మెక్సికో రోడ్డు ప్రమాదం: తొమ్మిది మంది మృతి, పది మందికి గాయాలు | 9 Dead 10 Injured in Tragic Mexico Highway Pile up | Sakshi
Sakshi News home page

మెక్సికో రోడ్డు ప్రమాదం: తొమ్మిది మంది మృతి, పది మందికి గాయాలు

Jul 13 2026 10:45 AM | Updated on Jul 13 2026 10:47 AM

9 Dead 10 Injured in Tragic Mexico Highway Pile up

జలిస్కో: మెక్సికోలోని జలిస్కో రాష్ట్ర హైవేపై ఆదివారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్లు సహా తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్వాడలజారా, టెపిక్ నగరాలను అనుసంధానించే జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ఒక ట్రాక్టర్-ట్రైలర్ నియంత్రణ కోల్పోయి పలు వాహనాలను బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
 

ప్రమాదం వెంటనే పలు వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి, హైవే అంతటా దట్టమైన నల్లటి పొగ ఆవరించింది. ప్రమాద తీవ్రతకు వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. క్షతగాత్రులలో నలుగురు అమెరికా పౌరులతో పాటు ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బంది కూడా ఉన్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గాయపడిన నేషనల్ గార్డ్ సభ్యులను గ్వాడలజారాలోని మాగ్డలీనా ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంపై జలిస్కో సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్వల్పంగా గాయపడిన నలుగురు అమెరికా పౌరులను ప్రైవేట్ అంబులెన్స్ ద్వారా గ్వాడలజారాలోని అర్బోలెడాస్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంది. స్థానిక రెస్క్యూ టీమ్స్, అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement