కిక్-2 సినిమాతో తెలుగువారికి పరిచయమైన బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. చెక్‌బౌన్స్ కేసులో నటుడికి ఢిల్లీ హైకోర్టు ఆరు నెలలు శిక్ష విధించింది. కానీ, గడుపు పెంచాలని పలుమార్లు కోరుతూ కొంత కాలంగా ఆయన కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో కోర్టు ఆగ్రహం చేయడంతో తప్పనిపరిస్థితిల్లో తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.
బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ యాదవ్, అతడి భార్య రాధపై ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2017లో చెక్ బౌన్స్ కేసు పెట్టింది. రాజ్‌పాల్ యాదవ్ తమ వద్ద రూ.5 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని సంస్థకు చెందిన ఎం.జి.అగర్వాల్ రికవరీ కేసు పెట్టాడు. వారు ఇచ్చిన బ్యాంక్ చెక్‌లు కూడా బౌన్స్ అయ్యాయని ఢిల్లీ కోర్టును ఆశ్రయించడంతో రాజ్‌పాల్ దంపతులను 2018లోనే దోషులుగా న్యాయస్థానం తేల్చింది. ఈ క్రమంలో రాజ్‌పాల్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి ఫిర్యాదుదారుడికి తిరిగి డబ్బు చెల్లిస్తానని స్టే తెచ్చుకున్నారు. కానీ, న్యాయస్థానం ముందు ఆయన చేసిన వాగ్ధానం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించలేదు. దీంతో ఢిల్లీ కోర్టు కూడా సీరియస్ అయింది. తీహార్ జైలు అధికారుల ముందు హాజరు కావాలని జారీ చేసింది.


