సినిమాలోని ట్విస్టు చెబితే రూ. కోటి పక్కా ఇస్తాం: పూర్వాజ్‌ | Poorvaj Talks About Killer Movie | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులు షాక్‌ అవుతారు : పూర్వాజ్‌

Oct 28 2026 11:40 AM | Updated on Oct 28 2026 11:48 AM

Poorvaj Talks About Killer Movie

జ్యోతి పూర్వజ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన  సినిమా ‘కిల్లర్‌’. ఈ చిత్రంలో పూర్వాజ్‌ మరో లీడ్‌ రోల్‌ చేసి, దర్శకత్వం వహించి, ఎ. పద్మనాభరెడ్డితో కలిసి నిర్మించారు. ఉర్వీష్‌ పూర్వజ్‌ సమర్పణలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. 

మంగళవారం విలేకరుల సమావేశంలో పూర్వాజ్‌ మాట్లాడుతూ– ‘‘కిల్లర్‌’ ఒక ఫీమేల్‌ సెంట్రిక్‌ సినిమా. టెర్రరిస్ట్, వ్యాంపైర్, స్పై... ఇలా డిఫరెంట్‌ రోల్స్‌తో ఆకట్టుకుంటారు జ్యోతి. న్యూరో లింక్‌ మీద ఎలాన్‌ మస్క్‌ పరిశోధనలు చేస్తున్నాడు. అయితే మిషిన్స్‌ మీద చేస్తున్నాడు. మనిషి మీద చేస్తే ఎలా ఉంటుందనేది మా సినిమా కాన్సెప్ట్‌. నేను సైంటిస్ట్‌గా, పోలీస్‌గా నటించాను. మా సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్‌ కథలోని మెయిన్‌ పాయింట్‌కు షాక్‌ అవుతారు. 

(చదవండి: ‘ఆదర్శ కుటుంబం’తో సెంచరీ కొడతాం : వెంకటేశ్‌)

సెకండాఫ్ లో ట్విస్ట్ చెప్పినవారికి కోటి రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించాం. ఈ నెల 29న రాత్రి 10 గంటలకు మా మూవీ ప్రీమియర్స్ పడతాయి. 11 గంటలకు ఆ ట్విస్ట్ ఏంటనేది వాట్సాప్ చేయాలి. ఎవరు త్వరగా ఆన్సర్ పంపిస్తే వారి పేరు మా మూవీ సక్సెస్ మీట్ లో ఎల్ ఈడీ స్క్రీన్ మీద డిస్ ప్లే చేస్తాం’ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement