7 ఏళ్లకే 12 భాషలు మాట్లాడుతున్న హీరోయిన్ కూతురు | Actor Asin 7 Year Old Daughter Speaks 12 Languages, Husband Rahul Sharma Reveals Their Unique Parenting Style, Read Story Inside | Sakshi
Sakshi News home page

Asin Daughter: నా జీవితంలో ఆమె పాత్రను మాటల్లో చెప్పలేను

Oct 28 2026 10:05 AM | Updated on Oct 28 2026 10:36 AM

Actor Asin Daughter Speak 12 Languages At 7 Years Age

ఒకప్పుడు తెలుగులో రవితేజ, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో వరస సినిమాలు చేసిన హీరోయిన్ అసిన్.. పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు పూర్తిగా దూరమైంది. రెండు రోజుల క్రితం తన 41వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. అయితే ‍అసిన్ గురించి ఈమె భర్త రాహుల్ శర్మ చెప్పిన విషయాలు, అలానే కూతురిని ఇద్దరూ కలిసి పెంచుతున్న విధానం గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు)

నా జీవితంలో ముఖ్యమైన విషయం అసిన్‌ని పెళ్లి చేసుకోవడం. నా వెనుకున్న బలం ఆమెనే. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అది ఎలాంటిదైనా సరే ‘చింతించకు.. ముందుకు సాగిపో’ అని ఆమెనే చెబుతుంది. నన్ను, నా అభిరుచిని అర్థం చేసుకుంటుంది. నాపై ఆమెకు అపారమైన నమ్మకముంది. మీ చుట్టూ ఇలాంటి వ్యక్తులు ఉంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మన జీవిత భాగస్వామి మనల్ని ముందుకు నడిపించే వ్యక్తి అయి ఉండాలి కానీ వెనక్కి లాగే వ్యక్తి కాకూడదు. నా విషయంలో అసిన్ అలాంటి వ్యక్తే. నా జీవితంలో ఆమె పాత్ర ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేను అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

తమ కుమార్తె అరిన్ గురించి మాట్లాడిన రాహుల్ శర్మ.. మాకు అందమైన కుమార్తె ఉంది. ఆమె కొరియన్, జపనీస్, థాయ్, చైనీస్ సహా దాదాపు 12 భాషలను అర్థం చేసుకోవడంతో పాటు మాట్లాడగలదు. నేను మాత్రం రెండు భాషలు మాట్లాడటానికే కష్టపడుతున్నాను. ఇంగ్లిష్, హిందీతోనే సరిపెట్టుకుంటున్నాం అని సరదాగా చెప్పాడు. ఇప్పటివరకు అరిన్‌ టీవీ చూడటం, మొబైల్ ఫోన్లు ఉపయోగించడం లాంటివి చేయలేదు. అరిన్ చదువుతున్న స్కూల్ కంటే మా ఇంట్లోనే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయేమో. ప్రస్తుతం ఆమె రెండో తరగతి చదువుతోంది. అయినప్పటికీ, ఎనిమిది, తొమ్మిదో తరగతులకు సంబంధించిన పుస్తకాలు కూడా ఇప్పటికే ఇంట్లో ఉన్నాయి. ఇదంతా అసిన్ కృషే అని రాహుల్ అన్నాడు.

అసిన్ చివరగా 2015లో వచ్చిన ‘ఆల్ ఈజ్ వెల్’ సినిమాలో కనిపించింది. తర్వాతి ఏడాది అంటే 2016లో రాహుల్ శర్మని పెళ్లాడిన తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసింది. భవిష్యత్‌లో నటిగా రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి?

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement