మండలి డిప్యూటీ చైర్మన్‌ అభ్యర్థిగా తూమాటి మాధవరావు | Thumati Madhavarao is candidate for post of Deputy Chairman of Council | Sakshi
Sakshi News home page

మండలి డిప్యూటీ చైర్మన్‌ అభ్యర్థిగా తూమాటి మాధవరావు

Aug 13 2026 5:33 AM | Updated on Aug 13 2026 5:33 AM

Thumati Madhavarao is candidate for post of Deputy Chairman of Council

ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును అభినందిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పార్టీ ఎమ్మెల్సీలంతా పూర్తి మద్దతు ఇవ్వాలి

ఎన్నిక సాఫీగా జరిగేలా సమన్వయంతో పని చేయాలి

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం

సాక్షి, అమరావతి: శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవికి వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్సీ తూమాటి మాధవరావును ప్రతిపాదిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ సమా­వేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మండలి డిప్యూటీ చైర్మన్‌ అభ్యర్థిగా టి.మాధవరావును ప్రకటించారు. శాసన మండ­లి డిప్యూటీ చైర్మన్‌ పోస్టు ఖాళీగా ఉన్న నేపథ్యంలో దాన్ని భర్తీ చేసే ప్రక్రియపై సమావేశంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. మండలి డిప్యూటీ చైర్మన్‌ పదవి రాజ్యాంగ పరంగా కీలకమైందని తెలిపారు. 

అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఉన్నట్టే మండలిలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ ఉంటారని గుర్తు చేశారు. ప్రస్తుతం శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్‌ పదవి ఖాళీగా ఉందని, త్వరలో ఆ పదవి భర్తీ ప్రక్రియ ప్రారంభం కా­నుందని తెలిపారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌­సీపీ తరఫున తూమాటి మాధవరావు అభ్యర్థి­త్వాన్ని ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు వెల్ల­డించారు. మాధవరావు అభ్యర్థిత్వానికి పార్టీ ఎ­మ్మెల్సీలందరూ పూర్తి మద్దతు ఇవ్వాలని సూచించారు. డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ సాఫీగా జరిగేలా ఎమ్మెల్సీలంతా పరస్పర సమన్వయంతో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ బా­ధ్యతగా వ్యవహరించాలని, మాధవరావు ఎన్నిక­కు అవసరమైన అన్ని చర్యలను సమన్వయంతో చేపట్టాలని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement