పెద్ది, డకాయిట్.. ఇక ది ప్యారడైజ్ వంతు..! | Reason Behind The Tollywood Movies Postponed From March | Sakshi
Sakshi News home page

Tollywood Movies: పెద్ది, డకాయిట్.. ఇక ది ప్యారడైజ్ వంతు..!

Feb 5 2026 7:55 PM | Updated on Feb 5 2026 8:56 PM

Reason Behind The Tollywood Movies Postponed From March

ఇటీవల కొద్దికాలంగా టాలీవుడ్‌ సినిమా పరిస్థితి కాస్తా అయోమయానికి గురి చేస్తోంది. పెద్ద హీరోల చిత్రాల రిలీజ్‌ డేట్లను ముందుగానే అనౌన్స్‌ చేస్తున్నారు. ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుందనేది పక్కాగా ముందే చెప్పేస్తున్నారు. ఆ రోజే గ్రాండ్ రిలీజ్‌ అంటూ పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. తీరా డేట్ దగ్గరికొచ్చేసరికి వాయిదా వేసుకుంటూ పోతున్నారు. భారీ బడ్జెట్‌, స్టార్ హీరో ఉన్నా సరే విడుదలకు వెనకాడుతున్నారు. తాజాగా టాలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.

తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. ఏకంగా ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. గ్లోబల్ స్టార్‌ చెర్రీ- బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ వాయిదా పడడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఈ ‍మార్చిలో పెద్ది చూడాలనుకున్న సినీ ప్రియులకు కూడా ఈ నిరాశే మిగిల్చింది.

అంతేకాకుండా అడివి శేష్ డకాయిట్ సైతం మరోసారి వాయిదా పడింది. గతంలో చాలాసార్లు వాయిదా పడినా.. ఈ ఏడాది మార్చి 19న వస్తామని ప్రకటించారు. అంతలోనే డకాయిట్ పోస్ట్‌ పోన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా కనిపించనుంది.

ఇక మార్చిలో వస్తోన్న టాలీవుడ్ మూవీ ది ప్యారడైజ్. నాని హీరోగా వస్తోన్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ అదే రోజు ఉస్తాగ్ భగత్ సింగ్‌ విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో నాని మూవీ కూడా దాదాపు వాయిదా పడిందనే వార్తలొస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. దీంతో ఈ చిత్రాలన్నీ సమ్మర్‌కు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

దురంధర్-3 దెబ్బకేనా?

ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వాయిదా వేయడం అభిమానుల్లో నిరాశ పెంచుతోంది. తమ అభిమాన హీరోల చిత్రాలు పోస్ట్‌పోన్ కావడం వల్ల ఫ్యాన్స్‌లో ఉన్న క్యూరియాసిటీ తగ్గుతోంది. అయితే ఇలా వరుసగా టాలీవుడ్‌ సినిమాలు వాయిదా పడడానికి ప్రధాన కారణం ఆ ఒక్క సినిమానేనా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మార్చి 19న రానున్న దురంధర్-2 దెబ్బకేనని సగటు సినీ ప్రియుడు భావిస్తున్నారు. లేదంటే నిజంగానే షూటింగ్‌ పెండింగ్‌ వల్ల వాయిదా వేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. వరుసగా మూడు టాలీవుడ్ చిత్రాలు వాయిదా పడడంతో సినీ ప్రియుల్లో అసలేం జరుగుతోందనే డౌటానుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement