ఓటీటీకి 'ది రాజాసాబ్‌'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్ | This Friday Ott Release Movies List with Prabhas The Raja Saab Movie | Sakshi
Sakshi News home page

Friday Ott Release Movies: ఫ్రైడే ఓటీటీ చిత్రాలు.. ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్

Feb 5 2026 6:39 PM | Updated on Feb 5 2026 7:21 PM

This Friday Ott Release Movies List with Prabhas The Raja Saab Movie

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం శ్రీ చిదంబరం గారు, సుమతీ శతకం, యూఫోరియా, బరాబర్ ప్రేమిస్తా లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో సుమతీ శతకం, యూఫోరియా లాంటి సినిమాలపై కాస్తా బజ్‌ ఉంది. పెద్ద సినిమాలేవీ ఈ ఫ్రైడే బాక్సాఫీస్ బరిలో లేకపోవడంతో సినీ ప్రియులు కాస్తా నిరాశకు గురవుతున్నారు.

ఇక ఈ శుక్రవారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే సంక్రాంతి మూవీ సందడి చేయనుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ఈ ఫ్రైడ్ ఓటీటీకి వస్తోంది. జియో హాట్‌ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. అయితే అనుకున్నంత స్థాయిలో ఈ మూవీ రాణించలేకపోయింది. ఈ మూవీతో పాటు పలు   డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ ఫ్రైడే ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

నెట్‌ఫ్లిక్స్

  •    క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 06

  •    సాల్వడార్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 06

  •    ట్రాన్స్‌ఫార్మర్స్ వన్(యానిమేటేడ్ మూవీ)- ఫిబ్రవరి 06

  •    యో బెస్టీ(హాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 06

అమెజాన్ ప్రైమ్

  • ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 06

  •    ఎల్ఓఎల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 06

  •    వయోలెంట్ ఎండ్స్(హాలీవుడ్ మూవీ)-ఫిబ్రవరి 06

జియో హాట్‌స్టార్

  •    ది రాజాసాబ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06

జీ5

  •    షాబాద్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06

  •    పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 07

సన్ నెక్స్ట్

  •    నీలకంఠ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06

సోనీ లివ్

  •    జాజ్ సిటీ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06

టెంట్‌ కోట్టా

  • కోంబుసివీ(తమిళ సినిమా)- ఫిబ్రవరి 06

హెచ్‌బీవో మ్యాక్స్

  • బాయ్స్ గో టూ జూపిటర్(యానిమేషన్ చిత్రం)- ఫిబ్రవరి 06

ముబీ..

  • లా గ్రేజియా(హాలీవుడ్)- ఫిబ్రవరి 06

హులు..

  • స్పిట్స్‌విల్లే(హాలీవుడ్)- ఫిబ్రవరి 06

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement