జార్జియాకి బై బై చెప్పారు మహేశ్‌బాబు. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్ర పాత్రలో మహేశ్‌బాబు, మందాకినిగా ప్రియాంకా చోప్రా, కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ , మరో కీలక పాత్రలో ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారు. ఇటీవల జార్జియాలో మొదలైన ‘వారణాసి’ కొత్త షూటింగ్ షెడ్యూల్ ముగిసింది. జార్జియా షూట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు మహేశ్‌బాబు.
ఈ షెడ్యూల్‌లో మహేశ్, పృథ్వీరాజ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలిసింది. కాగా ఈ మూవీ నెక్ట్స్ షూటింగ్ షెడ్యూల్ అంటార్కిటికాలో జరగనుందని తెలిసింది. ఈ షూట్ షెడ్యూల్‌లో మహేశ్‌బాబు, ప్రియాంకా చోప్రా పాల్గొంటారు. అలాగే లాటిన్ స్టైల్‌లో ఓ డ్యాన్స్ నంబరును కూడా ప్లాన్ చేశారట మేకర్స్. ప్రచారంలో ఉన్నట్లు ‘వారణాసి’ టీమ్ అంటార్కిటికాలో చిత్రీకరణ జరిపితే.. ఈ లొకేషన్స్ లో షూట్ జరుపుకున్న తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ నిలుస్తుందనే వార్తలు ఉన్నాయి.


