ఇది నిశ్చితార్థం కాదు.. షాకిచ్చిన హీరో.. కాబోయే భార్య ఫొటోలు | Bellamkonda Sreenivas Engagement And Wife Details | Sakshi
Sakshi News home page

Bellamkonda Sreenivas: 'నా కావ్యమ్మ'.. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పోస్ట్

Mar 9 2026 5:55 PM | Updated on Mar 9 2026 6:02 PM

Bellamkonda Sreenivas Engagement And Wife Details

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. ఆదివారం ఉదయం కావ్యరెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి కూడా. అయితే తామిద్దరి మధ్య జరిగింది ఎంగేజ్‌మెంట్ కాదని చెప్పి ఈ హీరో షాకిచ్చాడు. ఈ మేరకు ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టడంతో పాటు తనకు కాబోయే భార్య ఫొటోలని కూడా పంచుకున్నాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్)

నిర్మాత బెల్లంకొండ సురేశ్ పెద్ద కొడుకు శ్రీనివాస్.. 'అల్లుడు శ్రీను' మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. అడపాదడపా మూవీస్ చేస్తున్నప్పటికీ హిట్ రాలేదు. రాక్షసుడు, జయ జానకి నాయక లాంటి ఒకటి రెండు మూవీస్ మాత్రమే సక్సెస్‌ అయ్యాయి. గతేడాది 'కిష్కింధపురి', 'భైరవం' చిత్రాలతో వచ్చాడు. ప్రస్తుతం ఓ మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అయితే శ్రీనివాస్ చాన్నాళ్ల నుంచి హైదరాబాద్‌కి చెందిన కావ్యరెడ్డితో ప్రేమలో ఉన్నాడని, ఎంగేజ్‌మెంట్ అంటూ వార్తలొచ్చాయి. అంతా అదే అనుకున్నారు. కానీ ఇది కేవలం తమ ఫ్యామిలీ అనౌన్స్‌మెంట్ అని, నిశ్చితార్థం-పెళ్లి లాంటి శుభకార్యాలన్ని త్వరలో జరుగుతాయని తాజా ఇన్ స్టా పోస్టులో రాసుకొచ్చాడు.

'నా కావ్యమ్మకు.. జీవితానికి తనకంటూ ఓ అందమైన టైమ్ ఉంటుంది. నా జీవితంలోకి ఆ సమయం నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. సరైన టైంలో నా లైఫ్‌లోకి వచ్చి నన్ను నమ్మి, నా రోజులని ఎంతో ఆనందంగా, పాజిటివ్‌గా చేసినందుకు థ్యాంక్స్. నీ ముఖంపైనున్న ఆ నవ్వు ఎప్పటికీ మాయమవకుండా చూసుకుంటాను. మనం ఎప్పటికీ కలిసుండే ఆ జీవితం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను' అని బెల్లంకొండ శ్రీనివాస్ రాసుకొచ్చాడు.

(ఇదీ చదవండి: మగాళ్లు మా సినిమా చూడకపోయినా పర్వాలేదు: మంచు లక్ష‍్మీ)

Advertisement
 
Advertisement
Advertisement