నేరుగా ఓటీటీలోకి తెలుగు మిస్టరీ థ్రిల్లర్ | Rudravanam Ps Series OTT Release Date And Trailer | Sakshi
Sakshi News home page

Rudravanam Ps OTT: తెలుగు థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్

Oct 20 2026 10:52 AM | Updated on Oct 20 2026 10:52 AM

Rudravanam Ps Series OTT Release Date And Trailer

మలయాళంలోనే కాదు తెలుగులోనూ అప్పుడప్పుడు థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అవుతుంటాయి. వీటికి ఓటీటీల్లో మంచి ఆదరణ దక్కుతూ ఉంటుంది. ఇప్పుడు అలానే ఓ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ వదిలారు. ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తుందనేది కూడా వెల్లడించారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)

నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రలో చేసిన మిస్టరీ థ్రిల్లరీ సిరీస్ 'రుద్రవనం పీఎస్'. శశిధర్ మున్నంగి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మొత్తం ఏడు ఎపిసోడ్స్ ఉంటాయి. వీటిని వచ్చే శుక్రవారం(అక్టోబర్ 30) నుంచి జీ5 ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.

ట్రైలర్ బట్టి చూస్తే రుద్రవనం అనే ఊరిలో వరసగా రెండు హత్యలు జరుగుతాయి. అయితే ఆ బాడీలకు తల ఉండదు. దీంతో వీటిని విచారించే క్రమంలో ఎస్సై వేణుగోపాల్‌కి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఈ రెండే కాదు మరో ఆరు హత్యలు కూడా జరిగాయని తెలుసుకుంటాడు. ఇంతకీ వీళ్లని చంపింది ఎవరు? ఎందుకు హత్య చేస్తున్నాడు? చివరకు దొరికాడా లేదా అనేది స్టోరీలా అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement