తమిళ ప్రముఖ సంగీత దర్శకుడు దేవా.. గత శనివారం కన్నుమూశారు. ముఖ్యమంత్రి విజయ్, సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు వెళ్లి ఆయనకు నివాళులర్పించారు. ఇంతలోనే ఆ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. దేవా సోదరుడి కొడుకు, నటుడు కార్తిక్ సబేష్(37) అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ రెండు మరణాలు మూడు రోజుల్లోనే జరిగేసరికి సదరు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)
ఇదే కాదు గతేడాది అక్టోబర్‌లో కార్తిక్ తండ్రి, సంగీత దర్శకుడు ఎంసీ సబేష్ మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన గతేడాది అక్టోబర్ 23న చెన్నైలో 68 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఇప్పుడు ఏడాది తిరిగేసరికి సబేష్ కొడుకు కార్తిక్, సోదరుడు దేవా చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
కార్తిక్ సబేష్ తమిళంలో సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ధమ్, వల్లవన్, పట్టత్తు యానై, ఉదయం ఎన్‌హెచ్4, బర్మా, కాదల్ సొల్ల వందేన్, కులిర్ 100° తదితర చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు ఈ నటుడు కూడా చిన్న వయసులో చనిపోవడం బాధాకరం.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్)


