breaking news
Twins
-
పట్నం కోతి సలహాలు
ఒక పట్నం కోతి కొత్తగా అడవిలోకి వచ్చింది. వస్తూ వస్తూ అది ఒక ఇంట్లో నుంచి చిన్న అద్దం, పౌడర్ డబ్బా, పెదాలకు వేసుకునే ఎర్రరంగు దొంగిలించి తన వెంట తెచ్చుకుంది. అది ఒక చింత చెట్టు మీద తన నివాసం ఏర్పరచుకుంది. ఆ చెట్టు మీదనే తిమ్మమ్మ అనే కోతి తన కవల పిల్లలు చిట్టి, చిన్నిలతో కాపురం వుంది.పట్నం కోతి అద్దంలో మొహం చూసుకుంటూ పౌడర్ రాసుకోవడం, పెదాలకు ఎర్రరంగు వేసుకోవడం ఆసక్తిగా చూసేవి చిట్టి, చిన్ని.వాటిని చూసి పట్నం కోతి, ‘‘ఇలా రండి, మీకు కూడా పౌడర్ రాస్తాను’’ అంటూ పిలిచింది.చిట్టి, చిన్ని పనస తొనలు తింటూ మొహాలకు పౌడర్ రాయించుకున్నాయి.‘‘పనస తొనలను గింజలు తీసి తినాలి. అలా తినకూడదు. పట్నంలో గింజలు తినరు. పారేస్తారు’’ అంది పట్నం కోతి.చిట్టి, చిన్ని పనస గింజలన్నీ తీసి పారేసి, గుజ్జు మాత్రమే తిన్నాయి.అది మొదలు పట్నం కోతి వాటికి ఎలా నాజూకుగా నడవాలి, ఎలా తినాలి, ఏమి తినాలి అంటూ కొత్త విషయాలు చెప్పడం మొదలు పెట్టింది.చిట్టి, చిన్ని రోజంతా ఆ పట్నం కోతి మాటలు ఆసక్తిగా వింటూ, అది చెప్పినట్లుగా నడుచుకునేవి.‘‘అలా రోజంతా కూర్చుని కబుర్లు వింటూ ఉంటే సోమరిపోతుల్లా తయారవుతారు. మిగతా పిల్లలను చూడండి, ఎంత చక్కగా ఆడుకుంటున్నారో! మీరు కూడా చక్కగా వెళ్ళి వాటితో ఆడుకోండి.’’ అంటూ మొత్తుకునేది తిమ్మమ్మ. అయితే చిట్టి, చిన్ని తల్లి మాటలు లెక్క చేసేవి కావు. పట్నం కోతి దగ్గరకే పోయి కూర్చునేవి!పట్నం కోతి దాని మాటలతో చిట్టి, చిన్నీల ఆహారపు అలవాట్లు మార్చేసింది!‘‘దానిమ్మ తొక్కతో తినకూడదు, గింజలు వొలుచుకుని తినాలి. మొక్కజొన్న పొత్తి గింజలు తిని, కంకి పారేయాలి. మామిడి పండు రసం పీల్చుకుని తొక్క పారేయాలి. అరటి పండు తొక్క కూడా తినకూడదు. వీటితో పాటు ఆకుపచ్చని ఆకులు తింటే ఆరోగ్యానికి మంచిది!’’ అంటూ వాటికి నూరిపోస్తూ ఉండేది. అయితే నెల తిరిగేసరికి చిట్టి, చిన్ని నీరసపడ్డాయి. కడుపులో నొప్పి అంటూ ఏడుపు మొదలు పెట్టాయి .హడలిపోయిన తిమ్మమ్మ పిల్లలనిద్దరినీ తీసుకుని వైద్యం చేసే ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళింది. సంగతి తెలుసుకున్న ఎలుగు చిట్టి, చిన్ని నోట్లో పసరు మందు పోసి, ‘‘చూడండి పిల్లలూ! మనం పుట్టినప్పటి నుంచి ఏం తిని పెరుగుతున్నామో అవి తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. వాళ్లూ వీళ్ళూ చెప్పారని ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఇలాగే అనారోగ్యం పాలవుతారు. పళ్ళ మీద తొక్క, గింజలు ఇవే మనకు బలాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేవి. అవి తినకే మీరు నీరసపడ్డారు. ఆకులు, గడ్డి తింటే జీర్ణం కాదు. అది మీ ఆహారం కాదు. అందుకే ఈ కడుపు నొప్పి. ఈ వయసులో తిన్నది అరిగేదాకా ఆడుతూ ఉంటేనే, తిన్నది వంట పడుతుంది. ఇక ఆ పట్నం కోతి సలహాలు వినడం మానేసి, ఇన్నాళ్ళూ మీరు ఎలా ఉన్నారో, ఎలా తిన్నారో అలాగే ఉండండి. ఎటువంటి జబ్బు చేయదు!’’ అని చెప్పింది.ఆ తరువాత చిట్టి, చిన్ని పట్నం కోతి సలహాలు పాటించక పోగా, క్రమంగా దానిని కూడా తమ దారిలోకి తెచ్చుకున్నాయి. -
మెగా ఫ్యామిలీలో ట్విన్స్.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్
రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవలే కవలలకు జన్మనిచ్చింది. జనవరి 31న ఓ బాబు, పాపకు వెల్కమ్ చెప్పారు మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ అభిమానులు ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే తాజాగా ఉపాసన ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది. ట్విన్స్‌కు జన్మనిచ్చిన తర్వాత ఉపాసన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఉపాసన తన పోస్ట్‌లో రాస్తూ.." ఇది చూసిన ప్రతిసారీ నా హృదయం సంతోషంతో నిండిపోతోంది. మన చుట్టూ ఉన్న ప్రేమ, బలం, సానుకూలతకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతున్నా. మా కుటుంబం నిజంగా అదృష్టవంతులం. తేజస్వి గారు.. అపోలో హాస్పిటల్స్ బృందం నిబద్ధతతో మాకోసం పనిచేశారు. రామ్ చరణ్ అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ మనసు నుంచి వచ్చిందని నాకు తెలుసు. మీరు మా పిల్లలను ఎల్లప్పుడూ రక్షిస్తారని.. వారి భద్రతను గౌరవిస్తారని నేను నమ్ముతున్నా. ప్రపంచవ్యాప్తంగా మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ ఆశీర్వాదాలు ఎప్పటికీ మా హృదయంలో పదిలంగా ఉంటాయి' అంటూ ట్వీట్ చేసింది. ఇది చూసిన గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.Every time I watch this, my heart feels full. I’m deeply grateful for the love, strength, and positivity that surrounds us. With folded hands 🙏, THANK YOUMy family is truly blessed.Tejesvi Garu & the entire @HospitalsApollo team — your care & commitment meant everything to us.… pic.twitter.com/FKRtfBfMy9— Upasana Konidela (@upasanakonidela) February 9, 2026 -
ఉపాసనకు ట్విన్స్.. ఇంటికి వెళ్తున్న వీడియో వైరల్..!
ఈ ఏడాది జనవరి మాసం మెగా ఫ్యామిలీలో సంబురాన్ని తీసుకొచ్చింది. ఇటీవల ఉపాసన కవలలకు జన్మనివ్వడంతో మెగా కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. రామ్ చరణ్ దంపతులు సారి తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. ఈ శుభవార్తను మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. దీంతో మెగా అభిమానలంతా సంబురాలు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీతారలు రామ్ చరణ్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు.తాజాగా ఉపాసన అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు ఐదు రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న ఉపాసన.. ట్విన్స్‌ను తీసుకుని ఇంటికెళ్లారు. ఆస్పత్రి నుంచి కారులో వెళ్తున్న వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది. Visuals of Mega Power Star @AlwaysRamCharan and #UpasanaKonidela as they take the #MegaTwins home!📸🫶#RamCharan #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/bkTROvEsgC— Telugu FilmNagar (@telugufilmnagar) February 5, 2026 -
రామ్ చరణ్ దంపతులకు ట్విన్స్.. అభిమానులకు మెగా సర్ప్రైజ్ గిఫ్ట్స్..!
మెగా ఫ్యామిలీ ఇంట మరో సంబురం నెలకొంది. ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడంతో మరోసారి పండగ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే ఈ జంటకు క్లీంకార అనే కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసనకు ట్విన్స్ జన్మించడంతో సంతోషం మరింత రెట్టింపైంది. ఈ విషయాన్ని స్వయంగా మెగాస్టారే అభిమానులతో పంచుకున్నారు. అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్స్..అయితే ఈ శుభ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సంతోషం సమయంలో ఫ్యాన్స్‌కు స్వీట్స్ పంపించారు. ఓ అభిమాని గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో రెండు రకాల స్వీట్స్ ఉన్నాయి. ఈ బహుమతిపై రామ్ చరణ్ -ఉపాసనకు అభినందనలు. అపోలో నుండి ఈ బహుమతి వచ్చిందని క్యాప్షన్ రాశారు. ఈ మెగా ఫ్యామిలీ వేడుకలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందిని ఫ్యాన్స్ అంటున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by Lakshmi Vadupu (@lakshmi_naidu_10) -
మన జీవితాల్లోని మహిళలే మనకు బలం: రామ్‌చరణ్
జనవరి 31న (శనివారం) రామ్‌చరణ్–ఉపాసన కవలలకు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రామ్‌చరణ్ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరచి, ఓ స్పెషల్ ఫొటోను షేర్ చేశారు. ‘‘మాకు బాబు, పాప జన్మించారన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండటాన్ని ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాం.మన జీవితాల్లోని మహిళలే మనకు అత్యంత బలం. ప్రతి క్షణం మాకు అండగా నిలుస్తున్న మా అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’’ అని రామ్‌చరణ్ షేర్ చేశారు. ఇక 2023 జూన్ 20న ఈ దంపతులకు తొలి సంతానంగా కుమార్తె క్లింకార జన్మించిన విషయం తెలిసిందే. చాలా సంతోషంగా ఉన్నాం: చిరంజీవి ఆదివారం మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘భగవంతుడు, హనుమాన్ కృప వల్ల ఒక పాప, ఒక బాబు జన్మించారు. ఉపాసన, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. మా అభిమానులు, మా మంచి కాంక్షించే ప్రతి ఒక్కరితో ఈ శుభవార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. కొణిదెల, కామినేని... రెండు కుటుంబాల సభ్యులు సంతోషంగా ఉన్నాం. ఇంత సుఖ ప్రసవం జరిగినందుకు అ΄ోలో వైద్యులకు, వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పారు. -
వారసుడొచ్చాడు మెగాస్టార్ ఎమోషనల్...
-
మెగా ఫ్యామిలీకి డబుల్ ఆనందం.. ఉపాసనకు ట్విన్స్ (ఫోటోలు)
-
మెగా ఫ్యామిలీలో ట్విన్స్.. కవలలు పుట్టిన సినీ దంపతులు వీళ్లే
టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ మరోసారి తండ్రయ్యారు. తాజాగా ఆయన సతీమణి ఉపాసన కొణిదెలకు కవలలు పుట్టారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఓ బాబు, పాపకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీలో సంబురం నెలకొంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని ట్వీట్ చేశారు.అయితే ఈ శుభ సందర్భంలో సినీ ఇండస్ట్రీలో కవలలు ఎవరెవరికీ పుట్టారనే విషయంపై నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. దక్షిణదితో పాటు బాలీవుడ్‌లోనూ కొందరు సెలబ్రిటీలకు ట్విన్స్ పుట్టారు. ఆ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారనే విషయంపై నెటిజన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇంతకీ కవల పిల్లలతో డబుల్ ఆనందం పొందిన సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం. మంచు విష్ణు దంపతులకు ట్విన్స్..టాలీవుడ్ హీరో మంచు విష్ణు దంపతులకు కవలలు జన్మించారు. ఈ ట్విన్స్‌కు ఆరియానా- వివియానా అనే పేర్లు పెట్టారు. ఇటీవల కన్నప్ప చిత్రంలో వీరిద్దరు నటించారు. ఓ ప్రత్యేక సాంగ్‌లోనూ అరియానా- వివియానా కనిపించారు.నయనతార- విఘ్నేశ్ శివన్ దంపతులు..కోలీవుడ్ భామ నయనతార- విఘ్నేశ్ శివన్ దంపతులకు ట్విన్స్ జన్మించారు. వీరికి 2022లో సరోగసీ ద్వారా ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. వీరిద్దిరకి ఉయిర్, ఉలగం అనే పేర్లు పెట్టుకున్నారు.బాలీవుడ్ నటి ప్రీతి జింటా..బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటాకు ట్విన్స్ జన్మించారు. ఆమె 2021లో సరోగసీ ద్వారానే పిల్లలకు జన్మనిచ్చారు. వీరిది జై, జియా అనే పేర్లు పెట్టారు. ప్రీతి జింటా హీరోయిన్గా దక్షిణాదితో పాటు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. సంజయ్ దత్ దంపతులకు ట్విన్స్..బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ -ఆయన భార్య మాన్యతా దత్‌కు ట్విన్స్ జన్మించారు. 2010లో వీరికి కవలలు పుట్టగా షహ్రాన్, ఇక్రా అనే పేర్లు పెట్టారు. సంజయ్ దత్ బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.సెలీనా జైట్లీకి కవలలు..బాలీవుడ్ భామ సెలీనా జైట్లీ సైతం కవలలకు జన్మనిచ్చింది. 2011లో వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను వివాహం చేసుకున్న స్కు 2012లో ట్విన్స్ పుట్టారు. ఇద్దరు అబ్బాయిలకు విన్స్టన్, విరాజ్ అని పేర్లు పెట్టారు.శతృఘ్న సిన్హా దంపతులకు ట్విన్స్..బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా- పూనమ్ సిన్హా దంపతులకు కవలలు జన్మించారు. వీరిద్దరి కుమారులకు లవ్ సిన్హా, కుష్ సిన్హా అనే పేర్లు పెట్టారు. శతృఘ్న సిన్హాకు సోనాక్షి సిన్హా అనే మరో కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ నటిస్తోంది. సన్నీ లియోన్ దంపతులకు ట్విన్స్..బాలీవుడ్ నటి సన్నీ లియోన్- ఆమె భర్త డేనియల్ దంపతులకు ట్విన్స్ పట్టారు. 2018లో వీరికి కవలలు పుట్టగా.. నోవా, ఆషర్ అనే పేర్లు పెట్టుకున్నారు. అంతకు ముందే సన్నీ లియోన్ నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు బిజీగా ఉంది. -
మెగా ట్విన్స్ రాబోతున్నారు.. డేట్ కూడా ఫిక్స్!
మెగా ఫ్యామిలీలో సంబరాలకు టైమ్ దగ్గరపడినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్-ఉపాసన దంపతులు ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు గతేడాది దీపావళి టైంలో రివీల్ చేశారు. అప్పుడే సీమంతం కూడా చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఉపాసన డెలివరీ డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.(ఇదీ చదవండి: హైకోర్టులో 'మన శంకరవరప్రసాద్' నిర్మాతకు నిరాశ)జనవరి 31నే మెగాకోడలు ఉపాసన.. కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని మాట్లాడుకుంటున్నారు. 2012లో చరణ్-ఉపాసన పెళ్లి చేసుకోగా.. దాదాపు పదకొండేళ్ల తర్వాత అంటే 2023 జూన్‌లో వీళ్లకు పాప పుట్టింది. ఆమెకు క్లీంకార అని పేరు పెట్టారు. ఇప్పుడు క్లీంకారకు తమ్ముళ్లు లేదా చెల్లెళ్లు రాబోతున్నారనమాట.ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మార్చి చివరలో విడుదల ఉంటుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. కానీ చెప్పిన తేదీకి రావడం కష్టమే అనిపిస్తుంది. ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉన్న దృష్ట్యా వేసవి తర్వాతే అంటే జూన్ నెలలో ఈ మూవీ రిలీజ్ కావొచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఉపాసన డెలివరీ తర్వాత చరణ్.. షూటింగ్‌కి బ్రేక్ ఇస్తే గనక 'పెద్ది' రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది.(ఇదీ చదవండి: మలయాళ బ్లాక్‌బస్టర్.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులోనూ) -
వెళ్లిరా పాండా..!
అది కేవలం ఒక జూ కాదు.. ఒక దేశపు ఉద్వేగం.. ఆదివారం ఉదయం నుంచే టోక్యోలోని ‘ఉయెనో జూ’వెలుపల వేలాది మంది ప్రజలు నిలబడి ఉన్నారు. వారి చేతుల్లో కెమెరాలు, పాండా బొమ్మలు ఉన్నాయి.. కానీ కనులు మాత్రం వర్షిస్తున్నాయి. ఆఖరి నిమిషం.. కేవలం 60 సెకన్ల పాటు తమ ప్రియమైన కవల పాండాలను కళ్లారా చూసుకునేందుకు వారు పడుతున్న ఆరాటం వర్ణనాతీతం. ఎందుకంటే, ఆ నిమిషం తర్వాత జపాన్ గడ్డపై పాండాల శకం శాశ్వతంగా ముగిసిపోతోంది.. సెకనులో.. చెదిరిన కల వీటిని ఆఖరిసారిగా చూసుకునేందుకు.. ఆన్లైన్ లాటరీలో ఒక్కో టికెట్ కోసం 24 మంది పోటీ పడ్డారంటే ఆ పాండాలంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. ఆఖరిసారిగా.. వెదురు ఆకులను నములుతూ, అమాయకంగా అటూ ఇటూ తిరుగుతున్న కవల పాండాలు.. షా జియావో, లీలీలను చూసి అభిమానులు దుఃఖాన్ని నియంత్రించుకోలేకపోయారు. టికెట్ దొరకని వేలాది మంది జనం జూ గోడల బయటే నిలబడి, పాండాల ఉనికిని అనుభూతి చెందుతూ మౌనంగా వీడ్కోలు పలికారు. రాజకీయాల మధ్య నలిగిన అమాయక ప్రేమ.. పాండాల తరలింపు వెనుక ఒక విషాదకరమైన రాజకీయ నేపథ్యం ఉంది. 1972లో చైనా–జపాన్ దౌత్య సంబంధాల పునరుద్ధరణకు గుర్తుగా వచ్చిన ఈ పాండాలు.. ఇప్పుడు అవే దౌత్య సంబంధాలు క్షీణించడం వల్ల వెళ్లిపోతున్నాయి. తైవాన్ విషయంలో జపాన్ ప్రధాని సనాయే తకైచి చేసిన వ్యాఖ్యలు చైనాకు తీవ్ర ఆగ్రహం కలిగించాయి. సంబంధాలు దెబ్బ తినడంతో, పాండాల లీజు ఒప్పందాలను పొడిగించడానికి చైనా నిరాకరించింది. ఫలితంగా, జనవరి 27న ఈ కవలలు చైనాకు తిరిగి వెళ్లిపోతున్నాయి. మంగళవారం ఈ కవలలు చైనా వెళ్లిపోయాక, జపాన్‌లో ఒక్క పాండా కూడా ఉండదు. అర్ధ శతాబ్దపు చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. అవి మా సొంత బిడ్డలు! ‘నేను ఈ పాండాల కోసం 15 ఏళ్లలో ఒక కోటి ఫొటోలు తీశాను. నా సొంత పిల్లలే నన్ను వదిలి వెళ్తున్నట్టు ఉంది’.. అని తకాహిరో అనే అభిమాని భారమైన హృదయంతో చెప్పిన మాటలు అక్కడున్న అందరినీ కదిలించాయి. ‘ఈ పాండాలు కేవలం జంతువులు కావు, మా కుటుంబ సభ్యులు. అవి మాకు ఎంతో ఓదార్పునిచ్చాయి’.. అంటూ 54 ఏళ్ల మెచికో కన్నీరు పెట్టుకుంది. పాండాల తరలింపుతో ఏటా సుమారు రూ.1,100 కోట్ల ఆదాయాన్ని జపాన్ కోల్పోనుంది. వ్యాపారులు తమ దుకాణాల బోర్డులు మార్చడానికి నిరాకరిస్తూ, ‘అవి మళ్లీ తిరిగి వస్తాయి’.. అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూగబోయిన జపాన్ హృదయం! ప్రేమకు, ఓదార్పుకు గుర్తుగా నిలిచిన ఈ మూగజీవాలు.. దేశాల మధ్య సరిహద్దు గొడవలకు బలైపోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంగళవారం వీటిని తరలించే విమానం గాల్లోకి ఎగిరినప్పుడు, దాని రెక్కలు ఒక దేశపు 54 ఏళ్ల జ్ఞాపకాలు, కోట్లాది మంది భారమైన హృదయాలను కూడా మూటగట్టుకుని వెళ్లిపోతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్రికెట్ చరిత్రలో కవలలు.. మరో కొత్త జోడీ
క్రికెట్ చరిత్రలో చాలామంది అన్నదమ్ములున్నారు. వీరిలో అతి కొద్ది మంది మాత్రమే కవలలు ఉన్నారు. పురుషుల క్రికెట్లో కవలలు అనగానే ముందుగా గుర్తొచ్చేది వా బ్రదర్స్ (స్టీవ్-మార్క్). వీరిద్దరు ఆస్ట్రేలియా తరఫున కలిసి 108 టెస్ట్‌లు, 214 వన్డేలు ఆడారు. ఇందులో 35000కు పైగా పరుగులు చేశారు.పురుషుల క్రికెట్లో మరో ట్విన్స్ జోడీ జేమ్స్ మరియు హేమిష్ మార్షల్. వీర్దిదరు న్యూజిలాండ్ తరఫున కొన్నేళ్ల పాటు టెస్ట్, వన్డే క్రికెట్ కలిసి ఆడారు. వీరిద్దరు కూడా వా సోదరుల మాదిరే కుడి చేతి వాటం బ్యాటర్లు. వీరిద్దరిలో తేడాను కనుక్కోవడం చాలా కష్టం.ఇటీవలికాలంలో కనిపిస్తున్న మరో కవలల జోడీ ఓవర్టన్ బ్రదర్స్ (క్రెయిగ్-జేమీ). జేమీ మరియు క్రెయిగ్ ఓవర్టన్ కలిసి ఇంగ్లండ్ తరఫున టెస్ట్, వన్డే క్రికెట్ ఆడారు. వీరిద్దరు వా, మార్షల్ సోదరులలాగే ఒకే స్టయిల్ కలిగి ఉన్నారు. జేమీ, క్రెయిగ్ ఇద్దరూ ఫాస్ట్ బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్లు. వీరిద్దరిలో తేడా కనిపెట్టడం చాలా కష్టం. పురుషుల క్రికెట్ తొలినాళ్లలో మరో ట్విన్స్ జోడీ ఉండింది. వారి పేర్లు అలెక్, ఎరిక్ బెడ్సర్. ఈ ఇద్దరు కవలలు 1946-1955 మధ్యలో ఇంగ్లండ్‌లో వివిధ స్థాయిల పోటీల్లో పాల్గొన్నారు. అలెక్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు సైతం ఆడగా.. ఎరిక్ దేశవాలీ పోటీలకే పరిమితమయ్యాడు.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ మరియు కేట్ బ్లాక్వెల్ కవలలు. ఈ ఇద్దరూ కలిసి ఆడారు. అలెక్స్ ఆసీస్ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించింది.మహిళల క్రికెట్లో మరో కవలల జోడీ ఉంది. ఈ జోడీ కూడా ఆస్ట్రేలియాకే చెందింది కావడం విశేషం. ఇక్కడ మరో విశేషమేమిటంటే వీరు ట్విన్స్ కాదు. ట్రిప్లెట్స్ (ముగ్గురు). ఫెర్నీ, ఇరేన్, ఎస్సీ షెవిల్ అనే ఈ ముగ్గురు 20వ శతాబ్దం ఆరంభంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించారు.ప్రస్తుతం క్రికెట్‌కు సంబంధించి ట్వన్స్ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. పురుషుల జింబాబ్వే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు కవలలు ఎంపికయ్యారు. వీరిద్దరూ అదే దేశానికి చెందిన మాజీ ఆటగాడు ఆండీ బ్లిగ్నాట్ కుమారులు కావడం మరో విశేషం.బ్లిగ్నాట్ 1999-2010 మధ్యలో జింబాబ్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2003 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. ఇతని పుత్రసంతానమే మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ జోడీ. ఈ ఇద్దరు త్వరలో జరుగబోయే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. 17 ఏళ్ల మైఖేల్, కియాన్ బ్యాట్‌తో, బంతితో రాణించగల సమర్థులు. వీరిద్దరు తండ్రి అడుగుజాడల్లో నడవడానికి సిద్దంగా ఉన్నారు.వీరి తండ్రి ఆండీ బ్లిగ్నాట్ కూడా ఆల్‌రౌండరే. ఆండీ బంతిని బలంగా బాదేవాడు. అలాగే వేగవంతమైన బౌలర్ కూడా. ఏ స్థాయిలో అయినా ప్రపంచకప్ ఆడిన అతి కొద్ది మంది తండ్రి కొడుకుల జోడీల్లో ఇదీ ఒకటి. -
జింబాబ్వే జట్టులో మాజీ ప్లేయర్ కొడుకులు
