పూరీ: ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రథయాత్ర భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ఆయన కొనియాడారు. రథయాత్రలోని సంప్రదాయాలు వినయం, సమిష్టి భాగస్వామ్యం, నిస్వార్థ సేవలను ప్రతిబింబిస్తాయని, ఇవి తరతరాలుగా భారతీయులకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో ఉండాలని, సమాజంలో ఐక్యతా స్ఫూర్తి పెంపొందాలని మహాప్రభు జగన్నాథుడిని ఆయన ప్రార్థించారు.
ବିଶ୍ଵପ୍ରସିଦ୍ଧ ରଥଯାତ୍ରା ଉପଲକ୍ଷେ ଦେଶବିଦେଶରେ ରହୁଥିବା ଶ୍ରୀଜଗନ୍ନାଥଙ୍କ ଭକ୍ତଗଣଙ୍କୁ ମୁଁ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭେଚ୍ଛା ଜ୍ଞାପନ କରୁଅଛି । ଏହି ମହାପର୍ବରେ ମହାପ୍ରଭୁ ଶ୍ରୀଜଗନ୍ନାଥ ବଡ଼ଭାଇ ବଳଭଦ୍ର, ଭଗିନୀ ସୁଭଦ୍ରା ଓ ଚକ୍ରରାଜ ସୁଦର୍ଶନଙ୍କ ସହିତ ରଥାରୂଢ଼ ହୋଇ ଭକ୍ତମାନଙ୍କ ସହିତ ମିଳିତ ହୁଅନ୍ତି । ଭକ୍ତ ଓ ଭଗବାନଙ୍କ ମିଳନର ଏହି ପର୍ବ…
— President of India (@rashtrapatibhvn) July 16, 2026
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తజన సమూహానికి, దైవానికి మధ్య జరిగే ఈ కలయిక అద్వితీయమని ఆమె అభివర్ణించారు. శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రా దేవి రథాలపై ఊరేగింపుగా వచ్చి భక్తులకు దర్శనమివ్వడం అత్యంత పవిత్రమైన ఘట్టమని పేర్కొన్నారు.
మరోవైపు రథయాత్ర నేపథ్యంలో పూరీ నగరం భారీ భద్రతా వలయంలోకి వెళ్లింది. సింహద్వారం వద్ద నందిఘోష, దర్పదలన, తాళధ్వజ రథాలు సిద్ధంగా ఉన్నాయి. సుమారు 13 వేల మంది పోలీసు బలగాలు, కేంద్ర సాయుధ దళాలు, ఎన్ఎస్‌జీ కమాండోలు, తీర రక్షణ దళాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లు, యాంటీ-డ్రోన్ వ్యవస్థలతో నిఘాను ముమ్మరం చేశారు. భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ 300 ప్రత్యేక రైళ్లను, రవాణా శాఖ 800 బస్సులను అందుబాటులోకి తెచ్చింది.
ఇది కూడా చదవండి: రథయాత్రకు 300 రైళ్లు, 800 బస్సులు


