ప్రభాస్‌ ఇంత మారిపోయాడా? అస్సలు ఊహించలేదుగా | Prabhas Watch F1 Movie With Director Prashanth Neel | Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్‌కి బయట తిరిగేంత టైమ్ కూడా ఉందా?

Jul 15 2025 10:50 AM | Updated on Jul 15 2025 3:51 PM

Prabhas Watch F1 Movie With Director Prashanth Neel

తెలుగు హీరోల్లో ప్రస్తుతం ప్రభాస్ అంత బిజీగా మరొకరు ఉండరేమో! ఎందుకంటే ఒకేసారి రెండు మూడు సినిమాలు చేస్తుంటాడు. ఇప్పుడు కూడా 'రాజాసాబ్', ఫౌజీ(వర్కింగ్ టైటిల్), స్పిరిట్ లైన్‌లో ఉన్నాయి. వీటిలో రాజాసాబ్.. ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ కానుంది. ఫౌజీ.. వచ్చే ఏడాది వేసవిలో రావొచ్చు. సరే ఇవన్నీ పక్కనబెడితే ప్రభాస్ సాధారణంగా బయటకు రాడు. అలాంటిది ప్రభాస్ ఎంచక్క హైదరాబాద్ థియేటర్‌లో సినిమా చూశాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్)

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి ప్రభాస్.. 'ఎఫ్ 1' అనే హాలీవుడ్ మూవీ చూశాడు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో వీళ్లిద్దరూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన అభిమానులైతే.. ప్రభాస్‌కి షూటింగ్స్ కాకుండా బయట తిరిగేంత సమయం కూడా ఉందా అని మాట్లాడుకుంటున్నారు.

ఇంట్రవర్ట్ అయిన ప్రభాస్.. సినిమా ఫంక్షన్లకు తప్పితే పెద్దగా బయట కనిపించడు. అలాంటిది ఇప్పుడు సినిమా చూసేందుకు థియేటర్‌కి వచ్చాడని తెలిసి.. ఇంతలా మారిపోయాడేంటి అని కూడా నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో 'సలార్' సినిమా వచ్చింది. దీనికి సీక్వెల్ కూడా రావాల్సి ఉంది. మరి ఇది ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో అని ఫ్యాన్స్ వెయిటింగ్. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత 'సలార్ 2' మొదలుపెడతాడేమో?

(ఇదీ చదవండి: పవన్‌ ఫ్యాన్స్‌ని భయపెడుతున్న మెహర్ రమేష్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement