
తెలుగు నిర్మాత చిట్టూరి శ్రీనివాసరావు ఇంట్లో విషాదం నెలకొంది. ఈయన సోదరుడు చిట్టూరి కాశీవిశ్వనాథ్ (49) మృతి చెందారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన.. ఈరోజు(జూలై 15) ఉదయం ఉమ్మడి గోదావరి జిల్లాలోని స్వగ్రామం పసివేదులలో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
(ఇదీ చదవండి: కారణం లేకుండా విజయ్‌ని టార్గెట్ చేస్తున్నారు: నాగవంశీ)
2018లో సమంత నటించిన 'యూ టర్న్' సినిమాతో నిర్మాతగా మారిన చిట్టూరి శ్రీనివాసరావు.. తర్వాత 'ద వారియర్', స్కంద, సీటీమార్, కస్టడీ, నా సామి రంగ తదితర చిత్రాలని నిర్మించారు. ప్రస్తుతం మరికొన్ని మూవీస్ తీసే పనుల్లో బిజీగా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఈయన సోదరుడు చనిపోవడంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది.
(ఇదీ చదవండి: చట్టప్రకారం చిరంజీవి దరఖాస్తు పరిష్కరించండి: హైకోర్ట్)