breaking news
Madhava Rao
-
వెలిగొండపై బాబు మాటలు 'నీటి మూటలే': ఎమ్మెల్సీ మాధవరావు
సాక్షి, తాడేపల్లి: మార్కాపురం పర్యటనలో సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ తూమటి మాధవరావు ధ్వజమెత్తారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాణం పోసిందే వైఎస్సార్ కుటుంబమని తేల్చి చెప్పారు. ప్రాజెక్టు ప్రతి అడుగులోనూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్ ముద్ర ఉందని ఆయన స్పష్టం చేశారు.2004 అక్టోబరు 27న దివంగత నేత వైఎస్సార్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, రూ.3581 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం చుడితే... 2014-19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉన్నా పట్టించుకోలేదని విమర్శించారు. తిరిగి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి రెండు సొరంగాలను పూర్తి చేసిన మార్చి 6, 2024న జాతికి అంకితం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలైనా ఇంతవరకు ఆర్ అండ్ ఆర్ (సహాయ పునరావాస) ప్యాకేజీ ఇవ్వకుండా.. ప్రాజెక్టు పూర్తైందని ప్రకటించడాన్ని ఆయన తప్పు పట్టారు.సహాయ పునరావాస ప్యాకేజీలో భాగంగా ఇళ్లు కోల్పోయిన 7300 కుటుంబాలకు రూ.1000 కోట్లు అవసరం కాగా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి డీఆర్సీ సమావేశంలో ఆర్ అండ్ ఆర్ ఎప్పుడిస్తారని మేము అడిగితే 2-3 నెలల్లో చెల్లిస్తామని చెప్పి 20 నెలలు గడుస్తున్నా... నేటికీ వారికి పరిహారం అందలేదని నిలదీశారు. మరోవైపు నిర్వాసితులకు పరిహారం పూర్తిగా చెల్లించామన్న చంద్రబాబు మాటలు పచ్చి అబద్ధమని.. నిజంగా చెల్లిస్తే ప్రాజెక్టును ప్రారంభించకుండా, కేవలం కెనాల్‌ను ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే..ప్రకాశం జిల్లా అభివృద్ధి వైఎస్సార్సీపీతోనేప్రకాశం జిల్లాకు జరిగిన ప్రతి మేలు వైఎస్ జగన్ హయాంలోనే జరిగింది. రామాయపట్నం పోర్టు, ఇండోసోల్ కంపెనీ, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడం వంటివి వైఎస్ జగన్ చొరవ వల్లే సాధ్యమయ్యాయి. "వ్యవసాయం దండగ" అన్న చంద్రబాబుకు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.లడ్డూ వివాదం - ఫేక్ వీడియోల బాగోతంశాసనమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు చెప్పులతో స్వామివారిని అవమానించారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మేము చెప్పులతో ఉన్న వీడియోలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేస్తే, ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఆ వీడియోలు ఫేక్ అని ఒప్పుకున్న ప్రభుత్వం, వాటిని ప్రసారం చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పై ఏ చర్యలు తీసుకున్నారని తూమటి మాధవరావు నిలదీశారు. -
మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్న.. లోకేష్ ఓవరాక్షన్
సాక్షి, విజయవాడ: సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో భూములను కారుచౌకగా కంపెనీలకు కట్టబెట్టడాన్ని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలపై మంత్రి లోకేశ్ విరుచుకుపడ్డారు. పొంతనలేని వ్యాఖ్యలు చేస్తూ ఎదురుదాడికి దిగారు. తొంభై తొమ్మిది పైసలకే ఎకరా చొప్పున భూములు ఎన్ని కంపెనీలకిచ్చారని అడగడమే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల పాపమైపోయింది. లోకేశ్‌కు తోడుగా మరో మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. ఊరుపేరులేని ఉర్సా కంపెనీకి తాము స్థలాలు ఇవ్వనేలేదని బుకాయించే ప్రయత్నం చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండో రోజులు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా విశాఖలో కంపెనీలకు భూ కేటాయింపులపై వాడీవేడి చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ..‘గత 20 నెలల్లో ఏయే కంపెనీలకు 99 పైసలకే భూములు ఇచ్చారు. ఎవరికి ఎన్ని ఎకరాలు.. ఎంత ధరకు ఇచ్చారో చెప్పలేదు. గతేడాది ప్రారంభమైన కంపెనీలకు కూడా 99 పైసలకే భూములిచ్చారు. విజయవాడలో 156 కోట్ల పెట్టుబడులకు 600 కోట్ల విలువైన భూములిచ్చారు. అమరావతికి టెండర్లు పిలిచారు. లులు సంస్థకు ఎందుకు టెండర్లు పిలవలేదు? అని ప్రశ్నించారు. అలాగే...‘‘ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు రూ.మూడు వేల కోట్ల విలులైన భూమిని 99 పైసలకే లీజుకు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ సంస్థలు స్థలాలు కొనుగోలు చేయలేవా?. విశాఖలోని ఓ విద్యాసంస్థ రూ.ఐదు వేల కోట్ల విలువైన భూములను తమ ఆధీనంలో ఉంచుకుంది. ఆ సంస్థ కేవలం తాము రూ.వెయ్యి కోట్ల విలువైన భూమినే ఆక్రమించామని చెబుతోంది. రూ.వెయ్యి కోట్ల విలువైతే భూములను ఆక్రమించకోవచ్చా?’’ అని నిలదీశారు.రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘‘విశాఖలో భూ కేటాయింపులు తీవ్ర విమర్శలకు దారితీశాయి. రూపాయికి గుప్పెడు శనగలు, సింగిల్ టీ కూడా రాదు. కానీ 99 పైసలకే వేల కోట్ల విలువైన భూములు కట్టబెట్టేస్తున్నారు. ఎక్కడైనా వెనకబడిన ప్రాంతాల్లో భూములను తక్కువ ధరకు ఇస్తారు. కానీ ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందిన విశాఖలో భూములు కారుచౌకగా కట్టబెట్టడమేంటి?. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎందుకు భూములిస్తున్నారు. ఏపీఐఐసీ చేసే పని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చారు. ఏపీఐఐసీ కంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు బాగా పనిచేస్తాయా?. ప్రభుత్వ భూములను టెండర్లు లేకుండా ఎలా కేటాయిస్తారు’’ అని ప్రశ్నించారు.అవును.. 99 పైసలకే భూములిచ్చాం.. వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు ఆగ్రహంతో ఊగిపోతూ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. 99 పైసలకి 5 కంపెనీలకు మాత్రమే భూములు కేటాయించాం. రహేజా గ్లోబల్ బిల్డ్ కేపబులిటీ సెంటర్లు నిర్మిస్తుంది. మేం భూములిచ్చిన ప్రతీ కంపెనీ క్రెడిబులిటీ ఉన్నవే. ఉర్సాకు మేం 99 పైసలుకే భూములు ఇవ్వలేదు. అక్కడితో ఆగిపోయి ఉంటే బాగుండేది కానీ... ‘‘151 సీట్లు ఉన్న మీకు 11 వచ్చాయి’’ అంటూ ఓవరాక్షన్‌కు దిగారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. భూములు తక్కువ ధరకు ఇవ్వడం వల్లే కంపెనీలు, ఉద్యోగాలు వస్తాయి అని కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు.శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘భూముల కేటాయింపులపై సరైన సమాధానం ఇవ్వాల్సిందే. వైజాగ్‌లో 2006లోనే ఐటీ ఎకో సిస్టమ్ ఏర్పాటు చేశాం. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక అదానీ డేటా సెంటర్ వచ్చింది. వైజాగ్‌లో చంద్రబాబు కుటుంబ సభ్యులకు రూ.ఐదు వేల కోట్ల భూములు ఇస్తున్నారు. భూములు ఇవ్వడంలో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారు. గీతంకి భూములు కేటాయింపులకు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’ అని బయటకు వచ్చారు. -
MLC Madhava: అర్ధరాత్రి ముగ్గురు దళిత మహిళల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో..
-
కరేడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: తూమాటి మాధవరావు
సాక్షి, తాడేపల్లి: కరేడు గ్రామ ప్రజలను పోలీసులు, అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. బలవంతపు భూసేకరణ కోసం ఎస్టీ మహిళలపై అక్రమ కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ముగ్గురు ఎస్టీ మహిళలను వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కరేడులో భూసేకరణ గ్రామ సభలను స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కరేడు గ్రామ ప్రజలను పోలీసులు, అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. భూసేకరణ పేరుతో మళ్ళీ హడావుడి చేస్తున్నారు. గ్రామంలోని ఎస్టీలను భయపెట్టి భూసేకరణ చేయాలని చూస్తున్నారు. గత భూసేకరణ గ్రామ సభలో అభ్యంతరం తెలిపిన ఒక మహిళ మీద అక్రమంగా కేసులు పెట్టించారుఈ కేసులో ముగ్గురు ఎస్టీ మహిళలను అర్ధరాత్రి అరెస్టు చేశారు. బలవంతపు భూసేకరణ కోసం ఎస్టీ మహిళలపై అక్రమ కేసులు పెడతారా?. ముగ్గురు ఎస్టీ మహిళలను వెంటనే విడుదల చేయాలి. ప్రజల అనుమతి లేకుండా భూసేకరణ చేస్తామంటే కుదరదు. బలవంతపు భూసేకరణ, అర్థరాత్రి ఎస్టీ మహిళలను అరెస్ట్ చేయడంపై అసెంబ్లీలో లేవనెత్తుతాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం.. ఎమ్మెల్సీ తూమాటిపై దాడికి యత్నం
నెల్లూరు (పొగతోట): రామాయపట్నం పోర్టు పరిధిలో కూటమి ప్రభుత్వం బలవంతంగా చేపడుతున్న భూ సేకరణపై జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ(డీడీఆర్సీ) సమావేశంలో నిలదీసిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దూకుడుగా వ్యవహరించారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకుంటూ వేలు చూపిస్తూ ఆగ్రహంతో రగిలిపోయారు. ఒక దశలో దాడి చేసే యత్నం చేశారు. ఈ ఘటన ముగ్గురు మంత్రులు మహ్మద్ ఫరూఖ్, ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, కలెక్టర్, జిల్లా అధికార యంత్రాంగం సమక్షంలోనే బుధవారం ఈ ఘటన జరిగింది. భూసేకరణపై వివరణ ఇవ్వండి: ఎమ్మెల్సీ తూమాటి వ్యవసాయశాఖపై సమీక్ష జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ మాధవరావు భూ సేకరణపై చర్చకు పట్టుబట్టారు. జూలై 13న రామాయపట్నం పోర్టుకు 20 వేల ఎకరాల భూసేకరణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామంటూ ప్రభుత్వం జీఓ ఇచి్చందని, 20 వేలు ఎకరాలు ఏ ప్రాంతంలో సేకరిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే కరేడులో భూ సేకరణను ప్రజలు పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. 5 వేల ఎకరాలు సరిపడే పరిశ్రమకు 8,300 ఎకరాలకు పైగా సేకరిస్తున్నారని, దీనివల్ల 5 వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. వాగ్వాదానికి దిగిన కందుకూరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తూమాటి మాట్లాడుతుంటే కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సభా మర్యాదను పాటించకుండానే వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎమ్మెల్సీ ప్రభుత్వం ఇచి్చన జీఓకు వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, దగమాటి కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్సీపైకి దూసుకువచ్చారు. సభావేదికపై ఉన్న ముగ్గురు మంత్రులు కూడా ఎమ్మెల్సీని తప్పుబట్టారు. మంత్రి ఆనం మాట్లాడుతూ ‘‘ఇది అసెంబ్లీ కాదు. ఏదైనా ఉంటే అసెంబ్లీలో చర్చించండి. నీ రాజకీయ అనుభవం నాలుగేళ్లు. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాను. మాట్లాడకుండా కూర్చోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఎమ్మెల్సీ తూమాటి వాకౌట్ చేసి బయటకు వెళ్లి పోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విలేకరులతో మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, ఒక పరిశ్రమ పేరు చెప్పి బీపీసీఎల్‌కు భూములు కేటాయించేందుకు యత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రశ్నించినందుకు తనను అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాగళం వినిపిస్తామన్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనను ప్రసారం చేయొద్దంటూ మీడియాను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బెదిరించారు. -
DRC సమావేశంలో సోమిరెడ్డి ఓవర్ యాక్షన్...
-
కూటమి ప్రభుత్వంపై YSRCP ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్
-
టీవిలో స్క్రోల్ చూసి తెలుసుకున్న.. అంతవరకు తెలియదు
-
నటుడిగా కంటే వ్యక్తిగా చాలా గొప్పవాడు..!
-
నన్ను నిర్మాతను చేస్తా అన్నాడు: మాధవరావు
-
కృష్ణ విజయ నిర్మలను ఆ గెటప్ లో చూసి ఎగిరి గంతేసాడు..!
-
హాస్పిటల్ కు వెళ్లి చివరిసారిగా మేకప్ వేసి పడుకోబెట్టాను..!
-
చిరుత ఎదురుపడితే ఇలా చేయండి చాలు..! వెంటనే..
కుమరం భీం: ఎవరైనా అడవిలోకి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా చిరుతపులి ఎదురుపడితే ఏం చేయాలి? దాని భారినుంచి ఎలా తప్పించుకోవాలి? అనే అంశాలపై డెప్యూటీ కన్జర్వేటర్, జన్నారం ఎఫ్‌డీవో మాధవరావు పలు సూచనలు చేశారు. ఇటీవల తిరుమలలో కాలినడకన వెళ్లిన బాలికను చిరుతపులి హతమార్చిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వాటి ద్వారా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు తప్పించుకునే మెలకువల గురించి వివరించారు. ఆయన మాటల్లోనే.. పిల్లి జాతి జంతువు.. చిరుతపులి పిల్లి జాతికి చెందిన సిగ్గరి. మనుషుల కంట పడేందుకు ఇష్టపడదు. మనుషుల అలికిడి వినిపిస్తే దూరంగా వెళ్లిపోతుంది. సాధారణంగా ఫారెస్ట్ సఫారీకి వెళ్తే పులి కనిపిస్తుంది. కానీ చిరుతపులి కనబడటం చాలా తక్కువ. అది ఒంటరిగా నివసించేందుకు ఇష్టపడుతుంది. కలయిక సమయంలో సహచరిణితో, చిన్న పిల్లలతో ఉన్నప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. అడవిలో ఇవి గుహల్లాంటి ఆవాసాల్లో నివసిస్తాయి. జింకలు, సాంబర్లు, అడవి పందులను చిరుతలు ఎక్కువగా వేటాడుతాయి. పైకి చూస్తే శరీరంపై మచ్చలు చూడటానికి ఒకేలా కనిపించినా రెండు చిరుతలకు ఒకే విధంగా ఉండవు. ఎదురుపడితే ఎలా తప్పించుకోవాలి? దేశంలో పులుల సంఖ్య కంటే చిరుతల సంఖ్య ఎక్కువగా ఉంది. కవ్వాల్ టైగర్ జోన్లో సుమారుగా 80 వరకు చిరుతలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చిరుత పులుల జాతి ఉంది. చిరుతలు జనావాసాల్లోకి ఊరికే రావు. వాటికి ఆహారం, నీటి సమస్యలు ఏర్పడినప్పుడు మాత్రమే జనావాసాల్లోకి వస్తాయి. చిరుత వేగంగా కదిలే జంతువు కావడంతో జనాల్లోఎక్కువ అలజడి సృష్టిస్తుంది. జనాల మఽ ద్యకు వచ్చిన చిరుతను బంధించడం సులువుకాదు. చిరుత పులి ఎంతదూరంలో ఎదురుపడిందన్న అంశంపై ప్రమాద తీవ్రత ఆధారపడి ఉంటుంది. దూరంగా ఎదురుపడితే సాధారణంగా అదే పక్కకు వెళ్లిపోతుంది. అలాంటి సమయంలో మనుషులపై దాడి చేయాల్సిన అవసరం చిరుతకు ఉండదు. అనుకోని పరిస్థితుల్లో అతి సమీపంలో ముఖాముఖిగా ఎదురుపడితే దాడి చేసే అవకాశాలున్నాయి. అలాంటి సమయంలో రెండు చేతులు పైకెత్తి గట్టిగా అరవాలి. అడవి జంతువుల సైకాలజీ ప్రకారం ఆకారంలో తమకన్నా పెద్దగా ఉన్న జంతువులపై సాధారణంగా చిరుతలు దాడికి దిగవు. చిరుత పులి ఎదురుపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి పరుగెత్తడం, లేదా పొదల చాటున దాక్కోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే చిరుత వెంటపడి దాడిచేసే అవకాశం ఉంది. ఒకవేళ పారిపోతే ఎంత పరుగెత్తినా చిరుత వేగం ముందు మనం నిలువలేం. కాబట్టి చిరుత కాస్త దూరంలో ఎదురుపడితే చేతులు పైకెత్తి నెమ్మదిగా వెనక్కి నడవడం, దగ్గరగా ఉంటే చేతులు పైకెత్తి గట్టిగా అరుస్తూ వెనక్కి నడిస్తే చిరుత అక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం చెట్లు ఎక్కినా వేటాడాలనుకునే చిరుత సులభంగా చెట్లు ఎక్కుతుంది. కూలీలు ఏంచేయాలి? అడవిలోకి పనికి వెళ్లే కూలీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిరుత పులి వెనుక వైపు నుంచి వేటాడుతున్నందున కూలీలు మాస్కులు, తలకు వెనుకవైపు ఫేస్ మాస్కులు పెట్టుకోవడం మంచిది. వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు ఫేస్ మాస్కులు ధరించి, మాట్లాడుకుంటూ వెళ్లాలి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చిరుత పులి బారి నుంచి తప్పించుకోవచ్చని మాధవరావు సూచించారు. -
సినీ మేకప్ చీఫ్ మాధవరావుకు సతీవియోగం
సాక్షి, చెన్నై: తెలుగు సినీ చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ మేకప్ చీఫ్ సి.మాధవరావుకు సతీవియోగం కలిగింది. ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మ (76) కరోనాతో చెన్నైలో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. నెలరోజుల క్రితం మాధవరావు దంపతులు చెన్నైకి వెళ్లి కోవిడ్ బారినపడ్డారు. రాంప్రసాద్ హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చి చికిత్సకు సహకరించాడు. కాకినాడలో ఉన్న కుమార్తె గీత, అమెరికాలో ఉన్న చిన్న కుమారుడు రాజ చెన్నైకి చేరుకున్నారు. మాధవరావు కోలుకోగా సుబ్బలక్ష్మమ్మ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం చెన్నై బిసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కృష్ణ, నరేష్ పరామర్శ సుబ్బ లక్ష్మమ్మ మరణ సమాచారం అందగానే నటులు కృష్ణ, నరేష్, మరికొందరు సినీ ప్రముఖులు ఫోన్ ద్వారా మాధవరావును పరామర్శించి సంతాపం తెలిపారు. -
అమర జవాన్ల కోసం 'స్టాండ్ ఫర్ ద నేషన్'
సాక్షి, విజయవాడ: ఆసరా సంస్థ ఆధ్వర్యంలో 'స్టాండ్ ఫర్ ద నేషన్' బ్రోచర్ ఆవిష్కరణ శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగింది. విజయవాడ వినియోగదారుల (కన్జ్యూమర్) ఫోరమ్ జడ్జి మాధవరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. పుల్వామా దాడిలో అమరులైన 40 మంది సైనికులకోసం ఆసరా సంస్థ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. రాబోయే ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 3 గంటల15 నిమిషాలకు అమరులైన జవాన్ల కోసం నివాళిగా స్టాండ్ ఫర్ ద నేషన్ పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టనుందని పేర్కొన్నారు. దేశంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ఆసరా ద్వారా ఢిల్లీ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వినియోగదారులకు అందించిన సేవలు మరువలేనివని మాధవరావు ప్రశంసించారు. చట్టం గురించి తెలియని వారి కోసం.. ఆసరా సంస్థ సభ్యులు పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. -
‘రేషన్ ’లో దశల వారీగా నగదు రహిత లావాదేవీలు
సబ్బవరం (పెందుర్తి) : రేషన్ షాపుల్లో నిర్భంధ విధానం కాకుండా దశలవారీగా నగదు రహిత లావాదేవీలు అమలు చేయాలని రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి దివిలీల మాధవరావు అన్నారు. ఆదివారం మండలంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మండల రేషన్ డీలర్లతో సమావేశమయా్యరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ఉదయం విజయనగరంలో రాష్ట్ర రేషన్ లర్ల సమావేశం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పోస్ విధానాన్ని రాష్ట్ర డీలర్లు విజయవంతం చేసి ప్రజాపంపిణీ వ్యవస్థను దేశంలోనే తొలిస్థానానికి తీసుకువెళ్లారన్నారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా రూ.20 నుంచి రూ.70కు కమీషన్ పెంచిం దని తెలిపారు. రేషన్ డీలర్లను బ్యాంక్ కరస్పాం డెంట్లు నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. అందువల్ల వీరికి ఖర్చులు పోనూ 5 శాతం కమీషన్ వచ్చేవిధంగా విధివిధానాలు రూపొం దించాలని కోరారు. డీలర్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.గంగాధరగౌడ, రాష్ట్ర కోశాధికారి పి.చిట్టిరాజు, కె.అప్పారావు, వాసిరెడ్డి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర పనుల్లో అపశ్రుతి
-
పుష్కర పనుల్లో అపశ్రుతి
విజయవాడ: నగరంలోని వన్‌టౌన్‌లో గాంధీ కాలేజి సమీపంలో కొనసాగుతున్న పుష్కర పనుల్లో శనివారం అపశ్రుతి దొర్లింది. విద్యుత్ స్తంభానికి రంగులు వేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు మాధవరావు (25) కరెంట్ షాక్ తగిలింది. దీంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. సహచర కార్మికులు వెంటనే స్పందించి... అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు కొద్ది సేపటికే మరణించాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. -
వైఎస్ఆర్ సీపీ నేతకు తీవ్రగాయాలు
అవనిగడ్డ (కృష్ణా జిల్లా): కోడూరు మండలం వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ పరిశా మాధవరావుకు శనివారం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన బైక్‌పై కోడూరు నుంచి అవనిగడ్డ వెళ్తుండగా వి.కొత్తపాలెం వద్ద వెనుక నుంచి ఆటో ఢీ కొట్టింది. ప్రమాదంలో మాధవరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలించారు. -
మరణంలోనూ వీడని బంధం
నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం భార్యాభర్తలు సహా నలుగురు దుర్మరణం పెళ్లికి వస్తూ అనంతలోకాలకు.. మృతులంతా ఒడిశావాసులే మేనల్లుడి వివాహానికి బయలుదేరారు.. ఒడిశా రాష్ట్రం గుణుపూరు నుంచి విశాఖ చేరుకోవడానికి కారులో వస్తున్నారు.. మరో పావుగంటలో గమ్యానికి చేరుకుంటారనగా.. ఘోర రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. శుక్రవారం తెల్లవారుజామున కొమ్మాది, మారికవలస మధ్యలో ఈ దుర్ఘటన జరిగింది. భార్యాభర్తలు సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పీఎం పాలెం (విశాఖపట్నం): ఇసుకతోట ప్రాంతంలో నివసిస్తున్న