కొరియన్ అమ్మాయితో మహేశ్ బాబు మేనల్లుడి పెళ్లి | Mahesh Babu Nephew Siddharth Galla Engagement With Korean Girl, Namrata Shares Engagement Photos Trending On Social Media | Sakshi
Sakshi News home page

Mahesh Babu Nephew: పెళ్లి వేడుక.. నమ్రత స్పెషల్ పోస్ట్

Jul 13 2026 11:21 AM | Updated on Jul 13 2026 12:08 PM

Mahesh Babu Nephew Engagement With Korean Girl

హీరో మహేశ్ బాబు మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కొరియన్ అమ్మాయితో ఏడడుగులు వేయబోతున్నాడు. ఆదివారం నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని షేర్ చేసిన నమ్రత.. స్పెషల్ పోస్ట్ పెట్టింది. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపింది.

(ఇదీ చదవండి: నేనేం చేస్తున్నానో నాకు తెలుసు: నాగ్ అశ్విన్)

మహేశ్ సోదరి పద్మావతి-బావ గల్లా జయదేవ్‌కి ఇద్దరు కొడుకులు. వీరిలో పెద్దవాడు అశోక్ ఇ‍ప్పటికే హీరోగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. 'విసా' అనే మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. ఇక చిన్నకొడుకు సిద్ధార్థ్ ప్రస్తుతం కుటుంబానికి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు కొరియన్ అమ్మాయి హయిన్/ జిన్నీతో నిశ్చితార్థం చేసుకున్నాడు.

మహేశ్ బాబు ఫ్యామిలీ, బంధువులు అంతా ఈ ఎంగేజ్‌మెంట్ వేడుకల్లో పాల్గొన్నారు. మరి సిద్ధార్థ్-జిన్నీ ఎక్కడ ఎప్పుడు ఎలా కలిశారు? వీళ్ల మధ్య ప్రేమ ఎలా మొదలైంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా మహేశ్ బాబు మేనల్లుడు దేశాంతర వివాహం చేసుకోబోతుండటం హాట్ టాపిక్ అయిపోయింది. అయితే రాజమౌళి 'వారణాసి'తో బిజీగా ఉండిపోవడం వల్ల ఈ నిశ్చితార్థానికి మహేశ్ బాబు హాజరు కాలేదని అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement