నటి నమిత కమ్‌ బ్యాక్‌? | Actress Namitha Comeback On Cards | Sakshi
Sakshi News home page

Namitha: మళ్లీ సినిమాల్లోకి రానుందా?

Oct 28 2026 7:13 AM | Updated on Oct 28 2026 7:13 AM

Actress Namitha Comeback On Cards

ప్రయత్నిస్తే అసాధ్యమేదీ కాదు. నిరంతర కృషి ,పట్టుదలతో అనుకున్నది సాధించిన వారు చాలామంది ఉన్నారు. నటి నమితని కూడా ఈ కోవాలోకి చేర్చొచ్చు. రెండు దశాబ్దాల క్రితం అంటే 2001 ప్రాంతంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో నటించి క్రేజీ తెచ్చుకుంది. గ్లామరస్‌ పాత్రలతో ప్రత్యేకత చాటుకుంది. తర్వాత కొన్నాళ్లకు బిగ్‌బాస్‌లో కలిసిన వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత బరువు పెరగడంతో ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వెళ్లింది. ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్‌గా ఉంటోంది.

(ఇదీ చదవండి: చిరంజీవి.. 'మెగావర్స్')

రీసెంట్ టైంలో తరచూ తన ఫొటోలని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తూ లైవ్‌లో ఉండే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ప్రముఖ యూట్యూబర్‌ డీజే సిద్దు దర్శకత్వం వహిస్తున్న డయంకరం చిత్రంలో నమిత ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బరువు తగ్గి స్లిమ్‌గా కనిపిస్తోంది. అలా ఆమె జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఒక వీడియోని తన ఇన్‌ స్టాలో పోస్ట్‌ చేసింది. దీనిని చూసిన నెటిజన్లు.. ఈమె నమితేనా అని ఆశ్చర్యపోతున్నారు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు అస్సలు మిస్ కావొద్దు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement