Live Updates
కొనసాగుతున్న ఇండిగో ప్రయాణికుల కష్టాలు
డిసెంబర్ 10 నాటికి పరిస్థితులు సద్దుమణుగుతాయా?
డిసెంబర్ 10 నాటికి ఇండిగో తన కార్యకలాపాలను స్థిరీకరించాలని భావిస్తోంది.
ప్రధాన విమానాశ్రయాల్లో అధిక మొత్తంలో విమానాలు రద్దు అవుతున్నాయి.
ఈ రోజు ఢిల్లీ, ముంబై, చెన్నై, అగర్తలా, మధ్యప్రదేశ్ విమానాశ్రయాలు ఈ సంక్షోభం కారణంగా ప్రభావితమయ్యాయి.
రాజస్థాన్‌లో పెరుగుతున్న బుకింగ్ క్యాన్సిలేషన్లు
రాజస్థాన్‌లో ఇండిగో విమానాల క్యాన్సిలేషన్లు అధికమవుతున్నాయి.
రాజస్థాన్ పీక్ టూరిజం సీజన్ దెబ్బతిందని పరిశ్రమ వాటాదారులు తెలుపుతున్నారు.
రాష్ట్ర పర్యాటకానికి అత్యంత లాభదాయకమైన కాలంగా పరిగణించబడే డిసెంబర్ నెలలో ఇలా విమానాలు రద్దవ్వడం తీవ్రంగా దెబ్బతీసినట్లు చెబుతున్నారు.
జీఎంఆర్ అజ్వైజరీ జారీ
ఇండిగో విమానాల్లో ఇంకా అంతరాయం కొనసాగే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నిర్వహణ సంస్థ జీఎంఆర్ తెలిపింది.
ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు విమాన స్టేటస్‌ను తనిఖీ చేయాలని సూచించారు.
ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశారు.
Delhi Airport GMR says, "IndiGo flights may still experience delays. Passengers are advised to check the latest flight status with their airline before leaving for the airport to avoid inconvenience. Our teams are working closely with all stakeholders to minimize delays and… pic.twitter.com/evky3sdFaB
— ANI (@ANI) December 7, 2025
ఆదివారం 650 ఇండిగో విమానాలు రద్దు
ఇండిగో వరుసగా ఆరో రోజు సర్వీసుల్లో అంతరాయాలను ఎదుర్కొంటోంది.
ఆదివారం మొత్తం 650 విమానాలను రద్దు చేశారు.
సాధారణంగా నడిపే మొత్తం 2,300 రోజువారీ విమానాలలో ఆదివారం 1,650 విమానాలను నడుపుతున్నట్లు ఇండిగో తెలిపింది.
హైదరాబాద్ విమానాశ్రయంలో 115, ముంబైలో 112, ఢిల్లీలో 109, చెన్నైలో 38, అమృత్‌సర్‌లో 11 విమానాలను రద్దు చేశారు.
ఇది ప్రభుత్వ వైఫల్యమే: కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్
- ఇండిగో విమాన ఆలస్యం, రద్దుపై కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్ ఆగ్రహం
- నేను ఇండిగోతో చాలాసార్లు ప్రయాణించాను.. వారి సర్వీస్ బాగానే ఉంటుంది.
- కానీ సమస్య ఎక్కడ జరిగిందో నాకు తెలియదు. వైఫల్యం మాత్రం ప్రభుత్వానిదే.
- ఇండిగో చాలా విమానాలను కలిగి ఉండవచ్చు కానీ అది తన సిబ్బందిని పెంచలేదు.
- వారు ఇప్పటికే ఉన్న సిబ్బందితో 15-20 గంటలు పని చేయవచ్చని భావించారు. ఇది ఆమోదయోగ్యం కాదు.
- తప్పు ఇండిగో చేస్తున్నప్పటికీ ఇందులో కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమైంది.
- కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇండిగో యజమాని ఇప్పటికే జైలులో ఉండేవారు
Delhi: On IndiGo flight delays and cancellations, Congress MP Manoj Kumar says, "The government has failed in this, and it is responsible. This may be my personal statement. I have traveled a lot with Indigo, and if you ask me about the service, it was good. But I don’t know… pic.twitter.com/S2trty9mHt
— IANS (@ians_india) December 7, 2025
డీజీసీఏ దర్యాప్తు బృందం ఏర్పాటు
- ప్రస్తుత సంక్షోభానికి గల కారణాలను పరిశోధించడానికి నలుగురు సభ్యుల విచారణ ప్యానెల్‌ను ఏర్పాటు చేసిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)
- ఈ కమిటీలో సభ్యులుగా డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్స్ సంజయ్ కె. బ్రహ్మణే, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ కెప్టెన్ కపిల్ మాంగ్లిక్, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ కెప్టెన్ రాంపాల్
- అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలుగా సూచనలతో 15 రోజుల్లోపు నివేదిక సమర్పించనున్న ప్యానెల్
3 రోజులుగా చండీగఢ్‌లోనే చిక్కుకున్న నేపాలీ పర్యాటకుడు
- ఈరోజు చండీగఢ్ విమానాశ్రయంలో మూడు విమానాలను రద్దు చేసిన ఇండిగో
- వీటిలో ముంబైకి వెళ్లాల్సిన 6E5261, లక్నోకి వెళ్లాల్సిన 6E146, కోల్‌కతాకి వెళ్లాల్సిన 6E627 విమానాలు
- ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత తెలిసిన సమాచారం.
- ఇండిగో విమానాలు రద్దు కావడంతో మూడు రోజులుగా చండీగఢ్‌లోనే చిక్కుకుపోయిన నేపాలీ పర్యాటకుడు
- తాను ఈరోజు ఉదయం 7 గంటలకు మళ్ళీ వచ్చానని, కానీ ఈరోజు కూడా విమానం క్యాన్సిల్ అయిందని వాపోయిన రామచంద్ర
చెన్నై నుండి రీషెడ్యూల్ విమానాలు కూడా రద్దు
- చెన్నై నుండి రీషెడ్యూల్ చేసిన విమానాలు కూడా రద్దు
- చెన్నై నుండి పూణే, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, గౌహతి, విశాఖపట్నం వంటి నగరాలకు వెళ్లే విమానాలు మళ్లీ రద్దు
- నిన్నటి రద్దు తర్వాత ఈరోజుకు టిక్కెట్లను రీషెడ్యూల్ చేసుకున్న ప్రయాణీకులు
- రీషెడ్యూల్ విమానాలు కూడా రద్దు కావడంతో తప్పని ఇబ్బందులు
ఇండిగో సిబ్బందికి గౌరవం ఇవ్వండి: సోనూసూద్
- ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ..
- నటుడు సోనూసూద్ కీలక విజ్ఞప్తి
- తన కుటుంబ సభ్యులు కూడా దాదాపు 8 గంటలు విమానాశ్రయంలో ఎదురు చూశారు
- ఫ్లైట్ ఆలస్యమవడం బాధ కలిగించొచ్చు
- కానీ కౌంటర్ వద్ద ఉన్న ఉద్యోగులు దానికి కారణం కాదు
- వారు కూడా అదే ఒత్తిడిలో ఉన్నారు
- సిబ్బందిపై ఆగ్రహం చూపొద్దు.
- వారికి గౌరవం ఇవ్వాలంటూ పిలుపు
220కి పైగా విమానాలు రద్దు
- ఢిల్లీ, ముంబై విమానాశ్రయాల్లో 220కి పైగా విమానాలు రద్దు
- ఆదివారం ముంబై విమానాశ్రయం నుండి 112 విమానాలు, ఢిల్లీ విమానాశ్రయం నుండి 109 విమానాలు క్యాన్సిల్
హైదరాబాద్ నుండి 115 విమానాలు క్యాన్సిల్
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి రద్దు అయిన 115 ఇండిగో విమానాలు
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) ప్రకారం.. ఆదివారం 54 ఇన్‌కమింగ్, 61 అవుట్‌గోయింగ్ ఇండిగో విమానాలు రద్దు
ఇదిగో ఈ విమానాల్నీ రద్దు
- రాయ్‌పూర్ నుండి 2, చండీగఢ్ నుండి 3 విమానాలు రద్దు చేసిన ఇండిగో
- రాయ్‌పూర్ నుండి బెంగళూరుకు ఒక విమానం, రాయ్‌పూర్ నుండి హైదరాబాద్‌కు ఒక విమానం క్యాన్సిల్
- చండీగఢ్ నుండి మూడు విమానాలు కూడా రద్దు
- ఇండిగో భోపాల్ నుండి 2, జబల్పూర్ నుండి 2, ఇండోర్ నుండి 25 విమానాలను క్యాన్సిల్ చేసిన ఇండిగో
- మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుండి రెండు ఇండిగో విమానాలు, జబల్పూర్ నుండి రెండు విమానాలు రద్దు
- జబల్పూర్ లోని దుమ్నా విమానాశ్రయం నుండి మొత్తం ఆరు విమానాలు నడుస్తుండగా ఆదివారం, జబల్పూర్ మీదుగా ముంబై-ఢిల్లీ విమానం క్యాన్సిల్
- దీనితో పాటు, బెంగళూరు నుండి జబల్పూర్ మధ్య అప్ అండ్ డౌన్ విమానం ఈ రోజు రద్దు
- చండీగఢ్ నుండి 3 విమానాలను రద్దు చేసిన విమానయాన సంస్థ
ఇండిగో కీలక ప్రకటన
- కీలక నిర్ణయం తీసుకున్న ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్
- పరిస్థితిని పర్యవేక్షించడానికి క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటన
చరిత్రలోనే దారుణ సంక్షోభం: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
- ఇండిగో సంక్షోభాన్ని దేశ చరిత్రలోనే అత్యంత దారుణ సంక్షోభంగా పేర్కొన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
- వేలాది విమానాలు రద్దు చేశారు.. ప్రజలు ప్రతిచోటా చిక్కుకుపోయారు.
- ఇండిగో వైఫల్యం ప్రభుత్వ గుత్తాధిపత్య నమూనా ప్రత్యక్ష ఫలితం.
- దీనికి సాధారణ భారతీయులే మూల్యం చెల్లిస్తున్నారు.
- భారతదేశం చరిత్రలో అత్యంత ఘోరమైన విమానయాన సంక్షోభాన్ని చూస్తోందంటూ ఎక్స్‌లో పోస్ట్
రామ్మోహన్ నాయుడుపై కేఏ పాల్ ఫైర్
- కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుపై ఫైర్ అయిన కేఏ పాల్
- ఏకంగా 1000 ఫ్లైట్‌లు క్యాన్సిల్ అవడంపై మండిపాటు
- ప్రయాణికుల ఇబ్బందులను రామ్మోహన్ నాయుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం
- ఫ్లైట్ చార్జీల దోపిడీని అడ్డుకోవడంలో వైఫల్యం చెందారని ఫైర్
బుకింగ్‌లకు పూర్తి మొత్తం రిఫండ్
- డిసెంబర్ 5-15 మధ్య చేసిన బుకింగ్‌లకు పూర్తి మొత్తాన్ని రిఫండ్ చేయనున్న ఇండిగో
- ఈ రీఫండ్ కోసం ఎటువంటి ప్రశ్నలు అడగబోమన్న కంపెనీ
- అసౌకర్యానికి కస్టమర్లకు క్షమాపణలు కూడా చెప్పిన ఎయిర్‌లైన్స్
అహ్మదాబాద్ విమానాశ్రయంలో రైల్వే శాఖ, ఐఆర్‌సీటీసీ హెల్ప్ డెస్క్
- అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సంయుక్తంగా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసిన రైల్వే శాఖ, ఐఆర్‌సీటీసీ
- చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యక్ష చెల్లింపు ప్రాతిపదికన నేరుగా హెల్ప్ డెస్క్ వద్దే వద్ద టికెట్ల బుకింగ్
- ప్రస్తుతం అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి నడుస్తున్న రెండు ప్రత్యేక రైళ్లు
కేరళ: తిరుచ్చి విమానాశ్రయం.. 1 విమానాలు రద్దు
కేరళలోని తిరుచ్చి విమానాశ్రయం నుండి 11 విమానాలు రద్దు
ఉదయం 10 గంటల నాటికి, ఇక్కడి నుంచి 11 విమానాలు రద్దు
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టెన్షన్..
- ఇండిగో విమానాల రద్దుపై ప్రయాణికుల ఆగ్రహం
- ఇండిగో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదం.
- విమానాల రద్దుపై ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నలు.
"मेरी पत्नी गर्भवती है। हम सुबह 7 बजे से यहाँ फँसे हुए हैं, कोई अपडेट नहीं, कोई मैसेज नहीं, #IndiGo की तरफ़ से कुछ भी नहीं"
💔😥 pic.twitter.com/gDFgs3wr7t— ममता राजगढ़ (@rajgarh_mamta1) December 6, 2025
ప్రయాణికులకు ఊరట..
- ఇండిగో ప్రయాణికులకు శుభవార్త.
- దేశంలో 95 శాతం సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధమైన ఇండిగో.
- నేటి నుంచి 1500 విమాన సర్వీసులు షెడ్యూల్!
— IndiGo (@IndiGo6E) December 6, 2025
శంషాబాద్ నుంచి వంద విమానాల రద్దు
- శంషాబాద్ నుంచి వంద విమానాల రద్దు
- ఇండిగో విమానాల రద్దు కొనసాగుతోంది.
- శంషాబాద్ నుంచి దాదాపు 100కు పైగా విమానాలు రద్దు.
- రావాల్సిన విమానాలు-54
- వెళ్లాల్సిన విమానాలు-61 రద్దు
నేడు రాత్రి 8 గంటల్లోగా రీఫండ్..
- ప్రయాణికులకు టికెట్ల రుసుమును వేగంగా పూర్తిచేయాలని ఇండిగోకు పౌర విమానయాన శాఖ ఆదేశం.
- టికెట్ రీఫండ్ ఆదివారం రాత్రి 8 గంటల్లోగా పూర్తి కావాలని తేల్చి చెప్పింది.
- రీఫండ్ విషయంలో ఆదేశాలు పాటించకపోయినా, ఆలస్యం చేసినా చట్టపరమైన చర్యలు.
- రీషెడ్యూలింగ్ విమానాల విషయంలో ప్రయాణికుల నుంచి అదనంగా చార్జీలు వసూలు చేయకూడదని సూచన.
- ప్రయాణికులకు సహకరించడానికి ప్రత్యేకంగా రీఫండ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశం.
- సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా ఈ కేంద్రాలను కొనసాగించాలని వెల్లడించింది.
- ఒకవేళ ప్రయాణికుల నుంచి బ్యాగేజీ తీసుకొని ఉంటే రెండు రోజుల్లోగా తిరిగి అందజేయాలని పేర్కొంది.
- నిబంధనల ప్రకారం అవసరమైన చోట ప్రయాణికులకు పరిహారం అందించాలని వెల్లడి.
- ప్రస్తుత సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమయ్యే సౌకర్యాలు కల్పించడానికి పర్యవేక్షణ
తిరుపతి చేరుకున్న ఇండిగో విమానం
- తిరుపతి చేరుకున్న ఇండిగో విమానం
- హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్న ఇండిగో విమానం.
- తిరుపతి విమానాశ్రయానికి ఉదయం 7.45కు చేరుకున్న ఇండిగో విమానం
ఇండిగో ఎఫెక్ట్.. రైల్వేల ఆఫర్
- ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో రైల్వే కీలక ప్రకటన.
- స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్న ప్రకటించిన భారత రైల్వే
- ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైళ్లు.
- ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సందడి.
#WATCH | Railways has announced special trains across different parts of the country for the convenience of passengers, amid IndiGo flight cancellations.
Visuals from Hazrat Nizamuddin railway station in Delhi. pic.twitter.com/Pay9DlUScm— ANI (@ANI) December 7, 2025
ముంబైలో ప్రయాణికుల పడిగాపులు..
- ముంబైలో ప్రయాణికుల పడిగాపులు..
- ఇండిగో విమానాల రద్దు కారణంగా ముంబైలో ప్రయాణికుల ఇక్కట్లు.
- ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో ప్రయాణికుల పడిగాపులు.
#WATCH | Mumbai: Visuals from Chhatrapati Shivaji Maharaj International Airport in Mumbai, where IndiGo passengers continue to be affected amid flight disruptions and cancellations. pic.twitter.com/si8ELSQ0Ou
— ANI (@ANI) December 7, 2025
తిరుపతిలో ప్రయాణికుల కష్టాలు..
- తిరుపతి
- తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కొనసాగుతున్న ఇండిగో ప్రయాణీకులు కష్టాలు
- ఆరో రోజు ఇండిగో ప్రయాణీకులకు తప్పని కష్టాలు
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కేంద్ర విమానయాన శాఖ వైఫల్యం


