ఓటీటీలో ఫంకీ సినిమా.. స్ట్రీమింగ్‌ తేదీ వచ్చేసింది | Vishwak Sen And Kayadu Lohar Starrer Funky Movie OTT Release Date Locked, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Funky OTT Release: ఓటీటీలో ఫంకీ సినిమా.. స్ట్రీమింగ్‌ తేదీ వచ్చేసింది

Mar 8 2026 8:22 AM | Updated on Mar 8 2026 12:52 PM

Vishwak Sen Funky Movie OTT Streaming Details

టాలీవుడ్‌ నటుడు విశ్వక్‌ సేన్‌ నటించిన కొత్త సినిమా ఫంకీ ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఫిబ్రవరి 13న విడుదలైన ఈ చిత్రం ఆశించినంత రేంజ్‌లో మెప్పించలేదు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించిన ఈ సినిమా వాలెంటైన్ వీక్ స్పెషల్‌గా విడుదలైంది.  ఇందులో కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ నిర్మాణంలో ఎస్‌.నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా ఫంకీ చిత్రాన్ని నిర్మించారు. నరేష్, ఈశ్వరీ రావు, సంపత్ రాజ్, జై కృష్ణ, వీటీవీ గణేశ్‌ తదితరలు నటించారు.

ఫంకీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో విడుదల కానుంది. మార్చి 13 నుంచి స్ట్రీమింగ్‌ కానుందని అప్‌కమింగ్‌ సినిమాల జాబితాలో ఆ సంస్థ ఫంకీని చేర్చింది. ప్రస్తుతానికి తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ‘జాతి రత్నాలు’తో ఊహించని విజయాన్ని అందుకున్న దర్శకుడు కేవీ అనుదీప్‌ ఈ మూవీని తెరకెక్కించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుమారు 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ. 10 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది.

కథేంటంటే.. 
కోమల్‌ (విశ్వక్‌ సేన్‌) ఓ నూతన సినీ దర్శకుడు. ‘మంచి ప్రొడక్షన్స్‌’ నిర్మాణ సంస్థలో ‘ఫంకీ’ అనే సినిమాను తెరకెక్కించే అవకాశం వస్తుంది. రూ. 4 కోట్ల బడ్జెట్‌లో సినిమా తీస్తానని నిర్మాత సుదర్శన్‌(నరేశ్‌) హామీ ఇచ్చి.. రూ. 40 కోట్లు ఖర్చు పెట్టిస్తాడు. అయినా కూడా సినిమా పూర్తికాదు. బడ్జెట్‌ భారీగా పెరిగిపోయిందనే టెన్షన్‌తో నిర్మాత సుదర్శన్‌ ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను ఆయన కూతురు చిత్ర(కయాదు లోహర్‌) తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? బాధ్యతల నుంచి తప్పించడంతో కోమల్‌ ఏం చేశాడు? రూ. కోటి బడ్జెట్‌లో మిగిలిన సినిమాను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీని కోమల్‌ నిలబెట్టుకున్నాడా లేదా? కోమల్‌తో చిత్ర ఎలా ప్రేమలో పడింది? ఈ కథలో జీకే (సంపత్‌ రాజ్‌) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement