టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్ మరోసారి తండ్రయ్యారు. తాజాగా ఆయన సతీమణి ఉపాసన కొణిదెలకు కవలలు పుట్టారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఓ బాబు, పాపకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీలో సంబురం నెలకొంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారని
ట్వీట్ చేశారు.
అయితే ఈ శుభ సందర్భంలో సినీ ఇండస్ట్రీలో కవలలు ఎవరెవరికీ పుట్టారనే విషయంపై నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. దక్షిణదితో పాటు బాలీవుడ్‌లోనూ కొందరు సెలబ్రిటీలకు ట్విన్స్ పుట్టారు. ఆ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారనే విషయంపై నెటిజన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇంతకీ కవల పిల్లలతో డబుల్ ఆనందం పొందిన సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం.
మంచు విష్ణు దంపతులకు ట్విన్స్..
టాలీవుడ్ హీరో మంచు విష్ణు దంపతులకు కవలలు జన్మించారు. ఈ ట్విన్స్‌కు ఆరియానా- వివియానా అనే పేర్లు పెట్టారు. ఇటీవల కన్నప్ప చిత్రంలో వీరిద్దరు నటించారు. ఓ ప్రత్యేక సాంగ్‌లోనూ అరియానా- వివియానా కనిపించారు.
నయనతార- విఘ్నేశ్ శివన్ దంపతులు..
కోలీవుడ్ భామ నయనతార- విఘ్నేశ్ శివన్ దంపతులకు ట్విన్స్ జన్మించారు. వీరికి 2022లో సరోగసీ ద్వారా ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. వీరిద్దిరకి ఉయిర్, ఉలగం అనే పేర్లు పెట్టుకున్నారు.
బాలీవుడ్ నటి ప్రీతి జింటా..
బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటాకు ట్విన్స్ జన్మించారు. ఆమె 2021లో సరోగసీ ద్వారానే పిల్లలకు జన్మనిచ్చారు. వీరిది జై, జియా అనే పేర్లు పెట్టారు. ప్రీతి జింటా హీరోయిన్‌గా దక్షిణాదితో పాటు బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది.
సంజయ్ దత్ దంపతులకు ట్విన్స్..
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ -ఆయన భార్య మాన్యతా దత్‌కు ట్విన్స్ జన్మించారు. 2010లో వీరికి కవలలు పుట్టగా షహ్రాన్, ఇక్రా అనే పేర్లు పెట్టారు. సంజయ్ దత్ బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
సెలీనా జైట్లీకి కవలలు..
బాలీవుడ్ భామ సెలీనా జైట్లీ సైతం కవలలకు జన్మనిచ్చింది. 2011లో వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను వివాహం చేసుకున్న స్‌కు 2012లో ట్విన్స్ పుట్టారు. ఇద్దరు అబ్బాయిలకు విన్‌స్టన్, విరాజ్ అని పేర్లు పెట్టారు.
శతృఘ్న సిన్హా దంపతులకు ట్విన్స్..
బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా- పూనమ్ సిన్హా దంపతులకు కవలలు జన్మించారు. వీరిద్దరి కుమారులకు లవ్ సిన్హా, కుష్ సిన్హా అనే పేర్లు పెట్టారు. శతృఘ్న సిన్హాకు సోనాక్షి సిన్హా అనే మరో కూతురు ఉన్నారు. ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ నటిస్తోంది.
సన్నీ లియోన్ దంపతులకు ట్విన్స్..
బాలీవుడ్ నటి సన్నీ లియోన్- ఆమె భర్త డేనియల్ దంపతులకు ట్విన్స్ పట్టారు. 2018లో వీరికి కవలలు పుట్టగా.. నోవా, ఆషర్ అనే పేర్లు పెట్టుకున్నారు. అంతకు ముందే సన్నీ లియోన్ నిషా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు బిజీగా ఉంది.


