సిరీస్ విజయమే లక్ష్యంగా తలపడేందుకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు గురువారం విశాఖ చేరుకున్నాయి. రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం.. ప్రత్యేక విమానంలో క్రికెటర్లు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఇరుజట్ల ఆటగాళ్లకు అభిమానులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రత్యేక బస్సుల్లో రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్లారు.
ఈ నెల 6న వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో సిరీస్‌లోని నిర్ణయాత్మకమైన చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. శుక్రవారం ఇరుజట్లు స్టేడియంలో ప్రాక్టీస్‌తో పాటు మ్యాచ్ విజయానికి ప్రణాళికలు రచించనున్నాయి.


