ఢిల్లీ: భారత్‌లో విమానయాన సంస్థ ఇండిగో విమాన సేవలకు వరుసగా ఐదో తీవ్ర అంతరాయం కలిగింది. విమాన సర్వీసుల రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా విమాన సర్వీసులను రద్దు కావడంతో విదేశీయులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఓ విదేశీ మహిళ.. ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు సిబ్బందితో గొడవకు దిగారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ ఆఫ్రికన్ ప్రయాణికురాలు ఇండిగో సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో సిబ్బందితో సదరు మహిళ గొడవకు దిగారు. తాను ప్రయాణించాల్సిన విమానం రద్దు కావడంతో ఇండిగో కౌంటర్‌పైకి ఎక్కి సిబ్బందితో వాగ్వాదం పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కేకలు వేసింది. ఆమె తీరు చూసిన ఇండిగో సిబ్బంది దెబ్బకు హడలెత్తిపోయారు. ఒక్కసారిగా అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు.. సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరో ఐదు నుంచి పది రోజులు పడుతుందని ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్బెర్స్ తెలిపారు. ఇండిగో ప్రకటనపై ప్రయాణికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే వరకు తమకు ఎందుకు సమాచార ఇవ్వలేదని ఫైర్ అవుతున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ఇండిగో సిబ్బందితో గొడవకు దిగారు. పలువురు ప్రయాణికులు వారికి చెక్‌ఇన్ అయ్యాక విమానాలు రద్దు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు విమానాశ్రయాల్లో తిండి, నిద్రలేకపోవడంతో ప్రయాణికులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
Delhi airport scene hai .
The worst thing is the government is sleeping 😴 pic.twitter.com/8Yl7mWorJm— Charu Yadav (@YadavCharu28) December 5, 2025


