సాక్షి, నల్గొండ జిల్లా: కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. భీమవరం నుండి హైదరాబాద్ వెళుతున్న ఇంటర్‌సిటీ ట్రావెల్స్ బస్సు.. టైర్ పంక్చర్‌తో అదుపుతప్పి.. డివైడర్‌ను దాటి విజయవాడ వెళ్తున్న లారీని ఢీకొట్టింది.
బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరికిపోయాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. బస్సు డ్రైవర్‌ను బయటకుతీశారు. ట్రావెల్స్ బస్సు, లారీ డ్రైవర్లకు గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులకు ముప్పు తప్పింది.
విశాఖలో కంటైనర్ బోల్తా
విశాఖలోని షీలా నగర్ జంక్షన్‌లో కంటైనర్ లారీ బోల్తా పడింది. గాజువాక నుంచి పోర్టుకు వెళ్తున్న లారీ అదుపు తప్పింది. ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు జిల్లాలో సంగం మండలం తరుణవాయు దగ్గర జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి నెల్లూరు రొట్టెల పండగకు వస్తుండగా ఘటన జరిగింది. యాత్రికుల టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.


