వెంకీమామ ఆదర్శ కుటుంబం.. రన్‌ టైమ్ ఎంతంటే? | Venkatesh Aadarsha Kutumbam Movie Sensor Report Completed | Sakshi
Sakshi News home page

Aadarsha Kutumbam Movie: వెంకీమామ ఆదర్శ కుటుంబం.. సెన్సార్ ‍కంప్లీట్

Oct 28 2026 9:25 PM | Updated on Oct 28 2026 9:25 PM

Venkatesh Aadarsha Kutumbam Movie Sensor Report Completed

వెంకీమామ, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న లేటేస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆదర్శ కుటుంబం. ఈ చిత్రంలో  కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే పలుసార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ మూవీ ఎ‍ట్టకేలకు ఈనెల 30న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.

తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అంటే ఈ మూవీని చిన్నపిల్లలతో కలిసి ఫ్యామిలీ అందరూ చూసేయొచ్చు. అయితే కొన్ని అభ్యంతరకర పదాలను, ప్రముఖుల పేర్లను మ్యూట్ చేయాలని మేకర్స్‌కు సూచించింది. అంతేకాకుండా వయొలెన్స్ సీన్స్‌లో తీవ్రత తగ్గించాలని తెలిపింది. ఈ మూవీ దాదాపు రెండు గంటల 29 నిమిషాల రన్‌టైమ్‌తో థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌, నారా రోహిత్‌ కీలక పాత్రలు పోషించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement