విజయవాడ : నగర పాలక సంస్థ సహకారంలో రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫల,పుష్ప ప్రదర్శన నగర వాసులను ఆకట్టుకుంటుంది.
పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రదర్శనను శుక్రవారం తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల పూల మొక్కలు, వైవిధ్య భరితమైన పుష్పాలు ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.
వందకు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఢిల్లీకి చెందిన ప్రముఖ బోన్సాయ్ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో బోన్సాయ్ మొక్కల ప్రదర్శన ఆకర్షిస్తోంది.