జింబాబ్వే క్రికెట్ జట్టుకు కవలలు ఎంపిక కావడం కొత్తేమీ కాదు. చరిత్ర చూస్తే ఈ జట్టుకు చాలా మంది ట్విన్స్ ప్రాతినిథ్యం వహించారు. ఆండీ ఫ్లవర్-గ్రాంట్ ఫ్లవర్, గై విటల్-ఆండీ విటల్, గావిన్ రెన్నీ-జాన్ రెన్నీ, పాల్ స్ట్రాంగ్-బ్రియాన్ స్ట్రాంగ్ లాంటి జోడీలు జింబాబ్వే క్రికెట్ ఉన్నతికి దోహదపడ్డాయి.తాజాగా మరో కవలల జోడీ జింబాబ్వే జట్టుకు ఎంపికైంది. ఈ జోడీ అండర్-19 ప్రపంచకప్ ఆడే జింబాబ్వే జట్టులో స్థానం సంపాధించింది. ఈ ట్విన్ బ్రదర్స్ గతంలో జింబాబ్వే సీనియర్ జట్టుకు ఆడిన ఆండీ బ్లిగ్నాట్ కొడుకులు కావడం విశేషం. బ్లిగ్నాట్ 1999-2010 మధ్యలో జింబాబ్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2003 ప్రపంచకప్‌లోనూ ఆడాడు. ఇతని పుత్రసంతానం మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ జోడీ త్వరలో జరుగబోయే అండర్-19 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యారు. 17 ఏళ్ల మైఖేల్, కియాన్ బ్యాట్‌తో, బంతితో రాణించగల సమర్థులు. వీరిద్దరు తండ్రి అడుగుజాడల్లో నడవడానికి సిద్దంగా ఉన్నారు.వీరి తండ్రి ఆండీ బ్లిగ్నాట్ కూడా ఆల్‌రౌండరే. ఆండీ బంతిని బలంగా బాదేవాడు. అలాగే వేగవంతమైన బౌలర్ కూడా. ఏ స్థాయిలో అయినా ప్రపంచకప్ ఆడిన అతి కొద్ది తండ్రి కొడుకుల జోడీల్లో ఇదీ ఒకటి.కాగా, అండర్ 19 ప్రపంచకప్ 16వ ఎడిషన్‌కు జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం జింబాబ్వే చాలా ముందుగానే జట్టును ప్రకటించింది.ఈ జట్టుకు కెప్టెన్‌గా యువ పేసర్ సింబరాషే ముడ్జెంగెరె నియమితులయ్యాడు. 2024 U19 వరల్డ్‌కప్ ఆడిన బ్యాట్స్‌మన్ నాథనియెల్ హ్లాబంగానా కూడా జట్టులో ఉన్నాడు. ఈ జట్టులో మైఖేల్-కియాన్ బ్లిగ్నాట్ ప్రత్యేక ఆకర్శనగా నిలువనుంది.జింబాబ్వే U19 వరల్డ్‌కప్ 2026 జట్టు సింబరాషే ముడ్జెంగెరె (c), కియన్ బ్లిగ్నాట్, మైఖేల్ బ్లిగ్నాట్, లీరోయ్ చివౌలా, టటెండా చిముగోరో, బ్రెండన్ సెంజెరె, నాథనియెల్ హ్లాబంగానా, టకుడ్జ్వా మకోని, పానాషే మజాయి, వెబ్‌స్టర్ మధిధి, షెల్టన్ మజ్విటోరెరా, కుపక్వాషే మురాడ్జి, బ్రాండన్ న్డివేని, ధ్రువ్ పటేల్, బెన్నీ జూజే -
బెస్ట్ అమ్మ ఇన్ ది వరల్డ్.. నయనతారకు క్యూట్ విషెస్
లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంది. నవంబర్ 18న 42వ వసంతంలోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా ఆమెకు పలువురు సినీతారలు విషెస్ తెలిపారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న నయన్.. తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.ఈ ఏడాది తన పుట్టినరోజున తన పిల్లలు ప్రత్యేకంగా విష్ చేసినట్లు పోస్ట్ చేసింది. తన కవలలు ఉయిర్, ఉలగం రాసిన క్యూట్ కొటేషన్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. హ్యాపీ బర్త్‌డే టూ బెస్ట్ అమ్మ ఇన్ ది వరల్డ్ అంటూ చిట్టి చేతులతో రాసిన పేపర్‌ను నయన్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది కాస్తా వైరల్ కావడంతో క్యూట్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్
ప్రముఖ కన్నడ నటి తన జీవితంలో ఒకముఖ్యమైన అంశం గురించి ఫ్యాన్స్‌తో షేర్ చేసింది. 40 ఏళ్ల వయసులో బిడ్డల్ని కంటున్నాను అంటూ ప్రకటించింది. తద్వారా తాను పెళ్ళికాకుండా తల్లి అవ్వాలనుకునే స్త్రీలకు ప్రేరణగా నిలవ బోతున్నాను అంటూ వెల్లడించింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీని పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు ఇంతకీ ఎవరా నటి? ఎందుకు సింగిల్ మదర్‌గా ఉండాలనే సాహసోపేత నిర్ణయం తీసుకుంది? View this post on Instagram A post shared by Bhavana Ramanna (@bhavanaramannaofficial) భావన రామన్న తాను గర్భం దాల్చినట్టు తెలిపింది. ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) త్వరలోనే కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నా అంటూ ఒక ధీర ప్రకటన చేసింది నటి భావన. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఆరు నెలల బేబీ బంప్‌తో రెండు చిత్రాలను పోస్ట్ చేసింది. చాలా మంది మహిళల బిడ్డను కనాలనే కలలకు తాను ప్రతిరూపమంటూ ఈ భావోద్వేప్రయాణం ఎలా ఒడిదుడుకులతో నిండి ఉందో పంచుకుంది. ఒంటరి మహిళగా తన ప్రయాణాన్ని షేర్ చేసింది.ఇదీ చదవండి : రెండే రెండు టిప్స్ : 120 కిలోల నుంచి స్మార్ట్ అండ్ స్లిమ్‌గా "ఇదొ కొత్త అధ్యాయం, ఇది నేను ఊహించలేదు. కవలలతో ఆరు నెలల గర్భవతిని. 20-30 ఏళ్లపుడు తల్లినవ్వాలని అస్సలు అనుకోలేదు. కానీ నాకు 40 ఏళ్లు నిండిన తరువాత ఆ కోరికను కాదనలేకపోయా. ఇపుడు ఇద్దరికి జన్మనివ్వబోతున్నా..అదీ ఒంటరి మహిళగా. ఈ జర్నీ అంత సులభంగా సాగలేదు. చాలా IVF క్లినిక్‌లు, వైద్యులు నన్ను తిరస్కరించారు.’’ అయినా సాధించాను. "తన పిల్లలకు తండ్రి ఉండరని తెలుసు, కానీ వారు కళ, సంగీతం, సంస్కృతి, ఎల్లలులేని ప్రేమతో నిండిన ఇంట్లో పెరుగుతారు. ఏంతో ప్రేమగా నమ్మకమైన చేతుల్లో పెరుగుతారు’’ అని తెలిపింది. అలాగే ఇంత కష్టమైన సమయంలో తనకు అండగా నిలిచిన, తల్లిదండ్రులు, తోబుట్టువులకు, డాక్టర్ సుష్మకు భావన కృతజ్ఞతలు తెలిపింది. ‘‘ఇదేదో తిరుగుబాటుగా ఈ నిర్ణయం తీసుకోలేదు. నా కోరికను గౌరవించడానికే ఈ నిర్ణయం. నా స్టోరీ కనీసం ఒక మహిళను ఇన్స్పైర్ చేసినా అది చాలు నాకు.’’ అని పేర్కొనడం విశేషం. -
పుట్టిన రోజే మృత్యుఒడిలోకి
ఆ దంపతులు అన్యోన్యంగా ఉన్నారు. వివాహమైన ఎనిమిదేళ్లకు కవల పిల్లలు జన్మించారు. భర్త ఆర్మీలో ఉద్యోగ విరమణ పొందాడు. ప్రస్తుతం ప్రైవేటు గన్‌మెన్‌గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో తమ కలల రూపాలైన కవలలను ఉన్నతంగా చదివించాలని ఆరాట పడ్డారు. ఈ నేపథ్యంలో సొంతూరి నుంచి చిత్తూరుకు మకాం మార్చారు. ఆ దంపతులు పిల్లల భవిష్యత్తుపై ఎన్నో కలలుకన్నారు. కానీ ఆ కలలను దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం చిదిమేసింది. దంపతులిద్దరినీ మృత్యువు కబళించింది. ఈ ప్రమాదంలో కుమారుడు, కుమార్తె గాయపడి స్పృహ కోల్పోయారు. గాయపడిన ఆ కుటుంబ ఆశాదీపాలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిదండ్రులకు ఏం జరిగింది.. ఎలా ఉన్నారో..ఎక్కడ ఉన్నారో ఆ పసి హృదయాలకు పాపం తెలియదు.చిత్తూరు: గుడిపాల మండలంలోని కుప్పిగానిపల్లె గ్రామానికి చెందిన మాజీ సైనికుడు సిద్దయ్య(47), అతడి భార్య జ్యోతిలక్ష్మి (43) మృతి చెందగా, కొడుకు, కుమార్తె గాయపడ్డారు. దీంతో కుప్పిగానిపల్లె గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల దైవదర్శనానికి కుటుంబంతో కలిసి వెళ్లి వస్తుండగా పనపాకం సమీపంలోని గడ్డకిందపల్లె వద్ద ఆవును తప్పించబోయి డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే దంపతులు మృతి చెందారు. దంపతుల ఇద్దరిదీ కుప్పిగానిపల్లె గ్రామమే. వీరికి ఇద్దరు కవల పిల్లలు. పిల్లల చదువు కోసం చిత్తూరులో నివాసం ఉంటున్నారు. గిరి(13), గాయత్రి(13) బివిరెడ్డి ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు.తండ్రి అడుగుజాడలోనే ఆర్మీలో చేరి..కుప్పిగానిపల్లె గ్రామానికి చెందిన నాగరత్నం, సరస్వతీలకు 1978లో సిద్దయ్య జన్మించాడు. నాగర త్నం ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయ్యి టీటీడీలో పనిచే శాడు. నాగరత్నం చొరవతో కుమారుడు సిద్దయ్య 1998లో ఆర్మీలో ఉద్యోగం చేస్తూ కుప్పిగానిపల్లె గ్రామానికి చెందిన నరసింహులు, జగద కుమార్తె జ్యోతి లక్ష్మిని 2002లో వివాహం చేసుకున్నాడు. వీరికి సుమారు ఎనిమిదేళ్ల వరకు పిల్లలు కలగలేదు. అనంతరం ఇద్దరు కవల పిల్లలు జన్మించారు.పిల్లలను ఉన్నతంగా చదివించాలని..పిల్లలు జన్మించిన అయిదు సంవత్సరాలకు వారి చదువు కోసం చిత్తూరులో కాపురం పెట్టారు. సిద్దయ్య 2020 సంవత్సరంలో ఆర్మీ నుంచి ఉద్యోగ విరమణ పొందారు.ఈక్రమంలో చిత్తూరులోని ప్రైవేట్ పాఠశాలలో చదివించుకుంటూ సాఫీగా జీవనం సాగిస్తున్నారు.పుట్టిన రోజే మృత్యుఒడిలోకిసిద్దయ్య పుట్టిన రోజుకి ఎప్పుడూ తిరుమల దైవద ర్శనానికి వెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తిరు మలలో స్వామిని దర్శించుకొని పిల్లలు, భార్యతో కలిసి కారులో తిరిగి వస్తున్న నేపథ్యంలో వారిని మృత్యువు వెంటాడడంతో దంపతులు మృత్యుఒడికి చేరుకోగా పిల్లలు తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ సైనికుడిగా ఉన్న సిద్దయ్య ప్రస్తుతం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి ప్రైవేట్ గన్‌మెన్‌గా ఉంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మోహిత్‌రెడ్డి తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. -
వారిద్దరూ కవలలు.. వారి వెంటే అరుదైన సందర్భం!
జైపూర్: కవలలు.. ఇద్దరు పిల్లలు కలిసి పుడితే కవలలు అంటాం. కొన్ని సందర్భాల్లో కవలలు ఒకే పోలికలతో పుడితే.. మరికొన్ని సందర్భాల్లో వేరే పోలికలతో కూడా పుడతారు. కవలలు జంటగా పుట్టినంత మాత్రాన వారి వ్యవహారశైలి ఒకేలా ఉండే అవకాశాలు చాలా తక్కువ. అలాగని కొన్ని సందర్బాల్లో వారిద్దరూ చేసే పనులు చాలా దగ్గరగా ఉండే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ప్రధానంగా చదువుకునేటప్పుడు కవల పిల్లల తరగతుల్లో మార్పులు పెద్దగా ఉండవు. ఒకే ఏజ్‌లో ఉంటారు కాబట్టి.. వారి క్లాస్‌లు ఎప్పుడూ ఒకే రకంగా సాగడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగని వారిద్దరూ ఒకేలా చదువుతారని చెప్పలేం. కానీ అలా జరిగితే మాత్రం అది చాలా అరుదైన, ప్రత్యేకమైన సందర్బంగానే చెప్పాలి. ఇప్పుడు అదే జరిగింది. రాజస్తాన్‌లోని నాగ్‌పూర్ జిల్లాకు చెందిన కనిష్క, కార్తీకలు.. కవలలుగా పుట్టడమే కాదు.. జంటగానే విద్యలో దూసుకుపోతున్నారు. రాజస్తాన్ బోర్డు నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో వారిద్దరూ ఒకే పర్సంటేజ్‌ను సాధించడమే ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఎస్ఎస్సీ పరీక్షల్లో వారిద్దరూ 97. 17 శాతం మార్కులతో ఉత్తీర్ణీత సాధించారు. వీరిద్దరూ సాధించిన వ్యక్తిగత మార్కుల్లో స్వల్ప వ్యత్యాసం ఉన్నప్పటికీ పర్సంటేజ్ పరంగా ఒకేలా రావడంతో ఆ కవలలే వెంటే అరుదైన సందర్భం అనుకోవడం మనవంతైంది. మెర్టా రోడ్డులోని కల్పనా చావ్లా ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్లో చదవిన వీరిద్దరూ.. ఒకే పర్సంటేజ్ సాధించడంతో తల్లి దండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. తమ పిల్లలు కలిసి పుట్టడమే కాదు.. కలిసి సాదించిన మార్కుల్లో కూడా తేడా లేకుండా ఉండటంతో వారు మరింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజస్తాన్ రోడ్డు రవాణా సంస్థలో కండెక్టర్‌గా పని చేస్తున్న శివన్నారాయణ చౌదరి, సుమన్ చౌదరిల కుమార్తెలే కనిష్క, కార్తీకలు. వీరి సాధించిన మార్కులపై అటు స్కూల్ యాజమాన్యంతో పాటు ఇటు స్నేహితులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. శభాష్ కనిష్క, కార్తీక అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. -
ట్విన్స్ కి జన్మనిచ్చిన ప్రముఖ నటి.. తండ్రి ఎలన్ మస్క్?
హాలీవుడ్ ప్రముఖ నటి అంబర్ హెర్డ్.. తాను కవలలకు జన్మనిచ్చినట్లు ప్రకటించింది. మదర్స్ డే సందర్భంగా ఆదివారం (మే 11) ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ పిల్లలకు తండ్రి ఎవరు అనే ప్రశ్న ఈమెకు ఎదురవుతోంది. సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: మహేశ్ సినిమా ఛాన్స్.. సర్జరీ చేయించుకోమన్నారు: వెన్నెల కిశోర్)ఎందుకంటే అంబర్ హెర్డ్.. 2015లో 'పైరేట్స్ ఆఫ్ కరీబియన్' ఫేమ్ నటుడు జానీ డెప్ ని పెళ్లి చేసుకుంది. అయితే వీళ్ల బంధం పట్టుమని రెండేళ్లు కూడా నిలబడలేదు. 2017లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. మరోవైపు జానీ డెప్ తో విడాకులకు ముందే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఎలన్ మస్క్ తో అంబర్ డేటింగ్ చేసింది.2016-18 మధ్య అంబర్-మస్క్ డేటింగ్ లో ఉన్నారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరూ పిల్లల్ని కనాలనుకున్నారని.. అప్పుడు కుదరకపోవడంతో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నారని, వాటితోనే ఇప్పుడు అంబర్.. ట్విన్స్ కి జన్మనిచ్చిందేనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి పిల్లలకు తండ్రి ఎవరనేది సదరు నటి చెబితే తప్ప క్లారిటీ రాదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే) View this post on Instagram A post shared by Amber Heard (@amberheard) -
వేగాన్ వర్సెస్ నాన్‌వెజ్ డైట్: ఈ ట్విన్స్ ప్రయోగంలో ఏ డైట్ మంచిదంటే..?
ఇటీవల కాలంలో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. సోషల్‌మీడియా పుణ్యామా..? అని రకరకాల డైట్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఏది మంచిది అని డిసైడ్ చేసుకోలేని కన్ఫూజన్లో పడేసేలా ఊదరగొడుతున్నాయి. అయితే ఆ సమస్యకు చెక్‌పెట్టేలా ఈ ఇద్దరు కవలలు ఓ ప్రయోగానికి పూనుకున్నారు. అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండే ఈ కవల సోదరులు వేగాన్ వర్సెస్ నాన్‌వెజ్ డైట్లో ఏది బెటర్ అనే దాని గురించి తమ శరీరాలపై తామే ప్రయోగాలు చేసుకున్నారు. అంతేగాదు ఇద్దరూ ఏ డైట్ ఆరోగ్యకరమైనదో వైద్యపరంగా నిర్థారించి మరీ చెప్పారు.యూకేలోని డెవాన్లోని ఓ గ్రామానికి చెందిన రాస్, హ్యూగో టర్నోర్ అనే కవలలు ఇద్దరూ చూడటానికి ఒకేలా ఉంటారు. ఈ ఇద్దరు ఆహారం, ఫిట్నెస్కి సంబంధించి పలు ప్రయోగాలు చేస్తుంటారు. ఆ క్రమంలోనే ఈసారి మొక్కల ఆధారిత వర్సెస్ జంతువుల ఆధారిత డైట్లలో ఏది ఆరోగ్యానికి మంచి ఫలితాలనిస్తుంది దాని గురించి తమపైనే ప్రయోగాలు చేసుకుని మరీ నిర్థారించి చెప్పారు. అందుకోసం ఆరు నెలలపాటు ఈ 36 ఏళ్ల కవలలు దాదాపు ఒకేలాంటి జీవనశైలిని అనుసరించారు. అయితే తీసుకునే ఆహారంలోనే వ్యత్యాసం ఉంటుంది. హ్యూగో సముద్రపు ఆల్గే , మొక్కల ఆధారిత ఒమేగా 3 నూనెలు, మొక్కల ఆధారిత సప్లిమెంట్లు తదితరాలు తీసుకున్నాడు. రాస్ సాంప్రదాయ జంతు ఆధారిత విటమిన్లు తీసుకున్నాడు. అయితే ఆరు నెలల తదనంతరం ఇరువురిలో అద్భుతమైన మార్పులు, ఫలితాలు కనిపించాయి. ఇక్కడ హ్యూగో రక్తం పోషకాలతో కనిపించింది. కీలకమైన విటమిన్లు డీ3, కొవ్వు ఆమ్లాలు సమస్థాయిలో ఉన్నాయి. ఇక రాస్ తీసుకున్న నాన్ వెజ్ ప్రోటీన్లకు మించి హ్యగో శరీరంలో మెరుగైన స్థాయిలో విటమిన్లు ఉన్నాయి. వారిద్దరూ కూడా ఈ డైట్లలో ఇంత తేడా ఉంటుందని అనుకోలేదట. రక్తపరీక్షల్లో హ్యూగో ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఒమేగా-3, విటమిన్ D3 పుష్కలంగా ఉన్నాయి హ్యూగో బాడీలో. కేవలం రక్తపరీక్షలే గాక, కొవ్వులు, ఆమ్లలాల స్థాయిలతో సహా ప్రతీది ట్రాక్ చేశారు. అయితే ఈ డైట్లలో మొక్కల ఆధారిత వెర్షన్ మెరుగైన ఫలితాలనిచ్చింది. రాస్ తిన్న సాల్మన్ చేపల కంటే సముద్రపు పాచి సప్లిమెంట్లోనే విటమిన్ డీస్థాయిలు, మంచిరోగ నిరోధక శక్తిని హ్యూగోకి అందించాయి. అంతేగాదు శాకాహారం శరీరంలో కొవ్వుని తగ్గించి మెరుగైన శక్తి స్థాయిలను ప్రోత్సహించదని తేలింది. ఇలాంటి ప్రయోగాలు ఆ కవలలకు తొలిసారి కాదు. గతంలో అధిక కార్బ్ వర్సెస్ అధిక కొవ్వు ఆహారాలలో ఏది మంచిదో తెలుసుకోవాలని ప్రయోగాలు చేశారు కూడా. దానిలో రాస్ పాస్తా, బియ్యం వంటి కార్బొహైడ్రేట్లు తీసుకోగా, హ్యూగో గుడ్లు, వెన్న వంటి వాటిని తీసుకున్నారు. అయితే రాస్ కొలస్ట్రాల్‌ని కోల్పోగా, హ్యూగో మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. పైగా అందులో ప్రమాదకరమైన చెడెకొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఉన్నాయి. చివరగా ఈ కవల ఫిట్నెస్ ప్రయోగాల వల్ల మొక్కల ఆధారిత సప్లిమెంట్స్ ప్రయోజనాలు హైలెట్ చేయడమే గాక సాంప్రదాయ పోషకాహారం గురించి చాలకాలం నుంచి ఉన్న అపోహలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. అంతేగాదు మన ఆరోగ్యంలో ఆహారం ఎంత కీలకపాత్ర పోషిస్తుందని అనేది తేటతెల్లమైంది కూడా. View this post on Instagram A post shared by 𝗧𝗛𝗘 𝗧𝗨𝗥𝗡𝗘𝗥 𝗧𝗪𝗜𝗡𝗦 (@theturnertwiins) (చదవండి: పీరియడ్స్ వచ్చి వెయ్యి రోజులు.. అయినా తగ్గలేదు.. వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!) -
పోస్ట్‌పార్టం సమస్యలతో శ్రద్ధా ఆర్య, ట్విన్స్ జిబ్లీ ఫోటోలు సూపర్ క్యూట్
నటి శ్రద్ధా ఆర్య ఇటీవల పండంటి కవలల పిల్లలకు జన్మనిచ్చింది. ముద్దుల మూటగట్టే తన కవలల సంరక్షణలో బిజీగా ఉంది. ఇటీవల, శ్రద్ధా తన పిల్లల పేర్లను గిబ్లి-శైలి చిత్రంతో ప్రకటించింది. మరోవైపు తొలి సారిగా ప్రతి స్త్రీ ఎదుర్కొనే ప్రసవానంతర సమస్యల గురించి (Postpartum Problem) మాట్లాడింది.వివాహం పిల్లలతో ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్న శ్రద్ధా ఆర్య (Shraddha Arya) మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ప్రసవానంతర సమస్యలు గురించి మాట్లాడింది. సాధారణంగా మాతృత్వం అనేది మహిళలకు వరం మాత్రమే కాదు.. అనేక సమస్యలకు మూలం కూడా. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రసవానంతర సమస్యలతో మహిళలు చాలా ఇబ్బంది పడతారు. శారీరక సమస్యలతోపాటు,మానసిక ఒత్తిడితో మరికొన్ని ఇబ్బందు లొస్తాయి. దీనినే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (పీపీడీ)అని వ్యవహరిస్తారు. ఈ ఒత్తిడి కారణంగా, ఆత్మన్యూనతా భావంతో కుంగిపోవడం, తానే హాని చేసుకోవడం, శిశువును కూడా గాయ పరచడం వంటి స్థితికి వెళతారు. శరీరంలో మార్పులు, అధిక బరువు , మానసిక స్థితిలో మార్పులు, నిరాశ, తదితర ప్రసవానంతరం వచ్చే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రసవ సమయంలో బిడ్డను ఈ లోకంమీదికి తెచ్చేందుకు తల్లి పడే బాధ,ఆ వేదన వర్ణనాతీతం. వీటి గురించే ఆమె ఇన్‌స్టాలో ప్రస్తావించింది. ముఖ్యంగా జుట్టు రాలడం గురించి తన అభిప్రాయాలను షేర్ చేసింది. విపరీతంగా జుట్టురాలడంపై ఆవేదన వ్యక్తం చేసింది. కుచ్చులుగా రాలిపోతున్న వెంట్రుకల ఫోటోను పంచుకుంది. View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12)శ్రద్ధా ఆర్య, రాహుల్ నాగల్, జిబ్లి ఆర్ట్ ట్రెండ్టీవీ నటిగా అద్భుతమైన నటనతో పాపులర్ అయింది శ్రద్ధా ఆర్యా. 2004లో టీవీ రియాలిటీ షోలో పాల్గొన్న ఈమె.. 2006లో 'కలవనిన్ కదలై' అనే తమిళ సినిమాద్వారా హీరోయిన్గా బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత తెలుగులో గొడవ, రోమియో, కోతిమూక తదితర సినిమాల్లో నటించింది. పాటు పలు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసిన శ్రద్ధా కుండలి భాగ్య సీరియల్‌తో మరింత పాపులర్ అయింది.ఏడాది పాటు డేటింగ్ చేసిన నేవీ ఆఫీసర్ రాహుల్ నగల్ని ,శ్రద్ధా ఆర్యా 2021, నవంబరులో పెళ్లాడింది. ఈ జంటకు 2024 నవంబరు 29న ట్విన్స్( పాప, బాబు) పుట్టారు. కుమారుడికి ‘శౌర్య' అని కుమార్తెకు 'సియా' అంటూ పూర్లు కూడా పెట్టేశారు. తాజాగా జిబ్లి తరహా క్యూట్ ఫోటోలను షేర్ చేయడంతో ఇవి సోషల్ మీడియా ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షించాయి. -
అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్ఏ టెస్ట్‌లో..!
ఒక మహిళకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ మగపిల్లలే. అయితే ఎందువల్లో ఇద్దరు డీఎన్ఏలు వేర్వురుగా ఉన్నాయి. ఒక బిడ్డ డీఎన్ఏ ఆమె భర్తతో మ్యాచ్ అవ్వగా, మరో బిడ్డ డీఎన్ఏ మాత్రం అస్సలు మ్యాచ్ కాలేదు. ఇదేంటి ఇద్దరు కవలలు ఒకేలా ఉన్నారు. ఇదెలా సాధ్యం ఒకరిది మాత్రమే తండ్రితో మ్యాచ్ అయ్యి, మరొకరిది కాకపోవడంతో వైద్యులు సైతం కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే. ఈ విచిత్రమైన ఘటన పోర్చుగల్‌లోని గోయాస్ రాష్ట్రంలోని మినెరోస్ నగరంలో చోటు చేసుకుంది. 19 ఏళ్ల మహిళ కవల ప్లిలలకు జన్మనిచ్చింది. ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చిన ఆనందాన్ని తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఖుషీగా ఉంది. అయితే ప్రస్తతం వారికి ఎనిమిది నెలల వయసు. వారి బర్త్ సర్టిఫికేట్ల విషయమై డీఎన్ఏ టెస్ట్‌లు చేయగా అవాక్కయ్యే విషయం వెలుగులోకి చ్చింది. ఒక బిడ్డ డీఎన్ఏ మాత్రం ఆ మహిళ భర్తతో సరిపోయింది. మరో బిడ్డది అస్సలు మ్యాచ్ కాలేదు. దీంతో వైద్యులు సైతం ఇదేంటని తలలు పట్టుకున్నారు. అయితే ఆ మహిళలను వైద్యులు క్షణ్ణంగా ఆరా తీయగా తాను మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్న విషయం బయటపెట్టింది. వెంటనే ఆ వ్యక్తిని పిలిపించి డీఎన్ఏ టెస్ట్ చేయగా ఆ వ్యక్తితో ఆ బిడ్డ డీఎన్ఏ సరిగ్గా మ్యాచ్ అయ్యింది. అయితే ఇదెలా సాధ్యం అనే ప్రశ్న వైద్యలును కూడా ఆశ్చర్యాన్ని గురిచేసింది. అయితే పిల్లల తండ్రులు వేర్వేరు అయినా.. జనన ధృవీకరణ పత్రంలో ఒకటే రాయాల్సి ఉంది. దీంతో ఆ మహిళ భర్తనే ఆ ఇద్దరు పిల్లలకు తండిగ్రా పేరు నమోదు చేయించుకుని ఆ బిడ్డ బాధ్యత తనే చూసుకుంటానని అనడం విశేషం.ఇది అత్యంత అరుదైన కేసు..ఈ మేరకు డాక్టర్ టులియో జార్జ్ ఫ్రాంకో మాట్లాడుతూ..ఇప్పటివరకు మొత్తం ప్రపంచంలో ఇలాంటి కేసులు 20 మాత్రమే ఉన్నాయని చెప్పారు. వాటిలో కవలల తండ్రులు వేర్వేరుగా ఉన్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తల భాషలో హెటెరోపెరెంటల్ సూపర్‌ఫెకండేషన్ అంటారని అన్నారు. ఒకే తల్లి రెండు అండాలు వేర్వేరు పురుషుల ద్వారా ఫలదీకరణం చెందినప్పుడు ఇది జరుగుతుందని వెల్లడించారు. అయితే ఇక్కడ ఆ స్త్రీ గర్భం సాధారణంగానే ఉందని అన్నారు. ఇప్పటి వరకు ఆ శిశువులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని చెప్పారు. నిజంగా ఇది అత్యత విచిత్రమైన కేసు.(చదవండి: సందీప్ కిషన్: అలాంటి డైట్ ఫాలో అవుతాడా..! అందుకే..) -
Hanamkonda: నిద్రలోనే కన్నుమూసిన కవలలు
గణపురం : ముక్కు పచ్చలారని ఇద్దరు కవలలు నిద్రలోనే కన్నుమూశారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లిలో శని వారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గణపురం మండలం గొల్లపల్లిలకి చెందిన మర్రి లాస్యశ్రీ, అశోక్ దంపతులకు రెండో సంతానంగా ఒక బాబు, ఒక పాప కవల పిల్లలు జన్మించారు. లాస్య నగరంపల్లిలోని తల్లిగారింటి వద్ద నా లుగు నెలలుగా ఉంటోంది. శనివారం మధ్యాహ్నం లాస్య పిల్లలకు డబ్బా పాలు తాగించి పడుకోబెట్టింది. కొద్ది సేపటి తర్వాత వారిని చూడగా ముక్కులనుంచి నురగ రావడాన్ని గమనించి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలిçంచగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.న్యూట్రీసియా కంపెనీకి చెందిన ‘డిక్సోలాక్ ’డబ్బా పాల వల్లే త మ పిల్లలు మృతి చెందినట్లు లాస్య ఆరోపిస్తోంది. పాల డబ్బా కు ఎక్స్పైరీ డేట్ ఈ ఏ డాది డిసెంబర్ వరకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు గణ పురం ఎస్సై రేఖ అశోక్ తెలిపారు. పిల్లల మృతదేహాలకు వైద్యపరీక్షలు నిర్వహించిన తరువాతే మృతికి కారణాలు తెలుస్తాయని ఆయన వివరించారు. -
Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!
బంజారాహిల్స్: వాళ్లిద్దరూ కవలలు.. పదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులను, ఆ కొద్ది రోజులకే తోబుట్టువు, సోదరుడిని కోల్పోయి అనాథలయ్యారు. దీంతో నా అనేవారు ఎవరూ లేకుండా పోయారు.. వీరిని ‘మా ఇల్లు’ ఆశ్రమం చేరదీసింది. మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి ఈ కవల సోదరీమణులను చేరదీయడమే కాకుండా విద్యాబుద్ధులను నేర్పించారు. అనాథలైన విజేత, శ్వేత ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న ‘మా ఇల్లు’ ఆశ్రమంలో నిర్వాహకుల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా పెద్ద చదువుల్లో విశేషంగా రాణించారు. విజేత ఎమ్మెస్సీ సైకాలజీ చేసి బీఈడీ చేస్తూనే ఉద్యోగం పొందింది. చెల్లెలు శ్వేత ఎల్ఎల్బీ పూర్తిచేసి ప్రస్తుతం హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తోంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా రాణించిన వీరిద్దరికీ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి దంపతులు తామే తల్లిదండ్రులై సొంత కూతుళ్ల కంటే ఎక్కువగా ప్రేమించారు. అయితే వీరికి వివాహం ఒక సమస్యగా మారింది. అనాథలైన ఈ కవలలను చేసుకోడానికి ఎవరు ముందుకొస్తారా అని ఇన్నారెడ్డి దంపదతులు ఎదురుచూస్తున్న సమయంలోనే వారికి అండగా మేముంటామంటూ ఇద్దరు ముందుకొచ్చారు. వారిద్దరి గుణగణాలను పరిశీలించిన ఇన్నారెడ్డి దంపతులు విజేత, శ్వేతలకు సరిజోడీ అని నిర్ణయించుకున్నారు. వరంగల్ జిల్లా ఈసుకొండ మండలం ఎల్కుర్తి హవేలీ గ్రామానికి చెందిన అల్లూరి రంజిత్‌రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. విజేతను పెళ్లి చేసుకోడానికి ముందుకొచ్చాడు. ఇక అడ్వకేట్‌గా హైకోర్టులో పనిచేస్తున్న సురేష్ రెడ్డి అక్కడే పనిచేస్తున్న శ్వేతను పెళ్లి చేసుకోడానికి ముందుకొచ్చాడు. View this post on Instagram A post shared by Maa Illu Home🏡 (@maaillu) రంజిత్‌రెడ్డి–విజేత, సురేష్‌రెడ్డి–శ్వేతల వివాహం ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా అనాథల మధ్యనే నిర్వహించనున్నారు. జనగామ జిల్లా జాఫర్ఘడ్ మండలం రేగడి తండాలోని ‘మా ఇల్లు’ ప్రాంగణంలోనే తాము వీరి పెళ్లి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి రంజిత్, సురేష్ అంగీకరించారు. విజేత, శ్వేత వివాహం సందర్భంగా ‘మా ఇల్లు’ ఆశ్రమంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. -
కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్
అప్పట్లో తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన శ్రద్ధా ఆర్య కవలలకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేసి మరీ ప్రకటించింది. నవంబర్ 29న తనకు ప్రసవం జరిగిన విషయాన్ని బయటపెట్టింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించి ఈమె గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: శోభిత ధూళిపాళ పెళ్లి దుస్తుల డిజైనర్ ఎవరో తెలుసా..?)2004లో టీవీ రియాలిటీ షోలో పాల్గొన్న ఈమె.. 2006లో 'కలవనిన్ కదలై' అనే తమిళ సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగులో గొడవ, రోమియో, కోతిమూక తదితర సినిమాల్లో నటించింది. గతేడాది రిలీజైన హిందీ మూవీ 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది. వీటితో పాటు పలు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసింది.వైవాహిక జీవితం విషయానికొస్తే.. 2021లో నేవీ ఆఫీసర్ రాహుల్ నగల్ని పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబరులో ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు తనకు ఓ అబ్బాయి,అమ్మాయి పుట్టిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హౌస్‌లో ఉండలేను.. శోభా శెట్టి కన్నీళ్లు) View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12) -
అంబానీ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
దినేశ్ కార్తిక్- దీపికా ట్విన్స్ మూడో బర్త్‌డే.. కనిపించని డీకే (ఫొటోలు)
-
ఎలిగెంట్లుక్, స్టైలిష్ బ్యాగ్ : ఇషా అంబానీ లెవలే వేరు!
యువ మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వ్యాపార రంగంలో రాణిస్తూనే, ఫ్యాషన్ ఐకానిక్‌లా కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తుంది. తాజాగా ఒక ఫ్యాషన్ ఈవెంట్లో ఇషా స్పెషల్లుక్లో ఆకట్టుకుంది. ఈ విషయంలో తల్లి నీతా అంబానీకి తగ్గ తనయ అనిపించుకుంటోంది. సోమవారం జరిగిన లగ్జరీ స్కిన్‌కేర్ అండ్ హెయిర్‌కేర్ బ్రాండ్ అగస్టినస్ బాడర్ నిర్వహించిన స్టార్-స్టడెడ్ లాంచింగ్ కార్యక్రమంలో ఇషా అంబానీ బ్లాక్ డ్రెస్‌లో తళుక్కున మెరిసారు. అనైతా ష్రాఫ్ అడ్జానియా డిజైన్ చేసిన స్ట్రాప్‌లెస్ బ్లౌజ్, నెక్లైన్ కార్సెట్ టాప్ ,మ్యాచింగ్ స్కర్ట్ ధరించింది. అంతేకాదు లగ్జరీ చిట్టి బ్యాగ్ హీర్మేస్ కెల్లీ బ్యాగ్ ఆకర్షణగా నిలిచింది. తన కవల పిల్లలు ఆదియా,కృష్ణ పేర్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దడం హైలైట్. గ్లామరస్ అవతార్‌లో శిరస్సునుంచి పాదం వరకు ఆసాంతంగా పర్ఫెక్ట్గా కనిపించింది.కాగా ఇషా అంబానీ 2018లోవ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను పెళ్లి చేసుకున్నారు. 2022, నవంబరులో వీరికి కవల పిల్లలు పుట్టారు. -
కవలలే గానీ... గర్భాశయాలు వేరు
వారు కవలలే. ఒక తల్లి పిల్లలే. కాకపోతే చెరో గర్భాశయం నుంచి పుట్టుకొచ్చారు. అదెలా సాధ్యమంటారా? వాళ్లమ్మకు రెండు గర్భాశయాలున్నాయి! ఎంచక్కా ఒక్కోదాంట్లో ఒక్కొక్కరు పురుడు పోసుకున్నారన్నమాట. వైద్యపరంగా అత్యంత ఈ అరుదైన ఘటన చైనాలో జరిగింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కింది. పది లక్షల జననాల్లో ఒక్కసారి మాత్రమే ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుందట. చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో లీ అనే మహిళ సెపె్టంబర్ తొలి వారంలో పండంటి కవలలకు జన్మనిచి్చంది. పిల్లాడు 3.3 కిలోలు, పాప 2.4 కిలోల బరువుతో పుట్టారు. అయితే వారిద్దరూ చెరో గర్భాశయంలో పెరిగారు! లీకి రెండు గర్భాశయాలుండటమే ఇందుకు కారణం. లీకి గర్భాశయాలు రెండూ సంపూర్ణంగా ఎదగడమే గాక పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని ఆమెకు పురుడు పోసిన సీనియర్ డాక్టర్ కై యింగ్ చెప్పుకొచ్చారు. పైగా ఆ రెండింట్లోనూ సహజ పద్ధతిలో గర్భధారణ జరగడం మరీ అరుదని వివరించారు. తమకు తెలిసి గతంలో కేవలం రెండు కేసుల్లో మాత్రమే ఇలా జరిగిందని చెప్పారు. ఇలా జంట గర్భాశయాలుండటాన్ని వైద్య పరిభాషలో యుటెరస్ డైడెలి్ఫస్‌గా పిలుస్తారు. కేవలం 0.3 శాతం మంది మహిళల్లో మాత్రమే ఇందుకు అవకాశముంటుంది. కారణమేమిటో తెలియకపోయినా, లీకి ఇంతకు ముందు వచి్చన గర్భం నిలవలేదు. 27 వారాల తర్వాత అబార్షన్ అయింది. దాంతో గత జనవరిలో మళ్లీ గర్భం దాల్చాక వైద్యులు పక్కాగా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. అన్నీ సజావుగా జరిగి కాన్పు తేదీ సమీపించాక రిస్కు తీసుకోకుండా సిజేరియన్ చేశారు. గతేడాది అమెరికాలోని అలబామాలో కూడా ఇలాంటి ఉదంతం జరిగినట్టు తెలుస్తోంది. రెండు గర్భాశయాలున్న మహిళ డిసెంబర్లో ఇలాగే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచి్చంది. గత కాన్పులో ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టారు. కానీ వారంతా ఒకే గర్భాశయంలో పురుడు పోసుకోవడం విశేషం! ఎందుకిలా...? → గర్భావస్థలో పిండం ఎదిగే క్రమంలో గర్భాశయానికి సంబంధించిన రెండు కీలకమైన ట్యూబులు సకాలంలో కలిసిపోని పక్షంలో అవి రెండు గర్భాశయాలుగా ఏర్పడతాయి. → కొన్ని కేసుల్లో ఒక్కో గర్భాశయానికి విడిగా ఒక్కో ముఖద్వారం ఉంటుంది. యోని గుండా ఏర్పడే సన్నని కణజాల ద్వారం వాటిని విడదీస్తుంది. → ముందస్తు పరీక్షలు చేయించుకుంటే తప్ప గర్భధారణ జరిగేదాకా జంట గర్భాశయాలు ఉనికి ఇతరత్రా బయటపడే అవకాశం చాలా తక్కువ. → ఇలాంటి మహిళలకు గర్భస్రావం జరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అంతేగాక పిండం సరిగా ఎదగకపోవడం, ముందస్తు కాన్పు, కాన్పు సందర్భంగా విపరీతమైన రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తవచ్చు. – బీజింగ్ -
హ్యాపీ బర్త్‌డే : మా ‘ప్రాణం, ప్రపంచం’ మీరే - స్టార్ దంపతులు (ఫొటోలు)


