ఓటీటీకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Nivin Pauly Latest Movie Baby Girl OTT Release Date Confirmed, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Baby Girl OTT Release: ఓటీటీకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌.. ఎక్కడ చూడాలంటే?

Feb 5 2026 5:27 PM | Updated on Feb 5 2026 6:19 PM

Nivin Pauly Latest Movie Baby Girl Streaming On this Ott From This date

ఓటీటీల్లో మలయాళ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ మూవీ సర్వం మాయ అభిమానుల ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో మలయాళ చిత్రాల కోసం ఓటీటీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఇక క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో మరో మలయాళ థ్రిల్లర్‌ మూవీ అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.

నివిన్‌ పౌలీ హీరోగా నటించిన చిత్రం బేబీ గర్ల్. ఈ సినిమా థియేటర్లలో రిలీజై మలయాళ ఫ్యాన్స్‌ను అలరించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 12 నుంచి సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రానికి అరుణ్ వర్మ దర్శకత్వం వహించారు. కాహా.. ఆస్పత్రి నుంచి ఓ చిన్నారి ఎలా అదృశ్యమైందన్న పాయింట్‌తో ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీలో లిజోమోల్, సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రలు పోషించారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement