breaking news
passed away
-
డాక్టర్ వీస్ పేస్ కన్నుమూత
కోల్‌కతా: క్రీడాకారుడు, క్రీడలకు సంబంధించిన వివిధ రంగాల్లో నైపుణ్యం... స్వయంగా ఒలింపిక్ పతకం గెలిచిన జట్టులో సభ్యుడు, మరో ఒలింపిక్ మెడలిస్ట్‌కు తండ్రి... వైద్యుడిగా వేర్వేరు క్రీడాంశాల్లో ప్రత్యేక గుర్తింపు... బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ వీస్ పేస్ బయోడేటా ఇది. 80 ఏళ్ల వీస్ పేస్ గురువారం అనారోగ్య కారణాలతో కోల్‌కతాలో కన్ను మూశారు. చికిత్స కోసం మంగళవారం ఆయనను ఆస్పత్రిలో చేర్చించగా ఆపై కోలుకోలేకపోయారు. గత కొంత కాలంగా వీస్ పేస్ పార్కిన్సన్ వ్యాధితో కూడా బాధపడుతున్నారు. భారత మహిళల బాస్కెట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ జెన్నిఫర్‌ను వివాహమాడిన వీస్‌కు కుమారుడు లియాండర్తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విదేశాల్లో ఉన్న వారిద్దరు తిరిగొచ్చిన తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి. ప్లేయర్‌గా మొదలై... 1945లో గోవాలో పుట్టిన వీస్ పేస్ మొదటి నుంచి అటు క్రీడల్లోనూ, ఇటు క్రీడా వైద్యంలోనూ చురుగ్గా ఉండేవారు. ఫుట్‌బాల్, క్రికెట్, రగ్బీ వంటి ఆటల తర్వాత ఆయన హాకీని పూర్తి స్థాయిలో ఎంచుకొని సత్తా చాటారు. మిడ్ ఫీల్డర్‌గా భారత హాకీ జట్టు తరఫున రాణించిన వీస్‌కు 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టులో ఆడే అవకాశం త్రుటిలో చేజారింది. అయితే ఆ తర్వాత టీమ్‌లో తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. 1971 హాకీ వరల్డ్ కప్‌లో మూడో స్థానంలో నిలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. తర్వాతి ఏడాదే మరో కీలక విజయంలో ఆయన భాగమయ్యారు. 1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులో కూడా వీస్ కీలక పాత్ర పోషించారు. ఆటగాడిగా గుర్తింపు పొందక ముందే 1964–65లో ఆయన కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి ప్రి మెడికల్ కోర్సు పూర్తి చేశారు. స్పోర్ట్స్ డాక్టర్‌గా... హాకీ నుంచి తప్పుకోగానే వీస్ పేస్ పూర్తి స్థాయిలో క్రీడా వైద్యంపై దృష్టి పెట్టారు. నాటి రోజుల్లో మన దేశంలో స్పోర్ట్స్ మెడిసిన్‌పై పెద్దగా అవగాహన, గుర్తింపు రాని రోజుల్లోనే వీస్ ఆధునిక వైద్య విధానాలతో భిన్న క్రీడాంశాల్లో ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేశారు. దశాబ్దకాలం పాటు భారత డేవిస్ కప్ జట్టుతో పాటు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్‌లో పాల్గొన్న టీమ్‌లకు కూడా ఆయన టీమ్ డాక్టర్‌గా పని చేశారు. స్పోర్ట్స్ మెడిసిన్ ద్వారా పలువురు భారత ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోవడంలో వీస్ సహకరించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్, బీసీసీఐకి కూడా ఆయన సుదీర్ఘకాలం కన్సల్టెంట్‌గా పని చేశారు. ముఖ్యంగా బీసీసీఐ యాంటీ డోపింగ్ ప్రోగ్రామ్‌లో ఆయన కీలక పాత్ర పోషిస్తూ బోర్డుకు సహకరించారు. కొడుకును తీర్చిదిద్ది... తండ్రీ కొడుకులు ఒలింపిక్ పతక విజేతలు కావడం ప్రపంచ క్రీడల్లో చాలా అరుదు. అలాంటి ఘనతను పేస్ కుటుంబం సాధించింది. తండ్రి ప్రోత్సాహంతో క్రీడాకారుడిగా మారిన లియాండర్ తర్వాతి కాలంలో భారత టెన్నిస్ దిగ్గజంగా తన పేరును లిఖించుకున్నాడు. లియాండర్ కెరీర్‌ను తీర్చిదిద్దడంతో తండ్రిగా, మేనేజర్‌గా, మెంటార్‌గా వీస్ పాత్ర చాలా పెద్దది. 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పాటు 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన లియాండర్ తండ్రి అంచనాలను అందుకోగలిగాడు. వీస్ పేస్ మృతి పట్ల హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కీతో పాటు మాజీ ఆటగాళ్లు అజిత్‌పాల్ సింగ్, వీరెన్ రస్కిన్హా, బీపీ గోవింద, హర్బీందర్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ‘వీస్ అంకుల్‌తో నాకు దాదాపు పాతికేళ్ల అనుబంధం ఉంది.2002 బుసాన్ ఆసియా క్రీడల నుంచి ఆయన ఎన్నోసార్లు మాతో కలిసి పని చేశారు. స్వయంగా ఆటగాడు కావడంతో ఆయనకు క్రీడాకారుల మానసిక స్థితిపై కూడా సరైన అవగాహన ఉండేది. దాని ప్రకారమే ఆయన వైద్యం చేసేవారు. భారత క్రీడారంగానికి ఆయన లోటు తీరనిది’ అని నివాళి అర్పించింది. -
అపోలో వ్యోమగామి జిమ్ లవెల్ కన్నుమూత
వాషింగ్టన్: అపోలో 13 మిషన్‌కు నాయకత్వం వహించిన అమెరికా వ్యోమగామి జిమ్ లవెల్ 97 ఏళ్ల వయస్సులో శుక్రవారం కన్నుమూ శారు. ‘జిమ్ వ్యక్తిత్వం, దృఢ సంకల్పం మన దేశం చంద్రుడిని చేరుకోవడానికి, విషాదాన్ని విజయంగా మార్చడానికి సహాయపడ్డాయి, అప్పటి ఘటన నుంచి మేం ఎంతో నేర్చుకు న్నాం. జిమ్ మరణానికి సంతాపం తెలియజే స్తున్నాం’అని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. నాసా కార్యకలాపాలు చేపట్టిన మొదటి దశాబ్ద కాలంలో అత్యధికంగా ప్రయాణించిన వ్యోమగాములలో ఒకరు లవెల్. జెమిని 7, జెమిని 12, అపోలో 8, అపోలో 13 మిషన్లలో నాలుగుసార్లు ప్రయాణించారు.1928లో క్లీవ్‌ల్యాండ్‌లో జన్మించారు లవెల్. 1952లో అమెరికా నేవల్ అకాడెమీలో డిగ్రీ సాధించారు. 1952లో టెస్ట్ పైలట్, 1962లో నాసాలో వ్యోమగామిగా ఎంపికయ్యారు. జెమిని 7, అపొలో 8 వంటి మిషన్లలో ఆయన భాగస్వామిగా ఉన్నప్పటికీ, 1970 నాటి అపొలో 13 మిషన్ మాత్రం లెజెండ్‌గా ఆయన్ను మార్చివేసింది. మూడో యాత్ర సందర్భంగా చంద్రుడిపైకి దిగాక ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది. దీంతో, అందులోని సిబ్బంది భూమికి సుమారు 2 లక్షల మైళ్ల దూరంలో చిక్కుబడిపోయారు. అయినప్పటికీ ధైర్యాన్ని కోల్పోక ప్రత్యామ్నా యాలను అనుసరించి, అపాయం నుంచి బయటపడ్డారు. ‘వాస్తవానికి ఆ మిషన్ విఫల మైంది. దాంతో సాధించింది కూడా ఏమీ లేదు. కానీ, దాని ద్వారా వచ్చిన ఫలితం మాత్రం అద్భుతం. అలాంటి విపత్తును సైతం ధైర్యంగా స్వీకరించి విజయవంతంగా మార్చ గల సత్తా ఉందని నిరూపించడమే మేం సాధించిన విజయం’అని లవెల్ రాయిటర్స్‌కు 2010లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తనతోపాటు సహచరులు జాక్ స్విగెర్ట్, ఫ్రెడ్ హయిజ్లు.. గడ్డకట్టించే చలి, ఆకలి, మరో వైపు కేవలం నాలుగు రోజులకు మాత్రమే సరిపడే ఆక్సిజన్ ఉన్నా ఎంతో ధైర్యతో వ్యవ హరించామన్నారు. ఆ సమయంలో స్విగెర్ట్.. ‘హౌస్టన్, మాకో సమస్య వచ్చి పడింది’అంటూ నాసాకు చాలా తేలికైన సందేశమిచ్చారు. దీనినే టామ్ హాంక్స్ 1995 నాటి అపొలో 13 సినిమాలో వాడుకున్నారు. ఆ సినిమాలో లవెల్ పాత్రను టామ్ హాంక్స్ పోషించడం విశేషం. అపొలో 13 మిషన్ పసిఫిక్ సముద్రంలో సురక్షితంగా ల్యాండైంది. అప్పటికే లవెల్ పేరు ప్రపంచమంతటా మారుమోగిపోయింది. ఎన్నో తీవ్ర ఒత్తిళ్ల మధ్య నిబ్బరంగా పనిచేసిన లవెల్ మారుపేరుగా నిలిచారు. 1973లో నాసా నుంచి రిటైరయ్యారు. -
ఇండస్ట్రీలో విషాదం.. 34 ఏళ్లకే చనిపోయిన హీరో
గత కొన్నేళ్లలో మరణాలు ఆశ్చర్యకర రీతిలో ఉంటున్నాయి. చిన్న వయసులోనే చాలామంది తుదిశ్వాస విడుస్తున్నారు. ఇప్పుడు ఓ యంగ్ హీరో కూడా జాండీస్‌తో బాధపడుతూ కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇంతకీ ఏమైంది?(ఇదీ చదవండి: ఇండస్ట్రీలో మరో విషాదం.. కమెడియన్ కన్నుమూత)కన్నడ ఇండస్ట్రీలో అనెకల్ బాలరాజు నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన వారసుడు సంతోష్ బాలరాజు. 2009లో 'కెంప' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అనంతరం గణప, బర్కెలీ, సత్య, కరియా 2 తదితర సినిమాలు చేశాడు. గత కొన్నేళ్ల నుంచి మాత్రం సంతోష్.. నటుడిగా కొత్త మూవీస్ ఏం చేయట్లేదు. అసలు విషయానికొస్తే కాలేయం, మూత్రపిండాల్లో సమస్యల కారణంగా గత నెలలో జాండీస్ బారిన పడ్డాడు. దీంతో ఐసీయూలో చికిత్స అందిస్తూ వచ్చారు.తాజాగా మరోసారి ఆరోగ్య పరిస్థితి విషమించింది. సంతోష్ కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యులు ప్రయత్నాలు చేసినా సరే ప్రాణాలు కాపాడలేకపోయారు. బెంగళురూలోని కుమారస్వామి లేఔట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం 9:30 గంటలకు కన్నుమూశారు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. 2022లో సంతోష్ తండ్రి బాలరాజు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.(ఇదీ చదవండి: ఉదయం లేవగానే మొటిమలపై ఉమ్మి రాసుకుంటా: తమన్నా) -
Shibu Soren: జార్ఖండ్ మాజీ సీఎం కన్నుమూత
-
జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరెన్ కన్నుమూత
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ ఎంపీ శిబు సోరెన్(81) ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు. జార్ఖండ్ నుంచి శిబు సోరెన్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జార్ఖండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈయన తనయుడు.జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో శిబు సోరెన్ కీలక పాత్ర వహించారు. ఆ ఉద్యమంలో భాగంగానే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించారు. అనంతరం జార్ఖండ్‌కు ఆయన మూడుసార్లు సీఎంగా పని చేశారు. దుమ్కా లోక్‌సభ నియోజక వర్గం నుంచి 8 సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన.. యూపీఏ హయాంలో మూడుసార్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రెండుసార్లు రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు.జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుకు కీలకంగా పని చేయడంతో పాటు వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. చిరుదిహ్ హత్య కేసు శిబు సోరెన్ రాజకీయ జీవితంలో స్పీడ్ బ్రేకర్‌గా మారింది. 2004లో, శిబు సోరెన్ కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న టైంలో.. చిరుదిహ్ గ్రామంలో తన వ్యక్తిగత కార్యదర్శి శశినాథ్ ఝా హత్య కేసులో ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ కారణంగా ఆయన జూలై 24, 2004న కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన ఒక నెల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండి.. సెప్టెంబర్ 8న బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు.. చివరికి శిబు సోరెన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఆయన మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. -
ఏనుగులంటే ప్రాణం : కానీ మల్టీ మిలియనీర్ని ఏనుగే తొక్కేసింది!
ఆస్ట్రేలియన్ జూకీపర్, సంరక్షకుడు స్టీవ్ ఇర్విన్ స్టింగ్రే చేతిలో మరణించిన ఉదంతాన్ని గుర్తు చేసేలా మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా పర్యావరణ పర్యాటక రంగంలో పేరు గాంచిన మల్టీ మిలియనీర్ సీఈవో, ఎకోటూరిజం వ్యాపారవేత్త ఎఫ్‌సీ క్రిస్టియన్ కాన్రాడీ(39) తన సొంత జూలోనే ఏనుగు దాడిలో దుర్మరణం పాలైన ఘటన వన్యప్రాణి ప్రేమికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. జనసాంద్రత ఉన్న ప్రాంతం నుండి ఏనుగులను తరలించడానికి ప్రయత్నిస్తుండగా జూలై 22న ఉదయం 8 గంటలకు గోండ్వానా ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో ఈ విషాదకరమైన సంఘటన జరిగింది.దక్షిణాఫ్రికాలోని టాప్ రిజర్వ్‌లలో ఏనుగు అతనిపై దారుణంగా దాడిచేసి తొక్కి చంపింది. ది డైలీ మెయిల్ ప్రకారం.. కాన్రాడీ పర్యాటక లాడ్జీల నుండి ఏనుగుల గుంపును దూరంగా నడిపించడానికి ప్రయత్నించినప్పుడు జరిగింది. ఏనుగు తన దంతాలతో కాన్రాడీని పొడిచి, పలు మార్లు తొక్కడంతో, సమీపంలోని రేంజర్లు ఎంత ప్రయత్నించినా అతన్ని రక్షించలేకపోయారు. గోండ్వానా గేమ్ రిజర్వ్ మిస్టర్ కాన్రాడీ మృతిపై సంతాపం ప్రకటించింది. దక్షిణాఫ్రికాలోని ప్రముఖ గోండ్వానా ప్రైవేటు గేమ్ రిజర్వ్‌లో జరిగిన విషాద ఘటన ఎకోటూరిజం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. గేమ్ రిజర్వ్‌లలో భద్రతా ప్రోటోకాల్‌ల గురించి చర్చకు దారితీసింది.కేలిక్స్ గ్రూప్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ యజమానికి కాన్రాడీకి ఏనుగులు, ప్రకృతి అంటే చాలా ప్రేమ అట. వాటిని ఫోటో తీయడానికి ఇక్కడకు తరచూ వచ్చేవారని సిబ్బంది గుర్తు చేసుకున్నారు. ఎంత ప్రేమ అయినా కానీ అడవిలో ఉన్నాయనేది ఎప్పటికీ మర్చిపోకూడదంటూ ఆయన అకాలం మరణంపై సంతాపం ప్రకటించారు. కాన్రాడీకి జంతుశాస్త్రం, జంతు అధ్యయనాలు, వాణిజ్యం, మార్కెటింగ్‌లో ఆనర్స్ డిగ్రీలు కూడా ఉన్నాయి. ముగ్గురు బిడ్డలకు తండ్రి.Francois Christiaan Conradie, 39, CEO of Gondwana Private Game Reserve, killed by elephant on July 22 at 8 AM. Visionary conservationist, husband, father of three. Family seeks privacy in the meantime. pic.twitter.com/vxMIENplav— Inside Out News (@InsideOutNews_) July 24, 2025చదవండి: బాలీవుడ్ సాంగ్‌కు చిన్నారుల స్టెప్స్ అదుర్స్.. ఆ కెమెరా మేన్ ఉన్నాడే..!గోండ్వానా ప్రైవేటు గేమ్ రిజర్వ్ పాపులర్ ఫైవ్‌స్టార్ సఫారీ లాడ్జి. ఆఫ్రికాలోని ప్రసిద్ధ "బిగ్ ఫైవ్" సింహం, ఏనుగు, చిరుతపులి, ఖడ్గమృగం, బఫెలోలను దగ్గరగా చూడాలనుకునే పర్యాటకులకు ఇది ఫేవరెట్ డిస్టినేషన్. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు, ఫోటోగ్రాఫర్లు, వన్యప్రాణి ప్రేమికులు ఇక్కడకు వస్తుంటారు. మరోవైపు గోండ్వానా రిజర్వ్‌లో గత ఏడాది కూడా బోనీ అనే 36 ఏళ్ల ఉద్యోగి ఒకరు ఏనుగుల దాడిలో మృతి చెందారు. ఈ వరుస ఘటనలు గేమ్ రిజర్వ్‌లలో సిబ్బంది, పర్యాటకుల భద్రతపై అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఎఫ్‌సీ కాన్రాడీ మరణం వన్యప్రాంతాల్లో పనిచేసే వారికీ, పర్యాటకులకూ ఒక హెచ్చరిక అని, తగిన సంరక్షణ చర్యలు చేపట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పట్టుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం -
ప్రధానిని సైతం నవ్వించిన మీమ్ ఆర్టిస్ట్ కృష్ణ ఇక లేరు : ఫ్యాన్స్ దిగ్భ్రాంతి
ఒడిషాకు చెందిన ప్రముఖ ఫోటోషాప్ కళాకారుడు, మీమ్స్ సృష్టికర్త కృష్ణ (Atheist krishna) ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న (జూలై 23)న కన్నుమూశారు. దీంతో పలవురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయసులో అకాల మరణం అంటూ అభిమానులు నివాళులర్పించారు.కృష్ణ అసలు పేరు రాధాకృష్ణ పంగా. మీమ్స్ , ఫోటోషాప్ ఫోటోలతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ ఫోటోలతో పాటు, పాత, దెబ్బతిన్న ఫోటోలను పునరుద్ధరించడంలో కూడా ప్రసిద్ధి చెందాడు. కృష్ణ నైపుణ్యం అనేకమంది సెలబ్రిటీల ప్రశంసలందుకుంది. ముఖ్యంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ దృష్టిని ఆకర్షించి, వారి ప్రశంసలను కూడా దక్కించుకున్నారు.Woke up to the terrible news of @Atheist_Krishna passing away. He was one of the kindest people I met on this platform. On 10th July, he told me he was unwell and needs to be operated. He caught pneumonia. At that time, he said “it would be a miracle if I survive this.” I… pic.twitter.com/Fmo6AJFZhW— tere naina (@nainaverse) July 23, 2025అనారోగ్యంతో బాధపడుతూ జూలై ప్రారంభంలో ఆస్పత్రిలో చేరాడు. అయితే ఊరిపితిత్తుల్లోకి నీరు చేరడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసినా ఫలితం లేకపోయింది. కానీ దురదృష్టవశాత్తు న్యుమోనియా సోకడంతో పరిస్థితి క్షీణించి కన్నుమూశాడు ఈ వార్త తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.చదవండి: Beauty Tips ముడతల్లేకుండా...అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే!కాగా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేదికపై నృత్యం చేస్తున్న స్పూఫ్ వీడియోను క్రియేట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై స్వయంగా మోదీ స్పందించారు. మోదీ తన సోషల్ మీడియాలో ఖాతాలో ఈ ఆర్టిస్ట్ వీడియోను పోస్ట్ చేసి మరీ ప్రశంసించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: బాలీవుడ్ సాంగ్‌కు చిన్నారుల స్టెప్స్ అదుర్స్.. ఆ కెమెరా మేన్ ఉన్నాడే..! Like all of you, I also enjoyed seeing myself dance. 😀😀😀Such creativity in peak poll season is truly a delight! #PollHumour https://t.co/QNxB6KUQ3R— Narendra Modi (@narendramodi) May 6, 2024 -
కేన్సర్‌తో కన్నుమూసిన నటి, ప్రముఖ గాయని, కన్నీటి సంద్రంలో అభిమానులు
ప్రముఖ గాయని, నటి, వ్యాపారవేత్త ప్రెటా గిల్ కేన్సర్ పోరాడి, పోరాడి తనువు చాలించింది. తనదైన స్వరంతో సంగీత ప్రపంచాన్నిఉర్రూత లూగించిన ఆమె, 50 ఏళ్ల వయసులో పేగు క్యాన్సర్ తో పోరాడి, చికిత్స పొందుతూ,న్యూయార్క్ నగరంలో జూలై 20న తుది శ్వాస విడిచింది. దీంతో సంగతం ప్రపంచం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పలువురుప్రముఖుల సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.ప్రేటా గిల్ బ్రెజిలియన్ సంగీత పరిశ్రమలో పేరుగాంచిన మహిళ ప్రెటా. 2023 జనవరిలో ఆమెకు పేగు కేన్సర్ నిర్ధారణ అయింది. కేన్సర్‌తో పోరాటం గురించి బహిరంగంగా చర్చించేది. రెండేళ్లకు పైగా సాగిన సుదీర్ఘమైన, కఠినమైన తన పోరాటంలో అభిమానులు ఆమెకు అండగా నిలిచారు. 2024లో శస్త్రచికిత్స జరిగింది.కణితిని, గర్భాశయాన్ని కూడా తొలగించారు. కీమోథెరపీ , రేడియోథెరపీతో చికిత్స తీసుకుంటూ ఎంతో ధైర్యంగా, చాలా ఆశావహ దృక్పథంలో ఉండేది. తన పోరాటంలో అనేక సవాళ్ల గురించి ఆత్మస్థైర్యంతో మాట్లాడేది. తద్వారా తనలాంటి కేన్సర్ రోగులకు ఎంతోమందికి ధైర్యాన్నిచ్చేది.సంగీత కారుడు, రాజకీయవేత్త గిల్బర్టో గిల్ కుమార్తెప్రేటా. 'ప్రేటా' అంటే పోర్చుగీస్ భాషలో 'నలుపు' అని అర్థం. తన కుమార్తెకు ఈ పేరు పెట్టడానికి చాలా ఇబ్బందలు పడ్డాడట.గిల్బర్టో గిల్ తన కుమార్తె ప్రేటా గిల్ మరణ వార్తను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో అనేక మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు.lutou até o fim. tentou, foi forte, foi guerreira. lidou com abandono, traição em plena descoberta da doença e em nenhum momento parou de sorrir. descanse em paz, preta gil. você é amor 🤍 pic.twitter.com/T6ddwBpPcY— mari (@ahcamilas) July 20, 2025 పేగు కేన్సర్, లేదా పెద్ద పేగు కేన్సర్, పెద్దప్రేగు లేదా మలనాళంలో ఏర్పడే కేన్సర్. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ కేన్సర్ కనిపిస్తుంది, కానీ ఇటీవల యువతలో కూడా ఈ కేన్సర్ కేసులు పెరుగుతున్నాయి.లక్షణాలు:మలంలో రక్తంమలబద్ధకం లేదా అతిసారం వంటి ప్రేగు అలవాట్లలో మార్పుబలహీనత, అలసట, బరువు తగ్గడంకడుపు నొప్పి, తిమ్మిరి, లేదా ఉబ్బరంపేగు కదలిక తర్వాత ప్రేగులు పూర్తిగా ఖాళీ అవ్వడం లేదనే భావన కారణాలు: 50 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా వస్తుంది.పేగు కేన్సర్ లేదా పాలిప్స్ చరిత్ర ఉన్నవారికి ప్రమాదం ఎక్కువ. ఫ్యాటీ ఫుడ్స్, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం, తక్కువ పీచు పదార్థాలు తీసుకోవడం.శారీరక శ్రమ లేకపోవడం.సిగరెట్లు, మద్యపానం. -
ఇండస్ట్రీలో మరో విషాదం.. స్టార్ డైరెక్టర్ ఇక లేరు
ఇండస్ట్రీలో మరో విషాదం. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చంద్ర బరోట్(86) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయమై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. దర్శకుడికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.(ఇదీ చదవండి: యంగ్ హీరో నిఖిల్‌కి ఝలక్.. ట్వీట్ వైరల్)అమితాబ్ హీరోగా వచ్చిన 'డాన్' ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా తీసింది ఈయనే. అలా 'డాన్' దర్శకుడిగా చాలా ఫేమస్ అయిపోయారు. దీని తర్వాత ప్యార్ బరా దిల్, హాంకాంగ్ వాలీ స్క్రిప్ట్, నీల్ కో పకడ్నా తదితర చిత్రాల్ని తెరకెక్కించారు. కానీ, ఆయనకు అత్యంత గుర్తింపు తెచ్చింది మాత్రం డాన్. దర్శకత్వం వహించడానికి ముందు పురబ్ ఔర్ పచ్చిమ్, యాద్గార్, రోటీ కపడా ఔర్ మకాన్ తదితర మూవీస్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు ఈయన మృతి చెందడంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: నిజజీవిత కథ.. 'గరివిడి లక్ష్మి' గ్లింప్స్ రిలీజ్) -
20 ఏళ్లుగా కోమాలో.. సౌదీ ‘స్లీపింగ్ ప్రిన్స్’ కన్నుమూత
సౌదీ అరేబియా ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖలెద్(36) ఇక లేరు. గత 20 ఏళ్లుగా కోమాలో ఉన్న ఆయన.. శనివారం కన్నుమూశారు. ఈ కారణంగానే సౌదీ అరేబియా స్లీపింగ్ ప్రిన్స్‌గా ఈయనకంటూ ఓ పేరు ముద్రపడిపోయింది. ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖలెద్ సౌదీ అరేబియా రాజ కుటుంబానికి చెందినవారు. ఆయన ప్రిన్స్ ఖలెద్ బిన్ తలాల్ అల్ సౌద్ పెద్ద కుమారుడు. 2005లో లండన్‌లోని మిలిటరీ అకాడమీలో చదువుకుంటున్న టైంలో ఖలెద్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. మెదడులో రక్తస్రావం జరిగి.. వెంటిలేటర్‌పై కోమాలో ఉంటూ ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఖలెద్ కోసం అమెరికా, స్పెయిన్ నుండి నిపుణులు కూడా చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జూలై 20న రియాద్‌లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. Statement On the Passing of Prince Alwaleed bin Khaled bin Talal Al Saud pic.twitter.com/st19kxb7lC— Global Imams Council (GIC) (@ImamsOrg) July 19, 2025 View this post on Instagram A post shared by @arabianroyalagency -
కరుణానిధి పెద్ద కుమారుడు ముత్తు కన్నుమూత
చెన్నై: తమిళనాడు దివంగత సీఎం కరుణానిధి పెద్ద కుమారుడు, సీఎం స్టాలిన్ సోదరుడు ఎంకే ముత్తు(77) శనివారం కన్నుమూశారు. నటుడు, నేపథ్య గాయకుడు అయిన ముత్తు వయో సంబంధ సమస్యలతో చనిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. సీఎం స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి విషయం తెల్సిన వెంటనే ముత్తు నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. మాజీ గవర్నర్ తమిళిసై సహా పలువురు నేతలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. శనివారం సాయంత్రం బీసెంట్ నగర్‌లోని విద్యుత్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలకు స్టాలిన్ సోదరి, ఎంపీ కనిమొళి, సోదరులు అళగిరి తదితరులు హాజరయ్యారు. కరుణానిధికి ముగ్గురు భార్యలు కాగా, మొదట భార్య పద్మావతికి పుట్టిన కుమారుడే ముత్తు. -
నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
-
టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ఫిష్ వెంకట్ కన్నుమూత
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్(53) కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితమే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఫిష్ వెంకట్ చికిత్సకు ఆర్థికసాయం అందించారు.తెలుగులో పలు చిత్రాల్లో ఫిష్ వెంకట్ నటించారు. తెలుగు సినిమాల్లో విలన్ అంటే కొందరు గుర్తొస్తారు.. అలాంటి వారిలో ఫిష్ వెంకట్ ఒకరు. మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో బోలెడన్ని మూవీస్ చేశారు. ఎన్టీఆర్ 'ఆది' మూవీలో తొడకొట్టు చిన్నా అనే డైలాగ్‌తో తెగ పాపులర్ అయ్యారు. కాగా.. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేశ్ కాగా.. ముషీరాబాద్ మార్కెట్లో చేపలు వ్యాపారం చేయడంతో ఫిష్ వెంకట్‌గా తెచ్చుకున్నారు. తెలుగులో 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు. -
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతిపై నాట్స్ సంతాపం
ప్రముఖ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 750 సినిమాల్లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించిన కోట తెలుగు వారి మనస్సుల్లో చెరిగి పోని ముద్ర వేశారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. తండ్రిగా, తాతగా, కామెడీ విలన్‌గా, పోలీసుగా, మాంత్రికుడిగా ఎన్నో పాత్రలను పోషించిన కోటను తెలుగు వారు ఎన్నటికి మరిచిపోలేరని ఓ ప్రకటనలో తెలిపారు. కోట మృతి పట్ల నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చింది. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.కాగా ‘కోట’గా పాపులర్ అయిన నటుడు కోట శ్రీనివాసరావు (83) జూలై 13 తెల్లవారుజామున హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో కన్నుమూసారు. 83వ పుట్టినరోజు జరుపుకున్న కేవలం మూడు రోజులకే ఆయన మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక శకం ముగిసింది అంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత
ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్లో కోట శ్రీనివాసరావు మరణించగా.. ఆ తర్వాత మరో సీనియర్ నటి సరోజా దేవి కూడా కన్నుమూశారు. ఇవాళ మరో ప్రముఖ నటుడు మృతి చెందారు. బాలీవుడ్ నిర్మాత అయిన ధీరజ్ కుమార్ ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన న్యుమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా.. కోలుకోలేక తుదిశ్వాస విడిచారు.కాగా.. ధీరజ్ కుమార్ 1965లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆయన తన కెరీర్లో సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ నటించారు. 1970- 1984 మధ్య దాదాపు 21 పంజాబీ చిత్రాలలో నటించాడు. 'ఓం నమః శివాయ్' వంటి ఆధ్యాత్మిక, పౌరాణిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందిన క్రియేటివ్ ఐ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. అంతేకాకుండా 'స్వామి', 'హీరా పన్నా' 'రాతోన్ కా రాజా' వంటి లాంటి హిందీ చిత్రాలలో కూడా నటించాడు. ఆ తర్వాత రోటీ కపడా ఔర్ మకాన్ (1974), సర్గం (1979), క్రాంతి (1981) వంటి చిత్రాలలో సహాయక పాత్రలు పోషించారు. దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా సినిమాల్లో ధీరజ్ కుమార్ కొనసాగారు. ధీరజ్ కుమార్ మరణ వార్తను ధృవీకరించిన ఆయన కుటుంబం.. అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రార్థనలకు కృతజ్ఞతలు తెలిపింది. రేపు ఉదయం 10 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఇంటివద్దకు తరలించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు విలే పార్లే వెస్ట్‌లోని పవన్ హన్స్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. -
లెజెంజరీ నటి సరోజా దేవి చివరి కోరిక అదే.. నెరవేర్చిన కుటుంబ సభ్యులు
వెండితెరపై దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరించిన అలనాటి నటి బి. సరోజా దేవి (87) అనారోగ్యంతో మరణించారు. వృద్ధ్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని మల్లేశ్వరంలో తన స్వగృహంలో సోమవారం ఉదయం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దీంతో సినీ ప్రపంచం ఆమెకు ఘనంగా నివాళులర్పించింది. ఆమె నటించిన సినిమాలు, పాత్రలను గుర్తు చేసుకున్నారు.అయితే ఆమె చివరి కోరికను ఆమె కుటుంబ సభ్యులు నేరవేర్చారు. ఆమె కోరిక మేరకు కళ్లను దానం చేశారు. ఆమె కోరుకున్న విధంగా నారాయణ నేత్రాలయకు అందజేశారు. గతంలో నారాయణ నేత్రాలయను సందర్శించినప్పుడు కళ్లను దానం చేసేందుకు ముందుకొచ్చారని ఐ బ్యాంక్ అధికారి డాక్టర్ రాజ్‌కుమార్ తెలిపారు. ఆమె నేత్రదానానికి నమోదు చేసుకుని దాదాపు ఐదేళ్లు పూర్తయిందని వెల్లడించారు.అంత్యక్రియలుసరోజ మృతి పట్ల పలువురు కన్నడ, తెలుగు, తమిళ తదితర భాషల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంగళ వారం సరోజా దేవి స్వగ్రామం రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకా దశవార గ్రామంలో ఒక్కలిగ సామాజిక వర్గ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.తెలుగులో పాతిక వరకూ...తెలుగులో ఓ పాతిక సినిమాలు చేశారు సరోజ. ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎక్కువ చిత్రాలు చేశారామె. వాటిలో ‘ఉమాచండీ గౌరీ శంకరుల కథ, శ్రీరామాంజనేయ యుద్ధం, దాన వీర శూర కర్ణ’ వంటివి ఉన్నాయి. అలాగే అక్కినేని సరసన ‘శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆత్మ బలం, అమర శిల్పి జక్కన్న’ వంటివి చేశారు. ‘ఆత్మ బలం’లో ఏఎన్నార్‌తో కలిసి ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ పాటలో సరోజ వేసిన స్టెప్స్, కళ్లల్లో పలికించిన రొమాన్స్‌కి నాటి ప్రేక్షకులు ‘భేష్’ అన్నారు. -
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఇంట్లో విషాదం
తెలుగు నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు ఇంట్లో విషాదం నెలకొంది. ఈయన సోదరుడు చిట్టూరి కాశీవిశ్వనాథ్ (49) మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన.. ఈరోజు(జూలై 15) ఉదయం ఉమ్మడి గోదావరి జిల్లాలోని స్వగ్రామం పసివేదులలో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: కారణం లేకుండా విజయ్‌ని టార్గెట్ చేస్తున్నారు: నాగవంశీ)2018లో సమంత నటించిన 'యూ టర్న్' సినిమాతో నిర్మాతగా మారిన చిట్టూరి శ్రీనివాసరావు.. తర్వాత 'ద వారియర్', స్కంద, సీటీమార్, కస్టడీ, నా సామి రంగ తదితర చిత్రాలని నిర్మించారు. ప్రస్తుతం మరికొన్ని మూవీస్ తీసే పనుల్లో బిజీగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఈయన సోదరుడు చనిపోవడంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది.(ఇదీ చదవండి: చట్టప్రకారం చిరంజీవి దరఖాస్తు పరిష్కరించండి: హైకోర్ట్) -
బీ సరోజాదేవి మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
ప్రముఖ నటి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత బీ సరోజా దేవి మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి సంతాపం తెలియజేశారు. చలన చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారాయన.సాక్షి, గుంటూరు: ప్రముఖ నటి, పద్మభూషణ్ బీ సరోజా దేవి మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి సంతాపం తెలియజేశారు. తెలుగు, కన్నడ, తమిళ బాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని ఆమె పొందారని ఆయన ఒక ప్రకటనలో గుర్తుచేశారు. సరోజాదేవి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వైఎస్ జగన్ తెలిపారు. సరోజాదేవి గారు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆమె ఎన్నో అద్భుతమైన పాత్రలతో సినీ ప్రేక్షకులను అలరించారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సరోజాదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ప్రగాఢ సానుభూతిని వైఎస్ జగన్ తెలియజేశారు.ఇదీ చదవండి: అభినయ సరస్వతి సరోజా దేవి.. వరల్డ్ రికార్డు ఏంటో తెలుసా? -
సీనియర్ నటి బీ.సరోజాదేవి కన్నుమూత
-
సకల సినీ పాత్రలకు పెట్టని కోట
నివాళి: ‘శివ’లో అతను మాచిరాజు ‘అతడు’లో బాజిరెడ్డి పవర్జోన్లో అలాంటివాడుంటాడు – కోటలాగా. ‘అహ నా పెళ్ళంట’లో భిక్షపతి ‘ఆమె’లో అంతకంటే పిసినారి ప్రతి వీధిలో ఉంటాడు – కోటలాగే. ‘భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరూ’... ‘మందుబాబులం మేము మందుబాబులం’... మిడిల్‌క్లాస్ పార్టీల్లో పెగ్గుపెగ్గుకొక కోట... ఆ సినిమాలో తండ్రి... ఈ సినిమాలో తాతా... ‘చెబాష్... చెబాష్... చెబాష్’ ఉత్సాహపరిచే బాబాయ్... తెలుగు తెరపై ఆల్‌రౌండర్ కోట. 1985 ‘ప్రతిఘటన’ నుంచి 2015 ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వరకు ప్రేక్షకుల హృదయాలను గెలుస్తూనే ఉన్నాడు. దిగంతాలకేగినా నేలన మిగిలిపోయాడు.కోట శ్రీనివాసరావు తన ముఖంతో కంటే ముందు తన మాటతో ప్రేక్షకులకు తెలిశారు.అవును.‘ప్రతిఘటన’ సూపర్ హిట్ అయ్యాక వెంటనే డైలాగులు మార్కెట్లోకి క్యాసెట్లుగా వచ్చేశాయి. అప్పటికి ఆ సినిమా చాలా ఊళ్లకు వెళ్లనే లేదు. ఈలోపు క్యాసెట్లలో డైలాగులు వినసాగారు జనం. అందులో తెలంగాణ భాషలో పాత్ర మాట్లాడే ఒక పాత్ర వారిని ఆశ్చర్యపరిచి కొత్తగా అనిపించింది. మూసకట్టు తెలుగు సినిమాల్లో తెలంగాణ మాటను ఆ మాత్రమైనా పలికించినవారు అప్పటి వరకూ లేరు. ఏదడిగినా ‘పైకమిటీని అడిగి జె΄్తా’ అనే పాత్ర ఆ నటుడికి జన సామాన్యంలో మొదటిసారి గుర్తింపు తెచ్చింది. అందరూ ఆ నటుడిది తెలంగాణ అయి ఉంటుందని అనుకున్నారు. కాదు... కంకి పాడు.∙∙ చిరంజీవి, కోట శ్రీనివాసరావు ఒకే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రాణం ఖరీదు’. 1978. కాని 1985 వరకూ కోటకు మళ్లీ సినిమాలు చేసే వీలు రాలేదు. బ్యాంకు ఉద్యోగమూ... బాధ్యతలూ... నాటకాలూ. అయితే నాటకాలు వేసే వారు సినీ దర్శకుల కంట పడటం సులభం. క్రాంతి కుమార్, టి. కృష్ణ, జంధ్యాల అలా అవకాశాలు ఇచ్చినవారే. టి. కృష్ణ ‘ప్రతిఘటన’లో రాజకీయ నాయకుడి వేషం వేయిస్తే ‘బాబాయ్ అబ్బాయ్’లో అప్పులిచ్చి బాలకృష్ణ, సుత్తి వీరభద్రరావుల వెంటపడే గ్యాంగులో ఒకడిగా చూపించారు జంధ్యాల.అయితే సినిమాలో కోటకు ఆ అప్పు తిరిగి రాకపోగా పులి మీద పుట్రలా నిర్మలమ్మ మనవరాలైన పావలా శ్యామల పెళ్లి చేసుకోమని వెంటపడుతుంటుంది. రెండు పాత్రలూ నవ్వించేవే. అందుకే ‘అహ నా పెళ్ళంట’లో పిసినారి పాత్రకు కోట గుర్తుకు వచ్చారు రామానాయుడుకు. వాస్తవానికి ఆ పాత్ర రావు గో పాలరావు వేయాలి. కోటకు రాసిపెట్టి ఉంది. ‘నాకేంటి’ అని కోట ప్రేక్షకులను చూస్తూ అరచేతిలో అరచేతితో తాళం వేస్తే ప్రేక్షకులు ఎంతెంత ఇచ్చారనీ. ఇప్పటి వరకూ... ఇకపైనా.. అభిమానం!∙∙ కోటది నాగభూషణం స్కూలు. సీరియస్ విలన్లుగా రాణించిన కైకాల, రావు గో పాలరావుల అంశ కోటలో ఉన్నా కోట ఎప్పటికీ వారిలా సీరియస్ విలన్‌గా పండలేదు. కామెడీ టచ్ ఉంటే చెలరేగుతారు. నాగభూషణం కూడా అంతే. అందుకే కోటలో నాగభూషణం మేనరిజమ్స్ కనిపిస్తాయి. నాగభూషణాన్ని ఇన్‌స్పయిర్ చేసిన తమిళ నటుడు ఎం.ఆర్. రాధ బాడీ లాంగ్వేజ్ మాట విరుపు కూడా కోటలో ఉన్నాయి. మాటను నెమ్మది చేసి పెంచడం ఎం.ఆర్. రాధ స్టయిల్. నాన్ సీరియస్‌గా కనిపించే సీరియస్ విలన్. ‘శత్రువు’లో కోడి రామకృష్ణ కోటను సీరియస్ విలన్‌గానే చూపిద్దామనుకున్నారు. కాని ‘ఈ హోటల్లో జల పాతాలు ఎవరు పెట్టార్రా బాబూ’... అని చేతులు నెత్తి మీద వేసుకుంటే ప్రేక్షకులు భయపడుతూనే నవ్వారు. ‘థ్యాంక్స్’ అనే అతని మేనరిజమ్‌ని ఫాలో అయ్యారు. ∙∙ తమిళంలో గౌండర్ మణి, సెంథిల్ ద్వయం చేస్తున్న కామెడీకి తెలుగు రిప్లికాగా కోట, బాబూ మోహన్ తయారు కావడం సినిమాల సక్సెస్‌కు కారణమైంది. ‘మామగారు’ (1990)లో మొదలైన ఈ కామెడీ దాదాపు పదేళ్లు ఒక ఊపు ఊపింది. కోట సెట్స్ మీద మాటలు పేల్చడంలో ఘనులు. ‘కథలు లేక తెలుగు సినిమా కదల్లేకపోతోంది’ అనేవారాయన. కథలు లేక వరుసపెట్టి సాగిన తమిళ రీమేకుల్లో కోటకు పాత్రలు దొరుకుతూ వెళ్లాయి.అంతే కాదు ఆయన తన అద్భుతమైన టైమింగ్‌తో గౌండర్ మణి, మణివణ్ణన్, రాధా రవి... తదితరుల పాత్రలకు డబ్బింగ్ చెప్పి సినిమాలు హిట్ కావడానికి కారకులు అయ్యారు. ‘ఒకే ఒక్కడు’, ‘ప్రేమలేఖ’ సినిమాల్లో మణివణ్ణన్‌కు కోట డబ్బింగ్ చెప్పిన తీరు ఆ రంగంలో కృషి చేసేవారు తప్పక పరిశీలించదగ్గది.∙∙ దర్శకులే ఆర్టిస్టులను తయారు చేస్తారు. కోటకు ఆ సంగతి తెలుసు. నేను డైరెక్టర్ల ఆర్టిస్టును అని అంగీకరించేవారు. కోట కెరీర్లో ఇద్దరు ముగ్గురు దర్శకులు చాలా ముఖ్య పాత్ర పోషించారు. జంధ్యాల ఎలాగూ సరే. కాని జంధ్యాల శిష్యుడుగా రంగప్రవేశం చేసిన ఇ.వి.వి. సత్యనారాయణ కోటను తన సినిమాలకు ముఖ్య బలంగా చేసుకున్నారు. ‘సీతారత్నంగారి అబ్బాయి’తో మొదలైన ఈ కాంబినేషన్ ఇ.వి.వి. చివరి సినిమా వరకూ కొనసాగింది. ‘420’లో కోటతో చేయించిన ఎస్.ఐ. పాత్రను ‘హలో బ్రదర్’లో రిపీట్ చేసి ఎస్.ఐ. తాడి మట్టయ్య పాత్రను గుర్తుండిపోయేలా చేశారు.ఇ.వి.వియే కోటను వెంకటేశ్‌కు తండ్రిలా చూపించే సాహసం చేసి ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ను సూపర్ హిట్ చేశారు. కోట ఆ పాత్రను అలవోకగా నమిలేశారు. ఇ.వి.వి.యే కోటను ‘మా నాన్నకు పెళ్లి’ సినిమాలో తాత పాత్రకు ప్రమోట్ చేశారు. ఇక ‘జంబలకిడి పంబ’లో కోటను ఎవరు మరువగలరు? షాట్ మొదలుకావడమే తలకు తుండు ముడి వేసి తులసికోట చుట్టూ తిరుగుతుంటారు.ఇక కోట.. బ్రహ్మానందంల మధ్య సాగే లాంఛనాల డైలాగులు అందరికీ కంఠో పాఠమే. కోట అడిగిన మగపడుచు లాంఛనాలకు బ్రహ్మానందం జవాబు ‘అర్ధ నూట పదహార్లు... రెండు జబ్బల బనీన్లు. ఒక కరీం బీడీ కట్ట’....ఇ.వి.వితో సమాంతరంగా ఎస్.వి. కృష్ణారెడ్డి కూడా కోటకు వరుసగా పాత్రలు ఇస్తూ వెళ్లారు. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’, ‘శుభలగ్నం’, ‘మాయలోడు’... ఇక ‘వినోదం’ సినిమా కోట చుట్టూనే తిరుగుతూ వినోదాన్ని పంచింది.∙∙ ‘హోల్డర్‌లో దూరడం ముఖ్యం కాదు... స్విచ్ వేస్తే వెలగాలి’... అని కోట తరచూ చెప్పేమాట. అవకాశాల కోసం సినిమా ఇండస్ట్రీలో తిరిగేవారు తమలో ఎంత ప్రతిభ ఉందో గుర్తెరిగి ప్రయత్నించాలని అనేవారాయన. రికమండేషన్లు పాత్ర పట్టడానికి పనికి వస్తాయి గాని కెమెరా ముందు రికమండేషన్లు పని చేయవు. స్వయంగా వెలగాల్సిందే. ఆ వంకన చూస్తే మొదలు నుంచి తుది వరకు కోట స్విచ్ వేసిన ప్రతిసారి వెలుగుతూనే ఉన్నారు. ఒకో సందర్భంలో ఒకో పాత్ర... ఒకో మెరుపు. ‘గాయం’ సినిమాలో రేవతి ‘మీరేమంటారు?’ అనడిగితే ‘ఖండిస్తున్నాం’ అంటాడు కోట.చిన్న సీన్. పెద్ద హిట్. ‘మనీ’ సినిమాలో శుభలేఖ ఇస్తే ఇచ్చినవాడి మీద జాలిపడుతూ ‘కార్డ్ ప్రింటెడ్’ అంటూ పలికించిన కామెడీ బ్యాచిలర్ పార్టీలలో నేటికీ వినపడుతూనే ఉంటుంది. ‘సంతోషం’ సినిమాలో హింసరాజుగా ఒకటి రెండు సీన్లు... భలే. ఈ కోటే ‘గణేశ్’ సినిమాలో అత్యంత భయంకరమైన విలనీని ప్రదర్శించారు. కోట విలన్‌గా చేసిన పాత్రల్లో ఇది వేసినంత గట్టి ముద్ర మరొకటి వేయలేదు. ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో ‘ఎన్టీవోడు గద పిసుకుతుండు’ అని బ్రహ్మానందం ్ర పాణం తీస్తాడు పటేల్ పాత్రలో ఉన్న కోట.ఇక వంశీ తీసిన ‘శ్రీ కనక మహాలక్ష్మి డాన్స్‌ట్రూప్’లో హీరోయిన్ని నాటకాలకు పంపమని నిర్మలమ్మను అడిగేందుకు కోట వెళ్లి ‘లవకుశ’ సినిమాలోని పాట పాడటం, నిర్మలమ్మ చీపిరి తిరగేయడం మరో భాషలో మరో నటుడి మీద కుదరని కామెడీ. ఇలా నవ్వించిన కోట ‘లిటిల్ సోల్జర్స్’లో చాలా సీరియస్‌గా ఉండే మేజర్‌గా కనిపించడం, పిల్లలకు ధైర్యం ఇవ్వడం మరువగలమా? ‘ఆ నలుగురు’, ‘ఫ్యామిలీ సర్కస్’, ‘నా ఎదవతనం ముందు నీ ఎదవతనం ఎంత’ అని కొడుకు శ్రీహరిని ఊరడించే తండ్రిగా ‘బావగారూ... బాగున్నారా’, ‘అన్నయ్య’లో సీనియర్ లారీ క్లీనర్‌గా ‘చెబాష్ చెబాష్ చెబాష్’ అనే మేనరిజమ్ కోటను పదే పదే గుర్తు చేసేవే. ‘సడక్’లో సదాశివ్ అద్భుతంగా చేసిన హిజ్రా పాత్రను ‘రెండిళ్ల పూజారి’లో కోట అంతే అద్భుతంగా చేయగలిగారు. కెరీర్ పీక్‌లో ఉండగా అలాంటి పాత్ర చేయడం రిస్క్. దానిని దాటారు కోట.ఈ కోట శ్రీనివాసరావే కొడుకు మీద లోలోన ఎంతో ప్రేమ పెట్టుకుని పైకి కఠినంగా ఉండే తండ్రిగా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’లో ఎంత బాగా నటించారు!∙∙ కోట అసలు సిసలు తెలుగు నటుడు. ఆయన ఇతర భాషల్లో హిట్ అయినా ఆయన ముఖం, మాట, నటన, నడక అన్నీ తెలుగువే. అందుకే ఆయన పరాయి భాష నటుల మీద ఒకోసారి నిరసన చూపినా... లోకల్ టాలెంట్‌కు అవకాశాలు ఇవ్వాలని 2003 ్ర పాంతంలో హైదరాబాద్‌లో నిరాహార దీక్షకు కూచున్నా తెలుగు మమకారమే కారణం. ‘మండలాధీశుడు’ సినిమాలో నటించడం వల్ల చాలా కాలం ఆయన ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే యాక్సిడెంట్లో కుమారుణ్ణిపోగొట్టుకుని పుట్టెడు దుఃఖం మూటగట్టుకున్నారు. వయసు, డయాబెటిస్ ఆయనను ఇంటికే పరిమితం చేశాయిగానీ ఆయన తన మాటను వెలిగిస్తూనే వెళ్లారు.‘శ్రీమతితో, షుగర్‌తో జాగ్రత్తగా ఉండాలి. శ్రీమతిని బాగా చూసుకోకపోతే ఆమె వెళ్లిపోతుంది. షుగర్‌ను బాగా చూసుకోకపోతే మనం వెళ్లిపోతాం’ అని జోక్ చేసేవారాయన.రామ్గో పాల్ వర్మ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి అతి కొద్ది మంది దర్శకులు ఆయనలోని భిన్నమైన నటుణ్ణి వెలికి తీసే పాత్రలు ఇచ్చారు. కోట చాలా గొప్పగా చాలా పాత్రలు చేసినా ఆయనకు చాలెంజ్ విసిరే పాత్రలు ఇంకా దొరకాల్సింది. కోట వంటి ఆల్‌రౌండర్ నటుడు అరుదు. ఆ మేలిమి నటుడికి నివాళి.– కె.‘అహ నా పెళ్ళంట’లో కోట న్యూస్‌పేపర్‌ను లుంగీలా కట్టుకోవడం, కోణ్ణి వేళాడగట్టి అదే చికెన్ కర్రీ అని ఉత్తన్నం తినేయడం, వర్షం రాకపోయినా, గేదె ఎక్కువ పాలివ్వకపోయినా బ్రహ్మానందం జీతంలో కోత విధించడం... బ్రహ్మానందం కోటను చూసి ‘వీడూ వీడి మొహమూనూ’ అని తిట్టుకుంటూ ఉంటే ‘ఆ మొహానికేమి మాకు నచ్చింది’ అని సాకారు ప్రేక్షకులు ముద్దుగా.ప్రముఖుల నివాళికోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకోవడంతో పాటు కోట కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని పలువురు చిత్రరంగ ప్రముఖులు వ్యక్తం చేశారు. ⇒ మా ఇద్దరి నటప్రస్థానం ప్రాణం ఖరీదు’ సినిమాతో ్ర పారంభమైంది. వ్యక్తిగతంగా ఆయన చేసే చమత్కారాలు, చెప్పే జోకులు కానీ... అవి ఉత్సాహపరుస్తాయి. షూటింగ్ ఉందంటే ఇవాళ కోటగారు ఉంటారు... బాగుంటుందనే ఉత్సాహంతో వెళ్లేవాళ్లం. ఆయన చేయలేని క్యారెక్టర్, చేయని క్యారెక్టర్, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చె΄్పాలి. అంతటి పరిపూర్ణమైన నటన. ఆయనలా విలక్షణమైన, వైవిధ్యమైన నటులు మళ్లీ వస్తారని నేను అనుకోవడం లేదు. అలాంటి నటులు దొరకరేమో... ఉండరేమో కూడా. – చిరంజీవి ⇒ ప్రియమైన కోట... మిమ్మల్ని ఇకపై చాలా మిస్ అవుతాము. మీ ప్రతిభ, మీ ఉనికి, మీ మంచి మనసును ఎప్పటికీ మర్చిపోలేము. మాటల్లో చెప్పలేని దుఃఖం కలుగుతోంది. – మంచు మోహన్‌బాబు ⇒ నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలుపోషించిన కోట శ్రీనివాసరావుగారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సం పా దించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవంపోశారు. ఇతర భాషల్లోనూ నటించి, మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎమ్మెల్యేగా ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సం పాదించుకున్నారు. – నందమూరి బాలకృష్ణ⇒ ప్రియమైన కోటగారు... ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. మీ ప్రేమ, ఆ΄్యాయత, మీ చతురత, మీ ప్రతిభ భర్తీ చేయలేనివి. – నాగార్జున ⇒ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే విలక్షణ నటుడు. వ్యక్తిగతంగానూ నాకు నష్టమే. ‘ఇంట్లో ఇల్లాలు... వంటింట్లో ప్రియురాలు, శత్రువు, గణేష్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’... ఇలా ఎన్నో సినిమాలు చేశాం. మా సురేష్ ్ర΄÷డక్షన్స్లోని ప్రతి సినిమాలో కోటగారు చేసేవారు. మా నాన్నగారు డి. రామానాయుడు, నా సోదరుడు సురేష్‌బాబు, రానాలకూ కోటగారితో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. – వెంకటేశ్⇒ ఏ అభి్ర పాయాన్ని అయినా నిర్మొహమాటంగా చెప్పే వ్యక్తి కోటగారు. నా మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నుంచి ‘అత్తారింటికి దారేది’... వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ‘అత్తారింటికి దారేది’ సినిమా సమయంలో మీరు కాస్త ఇబ్బంది పడుతున్నారంటే, కష్టాలను అధిగమించడానికి నటనే నాకు మరుపు అని చెప్పేవారు. ఆ మాట నన్ను చాలా కదిలించింది. ఎంతమంది గొప్ప నటులు ఉన్నా ఆయనది విశిష్టమైన శైలి. కోట శ్రీనివాసరావు – బాబుమోహన్గార్ల కాంబినేషన్‌ని మేం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్లం. – పవన్ కల్యాణ్⇒ కోట శ్రీనివాసరావుగారిని చూస్తూ, ఆరాధిస్తూ, ఆయన్నుంచి నేర్చుకుంటూ పెరిగాను. కోట బాబాయ్ మా ఫ్యామిలీ మెంబర్ లాంటివారు. ఆయనతో నేను కలిసి పని చేసిన క్షణాలు నాకు మంచి జ్ఞాపకాలు. – రవితేజ ⇒ కోట శ్రీనివాసరావుగారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన సినిమాలు చూస్తూ, ఆయన్నుంచి నేర్చుకుంటూ పెరిగిన వారికి కోటగారు దూరం కావడం వ్యక్తిగత నష్టంలా అనిపిస్తుంది. – మహేశ్‌బాబు ⇒ యాక్టింగ్ ఇండస్ట్రీకి, నటనకి నిలువెత్తు రూపం కోట శ్రీనివాసరావుగారు. ఆయన ఒక్కరే. ఇంకో కోటాగారు మళ్లీ పుట్టరు... మళ్లీ రారు. అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే... ఈ రోజు మనకు ఉన్న మాధ్యమాల్లో ఆయన మనకు మిగిల్చి వెళ్లినటువంటి ఎన్నో అద్భుతమైన పాత్రలు, చిత్రాలు ఉన్నాయి. లెట్స్ సెలబ్రేట్ కోటాగారు. అందరికీ నా విజ్ఞప్తి. ఆయన మనల్ని ఎంతగా రంజింప చేశారో ఆ అనుభూతులుంటాయి. ఆయన ఎక్కడున్నా ఆ చల్లని చూపు మనందరిపై ఉండాలని ఆ భగవంతుణ్ణి ్ర పార్థిస్తున్నాను. – ఎన్టీఆర్⇒ కోట శ్రీనివాసరావుగారిలాంటి విలక్షణ నటుడిని సినీ పరిశ్రమ కోల్పోయింది. మన హృదయాల్లో నిలిచిపోయేలా, ఆయనపోషించిన అద్భుతమైన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి – రామ్‌చరణ్⇒ కోట శ్రీనివాసరావుగారి గురించి హృదయ విదారక వార్త విని ఇప్పుడే మేల్కొన్నాను. మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేని బహుముఖ ప్రజ్ఞాశాలి మీరు. మిమ్మల్ని మిస్ అవుతున్నాము కోటగారు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు నా సానుభూతి. – అల్లు అర్జున్⇒ కోట శ్రీనివాసరావుగారు అసమాన ప్రతిభావంతుడు. సీరియస్ రోల్ అయినా, విలన్ రోల్ అయినా, కామెడీ రోల్ అయినా... ఇలాపోషించిన ఏ పాత్రకైనా ్ర పాణంపోశారు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయనతో చాలా సినిమాల్లో కలిసి పని చేసే అదృష్టం నాకు కలిగింది. ఆయన కళ, ఆయన నవ్వు, ఆయనపోషించిన పాత్రలు సజీవంగా ఉంటాయి. – విష్ణు మంచు ⇒ కోట శ్రీనివాసరావుగారు మాకు ఒక యాక్టర్‌గా కన్నా కూడా మా కుటుంబ సభ్యుడు. మా నాన్నగారు సినిమాలు చేస్తున్నప్పటి నుంచి సెట్స్‌లో ఆయన్ను చూశాను. అలాగే నా తొలి సినిమా ‘అల్లరి’లో నా ఫాదర్‌గా చేశారు. మేం ఇద్దరం దాదాపు 40–50 సినిమాల వరకు కలిసి పని చేశాం. – ‘అల్లరి’ నరేశ్ ⇒ సినీపరిశ్రమలో ఉన్న కొద్దిమంది గొప్ప నటుల్లో కోట శ్రీనివాసరావుగారు ఒకరు. ఆయన నటనతో నా సినిమాలు ‘శివ, గాయం, మనీ, సర్కార్, రక్తచరిత్ర’లు మరింత ప్రభావితం అయ్యాయి. కోట శ్రీనివాసరావుగారూ... మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయి ఉండొచ్చు... కానీ మీ పాత్రలు జీవించే ఉంటాయి – రామ్గో పాల్ వర్మ⇒ కోట శ్రీనివాసరావుగారి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. నటనలో నిష్ణాతుడు.పోషించిన ప్రతి పాత్రకు ్ర పాణంపోసిన లెజెండ్. వెండితెరపై ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. – ఎస్ఎస్ రాజమౌళి⇒ ఓ చరిత్ర ముగిసిపోయింది. అంత గొప్ప నటుడిని కెమెరా వెనకాల నుంచి చూసే అదృష్టం చాలాసార్లు కలిగింది నాకు. ఆయనతో పని చేసే అవకాశం దొరికింది. వ్యక్తిగతంగానూ ఆయనతో మంచి అనుబంధం ఉంది. షూటింగ్ లేని సమయాల్లో కూడా ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని. – త్రివిక్రమ్⇒ కోటన్న, నేను సినిమాల్లోనే కాదు... విడిగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా సినిమాల్లో ఎలా ఉండేవో అలాగే సెటైర్స్ ఉండేవి. మొన్న ఫోన్ చేస్తే... ‘ఎక్కడున్నావ్ రా... ఎప్పుడొస్తావ్ రా’ అంటే.. ‘రేపు వస్తా’నని అన్నాను. బాగా మాట్లాడాడు. ‘హా.. చాల్లేవోయ్’... ఇలా మా తరహా మాటల్లోనే మాట్లాడారు. ‘షాట్ సిద్ధమైంది అన్నా... మరలా చేస్తా’నని చెప్పి, మళ్లీ ఫోన్ చేస్తే, పడుకున్నారు. ఇంటికి వెళితే సంతోషపడేవాడు. ‘రారా.. చాలా బోర్ కొడుతోంది’ అనేవారు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోజనం చేశాం. మాటలకందని సందర్భాలు ఎన్నో ఉన్నాయి మా ఇద్దరి మధ్య. – బాబూమోహన్⇒ కోట శ్రీనివాసరావుగారు, నేను కలిసి కొన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేశాం. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్... ప్రతి సినిమాలో ఉండేవాళ్లం. నాలుగు దశాబ్దాలుగా ‘అరే... ఒరేయ్...’ (భావోద్వేగానికి లోనవుతూ..) అనుకుంటూ కలిసి ఉన్నాం. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడు ఒక నట రాజపుత్రుడు. ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి. – బ్రహ్మానందం⇒ ‘రాజేంద్రుడు–గజేంద్రుడు, మాయలోడు. అహ నా పెళ్ళంట’... ఇలా చెప్పుకుంటూపోతే నా జీవితంలోని సూపర్‌హిట్ సినిమాలన్నింటిలోనూ కోట మామ ఉన్నారు. వారం క్రితం ఫోన్ చేసి, ‘ఏంటి మామ... ఆరోగ్యం ఎలా ఉందన్నాను’, ‘అబ్బాయ్... నువ్వు ఇంటికి రా’ అన్నారు. తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావుగారు. చాలా భాషల్లో నటుడిగాను మెప్పించారు. కోట మామగారూ... మీరు ఎక్కడ ఉన్నా మీ విలక్షణమైన శైలిలో అందర్నీ నవ్విస్తూ ఉండాలి.– రాజేంద్రప్రసాద్⇒ తెలుగు నటీనటులు, తెలుగు ప్రతిభావంతులకు పెద్ద ఎత్తున చాన్స్ దొరకడం లేదనే బాధ కోటగారిలో ఉండేది. ఆయన ఆవేదన నిజమైనదని నాకు అనిపించింది. ఒకసారి ఎవరో అడిగారు... ప్రకాశ్‌రాజ్ పరభాష నటుడే కదా? అని. ‘ఆయన తెలుగు నేర్చుకున్నారు కదా. మనోడు అయిపోయాడు’ అన్నారు. మన భాషను తప్పుగా పలుకుతారు. మన అవకాశాలను ఎవరో తీసుకెళ్లిపోతారనేది ఆయనకు ఉండేది. ఇటీవల కోటగారు గుర్తొచ్చి... ఆయన ఎక్కడంటే, ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలు చేయడం లేదన్నారు. ఫోన్ చేసి, ్ర΄÷డక్షన్ వారి నుంచి కారు పంపిస్తే ఆయన వచ్చారు... సరదాగా మాట్లాడుకున్నాం. – ప్రకాశ్‌రాజ్⇒ కోట శ్రీనివాసరావుగారితో కలిసి కొన్ని సినిమాలు చేయడం నా అదృష్టం. ఆయన అచీవ్ చేయనిది లేదు... చూడనది లేదు. తెలుగువారందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన. నటన గురించే 24 గంటలూ ఆలోచించే మహానటుడు ఆయన. – రావు రమేశ్⇒ ఆ తరంలో ఎస్వీ రంగారావుగారు, ఆ తర్వాత కైకాల సత్యనారాయణ రావుగారు, ఆ తర్వాత కోట శ్రీనివాసరావుగారు. కోట బాబాయ్–నేను 200 సినిమాలకు పైనే కలిసి నటించాం. తెలుగు నటులంటే ఆయనకు చాలా ఇష్టం. బాబాయ్ అని మా సొంతవారిని ఎన్నిసార్లు పిలిచామో తెలియదు కానీ.. కోట బాబాయ్ అని కొన్ని లక్షలసార్లు పిలిచి ఉంటాము. – అలీ -
తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచిన కోటా శ్రీనివాసరావు
-
వెండితెరపై విలక్షణ నటుడు.. కోటా శ్రీనివాసరావు అరుదైన ఫోటోలు
-
గత కొన్ని రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు
-
ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత
-
‘వత్సల’ ఇక లేదు : కన్నీటి సంద్రంలో వన్య ప్రేమికులు, సీఎం సంతాపం
ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు వత్సల ఇకలేదు. 100 సంవత్సరాలకు జీవించిన ఆడ ఏనుడు వత్సల. పన్నా టైగర్ రిజర్వ్ మదర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వత్సల హినౌటా ఎలిఫెంట్ క్యాంప్ సమీపంలో బుధవారం తుది శ్వాస విడిచింది. అటవీ కాలువ దగ్గర పడిపోయిన వత్సలను గమనించిన అటవీ సిబ్బంది, పశువైద్యులు తక్షణమే వైద్య సాయం అందించినప్పటికీ ఏనుగు ఫలితం లేకపోయింది. వయోభారంతో ఇప్పటికే బాధపడుతున్న వత్సల కన్నమూసిందని అధికారులు ప్రకటించారు. దీంతో మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు. వత్సల చనిపోలేదు - అది అడవితో ఐక్యమైంది అంటూ పలువురు వన్య ప్రేమికులు, అటవీశాఖ అధికారులు దానికి నివాళులర్పించారు. వత్సల మరణం ఒక జంతువును కోల్పోవడం కంటే ఎక్కువ. ఇది ఒక శతాబ్దం పాటు కాపలాగా ఉన్న చెట్టు కూలిపోవడం లాంటిదని సంతాపం తెలిపారు.వత్సల మరణం గురించి వార్త తెలియగానే పన్నా టైగర్ రిజర్వ్ సిబ్బంది, సమీప గ్రామాల స్థానికులు, దేశవ్యాప్తంగా ఉన్న వన్యప్రాణుల ఔత్సాహికులు దుఃఖం వ్యక్తం చేశారు. శోకతప్త హృదయంలో వత్సల మృతదేహాన్ని హినౌటాలో దహనం చేశారు. ఒకప్పుడు రాణిలా తిరుగాడిన ప్రదేశంలో ఇప్పుడిక దాని జ్ఞాపకాలే మిగిలాయి. సోషల్ మీడియాలో RIP Vatsala హ్యాష్ట్యాగ్వైరల్గా మారింది. ఇదీ చదవండి : Today Tip : మూడు నెలల్లో బాన పొట్ట కరిగిపోవాలంటే..! కేరళ- మధ్యప్రదేశ్కేరళలోని నిలంబూర్ ఫారెస్ట్ డివిజన్లోని కేరళలోని దట్టమైన నీలాంబూర్ అడవిలో జన్మించిన వత్సల తొలుత అటవీ ఉత్పత్తులను రవాణా చేస్తూ, దుంగల కంటే చాలా బరువైన భారాన్ని మోస్తూ గడిపింది. 50 ఏళ్లు నిండిన వయసులో 1972లో మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. ఆ తర్వాత 1993లో బోరి నుంచి పన్నా టైగర్ రిజర్వ్‌కు తరలించారు. అలా అప్పటి నుంచి పన్నా అభయారణ్యమే వత్సలకు నిలయంగా మారింది.Bidding a heartfelt farewell to #Vatsala, the world’s oldest known Asiatic elephant at 109 years, who passed away in Madhya Pradesh’s Panna Tiger Reserve. A gentle matriarch, Vatsala was a beloved guardian of her herd and was the soul of the reserve. She will be missed. pic.twitter.com/IrjZA32zIT— Parimal Nathwani (@mpparimal) July 9, 2025 ‘‘వత్సల మాకు గర్వకారణం" అని ఫీల్డ్ డైరెక్టర్ అంజనా సుచిత టిర్కీ చెప్పారు. "మందను గౌరవంగా నడిపించింది. ప్రసవాల సమయంలో, అనుభవజ్ఞురాలైన మంత్రసానిలా దగ్గరుండి సాయం చేసింది. బలాన్ని, ప్రశాంతతను ఇచ్చింది. వత్సల పెద్దది మాత్రమే కాదు - ఆమె మా ఏనుగు కుటుంబానికి ఆత్మ." పెద్ద ఆడ ఏనుగుగా,సహజంగా మందను నడిపించింది, పిల్ల ఏనుగులను పోషించింది అన్నారు.ఇదీ చదవండి: ‘హ్యాపీగా.. జాలీగా ఎంజాయ్ చేయరా’ : పిల్ల గుంపు వీడియో వైరల్ వత్సల మృతిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “వత్సల రాష్ట్ర ప్రజలకు ఒక భావోద్వేగంగా మారింది. పలు తరాలకు స్నేహితురాలిగా, పిల్ల ఏనుగులకు అమ్మమ్మగా అభయారణ్యంలో ఎంతో ప్రేమగా మెలిగింది” అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. వత్సల మరణం పన్నా టైగర్ రిజర్వ్‌కి తీరని లోటనిప్రముఖ పర్యావరణవేత్త రాజేష్ దీక్షిత్ సంతాపం తెలిపారు.2003 -2008లో, రామ్ బహదూర్ అనే మగ ఏనుగు చేసిన రెండు హింసాత్మక దాడుల నుండి వత్సల సురక్షితంగా బయటపడింది. ప్రేగులను చీల్చి,లోతైన గాయా లైన రెండు సందర్భాల్లో, ఆమె వీపును కుట్టినది వన్యప్రాణి పశువైద్యుడు డాక్టర్ సంజీవ్ కుమార్ గుప్తా - 2003లో 200 కుట్లు, తొమ్మిది నెలల చికిత్సచేశారు. అయినా వత్సల ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. 2020లో, వత్సల కంటిశుక్లం కారణంగా పూర్తిగా అంధురాలైంది. అయినప్పటికీ, ఆమె అటవీ బాటలలో నడవడం కొనసాగించింది. జీర్ణ సమస్యలు, పూర్తి అంధత్వంతో కారణంగా దానికి వైద్యులు గంజి తినిపించేవారు. 1972లో కేరళలో ఆమెను బంధించిన సమయంలో కనిపించని పత్రాల కారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం ఆమె ఖచ్చితమైన వయస్సు అధికారికంగా నిర్ధారించబడలేదు, అయినప్పటికీ, ఆమె పక్కన నడిచిన వారికి, గిన్నిస్ ఎప్పుడూ ముఖ్యమైనది కాదు. ఆమె గడిపిన జీవితం - మరియు ఆమె తాకిన జీవితాలు ముఖ్యమైనవి.1972లో కేరళలో ఆమెను బంధించిన సమయంలో కనిపించని పత్రాల కారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం చూసినప్పటికీ, వయస్సు అధికారికంగా నిర్ధారణ లేని కారణంగా అది మిస్ అయింది. అయితేనేం.. వత్సలకు గిన్నిస్ ఎప్పుడూ ముఖ్యమైనది కాదు. గడిపిన జీవితం చాలా ముఖ్యమైంది అంటూ కొనియాడారు అటవీ అధికారులు. -
ఆయన చిరంజీవి
అతను ఇంద్రజాలం చేశాడు. మాటలతో మనసుకు వైద్యం చేశాడు. యువతకు వ్యక్తిత్వ వికాసం తెలియజేశాడు. కళ్ళకు గంతలు కట్టుకుని స్కూటర్ నడిపి సంచలనం సృష్టించాడు. బి.వి. పట్టాభిరామ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సోమవారం రాత్రి కన్నుమూసిన ఆయన స్మృతికి నివాళిగా ఈ కథనం.ఇంత హఠాత్తుగా పట్టాభిరామ్ వెళ్లిపో వటం నాకింకా నమ్మబుద్ధి కావటం లేదు. నాకన్నా వయస్సులో ఒక ఏడాది చిన్న. అయితే అతని ఆలోచనలు చాలా పెద్దవి. ఎంతో బోళామనిషి. మనసులో ఏదీ దాచుకునేవాడు కాదు. దాచుకోవాలని ప్రయత్నించినా తెలిసిపోయేది. నవ్వు వస్తే హాయిగా నవ్వేసేవాడు. కోపం వచ్చినా అంతే. ఏదొచ్చినా పట్టలేం.అది ఒక విలక్షణమైన, విశిష్ఠమైన మనస్తత్వం. ఇద్దరం సమవయస్కులం కావటం వల్ల చాలా తరచుగా కలుసుకోవటం, సాయంత్రాలు సరదాగా కాలక్షేపం చేయటం, మనసు విప్పి మాట్లాడుకోవటం... తరచుగా జరుగుతుండేది. ఓ శ్రేయోభిలాషి ఎలా ఉంటాడంటే పట్టాభిరామ్ లాగా ఉంటాడని చెప్పవచ్చు. ఒకసారి ఇద్దరం కర్నూల్లో పుల్లారెడ్డి కాలేజీలో ఒక కార్యక్రమానికి వెళ్లాం. అక్కడ ప్లే గ్రౌండ్ లో ఒక పక్కన నిలబడి సిగరెట్ కాల్చుకుంటున్నాను. పట్టాభిరామ్ గబగబా నా దగ్గరకు వచ్చి చెవిలో మెల్లగా చెప్పాడు: ‘‘ఇక్కడ సిగరెట్ తాగొద్దు. దాన్ని వెంటనే దాచేసేయ్.’’నేను ఆశ్చర్యపోతూ ఆడిగాను:‘‘మనిషి మనిషి గా బతకాలని చెబుతున్నాం కదా. నా కిష్టమైంది నేను చేస్తే తప్పేంటి?’’ పట్టాభిరామ్ ఇంకాస్త దగ్గరకు వచ్చి అనునయంగా చెప్పాడు:‘‘గ్రౌండ్లో స్టూడెంట్స్ చూస్తున్నారు. తమకి ఎలాంటి అలవాట్లు ఉండొచ్చో, ఉండకూడదో బోధిస్తూ మార్గదర్శనం చేసే మార్గదర్శి ఇలా ధూమపానం చేస్తున్నాడేంటి – అనుకోరా?’’ నేను వెంటనే సిగరెట్ పడేశాను. పట్టాభిరామ్‌లో నాకొక నిజమైన శ్రేయోభిలాషి కనిపించాడు.మేం ముప్ఫయేళ్ల వయసులో ఉండగా పట్టాభిరామ్ తరచుగా ఏవో గమ్మత్తైన మేజిక్‌లు చేస్తుండేవాడు. నలుగురం చేరితే చాలు. అలాంటి సందర్భాలు ఏ కాలేజి ఆవరణలోనో, కార్యాలయం ఆవరణలోనో జరిగితే అమ్మాయిలందరూ గబ గబా చేరిపోయేవారు. మిత్రులం ఈర‡్ష్య పడేవాళ్లం. నేను పట్టాభిరామ్‌తో సన్నిహితంగా మెలిగేకొద్దీ నాకొక విషయం అర్థమవుతూ వచ్చింది. పట్టాభిరామ్‌లో తాను ఎక్కడ ఉన్నా ప్రస్ఫుటంగా, ప్రముఖంగా తన ఉనికిని కాపాడుకుంటూ ఉంటాడు. తన రంగంలో తాను నంబర్ వన్ గా ఉండాలి అనే పట్టుదల ఉండేది. ఎలాంటి పట్టుదల! సైకాలజీలో ఎం.ఏ. చేశాడు.రెండు దశాబ్దాల వ్యవధి లో రెండు పిహెచ్.డి లు చేశాడు. తను ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మేజిక్‌లు చేస్తూ నలుగురినీ ఆకట్టుకుంటూ ఉండేవాడు. క్రమంగా మేజిక్లకు ఆకర్షణ తగ్గుతుందనుకున్నప్పుడు హి΄్నాటిజంలో ప్రవేశించాడు. హిప్నటిజం అప్పట్లో యువతను విపరీతంగా ఆకర్షించింది. చాలామంది అతని దగ్గర హి΄్నాటిజం నేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతుండేవాళ్లు. అలా హి΄్నాటిజంతో బాగా ప్రచారంలోకి వచ్చాడు పట్టాభిరామ్.హి΄్నాటిజంకి కూడా ఆకర్షణ తగ్గుతుందేమో అనిపించిన సమయంలో క్రమంగా వ్యక్తిత్వ వికాసం వైపు అడుగులు వేశాడు. అడుగులు వేశాడు అనే కన్నా దానిలోతులు అధ్యయనం చేస్తూ, విద్యార్థులనుంచీ వృద్ధ దంపతుల దాకా అన్ని వయసుల వారికీ సలహాలిచ్చే మార్గదర్శిగా ఎదిగాడు. ఈ రంగంలో అడుగుపెట్టాక అతనిక వెనుతిరిగి చూడలేదు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సలహాలిచ్చినా, క్లాసులు చెప్పినా అందులో సందర్భానుసారంగా తన ఇంద్రజాల చమత్కారాలను చొప్పించేవాడు. అవి తన దగ్గరకు కౌన్సెలింగ్ కోసం వచ్చినవాళ్లని మరింతగా ఆకట్టుకునేవి. అధికారులు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, విద్యార్థులు, కొత్తగా పెళ్ళయినవాళ్లు, పెళ్లి చేసుకోబోయే వాళ్లు, లాయర్లు సహా పట్టాభిరామ్ కౌన్సెలింగ్ కోసం తహతహలాడేవాళ్లు.ఎంత ఎదిగినా నా లాంటి మిత్రులతో గడిపేటప్పుడు ఎంతో నిష్కల్మషంగా, నిరాడంబరంగా మెసలేవాడు. కల్మషం లేని మనసు. అతనిలో ఒక ఔన్నత్యం ఎలాంటిదంటే... 1980 దశకంలో హైదరాబాద్ రవీంద్రభారతి లో పట్టాభిరామ్ ఒక ఇంద్రజాల ప్రదర్శన చేస్తున్నాడు. అందులో ఒక మంచి ఇంద్రజాల ట్రిక్ విఫలమైంది. స్టేజిమీద ఏదో మేనేజ్ చేశాడు కానీ, ఆ ప్రయోగం విఫలమయిందని నాకర్థమయింది. నేను ప్రదర్శన అయ్యాక వెళ్లి కలిశాను. అతనిలో నిర్వేదం గమనించి అడిగాను: ‘‘ఏమైంది?’’‘ఆ ప్రయోగం విఫలమవుతుందని ఊహించలేకపోయాను. అదే మనసులో వెంటాడుతోంది...’’ నేను వెంటనే పట్టాభిరామ్ భుజం మీద ప్రేమగా తట్టాను. ‘ఈ ప్రయోగం ఎన్నోసారి చేయటం?’’ ‘‘మొదటిసారి.’’ ‘‘అంతేనా, అయితే దీనికి అసలు విచారించనక్కరలేదు మనం. మొదటిసారి చేసినప్పుడు ఎందుకు విఫలమయ్యామో నీకు తెలిసింది. మరెప్పుడూ ఇది జరగనివ్వవు. జీవితంలో ఇలాంటివి మనం ఎన్ని చూడలేదు?... ఆలోచించు...’’ నేనిలా చెబుతుంటే పట్టాభిరామ్ సాలోచనగా తలూపుతున్నాడు. కొద్ది క్షణాలు నిశ్శబ్దం. వెంటనే తేరుకొన్నాడు. ఒక నవ్వు నవ్వేశాడు. నేనూ నవ్వాను. ఇద్దరం హాయిగా నవ్వుకున్నాం. నాకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాడు. ఎలాంటి అహంభావానికీ లోనుకాకుండా ఆత్మావలోకనం చేసుకునే, మిత్రుల సలహాలను అర్థం చేసుకునే ఔన్నత్యం అది. పట్టాభిరామ్! నా జ్ఞాపకాల్లో నువ్వు చిరంజీవివి. – యండమూరి వీరేంద్రనాథ్శ్రీలక్ష్మి సంగీతం పిచ్చి పట్టాభిరామ్ కౌన్సెలింగ్సినీ దర్శకులు జంధ్యాల, మల్లాది వెంకట కృష్ణమూర్తి, బి.వి.పట్టాభిరామ్... వీరంతా మంచి మిత్రులు. మల్లాది రాసిన ‘రెండు రెళ్లు ఆరు’ నవలను సినిమాగా తీస్తున్నప్పుడు అందులో హి΄్నాటిస్ట్ పాత్రను పట్టాభిరామ్ చేత చేయించారు జంధ్యాల. కథానుసారం సుత్తి వీరభద్రరావు భార్య అయిన శ్రీలక్ష్మికి సంగీతం పిచ్చి. కాని ఆమెకు సంగీతం రాదు. భర్తకు శాస్త్రీయ సంగీతం అంటేప్రాణం అని తెలుసుకుని అతణ్ణి ఇంప్రెస్ చేయడానికి సంగీతం నేర్చుకునేందుకు హార్మోనియం పెట్టె పనిపడుతుంటుంది– వంట కూడా మానేసి.దాంతో సుత్తి వీరభద్రరావు వంట చేస్తుంటాడు... ఆ ఏరియా యాచకుడు అతని భోజనాన్ని మెచ్చి ఆ విషయాన్ని ఊరంతా ప్రమోట్ చేస్తుంటాడు. గ్రైండర్ కంపెనీ వాళ్లు వీరభద్రరావును తమ కంపెనీ మోడల్‌గా ఉండమని ఫోను చేస్తుంటారు. ఆ బాధలన్నీ పడలేని సుత్తి వీరభద్రరావు శ్రీలక్ష్మిని పట్టాభిరామ్ దగ్గరకు తీసుకెళ్లి హి΄్నాటిజమ్ ద్వారా సజెషన్స్ ఇప్పిస్తాడు. ‘మీకు సంగీతం ఇష్టం లేదు... సంగీతం ఇష్టం లేదు.. సంగీతం ఇష్టం లేదు’... అనేసరికి శ్రీలక్ష్మికి సంగీతం పిచ్చిపోతుంది. అయితే సుత్తి వీరభద్రరావు పట్టాభిరామ్‌కు ఇవ్వాల్సిన ఫీజు ఎగ్గొడతాడు. ఆ ఫీజు కోసం పదే పదే తిరిగిన పట్టాభిరామ్ క్లయిమాక్స్ సమయానికి మళ్లీ శ్రీలక్ష్మిని సంగీతం శ్రీలక్ష్మిగా మార్చడంతో ప్రేక్షకులు నవ్వుకుంటూ ఇంటి దారి పడతారు. ఈ సినిమాకు, ఈ సన్నివేశాలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. -
బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ (75) కన్నుమూశారు. హైదరాబాద్‌లో నిన్న (సోమవారం) రాత్రి ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రచయితగా, ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగానూ ఆయన పేరు ప్రఖ్యాతలు పొందారు. ఖైరతాబాద్ నివాసంలో పట్టాభిరామ్ పార్థివదేహాన్ని ఉంచారు. రేపు (బుధవారం) ఉదయం నుంచి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఆయన తెలుగుతో పాటు ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో కూడా రచనలు చేశారు. ఆయన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహింంచడంతో పాటు, తల్లిదండ్రుల అవగాహనా సదస్సులు కూడా నిర్వహించారు.బీవీ పట్టాభిరామ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ పట్టా పొందిన తరువాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లలో స్నాతకోత్తర పట్టా అందుకున్నారు. ఇండియాలోనే కాకుండా.. అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, అరబ్ దేశాలలో అనేక వర్క్ షాపులు నిర్వహించారు. -
బాలీవుడ్ నటి షెఫాలి జరీవాలా కన్నుమూత
-
నా తల్లి అల్లా దగ్గరకు వెళ్లిపోయింది.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ నటి, ‘బిగ్‌బాస్’ ఫేం సనాఖాన్( Sana Khan) ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి మంగళవారం మృతి చెందారు. ఈ విషయాన్ని సనాఖాన్ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో తెలియజేస్తూ..ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘నా తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ..ఇప్పుడు అల్లా వద్దకు చేరుకున్నారు’ అంటూ సనా భావోద్వేగానికి లోనయ్యారు.తన తల్లి ఆత్మకు శాంతి కలగాలని, అందరూ ప్రార్థనలు చేయాలని ఆమె కోరారు. తల్లి మరణంతో తీవవ్ర దుఖంలో మునిగిన సనాను పలువురు సినీ ప్రముఖులు ఓదార్చారు. అభిమానులు, సినీ ప్రముఖులు సనాకు సంతాపం తెలుపుతూ సందేశాలు పంపుతున్నారు.సనా ఖాన్ సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ నటించిన 'జై హో' చిత్రం, వెబ్ సిరీస్ 'స్పెషల్ ఆప్స్' వంటి ప్రాజెక్ట్‌లతో పాటు హింది బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. జర్నీ బాంబే టు గోవా మూవీలోనూ ఐటం సాంగ్ చేసింది. గోల్ సినిమాలో ఆమె చేసిన బిల్లో రాణి సెన్సేషన్ హిట్టయింది. ఈ సాంగ్‌తోనే విశేషమైన గుర్తింపు తెచ్చుకుంది. సిలంబట్టం (తమిళ) చిత్రంతో హీరోయిన్గా మారింది. కల్యాణ్ రామ్ కత్తి(2010) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో గగనం, మిస్టర్ నూకయ్య మూవీస్ చేసింది. మలయాళ, కన్నడ భాషల్లోనూ పలు సినిమలు చేసింది. 2020లో ముస్లిం మత గురువు ముఫ్తీ అనాస్ సయ్యద్‌ని వివాహం చేసుకుంది. ఈ జంటకు 2023లో బాబు పుట్టాడు. పెళ్లి తర్వాత సనా సినిమాలకు దూరంగా ఉంటుంది. -
హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం
విశాఖపట్నం(కంచరపాలెం): టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన నానమ్మ, జ్ఞానాపురం సిరిల్ వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయిని శ్రీపాదం ఆగ్నేసమ్మ(88) సోమవారం అర్ధరాత్రి కన్నుమూశారు. మంగళవారం సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చి సెమెట్రీలో ఆమె భూస్థాపన నిర్వహించారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయినిగా పనిచేసిన ఆగ్నేసమ్మ.. వృత్తిలో ఉన్న సమయంలో ఎంతోమంది పేద పిల్లలను చదివించి, వారి అవసరాలు తీర్చి అండగా నిలిచారు. ఆగ్నేసమ్మ పెద్ద కుమారుడు రవి తనయుడు, ప్రముఖ హీరో సందీప్ కిషన్ మద్రాసులో స్థిరపడినప్పటికీ, జ్ఞానాపురంలో తమ బంధువులతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. తనకు ఎంతో ఇష్టమైన నానమ్మ(ఆగ్నేసమ్మ) మరణవార్త విని చలించిపోయిన సందీప్ కిషన్..తన మేనమామ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు, కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఇక్కడకు చేరుకున్నారు. ఆగ్నేసమ్మ భూ స్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆమెకు నివాళులర్పించారు. సెయింట్ పీటర్స్ చర్చి పరిసరాల్లో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. -
దిగ్విజయాల నుంచి దిగంతాలకు
న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సాధారణ ప్రయాణికులతోపాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ సైతం ప్రాణాలు కోల్పోయిన వార్త తెలిసి గుజరాత్ ప్రజలు హుతాశులయ్యారు. పలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేసి ప్రజారంజకంగా పాలించిన విజయ్ రూపానీ లేరన్న వార్త గుజరాత్ వాసులను కలిచివేసింది. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్పై మక్కువ ప్రస్తుతం మయన్మార్‌గా పిలుచుకుంటున్న నాటి బర్మాలోని యాంగూర్ నగరంలో 1956 ఆగస్ట్ రెండో తేదీన విజయ్ కుమార్ రూపానీ జన్మించారు. నాటి బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా రూపానీ తల్లిదండ్రులు మాయబెన్, రామ్నిక్లాల్ రూపానీలు 1960లో గుజరాత్‌కు వలసవచ్చింది. చిన్నప్పటి నుంచే హిందూత్వంపై మక్కువతో టీనేజీలో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ ‘శాఖ’లో చేరారు. ఇందులోభాగంగా తొలుత ఏబీవీపీలో విద్యార్థి కార్యకర్తగా చేరారు. 1971లో జనసంఘ్‌లో చేరారు. భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం నాటి నుంచి పార్టీకు పూర్తిగా అంకితమయ్యారు. 1976లో ఎమర్జెన్సీ కాలంలో భుజ్, భావనగర్ జైళ్లలో 11 నెలలపాటు కారాగార శిక్ష అనుభవించారు. 1978 నుంచి 1981 వరకు ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గానూ పనిచేశారు. 1987లో రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పోరేటర్‌గా గెలిచారు. 1996 నుంచి 1997 దాకా రాజ్‌కోట్ మేయర్‌గా సేవలందించారు. 1998లో బీజేపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కేశూభాయ్‌పటేల్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మేనిఫెస్టో కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. 2006లో గుజరాత్ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా సేవలందించారు. 2006 నుంచి 2012 ఏడాదిదాకా గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. బీజేపీ గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాలుగు పర్యాయాలు పనిచేసిన రికార్డ్ ఈయన సొంతం. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో రాష్ట్ర మున్సిపల్ ఫైనాన్స్ బోర్డ్‌కు రూపానీ ఛైర్మన్ సేవలందించారు. 2014లో విజుభాయ్ వాలా రాజ్‌కోట్ పశి్చమ శాసనసభ నియోజకవర్గానికి రాజీనామాచేయడంతో అక్కడ ఉపఎన్నిక చేపట్టారు. బీజేపీ మద్దతుతో ఆనాడు రూపానీ భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014 నవంబర్‌లో నాటి మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్ తొలిసారిగా కేబినెట్‌ను విస్తరించినప్పుడు మొట్టమొదటిసారిగా రూపానీని మంత్రిపదవి వరించింది. రవాణా, నీటి పారుదల, ఉపాధి కారి్మక శాఖల మంత్రిగా పనిచేశారు. 2016 ఫిబ్రవరిలో గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా రూపానీ ఎన్నికయ్యారు. 2021లో భారత్‌లో అత్యంత ప్రభావశీలురైన తొలి 100 మంది వ్యక్తుల జాబితాలో రూపానీ స్థానం సంపాదించుకున్నారు.ముఖ్యమంత్రిగా.. 2017లో గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అప్పటిదాకా సీఎంగా కొనసాగిన ఆనందిబెన్ పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో పార్టీకోసం దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న రూపానీకి సీఎం పదవి కట్టబెట్టాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. రాజ్‌కోట్ వెస్ట్‌లో కాంగ్రెస్ నేత ఇంద్రాణిరాజ్యగురును మట్టికరిపించి ఎమ్మెల్యేగా గెలిచిన రూపానీని పార్టీ శాసనసభాపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించింది. ప్రజల సమస్యలను వీలైనంత ఎక్కువగా పరిష్కరించేందుకు కృషిచేసి సమర్థవంతమైన సీఎంగా పేరుతెచ్చుకున్నారు.లక్కీనంబర్ 1206 నాడే...1206. ఇది తన లక్కీ నంబర్ అని విజయ్ రూపానీ బాగా నమ్ముతారు. అందుకే తొలినాళ్లలో వాడిన మోటార్‌సైకిళ్ల నుంచి ఆయన కార్ల దాకా అన్నింటికీ ఇదే నంబర్ ఉంటుంది. చివరికి విమాన ప్రమాదంలో రూపానీ దుర్మరణం పాలైన తేదీ కూడా 12.06 (జూన్ 12) కావడం విధి వైచిత్రేనంటూ ఆయన అభిమానులు వాపోతున్నారు. -
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత
తెలుగులో పలు సినిమాలు తీసిన దర్శకుడు ఏఎస్ రవికుమార్ మృతి చెందారు. గతరాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గతేడాది చివరగా రాజ్ తరుణ్‌తో 'తిరగబడరా సామీ' అనే మూవీ చేశారు. ఇప్పుడు ఇలా అకాల మరణం చెందడంతో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్తతో తెలుగు చిత్రసీమలో విషాదం నెలకొంది.గోపీచంద్ హీరోగా నటించిన 'యజ్ఞం' సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఏఎస్ రవికుమార్ చౌదరి.. బాలకృష్ణతో 'వీరభద్ర', సాయి ధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం'తో పాటు ఆటాడిస్తా, ఏం పిల్లో ఏం పిల్లడో తదితర చిత్రాలు తీశారు. అయితే 'తిరగబడరా సామీ' పరాజయం పాలవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈయన మృతి పట్ల తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ సంతాపం తెలియజేశారు. -
హీరో మోహన్ లాల్ ఇంట్లో విషాదం.. ఆయన ఇక లేరు
స్వతహాగా మలయాళీ అయినప్పటికీ హీరో మోహన్ లాల్.. తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ టైంలో 'ఎల్ 2: ఎంపురాన్', 'తుడరుమ్' చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించాడు. ప్రస్తుతం ఈయన నటించిన తెలుగు మూవీ 'కన్నప్ప' రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అలాంటి ఈయన ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడు.. ఎవరో తెలుసా?)మోహన్ లాల్‌కి మేనమామ గోపీనాథన్ నాయర్(93) ఉన్నారు. గతంలో అలప్పుజా కో ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసిన ఈయన.. వయసు మీద పడటంతో గత 14 ఏళ్ల నుంచి మాత్రం అమృతపురిలోని మాత అమృతానందమయి వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. తాజాగా అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే మోహన్ లాల్ కుటుంబ సభ్యులు ఈయనకు సంతాపం తెలియజేస్తున్నారు.మోహన్ లాల్ అసలు పేరు రోషన్ లాల్. కానీ మేనమామ అయిన గోపీనాథన్.. ఈ పేరుని కాస్త మార్పు చేసి మోహన్ లాల్ అని పెట్టారు. తర్వాత తర్వాత హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. మోహన్ లాల్ మామతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు అంత్యక్రియలు కూడా మోహన్ లాల్ కుటుంబ సభ్యులు దగ్గరుండి చూసుకోనున్నారు.(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్) -
జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపినాథ్ కన్నుమూత
-
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. బస్సు ఎక్కుతూ దర్శకుడు కన్నుమూత
కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ కన్నుమూశారు. మధయనాయక్ కూట్టం, రావణ కొట్టం చిత్రాలకు ప్రసిద్ధి చెందిన విక్రమ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తమిళ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. మధురైలో బస్సు ఎక్కుతుండగా ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడంతో మరణించారు.శంతను భాగ్యరాజ్, ప్రభు, కతీర్తో సహా అనేక మంది ప్రముఖ నటులతో కలిసి విక్రమ్ సుగుమారన్ పనిచేశారు. డైరెక్టర్ మరణం పట్ల నటుడు శాంతను భాగ్యరాజ్ సంతాపం వ్యక్తం చేశారు. మీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. సోదరుడిలా భావించే నీ నుంచి తాను ఎంత నేర్చుకున్నాననని అన్నారు. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచకుంటానని పోస్ట్ చేశారు. చాలా త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయావ్.. మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉందంటూ ట్వీట్ చేశారు. దర్శకుడు మరణవార్త తెలుసుకున్న అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.కాగా.. విక్రమ్ సుకుమారన్ 2013లో మధయనాయక్ కూట్టం చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రంలో కథిర్, అంజు జంటగా నటించారు. అంతకుముందు విక్రమ్.. బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. పొల్లాధవన్, కోడివీరన్ వంటి చిత్రాల్లో కూడా నటించారు. 2023లో వచ్చిన 'రావణ కొట్టం'తో సూపర్ హిట్ కొట్టారు. ఆడుకాలం మూవీకి మాటల రచయితగా కూడా పనిచేశారు. ఆయన చివరిసారిగా 'థెరం బోరం' చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదని సమాచారం. #Rip dearest brother @VikramSugumara3 I’ve learnt so much from you & will always cherish every moment Gone too soonYou will be missed #RIPVikramSugumaran pic.twitter.com/U78l3olCWI— Shanthnu (@imKBRshanthnu) June 1, 2025 -
‘టైగర్ మ్యాన్’: వాల్మీకి థాపర్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణ ఉద్య మకారుడు, టైగర్ మ్యాన్‌గా పేరున్న వాల్మీకి థాపర్(73) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడు తున్న ఆయన శనివారం ఢిల్లీలోని కౌటిల్య మార్గ్‌లోని సొంతింట్లో తుదిశ్వాస విడిచారు. వన్యప్రాణుల సంరక్షణ, ప్రత్యేకించి పులులను కాపాడేందుకు నాలుగు దశాబ్దాల పాటు తీవ్రంగా శ్రమించారు. అటవీ సంరక్షణలో ప్రజలను మమేకం చేసే లక్ష్యంతో 1988లో ఏర్పాటైన ప్రభుత్వేతర సంస్థ రణథంబోర్ ఫౌండేషన్‌కు థాపర్ సహ వ్యవస్థాపకుడు. సహజంగా సంచరించే ప్రాంతాల్లో పులులను అక్రమంగా వేటాడటంపై ఆయన ఉద్యమించారు. మానవ జోక్యాన్ని అడ్డుకు నేలా ప్రత్యేక టైగర్ జోన్ల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి సారథ్యంలోని నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ వంటి రమారమి 150 ప్రభుత్వ కమిటీల్లో సభ్యుడిగా సేవలందించారు. వన్యప్రాణుల గురించి టైగర్ ఫైర్, లివింగ్ విత్ టైగర్స్ వంటి 30కి పైగా పుస్తకాలను రాశారు. భారతీయ వన్యప్రాణులపై పలు డాక్యుమెంటరీలను రూపొందించారు. 2024లో జీవావరణ పరిరక్షకురాలు నేహా సిన్హా తీసిన ‘మై టైగర్ ఫ్యామిలీ’అనే డాక్యుమెంటరీలో థాపర్ కూడా ఉన్నారు. కాగా, థాపర్ తండ్రి రమేశ్ థాపర్ ప్రముఖ జర్నలిస్ట్. బాలీవుడ్ దిగ్గజ నటుడు శశి కపూర్ కుమార్తె సంజనా కపూర్, వాల్మీకి థాపర్ దంపతులు కాగా వీరికి ఒక కుమారుడు ఉన్నారు. -
నటి భర్త, టైగర్ మ్యాన్ వాల్మీక్ థాపర్ ఇకలేరు.. ఎవరీ థాపర్?
ప్రఖ్యాత పులుల సంరక్షణకారుడు, రచయిత వాల్మీక్ థాపర్ (Valmik Thapar) ఇకలేరు. టైగర్ మ్యాన్‌గా ప్రసిద్ది చెందిన 73 ఏళ్ల వయసులో శనివారం ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు. ప్రకృతి పరిశోధకుడు, శాస్త్రవేత్త అయిన థాపర్ తన జీవితకాలంలో 32 పుస్తకాలు రాశారు. వాటిలో నాలుగు ఆఫ్రికన్ వన్యప్రాణులపై ఉన్నాయి. థాపర్ మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.సాంక్చువరీ నేచర్ ఫౌండేషన్ ప్రకారం, వాల్మీక్ థాపర్ 1970ల మధ్యకాలం నుండి భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ముఖ్యంగా రాజస్థాన్‌లోని రాంథంబోర్ జాతీయ ఉద్యానవనంలో పులుల పరిరక్షణకు ఎంతో కృషి చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా 150కి పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్యానెల్స్‌తో కలిసి పనిచేశారు. Valmik Thapar, a legendary figure in the world of conservation over the past four decades - especially tigers - has just passed away. It is a great loss. Today's Ranthambore, particularly, is a testimony to his deep commitment and indefatigable zeal. He was uncommonly… pic.twitter.com/6TP60wMleo— Jairam Ramesh (@Jairam_Ramesh) May 31, 2025వాల్మిక్ థాపర్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి సోషియాలజీలో గోల్డ్‌మెడల్ సాధించారు. లివింగ్ విత్ టైగర్స్, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ టైగర్స్ "Land of the Tiger" , "Tiger Fire" వంటి 30కి పైగా పుస్తకాలు రచించారు...(Land of the Tiger)ల్యాండ్ ఆఫ్ ది టైగర్: ఎ నేచురల్ హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్ (1997) టైగర్ ఫైర్: 500 ఇయర్స్ ఆఫ్ ది టైగర్ ఇన్ ఇండియాలాంటి పుస్తకాలునురచించారు. ఇంకా ఆయన సహనిర్మాతగా వన్యప్రాణులపై రూపొందించిన వీడియోలుయ చిత్రాలు అనేక ప్రశంసలు దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఆరు భాగాల BBC సిరీస్ ల్యాండ్ ఆఫ్ ది టైగర్ (1997) బాగా పాపులర్. 2024లో, ఆయన మై టైగర్ ఫ్యామిలీ అనే డాక్యుమెంటరీలో కనిపించారు. థాపర్ ప్రాజెక్ట్ చీతాను విమర్శించారు కూడా. భారతదేశంలో స్వేచ్ఛగా తిరిగే ఆఫ్రికన్ చిరుతలను నిలబెట్టడానికి అవసరమైన ఆవాసాలు, ఆహారం, నైపుణ్యం లేవని ఆవేదనవ్యక్తం చేసేవారు. పర్యాటకం వన్యప్రాణులకు హాని కలిగిస్తుందనే నమ్మకాన్ని ఆయన తోసి పుచ్చేవారు. స్థిరమైన పరిరక్షణ నమూనాలను రూపొందించడానికి సమాజం శాస్త్రవేత్తలు, అటవీ సిబ్బంది, అధికారులు, మీడియా మధ్య సహకారాన్ని పెంపొందించే వినూత్న విధానాలను ప్రోత్సహించే వారు వాల్మీక్ థాపర్ఎవరీ వాల్మీక్ థాపర్వాల్మీక్ థాపర్ బొంబాయిలో రాజ్-రోమేష్ థాపర్ దంపతులకు జన్మించారు. ప్రముఖ భారతీయ చరిత్రకారిణి రోమిల్లా థాపర్ సమీప బంధువు. నటుడు శశి కపూర్ కుమార్తె, నాటక కళాకారిణి, నటి సంజన కపూర్‌ను వివాహం చేసుకున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా వన్యప్రాణుల సంరక్షణలో, ముఖ్యంగా పులుల రక్షణలో వాల్మిక్ థాపర్ ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కాంగ్రెస్ నాయకుడు, యు మాజీ పర్యావరణ మంత్రి జైరాం రమేష్ అభివర్ణించారు. ప్రస్తుతం రణతంబోర్ థాపర్ అభివృద్దికి ఆయన అవిశ్రాంత అంకితభావం, నిబద్ధతకు నిదర్శనమంటూ ట్విటర్ ద్వారా నివాళి అర్పించారు. ఇంకా పలువురు పర్యావరణ వేత్తలు, విద్యార్థులు ఆయన మరణంపై సంతాపం వెలిబుచ్చారు.Rest in Peace, Valmik Thapar, the international voice of Indian tigers for many many years.As a tribute to him, do read the many books he penned on tigers: ‘Tiger Fire’, ‘Living with Tigers’ and others. pic.twitter.com/SJJzZeELYn— Neha Sinha (@nehaa_sinha) May 31, 2025ఫియర్లెస్ టైగర్ ఛాంపియన్ అంటూ పరిరక్షణ జీవశాస్త్రవేత్త నేహా సిన్హా వాల్మీక్ థాపర్ మృతిపై నివాళి అర్పించారు. తనకోసం తాను మాట్లాడలేని ఒక మూగ జీవికి స్వరాన్చిచ్చిన గొప్ప మనిషిగా ఆయన కలకాలం నిలిచిపోతారన్నారు. -
అస్తమించిన సాహిత్యశిఖరం
నైరోబీ: ఆధునిక ఆఫ్రికన్ సాహిత్యంపై చెరగని ముద్రవేసిన కెన్యా దిగ్గజ నవలా రచయిత, ఆరు దశాబ్దాలపాటు ఎన్నో రచనలు చేసిన ప్రముఖ సాహితీవేత్త ప్రొఫెసర్ గూగీ వా థియాంగో బుధవారం అమెరికాలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు 87 సంవత్సరాలు. వలసరాజ్యం నుంచి తన కెన్యా దేశం ప్రజాస్వామ్య దేశంగా ఎదిగే క్రమంలో జరిగిన పరిణామాలను ఆయన తన రచనల్లో అక్షరబద్ధంచేశారు. జైలు జీవితం, ప్రవాస జీవితం, తీవ్ర అనారోగ్యం ఇవేవీ ఆయన రచనను అడ్డుకోలేపోయాయి. ఎన్నోసార్లు సాహిత్య నోబెల్ ఆయనను వరించబోయి కొద్దిలో తప్పిపోయిందనేది ప్రపంచవ్యాప్తంగా సాహితీవేత్తల అభిప్రాయం. ఎంతో సరళంగా, మనసుకు హత్తుకునేలా నవలలు, నాటకాలు, చిన్న కథలు, వ్యాసాలు రాశారు. సాహిత్యం మొదలు సామాజిక విమర్శ, చిన్నారుల రచనల దాకా అన్ని రకాల సాహిత్య ప్రయోగాల్లో ఆయనకు అద్భుతమైన ప్రవేశం ఉంది. స్వదేశం కెన్యాలో ఏ గ్రంథాలయంలో చూసినా ఆయన రచనల పుస్తకాల కోసం ప్రత్యేకంగా అరలు ఉంటాయి. ‘‘ కెన్యా రాజధాని నైరోబీలో 30 సంవత్సరాలకుపైగా బుక్‌స్టోర్ నిర్వహిస్తున్నా. గూగీ రచనలు అలా ఆపకుండా చదవాలనిపిస్తుంది’’ అని నూరియా బుక్‌స్టోర్ ప్రొప్రైటర్ బెన్నెట్ ఎంబాటా చెప్పారు. ‘‘కెన్యా అక్షరమాలలో సమున్నత శిఖరం గూగీ. కెన్యాలో సామాజిక న్యాయం, అధికార దుర్వినియోగంపై గూగీ ధైర్యంగా పదునైన రచనాస్త్రాలు సంధించారు. ఆఫ్రికా సాహిత్య దీపస్తంభం ఆరిపోయింది’’ అని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం గూగీకి ఘన నివాళులర్పించారు. బ్రిటిష్ వలసరాజ్యంగా ఉన్నప్పుడు కెన్యాలోని కమిరిథులో 1938 జనవరి ఐదున జేమ్స్ గూగీ జన్మించారు. తొలుత అందరూ ఆఫ్రికన్లలాగే ఇంగ్లిష్‌పై మక్కువతో ఆంగ్లంలో తొలి నవల ‘వీప్ నాట్, చైల్డ్’ రాశారు. ఇది 1964 మేలో ప్రచురితమైంది. తూర్పు ఆఫ్రికా రచయిత రాసిన పుస్తకం ప్రచురితంకావడం అదే తొలిసారి. తర్వాత ఆయన స్థానిక ‘గికుయూ’ భాషలో మాత్రమే రాయడం మొదలెట్టారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టినందుకు కొంతకాలం జైలుజీవితం అనుభవించారు. అప్పుడు కూడా ఆయన రచనను వదిలిపెట్టలేదు. తొలి ఆధునిక గికుయూ నవల ‘ డెవిల్ ఆన్ ది క్రాస్’ను జైళ్లో ఖైదీలకు ఇచ్చే టాయిలెట్ పేపర్లతో రాశారు. జైలు నుంచి విడుదలయ్యాక సైతం కుటుంబాన్ని నియంత ప్రభుత్వం హింసించడంతో వేధింపులు తట్టుకోలేక ప్రవాసజీవితం గడిపారు. జర్మనీలో బేరూత్ వర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. బ్రిటన్‌లో కొన్నాళ్లు ఉండి చివరకు కాలిఫోర్నియా వర్సిటీలో బోధిస్తూ అక్కడే స్థిరపడ్డారు. 22 ఏళ్ల తర్వాత 2004లో సొంత దేశానికి వస్తే కెన్యన్లు అపూర్వస్వాగతం పలికారు. కానీ మాజీ అధికారపార్టీ పెద్దలకు ఇది ఇష్టంలేదని కొందరి అభిప్రాయం. ఈ మాటలను నిజంచేస్తూ గూగీ ఉంటున్న అపార్ట్మెంట్లోకి నలుగురు చొరబడి ఆయనను దారుణంగా కొట్టారు. భార్యను రేప్ చేశారు. తర్వాత ఆయన దాదాపు కెన్యాకు రాలేదు. ఈయనకు 1995లోనే ప్రోస్టేట్ క్యాన్సర్ సోకినా ఎలాగోలా కోలుకున్నారు. 2019లో మూడుసార్లు గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. తర్వాత మూత్రపిండ వైఫల్యం బాధించడం మొదలెట్టింది. అనారోగ్యంతో అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని బెడ్ఫోర్డ్ సిటీలో కన్నుమూశారు. -
వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ కన్నుమూత
సాక్షి, ఖమ్మం: వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.గతవారం ఖమ్మంలోని ఆయన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మదన్ లాల్ మృతితో వైరా నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు నేతలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.మదన్ లాల్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున వైరా నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. -
అదుర్స్ నటుడు మృతి.. జూనియర్ ఎన్టీఆర్ సంతాపం
బాలీవుడ్ నటుడి మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఆయనకు నివాళులర్పించారు. ముకుల్ దేవ్ మృతి చెందడం బాధాకరం.. ఈ విషాద సమయంలో అదుర్స్ మూవీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నామని రాసుకొచ్చారు. కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.కాగా..బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్(54) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ముకుల్ దేవ్ (Mukul Dev) బాలీవుడ్ మూవీ ‘దస్తక్’తో వెండితెరకి పరిచయం అయ్యాడు. హిందీతో పాటు తెలుగు, పంజాబీ, కన్న చిత్రాల్లోనూ నటించాడు.ముకుల్ దేవ్‌కి టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కృష్ణ, ఏక్ నిరంజన్, కేడీ, అదుర్స్, నిప్పు, భాయ్ తదితర సినిమాల్లో నటించాడు. కృష్ణ సినిమాలో పోషించిన విలన్ పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2022లో విడుదలైన ‘అంత్ ది ఎండ్’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు. సింహాద్రి, సీతయ్య, అతడు చిత్రాల్లో నటించారు. Saddened by the passing of Mukul Dev garu. Remembering our time in Adhurs and his commitment to the craft. My condolences to his family. Om Shanti. 🙏 pic.twitter.com/Rp4HsrLR2I— Jr NTR (@tarak9999) May 24, 2025 -
ప్రముఖ శాస్త్రవేత్త నార్లికర్ కన్నుమూత.. సాగించిన పరిశోధనలివే..
పూణే: ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జయంత్ విష్ణు నార్లికర్(Scientist Jayant Vishnu Narlikar) మహారాష్ట్రలోని పూణేలో నేడు (మే 20) కన్నుమూశారు. భారతదేశంలో ఖగోళ భౌతిక శాస్త్ర పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడంలో నార్లికర్ గణనీయమైన పాత్ర పోషించారు. విశ్వోద్భవ శాస్త్రం, బిగ్ బ్యాంగ్‌కు ప్రత్యామ్నాయ సిద్ధాంతాల రూపకల్పనలో నార్లికర్ విశేష కృషి చేశారు. పూణేలోని ఇంటర్-యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్(Inter-University Center for Astronomy and Astrophysics) (ఐయూసీఏఏ) వ్యవస్థాపక డైరెక్టర్‌గా పేరొందారు. 1938, జూలై 19న మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో జన్మించిన ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అక్కడ ఆయన ఫ్రెడ్ హోయిల్‌తో కలిసి హోయ్ల్-నార్లికర్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఇది సాంప్రదాయ విశ్వోద్భవ నమూనాలను సవాలు చేసింది.తన శాస్త్రీయ రచనలతో పాటు నార్లికర్ పలు సంక్లిష్టమైన శాస్త్రీయ భావనలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పుస్తకాలు, వ్యాసాలు రాశారు. ఆయన మరాఠీలో సైన్స్ ఫిక్షన్ కూడా రాశారు. నార్లికర్ రచనలు కొత్త తరాల పరిశోధకులకు స్ఫూర్తినిస్తున్నాయి. ఖగోళ భౌతిక శాస్త్ర రంగాల్లో నార్లికర్ చేసిన కృషిగా గాను ఆయన పద్మభూషణ్ (1965), పద్మవిభూషణ్ (2004), మహారాష్ట్ర భూషణ్ (2010) తదితర ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1980ల చివరలో ఆయన ప్రముఖ టీవీ షో ‘కాస్మోస్: ఎ పర్సనల్ వాయేజ్’లో కనిపించారు. ఇది ఖగోళ భౌతిక శాస్త్రంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న గుర్తింపును మరోమారు గుర్తు చేసింది.ఇది కూడా చదవండి: World Bee Day... అప్పుడు మనిషి జీవితం నాలుగేళ్లే! -
నటుడు మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం
తెలుగులో ఎన్నో సినిమాల్లో బాలనటుడిగా చేసి గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ భరత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఇతడి తల్లి కమలహాసిని.. ఆదివారం రాత్రి చెన్నైలో మరణించారు. ఈ క్రమంలో తోటి నటీనటులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. చెన్నైలోని భరత్ ఇంటికి బంధుమిత్రులు, సినీ ప్రముఖులు వచ్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) దర్శకుడు శ్రీనువైట్ల తీసిన వెంకీ, రెడీ, ఢీ, కింగ్ సినిమాలతో పాటు బిందాస్, మిస్టర్ ఫెర్ఫెక్ట్ తదితర 80 తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. పెద్దవాడు అయిన తర్వాత అల్లు శిరీష్ 'ఏబీసీడీ' మూవీతో నటుడిగా మారాడు. చివరగా గతేడాది రిలీజైన గోపీచంద్ విశ్వం సినిమాలో సహాయ పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు చేస్తున్నాడు.నటుడిగా తెలుగు, తమిళ, కన్నడలో పలు చిత్రాలు చేసిన మాస్టర్ భరత్.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతోనూ బాధపడుతున్నాడు. ఇలాంటి సమయంలో తల్లిని కోల్పోవడంతో చాలా బాధపడుతున్నాడు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషాద ఘటనతో మాస్టర్ భరత్ అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగారు.(ఇదీ చదవండి: అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ) -
అమెరికాలో నల్గొండ విద్యార్థిని కన్నుమూత
ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లిన మరో భారతీయ విద్యార్థి కన్నుమూసింది. ఇటీవలి కాలంలోఅమెరికాలో భారత విద్యార్థుల మృతుల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం మరింత విషాదం. తాజాగా మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన యువతి మృతి చెందింది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పందెనపల్లికి చెందిన కొండి వెంకట్ రెడ్డి, శోభారాణి దంపతులకు కుమార్తె ప్రియాంక(26) అమెరికాలో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ (మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్) చదువుతోంది. అనారోగ్యంతో మృతి చెందడం విషాదాన్ని నింపింది.అలబామా యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తిచేసిన ప్రియాంక అక్కడే పార్ట్ టైం వర్క్ చేస్తోంది. బ్రెయిన్ డెడ్ (మెదడు మృతి) స్థితికి చేరుకోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దంత సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లగా.. పరీక్షించి ఆమెకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని తెలిపిన వైద్యులు తెలిపారు. స్నానం చేసేందుకు వెళ్లిన ప్రియాంక బాత్రూంలో పడిపోయి ఉండటాన్ని గమనించి స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ప్రియాంకను పరిశీలించి ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన ఆమె కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోని సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. కాంతార నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటుడు రాకేష్ పూజారి కన్నుమూశారు. కేవలం 34 ఏళ్ల వయసులోనే ఆయన మరణించారు. గుండె పోటు రావడంతోనే రాకేశ్ మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం దక్కలేదని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఉడిపిలో జరిగిన ఓ మెహందీ వేడుకలో ఈ విషాదం చోటు చేసుకుంది.కాగా.. కన్నడలో ప్రముఖ రియాలిటీ షో కామెడీ కిలాడిగలు ద్వారా ఫేమస్ అయ్యారు. ఈ షోలో సీజన్-3 విన్నర్‌గా రాకేశ్ నిలిచారు. మరోవైపు రాకేశ్ ప్రస్తుతం కాంతారాకు ప్రీక్వెల్‌గా వస్తోన్న కాంతారా చాప్టర్-1లో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాకేశ్ మృతి పట్ల పలువురు కన్నడ సినీతారలు సంతాపం తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.Always with a pure sweet hearted smile , ever loving , and extremely talented artist , you will always remain in our heart , deeply saddened , Rakesh we miss you! pic.twitter.com/Qx9Tx0bOOT— Pruthvi Ambaar (@AmbarPruthvi) May 12, 2025 -
జాతీయ అవార్డ్ గ్రహీత విక్రమ్ కన్నుమూత
జాతీయ అవార్డ్ గ్రహీత, ప్రముఖ బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్(51) కన్నుమూశారు. తొలుత మరాఠీ సినిమాల్లో పనిచేసిన ఈయన తర్వాత పలు హిందీలో చిత్రాల్లో నటించారు. 2013లో ఓ బెంగాలీ చిత్రానికి ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. విక్రమ్ గైక్వాడ్ మరణవార్త తెలుసుకున్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నివాళులర్పించారు. ఈయన మరణం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. భారతీయ సినిమా, నాటక రంగానికి విక్రమ్ చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. (ఇదీ చదవండి: శ్రీవిష్ణు ‘సింగిల్’కి రికార్డు ఓపెనింగ్స్... తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?)విక్రమ్ గైక్వాడ్ మేకప్ ఆర్టిస్ట్ గా చేసిన వాటిలో.. బెల్ బాటమ్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, బ్లాక్ మెయిల్, దంగల్, పీకే, సూపర్ 30, కేదార్నాథ్, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ తదితర హిందీ సినిమాలున్నాయి.మరాఠీ సినిమాల్లో ఈయన్ని బాలగంధర్వ అని కూడా అంటారు. విక్రమ్ మరణంపై చిత్రపరిశ్రమలోని ప్రముఖులు నివాళులర్పించారు. ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ముంబైలోని దాదర్‌లోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే విక్రమ్ మృతికి కారణం ఇంకా తెలియరాలేదు.(ఇదీ చదవండి: ‘ఆపరేషన్ సిందూర్’పై సినిమా.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!) -
బరితెగించిన పాక్.. సీనియర్ అధికారి మృతి
-
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కన్నుమూత
టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత రామారావు(68) మృతి చెందారు. గత కొన్నాళ్లుగా కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ఆదివారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్ అని తొక్కేశారు.. లేదంటే విజయ్ తో సినిమా!) 90ల్లో నరేష్, రాజేంద్ర ప్రసాద్ తదితర హీరోలతో ఎక్కువగా సినిమాలు తీశారు. తేనెటీగ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు ఈ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఈయన అసలు పేరు జవ్వాజి వెంకట రామారావు.తేనెటీగ సినిమాతో పాటు ప్రేమ అండ్ కో, బొబ్బిలి వేట, బడి తదితర సినిమాలని నిర్మించారు. ఈయనకు భార్యతో పాటు కొడుకు కూతురు ఉన్నారు. కొన్ని డబ్బింగ్ చిత్రాలని కూడా ఆయన తెలుగులో రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: బాలీవుడ్ లో మర్యాద ఇవ్వరు.. యంగ్ హీరో కన్నీళ్లు) -
శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇంట తీవ్ర విషాదం
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి నిర్మల్ కపూర్(90) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరిన ఆమె ఇవాళ సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కాగా.. ఆమెకు ప్రముఖ నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్, నటుడు సంజయ్ కపూర్ కూడా సంతానం. వీరితో పాటు రీనా కపూర్ ఆమె ఓ కుమార్తె కూడా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న వెంటనే శ్రీదేవి భర్త బోనీ కపూర్, ఆయన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌తో పాటు శిఖర్ పహరియా, షనాయా కపూర్ల ముంబయి లోఖండ్‌వాలాలోని అనిల్ కపూర్ ఇంటికి చేరుకున్నారు. కాగా.. గతేడాది సెప్టెంబర్‌లో నిర్మల్ కపూర్ 90వ పుట్టినరోజు వేడుకను అందరూ కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.కాగా.. నిర్మల్ కపూర్ ప్రముఖ నిర్మాత సురీందర్ కపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ అనిల్ కపూర్, బోనీ కపూర్, సంజయ్ కపూర్, రీనా కపూర్ అనే నలుగురు జన్మించారు. అంతే కాకుండా ఆమెకు అర్జున్ కపూర్, సోనమ్ కపూర్, రియా కపూర్, హర్ష్ వర్ధన్ కపూర్, జాన్వీ కపూర్, అన్షులా కపూర్, ఖుషీ కపూర్, మోహిత్ మార్వా అనే మనవలు, మనవరాళ్లు ఉన్నారు. -
అయ్యో అంబానీ ‘హ్యాపీ’ ఇక లేదు, ఫ్యామిలీలో విషాదం!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ నివాసంలో విషాదం అలుముకుంది. అంబానీ చిన్న కుమారుడు, అనంత్ అంబానీ (Anant Ambani)కి ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క, హ్యాపీ ఇక లేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. అనంత్ అంబానీ తోపాటు కుటుంబ సభ్యులు తమ కుక్కకు భావోద్వేగ నివాళులర్పించారు.ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లోని పోస్టు ప్రకారం అనంత్ అంబానీ పెంపుడు కుక్క ‘హ్యాపీ’ ఏప్రిల్ 30, బుధవారం కన్నుమూసింది. ‘హ్యాపీ’ మృతితో అంబానీ కుటుంబ సభ్యులు భావోద్వేగంతో నివాళులర్పించారు. అంబానీ అప్డేట్ పేజ్ కూడా ‘ఆర్ఐపీ హ్యాపీ’ అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది.ప్రియమైన హ్యాపీ జ్ఞాపకార్థం, మా ప్రియమైన డాగ్ హ్యాపీ మరణించిన విషాదాన్ని బరువైన హృదయంతో ఈ వార్తను పంచుకుంటున్నాం. పెట్ కంటే ఎక్కువగా, కుటుంబంలో మనిషి. చాలా విశ్వాసమైన నమ్మకమైన సహచరుడు, హ్యాపీ మా జీవితాల్లోకి తెచ్చిన ఆనందాన్ని ఎప్పటికీ మరచిపోలేము. హ్యాపీ జ్ఞాపకాలు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉంటాయి. మిస్‌యూ’’ అంటూ అంబానీ కుటుంబం తమ ప్రియమైన నేస్తానికి వీడ్కోలు పలికింది. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)హ్యాపీ మరణంపై నటుడు వీర్ పహారియా కూడా విచారం ప్రకటించారు. హ్యాపీ జ్ఞాపకార్థం అంబానీ కుటుంబం ఒక స్మారక ఫోటోను పోస్ట్ చేశాడు. కుటుంబంలో అత్యంత ప్రియమైన సభ్యులలో ఒకరిగా పరిగణించబడే ఆ కుక్కకు తమ హృదయ పూర్వక నివాళి అర్పించారన్నాడు. అనంత్ అంబానీకి ఈ పెంపుడు కుక్క అంటే ఎంతో ఇష్టం. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం వేడుకల్లో హ్యాపీ ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. ఫోటోలకు ఫోజులిస్తూ హ్యాపీ చేసిన సందడికి సంబంధించిన ఫోటోలు నెట్టింట బాగా ఆకట్టు కున్నాయి. -
క్యాన్సర్ తో ప్రమఖ దర్శకుడు కన్నుమూత
ప్రముఖ మలయాళీ దర్శకుడు షాజీ కరుణ్ (73) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఈయన.. సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?) 1952లో పుట్టిన ఈయన.. సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించారు. అనంతరం దర్శకుడిగా మారారు. మోహన్ లాల్ తో 'వానప్రస్థం' సినిమా ఈయనకు చాలా పేరు తీసుకొచ్చింది. అలానే పిరవి మూవీతో జాతీయ అవార్డులు సైతం అందుకున్నారు. 2011లో ఈయన్ని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్ తో సత్కరించింది.ఈయన తీసిన సినిమాల్లో పిరవి, స్వాహం, వానప్రస్థం, నిషాద్, కుట్టి శృంఖు, స్వప్నం.. ప్రేక్షకుల నుంచి అద్బుతమైన ఆదరణ దక్కించుకున్నాయి. అలాంటి ఈయన ఇప్పుడు మృతి చెందడంతో సినీ ప్రముఖులు షాజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ఏపీలో సమంత టెంపుల్.. ఇప్పుడు మరో విగ్రహం) -
ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారు. కస్తూరి రంగన్‌కి నివాళులు అర్పిస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జేఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరి రంగన్. కేరళ ఎర్నాకులంలో కస్తూరిరంగన్ జన్మించారు. ఈయనది విద్యావంతుల కుటుంబం. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో మాస్టర్స్ చేసిన రంగన్.. అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ నుంచి 1971లో డాక్టరేట్ అందుకున్నారు. ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ మీద 240 పేజీల థియరీని సమర్పించారాయన.1994 నుంచి 2003 దాకా.. తొమ్మిదేళ్లపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కి ఆయన చైర్మన్‌గా పని చేశారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు.మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌తో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారాయన. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్ మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చిప్పుడు ఇస్రో చైర్మన్‌గా ఉంది కస్తూరి రంగనే. 1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్ భార్య 1991లో కన్నుమూశారు.Deeply saddened to learn of the passing of Dr. K. Kasturirangan, former Chairman of #ISRO — an eminent scientist, visionary educator, and passionate environmentalist. He leaves an indelible mark on the annals of India’s space history. My tributes to this legend. May his soul rest… pic.twitter.com/cDEHln1tet— YS Jagan Mohan Reddy (@ysjagan) April 25, 2025 -
ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ కన్నుమూత
బెంగళూరు, సాక్షి: ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జేఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరిరంగన్(Krishnaswamy Kasturirangan). కేరళ ఎర్నాకులంలో కస్తూరిరంగన్ జన్మించారు. ఈయనది విద్యావంతుల కుటుంబం. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో మాస్టర్స్ చేసిన రంగన్.. అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ నుంచి 1971లో డాక్టరేట్ అందుకున్నారు. ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ మీద 240 పేజీల థియరీని సమర్పించారాయన. 1994 నుంచి 2003 దాకా.. తొమ్మిదేళ్లపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కి ఆయన చైర్మన్‌గా పని చేశారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌తో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారాయన. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్ మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చిప్పుడు ఇస్రో చైర్మన్‌గా ఉంది కస్తూరి రంగనే. 1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్ భార్య 1991లో కన్నుమూశారు. -
పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
-
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
వాటికన్ సిటీ: క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్(88) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు వాటికన్ సిటీ వర్గాలు ప్రకటించాయి. ఈస్టర్ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. Pope Francis died on Easter Monday, April 21, 2025, at the age of 88 at his residence in the Vatican's Casa Santa Marta. pic.twitter.com/jUIkbplVi2— Vatican News (@VaticanNews) April 21, 2025పోప్ ఫ్రాన్సిస్ తరచూ సమకాలీన సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తుండేవారు. వలసదారులు, శరణార్థుల పట్ల మానవత్వంతో మెలగాలని ప్రపంచ దేశాలకు పిలుపు ఇచ్చిన ఈయన.. అదాయ అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాడారు కూడా. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలోనూ.. అటు ట్రంప్, ఇటు కమలా హారిస్ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు కూడా. తాజాగా ఈస్టర్ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) పోప్‌ను కలుసుకున్నారు కూడా. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డ పోప్ ఫ్రాన్సిస్.. కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు. వాటికన్ సిటీలోని కాసా శాంటా మార్టా (Casa Santa Marta) నివాసంలో సోమవారం కన్నుమూసినట్లు తెలుస్తోంది. పోప్ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
అయ్యో ఎంత విషాదం : కన్నీటి సుడుల మధ్య ప్రియురాలితో పెళ్ళి
చెట్టంత ఎదిగిన పిల్లలకు వేడుకగా పెళ్లి చేయాలని భావిస్తారు ఏ తల్లిదండ్రులైనా. అలాగే కనిపెంచిన అమ్మానాన్నల కనుల విందుగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలి ఆశిస్తారు ఏ బిడ్డలైనా. కానీ కన్నకొడుకు మూడు ముళ్ల ముచ్చట చూడాలన్న కోరిక తీరకముందే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. దీంతో పుట్టెడు దుఃఖ్ఖంతో కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురి చేత కంట తడి పెట్టిస్తోంది.Cuddalore Marriage | அப்பாவின் உடல் முன்பு நடைபெற்ற மகன் திருமணம்#cuddalore #viralvideo #virudhachalam #marriage #death pic.twitter.com/wUJW3qgvov— Thanthi TV (@ThanthiTV) April 18, 2025తండ్రి నిండు మనసుతో అక్షింతలేసి ఆశీర్వదిస్తుండగా, తన ప్రియురాల్ని పెళ్లి చేసుకోవాలని భావించిన కొడుక్కి తీరని వేదని మిగిల్చిన ఘటన ఇది. దీంతో తండ్రి భౌతిక దేహం సాక్షిగా అమ్మాయి మెడలో తాళి కట్టాడు. వధూవురులతోపాటు, బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య జరిగిన ఈ పెళ్లి తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చోటుచేసుకుంది. భౌతికంగా తన తండ్రి పూర్తిగా మాయం కాకముందే, ఆయన ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాలిని ఒప్పించి మరీ తండ్రి మృతదేహం ఎదుటే ఆమెకు తాళి కట్టారు. బోరున విలపిస్తూ తండ్రి ఆశీస్సులు తీసుకోవడం అక్కడున్నవారినందరి హృదయాలను బద్దలు చేసింది. ఉబికి వస్తున్న కన్నీటిని అదుముకుంటూ బంధువులు, స్థానికులు కూడా వారిని ఆశీర్వదించారు.ఇదీ చదవండి:అనేక విషాద గాథల మధ్య.. స్ఫూర్తినిచ్చే జ్యోతి, శోభనాద్రి దాంపత్యం!కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్(63) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఆయన రెండో కుమారుడు అప్పు లా కోర్సు చదువుతున్నాడు. గత నాలుగేళ్లుగా విజయశాంతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తమ ప్రేమ సంగతిని ఇంట్లోని పెద్దలతో చెప్పారు. ఇరు కుటుంబాల అనుమతితో త్వరలోనే పెళ్లి చేసుకోవాలను కున్నారు. విరుధాచలం కౌంజియప్పర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విజయశాంతి డిగ్రీ చదువుతోంది. చదువు పూర్తైన తరువాత వివాహంచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని..అన్నట్టు విధి మరోలా ఉంది. అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో అనూహ్యంగా కాలం చేశాడు. దీంతో గుండె పగిలిన అప్పు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
కోలీవుడ్‌లో విషాదం.. ధనుశ్‌తో సినిమా తీసిన డైరెక్టర్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అనారోగ్యంతో కన్నుమూశారు. కోలీవుడ్‌కు చెందిన ఎస్ఎస్ స్టాన్లీ( 57) అనారోగ్య సమస్యలతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణిచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు కోలీవుడ్ సినీతారలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఏప్రిల్ 15న వలసరవక్కంలోని విద్యుత్ శ్మశానవాటికలో జరగనున్నాయి.కాగా.. స్టాన్లీ 'ఏప్రిల్ మాధతిల్', 'పుదుకోట్టైయిలిరుండు శరవణ్', 'మెర్క్యురీ పౌక్కల్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2000ల దశకంలో పలు కోలీవుడ్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత 'ఏప్రిల్ మాధతిల్' (2002)తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ధనుశ్ హీరోగా నటించిన 'పుదుకోట్టైయిలిరుందు శరవణన్' మూవీకి కూడా ఆయనే దర్శకత్వం వహించారు. దర్శకత్వం వహించడంతో పాటు 'నినైతలే ఇనిక్కుమ్', 'నన్బన్' వంటి చిత్రాలలో సహాయ పాత్రలతో నటనలోకి అడుగుపెట్టారు. అతను చివరిగా విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' చిత్రంలో కనిపించారు. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అనారోగ్య కారణాలతో ప్రముఖ నటుడు, కమెడియన్ బ్యాంక్ జనార్ధన్ కన్నుమూశారు. అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం జనార్ధన్ వయస్సు 75 ఏళ్లు కాగా.. శాండల్‌వుడ్‌లో బుల్లితెరతో పాటు పలు సినిమాల్లో నటించారు. ఆయన మృతి పట్ల శాండల్‌వుడ్ సినీతారలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కన్నడ సినీ ఇండస్ట్రీలో టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 'పాపా పాండు', 'మాంగల్య జోకలి', 'రోబో ఫ్యామిలీ' వంటి ప్రముఖ సీరియల్స్‌లో ఆయన కనిపించారు. కేఎల్ స్వామి దర్శకత్వం వహించిన 'పితామహ' (1985) సినిమాతో ఎంట్రీ ఇచ్చారు . తన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్‌తో అభిమానుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహించిన ష్(1993), 'తర్లే నాన్ మగా' (1992), 'గణేశ సుబ్రమణ్య' (1992), కౌరవ (1998) చిత్రాల్లో నటించారు.కాగా..1948లో బెంగళూరులోని సుల్తాన్హళ్లి (ప్రస్తుతం సుల్తాన్‌పాళ్య)లో జన్మించిన జనార్దన్ దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. టెలివిజన్, సినిమాలతో పాటు రంగస్థల నాటకాల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. గతంలో 2023లో ఓ సారి గుండెపోటుకు గురైన ఆయన ఆ తర్వాత కోలుకున్నాడు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయన భౌతికకాయాన్ని అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఈ రోజు సాయంత్రం 5:30 గంటల వరకు సుల్తాన్పాళ్యలోని ఆయన నివాసంలో ఉంచనున్నారు. -
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత
-
Vanajeevi Ramaiah: ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇక లేరు
సాక్షి, ఖమ్మం: ప్రముఖ సామాజిక కార్యకర్త, జీవితమంతా మొక్కలు నాటేందుకే గడిపిన ప్రకృతి ప్రేమికుడు ‘వనజీవి’ రామయ్య(85) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. కోటికి పైగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో రామయ్య చేసిన కృషికిగానూ కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించింది.దరిపల్లి రామయ్య(Daripalli Ramaiah) స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలంలోని ముత్తగూడెం. ఇక్కడే ఐదో తరగతి దాకా చదువుకున్నారు కూడా. ఆ సమయంలో మల్లేశం సర్ చెప్పిన మొక్కల పెంపకం పాఠాలు రామయ్యను బాగా ప్రభావితం చేశాయి. ఆపై పంటపొలాల కోసం చిన్నతనంలోనే రెడ్డిపల్లికి రామయ్య కుటుంబం మకాం మార్చింది. మల్లేశం సర్ పాఠాల స్ఫూర్తితో తన ఇంటిలోని 40 కుంటల స్థలంలో ఇల్లు పోను మిగతా జాగలో చెట్లు నాటి వాటిని ప్రాణప్రదంగా పెంచారు. అక్కడి నుంచి.. దశాబ్దాలపాటు రోడ్ల పక్కన ఖాళీ స్థలం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, దేవాలయాలు.. ఇలా ఒకటేమిటి ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడం రామయ్యకు నిత్యకృత్యమైంది. వృత్తిరీత్యా కుండలు చేస్తూ, పాలు అమ్ముతూ ప్రవృత్తి రీత్యా వనపెంపకానికి అవిశ్రాంతంగా కృషి చేశారాయన. మనవళ్లకు మొక్కల పేర్లు!వనజీవి రామయ్య((Vanajeevi Ramaiah)కు భార్య జానకమ్మ, నలుగురు సంతానం. ఓవైపు కుటుంబ భారాన్ని మోస్తూనే.. దశాబ్దాలకు పైగా మొక్కలు నాటుతూ వచ్చారు. విశేషం ఏంటంటే.. మనుమళ్లు, మనుమరాళ్లకు కూడా ఆయన చెట్ల పేర్లే పెట్టాడు. ఒకామె పేరు చందనపుష్ప. ఇంకో మనుమరాలు హరిత లావణ్య. కబంధపుష్ప అని ఇంకో పాపకు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు వనజీవి రామయ్య.అలసిపోని వనజీవిఆయన యువతరం నుంచి నాటిన మొక్కలు నేడు మహావృక్షాలుగా దర్శనమిస్తున్నాయి. ఎండకాలం వచ్చిందంటే రామయ్య అడవుల్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. వయసు మీదపడుతున్నా కూడా అడవుల వెంట తిరుగుతూ వివిధ రకాల విత్తనాలను సేకరించేవారు. వాటన్నింటిని బస్తాల్లో నింపి ఇంటి దగ్గర నిల్వచేసేవారు. అందులో ఎవరికీ తెలియని చెట్ల విత్తనాలే ఎక్కువగా ఉండేవి. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటే కార్యక్రమంలో మునిగిపోయేవారు. తాను మొక్కలను పెంచడం మాత్రమే కాదు.. పదిమందికి విత్తనాలు పంచి పెంచమని సూచించారు. బంధువుల ఇళ్ళలో పెళ్ళిళ్ళకు వెళ్ళినా సరే మొక్కలను, విత్తనాలను బహుమతులుగా ఇచ్చి పెంచమని ప్రోత్సహించే వారు. ఆ మధ్య ఆయనకు ఓ యాక్సిడెంట్ అయ్యింది. ఆ వాహనదారుడిని శిక్షించే బదులు అతనితో వంద మొక్కలు నాటించాలని పోలీసులను ఆయన కోరారు. అలాగే.. రైతు బంధు, దళిత బంధులాగా హరిత బంధు కూడా ఇప్పించాలంటూ బీఆర్ఎస్ హయాంలో ఆయన ఓ విజ్ఞప్తి కూడా చేశారు.సీఎం రేవంత్ సహా ప్రముఖుల సంతాపంపద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ‘‘ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య గారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి పద్మశ్రీ రామయ్య గారు. వారి మరణం సమాజానికి తీరని లోటు, కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి.పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య గారి ఆత్మకు నివాళి. వారు సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శం అని ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రచార సాధనాలుప్లాస్టిక్ డబ్బాలు, విరిగిపోయిన కుర్చీలు, ప్లాస్టిక్ కుండలు, రింగులు.. ఇలా ఆయన తన హరితహారం ప్రచారానికి సాధనాలుగా ఉపయోగించుకోనంటూ వస్తువు లేదు. వాటికి తన సొంత డబ్బులతో రంగులు అద్ది.. అక్షరాలు రాసి తలకు ధరించేవారు. అలా.. తను ఎక్కడికి వెళ్లనా మొక్కల పెంపకంపై అవగాహన కలిగించడం ఆయనకంటూ దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ‘‘వృక్షోరక్షతి రక్షిత’’ అని రాసివున్న ప్లకార్డులను తగిలించుకుని ప్రచారం చేసేవారాయన. అడిగిందే ఆలస్యం.. 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా వివరించేవారాయన.అవార్డులు, పాఠంగా రామయ్య జీవితంకోటికి పైగా మొక్కలను నాటి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన రామయ్య సేవలకుగాను పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయి. 2005 సంవత్సరానికి సెంటర్‌ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ నుంచి వనమిత్ర అవార్డు ఇచ్చింది. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే అంతర్జాతీయ సంస్థ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. 1995లో భారత ప్రభుత్వం నుంచి వనసేవా అవార్డు దక్కింది. సాక్షి మీడియా సంస్థ సైతం ఆయన సేవలకుగానూ ఎక్సలెన్స్(Sakshi Excellence Award) అవార్డుతో సత్కరించింది. ఇక.. మహారాష్ట్ర ప్రభుత్వం వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అక్కడి తెలుగు విద్యార్థుల కోసం 9వ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవితం పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి కృషిని పాఠ్యాంశంగా పిల్లలకు బోధిస్తున్నారు. 2017 సంవత్సరంలో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ (సామాజిక సేవ) పురస్కారం అందుకుంటూ.. -
తమన్నాని పరిచయం చేసిన నిర్మాత కన్నుమూత
ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సలీం అక్తర్ (82) మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ కోసం 20 ఏళ్ల కుర్రాడు.. ఎవరీ సాయి?)1980-90ల్లో ఆమిర్ ఖాన్, బాబీ డియోల్ తో వరస సినిమాలు నిర్మించిన ఈయన.. మంచి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1997లో రాణీ ముఖర్జీని 'రాజా కీ ఆయేగా బరాత్' సినిమాతో, 2005లో తమన్నాని 'చాంద్ సా రోషన్ చెహ్రా' మూవీతో హిందీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే.అలా పలువురు హీరోయిన్లకు అచ్చొచ్చిన నిర్మాతగా పేరొందిన సలీం అక్తర్ ఇప్పుడు అనారోగ్య సమస్యలతో చనిపోయారు. బుధవారం (ఏప్రిల్ 9) మధ్యాహ్నం ఈయన అంత్యక్రియలు జరగనున్నాయి. సలీంకు భార్య, కొడుకు ఉన్నారు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ వీడియో.. ఏది నిజమో తెలియట్లేదు!) -
వెండితెరకు మిస్టర్ భారత్
‘ఈ దేశం నీకేమిచ్చిందనేది కాదు... ఈ దేశానికి నువ్వేమిచ్చావ్ అనేది చూడాలి’ అన్నారు నెహ్రూ. ‘జై జవాన్ జై కిసాన్ ’ అన్నారు లాల్‌బహదూర్ శాస్త్రి. ఈ దేశానికి ప్రధానులైన వారు ప్రజలను దేశం వైపు చూసేలా చేయగలిగారు. ఈ స్ఫూర్తిని సినిమా రంగంలో మొదటగా అందుకున్న హీరో మనోజ్ కుమార్ (Manoj Kumar). సినిమాల్లో తన పాత్రకు ‘భారత్’ అని పేరు పెట్టుకుని అందరి చేత ‘మిస్టర్ భారత్’ అనిపించుకున్నాడు. శుక్రవారం మరణించిన ఈ దేశభక్త నటుడికి నివాళి1974.‘రోటీ కపడా ఔర్ మకాన్’ రిలీజైంది. జనం మొదటిరోజు మొదటి ఆటకు వెళ్లారు. ఫస్ట్సీన్... జేబులో డిగ్రీ పెట్టుకుని రోడ్ల మీద బేకార్‌గా తిరుగుతున్న హీరో ఒకచోట ఆగిపోయాడు. కారణం... పోలీస్ ఒకతనిపై తుపాకీ ఎక్కుపెట్టి ‘చెప్పు... ఎవరు నువ్వు’ అని అడుగుతున్నాడు. ‘నేనా... ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ని’... ‘ఏం దొంగిలించుకుని వెళుతున్నావ్?’ ‘చూస్తావా...’ కోటు చాటున ఉన్న వస్తువు చూపించాడు. రొట్టె ముక్క.ఈ సీన్‌తోనే ఆనాటికి దేశంలో పేరుకొని పోయిన ఆకలిని, నిరుద్యోగాన్ని చూపించి ప్రేక్షకుల గుండెలను గట్టిగా చరుస్తాడు మనోజ్ కుమార్. ఆ తర్వాతి సీను కప్పుకోవడానికి గుడ్డలేని పేద స్త్రీలు... నిలువ నీడలేని నిరుపేద కూలివాళ్లు. దర్శకుడు తీసిన కథ తమ కష్టాల గురించే అని జనం అర్థం చేసుకున్నారు. సినిమా సూపర్ హిట్ అయ్యింది.‘సినిమా అనేది సందేశాలివ్వడానికి కాదు అని కొందరు అంటారు... అనుకుంటారు. కాని నేను తీసేది మాత్రం ఏదో ఒక సందేశం (Message) ఇవ్వడానికి. సమాజం నుంచి ఎంతో పొందాం... బదులుగా మంచి మాట చెప్పడానికి ఏమిటి కష్టం’ అంటాడు మనోజ్ కుమార్.బాధ చూసినవాడు బహుశా బాధ్యతగా ఉంటాడు. పదేళ్ల వయసులో ఉండగా దేశ విభజన చూశాడు మనోజ్ కుమార్. నేటి పాకిస్తాన్లో ఉన్నా అబ్తాబాద్ నుంచి అతడి కుటుంబం ఢిల్లీకి వచ్చేసింది. రెఫ్యూజీ క్యాంప్‌లో ఉంటూ చదువుకున్నాడు. ఆ కష్టాలను మర్చిపోవడానికి అప్పుడప్పుడు మేనమామ వచ్చి సినిమాకు తీసుకెళ్లేవాడు. పన్నెండేళ్ల మనోజ్ చూసిన మొదటి సినిమా ‘జుగ్ను’. ఇందులో దిలీప్ కుమార్ హీరో. సినిమా చివరలో చనిపోతాడు. తర్వాత మనోజ్ మరో సినిమా చూశాడు. ‘షహీద్’. ఇందులో కూడా దిలీప్ కుమార్ హీరో. సినిమాలో చనిపోతాడు. మనోజ్ చాలా విస్మయం చెంది ఇంటికొచ్చి తల్లిని అడిగాడు ‘అమ్మా.. ఒక మనిషి ఎన్నిసార్లు చనిపోతాడు?’. ‘ఒకసారే’. ‘మరి రెండుసార్లు చనిపోతే?’... ‘అలాంటి వాళ్లు దేవదూతలై ఉంటారు’ అంది. ‘అంటే సినిమా హీరోకు మరణం లేదన్నమాట. నేను హీరోను అవుతాను. దిలీప్ కుమార్లాంటి హీరో’ అనుకున్నాడు మనోజ్ కుమార్. అంతే కాదు దిలీప్ కుమార్ నటించిన ‘షబ్నమ్’ చూసి అందులో దిలీప్ పేరు ‘మనోజ్’ అని ఉంటే ‘నేను పెద్దయ్యి హీరో అయ్యాక ఆ పేరే పెట్టుకుంటాను’ అనుకున్నాడు. అనుకున్నట్టుగానే హీరో అయ్యాడు. అదే పేరుతో విఖ్యాతం అయ్యాడు. ఎంతగా అంటే అతని అసలు పేరు హరికిషన్ గిరి గోస్వామి (Harikrishna Giri Goswami) అని ఎవరికీ తెలియనంత!ఢిల్లీ నుంచి బాంబే వచ్చి సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు మనోజ్ కుమార్. వాళ్ల నాన్న కవి. ఇతనికి కూడా రాయడం వచ్చింది. కొన్నాళ్లు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాడు. సినిమాల్లో ‘ఎక్స్ట్రా’గా కూడా కనిపించాడు. దిలీప్ కుమార్‌ను ఇమిటేట్ చేస్తూ ఇతను చేస్తున్న నటన ఖరీదైన దిలీప్ కుమార్‌ను బుక్ చేసుకోలేకపోయేవారిని ఆకర్షించింది. మెల్లగా అవకాశాలు వచ్చాయి. 1960లో వచ్చిన ‘కాంచ్ కీ గుడియా’తో తొలిసారి హీరోగా కనిపించాడు. సినిమా ఫ్లాప్ అయ్యింది. మరికొన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అదే సమయంలో హీరో అవకాశాలు పొందడానికి డింకీలు కొడుతున్న ధర్మేంద్ర, శశి కపూర్లతో దోస్తీ కట్టి ఎక్కే స్టూడియో దిగే స్టూడియోగా ఉండేవాడు. ముగ్గురి జాతకం బాగుంది... ముగ్గురూ పెద్ద హీరోలయ్యారు. కాని మిగిలిన ఇద్దరి కంటే మనోజ్ ఎక్కువ నైపుణ్యాలు ప్రదర్శించాడు. నటుడు, రచయిత, ఎడిటర్, నిర్మాత, దర్శకుడు... అన్నింటికి మించి దేశభక్తి అనే అంశాన్ని సినిమాకు ఫార్ములాగా మార్చగలిగిన మేధావి అయ్యాడు.పెద్ద హీరోల రొమాంటిక్ సినిమాల హవా నడుస్తున్న రోజుల్లో డాన్స్ ఏ మాత్రం చేయలేని, లిమిటెడ్ బాడీ లాంగ్వేజ్ ఉన్న మనోజ్ కుమార్ సీరియస్ సబ్జెక్ట్స్ తనను గట్టెక్కిస్తాయని భావించాడు. భగత్సింగ్లాంటి కేరెక్టర్ తన ఇమేజ్ను పెంచుతుందని ఆ సినిమా చేయాలనుకున్నాడు. కాని భగత్ సింగ్‌కు సంబంధించి సినిమా తీసేంత సమాచారం ఆ రోజుల్లో లేదు. మనోజ్ కుమారే నాలుగేళ్లు తిరిగి సమాచారం సేకరించి కథ తయారు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. 1965లో వచ్చిన ‘షహీద్’... భగత్ సింగ్ మీద వచ్చిన తొలి భారతీయ సినిమా. పెద్ద హిట్ అయ్యింది. అంతేకాదు ‘నర్గిస్‌దత్ జాతీయ పురస్కారం’ గెలుచుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీకి వెళ్లినప్పుడు నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సినిమాను చూశారు. మరుసటిరోజు టీకి ఆహ్వానించి మనోజ్‌తో ‘నేను జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చాను కదా. నువ్వు ఆ నినాదం పై సినిమా తీయరాదూ’ అని అడిగారు. దేశ ప్రధాని కోరిన కోరిక మనోజ్‌ను సూటిగా తాకింది. ఒక నోట్‌బుక్, పెన్ను పట్టుకుని ఢిల్లీలో రైలెక్కి ముంబైలో దిగేలోపు ‘ఉప్కార్’ స్క్రిప్ట్ రాశాడు. దర్శకుడు కావాలనే కోరిక అప్పటి వరకూ మనోజ్‌కు లేదు. కాని ప్రధానిని ఇంప్రెస్ చేసేలా సినిమా తీయాలంటే తానే దర్శకుడిగా మారక తప్పదు అనుకున్నాడు. అంటే ఒక ప్రధాని వల్ల దర్శకుడైన ఏకైన వ్యక్తి మనోజ్. భారతదేశంలో రైతుకు ప్రాధాన్యం ఇవ్వాలని, సైనికులకు బాసటగా నిలవాలని మనోజ్ తీసిన ‘ఉప్కార్’ అతణ్ణి అంబరంలో కూచోబెట్టింది. అవార్డుల రాసి పోసింది. ‘మేరే దేశ్ కీ ధర్తీ’ పాట జనాన్ని ఊపేసింది. సినిమాలో పాత్రకు పెట్టిన పేరు భారత్ (Bharat) మనోజ్ కుమార్ నిక్‌నేమ్ అయ్యింది. ‘మిస్టర్ భారత్’.పాశ్చాత్య సంస్కృతి చెడ్డది కాకపోయినా దానిని చెడ్డగా ఇమిటేట్ చేస్తున్న వారిపై ‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ తీశాడు మనోజ్. మన సంస్కృతి మనకు ముఖ్యం అని చాటాడు. ఇక దేశంలో నిరుద్యోగం, యువకుల్లో పేరుకుపోతున్న అనిశ్చితి పై ‘రోటీ కపడా ఔర్ మకాన్’ తీశాడు. నేటికీ ప్రభుత్వాలు ఈ మూడూ అందించడానికి ఆపసోపాలు పడుతూనే ఉన్నాయి. ఇక బ్రిటిష్ వారు ఆక్రమించుకున్న చిన్న సంస్థానాల నుంచి వారిపై సాయుధ పోరాటం చేసిన వారి కథతో తీసిన భారీ చిత్రం ‘క్రాంతి’ సూపర్‌డూపర్ హిట్ అయ్యి భాష తెలియని ప్రాంతాల్లో కూడా పెద్ద కలెక్షన్లు రాబట్టింది. కార్మికుల సమస్యలతో ‘షోర్’ తీశాడు. చిరుద్యోగుల తరఫున ‘క్లర్క్’ తీశాడు. ఆకాంక్షలో స్వచ్ఛత, ప్రయత్నంలో శ్రమ ఉంటే విజయం వరిస్తుందనడానికి మనోజ్ కుమార్ జీవితం ఒక ఉదాహరణ. ఏ హీరోని అయితే చూసి హీరో అయ్యాడో ఆ దిలీప్ కుమార్‌తో ‘ఆద్మీ’లో నటించగలిగాడు మనోజ్ కుమార్. అదే దిలీప్ కుమార్‌ను డైరెక్ట్ చేసి ‘క్రాంతి’గా సూపర్‌హిట్ సాధించగలిగాడు. తగిన ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేక ముఖాన్ని చేతుల్లో దాచుకునే మేనరిజంతో ఫేమస్ అయిన మనోజ్‌ను అప్పుడప్పుడు కళాకారులు అదే మేనరిజంతో ఆటపట్టించడం కద్దు. షారూక్ ఖాన్ ‘ఓమ్ శాంతి ఓమ్’లో మనోజ్‌ను ఇమిటేట్ చేసి ఆయనకు కోపం తెప్పించాడు. పరువు నష్టం దావా వేసే వరకూ వ్యవహారం వెళ్లి తర్వాత సద్దుమణిగింది.చదవండి: అసహ్యించుకుంటూనే.. చివరికి నటినయ్యామనోజ్ కుమార్ నిజమైన దేశ ప్రేమికుడు. తన సినిమాల్లో అన్ని మతాల, వర్గాల వారి పాత్రలు సృష్టించి దేశమంటే మనుషులోయ్ అని చూపించినవాడు. నేటి హేట్ ఫిల్మ్స్ మధ్యలో మనోజ్ భావధార వెనుకబడ్డట్టు అనిపించిన అంతిమంగా గెలవబోయేది అదే. ఎందుకంటే విలువల వరుసలో మానవత్వం ముందు ఉండి తర్వాతే కదా మతం ఉండేది. సెల్యూట్ మిస్టర్ భారత్.హోమియోపతి డాక్టర్మనోజ్ కుమార్ మంచి హోమియోపతి డాక్టర్. అతనికి ఒకసారి చెంప మీద సర్పి వచ్చింది. అల్లోపతిలో ఎన్ని వైద్యాలు చేసినా పని చేయలేదు. నటుడికి ముఖాన సర్పి చాలా ప్రమాదం. ఆ సమయంలో మద్రాసులో షూటింగ్లో ఉండగా హోమియోపతిప్రాక్టీసు చేసే నటుడు అశోక్ కుమార్ (Ashok Kumar) ఒక డోస్ మందు వేశాడు. వారంలో సర్పి మాయమైంది. మనోజ్‌కు ఇది ఎంతగా ఆసక్తి రేపిందంటే అతడు హోమియోపతి డాక్టర్ల కంటే ఎక్కువగా హోమియోపతి (Homeopathy) చదివి ఆ వైద్యం ప్రాక్టీసు చేయడానికి సర్టిఫికెట్ పొందాడు. చాలామందికి హోమియోపతి వైద్యం చేశాడు.తెలుగు సినిమాల్లో మనోజ్ కుమార్మనోజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు తెలియకుండా తెలుగు సినిమాల్లో ఉన్నాడు. ఆయన తీసిన ‘ఉప్కార్’ తెలుగులో కృష్ణ హీరోగా ‘పాడిపంటలు’గా రీమేక్ అయ్యి హిట్ అయ్యింది. మరో సూపర్‌హిట్ ‘రోటీ కపడా ఔర్ మకాన్’ తెలుగులో శోభన్ బాబు హీరోగా ‘జీవన పోరాటం’ పేరుతో రీమేక్ అయ్యింది. హిందీలో అమితాబ్ వేసిన పాత్రను తెలుగులో రజనీకాంత్ చేశాడు. మనోజ్ కుమార్ నటించిన ‘ఓ కౌన్ థీ’ తెలుగులో జగ్గయ్య, జయలలిత కాంబినేషన్లో ‘ఆమె ఎవరు’గా వచ్చింది. ‘హిమాలయ్ కీ గోద్ మే’ శోభన్ బాబు హీరోగా ‘డాక్టర్ బాబు’గా వచ్చింది. ‘దస్ నంబరీ’ పెద్ద హిట్ కావడంతో ఎన్టీఆర్ (NTR) హీరోగా ‘కేడీ నంబర్ 1’ పేరుతో రీమేక్ చేశారు. చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘మగ మహారాజు’ సినిమాలో ఏడు రోజులు సైకిల్ తొక్కే సన్నివేశం ఒరిజినల్ మనోజ్ కుమార్ నటించిన ‘షోర్’లో ఉంది.మనోజ్ కుమార్ కన్నుమూతసుప్రసిద్ధ సినీనటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా వెన్నునొప్పితోనూ, వయసు సంబంధమైన ఇతర రుగ్మతలతోనూ బాధపడుతున్న మనోజ్‌కుమార్ ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. కునాల్, విశాల్. వీరిలో కునాల్ హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. దేశభక్తి సినిమాలతో ఖ్యాతి పొందిన మనోజ్‌కుమార్‌ను 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు వరించాయి. షహీద్, ఉప్కార్, పూరబ్ ఔర్ పశ్చిమ్, క్రాంతి తదితర సూపర్‌హిట్ సినిమాలు మనోజ్ దర్శకత్వంలో రూపొందాయి. -
సీనియర్ నటుడు మృతి.. రాధిక పోస్ట్ వైరల్
తమిళ, మలయాళ సినిమాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవి కుమార్ (71) చనిపోయారు. గతకొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. చెన్నై వళచెరిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రవికుమార్ కొడుకు ధ్రువీకరించాడు. నటి రాధిక కూడా రవికుమార్ మృతిపై పోస్ట్ పెట్టింది. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 18 మూవీస్)కేరళ త్రిసూర్ కి చెందిన రవికుమార్.. 1975 నుంచి సినిమాలు చేస్తున్నారు. ఉల్లాస యాత్ర, అవరగళ్, సీబీఐ 5, పరమానందం తదితర మలయాళ చిత్రాలు చేశారు. తమిళంలోనూ అల్లాఉద్దీన్ అద్భుత విళక్కుమ్, రమణ, ఆనంద రాగం తదితర సినిమాలు చేశారు. చివరగా 2022లో వీట్ల విశేషమ్ మూవీలో నటించారు.(ఇదీ చదవండి: దర్శకుడు బుచ్చిబాబుకు గిఫ్ట్ పంపిన రామ్ చరణ్) View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) -
నాగాంజలి మృతి బాధాకరం: మార్గాని భరత్
-
బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ మనోజ్ కుమార్ కన్నుమూత
-
రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతిచెందింది. బొల్లినేని ఆసుపత్రిలో 12 రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న నాగాంజలి శుక్రవారం ఉదయం మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఇక, గత 28 నుంచి నాగాంజలిని వ్యైదుల బృందం పర్యవేక్షిస్తోంది. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. నాగాంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈరోజు ఉదయమే పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇప్పటివరకు ఫార్మసీ విద్యార్థిని ఘటనకు సంబంధించి ప్రభుత్వం, మంత్రులు స్పందించకపోవడం గమనార్హం.జరిగింది ఇదీ.. లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టి చావుబతుకుల్లో ఉన్న ఫార్మసీ ఫైనలియర్ విద్యార్థిని కేసు దర్యాప్తు దారి తప్పుతోందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో ఈ ఘటన జరిగితే మూడు రోజులు గోప్యంగా ఉంచడం గమనార్హం. బాధిత విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకుడైన కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ టీడీపీలో క్రియాశీల నేతగా వ్యవహరిస్తున్నందున కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్‌ను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబం డిమాండ్ చేయగా.. కూటమి సర్కారు మొద్దు నిద్రపై మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఓ మహిళ హోంమంత్రిగా ఉండి కూడా పరామర్శించకపోవడం.. ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కిమ్స్ ఆస్పత్రి వద్ద ధర్నా చేశాయి.తన చెల్లిని ఇక్కడకు ఎలా వచ్చిందో అలాగే తమకు ప్రాణాలతో అప్పగించాలని బాధిత విద్యార్థిని అక్క కన్నీళ్లతో వేడుకుంది. పోలవరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడకు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ వెంటనే ఆసుపత్రికి రావాలని డిమాండ్ చేసింది. ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా ఈ విషయం తెలియదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారని, దాని అర్థం ఇదేనా? అని నిలదీసింది.నిందితుడు టీడీపీ నేతలకు బంధువు.. ఈ కేసులో అరెస్టయిన కిమ్స్ ఏజీఎం దీపక్ కాకినాడ జిల్లాలోని ఓ టీడీపీ ఎమ్మెల్యేకు మరిది అవుతాడని తెలిసింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుగ్గా పని చేశాడు. నిందితుడు మరో టీడీపీ నేతకు అల్లుడు కూడా కావడంతో ఈ కేసును నీరుగార్చే యత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.సీసీ ఫుటేజీ ఎక్కడ? బాధితురాలు వేకురోనీమ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుందని, దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్ డెడ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో విద్యార్థిని ఆరోగ్యం విషమంగానే ఉందని, బ్రెయిన్‌కు పూర్తిగా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడంతో డ్యామేజ్ ఎక్కువగా ఉందని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. వెంటిలేటర్ ఉన్నందున బీపీ, హార్ట్‌బీట్, పల్స్ నార్మల్‌గా ఉన్నట్లు వెల్లడించారు. వాడిని చంపేయండి..! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్ చేసింది. సూసైడ్ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు. -
విషాదం.. టాలీవుడ్ నిర్మాత కన్నుమూత
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలు చిత్రాలు తీసిన నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం (68) మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన పరిస్థితి తాజాగా విషమించడంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు.(ఇదీ చదవండి: 'సికిందర్' తొలిరోజు కలెక్షన్స్.. మరీ ఇంత తక్కువా?)ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చిన తర్వాత అంటే బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముళ్లపూడి బ్రహ్మానందం.. దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు బంధువు. ఈవీవీ సోదరిని ఈయన పెళ్లి చేసుకున్నారు.అల్లరి నరేశ్ 'నేను', అల్లుడు గారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా తదితర సినిమాలని బ్రహ్మానందం నిర్మించారు. ఇప్పుడు ఈయన చనిపోవడంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: మోనాలిసాకి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ అరెస్ట్) -
టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆమె ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇక మెహర్ రమేశ్ సినిమాల విషయానికొస్తే తెలుగులో 'శక్తి', 'కంత్రి', 'షాడో', 'భోళా శంకర్' సినిమాలను తెరకెక్కించారు. అంతకుముందు 2002లో తొలుత ఇతడు నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిరంజీవికి వరసకు తమ్ముడు అయ్యే మెహర్.. మహేశ్‌బాబు 'బాబీ' మూవీ సునీల్ అనే కామెడీ రోల్ చేశాడు. ఆ సినిమా ఆడకపోవడంతో మెహర్ యాక్టింగ్ వదిలేశాడు.ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అయితే ఒకానొక సందర్భంలో అనుకోకుండా 'ఆంధ్రావాలా' కన్నడ రీమేక్ 'వీర కన్నడిగ' తీసే అవకాశం వచ్చింది. అలా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అ తర్వాత 'ఒక్కడు' చిత్రాన్ని కన్నడలో 'అజయ్'గా రీమేక్ చేసి మరో హిట్ కొట్టాడు. ఇలా కన్నడ భాషలో సక్సెస్ అందుకున్న మెహర్ రమేశ్.. తెలుగులో మాత్రం అంతలా సక్సెస్ కాలేకపోయారు. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. దర్శకుడు భారతీరాజా కుమారుడు కన్నుమూత
కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ గుండెపోటుతో ఈ రోజు సాయంత్రం మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన మనోజ్‌కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 48 ఏళ్లు కాగా.. ఇటీవలే ఆయనకు గుండెకు శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది.కాగా.. మనోజ్ భారతిరాజా ప్రముఖ లెజెండరీ ఫిల్మ్ మేకర్ భారతిరాజా కుమారుడు. మనోజ్ తొలిసారిగా తాజ్ మహల్ (1999)మూవీలో నటించారు. ఆ తర్వాత అల్లి అర్జున (2002), కాదల్ పుక్కల్ (2001), అన్నక్కోడి, పల్లవన్, లాంటి తమిళ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. గత రెండేళ్లుగా దర్శకత్వం వైపు అడుగులు వేశారు. తన తండ్రి నిర్మించిన 2023 తమిళ చిత్రం మార్గజి తింగల్‌తో దర్శకుడిగా పరిచయమయ్యారు.మనోజ్ అరంగేట్రం చేయడానికి ముందు సినిమా పట్ల ఉన్న అభిరుచితో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. అంతకుముందు అతను సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో థియేటర్ ఆర్ట్స్ అభ్యసించారు. ఫైనల్ కట్ ఆఫ్ డైరెక్టర్ (2016) వంటి చిత్రానికి తన తండ్రికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే మనోజ్ తన స్నేహితురాలు, తమిళ నటి నందనను నవంబర్ 19న, 2006న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. -
YV సుబ్బారెడ్డి ఇంట విషాదం
-
ఆబిద్ అలీ అస్తమయం
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ ఆబిద్ అలీ (83) కన్నుమూశారు. సుదీర్ఘ కాలంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఆయన అక్కడే తుది శ్వాస విడిచారు. 1960వ, 1970వ దశకాల్లో భారత క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆబిద్ అలీ అంతర్జాతీయ కెరీర్ ఎనిమిదేళ్ల పాటు సాగింది. 1967–1975 మధ్య కాలంలో భారత్ తరఫున 29 టెస్టుల్లో ఆయన 20.36 సగటుతో 1018 పరుగులు చేశారు.ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మీడియం పేసర్ అయిన అలీ 42.12 సగటుతో 47 వికెట్లు కూడా పడగొట్టారు. ఆయన వన్డే కెరీర్ 5 మ్యాచ్‌లకే పరిమితమైంది. 5 వన్డేలు కలిపి ఆయన 93 పరుగులు చేయడంతోపాటు 7 వికెట్లు తీసుకున్నారు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆబిద్ అలీకి ఘనమైన రికార్డు ఉంది. ఏకంగా 212 మ్యాచ్‌లు ఆడిన ఆయన 8732 పరుగులు చేయడంతో పాటు 397 వికెట్లు తీశారు. రిటైర్మెంట్ తర్వాత ఆబిద్ అలీ కొన్నేళ్ల పాటు విరామం తీసుకున్నారు. ఆ తర్వాత కోచింగ్ వైపు మళ్లారు. ఆంధ్ర రంజీ టీమ్‌తో పాటు యూఏఈ, మాల్దీవ్స్ జట్లకు ఆబిద్ అలీ కోచ్‌గా వ్యవహరించి మంచి ఫలితాలు సాధించారు. అమెరికాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న తర్వాత అక్కడి నార్త్ అమెరికా క్రికెట్ లీగ్‌లో ఆటను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. చాలా విషాదకర వార్త. ఆబిద్ అలీ జట్టు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే దమ్మున్న క్రికెటర్. మిడిలార్డర్లో ఆడుతున్నప్పుడు కూడా జట్టు అవసరం కోసం ఓపెనింగ్‌కు కూడా సిద్ధమయ్యాడు. భారత స్పిన్నర్ల బౌలింగ్‌లో లెగ్ సైడ్‌లో అతను అందుకున్న చురుకైన క్యాచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. టెస్టుల్లో తొలి బంతికే అతను వికెట్ తీసిన రెండు సందర్భాలు నాకు గుర్తున్నాయి. నా తొలి టెస్టులో వికెట్ల మధ్య అతను చురుగ్గా పరుగెత్తిన తీరు ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడం నాకు బాగా గుర్తుంది. వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మనిషి. – సునీల్ గావస్కర్హైదరాబాదీ ఆల్‌రౌండర్‘ఆబిద్ అలీ తరహా ఆటకు వన్డే క్రికెట్ సరిగ్గా సరిపోయింది. ఈ ఫార్మాట్లో అతను అత్యుత్తమ ఆటగాడిగా నిలిచేవాడు. కానీ దురదృష్టవశాత్తూ 20 ఏళ్లు ముందుగా అతను పుట్టాడు’... ఆబిద్ అలీ గురించి, ఆయన ఆట గురించి బాగా తెలిసిన సన్నిహితులు చెప్పే మాట ఇది. స్ప్రింటర్లో ఉండే చురుకుదనం, మారథాన్ రన్నర్ తరహాలో శ్రమించే తత్వం, డెకాథ్లెట్ తరహాలో పట్టుదల ఆయనలో కనిపించేది. ఆటపరంగా చూస్తే మీడియం పేస్ బౌలింగ్, లోయర్ ఆర్డర్లో వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం, అద్భుత ఫీల్డింగ్‌తో ఒక వన్డే క్రికెటర్‌కు కావాల్సిన అన్ని అర్హతలు ఆబిద్లో ఉండేవి. వికెట్ల మధ్య పరుగెత్తే చురుకుదనం గురించి ప్రత్యేక ప్రశంస వినిపించేది. అవతలి ఎండ్‌లో ఆబిద్ ఉంటే సహచర బ్యాటర్ కూడా ఆయనతో పోటీ పడి పరుగెత్తలేక జాగ్రత్త పడేవాడు. సౌత్‌జోన్ తరఫున ఆడుతున్నప్పుడు దిగ్గజం గుండప్ప విశ్వనాథ్‌కు కూడా ఇదే అనుభవం ఎదురై రనౌట్ కావాల్సి వచ్చింది. అయితే ఆబిద్ వన్డే కెరీర్ వేర్వేరు కారణాలతో 5 మ్యాచ్‌లకే పరిమితమైంది. భారత జట్టు తొలి వన్డే మ్యాచ్ (1974 జూలై 13న, ఇంగ్లండ్‌తో లీడ్స్‌లో) ఆడిన జట్టులో భాగంగా ఉన్న ఆయన తొలి బంతిని బౌల్ చేసిన చిరస్మరణీయ ఘనతను సొంతం చేసుకున్నారు. తొలి వన్డే వరల్డ్‌కప్‌లో (1975) భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 బంతుల్లో 70 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచినా... అనూహ్యంగా అదే ఆఖరి వన్డే కూడా అయింది. ఇవన్నీ కూడా భారత జట్టుకు తొలి ఐదు వన్డేలే కావడం గమనార్హం. మరచిపోలేని ప్రదర్శనలు... 1971లో ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు తొలిసారి టెస్టు సిరీస్ నెగ్గింది. తొలి రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగియగా, ఓవల్‌లో జరిగిన చివరి టెస్టులో గెలిచి భారత్ సిరీస్ సొంతం చేసుకుంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో చివరి రోజు ‘విన్నింగ్ షాట్’ బౌండరీ కొట్టిన బ్యాటర్‌గా ఆబిద్ అలీ అందరికీ గుర్తుండిపోయారు. 1971లో వెస్టిండీస్‌పై పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారత్ గెలిచి ఆపై తొలిసారి సిరీస్ సొంతం చేసుకున్న చిరస్మరణీయ టెస్టులో వరుస బంతుల్లో రోహన్ కన్హాయ్, క్లయివ్ లాయిడ్లను అవుట్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అదే సిరీస్‌లో జార్జ్‌టౌన్ టెస్టులో చేసిన అజేయ అర్ధ సెంచరీ కూడా ఆయన బ్యాటింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఆడిన 29 టెస్టుల్లో 7 టెస్టుల్లో ఓపెనర్‌గా బ్యాటింగ్ చేయడంతో పాటు ఓపెనింగ్ బౌలర్‌గా కూడా ఆడిన ఘనత ఆబిద్ అలీ సొంతం. అరంగేట్రంలోనే సత్తా చాటి... హైదరాబాద్‌లో స్కూల్ క్రికెట్ ద్వారా వెలుగులోకి వచి్చన గత తరం క్రికెటర్లలో ఆబిద్ అలీ ఒకరు. స్కూల్ టోర్నీల్లో ప్రదర్శన ద్వారా హైదరాబాద్ జూనియర్ జట్టులోకి, ఆపై ఉద్యోగరీత్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తరఫున ప్రదర్శనతో హైదరాబాద్ సీనియర్ టీమ్‌లోకి ఆయన ఎంపిక అయ్యారు. దేశవాళీలో నిలకడైన ప్రదర్శన ఆబిద్ అలీకి భారత జట్టులో చోటు దక్కేలా చేసింది. 1967లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో టెస్టుతో ఆయన కెరీర్ మొదలైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ ప్రదర్శనతో ఆయన అరంగేట్రం చేశారు. ఇదే సిరీస్‌లో సిడ్నీ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో 78, 81 స్కోర్లతో టాప్ స్కోరర్‌గా తన ముద్ర వేస్తూ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటారు. ఆ తర్వాత వరుసగా ఏడేళ్ల పాటు ఆబిద్ కెరీర్ నిరాటంకంగా సాగింది. తన మీడియం పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఆబిద్‌కు అప్పటి పరిస్థితుల్లో పెద్దగా బౌలింగ్ చేసే అవకాశాలు రాలేదు. ప్రఖ్యాత భారత స్పిన్ చతుష్టయం శాసిస్తున్న ఆ రోజుల్లో మీడియం పేసర్లు ఆరంభంలో కొన్ని ఓవర్లు బౌలింగ్ వేసి బంతిని కాస్త పాతబడేలా చేయడమే ఉండేది. అక్కడితోనే వారి పని ముగిసేది. అయితే బ్యాటింగ్‌లో మాత్రం చాలా సందర్భాల్లో ఆబిద్ తన ముద్ర వేశారు. ముఖ్యంగా జట్టు అవసరాల కోసం 1 నుంచి 9 వరకు (నాలుగో స్థానం మినహా) అన్ని స్థానాల్లో ఆయన బ్యాటింగ్ చేశారు. -
బరువు తగ్గాలని ఆ డైటింగ్ : చివరికి ప్రాణమే పోయింది!
బరువు తగ్గాలనే ఆరాటంలో చాలా పొరబాట్లు చేస్తూ ఉంటారు కొంతమంది. శరీర తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. అసలు బరువు తగ్గడం అవసరమా? తగ్గితే ఎన్ని కిలోలు తగ్గాలి? ఎలాంటి డైట్ పాటించాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? అనేది నిర్ణయించుకోవడం అవసరం. ఇందుకు వైద్యుల సలహాలు, నిపుణుల సూచనలు చాలా ముఖ్యం. అలాకాకుండా బరువు పెరుగుతామనే భయంతో ఆన్లైన్లో చూసో, లేదా మరెవరో చెప్పారనో ఏ డైట్ బడితే అది ఫాలో కావడం అనర్థం. ఒక్కోసారి ఇది ప్రాణాలు కూడా పోవచ్చు. కేరళలో కన్నూరులో చోటు చేసుకున్న ఘటన ఇలాంటి ఆందోళనలనే రేకెత్తిస్తోంది. కొన్ని రకాల రుగ్మతల వల్ల కూడా భయం పెరిగిపోతామనే భయం పట్టుకుంటుందని మీకు తెలుసా? రండి తెలుసుకుందాం! కేరళలోని కన్నూర్‌కు చెందిన 18 ఏళ్ల అమ్మాయి తీవ్రమైన ఆహార నియంత్రణలు పాటించేది. యూట్యూబ్‌లో చూసి దాదాపు పూర్తిగా ఆహారాన్ని తీసుకోవడం మానేసింది. కేవలం నీటినే తీసుకునేది. చివరికి తీవ్రమైన దీర్ఘకాలిక ఆకలి కారణంగా ఏర్పడిన ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయింది. మృతురాల్ని కూతుపరంబ నివాసి శ్రీనందగా గుర్తించారు. తీవ్రమైన సమస్యలతో తలస్సేరిలోని ఒక ఆసుపత్రిలో చేరింది. వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉండి ప్రాణాలు కోల్పోయింది. ఆమె గతంలో కూడి ఇలాంటి సమస్యలతో కోజికోడ్ మెడికల్ కాలేజీలో చేరిందట. వైద్యుడు డాక్టర్ నాగేష్ ప్రభు ప్రకారం, శ్రీనంద అనోరెక్సియా నెర్వోసా అనే తినే రుగ్మతతో బాధపడుతోంది. దీని వలన రోగి బరువు పెరుగుతారనే భయం ఉంటుంది. ఆరు నెలల కింత నుంచి ఆకలితోనే ఉంటోందని ఆయన తెలిపారు. సోడియం , చక్కెర స్థాయిలు తీవ్రంగా పడిపోవడంతో చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఇలాంటి సమస్యలకు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాధి తీవ్రత గురించి తెలుసు కోవాలన్నారు. పశ్చిమ దేశాల్లో ఎక్కువగా కనిపించే అనోరెక్సియా నెర్వోసా కేరళలో కనిపించడం ఇది చాలా అరుదు అని కూడా ఆయన చెప్పారు. అనోరెక్సియా నెర్వోసా అంటే..?డా. నగేష్ అందించిన వివరాల ప్రకారం అనోరెక్సియానెర్వోసాతో బాధపడేవారిలో కాలక్రమేణా ఆకలి అనే అనుభూతిని కోల్పోతారు. దీనికి కారణాలపై స్పష్టత లేదు. అయితే మానసిక ఆరోగ్యం, జన్యు మార్పులు, పర్యావరణం వంటివి ఈ పరిస్థితికి కారణమవుతుంది. అన్ని వయసులు, జాతులు, శరీర రకాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది.మానసిక చికిత్సఅనోరెక్సియా నెర్వోసా ఒక మానసిక పరిస్థితి. దీని లక్షణాలను బట్టి మానసిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మందులు, పోషకాహార కౌన్సెలింగ్, వారానికి ఒకసారి మానసిక కౌన్సెలింగ్ తీసుకోవాలి. అవసరమైతే ఆసుపత్రిలో చేరాలి. సకాలంలో చికిత్స చేస్తే నయమవుతుంది. అయితే, ఇలాంటివి రుగ్మతలు రాత్రికి రాత్రే నయం కావు. కోలుకోవడానికి సమయం చాలా పట్టవచ్చు. వైద్యులను సలహాలను తప్పక పాటిస్తూ, క్రమం తప్పకుండా మందులు వాల్సి ఉంటుంది. -
సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం
ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం రాజకీయ నాయకురాలు అయిన జయప్రద ఇంట్లో విషాదం నెలకొంది. హైదరాబాద్ లో ఉంటున్న ఈమె సోదరుడు గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో జయప్రద సోదరుడి మరణం గురించి పంచుకున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)'నా అన్నయ్య శ్రీ రాజాబాబు మరణవార్తని మీకు తెలియజేస్తున్నందుకు బాధగా ఉంది. (ఫిబ్రవరి 27) మధ్యాహ్నం 3:26 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. దయచేసి ఆయన గురించి ప్రార్థించండి. మరిన్ని వివరాలు త్వరలో చెబుతాను' అని జయప్రద తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.జయప్రద విషయానికొస్తే 14 ఏళ్లకే నటిగా కెరీర్ ప్రారంభించారు. 1976 నుంచి 2005 వరకు దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించారు. మరోవైపు రాజకీయాల్లోనూ ఉన్నారు. 1994లో తొలుత తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ నాయకులతో గొడవల కారణంగా రెండేళ్లకే బయటకొచ్చి, సమాజ్ వాదీ పార్టీలో చేరారు. ప్రస్తుతానికైతే బీజేబీలో కొనసాగుతున్నారు. అలానే ప్రభాస్ 'ఫౌజీ'లోనూ ప్రస్తుతం నటిస్తున్నారు.(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు) View this post on Instagram A post shared by Jaya Prada (@jayapradaofficial) -
ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లో విషాదం, నెటిజనుల దిగ్భ్రాంతి
ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 'ఆజ్ మేరే హస్బెండ్ కే లంచ్ బాక్స్ మే క్యా హై' అంటూ పాపులర్ అయిన చటోరి రజనీ కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద వార్తను రజని దంపతులు ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో ఆమె ఫాలోవర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తమ 16 ఏళ్ల కుమారుడు తరణ్ జైన్ ఇకలేడని రజని జైన్, భర్త సంగీత్ జైన్ (ఫిబ్రవరి 18న) ఇన్‌స్టాలో ప్రకటించారు. 2008 ఆగస్టులో పుట్టిన తరణ్ 11వ తరగతి చదువుతున్నాడు. ట్యూషన్ నుండి తిరిగి వస్తున్నపుడు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ వార్త ఆమె అనుచరులను షాక్‌కు గురిచేసింది. అయ్యో, ఎంత విషాదం, నమ్మలేక పోతున్నాం, బీ బ్రేవ్ అంటూ పలువురు వీరికి ధైర్యం చెబుతున్నారు.ఇదీ చదవండి: దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!రజని జైన్ సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరు. అనేక శాకాహార వంటకాలతో అభిమానులను ఆమె ఖుషీ చేసేవారు. రజని ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్నారంటే ఆమెకున్న ఆదరణను అర్థం చేసుకోవచ్చు. భర్త , కొడుకు కోసం ఆమె రోజువారీ టిఫిన్ వంటకాల వీడియోలు 'ఆజ్ మేరే హస్బెండ్ కే లంచ్ బాక్స్ మే క్యా హై' అనే ట్యాగ్‌లైన్‌తో రెసిపీలను షేర్ చేస్తూ క్రమంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. సుషీ, వెజ్ రామెన్, సిజ్లర్స్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అనే ప్రసిద్ధ వంటకాలను ఆమె పరిచయం చేశారు. వీడియోలలో భర్త ,కొడుకు తరచుగా కనిపించడంతో వారు కూడా రజని అభిమానులకు బాగా పరిచయం. తరణ్ చివరిసారిగా ఈ నెల (ఫిబ్రవరి)5, న రజనీ రీల్లో కనిపించాడు.(మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం)ఆత్మహత్య ఊహాగానాలు, రజని జైన్ స్పష్టతతన మరణానికి కొన్ని గంటల ముందు, తరణ్ జైన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కష్టతరమైన చదువుల గురించి పోస్ట్‌ను పంచుకోవడం అనుమానాలకు తావిచ్చింది పంచుకున్నారు. "నేను 11వ తరగతి పాసవుతానా, లేదా చనిపోతానా" అని ఉంది. దీంతో తరణ్ది ఆత్మహత్య అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, తరణ్ చాలా మెరిట్స్టూడెంట్ అనీ, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని రజనీ వివరణ ఇచ్చారు. -
ప్రముఖ నిర్మాత–నటి–గాయని కృష్ణవేణి కన్నుమూత
తెలుగు సినిమా స్వర్ణయుగం నుండి ప్రపంచ స్థాయికి ఎదగడం వరకూ చూసిన నాటి తరం ప్రముఖ నిర్మాత–నటి–గాయని చిత్తజల్లు కృష్ణవేణి(Krishnaveni) (101) ఇక లేరు. పదిహేను రోజులుగా ఆమె హైదరాబాద్‌లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు.ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబరు 24న కృష్ణవేణి జన్మించారు. చిన్నతనంలోనే నాటకాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వేషాలు వేసి, బహుమతులు అందుకున్నారామె. కాగా ప్రముఖ దర్శక–నిర్మాత సి. పుల్లయ్య బాలనటీనటులతో ‘సతీ అనసూయ’ చిత్రానికి శ్రీకారం చుట్టిన సమయంలో రాజమండ్రిలో ‘తులాభారం’ నాటకం చూశారు. ఆ నాటకంలో కృష్ణవేణి నటన నచ్చి, ‘సతీ అనసూయ’కు అవకాశం ఇచ్చారు.అలా ‘సతీ అనసూయ’ (1936) సినిమాతో కృష్ణవేణి తొలిసారి వెండితెరపై కనిపించారు. బాల నటిగా కొన్ని చిత్రాల్లో నటించారు. సినిమాల్లో నటించడానికి మద్రాసు వెళ్లారామె. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు, పేరు దక్కాయి. కాగా ప్రముఖ నిర్మాత మీర్జాపురం రాజు (మేకా రంగయ్య) బేనర్లో ఆమె ‘జీవన జ్యోతి’ సినిమాలో మెయిన్ హీరోయిన్గా చేశారు.నటిగా కృష్ణవేణిని బాగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా అది. ఆ చిత్రం తర్వాత మీర్జాపురం రాజుతో ఆమె పెళ్లయింది. వారిది ప్రేమ వివాహం. ఆ తర్వాత జయా పిక్చర్స్‌పై తన భర్త తీసిన సినిమాలకు నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. అలా నిర్మాణరంగంవైపు వచ్చారామె. ఇక వివాహం తర్వాత జయా పిక్చర్స్‌ని శోభనాచల స్టూడియోస్‌గా మార్చారు. ఈ బేనర్ నిర్మించిన ‘దక్షయజ్ఞం (1941), గొల్లభామ (1947), లక్ష్మమ్మ (1950)’ వంటి చిత్రాల్లో మాత్రమే నటించారు కృష్ణవేణి.ఒకవైపు నటిస్తూనే ‘బాల మిత్రుల కథ, కీలు గుర్రం’ వంటి సినిమాల్లో పాటలు కూడా పాడారు. కాగా ‘తిరుగుబాటు’ సినిమాలో కృష్ణవేణి చేసిన వ్యాంప్ క్యారెక్టర్ అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక 1942లో మీర్జాపురం రాజా–కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనురాధ జన్మించారు. ఒకవైపు అనురాధ ఆలనా పాలనా, మరోవైపు సినిమాల నిర్మాణ పనులు చూసుకోవాల్సి రావడం... వంటి కారణాల చేత కృష్ణవేణి నటించడం తగ్గించారు.ఆమె హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రం ‘సాహసం’ (1952). అప్పట్లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్గా కృష్ణవేణికి పేరుంది. ‘ధర్మాంగద’ చిత్రానికి గాను ఆమె రూ. 45 వేలు పారితోషికం అందుకున్నారట. ఎన్టీఆర్‌ని పరిచయం చేసిన నిర్మాతగా... ‘మన దేశం’ చిత్రం ద్వారా ఎన్టీఆర్‌ని పరిచయం చేసిన నిర్మాతగా కృష్ణవేణి బాగా పాపులర్ అయ్యారు. పూర్తి స్థాయి నిర్మాతగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణవేణి నిర్మించిన ‘మన దేశం’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గానూ చేశారు. ఇదే చిత్రంతో గాయనిగా పి. లీలను పరిచయం చేశారు. అలాగే ‘వరూధిని’ చిత్రం తర్వాత, ఊరికి వెళ్లిపోయిన ఎస్వీ రంగారావును పిలిపించి, ‘మన దేశం’కు అవకాశం కల్పించారామె. అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావుకు పూర్తి స్థాయి సంగీతదర్శకునిగా తొలి అవకాశం కల్పించింది కూడా కృష్ణవేణియే కావడం మరో విశేషం. ‘దాంపత్యం’ (1957) నిర్మాతగా కృష్ణవేణికి ఆఖరి చిత్రం. నటిగా, నిర్మాతగా, గాయనిగా తనకంటూ ప్రత్యేక ప్రతిభను చాటుకున్నారామె. కృష్ణవేణి 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 2022లో ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. ఇక ఆమె కుమార్తె అనురాధ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించారు. కన్నడంలో ‘భక్త కుంభార’ (1974) నిర్మాతగా ఆమె తొలి చిత్రం.అదే సినిమాని తెలుగులో నాగేశ్వరరావు హీరోగా ‘చక్రధారి’గా రీమేక్ చేశారు. ‘రాముడే రావణుడైతే, శ్రీవారి ముచ్చట్లు, రాముడు కాదు కృష్ణుడు, అనుబంధం, ఆలయ దీపం, ఇల్లాలే దేవత’ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ , కన్నడ భాషల్లోనూ సినిమాలు నిర్మించారామె. తెలుగులో తీసిన ‘మా పెళ్లికి రండి’ నిర్మాతగా ఆమె చివరి చిత్రం. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్‌ని సొంతం చేసుకున్నారామె.కృష్ణవేణి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఫిల్మ్‌నగర్‌లోని ఆమె భౌతికకాయాన్ని సందర్శించిన సినీ ప్రముఖులు సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలను కొనియాడారు. ఆదివారం సాయంత్రం మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. కృష్ణవేణికి కూతురు అను రాధా దేవి, మనుమలు, మనవరాళ్లు ఉన్నారు. ఆమె చిన్న మనమరాలు అర్చన అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించారు.కృష్ణవేణి కాశీ మజిలీ కథలతో పాటు చాలా పుస్తకాలు చదివేవారు. వాటిలో సినిమా తీయడానికి పనికొస్తాయనిపించే పాయింట్స్ తీసుకుని, కథ తయారు చేయించేవారు. స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్ నుంచి షూటింగ్ షెడ్యూల్స్ ΄్లాన్ చేసి, షూటింగ్ స్పాట్లో ఉండటంవరకూ అన్నీ దగ్గరుండి చూసుకునేవారు కృష్ణవేణి.సినీ నిర్మాత, నటి, గాయని, రఘుపతి వెంకయ్య అవార్డుగ్రహీత కృష్ణవేణి మృతిపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అనేక భాషల్లో నటించి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొంది, నటిగా తనదైన ముద్ర వేసిన కృష్ణవేణి మృతి సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. పలు గొప్ప చిత్రాలు తీసి, నిండు నూరేళ్లు సంపూర్ణంగా జీవించి, పరమపదించిన ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడినిప్రార్థిస్తున్నానని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.‘‘అలనాటి నటీమణి, సినీ నిర్మాత కృష్ణవేణి మృతి నన్ను బాధించింది. పరిపూర్ణ జీవితం గడిపిన కృష్ణవేణిగారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడినిప్రార్ధిస్తున్నాను’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘‘మన దేశం’ చిత్రంతో ఎన్టీఆర్‌ను చిత్ర రంగానికి పరిచయం చేసి, కళారంగానికి వారు చేసిన సేవ మరువలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు. -
సీనియర్ నటి కృష్ణవేణి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
-
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజబాబు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: ద్వారకాతిరుమల మండలంలోని సీహెచ్ పోతేపల్లికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్‌రావు(రాజబాబు) మృతిపై ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు, సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. రాజబాబు మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా రాజబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.రాజబాబు శనివారం రాత్రి మృతి చెందారు. ఇటీవల బాత్రూమ్లో కాలుజారి పడిపోవడంతో ఆయన ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. కొద్దిరోజుల పాటు లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన, శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్యులు వారం రోజుల క్రితం ఆయన కాలికి శస్త్రచికిత్స చేశారు.ఈ నెల 12న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వాల్సి ఉండగా, అదే రోజు ఉదయం 11.30 గంటల సమయంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు వెంటిలేటర్ సాయంతో వైద్యం చేస్తూ వచ్చారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. రాజబాబు మృతి చెందడంతో మండలంలోని పార్టీ శ్రేణులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
తెలుగువారికి గొప్ప బహుమతిని అందించారు: మంచు విష్ణు
సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి మరణం పట్ల మా అధ్యక్షుడు మంచు విష్ణు సంతాపం తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు సినిమాలో ఒక చిరు దీపం వెలిగించిన లెజెండరీ కృష్ణవేణి.. నందమూరి తారక రామారావును బిగ్ స్క్రీన్‌కి పరిచయం చేసి మన ఇండస్ట్రీకి ఒక అమూల్యమైన బహుమతి ఇచ్చారు. ఆమె జ్ఞాపకాలు ఎప్పుడు మన హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోతాయన్నారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అని మంచు విష్ణు పోస్ట్ చేశారు.కాగా.. కృష్ణవేణి సినిమాల్లోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేశారు. 1936లో సతీఅనసూయ /ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేశారు. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో దాదాపు 15 చిత్రాలలో నటించారు. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించారు. కృష్ణవేణికి తెలుగు సినిమా నిర్మాత మీర్జాపురం రాజా మేకా రంగయ్యతో వివాహం జరిగింది. కేవలం నటిగానే కాదు.. తానే స్వయంగా అనేక సినిమాలు నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును,నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేశారు.ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. 1957లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది. తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషికి గానూ 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. ఆమె భర్త స్థాపించిన సంస్థ జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం ఆమె కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్ నిర్వహిస్తున్నారు.కృష్ణవేణి నిర్మించిన సినిమాలుమన దేశం (1949)లక్ష్మమ్మ (1950)దాంపత్యం (1957)గొల్లభామ (1947)భక్త ప్రహ్లాద (1042) Telugu cinema lo oka chiru deepam veliginchina Legendary Krishnaveni Garu kalasina tidhi 🙏. Aame parishrama tho Nandamuri Taraka Rama Rao Garu ni big screen ki introduce chesi, mana industry ki oka amulya mayina gift icharu. Aame gnapakalu eppudu mana hrudayallo undipothayi.… pic.twitter.com/dYYqz6nmxK— Vishnu Manchu (@iVishnuManchu) February 16, 2025 -
టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన నిర్మాత కన్నుమూత
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటి, నిర్మాత కృష్ణవేణి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు కాగా.. వయోభారంతో కన్నుమూశారు. కృష్ణవేణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు. ఆదివారం ఉదయమే తమ మాతృమూర్తి తుది శ్వాస విడిచినట్లు ఆమె కూమార్తె అనురాధ తెలిపారు.ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన కృష్ణవేణి1949 నవంబరు 24వ తేదీన మనదేశం చిత్రం విడుదలైంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ ఓ చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయన నటన విశ్వరూపంతో ఓ అసమాన చరిత్రను లిఖించాడు. రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న కృష్ణవేణి నందమూరి తారక రామారావును సినిమా రంగానికి పరిచయం చేశారు.కృష్ణవేణి సినీ ప్రస్థానం..శ్రీమతి కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 కృష్ణజిల్లాలోని పంగిడిగూడంలో డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు నటన అన్నా, నృత్యం అన్నా అభిమానంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. చిన్న వయసులోనే నాటకాలలో నటించటం మొదలుపెట్టారు. ఆమె నటనను చూసిన దర్శకుడు సి. పుల్లయ్య కృష్ణని బాలనటిగా ‘సతీ అనసూయ’ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తర్వాత బాల నటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించారు. కథానాయికగా నటిస్తున్న సమయంలోనే ఆమెకు మీర్జాపురం రాజా వారితో పరిచయమైంది. ఆ చిత్రం తర్వాత మళ్లీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు మృతి చెందడంతో అమ్మమ్మ, బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి. ఆ తర్వాత ‘తుకారాం’ (1937) సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత ‘మహానంద’ చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు.ఆ సమయంలోనే ప్రముఖ దర్శక–నిర్మాత, మీర్జాపురం రాజాతో (మేకా రంగయ్య) కృష్ణవేణి వివాహం 1940లో విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయటి సంస్థల్లో పని చేయడం ఇష్టం లేక సొంత ప్రోడక్షన్ జయా పిక్చర్స్–శోభనాచల స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించారామె. మీర్జాపురం రాజా నిర్మించిన తొలి సాంఘిక చిత్రం ‘జీవన జ్యోతి’లో (1940) హీరోయిన్గా చేశారు. ఆ చిత్రంతో సీహెచ్ నారాయణరావు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి. -
రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం
ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆయన తండ్రి రవీంద్రన్ నరసింహన్ మరణించారు. ఈ విషాద వార్తను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. కష్టపడి నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపిన నీ జ్ఞాపకాలు ఎప్పటికీ నాలో బతికే ఉంటాయి నాన్న అంటూ రాహుల్ రవీంద్రన్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు రాహుల్ తండ్రికి సంతాపం తెలియజేస్తున్నారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని రాహుల్ రవీంద్రన్‌కు అండగా నిలుస్తున్నారు.ఈ విషాద సమయంలో తాను దర్శకత్వం వహించిన చి.ల.సౌ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. 'చి లా సౌ చిత్రానికి నేను ఓ లైన్ రాశాను..అది ఇప్పుడు చాలా భిన్నంగా అనిపిస్తోంది.. నాన్న ఉన్నారులే.. అన్ని చూస్కుంటారు.. అనే మాటకి విలువ నాన్నను కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తుంది'.. నాకు ఈరోజు అర్థమైంది. నాన్న లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది.. మాటల్లో వివరించలేని భావాలను మనకు అందిస్తుంది.. థ్యాంక్యూ నాన్న.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా' అని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.కాగా..నటుడిగా మాత్రమే కాదు డైరెక్టర్‌గా రాహుల్ రవీంద్రన్ పలు చిత్రాలు తెరకెక్కించారు. తెలుగులో పలు సినిమాల్లోనూ నటించారు. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదను రాహుల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిన్మయి సైతం తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాలకు పనిచేశారు. View this post on Instagram A post shared by Rahul Ravindran (@rahulr_23) -
రామాలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ కన్నుమూత
అయోధ్య: యూపీలోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న 87 ఏళ్ల సత్యేంద్ర దాస్‌ను ఆదివారం లక్నోలోని ఎస్‌జీపీజీటీలో చేర్చారు. ఆయన డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. న్యూరాలజీ విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతూ సత్యేంద్ర దాస్ కన్నుమూశారు.1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన సమయంలో దాస్ రామాలయ పూజారిగా వ్యవహరించారు. ఆయన రామాలయంలో ఎక్కువ కాలం ప్రధాన పూజారిగా పనిశారు. దాస్ తన 20 వ ఏట ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నారు. అయోధ్యలో ఆయనకు ఎనలేని గౌరవ మర్యాదలు దక్కాయి. నిర్వాణి అఖాడాకు చెందిన దాస్ నిత్యం అయోధ్యలోనే ఉండేవారు. నాడు రామాలయంలో జరుగుతున్న పరిణామాలపై దేశవ్యాప్తంగా మీడియాకు దాస్ సమాచారం అందించేవారు. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత భారత రాజకీయాల దిశను మార్చివేసింది. మసీదు కూల్చివేత అనంతరం కూడా దాస్ ప్రధాన పూజారిగా కొనసాగారు.ఇది కూడా చదవండి: మస్క్‌కు మరింత పవర్ ఇచ్చిన ట్రంప్.. ఉద్యోగులే టార్గెట్ -
సీనియర్ నటి పుష్పలత కన్నుమూత
-
Aga Khan : ఆధ్యాత్మిక నేత, ప్రముఖ దాత ఆగా ఖాన్ కన్నుమూత
బిలియనీర్,ప్రపంచ ముస్లింల ఆధ్యాత్మిక గురువు, పద్మవిభూషణ్ ఆగాఖాన్ (88) (Aga Khan) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్ ఫౌండేషన్ ధృవీకరించింది. పోర్చుగల్‌లోని లిస్బన్లో తుదిశ్వాస విడిచారని ఆగాఖాన్ ఫౌండేషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆయన వారసుడిని త్వరలో ప్రకటిస్తామని చెప్పింది. ఆగాఖాన్మృతిపై విచారాన్ని ప్రకటించిన షౌండేషన్, ఆయన కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్మాయిలీ కమ్యూనిటీకి సంతాపం తెలిపింది. ప్రపంచంలోని వ్యక్తులంతా మతపరమైన భేదాలు లేకుండా ఆయన కోరుకున్నట్లుగా ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు తమ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని తెలిపింది.His Highness Prince Karim Al-Hussaini, Aga Khan IV, 49th hereditary Imam of the Shia Ismaili Muslims and direct descendant of the Prophet Muhammad (peace be upon him), passed away peacefully in Lisbon on 4 February 2025, aged 88, surrounded by his family. Prince Karim Aga Khan… pic.twitter.com/bxOyR0TyZr— Aga Khan Development Network (@akdn) February 4, 2025ఆగా ఖాన్‌కు హైదరాబాద్‌తో చారిత్రక సంబంధం కూడా ఉంది. అతని పూర్వీకులు ఈ ప్రాంతంలో వాణిజ్యం ,దాతృత్వం సేవలను అందించారు. ఆగా ఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ (AKDN) ద్వారా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో AKDN పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, వృత్తి శిక్షణా కేంద్రాలతో సహా అనేక విద్యా సంస్థలను స్థాపించింది. 1967లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్‌వర్క్‌ను స్థాపించారు. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వందిలాది ఆసుపత్రులు ,విద్యా, సాంస్కృతిక సంస్థలను అభివృద్ధి చేయడంతోపాటు అనేక ఇతర సేవా కార్యక్రమాలకు తన సంపదను వెచ్చించారు. ఈ సేవలకు గాను 2015లో దేశీయ అతిపెద్ద పౌరపురస్కారాలలో ఒకటైన పద్మ విభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దీన్ని అందుకున్నారు. ప్రిన్స్ కరీం అల్-హుస్సేనీ అగా ఖాన్ IV అని పిలుచుకునే ఆగా ఖాన్ స్విట్జర్లాండ్‌లో జన్మించారు. ప్రస్తుతం బ్రిటన్ పౌరుడిగా ఉన్నారు. 1957లో తన 20 ఏండ్ల వయస్సులో ఇస్మాయిలీ ముస్లింల 49వ వంశపారంపర్య ఇమామ్‌గా నియమితులయ్యారు. వారసత్వంగా వస్తున్న గుర్రపు పెంపకంతోపాటు అనేక ఇతర వ్యాపారాల్లో రాణించారు. యూకే, ఫ్రాన్స్, ఐర్లాండ్ వంటి దేశాల్లో నిర్వహించే గుర్రాల రేసుల్లో ఆయన పాల్గొన్నారు. షేర్గర్ జాతికి చెందిన గుర్రంతో రేసుల్లో పాల్గొనేవారు. 1969లో బేగం సమ్లిమా అగా ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. తరువాత 1998లో బేగం ఇనారా అగా ఖాన్‌ను రెండో వివాహం చేసుకున్నారు ఆగాఖాన్ ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆగాఖాన్ మృతిపట్ల కింగ్ చార్లెస్ 3 సంతాపం ప్రకటించారు. -
సీనియర్ నటి పుష్పలత కన్నుమూత
సీనియర్ నటి పుష్పలత(Pushpalatha)(87) చెన్నైలో కన్నుమూశారు. టి. నగర్‌లోని తిరుమల పిళ్ళై రోడ్డులో నివాసం ఉంటున్న ఆమె వృద్ధాప్యం కారణంగా మంగళవారం రాత్రి 9 గంటల ్రపాంతంలో కన్నుమూశారు. తమిళనాడు కోయంబత్తూర్‌లోని మేటుపాలయానికి చెందిన ఈమె, తొమ్మిదవ ఏటనే భరతనాట్యంలో శిక్షణ పొందారు.నటుడు ఎస్సే నటరాజ్ దర్శకత్వం వహించి, నిర్మించిన ‘నల్ల తంగై’(1955) అనే తమిళ చిత్రం ద్వారా నటిగా ఆరంగేట్రం చేసిన పుష్పలత.. ‘కొంగు నాట్టు తంగం’ (1962) సినిమాతో కథానాయకగా పరిచయమయ్యారు. ఆ తర్వాత హీరోయిన్గా, ఆర్టిస్టుగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. తమిళంలో శారద, పార్ మగళే పార్, నానుమ్ ఒరు పెన్ సంతానం, కర్పూరం, జీవనాంశం, దర్శనం, కళ్యాణ రామన్, సకల కళావల్లభన్, సిమ్లా స్పెషల్’ వంటి పలు విజయవంతమైన చిత్రాలు చేశారు.ఎంజీఆర్, శివాజీ గణేషన్, ఏఎం రాజా వంటి ప్రముఖ నటులతో కలిసి నటించారు. ఎన్టీఆర్ హీరోగా కోవెలమూడి భాస్కర్ రావ్ దర్శకత్వంలో రూపొందిన ‘చెరపకురా.. చెడేవు!’ అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యారు పుష్పలత. ఆ తర్వాత ‘ఆడబిడ్డ, మా ఊరిలో మహాశివుడు, వేటగాడు, ఆటగాడు, ఘరానా దొంగ, రక్త బంధం, శూలం, కొండవీటి సింహం, ఇద్దరు కొడుకులు, ప్రతిజ్ఞ, మూగవాని పగ, ఉక్కుమనిషి, రంగూన్ రౌడీ, విక్రమ్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులనూ అలరించారామె.అదేవిధంగా కన్నడలో ‘జీవనజ్యోతి, ఉలవే బాదుడు, ఎరడు కనసు’, మలయాళంలో ‘నర్స్’, హిందీలో ‘మై భీ లడకీ హూ’ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే కొన్ని వాణిజ్య ప్రకటనలు కూడా చేశారు పుష్పలత. కాగా తమిళంలో ఏవీఎం రాజన్‌కు జంటగా ‘నానుమ్ ఒరు పెన్’ అనే చిత్రంలో నటించారామె. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడంతో 1964లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిలో ఒకరు నటి మహాలక్ష్మి. ఆమె తమిళ, తెలుగు చిత్రాల్లో నటించారు. – సాక్షి సినిమా, చెన్నై -
జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతి
సాక్షి, జగిత్యాల జిల్లా: గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రైం రికార్డ్స్ బ్యూరో ఎస్ఐ శ్వేత మృతి చెందారు. కారులో ధర్మారం వైపు నుంచి జగిత్యాల వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. చిల్వాకోడూర్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఆమె కారు ఢీకొట్టింది. ఆ తర్వాత చెట్టును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఎస్ఐ.. ఘటనా స్థలంలోనే మృతిచెందారు.కారు, బైక్‌ను ఢీకొనడంతో ఎస్ఐతో పాటు, బైక్‌పై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ముత్యంపేట వాసిగా పోలీసులు గుర్తించారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ముత్యంపేట వాసిగా గుర్తించారు. ఎస్ఐ శ్వేత గతంలో వెల్గటూరు, కథలాపూర్, కోరుట్ల, పెగడపల్లిలో ఎస్ఐగా పనిచేశారు. -
గుజరాత్ అల్లర్లపై న్యాయ పోరాటం చేసిన జకియా జాఫ్రి కన్నుమూత
అహ్మదాబాద్: 2002 గుజరాత్ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహ్సాన్ జాఫ్రి భార్య జకియా జాఫ్రి(86) శనివారం చనిపోయారు. ‘అమ్మ అహ్మదాబాద్‌లోని ఆమె సోదరి ఇంట్లో ఉన్నారు. ఎప్పటిలాగానే శనివారం ఉదయం కూడా కుటుంబసభ్యులతో గడిపారు. అసౌకర్యం అనిపిస్తోందని చెప్పడంతో డాక్టర్‌ను పిలిచాం. ఆయన వచ్చే సరికే చనిపోయారు. అప్పుడు సమయం 11.30 గంటలు’అని జాఫ్రి కుమారుడు తన్వీర్ తెలిపారు. అయోధ్య నుంచి కరసేవకులతో వస్తున్న రైలుకు అహ్మదాబాద్‌లో దుండగులు నిప్పుపెట్టడంతో 59 మంది కరసేవకులు చనిపోవడం మరునాడే అహ్మదాబాద్‌లోని గుల్బర్గా సొసైటీ కాలనీపై జరిగిన దాడిలో ఎహ్సాన్ జాఫ్రి సహా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర కలహాలకు దారి తీశాయి. ఈ ఘటనల వెనుక భారీ రాజకీయ కుట్ర దాగి ఉందంటూ అనంతరం జకియా జాఫ్రి సుప్రీంకోర్టు గడప తొక్కారు. న్యాయం పోరాటం చేపట్టి, దేశం దృష్టిని ఆకర్షించారు. అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ తదితరులపై చార్జిషీటు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసు బలగాలు చాలినంతగా లేరనే విషయం తెలిసి కూడా ఆయన ప్రభుత్వం సైన్యాన్ని మోహరించడంలో ఆలస్యం చేసిందని వాదించారు. ఆమె వాదనను గుజరాత్ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె ఆరోపణలపై విచారణకు సుప్రీం ఆదేశాలతో 2008లో సిట్ ఏర్పాటైంది. 2012లో సిట్ నివేదిక ఇవ్వడంతో సుప్రీంకోర్టు కేసును మూసివేసింది. మోదీ, మరో 62 మందికి క్లీన్చిట్ ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఆమె తిరిగి మెట్రోపాలిటన్ కోర్టుకు, తర్వాత గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు. ఫలితం దక్కలేదంటూ చివరికి మళ్లీ సుప్రీంకోర్టుకు వచ్చారు. చివరికి, జకియా జాఫ్రి వాదనల్లో పస లేదంటూ సుప్రీంకోర్టు 2022లో ఆమె అర్జీని కొట్టివేసింది. జకియా జాఫ్రి మరణంపై సామాజిక కార్యకర్త తీస్తా షెతల్వాడ్ స్పందించారు. దూరదృష్టి కలిగిన మానవతావాదిగా జకియా జాఫ్రిని అభివరి్ణంచారు. -
ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ ఇంట విషాదం
ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్(Gopi Sundar ) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి లివి సురేశ్ బాబు(65)( Livi Suresh Babu)కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె గురువారం కేరళలోని కూర్కెన్చెరిలోని తన అపార్టుమెంట్లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా గోపీ సుందరే సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. తల్లి మరణ వార్తను తెలియజేస్తూ.. ‘అమ్మ.. నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమను ఇచ్చావు. నా కలలను నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చావు. నేను క్రియేట్ చేసే ప్రతీ సంగీతం స్వరంలో నువ్వు నాపై చూపించిన ప్రేమే ఉంటుంది. నువ్వు వెళ్లిపోలేదు. నా మనసులో, మెలోడీస్‌లో, నేను వేసే ప్రతీ అడుగులో ఉన్నావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కానీ నువ్వు నాతోనే ఉంటూ నన్ను చూస్తున్నావని నాకు తెలుసు. నువ్వు ఎప్పటికీ నా బలానివి. నాకు దారి చూపించే వెలుగువి’అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వడూకరా క్రిమేటోరియం వద్ద గోపీ సుందర్ తల్లి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.మలయాళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్మలయాళం టాప్ సంగీత దర్శకుల్లో గోపి సుందర్ ఒకరు. మెలోడీస్కి కేరాఫ్ ఆయన. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ హోటల్’ తో సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో మలయాళ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నచ్చి మన టాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేశారు. ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘18 పేజెస్’, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, ఊపిరి, మజిలీ, నిన్నుకోరి తదితర బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన సంగీతం అందించాడు. View this post on Instagram A post shared by Gopi Sundar Official (@gopisundar__official) -
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మలయాళ దర్శకుడైన షఫీ(56)కి ఈనెల 16న హార్ట్ స్ట్రోక్ రావడంతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాదాపు పది రోజుల చికిత్స పొందుతూ కోలుకోలేక ఇవాళ మృతి చెందారు. ఆయన మరణం పట్ల ప్రముఖ హీరోలు పృథ్వీరాజ్ సుకుమారన్, చియాన్ విక్రమ్ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ప్రియమైన స్నేహితుడిని కోల్పోయినందుకు బాధగా ఉందని చియాన్ విక్రమ్ ట్విటర్ వేదిక విచారం వ్యక్తం చేశారు. డైరెక్టర్ షఫీలో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.విక్రమ్ ట్విటర్లో రాస్తూ "ఈ రోజు ఒక ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను. అంతాకాదు ఈ ప్రపంచం ఒక అద్భుతమైన దర్శకుడిని కోల్పోయింది. నాకు తెలిసిన అత్యంత సున్నితమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. జీవితంలోని క్షణాలలో అందాన్ని చూడగల వ్యక్తి. అతను మన మధ్య లేకపోవచ్చు.. కానీ అతనితో ఉన్న క్షణాలు ఎల్లప్పుడూ గుర్తుకొస్తాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడి పార్థిస్తున్నా. నిన్ను మిస్సవుతున్నా కానీ ఎప్పటికీ మర్చిపోలేము " అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. డైరెక్టర్ మృతి పట్ల హీరో విష్ణు ఉన్నికృష్ణన్ నివాళులర్పించారు.కాగా.. షఫీ అసలు రషీద్ కాగా.. సినిమాల్లోకి వచ్చాక షఫీ పేరుతోనే ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా కామెడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. 2001లో వన్ మ్యాన్ షో మూవీతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో 10 కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. మలయాళంలో పులివాల్ కళ్యాణం, తొమ్మనుమ్ మక్కలుమ్, మాయావి, మరికొండొరు కుంజాడు లాంటి చిత్రాలను తెరకెక్కించారు. చివరిసారిగా 2022లో వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆనందం పరమానందం’ దర్శకుడిగా వ్యవహరించారు. Today, I lost a dear friend and the world lost an incredible storyteller. He was one of the most fun loving & sensitive souls I’ve ever known, someone who could see the beauty in life’s simplest moments.He may no longer walk among us, but he will always live in the laughter,… pic.twitter.com/HS8xytCvPi— Vikram (@chiyaan) January 26, 2025 -
మాజీ సీఎం KCR ఇంట్లో విషాదం
-
టాటూ కోసం వెళ్లి..వ్యాపారవేత్త, పాపులర్ ఇన్ఫ్లూయెన్సర్ మృతి
గుండెపోటుతో సంభవిస్తున్న హఠాన్మారణాలు ఆందోళన రేపుతున్నాయి. దీనికి సంబంధించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. బాగా ఫిట్‌గా ఉన్నామను కున్నవారు కూడా ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయితాజాగా బ్రెజిలియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకస్మిక మరణం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. అదీ వీపుమీద టాటూ వేయించుకుంటూ ఉండగా ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. వివరాలు ఏంటంటే..45 ఏళ్ల బ్రెజిలియన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రికార్డో గొడోయ్ టాటూ వేసుకుంటూ ఉండగా కుప్పకూలిపోయాడు. వీపు మొత్తంవీపు టాటూ వేయించుకోవాలని భావించిన గొడోయ్ బ్రెజిల్‌లోని శాంటా కాటరినాలోని టాటూ స్టూడియోకు వచ్చాడు. ఈ ప్రక్రియ కోసం మత్తు (జనరల్ అనస్థీషియా) ఇచ్చిన కొద్దిసేపటికే అతను గుండెపోటుకు గురయ్యాడు. దీంతో హుటాహుటిన కార్డియాలజిస్ట్‌తో సహా వైద్య సిబ్బంది అతడిని బతికించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రయత్నాలు విఫలమై అదే రోజు మధ్యాహ్నం గొడోయ్ మరణించాడు. ఈ విషయాన్ని స్టూడియో యజమాని గొడోయ్ ఇన్‌స్టా పేజ్ ధృవీకరించింది. జనవరి 20న ఈ విషాదం చోటు చేసుకుంది.ఎవరీ గొడోయ్ ప్రీమియం గ్రూప్ సీఈవో రికార్డో గొడోయ్ లగ్జరీ కార్ల వాడకంలో పేరుగాంచాడు. వ్యాపారవేత్తగా, లగ్జరీ కార్లు , హై-ఎండ్ జీవనశైలితో బాగా పాపులర్ అయ్యాడు. లగ్జరీ కార్ల గురించి ఆకర్షణీయమైన పోస్ట్‌లతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేవాడు. సోషల్ మీడియాలో 225,000 మందికి పైగా అభిమానులను సంపాదించుకున్నాడు. లగ్జరీ ఆటోమొబైల్ పరిశ్రమ గురించి ఆకర్షణీయమైన కంటెంట్‌ను అందిస్తూ గొడోయ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో కనెక్ట్ అయ్యాడు.టాటా వేయించుకున్నాక త్వరలోనే మిమ్మల్ని పలకరిస్తా అంటూ తన అనుచరులకు హామీ ఇచ్చిన గొడోయ్ గుండెపోటుతో మరణించడంతో ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేశారు. టాటూ స్టూడియో యజమాని సైతం సంతాపం ప్రకటించాడు. గొడోయ్ను "గొప్ప స్నేహితుడు"గా అభివర్ణించాడు. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. View this post on Instagram A post shared by RICARDO GODOI (@ricardo.godoi.oficial) -
ప్రముఖ నిర్మాత మృతి.. సుధా కొంగర ఎమోషనల్ నోట్
ప్రముఖ కోలీవుడ్ చిత్ర నిర్మాత మనో అక్కినేని కన్నుమూశారు. రెండు రోజుల క్రితమే ఆమె చెన్నైలో మరణించారు. ఫేమస్ డైరెక్టర్ సుధా కొంగర తొలి చిత్రానికి మనో నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుడా అజిత్ కుమార్ చిత్రం కిరీడం, మాధవన నటించిన 13బీ సినిమాలకు నిర్మాతగా పనిచేశారు. ఈ సందర్భంగా సుధా కొంగర ఆమెకు నివాళులర్పించారు. ఆమెతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.సుధా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా తొలి చిత్ర నిర్మాత, నా ప్రాణ స్నేహితురాలు మనో అక్కినేనికి ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ భూమిపై మీరెలా జీవించారో.. అక్కడ కూడా ప్రకాశిస్తారని నమ్ముతున్నా. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. మీరు నా మొదటి సినిమాకు పనిచేయడం ఎప్పటికీ గుర్తుంటుంది. నీతో కలిసి తీసిన ద్రోహి చిత్రాన్ని అంకితమిస్తున్నా. ఎందుకంటే సినిమాలను ఎక్కువగా ఇష్టపడే వారిలో ఒకరిగా నువ్వు నా ప్రతి కదలికను గమనిస్తావని నాకు తెలుసు' అని పోస్ట్ చేశారు. కాగా.. 2008లో సల్మాన్ ఖాన్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. A long journey through life and cinema.Miss you Mano... pic.twitter.com/pQ1iTuhwHv— Sudha Kongara (@Sudha_Kongara) January 21, 2025 View this post on Instagram A post shared by Sudha Kongara (@sudha_kongara) -
టాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి
-
రాజకీయ కురువృద్ధుడు పాలవలస కన్నుమూత
వీరఘట్టం/పాలకొండ: రాజకీయ కురువృద్ధుడు, మాజీ ఎమ్మెల్యే, రాజ్యసభ మాజీ సభ్యుడు, శ్రీకాకుళం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖరం (81) సోమవారం రాత్రి 7.30 గంటలకు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన స్వగృహం పాలకొండలో శ్వాసకు సంబంధించి సమస్య ఎదురుకావడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని జెమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.దివంగత సీఎం వైఎస్సార్‌తో అప్పట్లో నేరుగా మాట్లాడే వ్యక్తి పాలవలస. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీ కాగా, ఆయన కుమార్తె రెడ్డి శాంతి పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. సతీమణి పాలవలస ఇందుమతి రేగిడి జెడ్పీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. వైఎస్ జగన్ పరామర్శ రాజశేఖరం మృతి విషయాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే జగన్...రాజశేఖరం కుమారుడు పాలవలస విక్రాంత్‌ను, కుమార్తె రెడ్డి శాంతిని ఫోన్లో పరామర్శించారు. రాజశేఖరం మృతికి సంతాపం తెలిపారు. -
ఎమ్మెల్యే గురుప్రీత్ గోగిని కాల్చి చంపిన దుండగులు
-
వైఎస్ కుటుంబంలో విషాద ఛాయలు
-
వైఎస్ అభిషేక్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ నేత వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాసేపటి క్రితం మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.అభిషేక్‌రెడ్డి పార్థివదేహాన్ని హైదరాబాద్ నుంచి పులివెందులకు తరలిస్తున్నారు. రేపు(శనివారం) ఉదయం అభిషేక్‌రెడ్డికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. -
సాఫ్ట్వేర్ దంపతుల ఆత్మహత్య
పటాన్చెరు టౌన్: కుటుంబ కలహాలతో సాఫ్ట్వేర్ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంగారెడ్డి జిల్లా మియాపూర్‌కు చెందిన సందీప్ (36)కు ఆరేళ్ల కిందట మంచిర్యాలకు చెందిన కీర్తి (34)తో వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ మియాపూర్‌లో ఉండేవారు. 9 నెలల కిందట అమీన్పూర్ పరిధిలోని బంధంకొమ్ము శ్రీదామ్ హిల్స్‌లో సొంతిల్లు కొనుగోలు చేసి కూతురు గగనహిత(3), కుమారుడు సాకేత్‌రామ్ (ఏడాదిన్నర)తో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. సోమవారం పాప గగనహిత పుట్టినరోజు ఉంది.వేడుక జరిపే విషయంలో 5వ తేదీ (ఆదివారం) ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సందీప్ ఇద్దరు పిల్లల్ని తీసుకొని తల్లిగారింటికి మియాపూర్ వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కీర్తి తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఒక్కడే ఇంటికొచ్చిన సందీప్‌కు కీర్తి ఉరేసుకొని కనిపించింది. వెంటనే అతడి తండ్రికి ఫోన్లో కీర్తి ఉరేసుకుందని విషయం చెప్పాడు. సందీప్ తల్లిదండ్రులు అక్కడికి వచ్చేలోపు అతడు కూడా తాడుతో ఉరేసుకున్నాడు. కీర్తి తండ్రి ప్రభాకర్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమీన్పూర్ సీఐ నాగరాజుతోపాటు ఎస్ఐ సోమేశ్వరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తమ్ముడూ.. అమ్మ జాగ్రత్త!
భూపాలపల్లి రూరల్: ‘తమ్ముడూ.. అమ్మ జాగ్రత్త.. అమ్మను బాగా చూసుకో.. అమ్మకు, నీకు తోడుగా, అండగా ఉండాల్సిన సమయంలో మీకు అన్యాయం చేసి తిరిగిరాని లోకానికి వెళ్తున్నా.. నన్ను క్షమించండి’.. అంటూ ఓ యువరైతు సెల్ఫీ వీడియో తీసి, లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నందిగామ గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు, మృతుని బంధువుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన నీలాల శేఖర్ (29)తండ్రి రాజయ్య 15 ఏళ్ల క్రితం చనిపోయాడు.తల్లి వెంకటమ్మ, తమ్ముడు సిద్ధూతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది పంట దిగుబడి సరిగ్గా లేక, పెట్టుబడి కూడా రాలేదు. రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. వీటిని ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన శేఖర్.. నాలుగు రోజుల క్రితం పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం అతన్ని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతున్న శేఖర్ ఆదివారం చనిపోయాడు. కాగా, తాను కచ్చితంగా చనిపోతానని భావించిన శేఖర్.. ముందే తీసిన సెల్ఫీ వీడియోలో అప్పుల బాధతోనే పురుగు మందు తాగినట్లు స్పష్టం చేశాడు. అంతకుముందే ఆయన రాసి పెట్టుకున్న లేఖ కూడా బయటికి వచ్చింది. లేఖ, సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
టేబుల్ స్పేస్ సీఈవో అమిత్ బెనర్జీ కన్నుమూత
వర్క్‌స్పేస్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ‘టేబుల్ స్పేస్’ వ్యవస్థాపకుడు, చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అమిత్ బెనర్జీ కన్నుమూశారు. ఈ మేరకు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. గుండెపోటుతో ఆయన చనిపోయాడంటూ కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నప్పటికీ అమిత్ బెనర్జీ మరణానికి తక్షణ కారణం ఇంకా తెలియలేదు.“మా వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో అయిన అమిత్ బెనర్జీ మరణించినట్లు ప్రకటించడం చాలా విచారకరం. భారతదేశంలో ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ సొల్యూషన్ పరిశ్రమను మార్చిన దార్శనికుడైన నాయకుడు అమిత్. ఆయన నాయకత్వంలో టేబుల్ స్పేస్ ఈస్థాయికి చేరింది” అని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు.కంపెనీ, దాని వ్యక్తులు మరియు పరిశ్రమపై అతని ప్రభావం శాశ్వతంగా ఉంటుంది మరియు అతని కుటుంబం, స్నేహితులు మరియు భాగస్వాములచే అతను తీవ్రంగా మిస్ అవుతాడు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము.అమిత్ బెనర్జీ గురించి..దాదాపు 44 ఏళ్ల వయస్సు ఉన్న అమిత్ బెనర్జీ, 2017 సెప్టెంబర్‌లో టేబుల్ స్పేస్‌ను స్థాపించారు. వర్క్ స్పేస్ కోసం చూస్తున్న పెద్ద, మధ్య-మార్కెట్ అద్దెదారులకు ఇది మేనేజ్డ్ వర్క్‌స్పేస్ ప్రొవైడర్‌గా అందుబాటులోకి వచ్చింది.పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో 2002లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన అమిత్ బెనర్జీ 2004 జనవరిలో ఐటీ మేజర్ యాక్సెంచర్‌లో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ సంస్థలో 13 సంవత్సరాలు పనిచేసిన ఆయన రియల్ ఎస్టేట్ వ్యూహం, ప్రణాళిక, సముపార్జనలు, డీల్ స్ట్రక్చరింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్‌కు బాధ్యత వహించారు.వృత్తిపరమైన అనుభవం అతన్ని రియల్ ఎస్టేట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది టేబుల్ స్పేస్‌ను ప్రారంభించడంలో సహాయపడింది. అమిత్ బెనర్జీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. బెనర్జీ సెజ్ డీల్ స్ట్రక్చరింగ్‌లో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఆయన సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌లో ఆవిష్కరణలతో పేటెంట్ హోల్డర్ కూడా.టేబుల్ స్పేస్ గురించి..గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ హిల్‌హౌస్ క్యాపిటల్ మద్దతుతో ఉన్న టేబుల్ స్పేస్, 2025లో ఐపీఓకి వెళ్లాలని చూస్తున్న అనేక స్టార్టప్‌లలో ఒకటి. రూ. 3,500 కోట్ల కంటే ఎక్కువ నిధుల సమీకరణపై దృష్టి సారించింది. సుమారు 2.5 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.టేబుల్ స్పేస్ వెబ్సైట్ ప్రకారం.. సంస్థ నిర్వహించే వర్క్‌స్పేస్‌లలో మార్కెట్ లీడర్‌గా ఉంది. ప్రధానంగా గూగుల్ (Google), యాపిల్ (Apple), డెల్ (Dell) వంటి ఫార్చూన్ (Fortune) 500 కంపెనీలతో కలిసి పని చేస్తుంది. పెద్ద స్థలాలను లీజుకు ఇవ్వడం, వాటిని ఆధునీకరించడమే కాకుండా వాణిజ్య రియల్ ఎస్టేట్‌ను సొంతం చేసుకోవడానికి జాయింట్ వెంచర్ల కోసం కంపెనీ భారతీయ రియల్టర్లతో కూడా జతకట్టింది.వరుస విషాదాలుస్టార్టప్ కమ్యూనిటీలో ఇటీవల ప్రముఖుల మరణాలు విషాదాన్ని నింపుతున్నాయి. రెండు వారాల క్రితం, ప్రఖ్యాత యోగర్ట్ బ్రాండ్ ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ డిసెంబర్ 21న 41 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ గుడ్ క్యాపిటల్ సహ వ్యవస్థాపకుడు రోహన్ మల్హోత్రా అక్టోబర్ 1న మరణించారు. పెప్పర్ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి ఆగస్టులో లేహ్‌లో బైకింగ్ ట్రిప్‌లో గుండెపోటుతో మరణించారు. -
విషాదం.. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి..!
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రాజమండ్రిలో శనివారం జరిగిన గేమ్ రేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తూ ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠ గుర్తించారు.ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మరణంతో రెండు కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయాయి.భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రితో కలిపి పళ్ల వ్యాపారం చేస్తున్న చరణ్ మృతితో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఇప్పటివరకు బాధిత కుటుంబాలను సినీ ప్రముఖులు కానీ, అధికారులు కానీ పరామర్శించలేదని తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాల సభ్యులు వేడుకుంటున్నారు. -
116 ఏళ్ల మహిళ ఇక లేరు
టోక్యో: ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన జపాన్ బామ్మ టొమికో ఇటూకా 116 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. హ్యోగో ప్రిఫెక్చర్‌లోని ఆషియా నగరంలోని వృద్ధాశ్రయంలో డిసెంబర్ 29వ తేదీన ఆమె తుదిశ్వాస విడిచారని జపాన్ ప్రభుత్వ వృద్ధుల వ్యవహారాల పర్యవేక్షణ విభాగం అధికారి యోషిట్సుగు నగటా చెప్పారు. అరటి పండ్లు, జపాన్ పానీయం కల్పిస్ను అమితంగా ఇష్టపడే ఇటూకా 1908 మే 23వ తేదీన ఒసాకాలో జన్మించారు.హైసూ్కల్లో చదువుకునేటప్పుడు వాలీబాల్ ప్లేయర్. సుమారు 3,067 మీటర్ల ఎత్తున్న ఒంటాకె పర్వతాన్ని రెండుసార్లు అధిరోహించారు. ఆమెకు 20 ఏళ్లప్పుడు పెళ్లయింది. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కలిగారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భర్త సారథ్యంలోని దుస్తుల ఫ్యాక్టరీని నడిపారు. భర్త 1979లో చనిపోయినప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఇటూకాకు ఒక కుమార్తె, ఒక కుమారుడు, ఐదుగురు మనవలు ఉన్నారు. కాగా, గతేడాది ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు 117 ఏళ్ల మరియా బ్రన్యాస్ మరణించడంతో ఆమె స్థానంలో ఇటూకాను అత్యంత ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా గెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్ ప్రకటించారు. తాజాగా ఇటూకా కన్నుమూయడంతో ఆమె కంటే 16 రోజులు మాత్రమే చిన్నదైన బ్రెజిల్‌కు చెందిన సన్యాసిని ఇనాహ్ కనబర్రోను ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పరిగణిస్తామని గెరంటాలజీ రీసెర్చ్ గ్రూప్ తెలిపింది. -
ఏకంగా 174 కిలోల బరువు తగ్గాడు, చివరకు..
మనిషి కాస్త లావుగా ఉంటే.. బాడీ షేమింగ్ చేస్తూ హేళన చేసే సమాజం ఇది. అయితే తమ కొవ్వును కరిగించుకుని.. తమలాంటి మరెందరో భారీకాయులకు స్ఫూర్తిని కలిగించిన వాళ్లు మన చుట్టూరానే కనిపిస్తుంటారు. వాళ్లలో గాబ్రియల్ ఫెయిటస్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఆ జర్నీ ఇప్పుడు అర్థాంతరంగా ముగిసింది.ఈ లడ్డూ బాబు(Laddu Babu) ఏకంగా 174 కేజీల బరువు తగ్గి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. బ్రెజిల్‌కు చెందిన గాబ్రియల్ ఫెయిటస్. ఓ టీవీ షో ద్వారా అతని వెయిట్‌లాస్ జర్నీ పాపులర్ అయ్యింది. బరువు తగ్గాలనుకువాళ్లెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ‘‘హాయ్.. నాపేరు గాబ్రియల్(Gabrial). వయసు 29 ఏళ్లు. ఒకప్పుడు నేను 320 కేజీల బరువు ఉండేవాడిని. ఎలాంటి సర్జరీలు లేకుండా, మందులు వాడకుండా బరువు తగ్గేందుకు నేను ప్రయత్నించా. ఆ ప్రయాణం మీరు చూడడండి..’’ అంటూ ఎనిమిదేళ్ల కిందట అతను పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది. 2017లో ‘ప్రోగ్రామ డు గుగు’లో విరౌ ఔట్రా పెస్సావో(మరో వ్యక్తిగా మారడం) సెగ్మెంట్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడితను. అంతేకాదు.. బరువు తగ్గాలనుకునే ఎందరికో అతని పాఠాలు స్ఫూర్తిగా నిలిచాయి కూడా. View this post on Instagram A post shared by Gabriel Freitas (MUP) (@mupgabriel)అయితే ఆ తర్వాత ఆ ఫేమ్ ఎంతో కాలం నిలవలేదు. తండ్రిని, సోదరుడిని కోల్పోయాక మానసికంగా కుంగిపోయాడు. ఆ బాధలో లడ్డూ బాబు మునుపటి అంతలా కాకపోయినా కాస్త బరువు పెరిగాడు. చివరకు డిసెంబర్ 30వ తేదీన నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడని అతని స్నేహితుడు ప్రకటించారు. ‘‘మా వాడి మనసు బంగారం. ఎందరికో వాడి ప్రయాణం ఇన్స్పిరేషన్. అలాంటోడు ఏ నొప్పి లేకుండా ప్రశాంతంగా నిద్రలోనే కన్నుమూశాడు’’ అని చెబుతున్నాడను. VIDEO CREDITS: Headline Stream -
శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత
-
దిగ్గజ శాస్త్రవేత్త చిదంబరం కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, భారత అణ్వస్త్ర పరీక్షల్లో కీలక భూమిక పోషించిన శాస్త్రజ్ఞుడు డాక్టర్ రాజగోపాల చిదంబరం తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3.20 గంటలకు ముంబైలోని జస్లోక్ ఆస్పత్రిలో కన్నుమూశారని అణు శక్తి మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 88 ఏళ్ల చిదంబరం 1974లో, 1998లో భారత్ చేపట్టిన అణు పరీక్షల్లో ప్రధాన పాత్ర పోషించారు. చిదంబరం మృతి వార్త తెల్సి ప్రధాని మోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు. ‘‘భారత అణు కార్యక్రమ పితామహుల్లో ఒకరైన చిదంబరం దేశ శాస్త్రసాంకేతికత, వ్యూహాత్మక శక్తిసామర్థ్యాల మెరుగు కోసం అవిశ్రాంతంగా కృషిచేశారు. ఆయన చేసిన సేవలను యావత్ భారతావని, భవిష్యత్ తరాలు చిరకాలం గుర్తుంచుకుంటాయి’’అని మోదీ అన్నారు. భారత ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహదారుగా 17 సంవత్సరాలపాటు కీలక సేవలు అందించారని శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ స్మరించుకున్నారు. ఆయన అసాధారణ శాస్త్రీయ మేథస్సు భారతదేశానికి ఎంతో సాయపడిందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు. అణు భౌతిక శాస్త్రంలో కృషి 1936 నవంబర్ 12నలో తమిళనాడులోని చెన్నైలో జన్మించిన చిదంబరం మీరట్‌లోని సనాతన్ ధర్మ్ పాఠశాలలో, చెన్నైలోని మైలాపూర్ స్కూల్లో చదువుకున్నారు. తర్వాత చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. బెంగళూరులో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పీజీ చదివారు. అణుకార్యక్రమాల్లో పాల్గొంటూనే దాదాపు 60 సంవత్సరాలపాటు ప్రభుత్వంలో వేర్వేరు హోదాల్లో పనిచేసే అరుదైన వ్యక్తి చిదంబరం. 1962లో బాబా అణు పరిశోధనా కేంద్రం(బార్క్)లో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఆ తర్వాత 1990లో బార్క్‌కు ఛైర్మన్ అయ్యారు. 1990–1993వరకు ఛైర్మన్‌గా ఉన్నారు. 1993–2000 కాలంలో కేంద్ర అణుఇంధన మంత్రితి్వశాఖకు కార్యదర్శిగా కొనసాగారు. 2001–2018 కాలంలో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా ఉన్నారు. అంతర్జాతీయ అణుఇంధన సంస్థ(ఐఏఈఏ) గవర్నర్ల బోర్డ్‌కు 1994–95కాలంలో ఛైర్మన్‌గా సేవలందించారు. సొంతంగా ప్లుటోనియం తీసుకొచ్చి.. 1967 నుంచి భారత అణుపరీక్షలకు సంబంధించి ప్రాజెక్టుల్లో పనిచేయడం మొదలెట్టారు. 1974లో భారత్ తొలిసారిగా ఆపరేషన్ స్మైలింగ్ బుద్ద పేరిట అణుపరీక్షలు చేపట్టింది. ఆ మిషన్‌లో అణుశాస్త్రవేత్తగా కీలక భూమిక పోషించారు. ముంబై నుంచి ఫ్లుటోనియంను ఈయనే స్వయంగా రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌కు తీసుకొచ్చారు. 1998లో ఆపరేషన్ శక్తిపేరిట పోఖ్రాన్–2 అణుపరీక్షల సమయంలోనూ చిదంబరం న్యూక్లియర్ ఎనర్జీ బృందానికి సారథ్యం వహించారు. నాటి రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) చైర్మన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్తో కలిసి పోఖ్రాన్ అణుపరీక్షను స్వయంగా పర్యవేక్షించారు. ఆనాడు 1998 మే 11 నుంచి మే 13వ తేదీ వరకు ఐదుసార్లు అణుపరీక్షలు జరిగాయి. దేశం కోసం అవిశ్రాంతంగా కృషిచేసినందుకు గుర్తింపుగా ఆయనకు భారత ప్రభుత్వం 1975లో పద్మ శ్రీతో, 1999లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది. దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లనూ పొందారు. జాతీయ, అంతర్జాతీయ సైన్స్ అకాడమీల్లో సభ్యునిగా ఉన్నారు. ఎందరో యువ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ఈయన స్ఫూర్తిదాతగా నిలిచారు. చిదంబరంకు భార్య చెల్లా, కుమార్తెలు నిర్మల, నిత్య ఉన్నారు. Deeply saddened by the demise of Dr. Rajagopala Chidambaram. He was one of the key architects of India’s nuclear programme and made ground-breaking contributions in strengthening India’s scientific and strategic capabilities. He will be remembered with gratitude by the whole…— Narendra Modi (@narendramodi) January 4, 2025 -
టాలీవుడ్లో విషాదం.. క్యాన్సర్‌తో పోరాడుతూ డైరెక్టర్ కన్నుమూత
టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది(54) మృతి చెందారు. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో ఉంటున్న ఆమె గురువారం కన్నుమూశారు. క్యాన్సర్ చికిత్స కోసం యూఎస్ వెళ్లిన అపర్ణ కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్తతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అపర్ణ మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది(54) నటి, రచయితగా రాణించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ది అనుశ్రీ ఎక్స్పెరిమెంట్స్ అనే సినిమాతో ఆమె సినీ కెరీర్ ప్రారంభించారు. పోష్ పోరిస్ అనే వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితమే పెళ్లికూతురు పార్టీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. -
న్యూ ఇయర్ వేళ విషాదం : భారత సంతతి వైద్యుడు దుర్మరణం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) దేశంలో దుబాయ్ ఎమిరేట్, రాస్ అల్ ఖైమాలో జరిగిన చిన్న ప్రైవేట్ విమాన ప్రమాదంలో 26 ఏళ్ల భారత సంతతికి వైద్యుడు సులేమాన్ అల్ మాజిద్ దుర్మరణం పాలయ్యారు. యూఏఈలోని రస్ అల్ ఖైమా తీరంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని పైలట్, కోపైలట్ ఇద్దరూ చనిపోయారని యుఎఇ ప్రభుత్వ విభాగమైన జెనెరల్ సివిల్ ఏమియేషన్ అథారటీ ధృవీకరిస్తూ ప్రకటన జారీ చేసింది.చనిపోయిన ఇద్దరిలో 26 ఏళ్ల పాకిస్థానీ మహిళ కాగా మరొకరు సులేమాన్ అల్ మాజిద్. ఇతను విమానంలో కోపైలట్‌గా ఉన్నాడు. సులేమాన్ దుబాయ్‌లోనే పుట్టి పెరిగాడు. విమానాన్ని అద్దెకు తీసుకున్నట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. బెంగుళూరుకి చెందిన ఇతని కుటుంబం యూఏఈ దేశానికి వలస వెళ్లింది. యూకే దేశంలోని డుర్హాం కౌంటీ, డార్లింగ్టన్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్‌లో ఫెలో డాక్టర్‌గా ఉద్యోగం చేసేవాడు. బిట్రీష్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడిగా, హానరరీ సెక్రటరీ, నార్తరన్ రెసిడెంట్ డాక్టర్స్ కమిటీలో కో-చైర్మన్ పదవులు చేపట్టాడు. అలాగే యూకేలో డాక్టర్‌గా ఉన్న సమయంలోజూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్ల వేతనం పెంచాలని ఉద్యమం చేసినట్టు సోషల్‌మీడియా ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది.సులేమాన్ తన కుటుంబంతో కలిసి కొత్త సంవత్సరాన్ని సరదాగా కొంత సమయం గడిపాడు. ఆ తరువాత తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి ఒక ప్రైవేట్ ఏమియేషన్ క్లబ్ కు వెళ్లాడు. అక్కడ ముందుగా సులేమాన్ సరదాగా గాల్లో విహరించేందుకు క్లబ్ విమానంలో వెళ్లాడు. పైలట్ ఒక పాకిస్తానీ మహిళ ఉన్నారు. అయితే వీరి విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే కాంటాక్ట్ మిస్ అయింది. కోవ్ రొటానా హోటల్ సమీపంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. తీవ్ర గాయాలైన ఇద్దరినీ ఆస్పత్రి తరలించారు. కానీ ఇద్దరూ చనిపోయారు. సులేమాన్ అకాల మరణంపై తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకుతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో ఉన్నాం. త్వరలోనే అతడికి పెళ్లి కూడా చేయాలనుకున్నాం. కానీ ఇంతలోనే అతను మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. తమకు సర్వస్యం అయిన సులేమాన్ లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. -
బాలకృష్ణ వ్యక్తిగత జ్యోతిష్యుడు ‘కొఠారు’ మృతి
నల్లజర్ల: నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడు తున్న సింగరాజు పాలెం సిద్ధాంతి కొఠారు సత్యనారాయణ చౌదరి (75) బుధవారం హైదరాబాదు అపో లో ఆసుపత్రిలో మృతి చెందారు. ఊపిరితి త్తుల ఇన్పెక్షన్తో పాటు బీపీ తగ్గిపోవడంతో ఆయన కోలుకోలేకపోయారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి సింగరాజు పాలెం తీసుకువస్తున్నారు. గురువారం అంత్యక్రియలు జరుగుతాయని సమీప బంధు వులు తెలిపారు. సినీనటుడు బాలకృష్ణకు వ్యక్తి గత జ్యోతిష్యుడిగా చాలాకాలం పనిచేశారు. 2004 జూన్ 3వ తేదీన నటుడు బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనలో నిర్మాత బెల్లంకొండ సురేశ్‌తో పాటు సత్యనారాయణ చౌదరి కూడా గాయపడ్డారు. డాక్టర్లు రెండు బుల్లెట్లు తొలగించగా ఇప్పటికీ ఆయన శరీరంలో ఒక బుల్లెట్ ఉంది. అప్పట్లో ఈ ఉదంతం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, క్రీడా, సినీనటులు తమ సమస్యలపై తరుచూ సత్యనారాయణ చౌదరిని సంప్రదిస్తూ ఉండేవారు. సత్యనారాయణ చౌదరికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
మందలించారని ఉరేసుకున్నారు
యైటింక్లయిన్‌కాలనీ (రామగుండం)/ గోదావరిఖని: అర్ధరాత్రి బయటకు వెళ్లొద్దని తండ్రి మందలించడంతో ఒకరు, పద్ధతి మార్చుకోవాలని తల్లి హెచ్చరించడంతో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీ సమీప పోతనకాలనీలో ఉంటూ, ఏఎల్పీ గనిలో ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికుడు కొండిల్ల శ్రీనివాస్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు సాయి అవినాష్ (20) డిప్లొమా చదువుతూ వార్షిక పరీక్షల్లో ఫెయిలయ్యాడు.అతడి కోరిక మేరకు తండ్రి మంచిర్యాలలోని ప్రభుత్వ ఐటీఐలో చదివిస్తున్నాడు. ఈనెల 29న ఇంటికి వచ్చిన అవినాష్.. ఆదివారం రాత్రి బయటకు వెళ్తానని, బైక్ కావాలని తండ్రిని అడిగాడు, రాత్రి సమయంలో బయటకు వెళ్లద్దని, బైక్ ఇవ్వనని తండ్రి చెప్పడంతో కలత చెందిన అవినాష్.. తెల్లవారు జామున ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మరో ఘటనలో తల్లిమందలించిందన్న మనస్థాపంతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీకి చెందిన ముక్క రోహక్(16) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. రోహక్ మార్కండేయ కాలనీలో నివాసం ఉంటూ ఎస్టీపీసీలోని సచ్దేవ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి సరిగ్గా వెళ్లడంలేదు. కనీసం ప్రీ ఫైనల్ పరీక్షలు కూడా రాయలేదు. ఎప్పుడూ బయట తిరుగుతూ ఇంటికి వచ్చేవాడు కాదు. ఆదివారం కూడా బయటకు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఇలా చేస్తే కెరీర్ పాడవుతుందని, పద్ధతి మార్చుకోవాలని తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన రోహక్ పెంట్‌హౌస్ ఇనుపరాడ్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. -
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్టర్ మృతి
-
జిమ్మీ కార్టర్ అస్తమయం
వాషింగ్టన్: అమెరికా 39వ అధ్యక్షుడు, డెమొక్రటిక్ నేత జిమ్మీ కార్టర్ ఇక లేరు. ఇటీవలే 100వ పుట్టిన రోజు జరుపుకున్న ఆయన జార్జియా రాష్ట్రంలో ప్లెయిన్స్‌లోని తన నివాసంలో ఆదివారం ప్రశాంతంగా కన్నుమూశారు. అమెరికా అధ్యక్షుల్లో అత్యధిక కాలం జీవించిన రికార్డు ఆయనదే. 1977–81 మధ్య అధ్యక్షునిగా చేసిన కార్టర్ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు దేశాధినేతలు కార్టర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన నాయకత్వ పటిమ తిరుగులేనిదని బైడెన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గొప్ప వ్యక్తిత్వానికి, సానుకూల దృక్పథానికి కార్టర్ ప్రతిరూపమని కొనియాడారు. కార్టర్ అంత్యక్రియలను జనవరి 9న పూర్తి అధికార లాంఛనాలతో జరపనున్నట్టు ప్రకటించారు. రాజకీయంగా, సైద్ధాంతికంగా కార్టర్‌తో తాను తీవ్రంగా విభేదించినా ఆయన నిష్కళంక దేశభక్తుడన్నది నిస్సందేహమని ట్రంప్ పేర్కొన్నారు. కార్టర్ అంత్యక్రియలు స్వగ్రామంలో ఆయనకెంతో ఇష్టమైన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే జరిగే అవకాశముంది. రైతు బిడ్డ జిమ్మీ కార్టర్‌గా ప్రసిద్ధుడైన జేమ్స్ ఎర్ల్ కార్టర్ జూనియర్ ఓ నికార్సైన రైతు బిడ్డ. 1924 అక్టోబర్ 1న జార్జియాలోని ప్లెయిన్స్ అనే చిన్న పట్టణంలో జని్మంచారు. ఆయన తండ్రి కార్టర్ సీనియర్ ఓ రైతు. తల్లి లిలియన్ నర్సు. 1943లో అమెరికా నావల్ అకాడమీలో క్యాడెట్‌గా ఆయన కెరీర్ మొదలైంది. దీర్ఘకాలం పాటు విధులు నిర్వర్తించడమే గాక ప్రతిష్టాత్మక అణు జలాంతర్గామి కార్యక్రమానికి ఎంపికయ్యారు. 1962లో తొలిసారి సెనేటర్‌గా ఎన్నికయ్యారు. 1970లో జార్జియా గవర్నర్ అయ్యారు. 1974లోనే అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ రాజీనామాకు దారితీసిన వాటర్‌గేట్ కుంభకోణం నుంచి అమెరికా అప్పటికింకా బయట పడనే లేదు. 1977 ఎన్నికల్లో నెగ్గి అమెరికా అధ్యక్షుడయ్యారు. 1979లో ఈజిప్టు, ఇజ్రాయెల్ మధ్య చరిత్రాత్మక శాంతి ఒప్పందంలో కీలకపాత్రధారిగా నిలిచారు. చైనాతో అమెరికా దౌత్య సంబంధాలకు తెర తీసిన అధ్యక్షునిగా నిలిచిపోయారు. మానవ హక్కులే మూలసూత్రంగా అమెరికా విదేశాంగ విధానాన్ని పునరి్నర్వచించారు. అయితే అఫ్గానిస్తాన్‌పై సోవియట్ యూనియన్ ఆక్రమణను అడ్డుకోలేకపోయారు. ఇరాన్ బందీల సంక్షోభమూ కార్టర్ చరిత్రపై ఓ మచ్చగా మిగిలింది. డజన్ల కొద్దీ అమెరికన్లను ఇరాన్ తిరుగుబాటు విద్యార్థులు బందీలుగా చేసుకోవడం స్వదేశంలో ఆయన ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. 1980 ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి రొనాల్డ్ రీగన్ చేతిలో ఓటమి చవిచూశారు. అలా వైట్‌హౌస్‌ను వీడినా కార్టర్ ప్రజాసేన మాత్రం నిరి్నరోధంగా కొనసాగింది. అమెరికా ప్రభుత్వం తరఫున ఉత్తర కొరియాకు శాంతి స్థాపన బృందాన్ని తీసుకెళ్లారు. అంతర్జాతీయంగా శాంతి స్థాపనకు చేసిన నిరి్వరామంగా కృషికి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. కార్టర్‌కు ముగ్గురు పిల్లలున్నారు. ఆయన భార్య రోసలిన్ ఏడాది క్రితమే మరణించారు. When I look at Jimmy Carter, I see a man not only for our times, but for all times. A man who embodied the most fundamental human values we can never let slip away.And while we may never see his likes again, we would all do well to try to be a little more like Jimmy Carter. pic.twitter.com/I0xDM05xmH— President Biden (@POTUS) December 30, 2024భారత్‌తో అనుబంధం కార్టర్‌కు భారత్‌తో మంచి అనుబంధముంది. ఆయన తల్లి లిలియన్ పీస్ కార్ప్స్ బృందంలో భాగంగా 1960ల చివర్లో భారత్‌లో హెల్త్ వలంటీర్‌గా పని చేశారు. దాంతో కార్టర్ భారత్‌కు సహజ మిత్రునిగా పేరుబడ్డారు. మన దేశంలో పర్యటించిన మూడో అమెరికా అధ్యక్షునిగా నిలిచారు. 1977లో కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఎమర్జెన్సీని ఎత్తేసిన మరుసటేడాది కార్టర్ భార్యాసమేతంగా భారత్‌కు వచ్చారు. ఆ సందర్భంగా భారత పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నియంతృత్వ పాలనను స్పష్టంగా వ్యతిరేకించారు. ద్వైపాక్షిక సంబంధాలను ఎంతగానో మెరుగుపరిచినదిగా ఆ పర్యటన చిరస్థాయిగా నిలిచిపోయింది. కార్టర్ దంపతులు ఢిల్లీ సమీపంలోని ఓ గ్రామాన్ని సందర్శించడం అందరినీ ఆకర్షించింది. -
హెచ్‌బీవో ఫౌండర్ చార్లెస్ డోలన్ కన్నుమూత
కేబుల్ టీవీ దిగ్గజం, హెచ్‌బీవో (HBO) టీవీ చానెల్ వ్యవస్థాపకుడు చార్లెస్ డోలన్ (Charles Dolan) కన్నుమూశారు. 98 ఏళ్ల వయసులో ఆయన సహజ కారణాలతో శనివారం (డిసెంబర్ 28) తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ధ్రువీకరించినట్లుగా స్థానిక న్యూస్ పోర్టల్ న్యూస్‌డే పేర్కొంది.చార్లెస్ డోలన్ 1972లో హెచ్‌బీవోని స్థాపించారు. తర్వాత ఏడాదిలోనే దేశంలోని అతిపెద్ద కేబుల్ ఆపరేటర్లలో ఒకటైన కేబుల్విజన్ని సృష్టించారు. దీన్ని 2017లో ఆల్టిస్కి 17.7 బిలియన్ డాలర్లకు విక్రయించారు. 1986లో ఆయన కేబుల్‌విజన్ న్యూస్ 12 లాంగ్ ఐలాండ్‌ను ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించారు. యూఎస్‌లో ఇది తొలి 24 గంటల ప్రాంతీయ కేబుల్ న్యూస్ ఛానెల్. తర్వాత ఇది న్యూయార్క్ ప్రాంతంలో స్థానిక వార్తా ఛానెల్‌ల న్యూస్ 12 నెట్‌వర్క్‌ల సమూహానికి దారితీసింది. కేబుల్‌విజన్ నుండి ప్రత్యేక పబ్లిక్ కంపెనీగా విడిపోయిన ఏఎంసీ నెట్వర్క్స్ డైరెక్టర్ల బోర్డు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న చార్లెస్ డోలన్ 2020లో ఆ పదవి నుంచి వైదొలిగారు.డోలన్ భార్య కూడా కొన్ని నెలల క్రితమే మరణించారు. వీరికి ఆరుగురు సంతానం ఉన్నారు. వీరిలో పాట్రిక్ డోలన్ న్యూస్‌డే సంస్థను నడిపిస్తున్నారు. మరో కుమారుడు జేమ్స్ డోలన్ భార్య క్రిస్టిన్ డోలన్ ఏఎంసీ నెట్వర్క్స్ సీఈవోగా ఉన్నారు.దూసుకుపోతున్న క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ (Bitcoin) మూలాలపై హెచ్‌బీవో ఇటీవల ఓ సంచలనాత్మక డాక్యుమెంటరీ చిత్రీకరించింది. వాటిని తొలిసారి చేసిన వ్యక్తిగా ఇప్పటివరకు సతోషి నకమోటో పేరు చాలామందికి తెలుసు. కానీ కెనడాకు చెందిన పీటర్ టోడ్డ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ తొలిసారి బిట్‌కాయిన్ తయారుచేశాడంటూ ‘మనీ ఎలక్ట్రిక్: బిట్‌కాయిన్ మిస్టరీ’ పేరిట 100 నిమిషాల నిడివితో నిర్మించిన ఈ చిత్రాన్ని విడుదల చేసింది. -
ఆర్థిక సంస్కర్తకు అశ్రు నివాళి
సాక్షి, న్యూఢిల్లీ: దివికేగిన ఆర్థిక సంస్కర్త మన్మో హన్ సింగ్‌కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధా నమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తదితర ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం చుట్టిన మన్మోహన్ పార్థివదేహాన్ని ఢిల్లీలోని ఆయన నివాసమైన 3, మోతిలాల్ నెహ్రూ రోడ్డుకు తరలించారు. నివాళులర్పించడానికి శుక్రవారం పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో నాయకులు, కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి మన్మోహన్ అందించిన సేవలను స్మరించుకున్నారు. మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన భార్య గురుశరణ్ కౌర్‌ను ఓదార్చారు. ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జె.పి.నడ్డాతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాందీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు మన్మోహన్ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఢిల్లీ సీఎం అతిశీ, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కూడా నివాళులర్పించారు. నేడు నిగమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు దివంగత మాజీ ప్రధాని అంత్యక్రియలు శనివారం ఉదయం జరుగుతాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ చెప్పారు. మన్మోహన్ పారి్థవదేహాన్ని ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తామని, ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రజలు సందర్శించవచ్చని తెలిపారు. 9.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. శనివారం ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్ శ్మశాన వాటికలో మన్మోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలియజేసింది. పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖకు సూచించినట్లు పేర్కొంది. కేంద్ర మంత్రివర్గం సంతాపం మన్మోహన్ మృతి పట్ల కేంద్ర మంత్రివర్గం సంతాపం ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేబినెట్ శుక్రవారం సమావేశమైంది. మన్మోహన్ ఆత్మశాంతి కోసం తొలుత రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ప్రభుత్వంతోపాటు యావత్తు దేశం తరఫున సంతాపం తెలియజేశారు. అనంతరం సంతాప తీర్మానం ఆమోదించారు. మహోన్నత రాజనీతిజు్ఞడు, ఆర్థికవేత్త, గొప్ప నాయకుడిని దేశం కోల్పోయిందని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా ఆయన మనందరిపై బలమైన ముద్ర వేశారని కొనియాడారు. మన్మోహన్ గౌరవార్థం ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. సీడబ్ల్యూసీలో సంతాప తీర్మానం ఆమోదం మన్మోహన్ సింగ్‌కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నివాళులర్పించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యా లయంలో భేటీ అయ్యింది. సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ హాజరయ్యారు. మన్మోహన్‌కు సంతాపం ప్రకటిస్తూ ఒక తీర్మా నం ఆమోదించారు. భారత రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో అగ్రగణ్యుడు మన్మోహన్ అని కొనియాడారు. ఆయన కృషితో ప్రపంచస్థాయిలో మన దేశానికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభించాయని పేర్కొన్నారు. దేశంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన మన్మోహన్ చిరస్మరణీయులని ఉద్ఘాటించారు. ప్రజల తలరాతలు మార్చేలా ఎన్నో విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని ప్రశంసించారు. ఢిల్లీలో స్మారక చిహ్నం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు దేశ రాజధాని ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమాచారాన్ని కాంగ్రెస్‌కు కూడా అందించినట్లు శుక్రవారం ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఇందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు కొంత సమయం పడుతుందని తెలిపాయి. అయినప్పటికీ ఈ అంశంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించాయి.అదే సంప్రదాయం పాటించాలి: ఖర్గే ఢిల్లీలో మన్మోహన్ సింగ్‌కు స్మారకం నిర్మించడానికి వీలైన చోటేఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి రెండు పేజీల లేఖ రాశారు. మన మాజీ ప్రధానమంత్రులకు, రాజనీతిజు్ఞలకు అంత్యక్రియలు జరిగిన చోటే స్మారకం నిర్మించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి మన్మోహన్ అందించిన విశిష్టమైన సేవలను ఖర్గే తన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతకముందు ఆయన ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. మన్మోహన్ స్మారక నిర్మాణంపై చర్చించారు. మన్మోహన్ శాశ్వత విశ్రాంతి తీసుకొనే ప్రదేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని, అదొక పవిత్రమైన స్థలంగా ఉండాలని పేర్కొన్నారు. -
శోకసంద్రంలో మన్మోహన్ భార్య గురుశరణ్ : ఆ ప్రేమ గుర్తు ఇంకా ఆమెతోనే!
భారత మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ (RIP Manmohan Singh) అస్తమయంతో యావద్దేశం దిగ్బ్రాంతికి లోనైంది. ఆర్థికమంత్రి, ప్రధానమంత్రి, ఇలా పలు హోదాల్లో దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అనేకమంది రాజకీయ నేతలు, ఆర్థికవేత్తలు నివాళులర్పిస్తున్నారు.సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన భారత్ ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ పేరొందారు. పదేళ్ల పాటు మన్మోహస్ సింగ్ భారత దేశ ప్రధానిగా పనిచేసినప్పటికీ.. ఆయన కుటుంబం గురించి ప్రజలకు అంతగా తెలియదనే చెప్పాలి. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కుమార్తెలు వారి సంబంధిత రంగాలలో విశేషమైన విజయాలు సాధించారు.92 ఏళ్ల వయసులో ఆయన ఆకస్మిక మరణం ప్రధానంగా ఆయన భార్య గురు శరణ్ కౌర్‌కి తీరని లోటు. ప్రశాంతమైన,గాంభీర్యంగా ఉండే ఆయన ప్రవర్తనతో మనందరికీ తెలిసిన వ్యక్తి అయితే, ఆయన వెనుకున్న నిజమైన శక్తి అతని భార్య గురుశరణ్ కౌర్. ఆయన వెన్నంటే వుంటూ, ఆయన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర ఆమెదే. పదవిలో 2019లో, మన్మోహన్ సింగ్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినపుడు ఆమె భర్తను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆయన ఆరోగ్యం కోసం గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. అంతేకాదు మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉన్న సమయంలోమన్మోహన్ సింగ్ భోజనాన్ని స్వయంగా తయారు చేసి ప్యాక్ చేసి పంపేవారట. Wow !! So beautifully rendered this soulful Kirtan by Mrs.Gursharan Kaur, w/o Dr. Manmohan Singh ( former Prime Minister of India) pic.twitter.com/0HPVtxfzA0— Indu Kumari (@InduKumari1) November 5, 2023డా. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ (GursharanKaur) ఎవరు?మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ 1937, సెప్టెంబర్ 13; జలంధర్‌లో జన్మించారు. యాదృచ్చింగా మన్మోహన్ కూడా సెప్టెంబరు (1932, సెప్టెంబర్26) లోనే పుట్టారు. తండ్రి, సర్దార్ చత్తర్ సింగ్ కోహ్లీ, బర్మా-షెల్‌లో ఇంజనీర్. ఏడుగురు తోబుట్టువులలో ఈమె చిన్నది. 1958లో మన్మోహన్ సింగ్ , గురుశరణ్ కౌర్ వివాహం జరిగింది. మన్మోహన్ సింగ్ భార్య 2009లో ఫ్యాషన్ మ్యాగజీన్ వోగ్లో దర్శనమిచ్చారు. G-20 సమ్మిట్ సందర్భంగా ఏకైక ప్రథమ మహిళ. తన జట్టుకు రంగు వేసుకోకుండా, సహజత్వాన్ని మోసుకెళ్లిన మహిళగా వోగ్ ఆమెను గౌరవించింది. కౌర్ మంచి గాయని కూడా జలంధర్ రేడియోలో కూడా ఆమె కీర్తలను పాడారు. మన్మోహన్ సింగ్ లాగానే, గురుశరణ్ కౌర్ కూడా మృదుస్వభావి.చెక్కు చెదరని మారుతిగురుశరణ్ కౌర్ మన్మోహన్ సింగ్‌తో నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. పెళ్లి అయిన కొత్తలో తమ వివాహబంధానికి గుర్తుగా కొనుక్కున్న మారుతి-800ని ఇప్పటికీ ఆమె వాడతారు. అయితే వీరిది ప్రేమ వివాహమా, కాదా అనేదానిపై స్పష్టత లేదు. కానీ వీరి సుదీర్ఘ ఆదర్శ దాంపత్యం ఒక ప్రేమ కావ్యం లాంటిదే.ముగ్గురు కుమార్తెలుమన్మోహన్ సింగ్, కౌర్ దంపతులకు కుమార్తెలు ముగ్గరు. వారు ఉపిందర్ సింగ్, అమృత్ సింగ్, దమన్ సింగ్. పెద్ద కుమార్తె ఉపిందర్ సింగ్ ప్రఖ్యాత చరిత్రకారురాలు. ఆమె అశోక విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ డీన్. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర విభాగం హెడ్‌గా పనిచేశారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, మాంట్రియల్‌లోని మెక్‌గిల్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. ఆమె ప్రాచీన భారతీయ చరిత్ర, పురావస్తు శాస్త్రం, పొలిటికల్ ఐడియాస్‌పై విస్తృతంగా పరిశోధన జరిపారు. ఆమె రచనలలో ఎ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ అండ్ ఎర్లీ మెడీవల్ ఇండియా, పొలిటికల్ వయొలెన్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా వంటి పుస్తకాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి.రెండో కుమార్తె అమృత్ సింగ్ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది. స్టాన్ఫోర్డ్ లా స్కూల్లో ప్రాక్టీస్ ఆఫ్ లా ప్రొఫెసర్.రూల్ ఆఫ్ లా ఇంపాక్ట్ ల్యాబ్‌కు వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. యేల్ లా స్కూల్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీల నుంచి డిగ్రీలను పొందారు. హింస, ఏకపక్ష నిర్బంధ పద్ధతులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికపై సైతం ఆమె తన గళం వినిపించారు.ఇక చిన్న కుమార్తె దమన్ సింగ్ మంచి రచయిత్రి . లోతైన వ్యక్తిగత, విశ్లేషణాత్మక రచనలకు ప్రసిద్ధి చెందిన నిష్ణాత రైటర్. దమన్ సింగ్ తన తల్లిదండ్రుల జీవితాలలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రతిబింబిస్తూ.. స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ది సేక్రేడ్ గ్రోవ్, నైన్ బై నైన్ సహా ఆమె ఇతర పుస్తకాలు కథకురాలిగా ఉన్నారు. దమన్ సింగ్ పుస్తకాలు, రచనలు ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రతిబింబిస్తాయి. ఆమె భర్త అశోక్ పట్నాయక్ 1983 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి. -
మన్మోహన్ సింగ్ అంటే అందరి నోటా ఒకటే మాట
-
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
-
ఆయన దార్శనికత ఎప్పటికీ ఆదర్శప్రాయం
అమరావతి: భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్సింగ్ మరణం పట్ల మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. పదేళ్లపాటు దేశ ప్రధానిగా గొప్ప సేవలందించారని ప్రశంసించారు. ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా ఆర్థిక సంస్కరణలతో దేశ పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఆర్థికశాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం చైర్మన్‌గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్‌గా ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్ గొప్ప మేధావి అని కొనియాడారు. దేశంలో పేదరికాన్ని పారదోలేందు కు డాక్టర్ మన్మోహన్ సింగ్ అసమాన సేవలందించారని, ఆయన కలకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతారన్నారు. ఏ బాధ్యత నిర్వహించినాం ప్రతి చోటా తనదైన ముద్ర కనబరిచారని గుర్తు చేశారు. ఆయన దార్శనికత ఎప్పటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. మన్మోహన్సింగ్ మృతితో దేశం ఒక మహా నాయకుడిని కోల్పోయిందన్న వైఎస్ జగన్, ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.విశిష్ట నాయకుడు: మోదీమన్మోహన్ సింగ్ మృతికి జాతి యావత్తు నివాళులర్పిస్తోంది. విజ్ఞానం, వినయం కలిగిన అత్యంత విశిష్ట నాయకులలో ఒకరిని దేశం కోల్పోయింది. నిరాడంబరత కలిగిన వ్యక్తిగా ఆయన గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారు. ఆర్థిక మంత్రితోపాటు ఎన్నో ప్రభుత్వం పదవుల్లో సేవలందించారు. ఆర్థిక విధానాల్లో తనదంటూ గట్టి ముద్ర వేశారు. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఎనలేని కృషి చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ నా సానుభూతి. చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడుభరతమాత గొప్ప బిడ్డ: రాష్ట్రపతి ముర్ము భరతమాత గొప్ప బిడ్డల్లో మన్మోహన్ ఒకరు. భారత ఆర్థిక సంస్కరణలకు ఆయన సేవలు మర్చిపోలేనివి. దేశానికి ఆయన సేవలు అమూల్యం. మచ్చలేని రాజకీయ నేత. మనందరికీ తీరని నష్టం. ఆర్థిక సంస్కరణలకు బాటలు: ధన్‌ఖడ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు. దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ఆయన సమూలంగా మార్చేశారు. ముందుచూపున్న నేత: ఖర్గే మన్మోహన్ సింగ్ ముందు చూపున్న నేతను కోల్పోయాం. అసమానమైన పాండిత్యమున్న ఆర్థికవేత్త, దేశ అభివృద్ధి, సంక్షేమం, సమ్మిళిత విధానాలకు దారితీసే ఆయన విధానాలు ఎప్పటికీ గౌరవించబడతాయి. చరిత్రలో మీకు తగు స్థానం దక్కుతుంది. అరుదైన నేత: ప్రియాంకాగాంధీ రాజకీయాల్లో సర్దార్ మన్మోహన్ సింగ్ మాదిరిగా గౌరవం పొందేవారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఆయన నిజాయతీ మనందరికీ స్ఫూర్తిదాయకం. నమ్మిన వాటికి ఎన్ని అడ్డంకులెదురైనా కట్టుబడి ఉండే అరుదైన నేత.మార్గదర్శిని కోల్పోయా: రాహుల్ మాజీ ప్రధాని మన్మోహన్ మృతితో గొప్ప మార్గదర్శిని కోల్పోయా. మన్మోహన్ జీ తన అపారమైన విజ్ఞానం, వివేచనతో దేశాన్ని ముందుకు నడిపించారు. ఆయన వినయం, ఆర్థిక శాస్త్రంపై లోతైన అవగాహన స్ఫూర్తిగా నిలుస్తాయి. దార్శనికత కలిగిన ఆర్థికవేత్త: శరద్ పవార్ మన్మోహన్ మరణ వార్త విని ఎంతో విచారంలో మునిగిపోయాను. ఆయన కన్నుమూతతో దేశం గొప్ప ఆర్థిక వేత్తను, దార్శనికత కలిగిన సంస్కరణవాది, ప్రపంచ నాయకుడిని కోల్పోయింది. దిగ్భ్రాంతి కలిగించింది: మమత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హఠాన్మరణం వార్త విని షాక్‌కు గురయ్యాను. ఆయన విజ్ఞానం అపారం. దేశం ఆయన నాయకత్వాన్ని కోల్పోయింది. నేను ఆయన ఆప్యాయతను కోల్పోయాను. తరతరాలకు స్ఫూర్తి: నడ్డా మన్మోహన్ దార్శనికత కలిగిన నేత. దేశ రాజకీయాల్లో అగ్రగణ్యుడు. సుదీర్ఘ కాలం ప్రజా సేవలో కొనసాగిన ఆయన అణగారిన వర్గాల సంక్షేమం తరఫున నిలిచారు. పార్టీలతో ప్రమేయం లేకుండా ఆయన నాయకత్వం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆయన వారసత్వం దేశ నిర్మాణ సాధనలో తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. -
నీ దూకుడు.. సాటెవ్వరూ..!
మన్మోహన్ సింగ్ ఎక్కువగా మాట్లాడరని, దూకుడుగా వ్యవహరించరని ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనపై ప్రతిపక్షాలు విమర్శలు చేసేవి. ఆయన్ని మౌనమునిగా వర్ణించేవి. మన్మోహన్ కేవలం కీలుబొమ్మని, రిమోట్ సోనియా చేతిలో ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసేవి. కానీ తాను మాటల మనిషి కాదు చేతల మనిషని ఎన్నోసార్లు మన్మోహన్ నిరూపించారు. ఆయన దూకుడు ఏంటనేది ఆర్థిక సంస్కరణలతోనే దేశానికి తెలిసొచ్చింది. నెహ్రూ ఆర్థిక విధానాలు, రష్యాతో అనుబంధం కారణంగా 90వ దశకం వరకు సోషలిజం నినాదమే దేశంలో బలంగా వినిపించేది. ఆ నినాదానికి ఎదురుగా వెళ్లి మాట్లాడే దమ్ము, ధైర్యం అప్పటి రాజకీయ నాయకులకు లేదు. సోషలిజంలో భాగంగా అప్పటి ప్రభుత్వాలు గుడ్డిగా విదేశీ దిగుమతులను తగ్గించేందుకు అడ్డగోలుగా పన్నులు విధించేవి. అదే సమయంలో విదేశాలకు చేసే ఎగుమతులకు అనేక ప్రోత్సాహకాలు అందించేవి. అయితే కాలానుగుణంగా ఇందులో మార్పులు చేయకపోవడంతో ఈ రెండు విధానాలు భ్రష్టుపట్టిపోయాయి. తగ్గేదే లేదు ఇక్కడి దిగుమతి సుంకాలకు భయపడి విదేశీయులు తమ వస్తువులు అమ్మేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు కాదు. అదే సమయంలో కీలక విభాగాల్లో ప్రభుత్వ గుత్తాధిపత్యం, లైసైన్స్రాజ్ కారణంగా పరిమితంగానే ఇక్కడి పరిశ్రమల నుంచి ఉత్పత్తి జరిగేది. అంతర్జాతీయ మార్కెట్లో వీటికి డిమాండ్ లేకపోయినా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందించే వారు. ఇవి మంచి ఫలితాలు ఇవ్వకపోయినా మార్చే సాహసం ఎవరూ చేయలేదు. కానీ మన్మోహన్ ఏ మాత్రం సంకోచం లేకుండా విదేశీ దిగుమతులపై ఉన్న పన్నులు తొలగించడంతో పాటు స్వదేశీ వస్తువులకు అందిస్తున్న ప్రోత్సాహకాలను నిలిపేశారు. ఫలితాలు ఇవ్వకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకడానంటూ గట్టి సంకేతాలు పంపారు. చదవండి: నాయకత్వ లక్షణాలను చాటిన పౌర అణు ఒప్పందంతెగింపునకు మరో పేరుపీవీ నర్సింహారావు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు దేశంలో రాజకీయ అస్థిరత నెలకొని ఉంది. అంతకు ముందు 11 నెలలకే వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోగా, చంద్రశేఖర్ గవర్నమెంట్ పట్టుమని ఏడు నెలలు కూడా ఉండలేకపోయింది. ఇక పీవీది కూడా మైనార్టీ ప్రభుత్వమే అయినా ఇంతటి రాజకీయ అస్థిరతలో సైతం తెగించి ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు మన్మోహన్. పదవులు...బాధ్యతలు -
నాయకత్వ లక్షణాలను చాటిన పౌర అణు ఒప్పందం
ప్రధానిగా మన్మోహన్సింగ్ సాధించిన అతిపెద్ద విజయాల్లో అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం ప్రత్యేకమైంది. దేశ విదేశాంగ విధానంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మన్మోహన్ దూరదృష్టికి, నాయకత్వ లక్షణాలకు అద్దంపట్టింది. అణ్వస్త్రపరంగా భారత్‌ను దశాబ్దాలపాటు ఏకాకిగా మిగిల్చిన ప్రపంచ దేశాలకు భారత్ ఈ చరిత్రాత్మక ఒప్పందంతో దీటుగా బదులిచ్చింది. అమెరికా నుంచి అణు ఇంధన లభ్యత, పౌర అణు సాంకేతికతలో సహకారం సహా ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే ఈ ఒప్పందం కార్యరూపం దాల్చేలా మన్మోహన్ అవిరళ కృషి చేశారు. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్యూ. బుష్‌తో కలిసి మన్మోహన్సింగ్ 2005 జూలై 18న పౌర అణు ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలపై సంయుక్త ప్రకటన చేశారు. అయితే ఈ ఒప్పందాన్ని యూపీఏ–1 సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షమైన వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉన్నా లెక్కచేయకుండా మన్మోహన్ ముందడుగు వేశారు. విశ్వాస పరీక్ష ఎదుర్కొని మరీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోగలిగారు. 2008 అక్టోబర్‌లో అణు ఒప్పందం కార్యరూపం దాల్చింది. చదవండి: ప్రపంచం మెచ్చిన రాజనీతిజ్ఞుడు -
ప్రపంచం మెచ్చిన రాజనీతిజ్ఞుడు
యాక్సిడెంటల్ పీఎం. ఈ పదబంధం డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు అచ్చు గుద్దినట్టుగా సరిపోతుంది. నిజానికి ఆయనకున్న భుజకీర్తులు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచమే మెచ్చిన ఆర్థికవేత్త. అనుకోకుండా వచ్చి పడ్డ ముళ్లకిరీటం వంటి ఆర్థిక మంత్రి బాధ్యతలను అత్యంత చాకచక్యంగా నిభాయించి దేశాన్ని సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించిన మేధావి. ఏకంగా పదేళ్లపాటు ప్రధాని. ఆ ఘనత సాధించిన తొలి సిక్కు. నెహ్రూ, ఇందిర, మోదీ తర్వాత అత్యధిక కాలం ఆ పదవిలో కొనసాగిన నాయకుడు. సమాచార హక్కు వంటి కీలక చట్టాలు చేసిన సర్కారుకు సారథి. అయినా సరే, మన్మోహన్ పేరు చెప్పగానే ఎవరికైనా మదిలో మెదులేది ఆయన అనూహ్యంగా ప్రధాని అయిన తీరే! అందుకే ఆయనపై రాసిన పుస్తకానికి ప్రముఖ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకుడు సంజయ బారు కూడా ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనే పేరు పెట్టారు. ‘పీఎం మన్మోహన్’కు మీడియా సలహాదారుగా నాలుగేళ్ల పాటు ఆయనను అతి దగ్గరగా చూసిన అనుభవాలన్నింటినీ అందులో నిర్మొహమాటంగా పొందుపరిచారు. నిశ్శబ్ద సంస్కర్త ప్రధానిగా మన్మోహన్ సారథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింతగా పరుగులు పెట్టింది. మన దేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు వంటి చరిత్రాత్మక చట్టాలు పుట్టుకొచ్చాయి. వామపక్షాలు వ్యతిరేకించినా, ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా వెరవక అమెరికాతో మన్మోహన్ కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందం మరో మైలురాయి. దౌత్య రంగంలో కూడా పలువిజయాలకు ఆయన హయాం వేదికైంది. అమెరికా, రష్యా, చైనా వంటి పెద్ద దేశాలతో బంధాలను బలోపేతం చేశారు. ఫలితంగా 2008లో ప్రపంచమంతా పెను ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నా మన్మోహన్ ముందుచూపు నిర్ణయాల వల్ల భారత ప్రస్థానం మాత్రం స్థిరంగా సాగింది. ఇన్ని చేసినా కృషికి తగ్గ పేరు రాని నిశ్శబ్ద సంస్కర్తగానే మిగిలిపోయారు మన్మోహన్.మీరు జోక్ చేస్తున్నారా? ఆర్థిక శాఖ ఆఫర్‌పై మన్మోహన్అది 1991. కేంద్రంలో పీవీ సారథ్యంలో కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటు దేశమంతటా హాట్ టాపిక్‌గా మారింది. మర్నాడే ప్రమాణస్వీకారం. మంత్రివర్గ కూర్పుపై పీవీ మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ సమయాన మన్మోహన్ ఢిల్లీలో తన నివాసంలో కూర్చుని తాపీగా పేపర్ చదువుతున్నారు. అప్పుడు పీవీ ముఖ్య కార్యదర్శి ఆయన ఇంటికి వచ్చారు. ‘ప్రధాని మిమ్మల్ని కేబినెట్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి’ అని చెప్పారు. దాన్ని మన్మోహన్ నమ్మలేదు. ‘‘నేనా? కేబినెట్లోకా? మీరు జోక్ చేస్తున్నారా?’’ అంటూ నవ్వి ఊరుకున్నారు. తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు. మర్నాడు ప్రమాణ స్వీకారానికి వేళవుతున్నా మన్మోహన్న్రాష్ట్రపతి భవన్ చేరుకోకపోవడంతో పీవీ ముఖ్య కార్యదర్శి నేరుగా ఆయన ఇంటికి ఫోన్‌చేశారు. ’ప్రమాణానికి టైం దగ్గర పడుతుంటే మీరింకా రాలేదేంటి?’ అంటూ హైరానా పడ్డారు. అప్పటికి గానీ తాను నిజంగానే మంత్రిని కాబోతున్నట్టు మన్మోహన్ నమ్మలేదు. దాంతో ఉన్నపళాన బయల్దేరి వెళ్లి ప్రమాణస్వీకారం చేశారు. ‘‘అలా నా రాజకీయ జీవితం హడావుడిగా మొదలైంది! కనీసం తయారయ్యే టైం కూడా లేకుండానే ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది’’ అంటూ 2005లో ఓ బ్రిటిష్ జర్నలిస్టుకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. అవార్డులు.. రివార్డులు ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల నుంచి మన్మోహన్ లెక్కలేనన్ని గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ఎన్నోసార్లు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచారు. 1987లో దేశ రెండో అతి పెద్ద పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించింది. ఎన్నో దేశాలు ఆయనకు తమ అత్యుత్తమ పౌర పురస్కారాలు ప్రదానం చేశాయి. కష్టాల బాల్యం మన్మోహన్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్‌లోని గహ్ గ్రామంలో జని్మంచారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. చిన్నప్పుడే తల్లి చనిపోతే అమ్మమ్మే అన్నీ తానై పెంచింది. 1947లో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం అమృత్సర్ వలస వచ్చింది. ఆర్థిక కష్టనష్టాలను ఓర్చుకుంటూనే ఆయన విద్యాభ్యాసం సాగించారు. అసాధారణ ప్రతిభతో స్కాలర్షిప్లు పొందుతూ ఉన్నత విద్య పూర్తి చేశారు. 1952లో పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్, 1954లో మాస్టర్స్ పట్టా పొందారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పొందారు. తర్వాత ఆక్స్‌ఫర్డ్‌లో నఫీల్డ్ కాలేజీలో పీహెచ్డీ చేశారు. ఆయన సమరి్పంచిన డాక్టోరల్ థీసిస్ ‘భారత ఎగుమతి ధోరణులు, స్వయం ఆధారిత వృద్ధి ప్రాతిపదికలు’ మన ఆర్థిక వ్యవస్థపై ఆయన లోతైన దృష్టికి తార్కాణం. అధ్యాపకునిగా, బ్యూరోక్రాట్‌గా...మన్మోహన్ కెరీర్ ఆర్థిక శాస్త్రంలో లెక్చరర్‌గా మొదలైంది. పంజాబ్ యూనివర్సిటీ ,ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో బోధించారు. ఆర్థికశాస్త్రం, విధానాలపై లోతైన అవగాహన ఆయనది. 1966–69 మధ్య ఐరాసలోనూ పని చేశారు. అనంతరం అనుకోకుండా బ్యూరోక్రాట్‌గా మారారు. తొలుత వాణిజ్య, పరిశ్రమల శాఖలో ఆర్థిక సలహాదారుగా చేశారు. అనంతరం 1972–1976 నడుమ కేంద్ర ఆర్థిక శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగావున్నారు. 1982–1985 మధ్య రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా రాణించారు. తర్వాత రెండేళ్లు ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా సేవలందించారు. ఆయా పదవుల్లో ఉండగా మన్మోహన్ రూపొందించిన పలు కీలక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరణ బాట పట్టించడంలో ఎంతగానో దోహదపడ్డాయి.మచ్చలేని వ్యక్తిత్వం నిజాయితీకి, మచ్చలేని వ్యక్తిత్వానికి ప్రతీక మన్మోహన్. ప్రజా జీవితంలో నాయకులు పాటించాల్సిన విలువలకు బెంచ్‌మార్క్‌గా నిలిచారు. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. అతి నిరాడంబర జీవన శైలి, అన్ని అంశాల మీదా లోతైన అవగాహన సమకాలీన నాయకుల్లో ఆయన్ను అత్యంత విలక్షణంగా నిలిపాయి. నెహ్రూను కూడా కాదని మన్మోహన్‌ను అత్యుత్తమ ప్రధానిగా కుష్వంత్‌సింగ్ వంటి ప్రముఖులు కీర్తించారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం ప్రచారం నిమిత్తం తన వద్ద తీసుకున్న రూ.2 లక్షలను మన్మోహన్ గుర్తుతో తిరిగిచ్చిన వైనాన్ని కుష్వంత్ చాలాకాలం పాటు ఎందరితోనో చెప్పుకున్నారు.పాలనపై విమర్శ...వ్యక్తిగతంగా మన్మోహన్‌ది ఏ మచ్చా లేని జీవితమే అయినా పాలనపరంగా మాత్రం కొన్ని విమర్శలూ ఎదుర్కొన్నారు. యూపీఏ–2లో రెండోసారి ప్రధాని అయ్యాక కామన్వెల్త్ క్రీడలు, బొగ్గు, 2జీ స్పెక్ట్రం వంటి కుంభకోణాలు ఆయన ప్రతిష్టను మసకబార్చాయి. బొగ్గు కుంభకోణంపై ప్రశ్నల పరంపరకు, ‘వెయ్యి సమాధానాల కంటే మౌనమే మేలు’ అంటూ ఆయన బదులిచ్చారు. అవినీతి, నమ్మకద్రోహం, క్రిమినల్ కుట్ర తదితర ఆరోపణలపై బదులిచ్చేందుకు కోర్టుకు రావాల్సిందిగా అనంతర కాలంలో సమన్లు కూడా అందుకోవాల్సి వచ్చింది.ఆ మలుపు... 1991లో మన్మోహన్ జీవితం అనుహ్యమైన మలుపు తిరిగింది. భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయమది. విదేశీ మారక ద్రవ్యం దాదాపుగా నిండుకుంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలతో ఏ సంబంధమూ లేని మన్మోహన్‌ను ఎకాయెకిన కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమించారు. దీనిపై అప్పట్లో పలువురు పెదవి విరిచినా ఆ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్‌గా నిలిచింది. మన్మోహన్ విధానాలు, 1991 ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థనే సమూలంగా మార్చేశాయి. ఎగుమతులను ప్రోత్సహించడానికి రూపా యిని విలువ తగ్గించినా, విదేశీ పెట్టుబడులకు బాటలు పరిచినా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించినా అన్నీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నిర్ణయాలే! పీవీ మార్గదర్శకత్వంలో ఆయన చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించి, నేలచూపులు చూస్తున్న మన ఆర్థిక వ్యవస్థ సగర్వంగా తలెత్తుకునేలా చేశాయి. ‘ఏ శక్తీ ఆపలేని ఆలోచనలు మనవి’ అంటూ 1991 బడ్జెట్ ప్రసంగంలో మన్మోహన్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని అనంతర చరిత్ర నిరూపించింది. ప్రధానిగా ప్రస్థానంమన్మోహన్ జీవితంలో 1991ని కూడా మించిన అత్యంత అనూహ్య మలుపుకు 2004 వేదికైంది. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ మెజారిటీ సాధించినా సోనియాగాంధీ ప్రధాని కావడంపై అభ్యంతరాలు తలెత్తాయి. సొంత పార్టీ నేతలే ఆమె విదేశీయతను ప్రశ్నించిన పరిస్థితి! దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని పదవిని సోనియా ‘త్యాగం’ చేశారు. ప్రణబ్ సహా కాంగ్రెస్ దిగ్గజాలెందరో ఆ పదవికి పోటీ పడ్డా సోనియా మాత్రంసౌమ్యుడైన మన్మోహన్కేసి మొగ్గారు. అలా అనుకోకుండా దేశ 13వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా, ఆ అత్యున్నత పదవిలో ఏకంగా పదేళ్లపాటు నిరాఘాటంగా కొనసాగి ఆయన మరో చరిత్ర సృష్టించారు!రాహుల్ చించేసిన ఆ ఆర్డినెన్స్... ప్రధానిగా తన పాలనా కాలం పొడవునా సోనియా నీడలోనే మిగిలిపోయారన్న అపప్రథ మూటగట్టుకున్నారు మన్మోహన్. జాతీయ సలహా మండలి చైర్పర్సన్ హోదాలో పదేళ్ల పాటు ఆమె బాధ్యత లేని అధికారాలు చలాయించినా చేష్టలుడిగి చూశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక 2013లో సోనియా తనయుడు రాహుల్‌గాంధీ చేసిన పని మన్మోహన్ గౌరవ ప్రతిష్టలను మరింత దిగజార్చింది. కళంకిత నేతలు దోషులుగా తేలినా మూడు నెలల పాటు పదవుల్లో కొనసాగవచ్చంటూ 2013లో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను ‘నాన్సెన్స్’ అంటూ రాహుల్ కొట్టిపారేశారు. అంతటితో ఆగకుండా విలేకరుల సమావేశం సాక్షిగా ఆర్డినెన్స్ కాపీని చించేశారు. అది మన్మోహన్‌ను కూడా తీవ్రంగా కలచివేసిందని చెబుతారు. బహుశా వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే కాబోలు, మన్మోహన్‌ను ‘దేశ చరిత్రలోనే అత్యంత బలహీన ప్రధాని’గా బీజేపీ దిగ్గజం ఎల్కే ఆడ్వాణీ, ‘నైట్ వాచ్‌మన్’గా, ‘గాంధీల చేతుల్లో కీలు»ొమ్మ’గా నరేంద్ర మోదీ అభిర్ణించారు! మన్మోహన్ తన రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా లోక్‌సభకు ఎన్నికవలేదు! ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం 2024 ఏప్రిల్‌తో రాజ్యసభ సభ్యుని హోదాలో ముగిసింది.‘మన్మోహనాలు’ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ వివిధ అంశాలపై తన అంతరంగాన్ని ఆవిష్కరించే క్రమంలో పంచుకున్న మనసులోని భావాలు.ఆర్థిక సంస్కరణలపై..→ సమయం వచ్చినప్పుడు ఒక ఆలోచనను ఈ భూమ్మీద ఏ శక్తీ ఆపలేదు.గ్లోబలైజేషన్, ఆర్థిక వ్యవస్థపై:→ భారత్ ఇప్పుడు సమ్మిళిత, సమాన, స్థిరమైన వృద్ధి పథంలో సాగుతోందని నేను నమ్ముతున్నా→ ప్రపంచీకరణ ఒక వాస్తవం. దాన్ని అంగీకరించి అందుకు అనుగుణంగా మన విధానాలను రూపొందించుకోవాలి.నాయకత్వం, పాలనపై..→ భారత్‌కు అపారమైన శక్తిసామర్థ్యాలు ఉన్నాయని నిజంగా విశ్వసిస్తున్నా. వాటిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొనేందుకు సుపరిపాలన అవసరం.ప్రపంచంలో భారతదేశం పాత్రపై→ భారత్ పురాతన దేశమే అయినప్పటికీ అది యువదేశం. ఎటుచూసినా యువతరం కనిపిస్తున్న మాదిరిగానే మనం ఆత్రుతలో ఉన్నాం. కానీ భవిష్యత్తు మనదే అని నేను బలంగా నమ్ముతున్నా.→ మనం ఎదురుదాడి కాకుండా సహకారం, పోటీతత్వం అనే సరైన మార్గాన్ని ఎంచుకుంటే భారత్ ఎదిగేందుకు ఈ ప్రపంచం చోటు కల్పిస్తుంది.ఆయనపై → పెద్ద బాధ్యత అందుకున్న చిన్న వ్యక్తిని నేను.ప్రధానిగా..→ వినయం, లక్ష్యానికితగ్గ పట్టుదల నాయకత్వానికి పునాదులని నేను ఎల్లప్పుడూ విశ్వసించా.విద్య, యువతపై..→ భవిష్యత్తుకు విద్యే కీలకం. దేశ ప్రజలు, భవిత కోసం దేశం చేసే అత్యంత ముఖ్యమైన పెట్టుబడి అదే.→ దేశ యువత గొప్ప కలలు కనాలి. గొప్ప కలలు కంటేనే మనం గొప్ప విజయాలను సాధించగలమని నమ్మొచ్చు.చరిత్ర ఉదారంగానే చూస్తుంది... సమకాలీన మీడియా కంటే చరిత్ర నా పట్ల ఉదారంగానే వ్యవహరిస్తుంది – 2014 జనవరిలో ప్రధానిగా చివరి మీడియా సమావేశంలో మన్మోహన్ చేసిన వ్యాఖ్యలివి! మీడియా శరపరంపరగా ప్రశ్నలు సంధించడంతో అలా స్పందించారాయన. ‘సంకీర్ణ రాజకీయాల అనివార్యతకు లోబడి నేను చేయగలిగినంత చేశాను. దానిపై చరిత్రే తుది తీర్పరి’ అన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Manmohan Singh : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత - అరుదైన ఫోటోలు
-
మన్మోహన్ అస్తమయం
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణల సారథి, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ (92) ఇక లేరు. వయో సంబంధిత సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆయన గురువారం ఢిల్లీలోని తన నివాసంలో చికిత్స పొందుతూ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు. దాంతో అత్యంత విషమ స్థితిలో రాత్రి 8 గంటల వేళ హుటాహుటిగా ఎయిమ్స్ ఎమర్జెన్సీ విభాగానికి తరలించారు. ‘‘అన్నిరకాలుగా అత్యవసర చికిత్స అందించినా లాభం లేకపోయింది. 9.51 గంటల ప్రాంతంలో మన్మోహన్ తుదిశ్వాస విడిచారు’’ అని ఎయిమ్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. వివాద రహితునిగా, అత్యంత సౌమ్యునిగా, మృదుభాషిగా, మచ్చలేని రాజనీతిజు్ఞడిగా పేరొందిన మన్మోహన్ మృతి పట్ల రాజకీయ తదితర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాందీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు. మన్మోహన్ అస్వస్థత గురించి తెలియగానే సోనియా తన కుమార్తె ప్రియాంకతో కలిసి హుటాహుటిన ఎయిమ్స్‌కు చేరుకున్నారు. మన్మోహన్ పార్థివదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయన మరణ వార్త తెలిసి సీడబ్ల్యూసీ భేటీ కోసం కర్ణాటకలోని బెల్గావీలో ఉన్న ఖర్గే, రాహుల్ తదితరులంతా హస్తిన బయల్దేరారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాపం ప్రకటించింది. మన్మోహన్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని ఆదేశించింది. కాంగ్రెస్ కూడా వారం పాటు పార్టీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుంది. కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఉదయం సమావేశమై మన్మోహన్‌కు ఘనంగా నివాళులు అర్పించనుంది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ రెండుసార్లు ప్రధానిగా చేశారు. ఆయనకు భార్య గురుచరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలున్నారు. ⇒ శాంతి, శ్రేయస్సు విడదీయలేనివి. శాంతి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అదే సమయంలో అభివృద్ధి లేకుంటే శాంతి ఉండదు. భారతదేశ అసలైన భవితవ్యం దాని సహనశీలత, సమ్మిళిత, సమానత్వ సమాజంగా ఎదగగల సామర్థ్యంలో దాగి ఉంది.⇒ 1991లో మేం చేపట్టిన సంస్కరణలు ఎవరినీ సంతోషపరిచేందుకు కాదు. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు స్థిరమైన వృద్ధికి పునాది వేయడమే వాటి ఉద్దేశం.⇒ మన ప్రజల తలసరి ఆదాయం గురించి కంటే వారి ఆదాయాల్లోని అసమానతల గురించే నాకు ఎక్కువ ఆందోళన ఉంది.⇒ మన దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కానీ వాటిని ప్రతిసారీ మనం మరింత బలంగా, మరింత ఐక్యంగా, మరింత పట్టుదలతో ఎదుర్కొని బయటపడ్డాం. మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కానీ కష్టపడేతత్వం, చిత్తశుద్ధి, సరైన విధానాలతో మనం మనుగడ సాగించగలం. -
వేకువజామున చనిపోయాడు.. త్రిష పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) బాధపడుతోంది. తన కొడుకు చనిపోయాడని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం తాను షాక్‌లో ఉన్నానని చెప్పుకొచ్చింది. ఈ బాధ నుంచి తన ఫ్యామిలీ బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని తనని తానే సముదాయించుకుంది. ఇక్కడ జొర్రో అంటే త్రిష పెంపుడు కుక్క. పేరుకే కుక్క గానీ కొడుకులా పెంచుకున్నట్లు ఇన్ స్టాలో పోస్ట్ చూస్తే అర్థమవుతోంది.'నా కొడుకు జొర్రో.. ఈ క్రిస్మస్ నాడు వేకువజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసినవాళ్లకు.. జొర్రో నాకు ఎంతముఖ్యమనేది కూడా తెలుసు. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం. కుదుటపడటానికి కొన్నిరోజులు పడుతుంది. అప్పటివరకు అందుబాటులో ఉండను' అని హీరోయిన్ త్రిష ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)గత ఇరవైళ్లుగా దక్షిణాది భాషల్లో హీరోయిన్గా చేస్తున్న త్రిష.. ఇప్పుడు 40 ఏళ్లు దాటినా సరే స్టార్ హీరోయిన్ క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో (Viswambhara Movie) మెయిన్ హీరోయిన్ ఈమెనే. తమిళంలో అజిత్ 'విడమూయార్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాల్లో త్రిషనే హీరోయిన్. ఇది కాకుండా సూర్య, కమల్ హాసన్ (Kamal Haasan) కొత్త సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మలయాళంలోనూ రెండు మూవీస్ చేస్తోంది.ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న త్రిష.. ఇప్పుడు పెంపుడు కుక్క చనిపోయిందని పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె ఫాలోవర్స్.. త్వరలో త్రిష తిరిగి మాములు మనిషి అవ్వాలని కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కేసీఆర్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
స్త్రీ పాత్రల రూపశిల్పి శ్యామ్ బెనగళ్.. అల్విదా!
భారతీయ సినిమా పరిశ్రమలో తీరని విషాదం నెలకొంది. భారతీయ పార్లల్ సినిమాకు దశదిశలా ఖ్యాతిని తెచ్చి పెట్టిన తొలి తరం దర్శకులు శ్యామ్ బెనగళ్ (90) ఇకలేరు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి ముంబైలో స్థిరపడిన బెనగళ్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ముంబైలోని ఓ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని శ్యామ్ బెనగళ్ కుమార్తె పియా బెనగళ్ వెల్లడించారు. బెనగళ్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 2023 అక్టోబరు 13న విడుదలైంది. శ్యామ్ బెనగళ్‌కు భార్య నీరా బెనగళ్, కుమార్తె పియా బెనెగళ్ ఉన్నారు. లెజెండరీ దర్శకుడిగా పేరొందిన శ్యామ్ బెనగళ్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. జన్మతః కన్నడిగ అయినప్పటికీ తెలంగాణలో పుట్టి పెరగడం వల్ల తెలంగాణ చైతన్యం ఆయనలో చివరికంటా ఉంది.శ్యామ్ బెనగళ్( ShyamBenegal) తన సినిమాల్లో శక్తిమంతమైన స్త్రీపాత్రలకు రూపకల్పన చేశాడు. ‘అంకుర్’ (1974)తో మొదలెట్టి ‘జుబేదా’ (2001) వరకు దాదాపుగా ప్రతి సినిమాలో స్త్రీ పాత్రలకు చైతన్యాన్ని, శక్తిని ఇచ్చిన దర్శకుడు శ్యామ్ బెనగళ్. సత్యజిత్ రే వాస్తవిక సినిమాను ప్రవేశపెట్టి ఆ పరంపరను మృణాళ్ సేన్ అందుకున్నాక శ్యామ్ బెనగళ్ ఆ ఛత్రాన్ని గట్టిగా పట్టుకుని నిలబెట్టాడు. 1973లో విడుదలైన రెండు సినిమాలు ‘అంకుర్’, ‘గరమ్ హవా’ నవ సినిమాల పతాకాన్ని పట్టుకున్నాయి. అయితే ‘గరమ్ హవా’ తీసిన ఎం.ఎస్.సత్యు ఎక్కువ సినిమాలు చేయలేదు. శ్యామ్ బెనగళ్ నిరంతరం పని చేశాడు. ‘సినిమా కచ్చితంగా సామాజిక మాధ్యమం. అది సమాజాన్ని పట్టించుకోవాల్సిందే. నేను సికింద్రాబాద్‌లో పుట్టి పెరగడం వల్ల రైతాంగ పోరాటం, విప్లవ పోరాటాల ప్రభావం నా మీద ఉంది. ప్రజల పక్షం నిలబడాలి సినిమా అనుకున్నాను’ అంటారాయన. కంటోన్మెంట్ ఏరియాలోని టెంట్ హాలులో వారానికి మూడు ఇంగ్లిష్ సినిమాలు చూస్తూ తన అన్నయ్యతో కలిసి సినిమాలు తీసేందుకు ప్రయోగాలు చేసిన శ్యామ్ బెనగళ్ యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీల తర్వాత ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ అయ్యాడు. ఇంకా చెప్పాలంటే పార్లల్ సినిమా అంటే చిత్రోత్సవాల్లో ప్రదర్శించేది కాదు నేరుగా హాల్లో రిలీజ్ చేసి హిట్ చేయదగ్గది అని నిరూపించిన తొలి భారతీయ దర్శకుడు శ్యామ్ బెనగళ్. ‘అంకుర్’ హైదరాబాద్‌లో 100 రోజులు ఆడటమే ఉదాహరణ. భూస్వాముల దోపిడిని ఆ సినిమాలో చూపి కొనసాగింపుగా ‘నిషాంత్’ తీశాడు బెనగళ్. ఇక ‘మంథన్’ చిన్న మనుషులు ఒక్కటైతే సహకార వ్యవస్థ ద్వారా ఎలా స్వయం సమృద్ధి సాధించ వచ్చో ఆ రోజుల్లోనే తీశాడు బెనగళ్. దీని నిర్మాణానికి పాడిరైతులు తలా రెండురూపాయల వాటా వేయడం నభూతో నభవిష్యతి.ఎన్నో ప్రయోగాలు:శ్యామ్ బెనగళ్ తన సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేశాడు. కొత్త నటీనటులకు అవకాశం ఇచ్చాడు. బెనగళ్ సినిమాలతో షబానా, స్మితా పాటిల్ గొప్ప పాత్రలు పోషించదగ్గ నటీమణులుగా గుర్తింపు పొందారు. షబానాకు మొదటి సినిమాతోటే జాతీయ పురస్కారం వచ్చింది. ఔట్డోర్కు తన యూనిట్‌తో వెళ్లి అక్కడే ఉండిపోయి సినిమా తీసే పరంపరను బెనగళ్ ప్రవేశపెట్టాడు. అందరూ కలిసి ఆలోచనలు పంచుకోవడానికి ఇది మంచి మార్గం అంటాడాయన. ఆయన దర్శకత్వ ప్రతిభ తెలిసి కేవలం ఆయన దర్శకత్వంలో నటించాలనే అభిలాషతో ‘అనుగ్రహం’లో వాణిశ్రీ నటించింది. వ్యభిచార వ్యవస్థ మీద ‘మండి’, వ్యాపార సామ్రాజ్యాల ఎత్తుగడల మీద ‘కల్యుగ్’, గోవాలో పోర్చుగీసు పాలన సమాప్త సమయంలో చెలరేగిన భావోద్వేగాలను ‘త్రికాల్’ లో, నాలుగు కాలాల అంతరంలో ఒక సినీ నాయిక జీవితం, సినిమా జీవితం ఎలా మారిందో చూపిన ‘భూమిక’... ఇవన్నీ ప్రయోగాత్మక కథలు. ‘త్రికాల్’లో రాత్రి సన్నివేశాలు క్యాండిళ్ల వెలుతురులో తీసి ఒక గాంభీర్యం తెచ్చాడు బెనగళ్.దేశం కోసం:దేశం కోసం దేశ వాసుల కోసం బెనగళ్ పని చేస్తూనే వెళ్లాడు. ఎన్నో డాక్యుమెంటరీలు తీశాడు. వాటిలో సత్యజిత్ రే మీద తీసిన డాక్యుమెంటరీ ముఖ్యమైనది. ఇక నెహ్రూ ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ను ‘భారత్ ఏక్ ఖోజ్’ పేరుతో ఇచ్చిన దృశ్యరూపం కష్టతరమైనది. దూరదర్శన్‌లో దీనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అదే సమయంలో సుభాష్ చంద్రబోస్ మీద పరిశోధన చేసి ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్’ తీశాడు. ‘మేకింగ్ ఆఫ్ మహాత్మా’కు దర్శకత్వం వహించాడు. జీలాని బానో రాసిన ‘నర్సయ్య కీ బావ్డీ’ (నర్సయ్య బావి)ని చాలా కాలం తర్వాత ‘వెల్డన్ అబ్బా’గా తీశాడాయన.ఆయన నిష్క్రమణంతో గొప్ప వెలుగు వీడ్కోలు తీసుకున్నట్టయ్యింది. అవార్డులు... శ్యామ్ బెనగళ్ భారత ప్రభుత్వం నుంచి 8 జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్నారు. అవి ‘అంకుర్’(1975), ‘నిశాంత్’(1976), ‘మంథన్ ’(1977), ‘భూమిక: ది రోల్’(1978), ‘జునూన్’(1979), ‘ఆరోహణ్’(1982), ‘నేతాజీ సుభాష్ చంద్రబోస్’(2005), ‘వెల్డన్ అబ్బా’ (2009). అలాగే సినీ రంగంలో కనబరచిన అత్యుత్తమ ప్రతిభకుగానూ 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం, 2013లో ఏఎన్ఆర్ జాతీయ అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా 2005 సంవత్సరానికిగాను 2007 ఆగస్టు 8న అత్యంత ప్రతిష్ఠాత్మమైన ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అందుకున్నారు. తెలుగు సినిమా ‘అనుగ్రహం’కు నంది అవార్డు అందుకున్నారు. -
ఆయన సినిమాలు మనదేశ సంస్కృతిలో భాగం: డైరెక్టర్ మృతి పట్ల మెగాస్టార్ సంతాపం
ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. మనదేశంలో అత్యుత్తమ డైరెక్టర్లలో ఆయన ఒకరని కొనియాడారు. ఆయన సినిమాలు, డాక్యుమెంటరీలు మనదేశం గొప్ప సంస్కృతిని తెలుపుతాయంటూ ట్వీట్ చేశారు. మన హైదరాబాదీ, మాజీ రాజ్యసభ సభ్యుడైన శ్యామ్ బెనెగల్ సాబ్ రచనలు ఇండియన్ సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని మెగాస్టార్ పోస్ట్ చేశారు.డైరెక్టర్ శ్యామ్ బెనెగల్ మృతి..సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధుపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.శ్యామ్ బెనగల్ సినీ ప్రస్థానం1934 డిసెంబర్ 14న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ విద్యను అభ్యసించారు. ఆయన దర్శకత్వ ప్రతిభకుగానూ దాదాసాహెబ్ ఫాల్కే పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి సినీ అత్యున్నత అవార్డులు అందుకున్నారు. 1976లో పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. అంకుర్ (1974) అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత నిశాంత్ (1975), మంథన్ (1976), భూమిక, జునూన్ (1978), మండి (1983, త్రికాల్ (1985), అంతర్నాద్ (1991) లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. Deeply saddened at the departure of Shri Shyam Benegal,one of the finest film makers and great intellectuals of our country. He discovered & nurtured some of the brightest film talents of India. His films, biographies and documentaries form part of India’s greatest cultural…— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2024 -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధుపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.శ్యామ్ బెనగల్ సినీ ప్రస్థానం1934 డిసెంబర్ 14న హైదరాబాద్‌లో జన్మించిన ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఉస్మానియా వర్సిటీలో ఎంఏ విద్యను అభ్యసించారు. ఆయన దర్శకత్వ ప్రతిభకుగానూ దాదాసాహెబ్ ఫాల్కే పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి సినీ అత్యున్నత అవార్డులు అందుకున్నారు. 1976లో పద్మశ్రీ అవార్డ్ అందుకున్నారు. అంకుర్ (1974) అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత నిశాంత్ (1975), మంథన్ (1976), భూమిక, జునూన్ (1978), మండి (1983, త్రికాల్ (1985), అంతర్నాద్ (1991) లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.అనేక అవార్డులు- ప్రశంసలుదాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్-2005పద్మశ్రీ -1976పద్మ భూషణ్-1991ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం- 2003ఏఎన్నార్ జాతీయ అవార్డ్-2013నిశాంత్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు -1976మంథన్ సినిమాకు ఉత్తమ జాతీయ చలనచిత్ర అవార్డు- 1977జునూన్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు -1980 -
గుండెపోటుతో ప్రముఖ పారిశ్రామికవేత్త మృతి
ఎపిగామియా సహ వ్యవస్థాపకుడు 'రోహన్ మిర్చందానీ' (Rohan Mirchandani) డిసెంబర్ 21 రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఎపిగామియా మాతృ సంస్థ డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ధృవీకరించింది.అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన తన ప్రియతమ వ్యవస్థాపకుడు రోహన్ మిర్చందానీ అకాల మరణం చెందారని డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్ ధృవీకరిస్తూ.. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రోహన్ లేకపోయినప్పటికీ.. ఆయన విలువలు మాకు మార్గదర్శకంగా కొనసాగుతాయి. అయన కలలను నిజం చేయడానికి, సంస్థను అభివృద్ధి చేయడానికి మేము కలిసి పని చేస్తామని కంపెనీ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది.అంకుర్ గోయెల్ (సీఓఓ & వ్యవస్థాపక సభ్యుడు), ఉదయ్ థాక్కర్ (కో-ఫౌండర్ & డైరెక్టర్) నేతృత్వంలో కంపెనీ రోజువారీ కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఇందులో రోహన్ కుటుంబం కూడా ఉంటుంది. రోహన్ మా గురువు, స్నేహితుడు.. నాయకుడు. అతని విజన్‌ని ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నామని అంకుర్ గోయెల్ & ఉదయ్ థాక్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
కెనడాలో ఏపీకి చెందిన విద్యార్థి హఠాన్మరణం!
