ఈ మూవీకి ఫ్యామిలీస్ దూరంగా ఉండండి.. చూస్తే సీఎం మెచ్చుకుంటారు | Vishwak Sen Cult Movie Press Meet And Commnets | Sakshi
Sakshi News home page

Vishwak Sen: అన్ని మిక్స్ కొట్టి ఈ సినిమా తీశా.. ఎవరేమనుకున్నా 'ఫంకీ' హిట్టే

Feb 21 2026 6:51 PM | Updated on Feb 21 2026 7:08 PM

Vishwak Sen Cult Movie Press Meet And Commnets

సినిమా ప్రమోషన్లలో హడావుడి చేసే హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. అప్పట్లో రకరకాలుగా రచ్చ చేసి హాట్ టాపిక్ అయ్యేవాడు. గత రెండు మూడు సినిమాలు దారుణంగా దెబ్బకొట్టేసరికి సైలైంట్ అయిపోయాడు. గతవారం రిలీజైన 'ఫంకీ' కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇంతలోనే మరో కొత్త మూవీతో థియేటర్లలోకి వచ్చేందుకు విశ్వక్ రెడీ అయిపోయాడు. 'కల్ట్' పేరుతో తీసిన ఈ చిత్ర టీజర్ తాజాగా రిలీజైంది. ఈ లాంచ్ ఈవెంట్‌లో విశ్వక్ చాలా హడావుడి చేసేశాడు. బోలెడన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు.

'నేను ట్విటర్, రెడిట్‌లో జనాలు ఏం కోరుకుంటున్నారు. ఏం మిస్ అవుతున్నారనేది చదివా. అవన్నీ కలిపి ఓ మిక్సర్‌లో కొట్టి 'కల్ట్' తీశాను. 'ఫలక్‌నుమా దాస్' తీసిన దానికి 10 రెట్లు కసిగా తీశాను' అని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. అలానే టీజర్ చూసి.. చాలామంది దీన్ని 'స్క్విడ్ గేమ్', నాని 'హిట్ 3'తో పోల్చారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన విశ్వక్.. ఈ స్టోరీని నాలుగేళ్లుగా రాస్తున్నాను. హాలీవుడ్ మూవీ 'ప్రాజెక్ట్ ఎక్స్'ని స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను గతంలో దర్శకత్వం వహించిన వాటిలా స్క్రాచ్ నుంచి రాశాను అని అన్నాడు.

(ఇదీ చదవండి: 'స్క్విడ్ గేమ్' గుర్తుచేసిన విశ్వక్ సేన్ 'కల్ట్'.. టీజర్ రిలీజ్)

అలానే ఈ సినిమాకు కుటుంబాలు, పిల్లలు దూరంగా ఉండాలని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మూవీ చూస్తే, సూపర్ రా నువ్వు అని నన‍్ను మెచ్చుకుంటారు. ఇక 'ఫంకీ' ఫలితం గురించి ప్రశ్న రాగా.. ఎవడు ఏమనుకున్నా 'ఫంకీ' నాకు హిట్టే, నేనో గొప్ప మూవీ చేశాననని విశ్వక్ పేర్కొన్నాడు. 'ఆవేశం' చిత్రంలోలా మూవీ మొదలైన 45 నిమిషాల తర్వాత తన ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇక 'కల్ట్' టైటిల్ నిర్మాత ఎస్కేఎన్‌ది కదా? అని ఓ రిపోర్టర్, విశ్వక్‌ని అడగ్గా.. నాకు తెలియదు సార్. నేను అప్పటికే రిజిస్టర్ చేసుకున్నా. ఇది ఎప్పటికి నాదే అని బదులిచ్చాడు.

'కల్ట్' చిత్రంలో చాలామంది పలువురు కొత్త నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ కాగా విశ్వక్ సేన్.. దర్శకత్వం వహించడంతో పాటు ఓ కీలక పాత్ర చేశాడు. 'కేజీఎఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతమందించాడు. బహుశా ఈ సినిమా వేసవిలో థియేటర్లలోకి రావొచ్చేమో?

(ఇదీ చదవండి: గోల్డ్‌ రోలెక్స్‌ వాచ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన విశ్వక్‌.. రవి బస్రూర్‌ ఎమోషనల్‌)

Advertisement
 
Advertisement
Advertisement