మన జీవితాల్లోని మహిళలే మనకు బలం: రామ్‌చరణ్‌ | Women in our life have been our greatest strength says Ram Charan | Sakshi
Sakshi News home page

మన జీవితాల్లోని మహిళలే మనకు బలం: రామ్‌చరణ్‌

Feb 2 2026 12:52 AM | Updated on Feb 2 2026 1:22 AM

Women in our life have been our greatest strength says Ram Charan

జనవరి 31న (శనివారం) రామ్‌చరణ్‌–ఉపాసన కవలలకు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ తన సంతోషాన్ని సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తపరచి, ఓ స్పెషల్‌ ఫొటోను షేర్‌ చేశారు. ‘‘మాకు బాబు, పాప జన్మించారన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండటాన్ని ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాం.

మన జీవితాల్లోని మహిళలే మనకు అత్యంత బలం. ప్రతి క్షణం మాకు అండగా నిలుస్తున్న మా అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు’’ అని రామ్‌చరణ్‌ షేర్‌ చేశారు. ఇక 2023 జూన్‌ 20న ఈ దంపతులకు తొలి సంతానంగా కుమార్తె క్లింకార జన్మించిన విషయం తెలిసిందే. 

చాలా సంతోషంగా ఉన్నాం: చిరంజీవి 
ఆదివారం మీడియాతో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘భగవంతుడు, హనుమాన్‌ కృప వల్ల ఒక పాప, ఒక బాబు జన్మించారు. ఉపాసన, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. మా అభిమానులు, మా మంచి కాంక్షించే ప్రతి ఒక్కరితో ఈ శుభవార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. కొణిదెల, కామినేని... రెండు కుటుంబాల సభ్యులు సంతోషంగా ఉన్నాం. ఇంత సుఖ ప్రసవం జరిగినందుకు అ΄ోలో వైద్యులకు, వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement