ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. యూరియా నేషనల్ ఇన‍్వెస్ట్‌మెంట్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సెమీకాన్ 2.0 కోసం 1,27,500 కోట్ల రూపాయల కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. వరుణ నది వెంట 6/4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 10,998 కోట్ల రూపాయలు కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గంగానది వెంట ఆరులేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 14,448 కోట్ల రూపాయలు కేటాయించింది. మొబైల్ ఫోన్ తయారీ పథకం కోసం 62,500 కోట్ల రూపాయలు కేటాయింపునకు పచ్చజెండా ఊపింది. పారాదీప్-హరిదాస్పూర్ రైల్వే లైన్ డబ్బింగ్ కోసం 2,542 కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది. దంగోపోసి- రాజ్ కర్ సావన్ మధ్య నాలుగవ రైల్వే లైన్ నిర్మాణానికి 1,365 కోట్ల రూపాయలు కేటాయింపునకు ఆమోదం తెలిపింది.


