'ఆర్ఆర్ఆర్'కి నాటునాటు.. 'వారణాసి'కి లాటిన్ స్టయిల్! | Rajamouli, Mahesh Babu Varanasi Movie Planning for Latin Style Song | Sakshi
Sakshi News home page

'ఆర్ఆర్ఆర్'కి నాటునాటు.. 'వారణాసి'కి లాటిన్ స్టయిల్!

Mar 9 2026 11:25 PM | Updated on Mar 9 2026 11:30 PM

Rajamouli, Mahesh Babu Varanasi Movie Planning for Latin Style Song

ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు-నాటు' పాట అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆస్కార్ వేదికపై కూడా మెరిసింది ఈ పాట. అది తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైంది. అయితే ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి మరోసారి అలాంటి మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడట. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసిలో ఓ ప్రత్యేకమైన డాన్స్ నంబర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. 

ఈ పాటను లాటిన్ స్టయిల్‌లో తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నారని సీనియర్ కొరియోగ్రాఫర్ శంకర్ వెల్లడించారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటపై తెరకెక్కనున్న ఈ పాట కోసం వందలమంది లాటిన్ డాన్సర్లను తీసుకురావాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడట.

నాటు-నాటు తరహాలోనే, వారణాసిలో లాటిన్ స్టయిల్‌లో సాగే ఈ పాట కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఇప్పటికే వారణాసి టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా కొరియోగ్రాఫర్ వ్యాఖ్యలతో అంచనాలు మరింత పెరిగాయి. జార్జియాలోని షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని మహేష్ బాబు హైదరాబాద్‌కి తిరిగొచ్చాడు. ఎయిర్‌పోర్టులో ఆయన కొత్త లుక్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 

త్వరలోనే అంటార్కిటికాలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. హీరోయిన్ ప్రియాంక చోప్రా స్వయంగా ఈ విషయం వెల్లడించింది. వారణాసి అంటార్కిటికాలో షూటింగ్ జరుపుకోనున్న తొలి తెలుగు చిత్రంగా గుర్తింపు పొందనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement