breaking news
Cult Movie
-
ఈ మూవీకి ఫ్యామిలీస్ దూరంగా ఉండండి.. చూస్తే సీఎం మెచ్చుకుంటారు
సినిమా ప్రమోషన్లలో హడావుడి చేసే హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. అప్పట్లో రకరకాలుగా రచ్చ చేసి హాట్ టాపిక్ అయ్యేవాడు. గత రెండు మూడు సినిమాలు దారుణంగా దెబ్బకొట్టేసరికి సైలైంట్ అయిపోయాడు. గతవారం రిలీజైన 'ఫంకీ' కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇంతలోనే మరో కొత్త మూవీతో థియేటర్లలోకి వచ్చేందుకు విశ్వక్ రెడీ అయిపోయాడు. 'కల్ట్' పేరుతో తీసిన ఈ చిత్ర టీజర్ తాజాగా రిలీజైంది. ఈ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ చాలా హడావుడి చేసేశాడు. బోలెడన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశాడు.'నేను ట్విటర్, రెడిట్‌లో జనాలు ఏం కోరుకుంటున్నారు. ఏం మిస్ అవుతున్నారనేది చదివా. అవన్నీ కలిపి ఓ మిక్సర్‌లో కొట్టి 'కల్ట్' తీశాను. 'ఫలక్‌నుమా దాస్' తీసిన దానికి 10 రెట్లు కసిగా తీశాను' అని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. అలానే టీజర్ చూసి.. చాలామంది దీన్ని 'స్క్విడ్ గేమ్', నాని 'హిట్ 3'తో పోల్చారు. ఈ కామెంట్స్‌పై స్పందించిన విశ్వక్.. ఈ స్టోరీని నాలుగేళ్లుగా రాస్తున్నాను. హాలీవుడ్ మూవీ 'ప్రాజెక్ట్ ఎక్స్'ని స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను గతంలో దర్శకత్వం వహించిన వాటిలా స్క్రాచ్ నుంచి రాశాను అని అన్నాడు.(ఇదీ చదవండి: 'స్క్విడ్ గేమ్' గుర్తుచేసిన విశ్వక్ సేన్ 'కల్ట్'.. టీజర్ రిలీజ్)అలానే ఈ సినిమాకు కుటుంబాలు, పిల్లలు దూరంగా ఉండాలని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మూవీ చూస్తే, సూపర్ రా నువ్వు అని నన్ను మెచ్చుకుంటారు. ఇక 'ఫంకీ' ఫలితం గురించి ప్రశ్న రాగా.. ఎవడు ఏమనుకున్నా 'ఫంకీ' నాకు హిట్టే, నేనో గొప్ప మూవీ చేశాననని విశ్వక్ పేర్కొన్నాడు. 'ఆవేశం' చిత్రంలోలా మూవీ మొదలైన 45 నిమిషాల తర్వాత తన ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఇక 'కల్ట్' టైటిల్ నిర్మాత ఎస్కేఎన్ది కదా? అని ఓ రిపోర్టర్, విశ్వక్‌ని అడగ్గా.. నాకు తెలియదు సార్. నేను అప్పటికే రిజిస్టర్ చేసుకున్నా. ఇది ఎప్పటికి నాదే అని బదులిచ్చాడు.'కల్ట్' చిత్రంలో చాలామంది పలువురు కొత్త నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ కాగా విశ్వక్ సేన్.. దర్శకత్వం వహించడంతో పాటు ఓ కీలక పాత్ర చేశాడు. 'కేజీఎఫ్', 'సలార్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతమందించాడు. బహుశా ఈ సినిమా వేసవిలో థియేటర్లలోకి రావొచ్చేమో?(ఇదీ చదవండి: గోల్డ్ రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన విశ్వక్.. రవి బస్రూర్ ఎమోషనల్) -
గోల్డ్ రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిన విశ్వక్.. రవి బస్రూర్ ఎమోషనల్
హీరో విశ్వక్సేన్కు ఈ మధ్య ఏదీ కలిసిరావట్లేదు. గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన లైలా, ఈయేడు ఫిబ్రవరిలో వచ్చిన ఫంకీ.. రెండు చిత్రాలు తీవ్ర నిరాశపర్చాయి. దీంతో ఈసారి తన డైరెక్షన్లోనే ఓ సినిమా చేశాడు. అదే కల్ట్. శనివారం నాడు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.కల్ట్ టీజర్ రిలీజ్టీజర్ ఫుల్ వయొలెంట్‌గా ఉంది. కల్ట్ అనే చోటుకు వెళ్లిన వారందరికీ లోపల ఉన్న ఒక బొమ్మ గేమ్స్ పెడుతోంది. అందులో ఓడిపోయినవారు గేమ్‌లోనే కాదు ఏకంగా ఈ భూమిపై నుంచే ఎలిమినేట్ అవుతారు. స్క్విడ్ గేమ్ సిరీస్‌ను గుర్తు చేస్తున్న ఈ మూవీకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాయగా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందించాడు. అతడి మ్యూజిక్కు ఫిదా అయిన విశ్వక్సేన్ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఊహించని బహుమతి ఇచ్చాడు. ఖరీదైన కానుకవిశ్వక్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఒక కన్ను తరుణ్ భాస్కర్ అయితే మరో కన్ను రవి బస్రూర్ సర్. ఇంత మంచి మ్యూజిక్ నా మూవీకి దొరుకుతుందని ఎన్నడూ అనుకోలేదు. అలాంటిది నాకు మంచి మ్యూజిక్ అందించారు. అందుకు కృతజ్ఞతగా రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుమతిగా ఇస్తున్నాను. ఇది నా ఫేవరెట్ గిఫ్ట్. ఎందుకంటే ఇది నేను రెండేళ్లు వెయిట్ చేసి మరీ తెప్పించుకున్న వాచ్. మళ్లీ నేనెప్పుడైనా సినిమా చేయమని అడిగితే ఈ వాచ్ చూసైనా ఓకే చేయాలి అన్నాడు. ఆ వెంటనే వాచ్‌ను రవి బస్రూర్ చేతికి తొడిగి తన సంతోషాన్ని చాటుకున్నాడు.రవి బస్రూర్ ఎమోషనల్అనంతరం రవి బస్రూర్ మాట్లాడుతూ.. నేను 25 ఏళ్లుగా పని చేస్తున్నాను. ఎల్లప్పుడూ మంచి సంగీతం అందించాలనే కృషి చేస్తూ వచ్చాను. ఇన్నేళ్లకాలంలో ఒకడు నాలోని అసలైన మ్యూజిక్ డైరెక్టర్‌ను గుర్తించాడు. ఇది కేవలం వాచ్ కాదు, సంగీత దర్శకులకు దక్కిన గౌరవం అని సంతోషం వ్యక్తం చేశాడు. ఇంకా మాట్లాడుతూ.. 18 ఏళ్ల వయసులో రెండుసార్లు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాను. చివరి శ్వాస వరకు..ఈ జీవితమే నాకు వద్దని చనిపోదామనుకున్నాను. రెండుసార్లు ఎలాగోలా బతికేశాను. రెండోసారి నన్ను కాపాడిన వ్యక్తి నా గురించి తెలిసి కీబోర్డు కొనుక్కోమని రూ.35 వేలు ఇచ్చాడు. అతడి పేరు రవి. అప్పటినుంచి నా పేరు రవి బస్రూర్‌గా మారింది. చివరి శ్వాస వరకు ఈ పేరు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు విశ్వక్ సేన్ నా జర్నీని, ప్రతిభను గుర్తించాడు. అతడిని కూడా ఎన్నటికీ మర్చిపోలేను అని రవి బస్రూర్ ఎమోషనలయ్యాడు.కల్ట్ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
'స్క్విడ్ గేమ్' గుర్తుచేసిన విశ్వక్ సేన్ 'కల్ట్'.. టీజర్ రిలీజ్
గతవారం 'ఫంకీ' సినిమాతో వచ్చిన విశ్వక్ సేన్.. ఘోరమైన ఫ్లాప్ ఎదుర్కొన్నాడు. ఊహించిన దానికంటే ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఇంతలోనే మరో మూవీతో వచ్చేందుకు విశ్వక్ రెడీ అయిపోయాడు. 'కల్ట్' పేరుతో తీసిన ఈ చిత్రంలో నటించడంతో పాటు దర్శకత్వం కూడా చేశాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: సుహాస్‌కి కలిసొచ్చింది.. 'హే బలవంత్' కలెక్షన్ ఎన్ని కోట్లంటే?)టీజర్ బట్టి చూస్తే ఓ ముగ్గురు కుర్రాళ్లు.. గోవాకి వెళ్తారు. కానీ పబ్‌లోకి వెళ్లేందుకు ఎంట్రీ దొరకదు. దీంతో 'కల్ట్' అనే చోటుకి వెళ్తారు. ఈ గేమ్‌లో భాగంగా స్క్రీన్ పై ఓ బొమ్మ కనిపిస్తుంది. లోపల ఉన్నవాళ్లందరికీ కొన్ని గేమ్స్ పెడుతూ ఉంటుంది. అందులో ఫెయిలైన వాళ్లు ఎలిమినేట్ అవుతుంటారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే చంపేయడం. మరి ఈ 'కల్ట్' సంగతేంటి? ఇందులో విశ్వక్ పాత్ర ఏంటనేది తెలియాలంటే ట్రైలర్, మూవీ వచ్చేవరకు ఆగాల్సిందే. టీజర్ చూడగానే చాలామంది 'స్క్విడ్ గేమ్' సిరీస్ గుర్తుకురావడం గ్యారంటీ. ఎందుకంటే అందులోనూ ఇలానే గేమ్‌లో ఎలిమినేట్ అయితే చంపేస్తుంటారు.(ఇదీ చదవండి: లెస్బియన్ కాన్సెప్ట్ సినిమా.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)


