ఒకే స్టైల్‌.. ఒకే స్టెప్‌.. కవలల ర్యాంప్‌వాక్‌కు ప్రేక్షకుల ఫిదా! | 15 twin pairs shine at the twins edit event | Sakshi
Sakshi News home page

ఒకే స్టైల్‌.. ఒకే స్టెప్‌.. కవలల ర్యాంప్‌వాక్‌కు ప్రేక్షకుల ఫిదా!

Jun 28 2026 1:15 PM | Updated on Jun 28 2026 1:25 PM

15 twin pairs shine at the twins edit event

 విశాఖపట్నం: చూడటానికి ఒకేలా ఉండే కవలలు.. ఒకే రకమైన ట్రెండీ దుస్తులు ధరించి ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌ చేస్తూ అదరగొడితే ఆ మజానే వేరు.. సరిగ్గా ఇలాంటి వినూత్న దృశ్యమే శనివారం సాయంత్రం నగరంలోని రిలయన్స్‌ సెంట్రో వేదికగా ఆవిష్కృతమైంది. కవలల్లో దాగి ఉన్న ప్రతిభను, వారి మధ్య ఉండే ప్రత్యేక అనుబంధాన్ని ప్రోత్సహించేందుకు ‘ది ట్విన్స్‌ ఎడిట్‌’ పేరిట నిర్వహించిన ఈ ఫ్యాషన్‌ షోకు విశేష స్పందన లభించింది. 

చిన్నారుల నుంచి యువతీ యువకుల వరకు మొత్తం 15 జతల కవలలు ఈ పోటీలో పాల్గొని సందడి చేశారు. ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ వారు చేసిన ర్యాంప్‌ వాక్, క్విజ్, ఇతర ప్రదర్శనలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సెంట్రో ఎస్‌జీఎం వెంకట్‌ నారాయణ మాట్లాడుతూ.. కవలల మధ్య ఉండే స్టైల్, ప్రత్యేక బంధాన్ని ఈ వేదిక ప్రతిబింబించిందన్నారు. అనంతరం నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో శాన్వి–శైవి ప్రథమ స్థానంలో నిలవగా, శ్రీరమ్య–శ్రీలిఖిత ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పోటీలో పాల్గొన్న కవలలందరికీ గిఫ్ట్‌ హ్యాంపర్లు అందజేశారు.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement