ఉపాసనకు ట్విన్స్.. ఇంటికి వెళ్తున్న వీడియో వైరల్..! | Ram Charan And Upasana Konidela Take Their Twins Home From Hospital, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Ram Charan- Upasana: ఉపాసనకు ట్విన్స్.. ఇంటికి వెళ్తున్న వీడియో వైరల్..!

Feb 5 2026 5:15 PM | Updated on Feb 5 2026 5:37 PM

Ram Charan and Upasana take their twins home from hospital

ఈ ఏడాది జనవరి మాసం మెగా ఫ్యామిలీలో సంబురాన్ని తీసుకొచ్చింది. ఇటీవల ఉపాసన కవలలకు జన్మనివ్వడంతో మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. రామ్ చరణ్ దంపతులు సారి తల్లిదండ్రులుగా ప్రమోట్ అ‍య్యారు. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. దీంతో మెగా అభిమానలంతా సంబురాలు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు రామ్ చరణ్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.

తాజాగా ఉపాసన అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు ఐదు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఉపాసన.. ట్విన్స్‌ను తీసుకుని ఇంటికెళ్లారు. ఆస్పత్రి నుంచి కారులో వెళ్తున్న వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement