెట్, విజ్ ఎయిర్ వంటి ఎల్‌సీసీలు అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఎఫ్ఎస్సీలతో పోలిస్తే ఎల్‌సీసీల మార్కెట్ వాటా ఎక్కువగా ఉన్న దేశాలను పరిశీలిస్తే లాటిన్ అమెరికాలో బ్రెజిల్, యూరప్‌లో ఇటలీ, స్పెయిన్ మొదలైనవి ఉన్నాయి. అమెరికా, జర్మనీ, జపాన్ వంటి సంపన్న దేశాల్లో ఎఫ్ఎస్సీలదే ఆధిపత్యం ఉంటోంది. ఫుల్ సరీ్వస్ క్యారియర్లు ఇంకా కరోనా పూర్వ స్థాయికి కోలుకోవాల్సి ఉంది. ఇండిగో భారీగా విస్తరించడం భారత్‌లో ఎల్‌సీసీల మార్కెట్ వాటా వృద్ధికి దోహదపడింది. ఈ ఏడాది జూలై గణాంకాల ప్రకారం దేశీ ప్యాసింజర్ మార్కెట్లో ఇండిగో సంస్థకు 62 శాతం వాటా ఉంది. ఎల్సీసీ విభాగంలో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇతర ఆదాయంపరంగా సవాళ్లు.. మార్కెట్ వాటాను విస్తరించుకుంటున్నప్పటికీ దేశీయంగా ఎల్‌సీసీలు అనుబంధ ఆదాయాలను మాత్రం పెంచుకోలేకపోతున్నాయి. సీట్లను బట్టి ఫీజులు, ఆహారం, స్పెషల్ చెకిన్లు, సీట్ అప్గ్రేడ్లు, ఎక్స్ట్రా లగేజీ చార్జీలపరమైన ఆదాయం అంతంతే ఉంటోంది. దీన్ని పెంచుకునే అవకాశాలు పరిమితంగానే కనిపిస్తున్నాయి. 2022లో ఇండిగో మొత్తం ఆదాయంలో ఇతరత్రా అనుబంధ ఆదాయం వాటా 7.1 శాతమే. ఈ విషయంలో మొత్తం 64 ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో 54వ స్థానంలో ఉంది. అదే అంతర్జాతీయంగా టాప్ 10 ఎల్‌సీసీలను చూస్తే .. రయాన్ఎయిర్ గ్రూప్ ఆదాయాల్లో అనుబంధ ఆదాయం వాటా 35.7 శాతంగా ఉంది. అదే ఈజీజెట్ను చూస్తే ఇది 33.9 శాతంగా, సౌత్‌వెస్ట్ విషయంలో 24.9 శాతంగా ఉంది. ఈ విషయంలో ఇండిగో ఎక్కడో వెనకాల ఉండటం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
విమానంలోనే శిశువుకు జన్మనిచ్చిన గర్భిణి
విమానం గాల్లో ఉండగానే ఓ మహిళ శిశువుకు జన్మనిచ్చింది. సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ మార్గమధ్యలో మగబిడ్డకు జన్మనిచ్చారు.విజయవాడకు చెందిన దీప్తి సరసు వీర వెంకటరామన్(28) అనే గర్భిణి సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున విమానం గాల్లో ఉన్నప్పుడే పురిటి నొప్పులు మొదలయ్యాయి. విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే దీప్తి కూర్చున్న చోట చుట్టూ వస్త్రాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం అందించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఒక డాక్టర్, ఫ్లైట్ అటెండెంట్లు, మహిళా ప్రయాణికుల సహాయంతో గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇదీ చదవండి: సీప్లేన్ ఏరోడ్రోమ్ నిబంధనల సడలింపుపైలట్ అప్పటికే చెన్నై ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించడంతో ఉదయం 4:30కు ల్యాండ్ అయ్యే సమయానికి గ్రౌండ్ సిబ్బంది, వైద్యులు చేరుకుని వైద్య పరీక్షలు చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులు, సిబ్బంది, డాక్టర్‌ను పలువురు ప్రశంసించారు. అనంతరం తల్లి, బిడ్డలను అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
'క్యూట్ చార్జి' వసూలు చేసిన ఇండిగో.. నెటిజన్ల సెటైర్లు
ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్రయాణికుడి నుంచి టికెట్ చార్జీలతోపాటు ‘క్యూట్ ఫీజు’వసూలు చేయడమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని సదరు ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వివాదం వైరల్‌గా మారింది. విమాన టికెట్ ధరకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేస్తూ.. ఇండిగోపై ప్రశ్నల వర్షం కురిపించాడు.ఈ పోస్టు ప్రకారం.. శ్రేయాన్ష్ సింగ్ అనే వ్యక్తి ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతని వద్ద టికెట్ ధరతో పాటు క్యూట్ ఛార్జ్ కింద రూ.50, ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు కింద రూ.236, యూజర్ డెవలప్మెంట్ ఫీజు కింద రూ.1,003 ఎయిర్‌లైన్ వసూలు చేసినట్లుగా ఉంది. దీన్ని షేర్ చేస్తూ.. ‘‘ఏంటీ క్యూట్ ఫీజు? యూజర్లు అందంగా ఉన్నారని దీన్ని వసూలు చేస్తున్నారా? లేదా మీ విమానాలు క్యూట్‌గా ఉన్నాయని భావిస్తూ దానికి ఛార్జీ తీసుకుంటున్నారా?ఏంటీ యూజర్ డెవలప్మెంట్ ఫీజు? మీ విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నన్ను మీరు ఏవిధంగా డెవలప్ చేస్తారు? ఏంటీ ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు? ప్రయాణాల్లో నా భద్రత కోసం ప్రభుత్వానికి నేను పన్నులు కట్టట్లేదా? లేదా విమానాల్లో భద్రత కోసం పౌరవిమానయాన శాఖ ఔట్సోర్సింగ్ ఏమైనా ఇచ్చిందా?’’ అని ఆ ప్రయాణికుడు ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం చేసిన ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇప్పటికే 20లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు.అయితే దీనిపై ఇండిగో స్పందించింది. ఈ ఛార్జీలు ఎందుకో వివరణ ఇచ్చింది. ‘‘క్యూట్ అంటే కామన్ యూజర్ టర్మినల్ ఎక్విప్మెంట్ ఛార్జ్. సాధారణంగా ఎయిర్‌పోర్టుల్లో మెటల్ డిటెక్టింగ్ మెషిన్లు, ఎస్కలేటర్లు, ఇతర పరికరాలను ఉపయోగించినందుకు వీటిని వసూలు చేస్తాం. ఇక, యూజర్ డెవలప్మెంట్ ఫీజు అనేది.. ఎయిర్‌పోర్టులో మెయింటనెన్స్ కోసం ఛార్జ్ చేస్తున్నాం. సెక్యూరిటీ ఫీజు బుకింగ్‌కు సంబంధించినది’ అని ఎయిర్‌లైన్ వెల్లడించింది. -
స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు.. 77 మంది మహిళా పైలట్ల నియామకం
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇండిగో తన ఎయిర్‌బస్, ఏటీఆర్ విమానాల కోసం 77 మంది మహిళా పైలట్లను నియమించుకుంది. కొత్తగా చేరిన వారితో కలిపి సంస్థలోని మొత్తం మహిళా పైలట్ల సంఖ్య 800కు పెరిగింది.ఇండిగో సంస్థ నియమించుకున్న 77 మందిలో ఎయిర్‌బస్ ఫ్లీట్‌కు 72 మందిని, ఏటీఆర్ ఫ్లీట్‌కు 5 మంది మహిళా పైలట్లను విభజించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం పైలట్లలో మహిళలు సగటున 7-9 శాతంగా ఉన్నారని సంస్థ తెలిపింది. అదే ఇండిగోలోని మొత్తం పైలట్లలో మహిళా సిబ్బంది 14 శాతంగా ఉన్నారని సంస్థ ఫ్లైట్ ఆపరేషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ అషిమ్ మిత్రా పేర్కొన్నారు. మార్చి 31, 2024 నాటికి ఇండిగోలో 5,038 పైలట్లు, 9,363 క్యాబిన్ సిబ్బందితో సహా 36,860 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. సంస్థలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.ఇదీ చదవండి: ఖనిజాల వెలికితీతకు ప్రోత్సాహకాలు -
ఇండియా-బంగ్లాదేశ్ విమానాలు రద్దు
బంగ్లాదేశ్‌లో తీవ్ర నిరసనల మధ్య ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి వెళ్లారు. దాంతో స్థానికంగా ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు ఆ దేశానికి నడిపే తమ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు ప్రయాణించే సర్వీసులను నిలిపేస్తున్నట్లు విమానయాన సంస్థలు చెప్పాయి. సోమవారం ముంబై నుంచి ఢాకాకు విమానాన్ని నడిపిన విస్తారా..తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పింది. మంగళవారం పరిస్థితిని పర్యవేక్షించి నిర్ణయానికి వస్తామని పేర్కొంది. ఎయిరిండియా ఢిల్లీ నుంచి ఢాకాకు రోజువారీ రెండు విమానాలను నడుపుతుండగా వాటిని నిలిసేస్తున్నట్లు చెప్పింది.ఇదీ చదవండి: సైబర్ మోసాలు.. రూ.177 కోట్ల నష్టంఇండిగో సంస్థ ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నుంచి ఢాకాకు విమానాలను నడుపుతుంది. బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఢాకాకు బయలుదేరే విమానాలను రీషెడ్యూల్డ్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే అందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ‘మీ ప్రయాణ ప్రణాళికలకు కలిగిన అంతరాయానికి క్షమించాలి. బంగ్లాదేశ్‌లోని ఉద్రిక్తతలు కారణంగా విమానాలు రద్దు చేస్తున్నాం. తదుపరి వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. -
హైదరాబాద్ నుంచి ఇండిగో కొత్త సర్వీసులు
హైదరాబాద్-అహ్మదాబాద్ మధ్య విమానయాన సంస్థ ఇండిగో కొత్త, అదనపు సర్వీసులు నడుపుతామని ప్రకటించింది. హైదరాబాద్-హిరాసర్ మధ్య నూతన డెయిలీ సర్వీసును సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పింది.సెప్టెంబర్ ఒకటి నుంచి హైదరాబాద్-ఉదయ్‌పూర్ మధ్య వారంలో నాలుగు ఫ్లైట్స్, సెప్టెంబర్ మూడు నుంచి హైదరాబాద్-జోద్పూర్ మధ్య వారంలో మూడు సర్వీసులు తిరిగి మొదలు అవుతాయని చెప్పింది. కొత్త రూట్ల చేరికతో భాగ్యనగరి నుంచి 69 నగరాలకు ప్రతివారం డైరెక్ట్ ఫ్లైట్స్ సంఖ్య 1,220కి చేరనుంది. ఇక అహ్మదాబాద్ నుంచి అమృత్సర్, భువనేశ్వర్‌కు అదనపు ఫ్లైట్స్‌ను నడుపుతామని ఇండిగో పేర్కొంది.ఇదీ చదవండి: ధరలు తగ్గించిన ఏకైన దేశం ఇండియాప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెబుతున్నాయి. దాంతో కంపెనీలు తమ సర్వీసులు పెంచుతున్నాయి. మెట్రో నగరాలతోపాటు టైర్1, 2 సిటీలకు కూడా తమ సర్వీసులను పొడిగిస్తున్నాయి. దేశీయంగా నడిపే విమానాల సంఖ్యను పెంచుతున్నాయి. -
ఇండిగో విమానంలో మహిళ డ్యాన్స్.. వీడియో వైరల్
ఇండిగో విమానంలో ఇటీవల ఓ మహిళా ప్యాసింజర్ చేసిన డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలామంది ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేయడం సాధరణమైందని ఈ వీడియో చూసిన వీక్షకులు కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇండిగో సంస్థ ఇలాంటి వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.సల్మాషేక్ అనే మహిళా ప్యాసింజర్ ఈ వీడియోలో నల్లటి చీర కట్టుకుని రజనీకాంత్ నటించిన ‘భాషా’ చిత్రంలోని ‘స్టైల్స్టైల్’ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్‌ను ఇప్పటికే 16 లక్షల మంది వీక్షించారు. View this post on Instagram A post shared by Salma Sheik (@salma.sheik.9216)ఇదిలాఉండగా, ఈ వీడియో చూసినవారు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఈ విమానం తన ప్రైవేట్ ఫ్లైట్ కాదు. ఇలా వ్యవహరించడం సరికాదు’ అంటూ ఒక వ్యక్తి కామెంట్ చేశారు. ‘ఈ వీడియో చాలా భయంకరంగా ఉంది. పబ్లిక్‌లో ఇలాంటివి చేయడానికి సిగ్గుపడాలి. ఆమె ధైర్యంగా ఉందని అభినందించాలో.. లేదా ఇలా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసినందుకు అసహనం వ్యక్తం చేయాలో తెలియడం లేదు’ అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు. -
ఇండిగో కీలక ప్రకటన.. బెంగళూరు నుంచి అబుదాబి డైరెక్ట్ ఫ్లైట్
ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఇండిగో.. అబుదాబీకి పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 1నుంచి బెంగళూరు - అబుదాబి మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.భారతీయ ప్రయాణికులకు సేవలందించడం మాత్రమే కాదు, అంతర్జాతీయ పర్యటనను కూడా సులభతరం చేయడానికి ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండిగో వారానికి ఆరు సార్లు బెంగళూరు నుంచి అబుదాబికి, అబుదాబి నుంచి బెంగళూరుకు ఫ్లైట్స్ నడపడానికి సిద్ధమైంది.బెంగళూరు నుంచి 6E 1438 విమానం మంగళవారం మినహా ప్రతి రోజూ రాత్రి 9:25 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 11:30 గంటలకు అబుదాబి చేరుకుంటుంది. అదే విధంగా బుధవారం మినహా అబుదాబి నుంచి అర్ధరాత్రి 12:30 గంటలకు బయలుదేరి 6E 1439 విమానం మరుసటి రోజు ఉదయం 5:45 గంటలకు కెంపెగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది.బెంగళూరు నుంచి అబుదాబి వెళ్లాలనుకునే వారికి ఇండిగో చేసిన ప్రకటన ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సంస్థ తన పరిధిని ఎప్పటికప్పుడు విస్తరిస్తూ.. ప్రజలకు తమదైన రీతిలో సేవలందిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రయాణికుల అవసరాలను బట్టి తన సర్వీసును మరింత పెంచనున్నట్లు సమాచారం. -
విమాన ప్రయాణం నాలుగు గంటలు ఆలస్యం..కారణం..
దిల్లీ నుంచి బాగ్డోగ్రాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం వాతావరణంలోని వేడిగాలుల వల్ల దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దిల్లీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల విమానప్రయాణాల్లో అంతరాయం ఏర్పడుతోందని ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..సోమవారం మధ్యాహ్నం 2:10 గంటలకు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి సమీపంలో ఉన్న బాగ్డోగ్రాకు వెళ్లాల్సిన ఇండిగో విమానం సాయంత్రం 6:15గంటలకు బయలుదేరింది. దిల్లీలో వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. సోమవారం 45డిగ్రీల ఉష్ణోగ్రతతో గాలులు వీయడం వల్ల ప్రయాణంలో అంతరాయం ఏర్పడింది.ఈ సందర్భంగా ఇండిగో ప్రతినిధి మాట్లాడుతూ..‘అధిక ఉష్ణోగ్రతల వల్ల దిల్లీ నుంచి బాగ్డోగ్రాకు వెళ్లే ఇండిగో విమానం 6E 2521 ప్రయాణం ఆలస్యమైంది. ఇండిగో అన్నింటికంటే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. వేడిగాలులతో కొన్నిసార్లు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దాంతో ఆలస్యం అనివార్యమైంది. సంస్థ నిత్యం ప్రయాణికులకు సమాచారం అందిస్తుంది. ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని చెప్పారు.హీట్ వేవ్స్ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) ప్రకారం..వరుసగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ రోజులపాటు సగటు ఉష్ణోగ్రత కంటే గరిష్ఠ ఉష్ణోగ్రత ఐదు డిగ్రీలు అధికంగా నమోదైతే దాన్ని హీట్‌వేవ్‌గా పరిగణిస్తారు. ప్రభావిత ప్రాంతం గరిష్ట ఉష్ణోగ్రత రెండు రోజుల పాటు వరుసగా 45 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే అది వేడి గాలులుగా మారే ప్రమాదముందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ఈ హీట్‌వేవ్‌ను ‘నిశ్శబ్ద విపత్తు’ అని కూడా పిలుస్తారు. భారత్‌లో హీట్‌వేవ్స్ సాధారణంగా మార్చి-జూన్ మధ్య, అరుదైన సందర్భాల్లో జులైలోనూ సంభవిస్తాయి. ఇటీవల దిల్లీలోని నరేలాతోపాటు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు దిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. -
ఢిల్లీలో అధిక ఉష్ణోగ్రత.. విమానంలో సాంకేతిక లోపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఢిల్లీ నుంచి బెంగాల్‌లోని బాగ్డోగ్రా వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.దీంతో విమానం బయలుదేరడం రెండు గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏసీ పనిచేయకపోవడంతో విమానంలో గాలి లేక కొందరు అస్వస్థతకు గురయ్యారు. విమానం డోర్ మూసివేయడంతో వేడి తీవ్రత ఎక్కువైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన ఇండిగో సంస్థ వివరణ ఇచ్చింది. ‘ప్రయాణికుల భద్రతకు ఇండిగో ప్రాధాన్యతనిస్తుంది. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’అని తెలిపింది. -
ఒకే రన్‌వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?
ఎయిర్పోర్ట్ రన్‌వేపై దాదాపు నిమిషంలోపు రెండు విమానాలు ప్రయాణించడం సాధ్యమవుతుందా అంటే అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాతావరణంలో ఎలాంటి విజిబిలిటీ సమస్యలు లేవని నిర్ధారించుకుని షరతులకు లోబడి ఇది సాధ్యపడుతుందని నిబంధనలు చెబుతున్నాయి.ఒకే రన్‌వేపై రెండు విమానాలు ప్రయాణించేలా అనుమతులివ్వాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. ‘ఏటీసీ నియమాల ప్రకారం..వాతావరణంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవని నిర్ధారించుకోవాలి. విజిబిలిటీ సమస్యలు ఉండకూడదు. ప్రత్యేక షరతులకు లోబడి, ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి మూడు నిమిషాలలోపు రెండు విమాన టేకాఫ్‌లు, రెండు ల్యాండింగ్లకు అనుమతించవచ్చు’అని పీటీఐ తెలిపింది.ముంబై ఎయిర్‌పోర్ట్‌లో..జూన్ 8న 6ఈ 6053 అనే ఇండిగో విమానం ఇందోర్ నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సి ఉంది. దాంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ను ల్యాండింగ్ క్లియరెన్స్ కోసం అనుమతించాలని కోరారు. ఏటీసీ సూచనలను అనుసరించి ఇండిగో విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. ఇదిలాఉండగా, ఎయిర్ఇండియాకు చెందిన ఏఐ657 అనే విమానం అదే సమయంలో ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఏటీసీ టేకాఫ్‌కోసం అనుమతించారు. దాంతో రెండు విమానాలు నిమిషం తేడాతో రన్‌వేపై ప్రయాణించాయి. ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల్లో ఇండిగో విమానం అదే రన్‌వేపై ల్యాండ్ అయింది. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే రెండు విమానాల ప్రయాణికులకు తీవ్ర నష్టం జరిగేదని తోటి ప్యాసింజర్లు తెలిపారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)ని విధుల్లో నుంచి తొలగించి విచారణ జరుపుతోంది.ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్..!ఇదిలాఉండగా, విమానాశ్రయాల్లో అధిక జనసాంద్రత ఉన్నపుడు ఏటీసీలపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. ఏటీసీ, సంబంధిత పైలట్లు ఘటనకు సంబంధించి సరైన నిబంధనలు అనుసరించారా లేదా అనే అంశంపై డీజీసీఏ విచారణ జరుగుతుందని చెప్పారు. అధిక జనసాంద్రత కలిగిన విమానాశ్రయాల్లో ముంబై ఎయిర్పోర్ట్ ఒకటి. అక్కడ విమానాలరాకపోకలు ఎక్కువగా ఉంటాయి. విమానాశ్రయంలోని ఆర్డబ్ల్యూ27 అనే రన్‌వేపై గంటకు 46 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయని తెలిసింది.Serious security concern at @CSMIA_Official Mumbai Airport yesterday putting 100s of life at riskWhile @airindia ✈️ was in the process of take off, another 🛬 from @IndiGo6E was allowed to land on same runway@DGCAIndia takes action against #Mumbai ATC official responsible pic.twitter.com/nsJvHZrWTZ— Nikhil Lakhwani (@nikhil_lakhwani) June 9, 2024 -
ఒకే రన్‌వేపై రెండు విమానాలు.. ముంబైలో తప్పిన ప్రమాదం
విమాన ప్రమాదమనగానే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఏదైనా విమాన ప్రమాదం తప్పిందని తెలియనే ఊపిరి పీల్చుకుంటాం. ఇటువంటి సందర్భాల్లో ఆయా విమానాల్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురవుతారు. తాజాగా ముంబైలో విమాన ప్రమాదం తృటిలో తప్పింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం ముంబై విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలోని రన్‌వేపై నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతుండగా.. ఊహించని విధంగా అదే సమయంలో ఇండిగో విమానం ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో టేకాఫ్ అవుతున్న ఎయిరిండియా జెట్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగింది.ఈ ఘటనపై స్పందించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే డ్యూటీలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారిని సస్పెండ్ చేశారు. ఇక ఈ రెండు విమానాలు సమీపంగా వచ్చిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. Woh, this looks real close.@IndiGo6E lands just when @AirIndia was taking-off at Mumbai Airport.@DGCAIndia @FAANews @CSMIA_Official @MoCA_GoI pic.twitter.com/wRtFiTLKHE— Tarun Shukla (@shukla_tarun) June 9, 2024 -
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
-
100 విమానాలు కొనుగోలు చేయనున్న ఇండిగో.. ఎందుకంటే..
ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలందించేలా ఇండిగో సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దానికోసం మూడు విమాన తయారీ సంస్థలతో చర్చలు జరుపుతోంది.ఇండిగో సంస్థ ప్రాంతీయ మార్గాల్లో విమాన సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. స్థానికంగా ప్రయాణికులకు రవాణా సేవలందించి లాభాలు పొందాలని యోచిస్తోంది. అందులో భాగంగా కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. అయితే వీటి తయారీకి ఏటీఆర్, ఎంబ్రాయిర్, ఎయిర్‌బస్ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా 50 విమానాలకు ఆర్డరు పెట్టి, తర్వాత మరో 50 విమానాలు కొనుగోలు చేయాలనుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇండిగో 45 ఏటీఆర్-72 విమానాలను నడుపుతోంది. అందులో ప్రతి విమానంలో 78 సీట్లు ఉంటాయి. ఈ ఏడాదిలో మరో 5 కొత్త విమానాలు కంపెనీలో చేరనున్నాయి.ఇదీ చదవండి: తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావంఏటీఆర్‌తోపాటు ఎయిర్‌బస్ ఏ220, ఎంబ్రేయర్ ఈ-175 రకం విమానాలను కంపెనీ పరిశీలిస్తోంది. ఇటీవల అంతర్జాతీయ మార్గాలను చేరుకునేందుకు వీలుగా ఏప్రిల్‌లో 30 ఎయిర్‌బస్ ఏ350-900 విమానాల కోసం ఆర్డర్ చేసింది.


