'ధురంధర్‌-2'లో దర్శకుడి సతీమణి.. | Yami Gautam to play key role in Dhurandhar movie | Sakshi
Sakshi News home page

'ధురంధర్‌-2'లో దర్శకుడి సతీమణి..

Feb 6 2026 8:00 AM | Updated on Feb 6 2026 8:45 AM

Yami Gautam to play key role in Dhurandhar movie

బాలీవుడ్‌ సినిమా 'ధురంధర్‌' భారీ హిట్‌ అందుకుంది. దీంతో దర్శకుడు ఆదిత్య ధర్‌ సీక్వెల్‌ను ప్లాన్‌ చేశారు. పార్ట్‌-2 మార్చి 19న విడుదల కానుంది. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో  జియో స్టూడియోస్‌ నిర్మిస్తుంది.  తాజాగా సీక్వెల్‌ టీజర్‌ను విడుదల చేశారు. అయితే, ధురంధర్‌-2లో ప్రముఖ నటి యామి గౌతమ్‌ నటిస్తుందని తెలుస్తోంది. గౌరవం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్‌తో కూడా భారీగా పాపులర్‌ అయింది. దర్శకుడితో పెళ్లి తర్వాత కూడా  హిందీలో వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంటున్న యామి ఇప్పుడు ధురంధర్‌-2లో కీలకమైన పాత్రలో కనిపించనుంది.

'ధురంధర్‌' దర్శకుడు ఆదిత్య ధర్‌ను నటి యామి గౌతమ్‌ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న  ‘ధురంధర్‌: ది రివెంజ్‌’లో ఒక కీలకమైన పాత్రలో యామి గౌతమి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్‌లో కూడా ఆమె వారం రోజుల పాటు  పాల్గొన్నారట. సినిమాలో ఆమె కనిపించేది కొన్ని నిమిషాలే అయినప్పటికీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా యామి పాత్ర ఉండబోతుందని బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది.  

కాగా యామీ గౌతమ్‌ తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో రీసెంట్‌గా ఆమె నటించిన హక్ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement