అలాంటి వారు కల్ట్ చూడొద్దు.. ఇదే నా రిక్వెస్ట్:‍ విశ్వక్ సేన్ | Tollywood Hero Vishwak Sen Makes Shocking Request To Fans About His Upcoming Movie Cult, Read Story For More Details | Sakshi
Sakshi News home page

Cult Movie: 'దయచేసి అలాంటి వారు కల్ట్ మూవీ చూడొద్దు..'

Oct 29 2026 3:12 PM | Updated on Oct 29 2026 3:44 PM

tollywood hero Vishwak Sen Request To Fans about Cult Movie

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తోన్న యాక్షన్ మూవీ కల్ట్. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, తారక్‌ పొన్నప్ప, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. సందీప్‌ కాకరాల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ మీట్‌లో కల్ట్ మూవీ ట్రైలర్‌ కూడా రిలీజ్ చేశారు. తుఫాన్ కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ఓ రిక్వెస్ట్ చేశారు. ఈ మూవీలో వయొలెన్స్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మళ్లీ చెప్తున్నా.. దయచేసి వీక్ హార్టెడ్‌ పీపుల్, చిన్నపిల్లలు ఈ మూవీ చూడవద్దని విజ్ఞప్తి చేశారు. ఇది చాలా వైల్డ్ సినిమా అని స్పష్టం చేశారు. అంతేకాకుండా థియేటర్‌లో సౌండ్ తక్కువగా ఉంటే మీరే పెంచమని అడగాలని అభిమానులను కోరారు. ఈ పిచ్చోడిని ఇన్నాళ్లూ భరించారని.. ఈ పిచ్చి ఏంటో రేపు థియేటర్లలో చూస్తారని విశ్వక్ సేన్ పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement