వచ్చేవారం ఉగాది కానుకగా 'ధురంధర్ 2', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ఈ వారం బాక్సాఫీస్‌ని ఖాళీగానే వదిలేశారు. రావాల్సిన 'బ్యాండ్ మేళం' కూడా వాయిదా పడింది. దీంతో కొత్త మూవీసేం రావట్లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం స్టార్ హీరోలు చేసిన తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయాయి. మొత్తంగా 15 వరకు ఉండటం విశేషం.
(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!)
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', విశ్వక్ సేన్ 'ఫంకీ', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు జూటోపియా 2, ద తాజ్ స్టోరీ మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 9 నుంచి 15 వరకు)
నెట్‌ఫ్లిక్స్
వన్ పీస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 10
మేడిన్ కొరియా (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 12
వర్జిన్ రివర్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 12
ఫంకీ (తెలుగు సినిమా) - మార్చి 12
అమెజాన్ ప్రైమ్
ఆస్పిరెంట్స్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మార్చి 13
లోకల్ టైమ్స్ (తమిళ సిరీస్) - మార్చి 13
హాట్‌స్టార్
రిసార్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మార్చి 13
ద సొసైటీ సీజన్ 2 (హిందీ రియాలిటీ సిరీస్) - మార్చి 09
జూటోపియా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 13
ద ఫ్యామిలీ మెక్‌ములెన్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15
జీ5
పూకీ (తమిళ సినిమా) - మార్చి 13
భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు మూవీ) - మార్చి 13
అంధ ప్యార్ 2.0 (రియాలిటీ షో) - మార్చి 14
లయన్స్ గేట్ ప్లే
ద తాజ్ స్టోరీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 13
ఎమ్ఎక్స్ ప్లేయర్
సంకల్ప్ (హిందీ సిరీస్) - మార్చి 11
సన్ నెక్స్ట్
నాంగళ్ (తమిళ సినిమా) - మార్చి 13
ఫ్రైడే (తమిళ మూవీ) - మార్చి 13
(ఇదీ చదవండి: నటుడు పార్తిబన్ పరువు తీసేసిన త్రిష.. ట్వీట్ వైరల్)


