శంషాబాద్‌లో టెన్షన్‌.. ఇండిగో సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం | Indigo Airline Passengers Protest At Shamshabad Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌లో టెన్షన్‌.. ఇండిగో సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం

Dec 6 2025 10:46 AM | Updated on Dec 6 2025 12:15 PM

Indigo Airline Passengers Protest At Shamshabad Airport

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఇండిగో తీరు, సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానాల రద్దు విషయంలో ఎయిర్‌పోర్టుకు వచ్చే వరకు తమకు ఎందుకు ఇవ్వలేదని ఇండిగో సిబ్బందిని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. దీంతో, స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా, ఐదో రోజు కూడా ఇండిగో సర్వీసులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

వివరాల ​ప్రకారం.. శంషాబాద్‌ నుంచి పలు నగరాలకు వెళ్లాల్సిన ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. శంషాబాద్‌ నుంచి ఇండిగోకు చెందిన 69 సర్వీసులు నేడు రద్దు అయ్యాయి. దీంతో, ఆయా సర్వీసుల్లో టికెట్‌ తీసుకున్న ప్రయాణికులు భారీ సంఖ్యలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. తీరా వచ్చాక సర్వీసులు రద్దు విషయం తెలిసి.. సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు వచ్చే వరకు తమకు ఎందుకు సమాచార ఇవ్వలేదని ఫైర్‌ అయ్యారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ఇండిగో సిబ్బందితో గొడవకు దిగారు. మరోవైపు.. పలువురు ప్రయాణికులు వారికి చెక్‌ఇన్‌ అయ్యాక విమానాలు రద్దు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్ప స్వాముల సైతం ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు.

టికెట్‌ ధరలకు రెక్కలు..
ఇండిగో సంక్షోభం ముదురుతున్న వేళ విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటాయి. కోల్‌కతా నుంచి ముంబైకి వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమాన టికెట్‌ ధర శుక్రవారం ఏకంగా రూ.90,000కు చేరుకుంది. ముంబై నుంచి భువనేశ్వర్‌కు ఎయిరిండియా నడుపుతున్న విమానం టికెట్‌ ధర కూడా రూ.84,485 పలికింది. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి రూ.25 వేలు, విజయవాడకు రూ.18 వేలు పలికాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement