Funky Movie
-
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. మూడు డోంట్ మిస్
వచ్చేవారం ఉగాది కానుకగా 'ధురంధర్ 2', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో ఈ వారం బాక్సాఫీస్‌ని ఖాళీగానే వదిలేశారు. రావాల్సిన 'బ్యాండ్ మేళం' కూడా వాయిదా పడింది. దీంతో కొత్త మూవీసేం రావట్లేదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం స్టార్ హీరోలు చేసిన తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి. మొత్తంగా 15 వరకు ఉండటం విశేషం.(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!)ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', విశ్వక్ సేన్ 'ఫంకీ', ప్రియాంక మోహన్ 'మేడిన్ కొరియా' చిత్రాలు ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు జూటోపియా 2, ద తాజ్ స్టోరీ మూవీస్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 9 నుంచి 15 వరకు)నెట్ఫ్లిక్స్వన్ పీస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 10మేడిన్ కొరియా (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 12వర్జిన్ రివర్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 12ఫంకీ (తెలుగు సినిమా) - మార్చి 12అమెజాన్ ప్రైమ్ఆస్పిరెంట్స్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మార్చి 13లోకల్ టైమ్స్ (తమిళ సిరీస్) - మార్చి 13హాట్స్టార్రిసార్ట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మార్చి 13ద సొసైటీ సీజన్ 2 (హిందీ రియాలిటీ సిరీస్) - మార్చి 09జూటోపియా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 13ద ఫ్యామిలీ మెక్‌ములెన్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15జీ5పూకీ (తమిళ సినిమా) - మార్చి 13భర్త మహాశయులకు విజ్ఞప్తి (తెలుగు మూవీ) - మార్చి 13అంధ ప్యార్ 2.0 (రియాలిటీ షో) - మార్చి 14లయన్స్ గేట్ ప్లేద తాజ్ స్టోరీ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 13ఎమ్ఎక్స్ ప్లేయర్సంకల్ప్ (హిందీ సిరీస్) - మార్చి 11సన్ నెక్స్ట్నాంగళ్ (తమిళ సినిమా) - మార్చి 13ఫ్రైడే (తమిళ మూవీ) - మార్చి 13(ఇదీ చదవండి: నటుడు పార్తిబన్ పరువు తీసేసిన త్రిష.. ట్వీట్ వైరల్) -
ఓటీటీలో ఫంకీ సినిమా.. స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది
టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ నటించిన కొత్త సినిమా ఫంకీ ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఫిబ్రవరి 13న విడుదలైన ఈ చిత్రం ఆశించినంత రేంజ్లో మెప్పించలేదు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించిన ఈ సినిమా వాలెంటైన్ వీక్ స్పెషల్‌గా విడుదలైంది. ఇందులో కయాదు లోహర్ హీరోయిన్గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణంలో ఎస్.నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా ఫంకీ చిత్రాన్ని నిర్మించారు. నరేష్, ఈశ్వరీ రావు, సంపత్ రాజ్, జై కృష్ణ, వీటీవీ గణేశ్ తదితరలు నటించారు.ఫంకీ సినిమా నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో విడుదల కానుంది. మార్చి 13 నుంచి స్ట్రీమింగ్ కానుందని అప్‌కమింగ్ సినిమాల జాబితాలో ఆ సంస్థ ఫంకీని చేర్చింది. ప్రస్తుతానికి తెలుగులో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ‘జాతి రత్నాలు’తో ఊహించని విజయాన్ని అందుకున్న దర్శకుడు కేవీ అనుదీప్ ఈ మూవీని తెరకెక్కించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుమారు 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 10 కోట్లు మాత్రమే రాబట్టినట్లు తెలుస్తోంది.కథేంటంటే.. కోమల్ (విశ్వక్ సేన్) ఓ నూతన సినీ దర్శకుడు. ‘మంచి ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థలో ‘ఫంకీ’ అనే సినిమాను తెరకెక్కించే అవకాశం వస్తుంది. రూ. 4 కోట్ల బడ్జెట్లో సినిమా తీస్తానని నిర్మాత సుదర్శన్(నరేశ్) హామీ ఇచ్చి.. రూ. 40 కోట్లు ఖర్చు పెట్టిస్తాడు. అయినా కూడా సినిమా పూర్తికాదు. బడ్జెట్ భారీగా పెరిగిపోయిందనే టెన్షన్‌తో నిర్మాత సుదర్శన్ ఆరోగ్యం క్షీణిస్తుంది. దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను ఆయన కూతురు చిత్ర(కయాదు లోహర్) తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? బాధ్యతల నుంచి తప్పించడంతో కోమల్ ఏం చేశాడు? రూ. కోటి బడ్జెట్లో మిగిలిన సినిమాను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీని కోమల్ నిలబెట్టుకున్నాడా లేదా? కోమల్‌తో చిత్ర ఎలా ప్రేమలో పడింది? ఈ కథలో జీకే (సంపత్ రాజ్) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
చాన్నాళ్లకు టాలీవుడ్ ఫిబ్రవరి సెంటిమెంట్ బ్రేక్
సాధారణంగా ఫిబ్రవరి నెలలో టాలీవుడ్ పెద్ద సినిమాలేం రిలీజ్ పెట్టుకోవు. ఎందుకంటే అంతకు కొన్నిరోజుల ముందే సంక్రాంతి ఉంటుంది. ఆ టైంలో స్టార్ హీరో తమ మూవీస్ విడుదల చేసి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంటారు. దీంతో ఫిబ్రవరిలో దాదాపుగా మిడ్ రేంజ్ లేదా చిన్న చిత్రాలే విడుదల అవుతుంటాయి. ఈసారి కూడా అలానే వచ్చాయి కానీ ఓ సెంటిమెంట్ బ్రేక్ అయింది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: నచ్చినవాడితో జీవితం పంచుకుంటా.. త్రిష ఓల్డ్ కామెంట్స్ వైరల్)ఫిబ్రవరి తొలివారంలో చిన్న సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో కాస్తోకూస్తో చెప్పుకదగ్గది అంటే గుణశేఖర్ తీసిన 'యుఫోరియా'నే. చాన్నాళ్ల తర్వాత తన స్టైల్ మార్చి, ట్రెండీ యూత్ సబ్జెక్ట్‌తో మూవీ తీసినప్పటికీ ఫ్లాప్ అయింది. కమ్ బ్యాక్ ఇద్దామనుకున్నా సీనియర్ దర్శకుడికి నిరాశే ఎదురైంది. ఇవి కాకుండా విత్ లవ్, బరాబర్ ప్రేమిస్తా, ఆపరేషన్ పద్మ, బ్లడ్ రోజెస్, లగ్గం టైమ్, ఎర్రచీర తదితర మూవీస్ రిలీజయ్యాయి కానీ ఇవన్నీ కూడా డిజాస్టర్స్ అయ్యాయి.రెండోవారం విశ్వక్ సేన్-అనుదీప్ కాంబోలో 'ఫంకీ', సంతోష్ శోభన్ 'కపుల్ ఫ్రెండ్లీ' రిలీజ్ కాగా.. వీటిలో హిట్ అవుతుందనుకున్న ఫంకీ ఘోరమైన డిజాస్టర్ అయింది. ఏ మాత్రం అంచనాల్లేని 'కపుల్ ఫ్రెండ్లీ' సక్సెస్ అందుకుంది. హిట్ అనిపించుకుని ఊహించిన దానికంటే కాస్త ఎక్కువగాగనే కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సీనియర్ నటుడు అర్జున్ దర్శకుడిగా మారి, కూతురినే హీరోయిన్గా పెట్టి తీసిన 'సీతా పయనం' కూడా ఫ్లాప్ అయింది. వీటితో పాటు అమరావతికి ఆహ్వానం, స్కై, నిలవే కూడా ఏ మాత్రం నిలబడలేకపోయాయి.(ఇదీ చదవండి: హీరో విజయ్ను అన్‌ఫాలో కొట్టిన కుమారుడు!)మూడోవారంలో సుహాస్ 'హే బలవంత్', నవాబ్ కేఫ్ మూవీస్ వచ్చాయి. వీటిలో సుహాస్ సినిమా బాగుందని అన్నారు గానీ జనాలు ఎందుకో దీన్ని లైట్ తీసుకున్నారు. ఇక నవాబ్ కేఫ్ అయితే తొలిరోజుకే ఫ్లాప్ టాక్ ముద్ర వేయించుకుంది. చివరి వారం శ్రీ విష్ణు హీరోగా నటించిన 'విష్ణు విన్యాసం' అనే కామెడీ మూవీ రిలీజైంది. సోలో విడుదల కావడంతో ఏమైనా కలిసొస్తుందేమో అనుకున్నారు. ఇందులో కామెడీ ఏ మాత్రం నవ్వేలా లేకపోవడంతో జనాలు దీన్ని కూడా రిజెక్ట్ చేసినట్లే కనిపిస్తున్నారు. రేపటికల్లా దీని అసలు రిజల్ట్ ఏంటనేది తేలుతుంది.ఓవరాల్‌గా ఫిబ్రవరి నెలలో 20 సినిమాలు, థియేటర్లలోకి వస్తే ఒక్క 'కపుల్ ఫ్రెండ్లీ' మాత్రమే ఆకట్టుకుంది. కానీ ఇది మరీ అంత సూపర్ హిట్ అయితే కాలేకపోయింది. గత కొన్నాళ్ల నుంచి తీసుకుంటే 2020లో భీష్మ, 2021లో ఉప్పెన, 2022లో డీజే టిల్లు, 2023లో సర్, 2024లో ఊరిపేరు భైరవకోన, 2025లో తండేల్.. సక్సెస్ కావడంతో పాటు మంచి వసూళ్లు కూడా అందుకున్నాయి. ఈసారి మాత్రం అలాంటి మ్యాజిక్ ఏ సినిమా విషయంలోనూ జరగలేదు. తద్వారా కొన్నేళ్ల పాటు సాగిన సెంటిమెంట్ బ్రేక్ అయింది!(ఇదీ చదవండి: శరత్ కుమార్ రెండో భార్యని తెగ పొగిడేసిన మొదటి భార్య) -
ఈ మూవీకి ఫ్యామిలీస్ దూరంగా ఉండండి.. చూస్తే సీఎం మెచ్చుకుంటారు
సినిమా ప్రమోషన్లలో హడావుడి చేసే హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. అప్పట్లో రకరకాలుగా రచ్చ చేసి హాట్ టాపిక్ అయ్యేవాడు. గత రెండు మూడు సినిమాలు దారుణంగా దెబ్బకొట్టేసరికి సైలైంట్ అయిపోయాడు. గతవారం రిలీజైన 'ఫంకీ' కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇంతలోనే మరో కొత్త మూవీతో థియేటర్లలోకి వచ్చేందుకు విశ్వక్ రెడీ అయిపోయాడు. 'కల్ట్' పేరుతో తీసిన ఈ చిత్ర టీజర్ తాజాగా రిలీజైంది. ఈ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ చాలా హడావుడి చేసేశాడు. బోలెడన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు.'నేను ట్విటర్, రెడిట్‌లో జనాలు ఏం కోరుకుంటున్నారు. ఏం మిస్ అవుతున్నారనేది చదివా. అవన్నీ కలిపి ఓ మిక్సర్‌లో కొట్టి 'కల్ట్' తీశాను. 'ఫలక్‌నుమా దాస్' తీసిన దానికి 10 రెట్లు కసిగా తీశాను' అని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. అలానే టీజర్ చూసి.. చాలామంది దీన్ని 'స్క్విడ్ గేమ్', నాని 'హిట్ 3'తో పోల్చారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన విశ్వక్.. ఈ స్టోరీని నాలుగేళ్లుగా రాస్తున్నాను. హాలీవుడ్ మూవీ 'ప్రాజెక్ట్ ఎక్స్'ని స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను గతంలో దర్శకత్వం వహించిన వాటిలా స్క్రాచ్ నుంచి రాశాను అని అన్నాడు.(ఇదీ చదవండి: 'స్క్విడ్ గేమ్' గుర్తుచేసిన విశ్వక్ సేన్ 'కల్ట్'.. టీజర్ రిలీజ్)అలానే ఈ సినిమాకు కుటుంబాలు, పిల్లలు దూరంగా ఉండాలని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మూవీ చూస్తే, సూపర్ రా నువ్వు అని నన్ను మెచ్చుకుంటారు. ఇక 'ఫంకీ' ఫలితం గురించి ప్రశ్న రాగా.. ఎవడు ఏమనుకున్నా 'ఫంకీ' నాకు హిట్టే, నేనో గొప్ప మూవీ చేశాననని విశ్వక్ పేర్కొన్నాడు. 'ఆవేశం' చిత్రంలోలా మూవీ మొదలైన 45 నిమిషాల తర్వాత తన ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇక 'కల్ట్' టైటిల్ నిర్మాత ఎస్కేఎన్ది కదా? అని ఓ రిపోర్టర్, విశ్వక్‌ని అడగ్గా.. నాకు తెలియదు సార్. నేను అప్పటికే రిజిస్టర్ చేసుకున్నా. ఇది ఎప్పటికి నాదే అని బదులిచ్చాడు.'కల్ట్' చిత్రంలో చాలామంది పలువురు కొత్త నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ కాగా విశ్వక్ సేన్.. దర్శకత్వం వహించడంతో పాటు ఓ కీలక పాత్ర చేశాడు. 'కేజీఎఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతమందించాడు. బహుశా ఈ సినిమా వేసవిలో థియేటర్లలోకి రావొచ్చేమో?(ఇదీ చదవండి: గోల్డ్ రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన విశ్వక్.. రవి బస్రూర్ ఎమోషనల్) -
మిడ్ రేంజ్ హీరోలకు డేంజర్ బెల్స్.. లేటెస్ట్గా విశ్వక్
గత కొన్నేళ్లుగా చూసుకుంటే తెలుగు మిడ్ రేంజ్ హీరోలకు ఎప్పటికప్పుడు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రేక్షకుల పల్స్ వీళ్లు అర్థం చేసుకోలేకపోతున్నారా? సరైన స్టోరీలని ఎంపిక చేసుకోలేకపోతున్నారా? తెలియట్లేదు గానీ చేసిన సినిమాలు చేసినట్లు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతున్నాయి. ఒకవేళ సక్సెస్ అయినా సరే కలెక్షన్స్ పెద్దగా రావడం లేదు. దీనికి లేటెస్ట్ ఉదాహరణ విశ్వక్ సేన్. వరసపెట్టి మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇంతకీ తప్పు ఎక్కడ జరుగుతోంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)'ఈ నగరానికి ఏమైంది?', 'ఫలక్‌నుమా దాస్', 'హిట్' లాంటి సినిమాలతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్.. తర్వాత చేసిన 'అశోకవనంలో అర్జున కల్యాణం'తో నటుడిగా ఆకట్టుకున్నాడు. కానీ గత రెండు మూడేళ్లుగా చూసుకుంటే కెరీర్ ఏ మాత్రం ఆశజనకంగా లేదు. 2024లో ఏకంగా మూడు చిత్రాలతో వస్తే.. వాటిలో 'గామి' ప్రయోగాత్మక చిత్రం కావడంతో జనాలకు సరిగా రీచ్ కాలేదు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంటే.. 'మెకానిక్ రాకీ' ఘోరంగా దెబ్బతింది. గతేడాది ఇదే టైంకి వచ్చిన 'లైలా' అయితే అల్ట్రా డిజాస్టర్. దీంతో ఏడాది గ్యాప్ తీసుకుని 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్‌తో కలిసి 'ఫంకీ' చేశాడు. ఇదీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది.ఒకప్పటితో పోలిస్తే విశ్వక్ సేన్ యాటిట్యూడ్ ఎలా తగ్గిపోయిందో.. బాక్సాఫీస్ దగ్గర అతడి సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా అలానే తగ్గిపోతూ వస్తున్నాయి. ఓ రకంగా చూస్తే ఇది డేంజర్ బెల్స్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇతడి చేతిలో 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్, దర్శకుడిగా చేస్తున్న 'కల్ట్' ఉన్నాయి. ఈ రెండింటితోనైనా విశ్వక్.. బలమైన కంబ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం రేసులో వెనకబడిపోవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: ఏంటి ఇప్పుడు నీ కాళ్లు పట్టుకోవాలా అని తారక్ నాతో..)విశ్వక్ సేన్ మాత్రమే కాదు టాలీవుడ్లో చాలామంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్ దాదాపు ఇలానే ఉంది. గోపీచంద్, రవితేజ లాంటి హీరోల మార్కెట్ ఇప్పటికే చాలా పడిపోయింది. వీళ్లు సినిమాలైతే చేస్తున్నారు గానీ అటు కంటెంట్ పరంగా ఇటు మార్కెట్ పరంగా రెండూ వర్కౌట్ కావట్లేదు. వసూళ్లు కూడా పెద్దగా రావట్లేదు. సాయిధరమ్ తేజ్, సుధీర్ బాబు, శర్వానంద్, అల్లరి నరేశ్, నితిన్, వరుణ్ తేజ్, రామ్ పోతినేని లాంటి హీరోల పరిస్థితీ దాదాపు ఇంతే.పైన చెప్పిన హీరోలు.. తాము అసలు ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు చూస్తారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అప్పుడో ఇప్పుడో అన్నట్లు వస్తున్నారు. కానీ సక్సెస్ అందుకోలేకపోతున్నారు. వీళ్లు కాకుండా ఉన్న మిగతా మిడ్, చిన్న రేంజ్ హీరోల పరిస్థితి అయితే అంతకంటే దారుణంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉండబోతుందో ఏంటో అనిపిస్తోంది.(ఇదీ చదవండి: తమిళ బోల్డ్ సినిమా.. ఒకేసారి ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్) -
'ఫంకీ' సినిమా తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ తీసిన లేటెస్ట్ సినిమా 'ఫంకీ'. విశ్వక్ సేన్, కాయదు లోహర్ హీరోహీరోయిన్లుగా నటించారు. మూవీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రానికి థియేటర్లలో అనుకున్నంత స్పందన రాలేదు. తొలి షో నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. అక్కడక్కడ కామెడీ బాగున్నప్పటికీ ఓవరాల్‌గా మాత్రం ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మరి ఇలాంటి రెస్పాన్స్‌తో తొలిరోజు వసూళ్లు ఎంతొచ్చాయి?ఫంకీ చిత్రానికి తొలిరోజు నెట్ వసూళ్లు రూ.2.25 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అలానే ఓవర్సీస్లో మొదటిరోజు పూర్తయ్యేసరికి లక్షా 85 వేల డాలర్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. మనవరకు మాత్రం ఇంకా పోస్టర్ లాంటిది రిలీజ్ చేయలేదు. వస్తున్న టాక్ బట్టి చూస్తుంటే వీకెండ్ అయ్యాక ఏమైనా పోస్టర్ వదిలితే వదలొచ్చు. లేదంటే లేకపోవచ్చు.(ఇదీ చదవండి: 'ఫంకీ' సినిమా.. మేం కావాలనే అలా తీశాం: నిర్మాత నాగవంశీ)'ఫంకీ'తో పాటు రిలీజైన మరో తెలుగు సినిమా 'కపుల్ ఫ్రెండ్లీ'. సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్కి పాజిటివ్ టాక్ వస్తోంది. మరి ఈ రెండింటిలో దేనికి ప్రేక్షకులు ఓటేస్తారనేది సోమవారానికి తేలుతుంది.'ఫంకీ' విషయానికొస్తే.. కోమల్ (విశ్వక్ సేన్) కొత్త దర్శకుడు. ఓ నిర్మాణ సంస్థలో సినిమా కోసం అవకాశం దక్కించుకుంటాడు. రూ.4 కోట్లతో పూర్తి చేస్తానని రూ.40 కోట్ల బడ్జెట్ చేస్తాడు. అయినా సరే మూవీని పూర్తి చేయడు. దీంతో నిర్మాత కూతురు చిత్ర(కాయదు లోహర్) రంగంలోకి దిగుతుంది. రూ.కోటితో మిగిలిన చిత్రమంతా పూర్తిచేయాలనే షరతు పెడుతుంది. మరి అనుకున్న బడ్జెట్లో సినిమా పూర్తయిందా? ఈ క్రమంలో కోమల్-చిత్ర మధ్య ఎలాంటి బంధం ఏర్పడింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘ఫంకీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)