మేనల్లుడి పెళ్లి.. ఎంతో ఉత్సాహంగా బయలుదేరారు.. బంధుమిత్రులతో కలిసి కారులో వస్తున్నారు.. కాసేపట్లోనే గమ్యస్థానం చేరుకుంటారనగా పెను ప్రమాదం. ఈ దుర్ఘటనలో అసువులు బాసిన భార్యాభర్తలను చూసి కళ్లు చెమర్చనివారు లేరు. ఈ దంపతులతోపాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం తెల్లవారు జామున కొమ్మాది - మారికవలసల మధ్య జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రం గుణుపూరు మండలం గుడారి గ్రామంలో సేనపూరి మాధవరావు (55) వ్యాపారిగా స్థిరపడ్డారు. విశాఖలో మేనల్లుడి పెళ్లికి భార్య మోహిని (45), సమీప బంధువులు ఆదిత్య త్రిపాఠి (30), సింహాద్రి దిలీప్ (20), సింహాద్రి నెహ్రూ (30)లతో కలిసి గురువారం రాత్రి కారులో బయలుదేరారు. గమ్యానికి మరో 15 కిలోమీటర్ల దూరంలో.. ఇక బంధువుల ఇంటికి చేరుకుంటామనగా ప్రమాదానికి లోనయ్యారు. ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు కొడుకులను ఒంటరి వారిని చేసి అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న త్రిపాఠి, మాధవరావు, ఆయన భార్య మోహిని కారులో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన దిలీప్, నెహ్రూలను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ దిలీప్ మరణించాడు. నెహ్రూ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. సమాచారం అందుకున్న పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏసీపీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి సిబ్బందితో చేరుకుని కారులో చిక్కుకున్న వారిని వారిని బయటకు తీశారు. ట్రాఫిక్‌కు ఆటంకంగా ఉన్న వాహనాలను తొలగించారు. మృతులను, క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. మృతుని బంధువులకు సమాచారం అందించి, కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి కారణం అతి వేగమే !నలుగురి ప్రాణాలు బలిగొన్న ఈ ప్రమాదానికి కారణం మితిమీరిన వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. మధురవాడ ప్రాంతంలో రాత్రి వేళ జాతీయ రహదారికి ఒక వైపు అదనపు లేయర్ నిర్మాణపు పనులు చేపడుతున్న కారణంగా... కొమ్మాది- మారికవలసల మధ్య రెండు వైపుల వెళ్లే వాహనాలు ఒకే రోడ్డుపై వెళ్లే విధంగా ట్రాఫిక్ మళ్లించారు. ఈ క్రమంలో ఒడిశా నుంచి నగరానికి వస్తున్న కారు, ఎదురుగా కలప లోడుతో వస్తున్న లారీ బలంగా ఢీ కొన్నాయి.ఈ ధాటికి కారు ముందు భాగం నుజ్జయింది. లారీ ముందు చక్రాలు రెండూ ఊడిపోయాయి. ఫ్రంట్ యాక్సిల్ విరిగిపోయింది. ఒకే రోడ్డులో వాహనాలు ఎదురెదుగా ప్రయాణించడం ప్రమాదానికి మరో కారణమని భావిస్తున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేలను తోసేసిన టీఆర్ఎస్ సభ్యులు
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా సభలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. గవర్నర్ సాక్షిగా అధికార, విపక్ష సభ్యులు బాహాబాహికి దిగారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదులాట, తోపులాట చోటుచేసుకుంది. సభలో నిరసన తెలుపుతున్న కుకట్ పల్లి టీడీపీ ఎమ్మెల్యే మాధవరావును టీఆర్ఎస్ సభ్యులు తోసేశారు. రేవంత్ రెడ్డిని పక్కకు నెట్టేశారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలారు. విపక్షాల నిరసనల నడుమ గవర్నర్ ప్రసంగం కొనసాగించారు. -
భారతీయుడిగా గర్వపడుతున్నా
భద్రాచలం టౌన్: కష్టసాధ్యమైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినందుకు భారతీయుడిగా గర్వపడుతున్నానని సాధనపల్లి ఆనంద్‌కుమార్ అన్నాడు. ప్రపంచంలో ఎత్తై శిఖరాన్ని అధిరోహించి పలువురి ప్రశంసలు అందుకున్న ఆనంద్‌కుమార్ తన తల్లిదండ్రులతో గురువారం రాత్రి భద్రాచలం చేరుకున్నాడు. ఈ సందర్భంగా విద్యావేత్తలు, ప్రముఖులు, బంధువులు ఆనంద్‌కుమార్‌కు ఘనస్వాగతం పలికారు. భద్రాచలం ఎంఈవో మాధవరావు, పాల్‌రాజ్ ఇంజనీరింగ్ చైర్మన్ అబ్రహం పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆనంద్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ..... భారత దేశ జెండాతో పాటు, తెలంగాణ రాష్ట్ర జెండాను ఎవరెస్టు శిఖరంపై పాతటంతోనే తన గుండె ఉద్వేగంతో నిండిపోయిందని తెలిపాడు. తన విజయంతో భద్రాచలానికి ఖ్యాతి లభించినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నాడు. పేదరికం దేనికి అడ్డుకాదని, ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని పట్టుదల, క్రమశిక్షణతో కష్టపడితే విజయం వరిస్తుందని ఈ యాత్ర ద్వారా తెలిసిందని పేర్కొన్నాడు. తన విజయం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు. భద్రాచలం వచ్చిన ఆనంద్‌కుమార్‌కు స్వాగతం పలికిన వారిలో కరుణానిధి, జెట్టి రంజిత్‌కుమార్, సాధనపల్లి సతీష్, దాసరి శేఖర్ తదితరులు ఉన్నారు. కాగా, శుక్రవారం ఆనంద్‌కుమార్‌కు ఆర్డీవోతో పాటు, పలువురు సన్మాన, అభినందన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. -
ఎన్సీఎస్ షుగర్స్ ఎండీపై కేసు నమోదు
పొదలకూరు, న్యూస్‌లైన్: మండలంలోని ప్రభగిరిపట్నం పంచాయతీ పరిధిలో ఉన్న నారాయణం చలపతి సన్స్(ఎన్సీఎస్) షుగర్స్ ఎండీ నాగేశ్వరరావు, డెరైక్టర్ కన్నబాబు, ఫ్యాక్టరీ సీఈఓ మాధవరావుపై సోమవారం రాత్రి పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు అసిస్టెంట్ కేన్ కమిషనర్ జీవీవీ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వాస్తవానికి 2012 - 13 సీజన్లో చెరకు రైతుల బకాయిలకు సంబంధించిన రూ.14 కోట్లను చెల్లించే విషయమై ఫ్యాక్టరీ ఎండీ నాగేశ్వరరావు హైకోర్టును ఆశ్రయిం చారు. బకాయిలను మూడు విడతలుగా మూడు నెలల్లో చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తొలుత డిసెంబర్ 16వ తేదీన రూ.5 కోట్లను చెల్లించాల్సి ఉండగా, ఎండీ చెల్లించలేదు. ఈ సమాచారం తెలుసుకున్న కలెక్టర్ శ్రీకాంత్ ఏసీసీ సత్యనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి రైతుల బకాయిలను చెల్లించని షుగర్‌ఫ్యాక్టరీ ఎండీపై కేసు పెట్టాల్సిందిగా కలెక్టర్ ఆదేశించడంతో ఏసీసీ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎస్సై వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


