రష్మిక నటించిన రెండు సినిమాలు ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్నాయి. అందులో ఒకటి 'ద గర్ల్‌ఫ్రెండ్'. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఈ బ్యూటీ చేసిన హారర్ మూవీ కూడా ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో చూడొచ్చు?
(ఇదీ చదవండి: సమంతకు ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం అయిపోయిందా?)
రష్మిక ఓవైపు తెలుగు, మరోవైపు హిందీ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలా ఈ ఏడాది దీపావళికి 'థామా' అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్‌లోని 'స్త్రీ' యూనివర్స్‌లో భాగంగా వచ్చిన చిత్రమిది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా, నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా చేశాడు. ఇందులో రష్మిక.. రక్తం తాగే అమ్మాయి అంటే వ్యాంపైర్ పాత్రలో కనిపించింది. థియేటర్లలో ఓ మాదిరిగా ఆడినప్పటికీ ఈమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
థియేటర్లలో అక్టోబరు 21న రిలీజైన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, హిందీలో ప్రస్తుతానికి అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఉచితంగా ఎప్పటినుంచి అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు రిలీజ్)
'థామా' విషయానికొస్తే.. అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ జర్నలిస్ట్. ఫ్రెండ్స్‌తో కలిసి న్యూస్ కవరేజీ కోసం ఓ రోజు కొండ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఇతడిపై ఎలుగుబంటి దాడి చేయగా.. తడ్కా (రష్మిక) రక్షిస్తుంది. ఆమె బేతాళ జాతికి చెందిన యువతి. మనుషుల రక్తాన్ని తాగే అలవాటున్న వీళ్లకు ఎన్నో అతీత శక్తులుంటాయి. ఈ జాతికి నాయకుడు థామాగా పిలిచే యక్షాసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) చేసిన ఓ తప్పు కారణంగా బేతాళ జాతి అతడిని ఎన్నో దశాబ్దాలుగా ఓ గుహలో బందీగా ఉంచుతుంది.
అలాంటి బేతాళ సామ్రాజ్యంలోకి అలోక్ వచ్చాడని తెలిసి.. ఆ జాతి వాళ్లు ఇతడిని శిక్షించే ప్రయత్నం చేయగా.. తడ్కా తప్పిస్తుంది. ఈ క్రమంలోనే అలోక్‌తో ప్రేమతో పడిన తడ్కా.. తన జాతిని విడిచి జనజీవనంలోకి వస్తుంది. తర్వాత వీళ్ల ప్రేమలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి. తడ్కా ఓ వ్యాంపైర్ అని అలోక్‌కి ఎప్పుడు తెలిసింది? ఈ కథకు 'భేడియా', 'ముంజ్యా', 'స్త్రీ 2' సినిమాలతో లింకేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: రాజ్ ఎవరు? సమంతతో పరిచయం ఎలా? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?)


