పనిచేసినా రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు.. టాలీవుడ్ హీరోయిన్ ఆవేదన | Seerat Kapoor Angry On Remunaration Issue With Production House | Sakshi
Sakshi News home page

Seerat kapoor: ఇచ్చిన చెక్ కూడా బౌన్స్.. డబ్బులివ్వకపోతే మాత్రం

Mar 9 2026 7:37 PM | Updated on Mar 9 2026 7:42 PM

Seerat Kapoor Angry On Remunaration Issue With Production House

ఇండస్ట్రీలో సమస్యలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్లని.. దర్శకనిర్మాతల దగ్గర నుంచి నిర్మాణ సంస్థలు పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటివి బయటపడుతుంటాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఇలానే నిర్మాణ సంస్థ తన రెమ్యునరేషన్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

(ఇదీ చదవండి: ఇది నిశ్చితార్థం కాదు.. షాకిచ్చిన హీరో బెల్లంకొండ.. కాబోయే భార్య ఫొటోలు)

రన్ రాజా రన్, టైగర్, ఒక్క క్షణం, రాజుగారి గది 2 తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన సీరత్ కపూర్.. చివరగా 2024లో మనమే, ఉషా పరిణయం చిత్రాల్లో కనిపించింది. మరి ప్రస్తుతం ఏ మూవీ చేస్తుందో ఏమో గానీ షూటింగ్ పూర్తయి నాలుగు నెలలు అవుతున్న తనకు రావాల్సిన పారితోషికం ఇవ్వట్లేదని చెప్పి ఓ ట్వీట్ చేసింది.

'షూటింగ్ పూర్తయ్యి నాలుగు నెలలు గడిచినా సరే సంబంధిత ప్రొడక్షన్ టీమ్ నా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. నా కుటుంబంలో అత్యవసర వైద్య పరిస్థితి ఉందని చెప్పినా స్పందించలేదు. చాలా సహనంతో ఎదురుచూస్తున్నా. నా టీమ్‌కి ఇవ్వాల్సిన పారితోషికం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. టీమ్‌కు ఇచ్చిన చెక్కు కూడా బౌన్స్ అయింది. దీన్ని ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించండి. లేకపోతే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది' అని సీరత్ కపూర్ రాసుకొచ్చింది. ఇలాంటి విషయాల్లో కాస్త బాధ్యతతో వ్యవహరించాలని హితవు చెప్పింది. మరి ఈమెని ఇబ్బంది పెడుతున్న ఆ నిర్మాణ సంస్థ పేరు బయటపెట్టలేదు.

(ఇదీ చదవండి: మిషన్‌ నొక్కితే డబ్బే డబ్బు.. తెలుగు సినిమా టీజర్‌)

Advertisement
 
Advertisement
Advertisement