
తన మాటలు, చేతలతో కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం చాలా సైలెంట్ అయిపోయాడు. మరో 15 రోజుల్లో ఇతడు నటించిన 'కింగ్డమ్' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నెమ్మదిగా ప్రమోషన్లు మొదలుపెట్టారు. నిర్మాత నాగవంశీ లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. చిత్ర విశేషాలతో పాటు విజయ్ దేవరకొండని నెటిజన్లు టార్గెట్ చేయడం గురించి కూడా మాట్లాడారు. కారణం లేకుండానే అలా చేస్తున్నారని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
'విజయ్ దేవరకొండని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అలానే కారణం లేకుండా అతడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 'రెట్రో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‍లో కావొచ్చు, రీసెంట్‌గా బాలీవుడ్ ఇంటర్వ్యూలో కావొచ్చు.. అతడు మాట్లాడింది వేరే అర్థం వచ్చేలా మార్చేస్తున్నారు' అని నాగవంశీ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌ని భయపెడుతున్న మెహర్ రమేష్)
విజయ్ దేవరకొండ విషయానికొస్తే కెరీర్ ప్రారంభంలో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం తదితర సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. దీంతో తర్వాత సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో ఆటిట్యూడ్‌తో మాట్లాడేవాడు. ఈ విషయమై సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోల్స్ వచ్చేవి. అందుకు తగ్గట్లు గత కొన్నేళ్లుగా ఇతడు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. మరీ ముఖ్యంగా గత రెండు చిత్రాలు లైగర్, ఫ్యామిలీ స్టార్ అయితే ఘోరమైన రిజల్ట్ అందుకున్నాయి. అందుకే ఇప్పుడు విజయ్ పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. హిట్ కొట్టిన తర్వాత మాట్లాడుదాం అనుకుంటున్నారు.
'కింగ్డమ్'.. జూలై 31న థియేటర్లలోకి రానుంది. మరోవైపు రాహుల్ సంక్రిత్యాన్ తోఓ సినిమా, దిల్ రాజు నిర్మాణంలో 'రౌడీ జనార్ధన్' అని మరో మూవీ విజయ్ దేవరకొండ చేస్తున్నాడు. ఈ మూడు కూడా సక్సెస్ అయితేనే విజయ్ కెరీర్ పరంగా నిలబడతాడు. లేదంటే మాత్రం రేసులో వెనకబడిపోతాడు.
(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంత మారిపోయాడా? అస్సలు ఊహించలేదుగా)