కెనడాలో ఉన్నత చదువులకోసం వెళ్లిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు పిల్లి ఫణి కుమార్(36) వైజాగ్‌లోని గాజువాక ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు. దీంతో ఫణి కుమార్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయికాల్గరీలోని సదరన్ ఆల్బర్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SAIT)లో సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఎంఎస్ చదివేందుకు 2024 ఆగస్టు నెలలో వెళ్ళాడు ఫణి కుమార్. అయితే డిసెంబర్ 14న ఫణి కుమార్ రూమ్మేట్, ట్రక్ డ్రైవర్ తన కమారుడి మరణం గురించి సమాచారం అందించాడని తండ్రి, నాగ ప్రసాద్ తెలిపారు. గుండెపోటుతో చనిపోయినట్టు భావిస్తున్నప్పటికీ అయితే, ఈ మరణానికి గల కారణాలపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాల్గరీ పోలీసులు ఫణి కుమార్ వస్తువులను అతని ల్యాప్‌టాప్, పాస్‌పోర్ట్, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తన కుమారుడి మృతదేహాన్ని కెనడా నుంచి భారతదేశానికి తీసుకునేందుకు సహకరించాల్సిందిగా నాగప్రసాద్, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఓంప్రకాశ్ చౌతాలా కన్నుమూత
-
బలగం సింగర్ మొగిలయ్య మృతి
-
వృక్ష ప్రేమి తులసిగౌడ కన్నుమూత
యశవంతపుర: కర్ణాటకలో తన జీవితాన్ని మొక్కలు, చెట్ల పోషణకు అంకితం చేసిన తులసిగౌడ (90) కన్నుమూశారు. ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హొన్నళ్లికి చెందిన తుళసిగౌడ మంగళవారం వృద్ధాప్య సమస్యలతో మృతి చెందారు. మొక్కలు నాటితే చాలదు, వాటిని అలాగే సంరక్షించాలని సూచించేవారు. 17 ఏళ్ల పాటు ఆమె అటవీశాఖలో దినసరి కూలీగా పని చేశారు. ఆమె సేవలను గుర్తించిన అప్పటి అటవీశాఖ అధికారి యల్లప్పరెడ్డి ఆమెను పర్మినెంట్ ఉద్యోగిని చేశారు. ఆమె ఉద్యోగంలో ఉన్నా, రిటైరైనా మొక్కలపైనే మనసంతా ఉండేది. అనేక గ్రామాలలో రోడ్డు పక్కన వేలాదిగా మొక్కలు నాటి సంరక్షించారు. ఫలితంగా పచ్చదనం పెంపొందించారు. సుమారు 30 వేల మొక్కలను నాటి ఉంటారని ఒక అంచనా. ఎంత ఎదిగినా అత్యంత నిరాడంబరంగా ఉండడం ఆమెకే చెల్లింది. తులసిగౌడ సేవలకు గుర్తుగా 2020 జూలైలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఇటీవల ఆమె సొంతూరిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆనకట్ట కట్టాలని అధికారులు సర్వే చేశారు. ఇందుకోసం అటవీ ప్రాంతంలో చెట్లను నరకటంతో ఆమె ఆగ్రహించి ఆనకట్ట వద్దంటూ సర్వే అధికారులను వెనక్కి పంపారు. ప్రధాని మోదీ సంతాపం పర్యావరణవాది, పద్మశ్రీ తులసిగౌడ మరణం తీవ్ర విషాదకరమని ప్రధాని మోదీ ఎక్స్‌లో సంతాపం తెలిపారు. మొక్కల సంరక్షణకే తులసిగౌడ జీవితాన్ని ధారపోశారని, భూమిని రక్షించడానికి యువతకు స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. -
వాహ్ ఉస్తాద్ వాహ్
పుట్టిన వెంటనే చెవిలో ‘కల్మా’ కాకుండా తబలా జతులు విన్నవాడు... మూడేళ్లకే తబలాను పసి వేళ్లతో మీటిన వాడు... ఏడేళ్లకు ప్రదర్శనలు ఇచ్చినవాడు...పన్నెండేళ్లకు ప్రపంచ యాత్రకు బయల్దేరినవాడు... మహా మహా విద్వాంసులకు సహ వాద్యగాడు... తనే స్వయంగా అద్వితీయ వాద్యకారుడు... తబలా ప్రపంచానికి ఈశ్వరుడు... దేవుడు... ఉస్తాద్ జాకీర్ హుసేన్.టీషర్ట్, జీన్స్ వేసుకుని ఆధునిక యువకుడిగా ఉంటూ సంప్రదాయ శాస్త్రీయ సంగీతాన్ని కుర్రకారుకు చేరువ చేసిన ఈ నవ యువ వాద్య మాంత్రికుడు కన్నుమూశాడు. అతను లేడు. అతనిలాంటి వాడు మరి రాడు. ఒక్కడే జాకిర్ హుసేన్.జాకిర్ హుసేన్ ప్రదర్శనలో ఎవరైనా ఇది చూడాలి. ఆయన తబలా మీద డమరుకాన్ని, శంఖాన్ని వినిపిస్తాడు. ‘ఎడమ’ మీద డమరుకం వినిపిస్తూ ‘కుడి’ని మీటి శంఖనాదాన్ని సృష్టిస్తాడు. ఆ శంఖనాద సమయంలో జాకిర్ హుసేన్ వేళ్లు ఎంత వేగంగా కదులుతాయంటే అవి కనపడవు. పైగా తబలాని తాకినట్టుగా కూడా ఉండవు. ఇలా వాయించడం అసాధ్యం. ‘ఇది ఎలా సాధించారు’ అని అనడిగితే ‘సాధన చేయాలి. తబలాతో స్నేహం చేయాలి. దాని మాటకు చెవి ఒగ్గాలి’ అంటాడు జాకిర్ హుసేన్. అంత వినమ్రంగా ఉండటం వల్లే ఆయన తన తబలాకు ప్రపంచమే చెవి ఒగ్గేలా చేయగలిగాడు. ‘ఉస్తాద్’ కాగలిగాడు. ‘మేస్ట్రో’ అనిపించుకున్నాడు.‘మీరు తబలా ఏ వయసులో నేర్చుకోవడం మొదలెట్టారు’ అని అడిగితే జాకిర్ హుసేన్ ఆశ్చర్యపోతాడు. ‘అదేం ప్రశ్న’ అంటాడు. నిజమే. అతను పుట్టిందే తబలా ఉన్న ఇంట్లో. జాకిర్ తండ్రి ఉస్తాద్ అల్లా రఖా జగమెరిగిన తబలా విద్వాంసుడు. మన దేశంలో తబలాకు ఔన్నత్యం తీసుకు వచ్చిన తొలి విద్వాంసుడు. ఆయనకు పెద్ద కొడుకుగా 1951లో ముంబైలో జన్మించాడు జాకిర్ హుసేన్. నర్సింగ్ హోమ్ నుంచి మరుసటిరోజు ఇంటికి తీసుకొస్తే ముస్లిం సంప్రదాయం ప్రకారం తండ్రి తన కొడుకు చెవిలో ‘కల్మా’ చదివి, పేరు పలికి లోపలికి తీసుకెళ్లాలి. కాని అల్లా రఖా జాకిర్ని తన చేతుల్లో తీసుకుని ‘ధాధా ధినా.. థాథా తునా’ అని తబలా జతులు వినిపించాడు. భార్య ‘ఇదేమిటండీ చోద్యం.. దైవ స్తోత్రం వినిపించక’ అనంటే ‘నా దైవం తబలాయే’ అని బదులిచ్చాడాయన. అలా జాకిర్‌కు పుట్టిన వెంటనే తబలా తెలిసింది. జాకిర్‌ను పడుకోబెట్టడానికి తండ్రి రోజూ ఒడిలోకి తీసుకుని తబలా జతులు వినిపిస్తూనే వెళ్లాడు. ఇలా మూడేళ్లు ఆ పసికందు మెదడులోకి తబలా మాత్రమే వెళ్లింది. మూడేళ్లు వచ్చేసరికి జాకిర్ తబలా వరకూ బుడిబుడి అడుగులు వేస్తూ వెళ్లి అత్యంత సహజంగా దానిని మీటాడు.జాకిర్ హుసేన్ తబలా యాత్ర మొదలైంది.మన దేశానికి స్వతంత్రం వచ్చే వరకూ శాస్త్రీయ సంగీతం ఆస్థానాల్లో, దర్బారుల్లో, శ్రీమంతుల మహళ్లలో ఉండిపోయింది. స్వతంత్రం వచ్చాక అవన్నీ వెళ్లి సంగీత కచ్చేరీలు మొదలయ్యాయి. అయితే వాటికి ఆదరణ అంతంత మాత్రమే ఉండేది. ఆ సమయంలో సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్, సరోద్ వాద్యకారుడు అలి అక్బర్ ఖాన్‌లాంటి వారు అమెరికాకు వెళ్లి ప్రదర్శనలు ఇస్తూ మన దేశం తిరిగి వచ్చి అటెన్షన్ సంపాదించారు. ఆ తర్వాతి రోజుల్లో సంతూర్ పండిట్ శివకుమార్, వేణువు హరిప్రసాద్ చౌరాసియా కూడా పశ్చిమ దేశాలలోకి మన సంగీతాన్ని తీసుకెళ్లాడు. పండిట్ రవిశంకర్‌కు శాశ్వతంగా అల్లారఖా తబలాజోడిగా ఉండేవారు. అయితే అల్లా రఖాకు అనారోగ్యం వల్ల జాకిర్‌కు 19ఏళ్లు ఉండగా మొదటిసారి అమెరికా వెళ్లి రవి శంకర్‌కు సహ వాయిద్యం అందించే వీలు జాకిర్‌కు దక్కింది. మొదటిసారి అలా అమెరికాలో అడుగు పెట్టిన జాకిర్ జీవితంలో అత్యధిక కాలం అమెరికాలో ఉంటూ అక్కడినుంచే దేశ విదేశాలలో ప్రదర్శనలు ఇస్తూ తబలా వాదనలో ఉండే ఉత్కృష్ట ధ్వనిని ప్రపంచానికి వినిపించాడు. చివరకు అక్కడే– డిసెంబర్ 16 (సోమవారం) అంతిమ శ్వాస వదిలాడు.‘తబలాకు ఎప్పుడూ కాలు తగలనివ్వకు బాబూ. అది మన సరస్వతి’ అనేవారట ఉస్తాద్ అల్లారఖా. అందువల్ల జాకిర్ హడావిడి ప్రయాణాల్లో రైళ్లలో సీటు దొరక్కపోతే కింద కూచుని తబలాను ఒళ్లో జాగ్రత్తగా పెట్టుకునేవారు. ‘నేను తబలా నేర్చుకుంటాను’ అని ఏడేళ్ల వయసులో మొదటిసారి జాకిర్ తన తండ్రితో చెప్పినప్పుడు ఆ మరుసటి రోజు రాత్రి 3 గంట లకు నిద్ర లేపి సాధన మొదలేయించేవారట అల్లారఖా. రోజూ రాత్రి మూడు నుంచి ఉదయం 6 వరకు వారి సాధన సాగేది. ఆ తర్వాత స్కూల్ వెళ్లి సాయంత్రం మళ్లీ సాధన కొనసాగించేవాడు. ‘పండితులకు జన్మించే పిల్లలకు పోలిక ఉంటుంది. అల్లా రఖా కొడుకై ఉండి ఇంత సామాన్యంగా వాయిస్తున్నాడా అనంటే మా నాన్న పరువేంగాను. అందుకే నేను మరింత కష్టపడేవాణ్ణి’ అంటాడు జాకిర్. అంతేకాదు అన్ని మతాల సంగీతం నుంచి కూడా నేర్చుకోవడానికి చూశాడు. ‘నేను స్కూల్‌కు వెళ్లే దారిలో చర్చిలో సంగీతం వినేవాణ్ణి. గుడిలో వినిపించే భక్తి గీతాలు ఆలకించేవాణ్ణి. ప్రపంచంలో ఏ మతమూ ఇంకో మతంపైన జబర్దస్తీ చేయదు. ఏ మతమైనా చెప్పేది నీ పొరుగువారిని ప్రేమించమనే’ అంటాడు జాకిర్ హుసేన్. అందుకే జాకిర్ అన్ని మతాల, అన్ని ధోరణుల విద్వాంసులతో అతి సులువుగా కలిసిపోయి తన తబలాను వారి సంగీతానికి జత చేయగలిగారు. ముఖ్యంగా సంతూర్ శివకుమార్‌తో ఆయనకు సుదీర్ఘ స్నేహం సాగింది. కొన్నాళ్ల క్రితం శివకుమార్ మరణించినప్పుడు ఆయన అంత్యక్రియలకు హాజరైన జాకిర్ హుసేన్ దహన వాటిక నుంచి అందరూ వెళ్లిపోయినా తనొక్కడే మండుతున్న చితి పక్కన చాలా సేపు నిలబడిపోయి ఆ స్నేహితునికి అంతిమ వీడ్కోలు పలికాడు. ఈ భారతీయ హిందూ ముస్లిం శాస్త్రీయ సంగీత భాగస్వామ్యాన్ని జాకిర్ స్థిరంగా ప్రచారం చేశాడు. కొనసాగాలని కోరుకున్నాడు.బీటెల్స్ గ్రూప్ ద్వారా ఖ్యాతి గాంచిన గిటారిస్ట్ జార్జ్ హారిసన్ ‘లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్’ అనే ఆల్బమ్‌లో జాకిర్ భాగస్వామ్యాన్ని కోరడంతో 1973 నుంచి ఫ్యూజన్ సంగీతానికి ప్రచారం కల్పించసాగాడు జాకిర్ హుసేన్. అమెరికన్ జాజ్ మ్యుజీషియన్ జాన్ హ్యాండీ, ఐరిష్ గాయకుడు వాన్ మారిసన్, అమెరికన్ డ్రమ్మర్ మికీ హర్ట్లాంటి ప్రసిద్ధులతో యాభై ఏళ్ల క్రితమే పని చేయడం వల్ల జాకిర్ హుసేన్‌కి హద్దులు లేని ప్రచారం, ప్రశంస లభించాయి. గాత్ర సంగీతమైనా, వాద్య సంగీతమైనా, జుగల్బందీ అయినా, వ్యక్తిగత ప్రదర్శన అయినా, ఫ్యూజన్ అయినా జాకిర్ నీరు పాత్ర రూపు దాల్చినంత సులభంగా ఇమిడిపోయి కచ్చేరికి అందం, ఆనందం తెచ్చేవాడు. పొడవైన తన గుబురు జుత్తు గాలిలో ఊగేలా ఆయన సాగించే తబలా వాదనను చూడటానికి జనం విరగబడేవారు. ముచ్చటపడేవారు.జాకిర్ హుసేన్ మన దేశంలో ‘పద్మశ్రీ’తో గౌరవించబడ్డ (1988) అత్యంత పిన్న వయస్కుడు (అవార్డు ప్రకటించే సమయానికి). ఆ తర్వాత ఆయనకు ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’ వచ్చాయి. నాలుగుసార్లు ‘గ్రామీ’ గెలుచుకున్న ఏకైక భారతీయ సంగీతకారుడు. అంతేనా? అమెరికా ప్రభుత్వం కళ, సాంస్కృతిక రంగాల్లో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక ఫెలోషిప్ ‘నేషనల్ హెరిటేజ్ ఫెలోషిప్’ జాకిర్‌ను వరించింది. జాకిర్ సినిమాలకు పని చేశాడు. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘వానప్రస్థం’ సినిమాకు పాటలు కంపోజ్ చేశాడు. లతా మంగేశ్కర్, ఆశా భోంస్లేల జీవితం ఆధారంగా తీసిన ‘సాజ్’ (1998)లో ఆశా భోంస్లే భర్త ఆర్.డి.బర్మన్ పాత్రలో కనిపించాడు. మంచి మాటగాడు, హాస్యప్రియుడు, భోజన ప్రియుడైన జాకిర్ హుసేన్ ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉంటుంది. నవ్వులు ఉంటాయి. తబలా ఎలాగూ ఉంటుంది.గొప్ప సంగీతమయ ప్రపంచాన్ని సృష్టించి, శుభ నాదాలను జగత్తులోకి వదిలి సంగీతం ద్వారా శాంతము పొందమని కోరుతూ వీడ్కోలు తీసుకున్నాడు ఉస్తాద్ జాకిర్ హుసేన్. ప్రపంచ సంగీత ప్రియులు అతణ్ణి తలచుకుని కన్నీరు కారుస్తున్నారు. జాకిర్ ఆత్మ విశ్వ సంగీతంలో డోలలూగాలి.– కె -
'వరుడు' హీరోయిన్ భానుశ్రీ ఇంట్లో విషాదం
అల్లు అర్జున్ 'వరుడు' సినిమాలో హీరోయిన్గా నటించిన భానుశ్రీ మెహ్రా.. ఆ తర్వాత కూడా తెలుగులో కొన్ని మూవీస్ చేసింది గానీ పెద్దగా పేరు రాలేదు. దీంతో ఐదేళ్ల క్రితం కరణ్ మానస్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుని సెటిలైపోయింది. ఇప్పుడు ఈమె ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈమె సోదరుడు నందు.. ఏడు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో చనిపోయాడు. ఈ క్రమంలోనే అతడిని తలుచుకుని భావోద్వేగానికి లోనైంది. సోషల్ మీడియాలో తన సోదరుడితో ఉన్న జ్ఞాపకాల్ని పంచుకుంది.(ఇదీ చదవండి: ఇళయరాజాకు అవమానం? వీడియో వైరల్)'నువ్వు చనిపోయి ఏడు రోజులైంది. కానీ ఇంకా పీడకలలానే ఉంది. ఇదంతా నిజమని ఎలా నమ్మాలి? నువ్వు లేకపోవడంతో కుటుంబంలో స్తబ్దుగా మారింది. ప్రతి చిన్న విషయంలోనూ నువ్వే గుర్తొస్తున్నావ్. నువ్వు లేవనే బాధ.. జీవితాంతం నేను మోయాల్సిందే. నా మనసులో ఎప్పటికీ నీకు చోటుంటుంది. ఐ లవ్ యూ. నందు ఐ మిస్ యూ' అని భానుశ్రీ తన బాధనంతా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) View this post on Instagram A post shared by внanυѕнree мeнra (@mehrabhanushree) -
తబలా మ్యాస్ట్రో జాకీర్ హుస్సేన్ కన్నుమూత
-
ఫ్యాషన్ టైకూన్ ఇసాక్ ఆండిక్ కన్నుమూత
ఫ్యాషన్ సామ్రాజ్యం ‘మ్యాంగో’ వ్యవస్థాపకుడు, అధినేత ఇసాక్ ఆండిక్ కన్నుమూశారు. శనివారం ఆయన పర్వత ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆండిక్ వయసు 71 ఏళ్లు. బార్సిలోనా సమీపంలోని మోంట్సెరాట్ గుహలలో బంధువులతో హైకింగ్ చేస్తుండగా కొండపై నుండి 100 మీటర్లకు పైగా జారి పడిపోయాడని పోలీసు ప్రతినిధి తెలిపారు."మాంగో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు ఇసాక్ ఆండిక్ ఆకస్మికంగా మృతి చెందారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని కంపెనీ సీఈవో టోని రూయిజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన నిష్క్రమణ భారీ శూన్యతను మిగిల్చిందని, ఆయన కంపెనీ కోసం జీవితాన్ని అంకితం చేశారని, వ్యూహాత్మక దృష్టి, స్ఫూర్తిదాయకమైన నాయకత్వంతో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.ఇస్తాంబుల్‌లో జన్మించిన ఆండిక్ 1960లలో ఈశాన్య స్పానిష్ ప్రాంతమైన కాటలోనియాకు వలస వెళ్లి 1984లో ఫ్యాషన్ బ్రాండ్ మ్యాంగోను స్థాపించారు. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్‌వర్త్ 4.5 బిలియన్ డాలర్లు. ఆయన ప్రస్తుతం కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్ ఫ్యాషన్ రిటైలర్ అయిన ఇండిటెక్స్ అధినేత అమాన్సియో ఒర్టెగాను ఢీకొట్టిన వ్యాపారవేత్త ఆండిక్.తిరుగులేని బ్రాండ్దాదాపు 2,800 స్టోర్లతో యూరప్‌లోని అతిపెద్ద ఫ్యాషన్ గ్రూపులలో మ్యాంగో ఒకటిగా ఉంది. దాని వెబ్సైట్ ప్రకారం మ్యాంగో గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 120 కంటే ఎక్కువ దేశాలలో వ్యాపారాలు నిర్వహిస్తోంది. 15,500 మంది ఉద్యోగులతో ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ గ్రూపులలో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2023లో కంపెనీ టర్నోవర్ 3.1 బిలియన్ యూరోలు. -
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
-
ప్రమాదంలో గాయపడి బిర్సా ముండా మునిమనవడు మృతి
రాంచీ: గిరిజనుల ఆరాధ్య దైవం బిర్సా ముండా ముని మనవడు మంగళ్ ముండా కన్ను మూశారు. ఆయన వయస్సు 45 ఏళ్లు. ఈ నెల 25న ఖుంటి జిల్లాలో వాహనం పైనుంచి ప్రమాదవశాత్తు కిందపడిన మంగళ్ తీవ్రంగా గాయపడ్డారు. ముందుగా ఖుంటిలోని సదర్ ఆస్పత్రిలో చికిత్స చేశారు. తలకు తీవ్ర గాయాలై రక్తం గడ్డకట్టడంతో రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)కు తరలించి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తు న్నారు. శుక్రవారం ఆయన కార్డియో వాస్క్యులర్ ఫెయిల్యూర్‌తో తుదిశ్వాస విడిచారని రిమ్స్ వర్గాలు తెలిపాయి. ఆయన్ను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేశామని రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ హిరేన్ చెప్పారు. సీఎం హేమంత్ సోరెన్ రిమ్స్‌కు వెళ్లి మంగళ్ ముండా కుటుంబసభ్యులను ఓదా ర్చారు. మంగళ్ ముండా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. -
ఎయిర్‌సెల్ అధినేత కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త టి.ఆనంద కృష్ణన్(86) గురువారం మృతి చెందారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. టెలికమ్యూనికేషన్స్ నుంచి చమురు, గ్యాస్ వరకు విభిన్న రంగాల్లో ఈయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. మలేషియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా, అక్కడ సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా ఆనంద కృష్ణన్ నిలిచారు. తన మృతిని ధ్రువీకరిస్తూ మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘కార్పొరేట్ ప్రపంచానికి కృష్ణన్ చాలా సేవలందించారు. అనేక దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణన్ సమాజానికి చేసిన కృషి చిరస్మరణీయం’ అని ఇబ్రహీం అన్నారు.ఎవరీ ఆనంద కృష్ణన్?మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని బ్రిక్‌ఫీల్డ్ ప్రాంతంలో కృష్ణన్ ఏప్రిల్ 1, 1938న జన్మించారు. కృష్ణన్ పూర్వీకులకు భారత్‌తో సంబంధం ఉంది. ఆనంద మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. 1964లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పట్టా పొందరు. తర్వాత వ్యాపారంలో అడుగుపెట్టి చాలా అభివృద్ధి చెందారు. టెలికాం, ఉపగ్రహాలు, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్ పరిశ్రమల్లో తన వ్యాపారాన్ని విస్తరించారు. ఆనందకు ముగ్గురు సంతానం. తన కుమారుడు థాయిలాండ్‌లో బౌద్ధ సన్యాసిగా మారాడు. మిగిలిన ఇద్దరు కుమార్తెలు అతని వ్యాపార నిర్వహణలో పాలుపంచుకోలేదు.ఐపీఎల్ టీమ్‌కు స్పాన్సర్‌గా కూడా..ఒకప్పుడు ఆనంద ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను స్పాన్సర్ చేశారు. గతంలో దక్షిణాదిలో కార్యకలాపాలు సాగించిన ఎయిర్‌సెల్ టెలికాం కంపెనీకి సారథ్యం వహించారు. ఫోర్బ్స్ ప్రకారం కృష్ణన్ ప్రముఖ డీల్ మేకర్లలో ఒకరిగా ఎదిగారు. చమురు వ్యాపారంలోకి ప్రవేశించే ముందు బిజినెస్ కన్సల్టెన్సీని స్థాపించారు. మల్టీమీడియా వెంచర్లను ప్రారంభించారు. మ్యాక్సిస్ బీహెచ్డీ అనే టెలికా కంపెనీని ఏర్పాటు చేశారు. ఆనంద కృష్ణన్ మలేషియాలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా నిలిచారు.అవినీతి ఆరోపణలు2006లో ఎయిర్‌సెల్‌పై మాక్సిస్ నియంత్రణ సాధిస్తుందని ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి దేశంలోని పలు కంపెనీలు అభియోగాలు మోపడంతో కోర్టులో కేసు నడుస్తోంది.ఇదీ చదవండి: పన్ను లేకుండా ‘దోసె’స్తున్నారు!ఆనంద స్థాపించిన కొన్ని ప్రముఖ కంపెనీలుఆస్ట్రో మలేషియా హోల్డింగ్స్: మలేషియాలో ప్రముఖ శాటిలైట్ టెలివిజన్ ప్రొవైడర్.బుమి అర్మడా: ఈ సంస్థ చమురు సర్వీస్ అందిస్తోంది.ఎయిర్ సెల్: ఒకప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు స్పాన్సర్ గా వ్యవహరించిన టెలికమ్యూనికేషన్స్ కంపెనీ ఎయిర్ సెల్. -
విషాదం.. ఆ స్వీట్ వాయిస్ ఇక వినిపించదు!
పెద్దలకు సినిమాలంటే ఎంత ఇష్టమో.. పిల్లలకు కార్టూన్ చిత్రాలంటే ఇష్టం. అలా చిన్నపిల్లలు ఇష్టపడేవాటిలో డోరమాన్, నింజా హటోరి పాత్రలు ప్రధానంగా వినిపిస్తాయి. ఆ క్యారెక్టర్స్‌కు చిన్నపిల్లల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ పాత్రలకు కిడ్స్ అంతలా కనెక్ట్ అయ్యారు. ఈ కార్టూన్ సిరీస్‌లకు యానిమేషన్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.ఇంత క్రేజ్ ఉన్న నింజా హట్టోరి, డోరేమాన్ల పాత్రలకు వాయిస్ అందించిన యానిమేషన్ లెజెండ్ జుంకో హోరీ మరణించారు. జపాన్‌కు చెందిన ఆమె నవంబర్ 18న మరణించినట్లు ఆమె టాలెంట్ ఏజెన్సీ ప్రొడక్షన్ బావోబాబ్ ఈ వారంలో ప్రకటించింది. వృద్ధాప్య సమస్యలతోనే జుంకో హోరీ మరణించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని నవంబర్ 25న తెలిపారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యుల కోరిక మేరకే ఆలస్యంగా ప్రకటన విడుదల చేశామని పేర్కొన్నారు. దయచేసి అభిమానులు ఆమె ఇంటిని సందర్శించడం మానుకోవాలని ప్రకటనలో వెల్లడించారు. -
విషాదం.. టాలీవుడ్ గీత రచయిత కన్నుమూత
టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ గీత రచయిత కులశేఖర్ చనిపోయారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం కన్నుమూశారు. సాంగ్ రైటర్‌గా ఓ వెలుగు వెలిగిన ఈయన తర్వాతి రోజుల్లో మానసికంగా చాలా కుంగిపోయారు. ఇప్పుడు ఇలా దయనీయ స్థితిలో మృత్యు ఒడికి చేరారు.(ఇదీ చదవండి: 'పుష్ప' నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు)వైజాగ్‌కి చెందిన కులశేఖర్.. హైదరాబాద్‌లో తొలుత జర్నలిస్టుగా చేశారు. తర్వాత గీత రచయిత అయ్యారు. అలా 'చిత్రం', ఔనన్నా కాదన్నా, ఘర్షణ, భద్ర, నువ్వు నేను, సంతోషం, జయం, సైనికుడు లాంటి మంచి సినిమాల్లో పాటలు రాశారు. తర్వాత ఈయన కెరీర్ డౌన్ ఫాల్ అయింది. దీంతో మానసికంగా చాలా కుంగిపోయారు. దొంగతనాల వల్ల పలుమార్లు జైలుకు కూడా వెళ్లొచ్చారు.గత కొన్నాళ్లలో పెద్దగా సినిమాలు చేయలేదు. ఇంటర్వ్యూల్లోనూ కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు ఈయన చనిపోయారని తెలిసి పలువురు సినీ ప్రముఖు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ఐదేళ్ల నిరీక్షణ.. 'జీబ్రా' ఫలితంపై సత్యదేవ్ ఎమోషనల్) -
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య మృతి
-
భద్రాద్రి కొత్తగూడెం: మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య (70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఉమ్మడి ఏపీలో బూర్గంపాడు నుంచి 1983లో సీపీఐ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1994, 2009లో టీడీపీ నుంచి రెండుసార్లు ఇల్లందు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన.. ఇల్లందు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 టీఆర్ఎస్ నుంచి, 2018లో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఆయన మృతిపట్ల పలువురు నేతలు సంతాపం తెలుపుతున్నారు. -
చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు(72) కన్నుమూశారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మధ్యాహ్నం 12:45కు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నెల 14న ఆసుపత్రిలో చేరారు. రేపు(ఆదివారం) సొంతూరు నారావారి పల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.రామ్మూర్తి నాయుడు 1952లో నారా కర్జూర నాయుడు, అమ్మణమ్మ దంపతులకు రెండో సంతానంగా జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు నారా రోహిత్ కాగా, మరొకరు గిరీష్. 1994 నుండి 1999 వరకు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు పనిచేశారు. రెండోసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. -
చిన్న వయసులోనే యువ దర్శకుడు కన్నమూత
తమిళ యువ దర్శకుడు సురేశ్ సంగయ్య మృతి చెందారు. గత కొన్ని రోజులుగా లివర్ (కాలేయ) సమస్యలతో బాధపడుతున్న ఈయన.. శుక్రవారం రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇతడి ఫ్రెండ్, సినిమాటోగ్రాఫర్ శరణ్ ధ్రువీకరించారు.(ఇదీ చదవండి: )2017లో 'ఒరు కిడైయిన్ కరు మను' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఇతడు.. గతేడాది 'సత్య సొతనై' అనే మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కొన్నాళ్ల క్రితం కమెడియన్ యోగిబాబుతో ఓటీటీ సినిమా కూడా తీశాడు.అయితే గత కొన్నాళ్లుగా లివర్ సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. డైరెక్టర్ సురేశ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ) -
కొరియన్ డ్రామా నటుడు సాంగ్ జే రిమ్ కన్నుమూత
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటుడు సాంగ్ జే రిమ్(39) తన ఇంటిలో కన్నుమూశారు. సాంగ్ జే రిమ్ మరణానికి కారణం ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు. కే-డ్రామాలు 'ది మూన్ ఎంబ్రేసింగ్ ది సన్', 'క్వీన్ వూ'లో కీలక పాత్రలు పోషించిన జే రిమ్ మంచి నటునిగా పేరు తెచ్చుకున్నారు.సాంగ్ జే రిమ్ మరణవార్త తెలిసిన వెంటనే అభిమానులు షాక్‌కు గురయ్యారు. తమ అభిమాన నటుడు ఇక ఈ లోకంలో లేడంటే నమ్మలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.మీడియాకు అందిన సమచారం ప్రకారం పోలీసులు సాంగ్ జే రిమ్ మృతిపై దర్యాప్తు చేపట్టారు. జే రిమ్ ఇంటిలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై అటు జే రిమ్ కుటుంబ సభ్యులు లేదా ఇటు సియోల్ పోలీసులు గానీ మీడియాకు నిర్దిష్ట సమాచారం ఇవ్వలేదు.సాంగ్ జే రిమ్ అంత్యక్రియలు నవంబర్ 14న జరగనున్నాయి. సాంగ్ జే రిమ్ మృతికి విచారం వ్యక్తం చేస్తూ అతని అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 2009లో సాంగ్ జే రిమ్ నటనను ప్రారంభించారు. తొలుత 2011లో మూన్ ఎంబ్రేసింగ్ ది సన్‌లో నటించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇది కూడా చదవండి: ‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా -
తమిళ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత
-
ప్రముఖ నటుడు ఢిల్లీ గణేశ్ కన్నుమూత
ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఢిల్లీ గణేశ్ (80) కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించారు. వీటితో పాటు తమిళ సీరియల్స్, వెబ్ సిరీసుల్లోనూ నటించారు. అయితే గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. చెన్నైలో శనివారం రాత్రి 11:30 గంటలకు తుదిశ్వాస విడిచారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక)ఢిల్లీ గణేశ్ మృతితో తమిళ, తెలుగు ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఈయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చివరగా ఈయన కమల్ హాసన్ 'భారతీయుడు 2' మూవీలో కనిపించారు. అంతకు ముందు తెలుగులో ఈయన 'జైత్రయాత్ర', 'నాయుడమ్మ', 'పున్నమినాగు' తదితర సినిమాల్లో నటించారు. షారుఖ్ 'చెన్నై ఎక్స్‌ప్రెస్', సూర్య 'వీడొక్కడే', లారెన్స్ 'కాంచన 3' లాంటి డబ్బింగ్ చిత్రాల్లో ఈయన మీకు కనిపించే ఉంటారు.1976లో ప్రారంభమైన ఢిల్లీ గణేశ్ సినీ ప్రస్థానం.. ఈ ఏడాది వరకు కొనసాగింది. సినిమా ఇండస్ట్రీ రాకముందు ఈయన భారత వైమానిక దళంలోనూ పనిచేశారు. మొదటి సినిమా కె.బాలచందర్ దర్శకత్వంలో పట్టిన ప్రవేశం (1977)లో నటించారు. 1994 కలైమామణి అవార్డును తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈయనకు అందించింది. (ఇదీ చదవండి: OTT Review: గల్లీ ప్రేమను సింపుల్‌గా గెలిపించిన క్రికెట్) -
చిన్న వయసులోనే మృతి చెందిన నటుడు
ప్రముఖ హిందీ నటుడు నితిన్ చౌహాన్ (35) మృతి చెందాడు. ముంబైలోని గురువారం తన అపార్ట్మెంట్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇతడు తుదిశ్వాస విడిచిన విషయాన్ని ఫ్రెండ్స్ సుదీప్ సాహిర్, విభూతి ఠాకుర్ ధ్రువీకరించారు. తన స్నేహితుడి తమని వదిలేసి వెళ్లిపోవడంపై సంతాపం తెలియజేశారు.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌కి చెందిన నితిన్ చౌహాన్.. ముంబైలో నటుడిగి నిలదొక్కుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇందులో భాగంగానే స్ప్లిట్స్ విల్లా 5, జిందకీ డాట్ కామ్, క్రైమ్ పాట్రోల్ లాంటి రియాలిటీ షోల్లో పాల్గొన్నాడు. రెండేళ్ల క్రితం చివరగా 'తేరే యాన్ హూన్ మై' అనే సీరియల్లో నటించాడు.స్వతహాగా ఫిట్నెస్ ఫ్రీక్, నెమ్మదస్తుడు అయిన నితిన్.. ఇలా చనిపోయిన విషయాన్ని తోటీ నటీనటులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ఇంత చిన్నవయసులోనే ప్రాణాలు తీసేసుకోవడం ఏంటని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు) -
ప్రముఖ డిజైనర్ మృతి.. ఇంద్ర హీరోయిన్ ఎమోషనల్!
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ మృతిపట్ల సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే సంతాపం తెలిపారు. అతనితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనలయ్యారు. మీరు అద్భుతమైన డిజైనర్ అని అందరికీ తెలుసని అన్నారు. అంతే కాకుండా మీతో ల యూ హమేషా అనే చిత్రంలో నటించిన రోజులు గుర్తుకు వచ్చాయని పేర్కొన్నారు. అతన్ని సోనాలి కేవలం డిజైనర్‌గానే కాకుండా సహ నటుడిగా గుర్తు చేసుకున్నారు. వీరిద్దరు కలిసి నటించిన లవ్ యు హుమేషా మూవీ థియేటర్లలో విడుదల కాలేదు.కాగా.. రోహిత్ బాల్‌ను నవంబర్ 1న కన్నుమూశారు. ఆయన 63 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించారు. దీంతో హీరోయిన్ సోనాలి బింద్రే.. రోహిత్ బాల్‌కు నివాళులర్పించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించారు. ఆమెతో పాటు నటుడు అర్జున్ రాంపాల్ కూడా దివంగత ఫ్యాషన్ డిజైనర్‌కు నివాళులర్పించారు. రోహిత్ బాల్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. కాగా.. ఆయన జ్ఞాపకార్థం సోమవారం సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీలోని సాయి ఇంటర్నేషనల్ సెంటర్లో ప్రార్థనా సమావేశం నిర్వహించారు.కశ్మీర్‌కు చెందిన రోహిత్ బాల్ తన గొప్ప డిజైన్లతో బాలీవుడ్లో ప్రసిద్ధి చెందాడు. చాలామంది బాలీవుడ్ ప్రముఖులకు ఆయన పనిచేశారు. అతని డిజైన్లను పమేలా ఆండర్సన్, ఉమా థుర్మాన్, సిండి క్రాఫోర్డ్, నవోమి కాంప్‌బెల్ లాంటి అంతర్జాతీయ స్టార్స్ సైతం ధరించారు. కాగా.. సోనాలి బింద్రే తెలుగువారికి కూడా సుపరిచితమే. టాలీవుడ్లో ఇంద్ర సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటించింది. -
బాలీవుడ్ సీనియర్ హీరో తొలి భార్య కన్నుమూత
బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి తొలి భార్య హెలెన ల్యూక్ కన్నుమూసింది. అమెరికాలోనే చనిపోయినట్లు ఈమె ఫ్రెండ్, నటి కల్పన అయ్యర్ ధ్రువీకరించింది. ఇండో-అమెరికన్ సిటిజన్ అయిన హెలెన్.. గతంలో పలు హిందీ సినిమాల్లో నటించింది. ఆ సమయంలోనే మిథున్ చక్రవర్తిని పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నాలుగు నెలలు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత ఎవరి దాని వాళ్లు చూసుకున్నారు.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న నటి సన్నీ లియోన్!)మిథున్ చక్రవర్తితో పెళ్లి గురించి అప్పట్లో ఓసారి మాట్లాడిన హెలెన్.. తనని మిథున్ బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేసుకున్నాడని, తర్వాత అతడి నిజస్వరూపం బయటపడటంతో విడిపోయానని చెప్పింది. ఈమె విడాకులు ఇచ్చేసిన తర్వాత యోగిత బలిని మిథున్ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన తర్వాత అమెరికా వెళ్లిపోయిన హెలెన్.. అక్కడి ఉండిపోయింది. తాజాగా ఈమె మరణవార్త తెలిసి పలువురు నెటిజన్లు సంతాపం తెలియజేస్తున్నారు.అయితే చనిపోవడానికి కొన్ని గంటల ముందే హెలెన్.. తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. 'ఫీలింగ్ వీర్డ్. మిక్స్డ్ ఎమోషన్స్ అండ్ నో క్లూ' అని రాసుకొచ్చింది. అయితే ఈమె తన అనారోగ్య సమస్యల గురించే ఇలా పరోక్షంగా ప్రస్తావించిందని, కానీ అకస్మాత్తుగా మరణించడం మాత్రం షాక్‌కి గురిచేసిందని ఆమె స్నేహితులు అంటున్నారు. ఈమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్) -
బీపీఎల్ ఫౌండర్ టీపీజీ నంబియార్ కన్నుమూత
ఎలక్ట్రానిక్స్ సంస్థ బీపీఎల్ (బ్రిటిష్ ఫిజికల్ లేబొరేటరీస్ ఇండియా ) గ్రూప్ వ్యవస్థాపకుడు, ఎమిరిటస్ చైర్మన్ టీపీ గోపాలన్ నంబియార్ (94) గురువారం కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని తన నివాసంలో ఉదయం 10.15 గంటల ప్రాంతంలో మరణించారు.టీపీజీగా ప్రసిద్ధి చెందిన ఆయన బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కి మామగారు. ఈ వార్తను ధ్రువీకరిస్తూ చంద్రశేఖర్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. “బీపీఎల్ గ్రూప్ చైర్మన్, నా మామగారు టీపీజీ నంబియార్ మరణించడం గురించి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓం శాంతి.." రాసుకొచ్చారు.నంబియార్ మృతిపై పలువురు ప్రముఖలు సంతాపం తెలియజేశారు. “టీపీజీ నంబియార్ భారతదేశ ఆర్థిక బలోపేతాన్ని బలంగా కాంక్షించిన మార్గదర్శక ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త. ఆయన మృతి బాధ కలిగింది. ఆయన కుటుంబానికి, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను' అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/ నల్లకుంట: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎస్.ఇంద్రసేన్‌రెడ్డి (81) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన సోమాజి గూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. కళాశాల రోజుల నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఇంద్రసేన్‌రెడ్డి 1960 దశకం మొదట్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి యూని యన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.1972లో ఉమ్మడి ఏపీ యూత్‌కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆయన 1975లో జాతీయ యువ జన కాంగ్రెస్‌కు ఎంపికయ్యారు. ఏపీసీసీ ఉపా ద్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఇంద్ర సేన్‌రెడ్డి ఏఐసీసీ సభ్యుడిగా, ఏపీ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్‌గా, టి. అంజయ్య మంత్రివర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా, ఏపీఐడీసీ చైర్మన్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం సంతాపంమాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేన్‌రెడ్డి మృతి పట్ల ముఖ్య మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఎంతో సేవ చేసిన ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు కూడా సంతాపం వ్యక్తం చేశారు.