భర్త ముందే బోల్డ్ సీన్స్.. అసలు ఎలా చేశారు? |Jyothi Poorvaj Reveals How She Filmed Bold Scenes Under Husband Direction For Killer Movie, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

Jyothi Purvaj: భర్త ముందే బోల్డ్ సీన్స్.. అసలు ఎలా చేశారు?

Oct 28 2026 4:34 PM | Updated on Oct 28 2026 4:47 PM

Tolywood actress Jyothi Purvaj Shares Bold scened In Killer Movie

సీరియల్ బ్యూటీ జ్యోతి పూర్వాజ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన  సినిమా ‘కిల్లర్‌’. ఈ చిత్రంలో పూర్వాజ్‌ మరో లీడ్‌ రోల్‌ చేసి, దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఎ. పద్మనాభరెడ్డితో కలిసి ఆయనే నిర్మించారు. ఉర్వీష్‌ పూర్వజ్‌ సమర్పణలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది.  ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలోని ట్విస్ట్ కనిపెడితే రూ.కోటి బహుమతి ఇస్తామని ప్రకటించారు.

ఇదిలా ఉంటే హీరోయిన్ జ్యోతి పూర్వాజ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానామిచ్చారు. ఈ మూవీకి ఆమె తన భర్తనే డైరెక్టర్ కావడంతో మీరు ఎలా చేశారని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ముఖ్యంగా మీ భర్త ముందో బోల్డ్ సీన్స్ ఎలా చేశారని అడిగారు. దీనికి జ్యోతి పూర్వాజ్ ఆసక్తికర సమాధానమిచ్చింది.

జ్యోతి పూర్వాజ్ మాట్లాడుతూ..'ఒక నటి నేను సెట్‌లో అడుగుపెట్టాక నా బాడీపై కంట్రోల్‌ ఉండదు. ఇక్కడ నేను చెప్పేది వేరే ఉద్దేశంతో కాదు. అక్కడ కేవలం నా మైండ్‌లో ఒక నటిగా మాత్రమే ఆలోచిస్తా. ఆ క్యారెక్టర్‌ ఏంటనే దానిపైనే నా ఫోకస్ ఉంటుంది. నేను ఓ సీరియల్‌లో చేసినప్పుడు.. ఒక ఐటీ ఎంప్లాయి డబ్బుల కోసం సరోగసీకి ఒప్పుకుంటుంది. ఆ క్యారెక్టర్‌లో నేను ప్రెగ్నెన్సీతో కనిపించేందుకు చాలా కష్టపడ్డా. ఎందుకంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అలాంటి హవాభావాలు కనిపించాలి. నేను బయటికి వెళ్లినా కూడా అలానే అనిపించేంది' అని పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement